ముంబయి, ఏప్రిల్ 3: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శక్తీమిల్స్ ఆవరణలో ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో న్యాయస్థానం ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది. వరుస అకృత్యాలకు పాల్పడినందుకు వీరికి నిర్భయ చట్టం కింద శిక్షలు పడే అవకాశం ఉంది. విజయ్‌జాదవ్ (19), కాసీం బెంగాలీ (21), మహ్మద్ సలీం అన్సారీ (28)లను ఐపిసి సెక్షన్ 376(ఇ) కింద దోషులుగా తేల్చారు. శక్తీమిల్ ఆవరణలోనే టెలిఫోన్ ఆపరేటర్‌పై అత్యాచారం కేసులో ఈ ముగ్గురికి ఇంతకు ముందే న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శక్తీమిల్స్ ఆవరణలో
english title:
rape case
Date:
Friday, April 4, 2014