హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో మరో ఏడాది వరకు సలహాదారుల పాలన తప్పేటట్టు కనిపించడం లేదు. జూన్ రెండున కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్నందున గవర్నర్‌కు సలహాదారులుగా కేంద్రం నియమించిన వారినే కొంతకాలం పొడిగించాలని కేంద్రం భావిస్తోంది. సాధారణంగా రాష్టప్రతి పాలన ఉన్న సమయంలో గవర్నర్‌కు పాలనలో సహకరించేందుకు ఇద్దరు సలహాదారులను నియమించడం ఆనవాయితీ. ఇప్పుడు కూడా రాయ్, సలావుద్దీన్‌లను గవర్నర్ సలహాదారులుగా నియమించింది. రాష్టప్రతి పాలన ముగిసిన వెంటనే వారి పదవీకాలం కూడా ముగుస్తుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తున్నందున గవర్నర్‌కు సలహాదారులను మరికొంతకాలం కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఉమ్మడి రాజధానికోసం నిర్ణయం!
english title:
capital
Date:
Friday, April 4, 2014