హైదరాబాద్, ఏప్రిల్ 3: జిల్లా పరిషత్, మండల పరిషత్ (జడ్‌పిటిసి, ఎంపిటిసి) సభ్యుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిదశ పోలింగ్‌కు సంబంధించిన ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగుస్తోంది. 6న నిర్వహించనున్న తొలి దశలో 560 జడ్‌పిటిసి సభ్యులతో పాటు, ఆ యా మండలాల్లోని ఎంపిటిసి సభ్యుల ఎన్నికకు సంబంధించి తొలిదశ పోలింగ్‌కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మార్చి 17 న ప్రారంభమైన జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యుల నామినేషన్ల ప్రక్రియ మార్చి 24 తో ముగిసింది. ఆ వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల అధికారి (ప్రిసైడింగ్ అధికారులు) వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జడ్‌పిటిసిలకు 5094 మంది, ఎంపిటిసిలకు 53 వేల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మార్చి 24 నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం శుక్రవారంతో ముగుస్తోంది. రెండోదశ పోలింగ్‌కు సంబంధించిన ప్రచారం తొమ్మిదో తేదీ సాయంత్రంతో ముగుస్తుంది. తొలిదశ ప్రచారం 11 రోజుల పాటు కొనసాగింది. దండిగా డబ్బున్న కొంతమంది అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటినుండే ప్రచారం చేసుకుంటున్నారు. అంటే వారు తమ ప్రచారాన్ని దాదాపు 20 రోజుల పాటు చేసుకున్నారు. రెండో దశలో పోలింగ్ జరుగుతున్న అభ్యర్థులు మరో అయిదు రోజుల పాటు తమ ప్రచారాన్ని కొనసాగించాల్సి వస్తోంది.
జిల్లా పరిషత్, మండల పరిషత్ (జడ్‌పిటిసి, ఎంపిటిసి) సభ్యుల ఎన్నికల ప్రక్రియలో
english title:
parishat
Date:
Friday, April 4, 2014