ఫరుక్కాబాద్, ఏప్రిల్ 4: లౌకిక సిద్ధాంతాలను బలపరిచే పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతోవుందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పిలుపునిచ్చారు. ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. జామామసీద్ షాహీ ఇమామ్ బుఖారీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకోవడాన్ని మోడీ తప్పుబట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇంకెంతమాత్రం ఆలస్యం లేకుండా బుఖారీ ఇప్పటికైనా సోనియాను కలుసుకోవడం అన్నది శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. సమాజ్‌వాది పార్టీ మేనిఫెస్టో పైనా ఖుర్షీద్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలుచేయలేదని, తాజా వాగ్దానాలను అమలుచేస్తుందన్న హామీ ఏమిటని ప్రశ్నించారు.
* బుఖారీ-సోనియా భేటీపై ఖుర్షీద్
english title:
idi
Date:
Saturday, April 5, 2014