అడ్డం
1.పెళ్లికి ముందు మూకుట్లో గింజలు నాటడం (6)
4.పొదరిల్లు (3)
5.‘దప్పి’ని ఇలా గూడా అనొచ్చు గూడా! (2)
6.అక్షరము కానిది, మబ్బు (3)
7.వెనక నించి వచ్చి రెట్టిస్తే తప్ప,
ఇలా పనులు జరగవ్ (2)
8.‘నిద్రారుణిమ’లో దర్శనమిస్తుందా భవాని? (3)
10.మాంఛి ఎండాకాలం (5)
11.ముఖ్య పట్టణం
13.సామాను, సరుకులు (4)
15.కనపడకుండా వినపడేది (5)
16.మీగడ (3)
18.రెండు వేల ధనుసుల దూరం. అంటే సుమారు 2 మైళ్లు (2)
20.ఆశ హద్దు మీరితే ఇదే! (3)
21.అడ్డం (8)లో అమ్మవారే! (2)
22.దేశానికి ఇది జతయితే, అదో పెద్ద సినిమా! (3)
23.అద్దం చూడ్డం అని అర్థం. కాకతీయుల కాలంలో సానిపాపల స్నాతకోత్సవం లాంటిది (6)
నిలువు
1.‘... వాహనుడే’ అందరికీ అండ, ఆండాళూ! (3)
2.ఈ టైపు గంతులు పావని ముందు పని
చెయ్యవ్ (2)
3.వెనుదిరిగి చూసుకో! ఇది ఉపయోగించి ఏది మంచో, ఏది చెడో తెలుసుకో! (4)
4.ప్రేమతో శరీరము తడుము (3)
7.కోపించు, కోపంగా మాటాడు (3)
9.సినీ నటి జమున పుట్టినింటి పేరు
తలక్రిందులుగా (3)
10.ఈ పువ్వుని మాలలో గుచ్చడానికి
ఇంకా వేరే దారం కావాలా? (3)
12.్భమి (3)
13.ఇదీ, సంస్కారం ఉంటేనే గౌరవం! (3)
14.ఈయన గొప్ప నిస్వార్థ ప్రజా నాయకుడే గాని, జాతీయ స్థాయికి ఎదగనీయలేదు.
ఆంధ్రకే సరిపెట్టారు (3)
15.బాధ వ్యక్తీకరణము, తిట్టు (4)
17.‘ఇది ఆడినన్నాళ్లు కరవులే లేవు’ అని స్వరాజ్యం రాక ముందు పాట (3)
19.బీపీ వస్తుందని డాక్టర్లందరూ దీన్ని దూరంగా పెడతారు గాని, డా.సమరం గారికి మాత్రం
సోదర ప్రేమ (3)
21.నేరం కర్త అవునో కాదో గాని,
ఇది మాత్రం ఖర్మే! (2) *