అబ్రహాం లింకన్ లాయర్ వృత్తి కొనసాగిస్తున్న రోజుల్లో, ఓ రైతు అతని వద్దకు వచ్చాడు. తన పొలం పక్కనే పొలం చేసుకుంటున్న రైతు, తన పొలంలోకి చొచ్చుకు వచ్చి పంట పండించుకుంటున్నాడనే ఫిర్యాదుతో కోర్టు కెక్కాలని అతడి ఉద్దేశం. లింకన్ అతడి మాటలు విన్న తర్వాత ‘నువ్వు దీనిని కొనసాగిస్తే ఇద్దరి మధ్యా శత్రుత్వం, మీ తర్వాతి తరాల్లో కూడా సాగుతుంది. నువు రాక ముందే మీ పొరుగు రైతు కూడా నా వద్దకు వచ్చి, నేను తన తరఫున వకాల్తా తీసుకొని వాదించమని కోరాడు.
నేను భోజనానికి బయటికి వెళ్తున్నాను. మీరిద్దరూ ఈ ఆఫీసు రూమ్‌లోనే కూచొని చర్చించుకొని ఒక పరిష్కారానికి వస్తే ఏ గొడవా వుండదు కదా? మీ ఇద్దరూ ఈ గదిలో చర్చించుకునే వేళ, మరెవరో వచ్చి మీ చర్చకు అడ్డు రాకుండా ఉంటానికి, నేను వెళ్తూ బయట తలుపు తాళం పెట్టి వెళ్తాను’ అని చెప్పి వెళ్లాడు.
లింకన్ మధ్యాహ్నమంతా వెనక్కు రాలేదు. ఇద్దరు రైతులు, బయట తాళం ఉందని తెలిసి, లింకన్ తిరిగొచ్చేవరకు ఈ చెఱ తప్పదని గ్రహించి, తగవు పెంచే చర్చ వదిలేసి, పరిష్కారం దిశగా చర్చించారు. లింకన్ సాయంత్రానికి తిరిగి వచ్చాడు. రైతులిద్దరూ పరిష్కారం కుదుర్చుకొని, లింకన్ రాకకై ఎదురుచూస్తున్నారు.
కోప్పడకు, బ్రదర్
యుద్ధ విరమణ జరిగిన తర్వాత ఏర్పడిన క్షామ కాలంలో, రష్యా వీధుల గుండా నడిచి వెళ్తున్న గొప్ప రచయిత టాల్‌స్టాయ్‌కి ఒక బిచ్చగాడు ఎదురయ్యాడు.
టాల్‌స్టాయ్ జేబులన్నీ వెతుక్కున్నాడు, ఏదైనా ఇద్దామని. కానీ జేబుల్లో ఉన్న డబ్బంతా వారికీ వీరికీ అప్పటికే పందారం చేసేశాడు. అవి పూర్తిగా ఖాళీ అయిపోయినై. ఏమీ చేయలేక, బిచ్చగాడి దైన్యానికి హృదయం ద్రవించినందువల్ల, అతణ్ణి దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు. ‘కోప్పడవద్దు బ్రదర్, సమయానికి నా వద్ద ఏమీ లేకుండా పోయింది’ అని క్షమాపణ వేడుకున్నాడు.
జీవకళ కోల్పోయిన ఆ దీనుడి కృశించిన మొహంలో, వెలుగు పొడ సూపింది. కళ్లల్లో నీళ్లు నిండినై. ‘నన్ను బ్రదర్ అన్నావు కదా. ఆ మాటే చాలు. అదే పదివేలు’ అంటూ పొంగిపోయాడు.
వినోదమే ఔషధం
అమితమైన విచారం, దిగులుతో బాధపడుతున్న ఒక రోగి, డాక్టర్ ఎబెర్‌నతీ వద్దకొచ్చి, పరీక్ష చేయించుకున్నాడు. ఆ ప్రసిద్ధ డాక్టర్ అంతా పరీక్ష చేసి, ‘నీకు కాస్త వినోదమవసరమయ్యా, గ్రామాల్జీ అనే హాస్య చక్రవర్తి ప్రదర్శనలు చూడు. అతడి మాటలు వింటే, పొట్టచెక్కలయ్యేట్లు నవ్వు పుట్టుకు వస్తుంది. మందులకన్నా ఆ నవ్వే నీ పరిస్థితికి మంచి మందు’ అని సలహా ఇచ్చాడు.
‘మహాప్రభో, నేనే ఆ గ్రిమాల్డీనండీ’ అని మొత్తుకున్నాడు ఆ నిరాశోపహతుడు.
* * *
నియంతల కరుణ
‘స్టాలిన్ అని మనం వ్యవహరించే మనిషి అసలు పేరేమిటో తెలుసా?’ య్హశ్రీదిడ్హేనిజని. ఇకపోతే హిట్లర్ అనే ఆయన అసలు నామధేయమేమిటో తెలుసా? డ్ళ్హనిజద్గిశ్రీఱఉ్గ.
ఆ మహానాయకులిద్దరూ మనం పలకగల్గిన పేర్లు పెట్టుకున్నారు కాబట్టి మనం బ్రతికిపోయాం’ అన్నాడు ఉత్కళరావు.
బాధానుభవం
ప్రథమ ప్రపంచ సంగ్రామంలో (1914-1919) ఆర్మీ సర్జన్‌గా తన వృత్తిని ప్రారంభించిన జార్జెన్ డుహామెల్ తన హాస్పిటల్ అనుభవాలను గురించి రాస్తూ ‘మరొక మనిషి తన శరీరంలో అనుభవించే బాధ ఎలాంటిదో ఇవతలి మనిషికి తెలియడానికి కాబోలు, యుద్ధాలు జరుగుతూనే వుంటై’ అన్నాడు.
కాఫీ మెళకువతో వుంచుతుంది
వాషింగ్‌టన్‌లో ప్రభుత్వపరంగా ఓ విందు ఏర్పాటైంది. కొందరు ప్రముఖులు ప్రసంగించనున్న తరుణంలో సెనెటర్ తియొడోర్ గ్రీన్ పక్కనే కూచున్న ఒకావిడ ‘సెన్‌టర్‌గారూ, కాఫీ పాట్ నుండి మీ కప్పులో కాస్త కాఫీ పోయనా?’ అని అడిగింది.
‘అమ్మో, తొందరపడి అలాంటి పని చేయకండి; మీరందరూ ప్రసంగించేటపుడు నేను మెళకువతో ఉండాల్సి వస్తుంది’ అన్నాడు సెనెటర్ గ్రీన్.
*
నీలంరాజు నోట్‌బుక్
english title:
linkan
Date:
Sunday, April 15, 2012