Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పారిశ్రామిక రంగంలో పడకేసిన వృద్ధి

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులకు అద్దం పట్టేలా పారిశ్రామిక ప్రగతి గణాంకాలు విడుదలయ్యాయి. ఈ ఫిబ్రవరిలో పారిశ్రామిక ప్రగతి గణాంకాలు 0.6 శాతానికి పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 4.3 శాతంగా ఈ గణాంకాలున్నాయి. విద్యుదుత్పత్తి, గనుల అభివృద్ధి, తయారీ రంగాల్లో నమోదైన పేలవ ప్రదర్శన పారిశ్రామిక వృద్ధిరేటును దెబ్బతీశాయి. ఇక 2012-13 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-్ఫబ్రవరి మధ్యలో పారిశ్రామిక వృద్ధిరేటు 0.9 శాతం ఉండగా, 2011-12 ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 3.5 శాతంగా ఉంది. తయారీ రంగంలో వృద్ధి గత ఫిబ్రవరితో పోల్చితే ఈసారి 4.1 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది. అలాగే విద్యుత్ 8 శాతం నుంచి మైనస్ 3.2 శాతానికి, మైనింగ్ 2.3 శాతం నుంచి మైనస్ 8.1 శాతానికి పడిపోయింది. కాగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగం మంచి వృద్ధిరేటును నమోదు చేయగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాజా ఐఐపి గణాంకాలు చాలా తక్కువగా నమోదయ్యాయని ఈ సందర్భంగా అహ్లూవాలియా పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో సమసి పోతాయనే విశ్వాసాన్ని వెలిబుచ్చారు.
వడ్డీరేట్లు తగ్గించాలి
ఫిబ్రవరిలో పారిశ్రామిక రంగ ప్రదర్శన పేలవంగా ఉన్న నేపథ్యంలో ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ఉత్పత్తి పెరగాలంటే వడ్డీరేట్ల తగ్గింపు తప్పనిసరి అని అభిప్రాయపడుతున్నాయి. పరిశ్రమల విభాగం ఫిక్కి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘్ఫబ్రవరి ఐఐపి గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఉత్పత్తి పెరుగుదలకు, పెట్టుబడుల వెల్లువ కోసం ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించడంపై దృష్టి పెట్టాలి.’ అని ఫిక్కి ప్రధాన కార్యదర్శి దిదర్ సింగ్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులపై క్యాబినెట్ కమిటీ సైతం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కోరింది.
ఇక ఇదే అభిప్రాయాలను సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యక్తం చేశారు. రెపో రేటు, సిఆర్‌ఆర్‌లను 50 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్‌బిఐ తగ్గించాలని మేం కోరుకుంటున్నామన్నారు. క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ డికె జోషి మాట్లాడుతూ పేలవమైన వృద్ధిరేటు దృష్ట్యా వడ్డీరేట్లు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు.
తాజాగా విడుదలైన చిల్లర ద్య్రవోల్బణం తగ్గిన దృష్ట్యా వడ్డీరేట్లను తగ్గించే విషయంలో రిజర్వ్ బ్యాంకు యోచించాలన్నారు.
ఈ-కాయిన్స్ ట్రేడింగ్‌ను
ఆరంభించిన ఆర్‌ఎస్‌బిఎల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 12: దేశంలోనే అతి పెద్ద బులియన్ ట్రేడింగ్ కంపెనీ రిద్ధిసిద్ధి బులియన్స్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌బిఎల్) తొలిసారిగా ఈ-కాయిన్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ కంపెనీ ఎండి ఫృధ్వీరాజ్ కొఠారీ ఈ-కాయిన్స్ ట్రేడింగ్‌ను శుక్రవారం నాడిక్కడ ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రారంభించారు. స్వల్ప విలువ కలిగిన బంగారు నాణేలను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ-కాయిన్స్ ట్రేడింగ్ ద్వారా పొందేందుకు దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. ఆధునాతాన ఎలక్ట్రానిక్ విధానం ద్వారా కొనుగోలు లేదా విక్రయం ఏదైనా చేసుకోవచ్చని తెలిపారు. ఏదైనా కడ్డీ, కాయిన్ రూపంలో మాత్రమే ఉంటేనే ట్రేడింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ లావాదేవీ ఒక గ్రాము నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఒకటి ఉందని, దానిని కొనుగోలు దారుడు ఎలాంటి చార్జిలు చెల్లించే అవసరం లేకుండా డౌన్‌లోడ్ చేసుకుని ట్రేడింగ్‌కు యాక్సెస్ కావచ్చని తెలిపారు. స్వచ్చతను బట్టి ధర ఉంటుందని, స్పాట్ డెలివరీ అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.
భారత్‌తో ఎఫ్‌టిఎకి
ఐరోపా సమాజం మొగ్గు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్‌తో కుదుర్చుకోవాలనుకుంటున్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)లో డాటాకు సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలను చేర్చాలని తాము కోరడం లేదని ఐరోపా సమాజం (ఇయు) స్పష్టం చేసింది. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే రాజకీయ దృఢ సంకల్పం ఇరు పక్షాల్లో కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించింది. కొత్త ఔషధాలకు సంబంధించి భద్రత, సామర్థ్యం రుజువు చేసుకునేందుకు నిర్వహించే అంతర్జాతీయ పరిశోధనల ఖర్చులు, తదతర వివరాలను పొందుపరచాలని ఔషధ రంగంలోని ఆయా సంస్థలకు నిబంధనలు పెట్టడం లేదంది. మార్కెట్‌లో ప్రముఖ సంస్థలు ఈ విషయంలో ఔషధ తయారీపై హక్కులను సాధించుకుంటుండటంతో మిగతా సంస్థలు ఇబ్బందిగా ఉంటుందనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే ఇయు పైవిధంగా స్పందించింది. ఇప్పుడు మేము ఇలాంటి డాటా ఉండాల్సిందని ఏమీ అనడం లేదని ఇయు ప్రతినిధుల బృందం అధిపతి తెలిపారు. భారత్ పర్యటనకు వచ్చిన ఈ బృందం ప్రభుత్వ అధికారులను కలుసుకుని అనంతరం విలేఖరులతో మాట్లాడింది. కాగా, భారత జనరిక్ మందుల పరిశ్రమ 20 బిలియన్ డాలర్ల విలువైనదిగా ఉండగా, మొత్తం ఉత్పత్తిలో 50 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఫిబ్రవరి ఐఐపి గణాంకాలు 0.6 శాతంగా నమోదు
english title: 
p

మార్కెట్‌ను దెబ్బతీసిన ఇన్ఫోసిస్ ఫలితాలు

$
0
0

ముంబయి, ఏప్రిల్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ స్థాయిలో నష్టాలను చవిచూశాయి. గత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికానికిగానూ ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో ఐటి దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ మదుపర్లను నిరాశపరించింది. ఈ క్రమంలోనే ఆ సంస్థ షేర్ల విలువ 21 శాతానికిపైగా క్షీణించింది. చిల్లర ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ పట్టించుకోని మదుపర్లు అమ్మకాలకు తెగబడ్డారు. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 300 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 65 పాయింట్ల మేర కోల్పోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తర్వాత ఆ స్థాయిలో మార్కెట్లు నష్టపోవడం ఇదే తొలిసారి. నాడు సెనె్సక్స్ 317 పాయింట్ల వరకు దిగజారింది. ఇతర ఐటి సంస్థలైన టిసిఎస్, విప్రో సంస్థల షేర్లూ పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఆసియాలోని చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మార్కెట్లు 0.06 శాతం నుంచి 1.31 శాతం పడిపోయాయి. ఐరోపా మార్కెట్లు సైతం నిరాశాజనకంగానే ట్రేడ్ అవుతున్నాయి. ఇదిలావుంటే ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, రిఫైనరీ షేర్లు లాభాలను అందుకున్నాయి. అయినప్పటికీ ఐటి సూచి 11.09 శాతం క్షీణించడం వల్ల నష్టాలు మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 299.64 పాయింట్లు పడిపోయి 18,242.56 వద్ద, నిఫ్టీ 65.45 పాయింట్లు దిగజారి 5,528.55 వద్ద ముగిశాయి.
దశాబ్దకాలం క్రిందకు
ఇన్ఫోసిస్ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు మదుపర్లను ఆకట్టుకోలేకపోవడంతో భారీగా అమ్మకాలకు గురైన ఆ సంస్థ షేర్ల విలువ దశాబ్దకాలం క్రిందకు దిగజారింది. ఈ ఆర్థిక సంవత్సరం రెవిన్యూ అంచనా తక్కువగా ఉండటంతో నిరాశకు లోనైన మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఇన్ఫోసిస్ షేర్ విలువ 21.33 శాతం పడిపోగా, 35,740 కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయింది.

చిన్న పట్టణాలపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: బీమా రంగం చిన్నచిన్న పట్టణాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సూచించారు. శుక్రవారం ఆయన ఇక్కడ పాన్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ప్రపంచంలో నాన్‌లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో భారత్ 52వ స్థానంలో ఉందన్న ఆయన ఎల్‌పిజి రాయితీని ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఆస్తి పన్ను వసూళ్లలో రాజమండ్రి టాప్

రాజమండ్రి, ఏప్రిల్ 12: ఆస్తి పన్ను వసూళ్లలో పురపాలకశాఖ రాజమండ్రి రీజియన్ రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. పాత బకాయిలు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వసూలుకావాల్సిన మొత్తం ఆస్తి పన్ను రూ.180కోట్ల 57లక్షల్లో మార్చి 31నాటికి రూ.171కోట్ల 83లక్షల ఆస్తి పన్ను వసూలయింది. రాజమండ్రి రీజియన్‌లోని ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుండి ఇంకా వసూలుకావాల్సిన ఆస్తి పన్ను కేవలం రూ.8కోట్ల 74లక్షలు మాత్రమే ఉంది. మూడు జిల్లాల్లోని సుమారు 6లక్షల 39వేల 874 భవనాలు, ఖాళీ స్థలాల నుండి ఈ ఆస్తి పన్ను వసూలయింది.
గతంలో ఆస్తి పన్ను సక్రమంగా వసూలు కాకపోవటంతో పురపాలకసంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవి. ఆస్తి పన్ను వసూలుచేయటానికి పురపాలకసంఘాల అధికారులు నానా తిప్పలుపడాల్సి వచ్చేది. రాను రాను యజమానుల విధానంలో మార్పు రావటంతో పాటు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో ఆస్తి పన్ను వసూళ్లు గత రెండేళ్లుగా పెరుగుతున్నాయి. అయితే ఆస్తి పన్ను వసూళ్లు కోస్తాంధ్ర జిల్లాల్లోనే ఇతర ప్రాంతాల్లో కన్నా కాస్తంత ఎక్కువ జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా మార్చి 31నాటికి వసూలయిన ఆస్తి పన్ను వసూళ్లను పరిశీలిస్తే, రాజమండ్రి రీజియన్‌లోనే ఇతర రీజియన్ల కన్నా ఎక్కువ వసూళ్లు కనిపిస్తున్నాయి. బకాయిలతో సహా మార్చి 31నాటికి ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే, ఎలాంటి అదనపు భారం లేకుండా, వడ్డీని మాఫీ చేస్తామని రెండేళ్లుగా రాష్ట్రప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక రాయితీ కూడా ఆస్తి పన్ను వసూళ్లు పెరగటానికి ఊతమిస్తోంది. ఈ అవకాశాన్ని కూడా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలోని వారే ఎక్కువ వినియోగించుకుంటున్నారు తప్ప, ఇతర రీజియన్లలోని వారు పెద్దగా పట్టించుకుంటున్నట్టు కనిపించటం లేదు. రీజియన్లవారీ వసూళ్లతో పాటు కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీల వారీ ఆస్తి పన్ను వసూళ్లను చూసినాగానీ గోదావరి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనే ఎక్కువ వసూళ్లు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కార్పొరేషన్లలో రాజమండ్రి కార్పొరేషన్ 99.10శాతం ఆస్తి పన్నును వసూలుచేసి, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. గత ఏడాది కూడా రాజమండ్రి కార్పొరేషన్ ఇదే తీరును ప్రదర్శించింది. మున్సిపాలిటీల్లో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ 99.10శాతం సాధించి మున్సిపాలిటీల్లో అగ్రభాగాన నిలిచింది. 95శాతంపైనే ఆస్తి పన్ను వసూలుచేసిన మున్సిపాలిటీలు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 16 ఉన్నాయి. వీటిలో 98శాతం వసూళ్లు సాధించిన మున్సిపాలిటీలు 13 ఉన్నాయి. ఆస్తి పన్నును ఇంత బాగా వసూలుచేస్తున్నాగానీ, ఖాతాల్లో జమ చేసుకోవటం తప్ప, అభివృద్ధి పనులకు వినియోగించుకోవటానికి మాత్రం మున్సిపాలిటీలకు సవాలక్ష అడ్డంకులు ఉన్నాయి.

అమ్మకాలకు తెగబడ్డ మదుపర్లు * సెనె్సక్స్ 300, నిఫ్టీ 65 పాయింట్ల పతనం
english title: 
m

పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో పైప్‌లైన్ వ్యవస్థ కీలకం

$
0
0

విశాఖపట్నం, ఏప్రిల్ 12: పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో పైప్‌లైన్ వ్యవస్థ కీలకం కానుందని, ఉపరితల రవాణాతో పోలిస్తే పైప్‌లైన్ ద్వారా రవాణా చేయడం ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు భద్రత పరంగాను సురక్షితమని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అభిప్రాయపడ్డారు. సెంటర్ ఫర్ హైటెక్నాలజీ, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) సంస్థలు సంయుక్తంగా ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్స్‌పై శుక్రవారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ఇప్పుడు నిత్యావసరాలుగా మారాయని, వీటి రవాణా, పంపిణీ వంటి అంశాల్లో మాత్రం ఒకప్పటి విధానాలే అమలవుతున్నాయన్నారు. ప్రస్తుతం గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి 42 శాతం పైప్‌లైన్ ద్వారానే రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. దీన్ని ఈ సంవత్సరాంతానికి 52 శాతానికి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 2,300 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందని, 2020 నాటికి ఈ వ్యవస్థను మరింత పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక కిలోమీటర్ పైప్‌లైన్ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సగటున 6కోట్ల రూపాయల వ్యయం అవుతోందన్నారు. చమురు క్షేత్రాల నుంచి రిఫైనరీకి, రిఫైనరీ నుంచి సరఫరా పాయింట్లకు పైప్‌లైన్ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉపరితల రవాణా వ్యవస్థపై ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. అయితే పైప్‌లైన్ రవాణా వ్యవస్థ సురక్షితమైనప్పటికీ వీటి నిర్మాణంలో కొన్ని సాంకేతిక పరమైన అవరోధాలు తప్పట్లేదన్నారు.
రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులపై చర్చిస్తాం
ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు అదనపుగ్యాస్ కేటాయింపులపై పనబాక లక్ష్మిని విలేఖరులు ప్రశ్నించగా, ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తమ శాఖతో చర్చిస్తున్నారని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ అంశంపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని వివరించారు. పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో తమ మంత్రిత్వశాఖలో దీనిపై చర్చించాల్సి ఉందన్నారు.

భవిష్యత్తులో ఇదే సురక్షిత విధానం, అధిక ఆదాయం: కేంద్ర సహాయ మంత్రి పనబాక
english title: 
p

15 శాతం పెరిగే అవకాశాలున్నాయి

$
0
0

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈ ఆర్థిక సంవత్సరం రత్నాలు, నగల ఎగుమతులు 15 శాతం పెరిగే అవకాశాలున్నాయని రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జిజెఇపిసి) అంచనా వేసింది. బంగారం ధరలు దిగివస్తున్న ప్రస్తుత తరుణంలో శుక్రవారం నుంచి ఇక్కడ ప్రారంభమైన భారత రత్నాలు, నగల ప్రదర్శనలో కొనుగోళ్లు పెరుగుతాయనే ఆశాభావాన్ని కూడా జిజెఇపిసి వ్యక్తం చేసింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర 29,000 రూపాయల దరిదాపుల్లో కదలాడుతుండగా, గత పదిహేను రోజుల నుంచి పుత్తడి ధరలు 30,000 రూపాయల నుంచి క్రమంగా పడిపోతూ వస్తున్నాయి.
గత ఏడాది నవంబర్ 27న 10 గ్రాముల బంగారం అత్యధికంగా 32,975 రూపాయలు పలికింది. ఈ పరిణామాలపై జిజెఇపిసి వైస్ చైర్మన్ పంకజ్ పరేఖ్ పిటిఐతో మాట్లాడుతూ ‘గత కొద్ది వారాలుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి.’ అన్నారు. ఈ పరిస్థితుల్లో తాజా నగల ప్రదర్శన ఢిల్లీ వాసులకు లాభించగలదని అభిప్రాయపడ్డ ఆయన సుమారు 100 రిటైలర్ల నుంచి వివిధ రకాల ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
గీతాంజలి, మలబార్ గోల్డ్‌తోపాటు మరికొన్ని ప్రముఖ సంస్థల ఆభరణాలు ఈ ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయన్నారు. కాగా, భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటిపిఒ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రితా మీనన్ మాట్లాడుతూ అన్ని వర్గాల వినియోగదారులకు తగ్గట్లుగా వివిధ ధరల శ్రేణులతో ఎన్నో రకాల ఆభరణాలు ఈ ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. ఇదిలావుంటే అంతకుముందు భారత్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రత్నాలు, నగల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 15 శాతం పెరిగే అవకాశాలున్నాయని రత్నాలు, జిజెఇపిసి చైర్మన్ విపుల్ షా అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి విదేశాలకు 39 బిలియన్ డాలర్ల విలువైన వివిధ రకాల రత్నాలు, నగలు ఎగుమతి అయిన నేపథ్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆ ఎగుమతులు 15 శాతం పెరిగి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ఇక్కడ ప్రారంభమైన 2013 భారత రత్నాలు, నగల ప్రదర్శనకు హాజరైన ఆయన ఎగుమతులపై ప్రత్యేకంగా మాట్లాడారు. అంతర్జాతీయ విపణిలో నెలకొన్న మందగమనం ప్రభావం తగ్గిపోతోందన్న ఆయన ప్రధానంగా అమెరికా మార్కెట్‌లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, డిమాండ్ పెరుగుతోందని, అందుకే ఈసారి భారత్ నుంచి ఎగుమతులు కూడా పెరుగుతాయని అంచనా వేశామన్నారు.
భారత రత్నాలు, నగలకు మేజర్ మార్కెట్లుగా యూరప్, అమెరికా, యుఎఇ, హాంగ్‌కాంగ్ దేశాలున్నాయి. ఈ క్రమంలో లాటిన్ అమెరికా, రష్యా, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లపైనా ఎగుమతిదారులు దృష్టి పెడుతున్నారని విపుల్ షా తెలిపారు.

2013-14లో రత్నాలు, నగల ఎగుమతులపై జిజెఇపిసి అంచనా బంగారం ధరల తగ్గుదలతో కొనుగోళ్లు పెరగగలవనే ఆశాభావం
english title: 
s

భెల్ టర్నోవర్ రూ.7వేల కోట్లు

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 12: బిహెచ్‌ఇఎల్ హైదరాబాద్ యూనిట్ 2012-13 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6,999 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ.1650 కోట్ల లాభం ఆర్జించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(హెచ్‌పిఇపి) ఎన్ రవిచందర్ వెల్లడించారు. రామచంద్రాపురంలోని సంస్థ పరిపాలన భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వార్షిక పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు. హెచ్‌పిఇపి విభాగంలో 6,490 కోట్ల టర్నోవర్ సాధించడం ద్వారా 1525 కోట్ల లాభాలు పొందినట్లు చెప్పారు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ డివిజన్‌కు సంబంధించి 509 కోట్ల టర్నోవర్ ద్వారా 125 కోట్ల లాభం సాధించినట్లు ఆ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవింద్ గుప్త వివరించారు. పరిశోధన, అభివృద్ధికి రూ.171 కోట్లు వెచ్చించినట్లు భెల్ ఇడి రవిచందర్ పేర్కొన్నారు. బిజినెస్ ఎక్సెలెన్స్ అవార్డు, ఐఎస్‌వో 27001 సర్ట్ఫికెట్, ప్రధాన మంఅతి శ్రమశ్రీ అవార్డులను తమ యూనిట్ సాధించిందని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగాంగా పరిసర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

శుక్రవారం జరిగిన బిహెచ్‌ఇఎల్ వార్షిక సమావేశం

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవిచందర్ వెల్లడి
english title: 
b

రాజుకుంటున్న 'బొగ్గు'!

$
0
0

సిబిఐ నివేదికలో సర్కారు జోక్యంపై కథనాలు
ప్రధానిని రక్షించే ప్రయత్నమే: సుష్మ సిబిఐని వాడుకుంటున్నారు: అరుణ్‌జైట్లీ నివేదికలో ప్రభుత్వ జోక్యం లేదు: కాంగ్రెస్ పరిస్థితిపై కాంగ్రెస్ కోర్ గ్రూప్ చర్చ కథనాలన్నీ ఊహాజనితాలు: సిబిఐ డైరెక్టర్
=========
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ‘బొగ్గు’ మళ్లీ రాజుకుంటోంది. గనుల కేటాయింపు కుంభకోణం సరికొత్త మలుపు తిరిగి సంకీర్ణ సర్కారు పీకకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో ఘట్టంలో ‘బొగ్గు’నే ఆయుధంగా చేసుకుని సంకీర్ణ సర్కారుపై దాడికి విపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. మరోపక్క బొగ్గు కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి ప్రభుత్వ జోక్యంపై సుప్రీం కోర్టుకు సిబిఐ అందచేయనున్న నివేదిక అనూహ్య పరిణామాలకు దారి తీయవచ్చునని భావిస్తున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ నీతి నిజాయితీలనే వేలెత్తి చూపుతున్న బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవినీతి అవకతవకలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సిబిఐ యథాతథ స్థితిని వివరిస్తూ ఒక నివేదికను తయారు చేసి అందించింది. నివేదికను సీల్డు కవర్‌లో ఉంచాల్సిందిగా ఆదేశిస్తూ, నివేదికలోని అంశాలను అధికారులు, ప్రభుత్వానికి తెలియనివ్వొద్దని జస్టిస్ ఆర్‌ఎం లోథా, జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్‌తో కూడిన బెంచి సిబిఐని ఆదేశించింది. కుంభకోణంపై నిర్వహించే అన్ని దర్యాప్తు నివేదికలకూ ఇదే సూత్రం వర్తింప చేయాల్సిందిగా బెంచి ఆదేశించింది. అయితే తాము సమర్పించిన నివేదికకు తుదిరూపం ఇచ్చే సమయంలో న్యాయ శాఖ మంత్రి అశ్వనీకుమార్ తమ సంస్థ డైరక్టర్ సహా మరికొంతమంది ఉన్నతాధికార్లతో సమావేశమై నివేదికను సవరించినట్టు సిబిఐ న్యాయ స్థానానికి తెలియచేయాలని నిశ్చయించింది. సిబిఐ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి సంకటంగా మారుతోంది. ఒక జాతీయ పత్రికలో ఈమేరకు వచ్చిన కథనాలపై బిజెపి నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మన్మోహన్‌ను రక్షించేందుకే న్యాయ శాఖామంత్రి అశ్వినీకుమార్ ఈ చర్యకు పాల్పడ్డారని లోక్‌సభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ఆరోపించారు. సిబిఐ రూపొందించిన నివేదికను తారుమారు చేసి నీరుగార్చటంకంటే తీవ్రనేరం మరొకటి ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి కలిగిన సిబిఐని ప్రభుత్వం స్వతంత్రంగా పని చేయనీయటం లేదని వ్యాఖ్యానించారు. సుప్రీం ఆదేశాల మేరకు సిబిఐ తన నివేదికను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి అందచేయాలే తప్పించి, ప్రభుత్వానికి ఒక్కముక్క కూడా తెలియచేయటానికి వీల్లేదని ఆయన గుర్తు చేశారు. తమ నివేదికలోని అంశాలను సిబిఐ అధికారులు లేదా రాజకీయ నాయకత్వానికి వివరించకూడదని సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం నివేదికను తారుమారు చేయటం సహించరాని నేరమే అవుతుందని ఆయన చెప్పారు. గనుల కేటాయింపులో చోటుచేసుకున్న అవినీతి అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ జోక్యాన్ని సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టు దృష్టికి సిబిఐ తీసుకురానున్నందున తీవ్ర పరిణామామలు తప్పవని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ జోక్యం లేదు: కాంగ్రెస్
ఇదిలావుంటే, వేడెక్కుతున్న ‘బొగ్గు’ వ్యవహారంపై కాంగ్రెస్ కోర్ గ్రూపు శనివారం చర్చించింది. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కోర్ సభ్యులు తీవ్రమవుతున్న పరిస్థితిపై చర్చలు జరిపారు. విమర్శల వాడిని పెంచుతున్న బిజెపిని ఎదుర్కొనే అంశంపై వ్యూహాత్మక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కోర్ గ్రూపు చర్చల అనంతరం అధికార ప్రతినిధి రషీద్ అల్వీ మీడియాతో మాట్లాడారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై సుప్రీం కోర్టుకు సిబిఐ సమర్పిస్తున్న నివేదికలో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో న్యాయశాఖా మంత్రి అశ్వినీ కుమార్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కూడా తేల్చిచెప్పారు. సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యే వరకూ బిజెపి వేచి ఉండాలన్నారు. దేశాన్ని తప్పుదోవ పట్టించవద్దని, దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించవద్దని ఆయన హితవు పలికారు.
కథనాలన్నీ కల్పితాలే: సిబిఐ
అయితే, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు నివేదికను ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న కథనాలన్నీ ఊహాజనితాలని సిబిఐ డైరెక్టర్ రంజిత్‌సిన్హా కొట్టిపారేశారు. వ్యవహారం యథాతథ స్థితికి సంబంధించి ఇప్పటికే సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించామన్నారు. సిబిఐ నివేదికలో మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయన్న కథనాల్లో ఎలాంటి వాస్తవమూ లేదని ఆయన కొట్టిపారేశారు.

గనుల కేటాయింపు కుంభకోణంలో కొత్తమలుపు*మన్మోహన్ లక్ష్యంగా దాడికి విపక్షాలు సమాయత్తం
english title: 
coalgate

మోడీని ఒప్పుకోం

$
0
0

లౌకికవాదే పదవికి అర్హుడని మెలిక * జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చ
==================
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే ప్రధాన మంత్రి పీఠంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కూర్చోబెట్టాలన్న భారతీయ జనతా పార్టీ ఆలోచనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన మంత్రి పదవికి ఎవరు అర్హులన్న విషయమై బిజెపి, దాని భాగస్వామ్య పక్షమైన జెడి(యు) మధ్య నలుగుతున్న వివాదానికి తెరపడింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ఆమోదించే ప్రసక్తి లేదని జనతాదళ్(యు) నిర్ద్వంద్వంగా ప్రకటించింది. లౌకికవాదానికి కట్టుబడిన వ్యక్తులే ప్రధానమంత్రి కావాలన్న తమ వాదన ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని పార్టీ నాయకుడు కేపి త్యాగి స్పష్టం చేయటంతో మోడీ అభ్యర్థిత్వంపై బిజెపి, జెడి(యు) మధ్య సయోధ్య కుదరకపోగా రానున్న కాలంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమీకరణలు మారే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. రెండురోజుల పాటు జరిగే జెడి (యు) జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం ఇక్కడ మొదలయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ సమావేశాల్లో సీనియర్ నాయకుడైన శరద్‌యాదవ్ మూడవసారి పార్టీ అధ్యుక్షుడిగా ఎంపికయ్యారు. ప్రధాన మంత్రి పదవికి మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జెడి(యు) ఈ మేరకు ఒక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంది. అయితే చివరి క్షణాల్లో చర్చను ఆదివారానికి వాయిదా వేశారు. బిజెపితో తమకున్న సదీర్ఘ అనుబంధం యథాతథంగా కొనసాగుతుందన్న నమ్మకాన్ని సీనియర్ నేత త్యాగి మీడియా సమావేశంలో వ్యక్తం చేశారు. అంతేకాక ప్రధాని అభ్యర్థి విషయంలో తమ పార్టీ బిజెపిపై ఎలాంటి ఒత్తిడీ చేయటం లేదని చెప్పారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే బిజెపి అభ్యర్థే ప్రధాని అవుతారని చెబుతూ, పదవిని లౌకికవాదే చేపట్టాలన్నది తమ అభిమతమని మెలికపెట్టారు. మోడీయే ప్రధాని అభ్యర్ధి అన్న ప్రచారం పత్రికల్లో తప్పించి ఇంతవరకూ పార్టీపరంగా వ్యక్తం కాలేదని ఆయన గుర్తు చేశారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మతకలహాలను అదుపుచేసి అమాయకుల ప్రాణాలను రక్షించటంలో ముఖ్యమంత్రిగా మోడీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. బిజెపి ప్రాంతీయ పార్టీలతో సంకీర్ణ ధర్మాన్ని సక్రమంగా పాటించటం లేదని విమర్శించారు. బిజెపి తన ప్రధాని అభ్యర్థిని ప్రకటించిన తరువాతే తమ అభిప్రాయాన్ని తెలియచేస్తామని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు వ్యవధి ఉన్నందున తమ పార్టీ ఏ విషయంలోనూ తొందర పడదని త్యాగి వెల్లడించారు. (చిత్రం) ఢిల్లీలో శనివారం ప్రారంభమైన జెడి(యు) జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికపై ముచ్చటిస్తున్న పార్టీ అధ్యక్షుడు శరద్‌యాదవ్, బీహార్ సిఎం నితీష్‌కుమార్, సీనియర్ నాయకుడు త్యాగి

ప్రధాని అభ్యర్థిత్వంపై జెడి(యు) * కమలనాథుల ఆశలకు చెక్
english title: 
jdu

శ్రీవారి ఆలయ పోటులో అగ్నిప్రమాదం

$
0
0

తిరుపతి, ఏప్రిల్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలోని వంటశాల (పోటు) శనివారం సాయంత్రం 5.30 గంటలకు స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. అయితే పోటులో లడ్డు, వడ తయారు చేస్తుండగా నెయ్యి ద్వారా విడుదలయ్యే పొగ దట్టంగా ఉండటంతో ఈ మంటలకు నల్లటి పొగలు ఎగజిమ్మాయి. దీంతో ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఇటు స్థానికులు, భక్తులు ఆందోళనకు గురైయ్యారు. అధికారులకు కూడా ఆందోళన చెందారు. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా ఈసారి సిబ్బంది మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రెండు ఫైరింజన్లు అక్కడకు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తక్కువ వ్యవధిలోనే మంటలను అదుపు చేయగలిగారు. కాగా ఈ మంటల కారణంగా అక్కడ ఉన్న బూందీ, నెయ్యిడబ్బాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం తెలుసుకున్న తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు , ఇఒ ఎల్వీ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా పోటులో మంటలు రేగడానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ఒక వాదన వినిపిస్తోంది. (చిత్రం) తిరుపతి శ్రీవారి ఆలయ పోటులో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంతో కమ్ముకున్న దట్టమైన పొగలు

తిరుమల శ్రీవారి ఆలయంలోని వంటశాల (పోటు) శనివారం సాయంత్రం
english title: 
fire accident

భారీగా తగ్గిన బంగారం, వెండి

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ద్రవ్యోల్భణం ప్రభావంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే 1300 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర 2800 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 28,150 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 27,600 రూపాయలు కిలో వెండి ధర 49,700 రూపాయలు పలికింది. ధరలు ఇంకా తగ్గుతాయేమోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర 25వేలకు చేరుకుంటే కొనుగోలు కూడా బాగా పెరుగుతాయని వ్యాపారస్తులు భావిస్తున్నారు. గత కొద్దిరోజులుగా పసిడి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు.

మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి
english title: 
gold and silver

సిఎం టూర్‌కు డిఎల్ డుమ్మా

$
0
0

కడప/ అనంతపురం, ఏప్రిల్ 13: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి డుమ్మాకొట్టారు. కడప వైఎస్సార్ జిల్లాలో శనివారం ముఖ్యమంత్రి పర్యటించారు. పర్యటనలో మిగిలిన ఇద్దరు మంత్రులతో పాటు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న నేతలు, జిల్లా నేతలు ఎవరికివారే యమున తీరే అన్నట్టుగా వ్యవహరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎం మహీధర్‌రెడ్డి మాత్రం పర్యవేక్షణ బాధ్యతను భుజానికెత్తుకుని గత రెండు రోజులుగా అధికార యంత్రాంగాన్ని, జిల్లా నేతలను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని గట్టెక్కించారు. మంత్రులు సి రామచంద్రయ్య, ఎస్‌ఎండి అహ్మదుల్లాలు శనివారం ఉదయం జిల్లాకు చేరుకున్నప్పటికీ తప్పనితంతుగా ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్న సిఎం పర్యటన ఏర్పాట్ల విషయంలో అంతగా ఆసక్తి కనబర్చకపోవడంతో అనుచరగణం కూడా అదేబాటలో నడిచింది. డిసిసి అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్ మాత్రం తనవంతు బాధ్యత నెరవేర్చానని అనిపించుకున్నారు. ఇదిలావుండగా బద్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి శివరాకృష్ణారావుల మధ్య స్పర్థలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కమలమ్మ సీనియర్ నాయకుడు శివరామకృష్ణారావుకు తెలియకుండా కార్యక్రమాలు ఖరారు చేయడంతోపాటు చివరికి ఆయన కోరిన బద్వేలులోకాకుండా అట్లూరు మండలంలో వేదికలు ఏర్పాటు చేయడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయినట్టు తెలుస్తోంది. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన శివరామకృష్ణారావును కమలమ్మ నిర్లక్ష్యం చేయడంపై ఆయన అనుచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. శివరామకృష్ణారావు పార్టీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి ముంత్రి మహీధర్‌రెడ్డి జోక్యం చేసుకుని ఆయనతో మంతనాలు జరిపారు. దీంతో ఆయన శుక్రవారం వౌనం వీడారు. మంత్రి మహీధర్‌రెడ్డితోపాటు ఏర్పాట్లను పర్యవేక్షించినా అన్యమనస్కంగానే ఉన్నట్టు కనిపించింది. ఇవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కమలమ్మ జన సమీకరణ కోసం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కాగా జిల్లాకు చెందిన రాజంపేట ఎంపి, కేంద్ర మాజీ మంత్రి ఎ సాయిప్రతాప్, రాష్ట్ర మాజీ మంత్రి ఎస్ రామమునిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎన్ వరదరాజులరెడ్డి, రాజంపేట ఇన్‌చార్జి మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, రైల్వే కోడూరుకు చెందిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడులు తమ అనుచరులతోరాగా కడప, పులివెందుల, రాయచోటి నియోజకవర్గాల నుంచి డిసిసి అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి, పిసిసి ప్రతినిధి ఎం రాంప్రసాద్‌రెడ్డిలు వేర్వేరుగా తమ అనుచరగణాలతో ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరయ్యారు. జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు మచ్చుకైనా హాజరుకాలేదు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయినప్పటికీ జిల్లా మంత్రులకు ముఖ్యమంత్రితో సఖ్యత ఏమాత్రం ఉందో పర్యటనలో స్పష్టమయింది. ఆధిపత్య పోరు నేపథ్యంలో మంత్రులు, నేతలు సిఎం పర్యటన విషయంలో కూడా ఎవరికివారుగా వ్యవహరించడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.
అనంతలో జెసి డుమ్మా!
అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి దివాకర్‌రెడ్డి డుమ్మాకొట్టారు. జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన జెసి మరోసారి సిఎం పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ముఖ్యమంత్రి పదిసార్లు పర్యటించగా ఒకటి, రెండుసార్లు మాత్రమే జెసి పాల్గొన్నారు. శనివారం సభకు సైతం దూరంగా ఉన్నారు. కార్యక్రమంలో జెసి వర్గీయులు సైతం పాల్గొనలేదు. జిల్లాకు చెందిన మంత్రులతో విభేదాలు తీవ్రస్థాయిలో ఉండటం వల్లే సిఎం సభకు జెసి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మంత్రులు, నేతలు ఎడమొగం పెడమొగం * అనంతలో మాజీ మంత్రి జెసి గైర్హాజరు
english title: 
dl

ఇక గుడిసెలులేని రాష్ట్రం

$
0
0

కడప, ఏప్రిల్ 13: రాష్ట్రంలో గుడిసెలనేవి లేకుండా పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి నాటి ఇందిరమ్మ కలలను యూపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆశీస్సులతో నిజం చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సాయంత్రం కడప వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గంగవరంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం ద్వారా గూడులేని ఎస్సీలకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 65 వేల రూపాయలను లక్ష రూపాయలకు, ఎస్టీలకు ఇచ్చే 65 వేల రూపాయలను లక్షా 5వేలకు పెంచామన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కపట ప్రేమ చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినపుడు సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. వెన్నుపోటుతో అధికారం వెలగబెట్టిన బాబు అధికారదాహంతో పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. పాదయాత్రలో అమలుకాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. సభకు వేలాదిగా తరలి వచ్చి తనను ఆదరించడం తన జీవితంలో మరుపురాని ఘట్టమని అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం చేసిన తర్వాత రాష్ట్రంలోని ఎస్టీలకు 16.6 శాతం రూ.8,585 కోట్లు, ఎస్టీలకు 6.1శాతం రూ. 3,666 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఏడాదిలోనే నిధులను ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. ఈ చట్టం కింద గతంలో ఎస్సీ, ఎస్టీలకు పక్కా ఇళ్లకు 65వేలు విడుదల చేస్తుంటే, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఒక్కొక్క గృహానికి లక్ష రూపాయలకు పెంచామన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలన కోసమే దళిత వర్గాలకు పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు పెంపుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలు 50 యూనిట్ల లోపు విద్యుత్ వాడితే ప్రభుత్వమే ఆ బిల్లులను భరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి టీవీ చానళ్లు, పత్రికలు లేవన్నారు. ఆ రెండూ కార్యకర్తలేనన్నారు. కార్యకర్తలే ప్రసార సాధనాలై 2014లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా అందిస్తున్న రుణాల్లో సింహభాగం మహిళలకే వడ్డీ లేకుండా ఇస్తున్నామన్నారు. మహిళలకు ఇస్తున్న రుణాలకు సంబంధించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు. గతంలో పురుషుల ఆధిపత్యంతో కుటుంబాలు అభివృద్ధి కాలేదనే నానుడి ఉందన్నారు. అందుకే ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అందించడం ద్వారా ఆ కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉన్నాయన్నారు. ఈ వాస్తవాన్ని కార్యకర్తలకు, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జిమంత్రి ఎం మహీధర్‌రెడ్డి, మంత్రులు సి రామచంద్రయ్య, ఎస్‌ఎండి అహ్మదుల్లా, పితాని సత్యనారాయణ, పసుపులేటి బాలరాజు, రాజంపేట ఎంపి సాయిప్రతాప్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) కడప వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్.

ఇందిరమ్మ కలల సాకారానికే ఉప ప్రణాళిక చట్టం బాబుకి ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ ఉండే అసెంబ్లీకి హాజరుకాలేదా? కాంగ్రెస్‌కు కార్యకర్తలే టీవీలు, పత్రికలు కడప జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
english title: 
hutless state

బాబు బస్సుకే పరిమితం

$
0
0

విశాఖపట్నం, ఏప్రిల్ 13: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి కాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉండటంతో ఆయన శనివారం అంతా బస్సుకే పరిమితమయ్యారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో శృంగవరంలోనే శుక్రవారం రాత్రి నుంచి బస చేశారు. ఆదివారం కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. విజయవాడ నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ వచ్చి చంద్రబాబును పరీక్షించారు. కాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి శనివారం సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. కశింకోట వద్ద హెరిటేజ్ కర్మాగారంలో ఇటీవల జరిగిన ప్రమాదం స్థలాన్ని పరిశీలించి, అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు వద్దకు చేరుకున్నారు.

పూర్తి స్థాయిలో విశ్రాంతి *శృంగవరం చేరిన భువనేశ్వరి
english title: 
bhuvaneshwari

ప్రత్యేక రైళ్లు 278

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: వేసవి దృష్ట్యా పెరిగిన ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుకు అనేక సదుపాయాలు, ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 278 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ రైళ్లు హైదరాబాద్, తిరుపతి, కరీంనగర్, విశాఖపట్నం, మచిలీపట్నం, రేణిగుంట, కాకినాడ, గుంటూరు, నాందేడ్, ఔరంగాబాద్, బెంగళూరు, ముంబాయి, కొల్లం, జైపూర్, శ్రీగంగాపూర్, కోట, దర్బాంగకు నడుస్తాయి. 22 రైళ్లకు 63 అదనపు కోచ్‌లను అనుసంధానం చేశారు. దీనివల్ల వెయిటింగ్ జాబితా తగ్గుతుంది. అదనపు టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇ-టిక్కెట్లు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. జన సాధారణ్ టిక్కెట్ బుకింగ్ సేవక్, ఆటోమాటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. టిక్కెట్ల బుకింగ్ రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద మోసగాళ్లు నేరాలకు పాల్పడకుండా తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల అత్యవసరాలను గమనించిన ఈ నేరగాళ్లు రైల్వే సిబ్బందితో కుమ్మక్కై దొంగమార్గాల ద్వారా టిక్కెట్లను సంపాదించి ప్రయాణికులకు ఎక్కువ సొమ్ముకు ఇస్తారు. ఈ సందర్భంగా నేరగాళ్ల కదలికలపై గట్టి నిఘా పెట్టినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వీరికి సహకరించే రైల్వే సిబ్బందిని కూడా తనిఖీ బృందం గమనిస్తుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

వేసవి రద్దీని ఎదుర్కోవడానికే.. టిక్కెట్ల మోసాలకు పాల్పడితే చర్యలు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
english title: 
special trains

అసెంబ్లీ బడ్జెట్ భేటీ ఎప్పుడో

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలెప్పుడు?.. ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట, అమ్మహస్తంతో నెలంతా బిజీబిజీగా గడుపుతున్నారు. జూన్‌లో స్థానిక సంస్ధల ఎన్నికలకు, తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే పార్టీని సమాయత్తం చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి పరుగులు తీస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా గడువు ఉన్నప్పటికీ, లోక్‌సభకు ఈ ఏడాది చివర్లోనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు వీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై, మార్చి నెలాఖరుకు ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదంతో ముగిసేవి. కానీ ఈ దఫా పార్లమెంటు తరహాలో కొత్తగా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేశారు. ఆమేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నెలరోజుల క్రితం మెదక్ జిల్లా శంకర్‌పల్లిలోని లహరి రిసార్ట్స్‌లో స్టాండింగ్ కమిటీలపై రెండురోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు రోజున అసెంబ్లీ సెంట్రల్ హాలులో పంజాబ్ గవర్నర్ శివరాజ్‌పాటిల్‌తో ఆర్భాటంగా సదస్సును ప్రారంభింపజేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు కాలేదు. గత నెల 13న ప్రారంభించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడునెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించుకోవడం, 26న సమావేశాలు వాయిదా పడడం జరిగిపోయాయి. ఓట్ ఆన్ అకౌంట్‌కే ఆమోదం పొందినందున, పూర్తిస్థాయి బడ్జెట్ ఆమోదం కోసం మళ్లీ అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంది. ఆ సమావేశాలు నిర్వహించడానికి ముందు, కొత్తగా ఏర్పాటు చేసే స్టాండింగ్ కమిటీలు, అన్ని ప్రభుత్వ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై అధ్యయనం చేయాల్సి ఉంది. ఆ కమిటీలు నేరుగా సభకు సిఫార్సులు అందజేస్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి కమిటీలకు కనీసం మూడువారాల గడువు అవసరం ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఇప్పటివరకు కమిటీల ఏర్పాటు కాలేదు. కమిటీల ఏర్పాటు ఎప్పుడు? సమావేశాలు మళ్లీ ఎప్పుడు? అంటే మే నెలాఖరున లేదా జూన్ మొదటివారంలో నిర్వహించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశాల కంటే నెల రోజుల ముందు స్టాండింగ్ కమిటీలు ఏర్పాటైతేనే, ఆ కమిటీలు అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదికి పైగా గడువు ఉన్నప్పటికీ, ఇప్పటి నుంచే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం, ప్రజలతో మమేకం కావడంలో నిమగ్నమయ్యారు. ఈ స్టాండింగ్ కమిటీలపై పెద్దగా దృష్టి సారించే అవకాశాలు కనిపించడం లేదు. స్టాండింగ్ కమిటీలు ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో ఆలోచన చేయడం బాగా లేదని, కనీసం రెండేళ్ళ ముందైనా చేసి ఉండాలని, లేదా సార్వత్రిక ఎన్నికలు పూర్తయి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనైనా చేసి ఉండాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దృష్టి సారించలేమని ఎమ్మెల్యేలు కొందరు అన్నారు. పైగా ఈ అధ్యయనం చేయడం అనేది రాష్ట్రంలో తొలిసారి కాబట్టి, అంత సమర్థవంతంగా జరుగుతుందన్న నమ్మకమూ లేదన్న అభిప్రాయాన్ని, సందేహాన్ని వ్యక్తం చేశారు. మేలో కమిటీలు ఏర్పాటైతే అధ్యయనం చేయడానికి మూడువారాల గడువు అవసరం కాబట్టి మేలో మండు వేసవిలో మూడువారాల పాటు హైదరాబాద్‌లో ఉంటే, అటు ఎమ్మెల్యేలకు, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే కొత్తగా ఏర్పాటయ్యే 12 స్టాండింగ్ కమిటీల్లో నాలుగు స్టాండింగ్ కమిటీల చైర్మన్ పదవులను ప్రతిపక్షాలకు ఇవ్వాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఎందుకంటే పార్లమెంటును ఆదర్శంగా తీసుకుంటున్నాం కాబట్టి అదే పద్ధతిని ఆచరించాలని ఆయన చెబుతున్నారు. పార్లమెంటులో మొత్తం 24 కమిటీలు ఉంటే, అందులో 8 కమిటీల చైర్మన్ పదవులను ప్రతిపక్షాలకు ఇచ్చారు. ఇక్కడా అదే పద్ధతిని అవలంభించాలనుకున్నా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం పార్టీ స్టాండింగ్ కమిటీల చైర్మన్ పదవులను తీసుకోవడానికి విముఖత చూపుతున్నది. ఎందుకంటే కమిటీ చైర్మన్ పదవులను తీసుకుంటే, భాగస్వామ్యమై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అవకాశం రాదని ఆ పార్టీ భావన. కమిటీ చైర్మన్ పదవులను తీసుకోకుండా ఉంటే, ప్రతి కమిటీ సమర్పించే నివేదికను తూర్పారబట్టేందుకు అవకాశం లభిస్తుంది.
మరోవైపు స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీ్ధర్ బాబు, అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి జాబితాలు సిద్ధం చేశారని, దానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆమోదం తెలపాల్సి ఉందని తెలుస్తోంది.

సమావేశాల నిర్వహణపై తర్జన భర్జన * స్టాండింగ్ కమిటీలతో తలనొప్పి! * కమిటీల్లో చేరేందుకు తెదేపా విముఖత
english title: 
assembly

విముక్తి! (కథ)

$
0
0

నడిమెట్ల రామయ్య తెల్లటి గుబురు మీసాలు, భుజంపై కండువ, ధోతి కట్టుకుని గోచి బిగించి, అచ్చం తెలుగు ‘్ధనం’ ఉట్టిపడుతున్న తాతయ్యలాగా కనిపిస్తాడు. గత ఆరేడేళ్ళ నుండి ప్రతి సాహిత్య, సాంస్కృతిక సభల్లోను లెక్కతప్పకుండా కనబడేవాడు. డెబ్బయి ఏళ్ళ ముదిమిలోనైనా చురుకుగా వుండేవాడు. నిర్ణీత సమయానికి ముందే ఠంచన్‌గా హాజరవుతాడు. ఈయనకు పనిపాటా, కుటుంబం, పిల్లలు లేరా? ఉన్నా ఎవ్వరూ ఏమనరా? అనిపించింది. నాలో నాకే ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. నేను కూడా తరుచుగా సభలు, సమావేశాలకు వెడుతుండటం వలన, వెళ్ళినచోట రామయ్యగారు తారసపడుతుండటం వల్ల ఆయనపై చర్చించే ఆలోచన మళ్ళింది. ఆయన నన్నుచూడగానే యథాలాపంగానే, ‘నమస్కారమండి’ అన్నాడు. నేను అదోలా ఆలోచిస్తూనే ప్రతి నమస్కారం చేసి ముందుకు కదిలాను. సార్ అని పిలువడంతో, ఎందోయ్ అన్నాను. ఏమనుకోకండి సార్, మొన్న మీరు రాసిన మానేరు తరంగాలు అన్న పుస్తకం ఒకరి చేతిలో చూశాను, కాస్తా నాకొకటి ఇస్తారా? అన్నాడు. నేను ఇరవైఐదేళ్ల కిందట రాసిన జైజవాన్- జైకిసాన్ పాటల పుస్తకం తీసుకోండి అని తన జబ్బ సంచీనుండి తీసి ఇచ్చాడు. సరేలే రామయ్యగారు ఇస్తాను. వీలైతే మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. తప్పక, సరేనని బదులిచ్చాడు.
తెల్లారి ఆదివారం ఉదయం కుర్చీలో కూర్చుండి, పేపర్ తిరగేస్తున్నాను. మా ఆవిడ తనకే సొంతమైన వంటసాలలో గరిటెలను ఆడిస్తోంది. సార్ అంటూ రామయ్య దిగారు. రావయ్యా అని ఆహ్వానించాను. లోనికివెళ్ళి నేను రాసిన మూడు పుస్తకాలు ఇచ్చాను. కృతజ్ఞతలు, మీరు ఇంత ఉదారులని అనుకోలేదని, పుస్తకాలు తీసుకుంటూ అన్నాడు. అలా ఎందుకంటున్నావయ్యా? అన్నాను. పుస్తకాలు చదివేవారి దగ్గరికి చేరితేనే విలువుంటుంది. బుల్లితెర ఇంటిలోకి వచ్చి రీడింగ్‌ను కబళించివేసింది. నారచనకు సార్థకం వుంటుందని ఇచ్చానని అన్నాను.
ఈలోగా నా శ్రీమతి శారద రెండు టీ కప్పులతో వచ్చి చేరో కప్పు చేతికందించింది. ముదిమి వయస్సులో తిప్పుడు మీసాలతో ఉత్సాహంగా వున్నారు, దీని రహస్యమేమిటి? ఉత్సుకతను చంపుకోలేక అడిగా...
అందరూ ఇలాగే అడుగుతుంటారు. కాదనను, చెబుతాను. మీకు ఒపికుంటే నా జీవితానే్న కథగా చెబుతాను. మీరే తీర్పివ్వండి అన్నాడు.
సార్ నేనొక సాధారణ మగ్గం నేసే పద్మశాలి కార్మికున్ని. కరీంనగర్ మండలంలోని వల్లంపాడు స్వగ్రామం. వృత్తిపరంగా వచ్చిన సాంప్రదాయ మొగ్గం నేతనే నాకు బతుకుతెరువు. పెళ్ళాయ్యాక నా పొట్టతిప్పలాటలు, కష్టాలు పోటీపడ్డాయి. కొన్నాళ్ళు ఇంటివద్దే మొగ్గం నేశాను. గిట్టుబాటు కాకపోవడంతో కరీంనగర్‌కు చేనేత సోసైటిలో మొగ్గం కూలీగా చేరాను. కూలీ సరిపోకపోవడం వల్ల మహారాష్టల్రోని బీవండిలో మిల్లు సాంచాలపై పనిచేయడానికి వలస వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అంతా చేదు అనుభవమే ఎదురయైంది. రోకట్లో నుండి తీసి పొయ్యిలో కాలు పెట్టినట్లయింది. బీవండిలో మిల్లులలో పనిచేసే వర్కర్లది పరమ దుర్భర జీవితం. 12 గంటల డ్యూటి. రాత్‌పైలీ, దివస్ పైలిగా పని చేయాల్సి వుంటుంది. అక్కడ కూడా వర్కర్లు అనేక వ్యసనాలకు లోనై, అష్టకష్టాలు పడుతుండటం కనిపించింది. పైగా ఒంటరి జీవితం, బరువనిపించింది. భీవండి కార్మికుల దుర్భర జీవితంపై చలించి ఒక గేయం కూడా రాశాను. ఆర్నెల్లు తర్వాత బీమారికి గురి కాగా, చేసేదిలేక పెట్టెబేడా సదురుకొని ఇంటికి వచ్చేశాను. టెన్త్ వరకు చదివాను. సొంతంగా గేయాలు, పాటలు రాసి పాడటం, కవిత్వం రాయడం నాకు కొట్టినపిండి.
మా నాయన తెచ్చే తత్వాలు, మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు చదవటం వల్ల నాకు కొంత ఆధ్యాత్మికంగాను, మరియు సాధారణంగాను లోక జ్ఞానం తెలిసివచ్చింది. చేనేతకు పెద్దదిక్కయిన ప్రభుత్వ సహకార ప్య్రాబ్రిక్స్ సంస్థలో 1973లో అప్రెంటిస్, అసిస్టెంట్ సేల్స్‌మెన్ జాబ్స్ వున్నట్లు తెలిసి దరాఖాస్తు చేశాను. నెలరోజులలోపే జాబు ఇస్తు, తిరుపతిలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు నాజీతం 110 రూపాయలు. ఎదుగుల లేని ఉద్యోగమిది. పొట్టతిప్పలుకై ఎదో పనిచేయాలన్న విషయమై రాజీపడాల్సి వచ్చింది. విషయాలన్నీ అవగాహన అయ్యేవరకల్లా ఇహ ఉద్యోగం చేయడం భారమనిపించింది. అప్పటికీ సంస్థలో నిబద్దతగల సైనికుడిగా 27ఏళ్ళపాటు నా ఉద్యోగ జీవితం నడిచింది. 2వేల సంవత్సరంలో తప్పుకున్నాను. సంస్థలో ఎనె్నన్నో ఆటుపోట్లను ఎదుర్కున్నాను. వాటి వివరాలు వింటే నా జీవితమే మరొక బృహత్క్థగా, వుంటుందని నవ్వుకుంటూ అన్నాడు.
తిరుపతిలోని సంస్థవారి విక్రయశాలలో అప్రంటిస్ సేల్స్‌మెన్‌గా నా ప్రవాస జీవితం మొదలైంది. అప్పటికే నా పెళ్ళయి, పదేళ్ళయింది. నావయస్సు 33 ఎళ్ళు. నా శ్రీమతిని కాపురానికి తీసుకెళ్ళాను. నాతోపాటుగా, ఆరేడుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. నెలకు మూడు లక్షల టర్నోవర్ వుండేది. కస్టమర్స్ కొన్న బట్టలు ప్యాకింగ్ చేయడం, స్వీపర్ రాకపోతే ఊడ్చడం, అతిధులకు టీలు అందించడం, షాపు షెల్ప్‌లు,సేల్స్ కౌంటర్ శుభ్రం చేయడం వంటి పనులుండేవి. ఉదయం 10 గంటల నుండి రాత్రి కొట్టు కట్టేసే 9 గంటల వరకు పని వుంటుండేది.
పైగా ఎవరైనా వస్తే తిరుమల కొండకు తీసుకెళ్ళి దర్శనం చేయించేవాడిని. అక్కడి తిరుమల అర్చకులతో పరిచయాలు పెరగడం వల్ల వెంకన్న దర్శనం సులభంగా అయ్యేది. అప్పటి లడ్లు పెద్దసైజులో, మధురంగా వుండేవి. వాటి ధర ఒక రూపాయే. మూడేళ్ళ తర్వాత నెల్లూరుకు సేల్స్‌మెన్‌గా ప్రమోట్ చేస్తూ బదిలీ చేశారు. నా నిజాయితీ తనాన్ని నచ్చిని చేతివాటానికి పాల్పడిన తోటి ఉద్యోగులు, నన్ను తెలివిగా నెల్లూరుకు బదిలీ చేయించారని తెలిసింది. తిరుపతిలో వేడినీళ్ళకు చన్నీళ్ళలాగా మా ఆవిడ బట్టల మిషన్ కుట్టి సంపాదిస్తుండేది. మా ఆవిడ స్వయం ఉపాధి నా కుటుంబానికి ఎంతో అండై నిలిచింది. నా అత్తెసరి జీతంతో సమానంగా మా ఆవిడ ఆదాయం తేవడం వల్ల, ఇలా నాకుటుంబాన్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, నెట్టుకురాగలిగాను.
సింహపురిలో ఒక సంవత్సరం పనిచేశాను. నెల్లూరు షాప్ కౌంటర్ పెద్దదే. పక్కనే వున్న గూడూరు షాపులో ఫ్రాడ్ కావడం వల్ల, నన్ను ఇంచార్జ్ అసిస్టెంట్ మేనేజర్‌గా అక్కడికి పంపించారు. గూడూర్‌లో తొమ్మిదేళ్లు సంస్థకు పనిచేశాను. నా నిజాయితీ పనితనం వల్ల షాపు టర్నోవర్ పెరగింది. షాపు గిరాకీ పెరిగింది. నగరంలో వుండే మరో షాపు బాగోగులను కూడా నేనే చూసేవాడిని. ఎందుకంటే ఆషాపు మేనేజర్‌కు తరుచుగా అనారోగ్యానికి గురికావడం వల్ల ఆషాపు నిర్వహణాభారం, అకౌంట్స్ చూడటం అన్నీ నాపైనే అదనంగా పడ్డాయి. పొరుగున వున్న శ్రీహరికోట ఆప్కో షాపులో దొంగలుపడి బట్టలు పోయినపుడు, ననే్న ఆషాపు ఇంచార్జిగా డిప్యూటేషన్‌పై పంపించారు. నేను ఆషాపు నిర్వహణను మెరుగుపరచాను. దానివల్ల శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఉద్యోగులతో పరిచయాలు పెరిగాయి. 1977 కృష్ణాజిల్లా దివిసీమ ఉప్పెన వచ్చినపుడు, సంస్థ తరపున చేసే సహాయానికి ననే్న ఎంపిక చేసి పంపించారు. సూళ్లూరుపేట స్టాక్ పాయింట్ నుండి బట్టలు తీసుకెళ్ళి చుట్టుపక్కల గల గ్రామాలలోని తుఫాన్ బాధితులకు పంపిణీ చేయించేశాం. అదనంగా లెక్కతప్పిపోయి వచ్చిన రెండు బట్టల గట్టాలను తిరిగి సంస్థకు వాపస్ చేయించాను. వాటిని అమ్ముకుతిందామనుకున్న తోటి ఉద్యోగుల నోట్లో పచ్చి వెలగ్గాయ పడినట్లయింది. అవినీతికి ఆమడ దూరం ఉండటం వల్ల, అప్పుడప్పుడు ఇలా ఇబ్బందులెదురయ్యేవి. ఇక్కడి షాపులో 30మీటర్ల పాలిష్టర్ బట్ట రోల్ దొంగతనం జరిగినప్పుడు, వెంటనే పైఅధికారులకు రిపోర్టు చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినా, అధికారులు నా నిజాయితీకి మచ్చతెచ్చేలా ఆ బట్టల ఖరీదును నాజీతం నుండి రాబట్టుకోవడం నన్ను తెగ బాధించింది. ఇలా ఉద్యోగిగా ఎనె్నన్నో సమస్యల్ని ఏకవీరుడిలాగా అధిగమించినాను. అక్కడి నుండి నన్ను ఆత్మకూర్‌కు బదిలీ చేశారు. అక్కడి మేనేజర్, షాపు సరిగా తీయడం లేదన్న ఫిర్యాదులు రావడంతో ఆ షాపును సరిదిద్దడానికై నన్ను పంపించారు. అక్కడ ఐదేళ్ళు పనిచేశాను. షాపునిర్వహణా సామర్థ్యాన్ని పెంచాను.
అక్కడి నుండి నన్ను నా సొంత జిల్లాయైన కరీంనగర్‌కు బదిలీ చేశారు. ఎక్కడ అవినీతి వుంటే, సరిచేయమని అక్కడికి బదిలీ చేసే వారు. అధికారులకు నేనొక చూపుడు వేలులా మిగిలిపోయాను. అట్లనే జమ్మికుంట షాపును సరిచేసిన. నాపట్ల అధికారులలో మంచిపేరే వుండేది. తర్వాత నన్ను జమ్మికుంట నుండి కరీంనగర్‌కు బదిలీ చేశారు. కరీంనగర్ ఆప్కో కౌంటర్‌లోకి నన్ను మేనేజర్‌గా బదిలీ చేశారు. సిటికి రావడం నా ఇంటికి వచ్చినంత ఆనందమైంది. రెండేళ్ళ తర్వాత టవర్ సర్కిల్ శాఖకు బదిలీ చేశారు. ఆషాపు టర్నోవర్ లక్షల్లో వుంటుంది. మూడేళ్లు పనిచేశాక, నన్ను ఆదిలాబాద్ జిల్లా జన్నారంకు బదిలీపై పంపించారు. అక్కడి అవకతవకలు సరిదిద్దడానికై, నాసొంత జిల్లానుండి కదిలించడం నన్ను బాధించింది. ఆ టైమ్‌కే నా పెద్దమ్మాయి పెళ్ళి చేశాను. నిజాయితీ పనితనానికి స్థిరత్వం వుండదని నాతో రుజువైంది. సంచార కర్మచారిగా అలిసిపోయాను. తదుపరి రెండవ అమ్మాయి ప్రియబాంధవి పెళ్ళి చేశాను. నేను రిటైర్‌మెంట్ తీసుకునేంత వరకు నాజీతంలో ఎలాంటి పెరుగుదలలు కనిపించలేదు. నాకు ఆఖరికి దక్కిన పెద్ద సైజు జీతం కేవలం 5,500 రూపాయలు మాత్రమే. సంస్థలో చివరి దినాలలో పనిచేయడం నాకు రుచించలేదు. చాలామంది ఉన్నతాధికారులు సైతం లంచగొండి తనాలకు అలవాటై వుండటం వల్ల నాకు బాధేనిపించింది. ఇలావుంటే, సంస్థ భవిష్యత్తు, ఆర్థిక స్థితి కష్టంగా మారగలదని ఊహించాను. అప్పటినుండే సంస్థ నష్టాల బాటలో వున్నట్లు వార్తలు వచ్చాయి. బురదగుంటలో కాలిడి, బురదంటకుంట ఎలా ఉండగలుగుతుందన్న ప్రశే్న నన్ను వేధించసాగింది. పర్యవేక్షణకు వచ్చిన పైఅధికారులు, ప్రలోభాలకు, ఆమ్యామ్యాలకు ఆశపడినట్లు కనిపించేది. ఏమైనా లోపం కనిపిస్తేచాలు దండుకోవడానికి వారికి మార్గం సుగమమైనట్లే. ఇంకా తోమ్మిదేళ్ళ సర్వీసుందనగానే సంస్థ ప్రకటించిన స్వచ్చంద పదవీ విరమణ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. 2వేల సంవత్సరంలో పదవీ విరమణ పొందాను. అంతాకలిపి నాలుగున్నర లక్షల ద్రవ్యం చేతికి వచ్చింది. అందులో నుండి యాబై వేలు వృద్ధాశ్రమానికి విరాళంగా తీసి పెట్టాను. చిన్నమ్మాయి ఝూన్సిలక్ష్మీ పెళ్ళి చేశాను. శివాజీనగర్‌లోని నా పెంకుటింటిని బాగుచేయించుకుని కవిత్వం రాస్తు, సభలకు హాజరవుతూ కాలం వెళ్ళదీస్తున్నాను. ముగ్గురు బిడ్డల తర్వాతే నా కవిత్వం నాలుగో కూతురు నుండి నేడు పెద్దకూతురంతగా ఎదిగిపోయింది. 40 ఏళ్ళ పర్వంలో పుస్తకాలు చదివినా, కవిత్వం రాసినా, పాటలు పాడినా. 1970లోనే పాటల పుస్తకం రాయగా, అప్పటి కరీంనగర్ కలెక్టర్ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఇటీవల తెలంగాణ ఉద్యమ పాటలు రాశాను. గొంతెత్తి పాడుతాను. ‘నడిమెట్లరాగాలు’ అన్న గేయశతకాన్ని వేయగా, చక్కటి ఆదరణ లభించింది. ఈపుస్తకాన్ని రంగినేని ట్రస్టు వారు అచ్చేసిర్రు. నాజీవితం నల్లేటి మీది నడక కాదు,అయినప్పటికి సడలని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను.
ఏవండి టిఫిన్ రెడీ అయింది. మీ ఇద్దరకు తెమ్మాంటారాయని నా శ్రీమతి వంటశాల నుండి పిలువడంతో.. రామయ్య సంభాషణను ఆపాడు. ఇహ మార్కెట్‌కు వెళ్లే టైమైందని లేచాడు. రామయ్య ఉద్యోగ జీవితంలోని ఆటుపోట్లను ఆధారంగా తీసుకుని, ఎందుకు కథరాయరాదని అనిపించింది. పక్కనున్న ప్యాడ్ తీసుకుని, కలంతో కథ రాయడం మొదలుపెట్టాను.

-సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్, సెల్. 9346814782

ఆనాటి కథలు.. ఆణిముత్యాలు- 2

సురవరం ప్రతాపరెడ్డి గారు, గోలకొండ పత్రిక- రెండూ అవిభక్త కవలలుగా తెలుగుజాతి గుర్తుంచుకుంది. తెలంగాణ సామాజిక జీవన విధానాన్ని అనేక విధాలుగా వెలుగులోకి తెచ్చిన మహామనీషి- సురవరం వారు. మొత్తం తెలుగు వారి ఆచార వ్యవహారాలూ, సాంస్కృతిక వైభవం, సంప్రదాయ వివరాలూ- లోకానికి వెల్లడిస్తూ వారు రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’- నాటికీ, నేటికీ ఒక సుప్రసిద్ధ ఆకర గ్రంథం. ఉత్తమ సాహిత్య ప్రచారానికీ, ఉన్నత విలువల నిర్వహణకీ సురవరం వారు వైవిధ్యభరితమైన ప్రక్రియల్ని ప్రోత్సహించారు. వాటిలో కథానిక ఒకటి. స్వయంగా తానే కథకులు. 1930 ప్రాంతాల్లోనే సామాజిక న్యాయ ఆవశ్యకతను బలంగా విశ్వసించి, తమ కథల ద్వారా ప్రజల్లో ఆ భావ చైతన్యాన్ని కలిగించిన ఆదరణశీలి వారు. ఆనాటి ప్రభువుల అలసత్వం, గ్రామాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ కలిగించిన దురాగతాలూ, అధికారమదాంధత వంటి అంశాల్ని వ్యంగ్యాత్మకం చేస్తూ వారు రాసిన ‘మొగలారుూ కథలు’ సుప్రసిద్ధమైనవి. కష్టించి గడించుకొని పొట్ట పోసుకునే శ్రమజీవులూ, ఇతరుల కష్టాన్ని తాము దోచుకుని వారి పొట్టలుకొట్టే దళారీలూ, ప్రభుత్వాధికార్లూ- వారి కథల్లో కళాత్మక వాస్తవికతతో కనిపిస్తారు. ఆ వ్యవస్థ దుస్థితి- ‘ఇంకానా, ఇకపై సాగదు’ అని చేసిన హెచ్చరికే ఈ- ‘సంఘాల పంతులు’ కథ!

నిజాం ఇలాకా గ్రామం. పేరు రామసాగరం. గ్రామంలో 500 ఇండ్లు. ఆ ఊళ్ళో ఒక సర్కారీ నాకా- అంటే పోలీసు స్టేషన్ వుంది. 12 మంది జవాన్లు, ఒక అమీన్, ఒక జమేదారు- దాని పాలకులు. అమీన్ ఇల్లు నాకా పక్కనే. అమీన్ పెండ్లాము- బేగం సాహెబా! పోలీసు వారెప్పుడూ చేతి నుంచీ పైకమిచ్చి వస్తువులు కొనరు. కోరిందంతా కోమట్లు సప్లై చెయ్యాలి. కోళ్ళు, గుడ్లు, కట్టెలు- మాదిగల జిమ్మా! ఇట్లా వ్యవహారం మజాగా సాగుతూ వుంది. ఒకనాడు ముసలి మాదిగది- 70 ఏండ్లది- అమీన్ సాహెబ్ పెండ్లాము రేలకట్టెల మోపు తెమ్మంటే, అడవంతా తిరిగి అవి దొరక్క తంగేడి కట్టెలు మోపు చేసుకుని కష్టించి అలసిపోయి, మోపు తెచ్చి ఇంట్లో వేసింది. ‘్ఛనాల్, రేలకట్టె తీస్కొని రమ్మంటే, ఇదేమి పుల్లలు తెచ్చినావ్?’ అని డొక్కమీద నాలుగు తన్నులు తన్నింది బేగం. ముసలిది చచ్చింది. ‘నికాలో ఈ పీనిగని’ అంది బేగం. శవాన్ని ఈడ్చి మాదిగ గేర్లో పారేశారు జవాన్లు. కోమటి దుకాన్‌దారు బాదమ్, అఖ్రోట్, పిస్తా సప్లై చేయలేదని నాలుగు ‘జూతా’లు పునకమీద వాయించారు... ఇలావుంది జులుం పరిస్థితి. ఊళ్ళో గోలరేగింది. ఒకనాడు చీకటి వుండగానే పక్క వూరి నుంచీ బండి కట్టుకొని ఒక పెద్ద మనిషి రామసాగరం వచ్చాడు. ఎతె్తైన మనిషి. ఖద్దరు వేస్తాడు. వకీళ్లలాగా రుమాలు కడ్తాడు. వెంట తోలుపెట్టె. ఈయనే సంఘాల పంతులు! ఊళ్ళో పది మందినీ కలిపాడు. కోమట్లకి ధైర్యమిచ్చాడు. వర్తక సంఘం స్థాపనయింది! తన పాయిఖానా బాగా సాఫు చేయలేదని ఒక మాలామె చెంప మీద వాత వేసింది బేగం. ఇంకొకాయన కాళ్ళొత్తలేదని డొక్కమీద తన్నాడు అమీన్. ఆయన మంచం పట్టాడు. ఈ బాధితుల్ని సమావేశపరచాడు పంతులు. వెట్టి కూడదనే ఫర్మానులు చదివి వినిపించాడు. క్రమంగా జనంలో అవగాహన వచ్చింది. వారంలోనే మార్పు మొదలైంది.
బేగం సాహెబ్ పాయిఖానా ఊడ్చేవారులేరు. వెట్టి చాకిరీకి మనుషులు రారు. కోళ్ళు లేవు. బియ్యం రూపాయికి 4 పళ్ళే అయినవి. గుర్రాలకు గడ్డి చిక్కదు! కుతకుత ఉడికిపోయింది నాకా! కడుపు రగిలింది. కసి రేగింది. పంతుల్ని ‘డాలో హత్కడీ, గోలీసే ఉడాదో, పట్టండి బొమ్మన్‌కీ’ అంటూ, ‘వీడూ మనకీ నోట్లో మన్నూ వేసినాడ్’ అంటూ జవాన్లు మీద పడ్డారు. సరిగ్గా ఆ సమయంలో- సైన్యం ప్రవేశించింది. జవాన్లకి దేహశుద్ధి జరిగింది. అమీన్‌ని తన్నారు. ‘కల్లు తిత్తివలె దొర్లినాడు’! వారం గడిచేసరికీ మొహతమీం వచ్చాడు. విచారణ జరిగింది. వందల కొలది షికాయతులు చేశారు గ్రామస్థులు. అమీన్‌కి బర్తరఫ్, జమాదారుకు తనుజ్జుల్ (డిగ్రేడ్), జవాన్లకి మోతల్ (సస్పెండ్).. కడకు నాకా అవసరం ఆ వూరికి లేదని, ఠానా బర్ఖాస్త్ (ఎత్తివేయటానికి) హుకుం అయింది! ఇదీ కథ!
సామాజిక వాస్తవికత, మంది మంచి కోసం ఒక మార్పు ఆవశ్యకత, జనంలో ఐకమత్యం వుంటే ఆ మార్పు సాధ్యమవుతుందనే నమ్మకం- వీటిని బలంగా చిత్రించిన కథ - ‘సంఘాల పంతులు’! నేటికీ ఆ నమ్మకం, ఆ ఆచరణలే- సమాజానికి రక్ష- అని మళ్ళీమళ్ళీ రుజువవుతూనే వుంది. అందుకనే ఈ కథ- సార్వకాలీనం, సార్వజనీనం అయిన ఆణిముత్యం!!

- విహారి, సెల్: 9848025600

బుక్ షెల్ఫ్

భారతీయ సాహిత్య వ్యాసాలు
-నలిమెల భాస్కర్
వెల: 60/-
రామయ్య విద్యాపీఠం ప్రచురణ
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో

రావు రూకుల
(కవిత్వం)
-కందుకూరి శ్రీరాములు
వెల: 95/-
ఝరీ పోయెట్రి సర్కిల్ ప్రచురణ
ప్రతులకు: 503, సుహార్తి నెట్
సలీంనగర్, మలక్‌పేట
హైదరాబాద్
ఫోన్ నెం: 040-24545405

యాభై దాటిన యవ్వనం
(కవిత్వం)
-సౌభాగ్య
వెల: 90/-
క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్
ప్రతులకు: సౌభాగ్య,
ఎఫ్-3, బి-4, రామరాజునగర్
మేడ్చల్ రోడ్, హైదరాబాద్
సెల్ నెం: 9848157909

సమ్మోహనం
(కవిత్వం)
-కోటం చంద్రశేఖర్
వెల: 50/-
కళాభారతి ప్రచురణలు
కాపీలకు: 4-2-120,
విజ్ఞాణపురి కాలనీ, తాండూర్
రంగారెడ్డి జిల్లా
సెల్ నెం: 9490157371

మనో గీతికలు

ఓ మానవుడా
ఓ మానవుడా ధనమంటే ఎందుకు నీకు ఆపేక్ష
అక్రమ మార్గంలో సంపాదిస్తే పడుతుంది శిక్ష
అప్పుడు ఎవరూ రారు నీకు రక్ష
నీవంటే ఎవరికీ లేదు కక్ష
నామోషి కాకపోతే తొక్కు రిక్ష
చేతకాకపోతే అడుగు భిక్ష
భగవంతుడు పెడుతున్నాడు నీకు పరీక్ష
డబ్బు సంపాదించడానికి కావాలి దీక్ష
ఇతరుల సొమ్ము మీద ఎందుకు నీకు ఆకాంక్ష
నిన్ను నువ్వు చేసుకో సమీక్ష
లక్షలు సంపాదించడానికి మార్గాలున్నాయి సవాలక్ష

-కె.సురేష్ బాబు, సుల్తానాబాద్, సెల్: 8019432895

ముళ్ల కంప
సత్యం శివం సుందరమ్
ఓడిపోయిన జీవితం సాక్షిగా
నేను ఆ దారిలోనే నడిచాను
సత్యాన్ని సమాధి చేసి
మట్టి మీద జెండా లేని కట్టె
సాయమవుతున్నప్పుడు
కన్నీళ్లు కార్చినందుకు
ఎన్‌కౌంటర్
ప్రజాస్వామ్య ఆయుధం
గుండెల మీద గురి పెట్టింది
ఓడిపోయిన కన్నీళ్లని!
శివం మనసు శివం
ఆత్మ శివం
ఆకాశం శివం
శివం శివం శివం
శివుని మీద ఒట్టు
విశ్వాసం మీద ఓటునం నిలబెట్టినపుడు
ఏమిటనే ప్రశ్నించాను
కమల ముందు లాఠీ తిరిగింది
సుందరమ్
జీవనం సుందరమ్ జీవితం సుందరమ్
నడక సుందరమ్ ఆడుగు సుందరమ్
ఆలోచన సుందరమ్ ఆశ సుందరమ్
సుందరమ్ సుందరమ్ సుందరమంటూ
ఎన్ని మల్లె తోటలు నాటినా
ప్రపంచీకరణ పాడు గాలికి
అన్నీ ముళ్ల
కంపలయ్యాయి

-సిహెచ్.మధు

అబల
అబల నువ్వు అశ్రువు కాదు
తాళమేయ తబల కాదు
చాకిరి చేయ చీపురు కాదు
పోకిరి వెధవల బానిస కాదు
వంటింటి కుందేలువు కాదు
బాసండ్లు తోమ బతకలేక కాదు
బావ మరుదులతో బందుకుండుట కాదు
అత్త మామల పాద దాసివి కాదు
నాలుగు గోడల నిలువుటద్ధం కాదు
నాగరికత ఎరుగని అనామకురాలివి కాదు
నలుగురిలో తలవంచ దోషివి కాదు
నిత్యం నీవో యంత్రం కాదు
ప్లస్‌లు మైనస్‌లు లెక్కలు కాదు
ముళ్లు ఆకులు మచ్చలు కాదు
అనసూయ అరుంధతి కథలిప్పుడు కాదు
అణచివేతకు నువ్వు అర్థం కాదు
ఎత్తుకు ఎదగ ఆకాశం అడ్డే కాదు
ఎగతాళిని చేసేవారు ఎదురే కాదు
స్ర్తి పురుష భేదాలెంచే వ్యక్తులు కాదు
నీకడ్డుగ నిలిచే చీడలు అవరోధం కాదు

-వజీరు ప్రదీప్, పరకాల, సెల్: 989562991

నేనెప్పుడు..?
నేనెప్పుడు
కవిత్వం రాస్తనో తెలుసా?
మనో గోళంలో సునామి ఏర్పడినపుడు!!
నేనెప్పుడు మాట్లాడుతానో తెలుసా?
గొంతుల్లో
ఆప్యాయతకు వెలక్కాయ అడ్డుపడినపుడు!!
నేనెప్పుడు ఉద్యమిస్తానో తెలుసా?
హృదయ కవాటాలలో
ఉద్వేగం ప్రవహించినపుడు!!
నేనెప్పుడు స్పందిస్తానో తెలుసా?
ప్రశాంతత పరాయికరణం చెందినపుడు!!
నేనెప్పుడు విశ్రమిస్తానో తెలుసా?
అక్షరం ఎముకలు విరిగినపుడు!!
నేనెప్పుడు నినదిస్తానో తెలుసా?
నా ప్రశ్న పరావర్తనం చెంది
ననే్న ప్రశ్నించినపుడు!!
నేనెప్పుడు
బోధిస్తానో తెలుసా?
సుగుణం నిర్మోచనం చెంది
వెర్రితలలు వేసినపుడు!!
నేనెప్పుడు సూక్ష్మంగా ఆలోచిస్తానో తెలుసా?
వృద్ధాప్యం సమాధి
మంచి చెడులను ప్రశ్నించినపుడు!!
ఆకుముడుత పురుగులాగా
ఆత్మీయతా చెదలు
ఆవహించిన మనిషిని కదా
మనో యవనికపై రూపాయి లెక్కింపులు
లెక్కల్లో జీవిస్తున్నా
జీవితాన్ని లెక్కిస్తున్నా
లెక్క తేలేది ఎప్పుడనీ?

-కె.ఎస్.అనంతాచార్య
కరీంనగర్
సెల్ నెం: 9441195765

రవ్వలు
విద్యార్థి చేతిలో పెన్ను
జవాన్ చేతిలో గన్ను
రైతు ఒంటికి మన్ను
దేశానికి వెన్నుదన్ను
ఆచార్యుల చేతిలో పెన్ను
మన్నును మిన్నును చైతన్యపరిచే మూడో కన్ను
కవి చేతిలో పెన్ను అన్యాయాల నెదిరించె గన్ను
విద్యార్థుల మేధస్సుకు
పౌష్టికాహారం జీవితం నావకు దిక్సూచి పుస్తకం
నాకు ఏకాంతమంటే ఎంతో ఇష్టం
మెదడుకు పుస్తకాల మేత వేయొచ్చు
కలానికి కవిత్వం పూత పొయొచ్చు

-ఎర్రోజు వెంకటశ్వర్లు
కరీంనగర్
సెల్: 9492557037

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం కోసం ఈ క్రిందిచిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫోటో, చిరునామాతో ఈ మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. knrmerupu@deccanmail.com

నిర్వహణ: వారాల ఆనంద్ varalaanand@yahoo.com

నడిమెట్ల రామయ్య తెల్లటి గుబురు మీసాలు
english title: 
v
author: 
-సంకేపల్లి నాగేంద్రశర్మ

విలీనంపై నేడు మళ్ళీ చర్చ

$
0
0

విశాఖపట్నం, ఏప్రిల్ 14: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలతోపాటు, కొన్ని గ్రామాలను కూడా విలీనం చేయాలన్న ప్రతిపాదనపై సోమవారం హైదరాబాద్‌లో సమీక్ష జరగనుంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన హామీల కమిటీ ముందుకు వచ్చిన వివిధ అంశాలపై సోమ, మంగళవారాల్లో చర్చ జరగనుంది. ఇందులో జివిఎంసికి చెందిన విలీనం, పార్కింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తదితర అంశాలపై చర్చ జరగనుంది. ఇప్పటికే జివిఎంసిలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల విలీనాన్ని వద్దంటూ ఎంపి పురంధ్రీశ్వరి గట్టిగా పట్టుపడుతున్నారు. అయితే, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు చింతలపూడి, అవంతి శ్రీనివాస్ విలీనానికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం రాజకీయమైంది. ఎవరి పంతం నెగ్గుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. విలీనాన్ని మెజార్టీ ప్రజలు వద్దనుకుంటున్నారు. జివిఎంసి పాలకవర్గం ఉన్నప్పుడు కూడా విలీన ప్రతిపాదనను తిరస్కరించింది. జివిఎంసి పాలకవర్గం అనుమతి లేకుండా విలీనాన్ని ఏవిధంగా చేస్తారు. అలాగే, పంచాయతీల పాలకవర్గం లేకుండా గ్రామాలను జివిఎంసిలో ఏవిధంగా విలీనం చేస్తారు? ఒకవేళ విలీనం చేయాల్సి వస్తే, ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం వివిధ పరిశ్రమల స్థాపనకు సంబంధించి నిర్వహిస్తున్నా ప్రజాభిప్రాయ సేకరణల్లో 99 శాతం మంది కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, పనులు సాగిస్తున్నారు. అయితే, ఈ మున్సిపాలిటీల విలీనం విషయంలో అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
కాంగ్రెస్‌లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు విలీనాన్ని తప్పుపడుతున్నారు. విలీనానికి పాజిటివ్‌గా ఉన్న వారు తమ అభిప్రాయాలను మార్చుకోవలసి ఉంటుందిన అధికారపక్ష నాయకులే చెబుతున్నారు.

గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి
english title: 
merger controversy

పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

$
0
0

విశాఖపట్నం, ఏప్రిల్ 14: పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సంవత్సరం జూన్‌లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్న భావతో ఉన్న ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రక్రియను చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే ఓటర్ల జాబితాలను ప్రకటించిన అధికారులు ఈనెల 17 తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలను చేపట్టనున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీలకు, వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈనెలాఖరులోగా 2011 జనాభా లెక్కలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ముందుగానే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 38.32 లక్షల జనాభా ఉంది. గ్రామీణ జిల్లా జనాభా 21.08 లక్షలు. వీరిలో ఎస్సీ జనాభా 7.6 శాతం కాగా, ఎస్టీ జనాభా 14.55 శాతం. జిల్లా వ్యాప్తంగా 942 గ్రామ పంచాయతీలు ఉండగా, ఏజెన్సీలో 244 గ్రామాలున్నాయి.
జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం, బిసిలకు 35 శాతం పంచాయతీలు, వార్డులు కేటాయించనున్నారు. వీటిలో 50శాతం స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. ఈ జనాభా లెక్కల ప్రాతిపదికనే ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు.

వుడా షాపుల కేటాయింపునకు ఆన్‌లైన్ దరఖాస్తులు
విశాఖపట్నం, ఏప్రిల్ 14: విశాఖ నగర పరిధిలో వుడా షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాల్లో ఖాళీగా ఉన్న షాపులు, కార్యాలయ వసతుల కేటాయింపునకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ వుడా ప్రకటన జారీ చేసింది. కూర్మన్నపాలెం షాపింగ్‌కాంప్లెక్స్‌లో మూడు, పెదగంట్యాడ ఫేజ్-1లో ఒకటి, సాగర్‌నగర్‌లో నాలుగు, వెంకోజీపాలెంలో పెట్రోల్ బంక్ ఎదురుగా రెండు దుకాణాలు ఉద్యోగభవన్ కాంప్లెక్స్‌లో రెండు షాపులు, సీతమ్మధార జనతాకాంప్లెక్స్ మొదటి అంతస్తులో 19 షాపులు, వుడా పార్కు ఫేజ్-2లో మూడు షాపులు, ఫేజ్-1లో మినీ క్యాంటీను, కైలాసగిరి ఫుడ్‌కోర్టు-1 కేటాయింపు నిమిత్తం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చును.

‘శ్రీ రామాయణం
అన్నా, విన్నా పుణ్యమే’
సింహాచలం, ఏప్రిల్ 14 : శ్రీరామాయణాన్ని పారాయణ చేసిన, శ్రద్ధతో వీనుల విందుగా విన్నా పుణ్యం ప్రాప్తిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు డాక్టర్ టి.పి.శ్రీనివాసయాజులు అన్నారు. దేవస్థానం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో జరుగుతున్న అష్టోత్తర శత సుందరకాండ సామూహిక పారాయణ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు ఆయన సుందరకాండపై ప్రవచించారు. శ్రీరామాయణంలో సుందరకాండ ప్రత్యేకతలను ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. లోకంలో గాయత్రి మంత్రానికి మించిన మంత్రం మరొకటి లేదని మహనీయుల వాక్కు అటువంటిది. సుందరకొండలో ఒకసారి పారాయణం చేస్తే సహస్ర గాయిత్రీ మంత్రాలలు జపించిన పుణ్యం దక్కుతుందని ఆయన ఉపమానాలతో సహ ప్రస్తుతించారు. కలిమొక్క ప్రభావతం రామాణం పూర్తిగా రామయణం, భారతం ప్రస్తావించిన కథలు, కవులు లేరని ఆఖరికి సినిమాలు కూడా అనేకం ఉన్నాయని రామానుజం చెప్పారు. కార్యక్రమం అనంతరం సింహక్షేత్ర ప్రధానార్చకుడు మోర్త సీతారామాచార్యులు నేతృతంలో భజన సంకీర్తన జరిగింది. అంతకు ముందు శ్రీ విష్ణు సహస్రనామ సామూహిక పారాయణం ఉదయనగర్ సంకీర్తన నిర్వహించారు. చివరి రోజు సోమవారం మధ్యాహ్నం పూర్ణాహుతి, పట్ట్భాషేక సర్ల విన్నపం, శాంతి కల్యాణం, నిర్వహిస్తారు.

సింహగిరిపై బ్యూటిఫికేషన్ పనులు
సింహాచలం, ఏప్రిల్ 14: సింహగిరిపై బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నుండి పలు రకాల పూలమొక్కలను తీసుకువచ్చారు. ఆదివారం ముందు భాగంలో నృసింహాలయం వద్ద ఈ మొక్కలను నాటనున్నారు. బంతులు గులాబీలు విదేశీ జాతులకు చెందిన పుష్పాలు తీసుకువచ్చారు.

‘సామాజిక విలువలను నేర్పించేదే విద్య’
పెందుర్తి, ఏప్రిల్ 14 : సామాజిక నైతిక, విలువలను పెంచేదే విద్య అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. పెందుర్తిలో గల శ్రీ విద్యా టెక్నో పాఠశాల రెండో వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వరూపానందేంద్ర సరస్వతి విద్యార్థులను ఉద్దేశించి అభిభాషించారు. ప్రతీ మనిషికి విద్య కీలకమైనదని దానిని అందరూ వినియోగించుకోవాలని స్వరూనందేంద్ర సరస్వతి ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పీలా శ్రీనివాసరావు, మాజీ ఎంపిటిసి గొర్లె రామునాయుడు, పాఠశాల ప్రిన్సిపల్ అంజి తదితరులు పాల్గొన్నారు.

‘దిక్సూచి’కి ఉత్తమ ప్రదర్శన బహుమతి
ఆరిలోవ, ఏప్రిల్ 14: కళాభారతి, కీర్తిశేషులు ఎ.ఎస్. రాజా నాటకోత్సవాల సంస్థల ఆధ్వర్యంలో ఆ సంస్థల అష్టమ వార్షిక రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు 2013 పేరున నాలుగు రోజుల పాటు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఎనిమిది నాటికల్లో జమ్మలమడక రమణ దర్శకత్వంలో నడిమింటి జగ్గారావు రచన దిక్సూచి ఉత్తమ ప్రదర్శన బహుమతి కైవశం చేసుకుంది.
ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని చెంగల్వ పూదండ నాటిక, తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని సంచలనం నాటికలు కైవశం చేసుకున్నాయి. వీరికి వరుసగా రూ.10 వేలు, రూ.8 వేలు, రూ. 6 వేలు, నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. చెంగల్వ పూదండ నాటిక రచయిత శిష్ట్రా చంద్రశేఖర్ ఉత్తమ రచయిత బహుమతిని, దిక్సూచి నాటికకు దర్శకత్వం వహించిన జమ్మలమడక రమణ ఉత్తమ దర్శకత్వ బహుమతిని, ఉత్తమ నటుడు బహుమతిని దిక్సూచి నాటికలోని పాత్రధారి శరత్‌కుమార్, ఉత్తమ నటి బహుమతిని ట్రీట్‌మెంట్ నాటికలోని పాత్రధారి కె. విజయలక్ష్మి, అదే నాటికలో నటించిన ఐ.కె. త్రినాధ్ ఉత్తమ ప్రతి నాయకుడు బహుమతిని, అదే నాటికలోని పాత్రధారి ఎన్. శ్రీను ఉత్తమ హాస్య నటుడు బహుమతిని, దిక్సూచి నాటికలో నటించిన బి. సుధాకర్ ఉత్తమ సహాయ నటుడు బహుమతిని, సంచలనం నాటికలో నటించిన జానకీనాధ్ ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ బహుమతిని, పి. బాబూరావు (ట్రీట్‌మెంట్) ఉత్తమ రంగాలంకరణ బహుమతి, చెంగల్వ పూదండకు సంగీతం సమకూర్చిన లీలామోహన్ ఉత్తమ సంగీతం బహుమతిని, మల్లాది గోపాలకృష్ణ (చెంగల్వ పూదండ) ఉత్తమ ఆహార్యం బహుమతులను కైవశం చేసుకున్నారు. వీరికి 1,116 రూపాయల చొప్పున నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అతిధులు ఎఎస్ రాజా ట్రస్ట్ ధర్మకర్త డాక్టర్ మంగళగౌరి, వి.ఎం.డి.ఎ. అధ్యక్షుడు రాజు అందజేశారు. గుణ నిర్ణేతలుగా ఆచార్య బాబీవర్దన్, ఎం.వివి. గోపాలరావు, బి. ధవళేశ్వరరావులు వ్యవహరించారు. కార్యక్రమ నిర్వహణలో బొడ్డేటి జగత్‌రావు, వి. నాంచారయ్య, శ్రీపాద వెంకన్న పాల్గొన్నారు. డాక్టర్ శర్మ, డాక్టర్ వేణు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది
english title: 
panchayat elections

‘అంబేద్కర్ చొరవతోనే భిన్నత్వంలో ఏకత్వం’

$
0
0

విశాలాక్షినగర్, ఏప్రిల్ 14: అంబేద్కర్ రాజ్యాంగ రచనతోనే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి పునాది పడిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మర్రిపాలెంలోని అంబేద్కర్ భవన్‌లో 122వ జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సమాజంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం రాజ్యాంగ బద్దంగా హక్కులు కల్పించారన్నారు.
ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరికి సమాన హోదా కల్పించేది విద్య ఒక్కటేనని గుర్తించారన్నారు. ప్రతిఒక్కరూ ఉన్నత విద్యలను అభ్యసించాలని అంబేద్కర్ ఆకాంక్షించారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శేషాద్రి మాట్లాడుతూ దేశంలో సామాజికంగా అందర్ని సమైక్య పరిచిన ఘనత డాక్టర్ అంబేద్కర్‌కే దక్కుతుందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ద్వారా అందరికీ సమానమైన హోదా, అవకాశాలు కల్పంచారని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, డాక్టర్ మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు జి. సుమన, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, అదనపు సంయుక్త కలెక్టర్ వై. నరసింహారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డి. శ్రీనివాసన్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి నంబూద్రిపాల్, దళిత నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

అంబేద్కర్ రాజ్యాంగ రచనతోనే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి
english title: 
unity in diversity

బియ్యం ధరలకు రెక్కలు!

$
0
0

విశాఖపట్నం, ఏప్రిల్ 14 : బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ఆరు నెలల వ్యవధిలో కిలో రూ. 10 వరకు ధర పెరిగింది. వరి సేద్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడే ఇలా ఉంటే జూన్ నాటికి క్వింటా ధర రూ. 5 వేలు దాటవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతినెలా బియ్యం ధర పెరుగుతుండడంతో మధ్య తరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లాలో గత రెండేళ్ళుగా ఆయకట్టు పరిధిలో వరి సేద్యం పడకేసింది. దీంతో జిల్లాలో వరి ఉత్పత్తి తగ్గింది. దీని ప్రభావం బియ్యంపై పడింది. జిల్లాలో కూడా ఆశించనంత స్థాయిలో సాగులేకపోవడంతో పోరుగు జిల్లాల నుంచి మరీ దిగుమతి చేస్తున్నారు. గతంలో జిల్లాలోనే ధాన్యం మిగులు ఉండడంతో బియ్యం ధరలు అంతగా పెరగలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం దిగుబడి తగ్గడంతో గతంలో ఎప్పుడూ లేనంతగా బియ్యం ధరకు రెక్కలొచ్చాయి. మిల్లుల వద్ద కిలో రూ.30 చొప్పున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా జిల్లాలో అది ఆరంభ శూరత్వమే అయింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ ప్రకటన నీరుగారి పోయింది. ఆరు నెలల క్రితం క్వింటా బియ్యం ధర 3,200 నుంచి 3,500 వరకూ ఉండగా, ప్రస్తుతం రూ. 4,500కు చేరింది. ఆరు నెలల్లోనే రూ. వెయ్యి పెరగడంతో మధ్య తరగతి వర్గాలు బెంబేలెత్తుతున్నాయి. సన్న బియ్యంతో పాటు మిగిలిన బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నాటికి రూ. 5 వేలకు పైన ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధాన్యం దిగుబడి తగ్గడంతో ఏటా ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని ఆయుకట్ట ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో 3.50 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతుంది. ఈ ఖరీఫ్, రబీ సీజన్‌లో నీరు విడుదల చేయకపోవడంతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. బోర్లు, బావుల కింద సాగు చేసినా నీలం తుపాను కారణంగా సుమారు 50 శాతం మేర పంట నష్టం వాటిల్లింది. అయితే అరకొరగా వచ్చినది దిగుబడిన వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల వద్ద ధాన్యం అయిపోవడంతో బియ్యం ధరలు కొద్ది కొద్దిగా పెంచడం ప్రారంభించారు. సన్నబియ్యం ధరలను పెంచుతున్న వ్యాపారులు వాటితో పాటు దొడ్డు బియ్యం, నూకల ధరలు కూడా పెంచేశారు.

నేటి నుంచి వేటకు విరామం
విశాఖపట్నం, ఏప్రిల్ 14: సముద్ర ఉత్పత్తుల పరిరక్షణలో భాగంగా నేటి నుంచి చేపటల వేటను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య సంపద సంరక్షణలో భాగంగా ఈనెల 15 నుంచి మే 31 వరకూ 45 రోజుల పాటు వేటను నిలిపివేస్తారు. ఈకాలంలో సముద్ర ఉత్పత్తులు గుడ్లుపెట్టి పునరుత్పత్తిని కొనసాగిస్తుంటాయి. ఈకారణంగా సముద్రంలో చేపలవేటను నిషేధిస్తుంటారు. సముద్రం లోనికి వెళ్ళి వేటసాగించే ట్రాలర్లు, మెకనైజ్డ్ బోట్లు, సాధారణ మర పడవలకు నిషేధం వర్తిస్తుంది. తీరం వెంబడి వేట సాగించే సంప్రదాయ పడవలకు నిషేధం నుంచి మినహాయింపు నిచ్చారు. జిల్లాలో సుమారు 600వరకూ మెకనైజ్డ్ బోట్లు, 100 వరకూ ట్రాలర్లు వేట సాగిస్తుంటాయి. ఇక తీరం వెంబడి మరో 600 వరకూ సంప్రదాయ పడవుల్లో మత్స్యకారులు వేట సాగిస్తుంటారు. జిల్లాలో 132 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతం ఉంది. దాదాపు 11 మండల్లో విస్తరించిన తీరప్రాంతంలో 63 మత్స్యకార గ్రామాల్లో 13వేల కుటుంబాలు చేపలవేటనే ఆధారంగా జీవిస్తున్నాయి. సాలీనా జిల్లా నుంచి 70 వేల టన్నుల వరకూ మత్స్య సంపదన లభిస్తుండగా, స్థానిక అవసరాలు తీర్చగా 30 వేల టన్నుల సముద్ర ఉత్పత్తులను ఎగుమతిచేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న టైగర్ ఫ్రాన్స్ ఎగుమతులు విశాఖ కేంద్రంగా సాగుతుంటాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ట్యూనా ఫిష్‌కు మంచి గిరాకీ ఉంది. ఈరకం చేపల వేటకు మత్స్యకారులు ప్రాధాన్యత నిస్తారు. అయితే ఇటీవల కాలంలో ట్యూనాఫిష్ వేట ఆశాజకంగా లేదు.
ఇదిలా ఉండగా సముద్ర ఉత్పత్తుల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని చేపలవేటపై నిషేధం కొనసాగిస్తున్నప్పటికీ మత్స్యకార కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మత్స్యకార సంఘాలు విమర్శిస్తున్నాయి. వేట నిషేధం అమల్లో ఉన్న కాలంలో వీరికి అవసరమైన నిత్యావసరాలతో పాటు నగదు సాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. నిషేధ కాలంలో 4500 రూపాయలు ఆర్ధిక సాయం అందజేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

‘అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి సాధించాలి’
విశాలాక్షినగర్, ఏప్రిల్ 14: అన్ని రంగాల్లో గిరిజనులు మరింత అభివృద్ధిచెందాల్సి ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం ఆంధ్రవిశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ప్లాటినం జూబ్లీహాలులో గిరిజనులు-విద్య అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక యూనివర్శిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కంటే కూడా గిరిజనులు అభివృద్ధి చెందుతున్నారని, మరింత అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. కలెక్టర్ వి.శేషాద్రి, ఏయు విసీ ఆచార్య జిఎస్‌ఎన్ రాజు, గిరిజన సంఘం గౌరవ అధ్యక్షుడు వి.తిరుపతిరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

పోలీసుల అదుపులో మరో సిమ్స్ డైరక్టర్
* నగదు, బంగారం, ఇన్నోవ కారు స్వాధీనం
విశాఖపట్నం, ఏప్రిల్ 14: సిమ్స్ డైరక్టర్లలో మరో డైరక్టర్‌ను ఆదివారం యానాంలో ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఖాతాదారులకు మస్కకొట్టి కోట్లాది రూపాయలతో బోర్డు తిప్పేసిన సిమ్స్ సంస్థకు చెందిన ఎం.డి. సురేంద్రగుప్తాను, ఖాతాదారులను మాయ చేసి సిమ్స్‌లో డిపాజిట్లను కట్టించిన డైరక్టర్లు, ఏజెంట్లల్లో కొంతమందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో పరారీలో ఉన్న మరి కొంతమంది డైరక్టర్ల ఆచూకీపై ప్రత్యేక పోలీసు బృందం నిఘా పెట్టింది. సిమ్స్ బోర్డు తిప్పేసిన నాటి నుండి పరారీలో ఉన్న మరో డైరక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి పాండిచ్ఛేరిలోని యానాంలో ఉన్నట్టు తెలుసుకున్న ప్రత్యేక పోలీసు బృందం అదివారం అతనిని అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పాటు ఇన్నోవ కారును, రూ. లక్షా 80వేలు, ఎనిమిది గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎసిపి కె.రాజేంద్రరావు నేతృత్వంలో సిఐ మళ్ళ శేషు బృందం కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి భౌతిక కాయానికి
తలకొరివి పెట్టిన కుమార్తె
విశాఖపట్నం, ఏప్రిల్ 14: కుమారులు లేని ఆ తండ్రికి కన్నకూతురే రుణం తీర్చుకుంది. అరుదైన అల్లిపురం వెంకటేశ్వర మెట్ట ప్రాంతంలో ఆదివారం జరిగింది. అల్లిపురానికి చెందిన దాడి సూర్యనారాయణ (53) రైల్వేలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి కూతురు కల్పన, అల్లుడు దొరబాబు ఉన్నారు. కొంతకాలంగా సూర్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందారు. శనివారం రాత్రి సూర్యనారాయణ కన్నుమూశారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించే సమయంలో ఆయనకు తలకొరివి ఎవరు పెట్టాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. కొడుకులు లేకపోవడంతో కూతురు లక్ష్మి ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఇంటి దగ్గర నుంచి శ్మాశనవాటిక వరకు వెళ్ళింది. దహన సంస్కారాల్లో చేయాల్సిన పనులన్నీ చేసింది. తండ్రి అంత్యక్రియలు బాధ్యతను తీసుకున్న ఆమె సంప్రదాయబద్ధంగా నిర్వహించి కొడుకులేని లోటు తీర్చింది. ఈ సంఘటన స్థానిక చర్చనీయాంశమైంది.

‘అగ్ని ప్రమాద రహిత జిల్లా కోసం సహకారం అవసరం’
విశాఖపట్నం, ఏప్రిల్ 14: అగ్ని ప్రమాదరహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దేందుకు అంతా సహకరించాలని కలెక్టర్ వి.శేషాద్రి కోరారు. నగర పరిధిలోనున్న పలు రకాల భవనాలు, ప్రస్తుతం నిర్మాణంలోనున్న భవనాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు శతశాతం పాటించడం వలనే ఇది సాధ్యమవుతుందన్నారు. జాతీయ అగ్నిమాపక సేవ దినాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్యాబాగ్‌లో అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగర పరిధిలో షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్సులు, హోటళ్ళు, ఆసుపత్రులు, అపార్టుమెంట్లు తదితర అత్యాధునిక భవన నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. వీటన్నింటిలోను అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను శతశాతం పాటించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి అంతా సహకరించాలన్నారు. జిల్లా అగ్నిమాపక కేంద్ర అధికారి సిహెచ్.కృపావరం, జెసి ప్రవీణ్‌కుమార్, విశాఖ తూర్పు ఏసిపి వెంకటరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్నిమాపక సేవల శాఖ ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు, బ్రోచర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.

బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి
english title: 
rice price

తేలని పైలాన్ స్థల వివాదం

$
0
0

గాజువాక, ఏప్రిల్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా... మీకోసం పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఏర్పాటు చేయాలకున్న పైలాన్ స్థల వివాదం కొనసాగుతోంది. పైలాన్ నిర్మాణంపై ఆదివారం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు. పైలాన్ నిర్మించాలనుకున్న స్థలం వివాదంలో పడిందన్న విషయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి నేతలు తీసుకువెళ్లారు. వివాద స్థలాన్ని పక్కన పెట్టి మరో స్థలాన్ని అనే్వషించాలని టీడీపీ విశాఖపట్నం జిల్లా నేతలకు ఆదేశించినట్లు తెలిసింది.
వివాదం చోటు చేసుకున్న వడ్లపూడి స్థలాన్ని విడిచి పెట్టి మరో స్థలాన్ని అనే్వషించే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఆదివారం కూర్మన్నపాలెం, శివాజీనగర్, అగనంపూడి, షీలానగర్ ప్రాంతాల్లో నేతలు స్థల అనే్వషించారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నేతలు నెల్లూరు భాస్కరరావు, హర్షవర్థన ప్రసాద్, పల్లా శ్రీనివాసరావు, పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాసరావులు ఈ స్థల అనే్వషణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో స్థలాన్ని నేతలు గుర్తించారు. దీంట్లో భాగంగా ఆయా స్థలాలకు చెందిన రైతన్నలతో నేతలు మాట్లాడారు. ఒక స్థలం ఉడా లే-అవుట్‌లో ఉంది.
లే-అవుట్‌లో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయాలని కొంత మంది నేతలు ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ మూడు స్థలాలు పట్టణానికి కాస్త దూరంగా ఉంటుందన్న భావం నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వడ్లపూడి స్థలానికి నగరానికి దగ్గర, జాతీయ రహదారి అనుకుని ఉండడంతో నేటికీ కొంత మంది ఆ స్థలంలోనే పైలాన్ నిర్మాణం చేపట్టాలని పట్టుబడుతున్నారు. దీంతో స్థల వివాదాన్ని పరిష్కరించుకునే విధంగా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్లపూడి స్థలానికి సంబంధించిన యజమాని ఇప్పటికే కమర్షియల్ స్థలంగా మార్పు చేసుకుని ఉడా అధికారుల వద్ద అనుమతులు పొందినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. సదరు స్థల యజమాని చక్రవర్తికి స్టీల్‌ప్లాంట్ భూ సేకరణ అధికారులు కేటాయించడం జరిగిందని, అయితే ఈ స్థలానికి గాజువాక తహశీల్దార్ నోటీసులు జారీ చేయడం ఏమిటని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు.
అయినప్పటికీ వివాదానికి పోయేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా లేరు. డబ్బు ఇచ్చి స్థలాన్ని కొనుగోలు చేసుకునేందుకు వివాదాలు ఎందుకు అని టీడీపీ నేతలు అంటున్నారు. పైలాన్ స్థల వివాదం వెనక రాజకీయ కుట్ర ఉందన్న భావం పలువురు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని అనే్వషిస్తున్నప్పటికీ సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ సమస్యను ఆయన ముందు పెట్టి పరిష్కరించుకునేందుకు ఆలోచన చేస్తున్నారు. పైలాన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వాన్ని కేటాయించమని చెప్పడం లేదని, కొనుగోలు చేసుకుందామన్నా అటంకం పెట్టడం పట్ల టీడీపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా..మీకోసం పాదయాత్ర విజయవంతానికి చిహ్నాన్ని నిర్మించే ఈ పైలాన్ విశాఖపట్నానికి వనె్న తెస్తుందన్న భావం వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే కొంత మంది పైలాన్ నిర్మాణం అడ్డుకోవాలని తెర వెనక ఉండి రాజకీయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైలాన్ నిర్మాణం వారం రోజుల్లో పూరి చేసే విధంగా కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చంద్రబాబు పాదయాత్ర కాస్త ఆలస్యం కావడంతో పైలాన్ నిర్మాణానికి సమయం సరి పోతుందని టీడీపీ నేతలు అంటున్నారు.

కశింకోటలో మంత్రి ఆనం కటౌట్ శవయాత్ర
* చెప్పులతో కొట్టిన వైకాపా కార్యకర్తలు
* దిష్టిబొమ్మ దగ్ధం
* భారీగా నిలిచిన ట్రాఫిక్
కశింకోట, ఏప్రిల్ 14: రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎం.పి జగన్‌మ్మోన్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా కశింకోటలో మాజీ సర్పంచ్ మళ్లబుల్లిబాబు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. మంత్రి ఆనం రామానారాయణరెడ్డి కటౌట్ తయారుచేయించి కశింకోట పురవీధుల్లో శవయాత్ర మాదిరిగా డప్పులతో ఊరేగించి కర్మకాండలు చేయించి స్థానిక జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేసి దిష్టిబొమ్మను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు దగ్ధం చేసారు. మంత్రి కటౌట్‌ను స్థానిక ఆర్‌ఇసిఎస్ డైరక్టర్ శ్రీనివాసరావు చెప్పుతో కొట్టడమే కాకుండా జిల్లాజెడ్పికో-అప్షన్ మాజీ సభ్యుడు పీటర్‌వైజ్‌మేన్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు రాపేటి భానోజీరావు కాళ్లుతో తన్నుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌ఇసిఎస్ వైస్‌చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, బుల్లిబాబు మాట్లాడుతూ మంత్రి ఆనంకు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేసి పోటీచేయాలని, వైఎస్ బిక్షతో గెలిచి మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా జగన్‌పైనా, వారి కుటుంబ సభ్యులపైనా నిందారోపణలు చేయడం మంత్రి నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమన్నారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక కాంగ్రెస్ నాయకులకు మతి భ్రమించిందని ఆరోపించారు. ఈ నిరసన కారణంగా జాతీయ రహదారిపై సుమారు ఐదు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చినా ఆందోళనకారులు నిరసనలు విరమించలేదు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పండూరి ఎరుకునాయుడు, సాలాపు స్యామలరావు, బుద్ద వరహాసత్యనారాయణ(సత్య), బయ్యవరం సత్తిబాబు, పిఎసిఎస్ డైరక్టర్ పెంటకోట నాగేశ్వరరావు, బలిజిబల్లి అప్పలనాయుడు, శిష్టి గోవింద పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 800 పోస్టులు ఖాళీ
* రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జెసి వనజాక్షి
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 14: రాష్ట్రం లో పలు ప్రభుత్వ వైద్యాలయాల్లో 800 స్పెషలిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ ఎస్. వనజాక్షి తెలిపారు. ఆదివారం స్థానిక వంద పడకల ఆసుపత్రికి విచ్చేసిన సందర్భంగా పలు వార్డులను ఆమె సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఆపరేషన్ థియేటర్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఎస్‌వి కుమారి మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్‌లో కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పించాల్సిఉందని జెసికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ధియేటర్‌కు కావాల్సిన పరికరాలను నిధులు మం జూరు చేస్తానని జెసి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చా రు. ఈ సందర్భంగా డెలీవరీ కేసుల రిజిస్టర్‌ను తనిఖీలు చేసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో వనజాక్షి మాట్లాడుతూ ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని, దీంతో 350 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందుతుందని, విశాఖ రూరల్‌లోనే అనకాపల్లి పెద్ద ఆసుపత్రిగా అభివృద్ధి చెంది ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో 253 ఏరియా ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేచ్చారని ఆమె అన్నారు. ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా వైద్యసిబ్బందిని నియమించుకోవచ్చని ఆమె భరోసా పలికారు. అనంతరం నూకాంబిక దేవాలయాన్ని సందర్శించిన ఆమె అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ నాయక్, వైద్యవిధాన పరిషత్ సూపరింటెండెంట్ ఎస్‌వి కుమారి, ఆర్‌ఎంఒ ప్రియదర్శిని, ఆసుపత్రి అభివృద్ధి డైరెక్టర్ బొడ్డేడ అప్పారావు పాల్గొన్నారు.

వస్తున్నా మీ కోసం పాదయాత్రకు ఏర్పాట్లు
నాతవరం, ఏప్రిల్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు రోడ్డుపై కాకుండా రోడ్డుపక్కన నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆదివారం శృంగవరం నుండి డి.యర్రవరం మదర్ కాలేజ్ వరకు రోడ్డు పక్కన మట్టిని వేసే కార్యక్రమంలో పార్టీ నాయకులు పనులు వేగవంతం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ప్రారంభం కానున్న యాత్రకు బాబు కాళ్ళు సహకరించకపోవడంతో మట్టిరోడ్డుపై నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాతవరం మండలంలో బాబు బస నాల్గవ రోజుకు చేరింది. ఇంకా మండలంలో మరో నాలుగు రోజులు బస చేసే పరిస్థితులు కనిపిస్తుంది. వస్తున్నా మీ కోసం బాబుపాదయాత్ర అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి శ్రీకారం చుట్టారు. మొదట్లో 2,300 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని సాగించిన పాదయాత్ర విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చేరుకునే సరికి 2,700 కిలోమీటర్లు దాటింది. మండలంలో ఇంకా 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంది.

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో
నియోజకవర్గ సమీక్షా సమావేశాలు
నాతవరం, ఏప్రిల్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో నియోజకవర్గాల సమీక్షా సమావేశాల వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు తెలియజేశారు. ఆదివారం వారు విలేఖరులతో మాట్లాడుతూ 15వతేదీ సాయంత్రం పాయకరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులతో సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు. 16వ తేదీ డి.యర్రవరం కాలేజీలో రాత్రి బసచేసి 17వ తేదీ ఉదయం పాడేరు నియోజకవర్గంలో సమీక్ష నిర్వహిస్తారన్నారు. 17వ తేదీన బలిఘట్టంలో బసచేసి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల నాయకులతో సమీక్షిస్తారు. 18వ తేదీన కొండల అగ్రహారం నల్లమారెమ్మ గుడివద్ద బస చేస్తారు. 19వ తేదీన పాత కన్నూరుపాలెంలో బసతోపాటు భీమిలి నియోజకవర్గం సమీక్ష, 20వ తేదీన తాళ్ళపాలెంలో బస చేస్తారు. 21వ ఆదివారం పూర్తిగా విరామం. 22వ తేదీన జగన్నాధపురంలో బస చేసి యలమంచిలి కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 23న గంగాదేవి పేటలో బస చేసి విశాఖ తూర్పు, విశాఖ పడమర నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తారు. 24వ తేదీన రేబాకలో బస చేస్తారని, అనంతరం అనకాపల్లి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నాయకులతో సమీక్షా నిర్వహిస్తారన్నారు. 25వ తేదీన సబ్బవరంలో బసచేసి అనంతరం విశాఖ దక్షిణ, అరకు కార్యకర్తలతో సమీక్ష, 26న కొత్తూరు జంక్షన్‌లో రాత్రి బస, పెందుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. 27వ తేదీన వడ్లపూడిలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశాలకు ఆయా నియోజకవర్గాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని వారు కోరారు. వస్తున్నా పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు.

మావోల వల్ల ప్రగతికి అవరోధం
* నర్సీపట్నం ఒఎస్‌డి దామోదర్
పాడేరు, ఏప్రిల్ 14: గిరిజన ప్రాంతంలో మావోల కార్యకలాపాల వల్ల ప్రగతికి విఘాతం కలుగుతుందని నర్సీపట్నం ఒ.ఎస్.డి.దామోదర్ అన్నారు. స్ధానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంవద్ద ఆదివారం ఆయన మావోయిస్ట్ అగ్రనేత బాకూరు గణేష్ సోదరుడు బాకూరు బొంజురాజుకు వాహనాల మరమ్మత్తులు చేసేందుకు ఉపకరించే పనిముట్లను అందజేశారు. ఇంతకుముందు బాకూరులో జయహో మహిళలో బాకూరు బొంజురాజుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా పనిముట్లను అందజేసేందుకు డి.ఐ.జి.స్వాతి లక్రా హామీ ఇచ్చారని తెలిపారు. డి.ఐ.జి. ఆదేశాల మేరకు పనిముట్లను పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మావోయిస్టుల చర్యలవల్ల మారుమూల ప్రాంతాల ప్రగతికి విఘాతం కలుగుతుందని తెలిపారు. మావోయిస్ట్ ఉద్యమంలో చేరిన ప్రతి ఒక్కరి కుటుంబీకులు సంఘంలో తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ మానసిక క్షోభకు గురవుతూ పిల్లలకై పరితపిస్తున్న తల్లిదండ్రులను విడిచి అందరికీ దూరమై మావోయిస్ట్‌లు సాధించేది ఏమీ లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మావోయిస్ట్‌లు తమ పద్ధతి మార్చుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గఫూర్, ఎస్.ఐ.అప్పన్న, సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్ సిపి యలమంచిలి
సమన్వయకర్తగా బొడ్డేడ
అనకాపల్లి, ఏప్రిల్ 14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ నియామక పత్రాన్ని ఆదివారం అందుకున్నారు. రాజధానిలో వైఎస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ యలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్తగా నియామకపు పత్రాన్ని ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ ప్రసాద్‌కు అందజేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు
english title: 
pylon
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>