Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

$
0
0

ఇందూర్, మే 15: రాష్ట్ర మంత్రివర్గం నుండి కళంకిత మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోఆందోళన చేపట్టిన బిజెపి నాయకులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్జి, అరెస్ట్‌లను నిరసిస్తూ బిజెవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగరంలోని దేవి థియేటర్ చౌరస్తాలో బిజెవైఎం నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మతో ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిజెవైఎం రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి మంత్రివర్గంలో కొనసాగుతన్న కళంకిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకవైపు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, క్యాబినెట్‌లోని కొంతమంది మంత్రులు కుంభకోణాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కళంకిత మంత్రులపై చర్యలు తీసుకోకుండా వారికి అండగా నిలుస్తుండటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలన వల్ల అటు దేశంలో, రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలు, 2జీ స్పెక్టమ్, కామన్‌వెల్త్ క్రీడలు వంటి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కళంకిత మంత్రులను క్యాబినెట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన బిజెపి నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు న్యాలం రాజు, ఆనంద్‌రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

సకాలంలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు
పనులు రద్దు చేసి ఇతరులకు అప్పగించాలని మంత్రి ఆదేశం
నిజామాబాద్, మే 16: ప్రజోపయోగ పనులను చేపట్టే విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించే కాంట్రాక్టర్లను ఎంతమాత్రం ఉపేక్షించబోమని మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. గడువు ముగిసినా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను గుర్తించి, వారితో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, ఆ పనులను ఇతరులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంత్రి సుదర్శన్‌రెడ్డి సమీక్ష జరిపారు. తాగునీటి పథకాల పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతుండడం, గిడ్డంగుల నిర్మాణాల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, పనుల్లో తాత్సారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సకాలంలో పనులు పూర్తయినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు సమకూరుతాయని, ఈ దిశగా అధికారులు ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లను తొలగించి, వారి స్థానంలో ఇతరులకు ఆ పనులు కేటాయించాలన్నారు. నాణ్యత విషయంలోనూ రాజీకి తావులేకుండా పనులు చేపట్టాలని, నాసిరకం పనులు చేపడితే గుత్తేదార్లపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాల్లో మంచినీటి పథకాలను మంజూరు చేస్తే, ఇప్పటికీ అనేక చోట్ల పనులను పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టే విషయంలో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, వాటిని సాకుగా చూపుతూ పనుల్లో జాప్యం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మంచినీటి పథకాల పనులకు ఉపయోగించే పైపుల నాణ్యతను స్థానికంగా కూడా పరిశీలన జరపాలని, నాణ్యతతో కూడిన వాటినే వినియోగించేలా అధికారులు పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా పైపులు లీకేజీకి గురైతే సంబంధిత గుత్తేదారు, అధికారులనే బాధ్యులుగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగునీటి పథకాల పనుల్లో నిర్లక్ష్యానికి తావివ్వకుండా సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు అవసరమైన ఇసుకను సమకూర్చుకునేందుకు అధికారులు ఎంతో జాగ్రత్తగా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల పేరుతో ఇసుక నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నందున అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఏ ప్రాంతంలో, ఏ పని కోసం ఇసుకను వినియోగిస్తున్నారు, ఏ వాహనంలో ఎన్ని ట్రిప్పులు తరలించాలనేది అనుమతి పత్రంలో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. నిర్దేశించిన పని కోసం కాకుండా ఇతర పనులకు ఇసుకను తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయాలని జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్‌కు సూచించారు. కాగా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గిడ్డింగులను వచ్చే ఆగస్టు మాసం నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున గోడౌన్లను మంజూరు చేయగా, కేవలం 12 మండలాల్లో మాత్రమే రూఫ్ లెవల్ స్థాయికి చేరాయని, మిగతాచోట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని అన్నారు. పనులను వేగవంతం చేయిస్తూ ఆగస్టు మాసం కల్లా వీటిని పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు, గుత్తేదార్లతో లిఖితపూర్వకంగా రాయించుకోవాలని ఎస్‌ఇని ఆదేశించారు. గిడ్డంగుల నిర్మాణాలపై ప్రతి పక్షం రోజులకోసారి సమీక్ష జరపాలని జె.సికి సూచించారు. సమీక్షా సమావేశంలో పంచాయితీరాజ్ ఎస్‌ఇ శంకరయ్య, హౌసింగ్ పిడి రమేష్, డ్వామా పిడి శివలింగయ్యతో పాటు వివిధ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలి

హౌసింగ్ ప్రగతిపై కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, మే 16: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద విరివిగా ఇళ్లను మంజూరు చేస్తున్నప్పటికీ, గృహ నిర్మాణాల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదని కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులను కలుసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని, వారికి అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని ఆదేశించారు. గురువారం స్థానిక ప్రగతిభవన్‌లో హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇందిరమ్మ పథకం, ఇతర పథకాల కింద ఇప్పటివరకు 2.01 మందికి ఇళ్లను మంజూరు చేయగా, వారిలో కేవలం 1.12 లక్షల మంది మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని అన్నారు. మరో 25,500 గృహాలు వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇంకా 63,739 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాల పనులు అసలే ప్రారంభించలేదని పేర్కొన్నారు. సదరు లబ్ధిదారులను కలుసుకుని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని, ప్రభుత్వపరంగా అందిస్తున్న సహాయ, సహకారాల గురించి అవగాహన కల్పిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. అప్పటికీ లబ్ధిదారులు ముందుకు రాకపోతే వారి పేరిట ఉన్న ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను రద్దు చేసే, అర్హులైన ఇతరులకు కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై ముందుగా లబ్ధిదారులకు వివరిస్తూ, వారికి నోటీసులు జారీ చేసిన మీదట నివేశన స్థలాలను రద్దు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం గృహ నిర్మాణానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచిందనే విషయాన్ని వివరించాలని, బ్యాంకుల ద్వారా త్వరితగతిన రుణాలు మంజూరయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేందుకు వీలుగా లబ్ధిదారులకు అవసరమైన గృహ నిర్మాణ సామాగ్రిని సమకూర్చేందుకు అధికారులు సహాయ, సహకారాలు అందించాలన్నారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో హౌసింగ్ పి.డి రమేష్‌తో పాటు ఇ.ఇలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీరాంసాగర్‌ను సందర్శించిన ఆక్టోపస్ బృందం

బాల్కొండ, మే 16: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైనా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును గురువారం ఆక్టోపస్ బృందం సందర్శించింది. ఆక్టోపస్ డిఎస్పీ సాయిప్రసాద్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం డ్యామ్ పైకి చేరుకుని, ప్రాజెక్టును, ప్రాజెక్టు గేట్లను పరిశీలించి మాక్‌డ్రిల్ నిర్వహించారు. అనంతరం కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాల్వలను పరిశీలించి భద్రత పరంగా చేపట్టాల్సిన పలు అంశాలను వారు పరిశీలించారు. ఈ బృందం వెంట ఆర్మూర్ సిఐ రవికుమార్, బాల్కొండ ఎస్‌ఐ ప్రతాపలింగంలు ఉన్నారు.

మహిళా సంఘాలకు 420 కోట్ల రుణాలు

పిడి వెంకటేశం

డిచ్‌పల్లి రూరల్, మే 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఐకెపి మహిళా సంఘాలకు 420 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఐకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశం తెలిపారు. మండల కేంద్రంలోని టిటిడిసిలో గురువారం మహిళా సంఘాలు, ఐకెపి సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బ్యాంకు లింకేజీ ద్వారా లింకేజీ రుణాలు మంజూరరు చేయిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నిధులను మహిళా సంఘాల ప్రతినిధులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిడి ఆకాంక్షించారు. అదేవిధంగా కిరాణాషాపులు, చిన్నచిన్న వ్యాపారులు చేసుకునేందుకు సైతం బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. బ్యాంక్ లింకేజీ రుణాలతో పాటు స్ర్తినిధి, రాజీవ్ ఉద్యోగశ్రీ, సుస్థిర వ్యవసాయంపై అవగాహన కల్పించడం వల్ల ప్రజలను మంచి స్పందన వస్తోందన్నారు. జిల్లాలోని ఐకెపి సిబ్బంది గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా వినియోగించుకునేలా చైతన్యపర్చుతూ, వారి అభివృద్ధి నివేదికలను ఎప్పటికప్పుడు కార్యాలయానికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

స్వయం సహాయక సంఘాల్లో
ఎస్సీ, ఎస్టీ మహిళల సభ్యత్వం తప్పనిసరి
ఐకెపి ప్రాంతీయ సమన్వయకర్త సుధాకర్

మాచారెడ్డి, మే 16: ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాల నుంచి ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో తప్పనిసరిగా సభ్యత్వం కలిగి ఉండాలని ఐకెపి సమన్వయకర్త సుధాకర్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన పిఓపి సిఎల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సిఎలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఎస్‌సి, ఎస్‌టి కుటుంబానికి చెందిన మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం కలిగి ఉండేలా చైతన్యం చేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా మిగిలి ఉంటే వారితో కొత్త సంఘం ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల చివరి వరకు సభ్యత్వం లేని మహిళలతో సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు తీసుకున్న రుణాలు ఆదాయవృద్ధి కోసం ఉపయోగించుకునే విధంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. జీవనోపాదులైన గొర్రెలు, మేకలు, గేదెలు, కోళ్లు పెంపకం, కౌలు కిరాణా, కూరగాయల వ్యాపారం నిర్వహించుకునే విధంగా వారిని చైతన్యం చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలు ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి ఎపిఎం శ్రీనివాస్, పిఓపి ఎపిఎం రాజెందర్, ఐకెపి ఎపిఎం రాజయ్య, సమాఖ్య అధ్యక్షురాలు రాజమణి, కార్యదర్శి షెహనాజ్, ఉపాధ్యక్షురాలు శోభ, మాచారెడ్డి, సదాశివనగర్, దోమకొండ మండలాలకు చెందిన సిఎలు, సిబ్బంది పాల్గొన్నారు.

నేటినుండి ఏర్గట్లలో అయ్యప్ప ఆలయ ప్రతిష్ఠ

మోర్తాడ్, మే 16: మండలంలోని ఏర్గట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఈ నెల 17 నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు అయ్యప్ప సేవా సమితి, గ్రామ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీ జగద్గురు శంకరాచార్య పరమహంస హంపి నిరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అయ్యప్పస్వామి త్రాయహ్నిక ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 17న మహాగణపతి పూజ, పుణ్యావచనం, శోడశోపచారపూజ, చతుర్వేద అవధార సమర్పణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. 18న భగత్‌ప్రార్థన, విశేష సంకల్పం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, వాస్తుపూజ, అగ్నిప్రతిష్ఠ, దేవతాహ్వానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని సేవా సమితి తెలిపింది. ఆదివారం మహాగణపతి పూజ, దేవతా అవనము, నవగ్రహ పంచసూక్త రుద్రహోమం, చండీహోమం, సుదర్శనహోమం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. అదే రోజున రాత్రి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం వేకువజామున 5.49 నిమిషాలకు యంత్రప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, బలిహరణం, పూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామని కమిటీ పేర్కొంది. ఆలయ ప్రతిష్ఠ తర్వాత చక్రవర్తుల పురుషోత్తమచార్యులచే మహాపడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. శతాధిక ప్రతిష్ఠాపనాచార్యులు గురుమంచి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో చేపట్టే ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఏలేటి అన్నపూర్ణమ్మ, యెండల లక్ష్మినారాయణ తదితరులతో పాటు రాష్టస్థ్రాయి నేతలు కూడా హాజరవుతున్నారు. ఈ ప్రతిష్ఠాపన ఉత్సవానికిగాను 108 మంది భక్తులు అయ్యప్పమాల ధరించి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు. ప్రజలు, భక్తులు, ఆయా గ్రామాల అయ్యప్ప సేవా సమితి సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను జయప్రదం చేయాలని కమిటీ కోరింది.

ఇందిరమ్మ కాలనీ సమస్యలు పరిష్కరించాలని
ఎఐకెఎంఎస్ ధర్నా

మోర్తాడ్, మే 16: మోర్తాడ్‌లోని ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కార్యాలయం ఎదుట ఎఐకెఎంఎస్ నాయకులు గురువారం ధర్నా చేపట్టారు. బస్టాండ్ నుండి ర్యాలీగా తరలివెళ్లిన కార్యకర్తలు, కాలనీవాసులు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఎఐకెఎంఎస్ జిల్లా కార్యాదర్శి సారా సురేష్, పిఓడబ్ల్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు భాగ్య మాట్లాడుతూ, పేదలకు నివాస వసతి కల్పిస్తామని ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం సరిపడా వసతులు కల్పించడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మోర్తాడ్‌లో రెండు కాలనీలు ఏర్పాటు చేసి దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉండేలా ఇండ్లు నిర్మించారని, తాగునీరు, రోడ్లు, విద్యుత్, మురుగునీటి కాల్వల వంటి వౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల కల్పనకై లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేశామని ఆరు మాసాల క్రితం అధికారులు ప్రకటించారని, ఇప్పటి వరకు కనీసం పైపులైన్లు కూడా వేయలేదని ఆరోపించారు. కాలనీ ఏర్పాటైన నాటి నుండి ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నా పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తున్నారే తప్ప, ఆచరణలో విఫలమవుతున్నారని అన్నారు. ఈ మేరకు ఎంపిడిఓ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ఎంపిడిఓ ప్రవీణ్‌కుమార్ 15 రోజుల్లో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎంఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, కిషన్, నాయకులు భూమయ్య, సత్తెక్క, లక్ష్మితో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.

అష్టముఖి కోనేరులో ఉదకశాంతి పూజ

ఇందూర్, మే 16: ఎడపల్లి మండలం జానకంపేట శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయం సమీపంలోని అష్టముఖి కోనేరులో ఈ నెల 6వ తేదీన జల్లపురం నర్సయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందగా, గురువారం ఉదకశాంతి పూజ నిర్వహించినట్లు ఆలయ అర్చకులు అనిల్‌శర్మ తెలిపారు. ముందుగా కోనేరులోని నీరంతా బయటకు తీయించడం జరిగిందన్నారు. అనంతరం సుదీంద్రచారి, అనిల్‌శర్మ, కొండమాచార్యుల ఆధ్వర్యంలో ఉదకశాంతి పూజను నిర్వహించారు. ఈ పూజను చేపట్టడం వల్ల సకల దోషాలు తొలగిపోయి, బ్రహ్మపూజ జరిగి శాంతి చేకూరుతుందని పూజారులు వివరించారు.

శ్రీరామ జమనామ యజ్ఞం

బోధన్, మే 16: పట్టణంలోని షర్బతికేకెనాల్ ఏరియాలో గల మహాలక్ష్మి దేవాలయ కల్యాణ మండపంలో గురువారం బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శ్రీరామ జపనామ మహాయజ్ఞం జరిగింది. ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన యజ్ఞంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ జయరామ జయజయరామ అంటూ శ్రీరాముడిని జపిస్తూ యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి హాజరై యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ రామనామ జపం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయోధ్యలోని రామాలయాన్ని నిర్మించేందుకు ఈ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ హిందువు దేవాలయానికి వెళ్లి భగవంతుడిని ప్రార్థించాలని, భగవంతుడిని కొలిచిన వారికి ఎటువంటి ఇబ్బందులు రావన్నారు. భక్తి మార్గాన్ని విస్మరిస్తే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఇప్పటికే హిందూ దేవాలయాలను నామరూపాలు లేకుండా అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయని, హిందువులు భరించలేనటువంటి అనుమానాలు జరుగుతున్నాయని వీటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రజలతో పాటు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ యజ్ఞ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ నాయకులు సురేందర్‌రెడ్డి, ఆకారపు కేశవరాజు, కోటేశ్వర్‌రావు, బజరంగ్‌దళ్ ప్రతినిధులు గోపికిషన్, హరికృష్ణ, ప్రీతం, లింగం బిజెపి పట్టణాధ్యక్షుడు రామరాజు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం
జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు ఆదేశం

బోధన్ రూరల్, మే 16: గ్రామాల వారీగా ఓటరు జాబితాలు సర్వం సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తహశీల్దార్‌లు, ఎంపిడివోలు, ఎఎస్‌వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ జాబితాలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ వారీగా ఓటరు జాబితాలు రూపొందించారని, ప్రస్తుతం వాటిని గ్రామాల వారీగా మార్చాలని సూచించారు. గ్రామాల వారీగా వెళ్లి ఇంటింటి సర్వే చేసినట్లయితే గ్రామాల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేయవచ్చన్నారు. ఈ జాబితాలపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాల్సి ఉందన్నారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. తహశీల్దార్‌లు, ఎంపిడివోలు, ఎఎస్‌వోలు ఈ జాబితాలను పరిశీలించి నూతన జాబితాలను త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మండలాల వారీగా జాబితాల గురించి తహశీల్దార్‌లను అడిగి తెల్సుకున్నారు. ఇందులో ఆర్డీవో మోహన్‌రెడ్డి, డివిజన్ పంచాయతీ అధికారి హనోఖ్, ఆయా మండలాల తహశీల్దార్‌లు, ఎంపిడివోలు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వల్లనే మతమార్పిడిలు
తీరుమారకుంటే ఎండోమెంట్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపడతా
హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి

బోధన్, మే 16: రాష్ట్రంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని హిందు దేవాలయాల పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి స్వామి అన్నారు. గురువారం బోధన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలలో దూప, దీప, నైవేద్యాల పథకాన్ని రద్దు చేయడం వలన అనేక దేవాలయాలలోని అర్చకులు బజారున పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడులు మూతపడటం వలన హిందువులు తమ బాధలను భగవంతునికి చెప్పుకోలేక, ప్రార్థనలు చేయలేక మతమార్పిడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దీనికి పరోక్షంగా దేవాదాయ శాఖయే కారణమని అన్నారు. హిందూ దేవాలయాలను పరిరక్షించేందుకు, ఆయా దేవాలయాలలో గోవులను హిందూ ధర్మ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు దేవాదాయ శాఖకు నెల రోజులు గడువు ఇస్తున్నామని సంబంధిత మంత్రి స్పందించనట్లయితే రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు పూనుకుంటానని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, వేములవాడలో భక్తులు వదులుతున్న కోడెలను కబేళాలకు తరలిస్తున్నారని, తాజాగా సింహాచలంలో 150 గోవులు ఒకేరోజు చనిపోయాయని వివరించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రయ్య కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, ఇప్పటివరకు దేవాలయాల పరిరక్షణ కోసం ఆయన ఎటువంటి విధాన నిర్ణయాలు ప్రకటించలేక పోయారని అన్నారు. గోవుల రక్షణ కోసం ప్రత్యేక ట్రస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలన్నారు. అర్చకుల జీవితాలు కూడా దుర్భరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులను అణచివేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికలలో అటువంటి ప్రభుత్వాన్ని హిందువులు ఎన్నుకోవాలన్నారు. అయోధ్య రామాలయం కోసం అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తు చేశారు. రామాలయ నిర్మాణం కోసం దేశమంతటా శ్రీరామ జప మహాయజ్ఞాలు చేయాలని ధర్మసంతులు నిర్ణయం తీసుకున్నారని అందువల్లనే అన్ని చోట్ల నేడు ఈ యజ్ఞాలు జరుగుతున్నాయని వివరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరుని దేవాలయాల భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నారని కమలానంద భారతి స్వామి ఆరోపించారు. ఈ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో లింగేశ్వర గుట్ట ఆశ్రమ స్వామి శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్లక్రిష్ణ మహారాజ్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, విహెచ్‌పి ప్రాంత సంఘటన కార్యదర్శి ఆకారపు కేశవరాజు, బోధన్ ప్రఖండ అధ్యక్షుడు కోటేశ్వర్‌రావు, గోపికిషన్ తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కళాశాలను సందర్శించిన ఎంసిఐ ప్రతినిధుల బృందం

సదుపాయాల కల్పనపై నిశితంగా పరిశీలన

ఎంసిఐ ప్రతినిధులతో మంత్రి, కలెక్టర్ భేటీ
నిజామాబాద్, మే 16: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన జనరల్ హాస్పిటల్‌ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసిఐ)కు చెందిన ముగ్గురు అధికారులతో కూడిన ప్రతినిధుల బృందం సందర్శించింది. రెండు రోజుల తమ పర్యటనలో భాగంగా మొదటిరోజైన గురువారం భవన సముదాయం, ఆసుపత్రిలోని అన్ని విభాగాలు తిరుగుతూ అక్కడి సదుపాయాల పరిశీలన జరిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఆయా విభాగాల వారీగా ఈ పరిశీలన ప్రక్రియ కొనసాగింది. అంతకుముందు జిల్లాకు చెందిన మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ ఎంసిఐ బృందానికి స్వాగతం పలుకుతూ, స్థానికంగా ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, వైద్య పరికరాలను సమకూర్చడం తదితర అంశాలను వారి దృష్టికి తెచ్చారు. అనంతరం ఎంసిఐ ప్రతినిధులు అన్‌టోమో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బిసి.దత్తా, భాగల్‌పూర్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఠాకూర్, అలహాబాద్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాద్రీలతో కూడిన బృందం ఆసుపత్రిలోని ఒక్కో విభాగాన్ని సందర్శిస్తూ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో ఎంతమంది వైద్యాధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు, వారి విధులేమిటి, వివిధ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ రికార్డులను పరిశీలించారు. తమవెంట తెచ్చుకున్న చెక్‌లిస్టు ప్రకారం ఎంసిఐ నిబంధనలకు లోబడి వసతి, సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అనే అంశాలను గమనించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆసుపత్రిలోని గైనకాలజీ, రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్, డిజిటల్ స్కానింగ్, ఫిజియోథెరపి, జనరల్ వార్డు, ఎక్స్‌రే ఇత్యాది విభాగాలను సందర్శించి అక్కడి పరికరాలను తనిఖీ చేశారు. పలువురు రోగులను పలకరిస్తూ, స్థానికంగా అందిస్తున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. పాథలాజికల్ విభాగంలో పని చేస్తున్న సిబ్బంది వద్దకు వెళ్లి రక్త నమూనాలను సేకరించే విధానం గురించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రతి వార్డులో అత్యవసర మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడాలని, గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అహ్లాదకరమైన వాతావరణంలో వైద్య సేవలందించాలని సూచించారు. మెడికల్ కళాశాలలో తరగతి గదులు, సెమినార్ హాల్, విద్యార్థుల కోసం నిర్మించిన వసతి గృహాలు, లంచ్‌రూమ్, లైబ్రరీ, ల్యాబ్‌లు, మ్యూజియం, శవ పరీక్షల గది తదితర వాటిని పరిశీలించారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రి పరిసరాలను సైతం నిశితంగా గమనించారు. ఎదురెదురుగా ఉన్న మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు మధ్య రాష్టప్రతి రోడ్డు అడ్డంకిగా ఉండడంతో, ఈ సమస్యను అధిగమించేందుకు నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని సైతం పరిగణలోకి తీసుకున్నారు. పరిశీలన పూర్తయిన అనంతరం ఎంసిఐకు నివేదికను సమర్పిస్తామని డాక్టర్ బిసి.దత్తా విలేఖరులతో పేర్కొన్నారు.
అడుగడుగునా జాగ్రత్తలు చేపట్టిన జిల్లా యంత్రాంగం
కాగా, వైద్య కళాశాల పరిశీలన నిమిత్తం ఎంసిఐ బృందం హాజరైన క్రమంలో జిల్లా యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంది. ఏ చిన్న లోటుపాట్లు కనిపించినా ఎంసిఐ అనుమతిని నిరాకరించే అవకాశాలు ఉండడంతో, అసౌకర్యాలేవీ ఎంసిబి ప్రతినిధుల దృష్టికి రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఒకరోజు ముందుగానే కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించి ఏర్పాట్లను చక్కబెట్టగా, శానిటేషన్ వంటి సమస్యలు తెరపైకి రాకుండా పరిసరాలను శుభ్రం చేయించారు. ప్రధానంగా మెడికల్ కళాశాల, ఆసుపత్రికి మధ్య రాష్టప్రతి రోడ్డు ఎల్లప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుండడంతో, ఎంసిఐ బృందం హాజరైన సందర్భంగా ఈ మార్గంలో పయనించే వాహనాలను దారిమళ్లించారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించడం ద్వారా బస్సులు, ఆటోరిక్షాలను ఇతర మార్గాల మీదుగా బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలకు తరలించారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు దూరభారాన్ని అధిగమిస్తూ ఒకింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సెలవులపై ఉన్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని ఉన్నపళంగా విధుల్లో చేరేలా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో రోగుల వెంట ఒకరిద్దరు సహాయకులను మాత్రమే అనుమతిస్తూ వైద్య కళాశాలకు అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొని ఉన్నట్టు ఎంసిఐ బృందం దృష్టికి తెచ్చేందుకు ఆపసోపాలు పడ్డారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుమన్‌చంద్ర, సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్, ఆర్‌ఎంఓ రవూఫ్‌తో పాటు ఇతర అధికారులు ఎంసిఐ బృందానికి వెన్నంటి ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేశారు.

‘సెజ్’ భూమిలో పరిశ్రమల స్థాపన ఎప్పుడో...?

ఐదేళ్లు పూర్తికావస్తున్నా జాడలేని పరిశ్రమలు
నందిపేట, మే 16: ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్) కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న రైతులకు చెందిన 430 ఎకరాల సాగుభూములు గడిచిన ఐదేళ్ల కాలంగా నిరుపయోగంగానే ఉంటున్నాయి. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పితే వందలాది మందికి ఉపాధి లభిస్తుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సెజ్ చట్టం కింద భూములను స్వాధీనం చేసుకుని బడా కంపెనీలకు ధారాదత్తం చేయగా, ఇప్పటివరకు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపించి మారుమూల ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ హాజరుకాగా, ఇక్కడ సెజ్‌కు కేటాయించిన భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. కనీసం సిఎం చొరవతోనైనా పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభమవుతాయా లేక మరింత జాప్యం జరుగుతుందా అన్నది సందిగ్ధంగానే మారింది. మరోవైపు సెజ్ కింద కేటాయించిన భూముల్లో పరిశ్రమలు పెట్టకపోతే స్థలాలను స్వాధీనం చేసుకుంటామని ఇటీవలే ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. ఈ హెచ్చరికలతోనైనా పరిశ్రమను ఏర్పాటు చేస్తే, ఆశించిన ప్రయోజనం నెరవేరే అవకాశం ఉంటుంది. నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం సెజ్ పేరిట 430 ఎకరాల సాగు భూమిని గత నాలుగున్నరేళ్ల క్రితం స్వాధీనం చేసుకుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఈ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు 6 వేల మంది స్థానికులకు, భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించి బతుకుదెరువు చూపిస్తామని చెప్పిన ప్రభుత్వం, నాలుగున్నరేళ్లు పూర్తయినా, పరిశ్రమల స్థాపన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా భూ నిర్వాసితులు సాగుభూమి లేక, ఉద్యోగాలు, ఉపాధి లేక అర్ధాకలితో రోజులు వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. మండలంలోని లక్కంపల్లి, చింరాజ్‌పల్లి, నందిపేట, బజార్‌కొత్తూర్ గ్రామాల రైతులకు చెందిన 188/1, 189, 432/1-6, 438/16, 17, 48/1 సర్వే నెంబర్లలో గల 429.12 ఎకరాల సాగు భూమిని సెజ్ కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో కేవలం 70 ఎకరాలు పట్టా భూమి కాగా, మిగతా స్థలమంతా గతంలో పేదకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూమి. దీంతో ఈ స్థలాన్ని ప్రభుత్వం పెద్దగా ప్రతిఘటనలు లేకుండానే పేదల నుండి లాక్కుని పరిశ్రమల స్థాపన పేరిట ‘పెద్దల’కు అప్పగించింది. ఇందుకుగాను భూ నిర్వాసితులకు ఎకరానికి 60 నుండి లక్షా 20 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని మాత్రమే అందించారు. భూములు కోల్పోయిన వారిలో 95 శాతం మంది రైతులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారున్నారు. పరిహారం చెల్లింపుల్లో సైతం రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శించి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకా అనేకమంది రైతులకు నష్టపరిహారం అందలేదు. మార్కెట్ ధర ప్రకారం ఈ భూములు ఎకరానికి మూడు నుండి నాలుగు లక్షల రూపాయల వరకు రేటు పలుకుతుంటే, ప్రభుత్వం మాత్రం గరిష్టంగా లక్షా 20 వేలతోనే సరిపెట్టుకుందని పట్టా భూముల రైతులు వాపోతున్నారు. కాగా, భూములను సెజ్ పేరిట స్వాధీనం చేసుకుని ఐదేళ్లు పూర్తి కావస్తుండగా, ఆ స్థలంలో ప్రైవేట్ కంపెనీ వారు చుట్టూ కందకం తవ్వి వదిలేశారు. సెజ్ భూముల్లో ఇంతవరకు సదరు కంపెనీ వారు పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టలేదు.

రాష్ట్ర మంత్రివర్గం నుండి కళంకిత మంత్రులను కేబినెట్ నుండి తొలగించాలని
english title: 
effigy

‘సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలి’

$
0
0

విజయనగరం , మే 16: ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా యువజన, విద్యార్థి విభాగాలు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో తోటపాలెంలో ఏర్పాటైన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి విభాగాల సభ్యులను పార్టీ కండువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు బొత్స నాయకత్వం పట్ల, పార్టీ పట్ల యువత ఆకర్షితులై పార్టీలోకి యువత వస్తున్నారన్నారు. యువజన విభాగాల ఏర్పాటు వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌రాజు, మాజీ కౌన్సిలర్ కరణం గంగాధరరావు, 14వ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ శ్రీనివాసరావు, కార్యదర్శి సుంకర శంకరరావు, ఎన్‌ఎస్‌యుఐ విభాగం అధ్యక్షుడు కె.మహేష్, కార్యదర్శి కంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.

చల్లబడిన వాతావరణం.. అరటి పంట ధ్వంసం
పార్వతీపురం, మే 16: పట్టణంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. గ్రీష్మతాపంతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షం కొంత ఊరట కలిగింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొద్దిపాటి వర్షం కురడంతో వాతావరణం చల్లబడినప్పటికీ ఈదురు గాలులు కారణంగా
పార్వతీపురం, కొమరాడ తదితర ప్రాంతాల్లోని అరటి పంటలు ధ్వంసమయ్యాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన అరటి పంట ధ్వంసం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటనష్టాలు అంచనావేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

‘బొబ్బిరి రైల్వే స్టేషన్‌లో మరిన్ని సౌకర్యాలు’

బొబ్బిలి, మే 16: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని రైల్వే డి.సి.ఎం. రమణారావు ఆదేశాలు జారీచేశారు. రైల్వేస్టేషన్ పనితీరును గురువారం పరిశీలించారు. ప్లాట్‌ఫారం, రైల్వేస్టేషన్, ప్రయాణికుల గదిని పరిశీలించారు. ఈ మేరకు పలు రకాలైన సూచనలు, సలహాలు అందించారు. స్టేషన్‌లో పారిశుద్ధ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. స్టేషన్ బోర్డులు మరమ్మతులకు గురయ్యాయని, వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టిక్కెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులను ఇబ్బందులు పెట్టకుండా టిక్కెట్‌తోపాటు మిగిలిన చిల్లర అందించాలన్నారు. కౌంటర్ వద్ద ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలన్నారు. రైల్వే ట్రాక్‌లపై పనికిరాని వ్యర్థపదార్ధాలు, కాగితాలు వేయరాదన్నారు. రైల్వే సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే మాస్టర్ కమలేష్‌కుమార్ ద్వారా స్టేషన్‌లో ఉన్న సమస్యలను అడిగితెలుసుకున్నారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ప్రయాణీకులకు సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. ఈయనతోపాటు చీఫ్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, రైల్వే బోర్డు సభ్యులు నంబియార్ వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

‘రూప్‌కార్డు అమలుకు డిసిసిబి సన్నాహాలు’
బొబ్బిలి, మే 16: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉన్న అన్ని బ్రాంచిలలోను రైతుల సౌకర్యం కోసం రూప్‌కార్డు(ఎ.టి.ఎం.) విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నామని డి.సి.సి.బి. సి.ఇ.ఒ డి.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. స్థానిక వెలమ సంక్షేమ సంఘం కళ్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 16 బ్రాంచ్‌లున్నాయని, 94 పిఎ.సి.ఎస్.లున్నాయన్నారు. ఈ బ్రాంచిలలో రైతులు, ఖాతాదారుల సౌకర్యార్థం ఏ.టి. ఎం. సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని ద్వారా రైతులు, ఖాతాదారులు నేరుగా డబ్బులు స్క్రాచ్ చేసి డబ్బులు తీసుకోవచ్చునన్నారు. దీని ద్వారా ఎటువంటి అవకతవకలు చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. గత ఏడాది డి.సి.సి.బి. ద్వారా రబీ సీజన్‌కు 135కోట్ల రూపాయలు రైతులకు అందించామన్నారు. వీటిని జూన్‌లోగా చెల్లించిన పక్షంలో జీరోశాతం వడ్డీ వర్తిస్తుందన్నారు. 68వేల మంది రైతులకు రుణాలు అందించామన్నారు. ఈ మొత్తంలో 12కోట్ల రూపాయలు 13వేలమంది కొత్తరైతులకు అందించామన్నారు. గత ఖరీఫ్‌లో 30కోట్ల రూపాయలు రుణాలు అందించామన్నారు. ఈ ఏడాది డి.సి.సి.బి. ద్వారా 140కోట్ల రూపాయలు రుణాలుగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. డి.సి.సి.బి.కి జాతీయస్థాయి గుర్తింపుకోసం ప్రతిపాదించామన్నారు. దీని ద్వారా జాతీయస్థాయిలో ఎక్కడైన బ్యాంకు లావాదేవీలు కొనసాగించవచ్చునన్నారు. 70వేలమంది డిపాజిట్‌దారులున్నట్లు తెలిపారు. 44కోట్ల 64లక్షలు డిపాజిట్లు ఉన్నాయన్నారు. అలాగే 17కోట్ల రూపాయలు 6వేలమంది లబ్ధిదారులకు బంగారంపై రుణాలు అందించామన్నారు. బ్యాంకుల్లో ఎన్.వై.సి. సిస్టం అమలు చేస్తామన్నారు. దీని ద్వారా ఖాతాదారులకు సంబంధించిన ఐ.డి. కార్డులు, ఆదార్‌కార్డులు, తదితరవి బ్యాంకుకు అందించాలని కోరారు. లేనిపక్షంలో వారి ఖాతాలను నిలుపుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డి.సి.సి.బి. డి.జి. ఎం. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇంటి యజమానురాలే దొంగ..
విజయనగరం , మే 16: ఇంటిని రక్షించుకోవాల్సిన ఆ ఇల్లాలు భర్తపై కక్షగట్టి, ఓ వ్యక్తి సహాయంతో తన ఇంటికే కన్నం వేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని, అనుకున్న పథకం ప్రకారం తన పనికానిచ్చేసింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సహాయంతో దొంగలించిన చోరీ సొత్తును అమ్ముతుండగా పోలీసులకు పట్టుబడ్డంతో ఆ ఇల్లాలితోపాటు ఆమెకు సహకరించిన నిందితుడు సైతం జైలు పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ కార్తికేయ గురువారం తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలో అలకనందా కాలనీకి చెందిన ఇమంది కళ్యాణ చక్రవర్తి, భార్య కళ్యాణిల మధ్య గొడవలున్న నేపధ్యంలో కళ్యాణి తన ఇంట్లో దొంగతనం చేసేందుకు సిర్ణయించుకుంది. ఈ మేరకు పట్టణంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన పాత నేరస్థుడు ఇసుకుపల్లి శ్రీను అలియాస్ చంటి అలియాస్ కలకత్తా శ్రీను తన ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంది. ఇందుకోసం శ్రీనుకి 40 వేల రూపాయలు ఇచ్చేందుకు ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈ నెల 1న కళ్యాణి భర్త చక్రవర్తి ఇంట్లో లేని సమయం చూసి నిద్రమాత్రలు తేవాల్సిందిగా శ్రీనుకి ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో శ్రీను ఒకమెడికల్ షాపు నుంచి నిద్రమాత్రలు కొనుగోలు చేసి కళ్యాణికి అందజేశాడు. దీంతో కళ్యాణి తన భర్త చక్రవర్తి ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో ఉన్న తన అత్తమామలకు తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది. దీంతో అత్తమామలు గాఢ నిద్రలో ఉండటంతో పథకం ప్రకారం శ్రీనుని ఇంట్లోక రప్పించి, అత్త వద్ద ఉన్న బంగారు నగలను కళ్యాణి స్వయంగా తీసి రెండు బంగారు గాజులను తన వద్ద ఉంచుకొని మిగిలిన ఆభరణాలను అమ్మేందుకు శ్రీనుకి అప్పగించింది. దొంగలించిన ఆ నగలను శ్రీను అమ్మేందుకు అవకాశం కుదరలేదని కళ్యాణికి సమాచారం ఇవ్వడంతో వీరిద్దరూ కలిసి దొంగలించిన ఆ నగలను ఈ నెల 15న పట్టణంలో మంగళవీధి నూకాలమ్మ ఆలయం సమీపంలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంతో చోరీ సొత్తుతోపాటు ఒక హత్యాయత్నాన్ని నివారించగలిగారు. కళ్యాణి మామ తన ఇంట్లో 14 తులాల బంగారు నగలు అపహరణకు గురైనట్లు దొంగతనం జరిగిన మరుసటిరోజు ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. అనతికాలంలోనే కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న సిసిఎస్ సిఐతోపాటు సిసిఎస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

‘ఇందిరమ్మ పచ్చతోరణం ద్వారా 5వేల మందికి ఉపాధి’
విజయనగరం , మే 16: జిల్లాలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం ద్వారా అయిదువేల మందికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అన్వయిస్తూ ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9,400 చెరువులు ఉన్నాయన్నారు. చెరువుల హద్దులను గుర్తించి మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో పది మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు
ఉన్నాయని, ట్యాంకు బండ్ పాడవుకుండా ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటాలని సూచించారు. గ్రామీణ రహదార్లల్లో మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం పథకంలో భాగంగా ఒక్కొక్క లబ్థిదారుని కుటుంబానికి 200 మొక్కలను సరఫరా చేయాలన్నారు. జిల్లాలో సుమారు నాలుగువేల కిలోమీటర్ల నిడివి ఉన్న రోడ్డు మార్జిన్లలో మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించి రెండువేల మందికి లబ్థి చేకూర్చాలన్నారు. అదేవిధంగా చెరువుగట్లను గుర్తించి వేయి మందికి, నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాంతాల్లో వేయిమందికి, ఖాళీస్థలాలను గుర్తించి మరో వేయి మందికి లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆదేశించారు. స్థలాలను, లబ్థిదారులను గుర్తించే బాధ్యత గ్రామస్థాయి కమిటీలు చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖలు రెండువేల మంది లబ్ధిదారులను, నీటిపారుదల శాఖ రెండువేల మంది లబ్ధిదారులను, తహాశీల్దార్లు వేయి మందికి లబ్ధిదారులను ఎంపిక చేసి పచ్చతోరణం పథకం విజయవంతమయ్యేందుకు బాధ్యత వహించాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.ఎ.శోభ, అదనపుజాయింట్‌కలెక్టర్ యుజిసి నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఒ ఎన్.మోహన్‌రావు,ఐటిడిఎ ప్రాజెక్టు అంబేద్కర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతి, డ్వామా ప్రాజెక్టుడైరెక్టర్ శ్రీరాములనాయుడు, ఐసిడిఎస్ ప్రాజెక్టుడైరెక్టర్ రాబర్ట్స్, పార్వతీపురం ఆర్డీఒ వెంకటరావుతదితరులు పాల్గొన్నారు.
వేసవిలోనూ జలకళతో తాటిపూడి
గంట్యాడ, మే 16 : మండు వేసవిలో కూడా తాటిపూడి జలాశయం నీటి మట్టం నిలకడగానే ఉంది. గురువారం నాటికి 291 అడుగుల నీటి మట్టం ఉంది. గత ఏడాది ఇదే తేదీ నాటికి 282 అడుగులు నీరు ఉండేది. జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 297 అడుగులు, ఈ ఏడాది మే మూడవ వారానికి కూడా తాటిపూడినీటి మట్టం 291 అడుగుల వద్ద నిలకడగా ఉండటంతో ఖరీఫ్ అవసరాలకు సాగునీటి సమస్య ఉండదని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రేంజ్ పరిధిలో
11 మంది సిఐలకు స్థాన చలనం
విశాఖపట్నం, మే 16: విశాఖ రేంజ్ పరిధిలోని పలువురు సిఐలకు స్థాన చలనం కలిగిస్తూ డిఐజి స్వాతిలక్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని ఇంటిలిజెన్స్‌లో ఉన్న సిఐ పి.కోటేశ్వరరావును నగరానికి బదిలీ చేశారు. విశాఖలోని సిఐడి విభాగంలో ఉన్న సిఐలు పి.వి.వి.నరసింహరావు, ధనుంజయనాయుడు, తిరుపతిరావులను కూడ సిటీకి బదిలీ చేశారు. అలాగే డిఐజి కార్యాలయంలో వి.ఆర్.లో ఉన్న బి.మోహనరావును, పొత్తూరు సిఐ ఎడమ్స్‌ను నగరానికి బదిలీ చేశారు. విజయనగరం జిల్లా ఎల్విన్‌పేట పోలీసు స్టేషన్‌లో సిఐగా విధులు నిర్వహిస్తున్న పి.ఈశ్వరరావు, స్పెషల్‌బ్రాంచ్‌లో ఉన్న సిఐ జెఎస్‌ఎన్ కొండ లను విశాఖ సిటీకి బదిలీ జరిగింది. జిల్లాలోని అనకాపల్లి పోలీసు స్టేషన్‌లో సిఐగా విధులు నిర్వహిస్తున్న సిఐ గోవిందరావును డిఐజి కార్యాలయంలోని వి.ఆర్.లో ఉంచారు. అరుకు సిఐ జి.శ్రీనివాసరెడ్డిని అనకాపల్లి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయగా, విశాఖ సిటీలోని వి.ఆర్.లో ఉన్న వై.మురళీరావును అరకు సిఐగా బదిలీ చేశారు.
‘అక్షరాస్యత....ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత’
విజయనగరం , మే 16: జిల్లాలో అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించి శతశాతం అక్షరాస్యత సాధనకు కృషి చేయాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ల వయస్సు దాటినవారిని ప్రాథమిక అక్షరాస్యులు తీర్చిదిద్దేందుకు ఇంటింటి సర్వే నిర్వహించి 7.39 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామన్నారు. మొదటిదశలో 1.50లక్షల మందిని, రెండోదశలో 4.50 లక్షల మందిని సాక్షరభారత్ కార్యక్రమం ద్వారా ఓపెన్ స్కూల్ పరీక్షలకు పంపగా, 88.65శాతం ఉత్తీర్ణత సాధించారని గుర్తు చేశారు. అయితే గత 18 ఏళ్లుగా కృషి చేస్తున్నప్పటికీ జిల్లా 22వస్థానంలో ఉంటడం ఆందోళనకరమన్నారు. ఆగస్టులో నిర్వహించనున్న ఓపెన్‌స్కూల్ పరీక్షకు మిగిలిన 1.39 లక్షల మందిని పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విధంగా తీర్చిదిద్దాలన్నారు. జాయింట్ కలెక్టర్ పిఎ శోభ, అదనపుజాయింట్‌కలెక్టర్ యుజిసి నాగేశ్వరరావు, జెడ్పీ సిఇఒ మోహన్‌రావు, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు డైరెక్టర్ అంబేద్కర్, డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతి, డ్వామా పిడి శ్రీరాములనాయుడు తదితరులు పాల్గొన్నారు.
‘వ్యవసాయ ఉపకరణాలను
సద్వినియోగం చేసుకోండి’
గంట్యాడ, మే 16 : వ్యవసాయ పనిముట్లు సేవా కేంద్రం క్రింద సబ్సిడీతో ఇస్తున్న వ్యవసాయ ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాశాఖ సహాయ సంచాలకులు ఎల్. విజయ అన్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతు సంఘాలకు 2 లక్షల రూపాయల రాయితీతో కూడిన 6 లక్షలు విలువైన వ్యవసాయ పరికరాలను గురువారం ఆమె పంపిణీ చేశారు. కొండతామరాపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ్మ రైతు గ్రూపునకు పవర్ టిల్లర్లు, దుక్కు సెట్టు, తార్పాన్లు, 82,095 రూపాయలు రాయితీతో అందజేశారు. అలాగే గింజేరు శివశంకర్ రైతుసంఘానికి పవర్‌టిల్లర్లు, టెంటు పరదారు, స్పెయర్లు, దుక్కు సెట్టు, 70 వేల రూపాయల రాయితీతో అందజేసారు. బొనంగి బూలోక మాత సంఘానికి పవర్‌టిల్లర్, దుక్కు,దమ్ముసెట్లు, రాయితీతో అందజేశారు. చినమానాపురం, కిట్టుపర్తి, నీలావతి, గ్రామాలకు చెందిని రైతులకు టార్పాలిన్లు అందజేసారు. మండల వ్యవసాయాధికారి బి.శ్యామ్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి పాల్గొన్నారు.
‘సహకార చట్టాలపై అవగాహన అవసరం’
బొబ్బిలి, మే 16: సహకార చట్టాల పట్ల పి.ఏ.సి.ఎస్. సభ్యులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవల్సిన అవసరం ఉందని డి.సి.సి.బి. చైర్‌పర్సన్ తులసి కోరారు. స్థానిక వెలమ సంక్షేమ సంఘం భవనంలో గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సొసైటీల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘాల నిర్వహణ, అభివృద్ధి, తదితర విషయాలపై అవగాహన పెంపొందించుకుని రైతులకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా డి.సి.సి.బి. సి.ఇ.ఒ. వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధిపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ప్రస్తుతం సహకార సంఘాల పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సహకార యూనియన్ ప్రాంతీయ విద్యాధికారి కె.శ్రీనివాసరావు, సహకార శిక్షణా కళాశాల అధ్యాపకులు ఆర్.శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావులతోపాటు డి.సి.సి.బి. డైరెక్టర్లు సింహాచలంనాయుడు, చిట్టిబాబు, మల్లేశ్వరరావు, డి.సి.ఎం.ఎస్. వైస్ చైర్మన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి’
గజపతినగరం, మే 16 : జగన్ జైలు నుండి బయటికి వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయనే ఉద్దేశ్యంతోనే బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని వైకాపా నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్సార్ సిపి నేత షర్మిల పాదయాత్ర చేపట్టి గురువారానికి 2000 కిలోమీటర్లకు చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని సంఘీభావం తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్ చేసి కార్యకర్తలు, నాయకులకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండి ఎదుర్కొవడానికి సైనికుల్లా పనిచేయాలన్నారు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైకాపా నాయకులు డా.ఎస్.పెద్దినాయుడు మక్కువ శ్రీ్ధర్, శీరంరెడ్డి శారదానాయుడు, మిత్తిరెడ్డి వెంకటరమణ, గార రమణ, గుంట్రోతు గోవింద, మిత్తిరెడ్డి గౌరినాయుడు పాల్గొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు
english title: 
welfare

ఇక జోరుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!

$
0
0

ఒంగోలు, మే 16: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం గృహాల నిర్మాణానికి అంచనాలను పెంచటంతో నూతనంగా గృహాలను నిర్మించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుండి ఇంతవరకు జిల్లాలో 28వేల గృహాలను నిర్మించలేదు. కాగా జిల్లాలో 18వేల గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నట్లు గృహనిర్మాణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ గృహానికి గ్రామీణ ప్రాంతాల్లో 45వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 55వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలకు అంచనాలను పెంచింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఒసి, బిసిలకు 75వేల రూపాయలు, ఎస్‌సిలకు లక్ష రూపాయలు, ఎస్‌టిలకు లక్షా ఐదువేల రూపాయలను మంజూరు చేయనున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఒసి, బిసిలకు 80వేల రూపాయలు, ఎస్‌సిలకు లక్ష రూపాయలు, ఎస్‌టిలకు లక్షా ఐదువేల రూపాయలను మంజూరు చేయనున్నారు. దీంతో జిల్లాలో గృహనిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. గతంలో నిర్మిస్తున్న వాటికి బేస్‌మెంట్ వేసిన లబ్ధిదారులకు ఎంత నగదు ఇవ్వాలి, రూఫ్‌లెవెల్ ఉంటే ఎంత, శ్లాబువేసి ఉంటే ఎంత నగదు మంజూరు చేయాలనే విషయంపై స్పష్టత రానున్నట్లు గృహనిర్మాణ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈనెల 21వ తేదీన రాజధానిలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈసమావేశానికి జిల్లాలోని ఎంపిలు, శాసనసభ్యులు, జిల్లాకలెక్టర్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. ఈసమావేశంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణ స్ధితిగతులపై పూర్తిస్ధాయిలో మంత్రి చర్చించే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా ప్రస్తుతం ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తున్న లబ్ధిదారులకు రెండు నెలల నుండి బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని అమలు చేస్తుండటంతో ముందుగానే బిల్లులను నిలిపివేసినట్లు సమాచారం. మొత్తంమీద జిల్లాలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం శరవేగంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

మూడు సొసైటీలకు 21న ఎన్నికలు
ఒంగోలు, మే 16: జిల్లాలోని మూడు సహకార సంఘాలకు ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని సంతమాగులూరు, వల్లాపల్లి, సజ్జాపురం సొసైటీలకు సంబంధించి గతంలోనే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం, పోటీలో ఉన్న అభ్యర్థుల ఉపసంహరణ శనివారం ఉంటుందన్నారు. అనంతరం 21వ తేదీన ఎన్నికలు జరుగుతాయని జిల్లా కో ఆపరేటివ్ అధికారి కొండయ్య ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత ఈనెల 28వ తేదీన డిసిసిబి పాలకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు సొసైటీల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీల నేతలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. కాగా బ్యాంకు పాలకవర్గానికి గ్రీన్‌సిగ్నల్ రావటంతో చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం.

పామూరులో గాలివాన బీభత్సం
పామూరు, మే 16: పామూరు పట్టణంలో గురువారం అరగంటసేపు గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పామూరు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. పట్టణంలోని అనేకచోట్ల చెట్లు విరిగిపడి బంకులపై రేకులు లేచిపోయాయి. మండలంలోని బత్తాయి, నిమ్మ రైతులకు గాలుల దాటికి తీవ్రంగా నష్టపోయారు. లక్ష్మీనరసాపురం- మోపాడు మధ్యలో పది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
తృటిలో తప్పిన ప్రమాదం
గురువారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో వీచిన పెనుగాలుల కారణంగా స్థానిక మమ్మిడాడి సెంటర్ ఎదురుగా ఉన్న చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. అప్పుడే నెల్లూరు నుంచి పామూరుకు వచ్చిన బస్సు ప్రయాణికులను దించుతున్న సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు బస్సుపై పడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారలు చేస్తూ భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ చెట్టు విరిగిపడిన మరుక్షణమే పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో అనేక మంది ప్రాణాలు నిలబడ్డాయి. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా చేపల మార్కెట్ పక్కన ఉన్న భారీ చెట్లు నేలకొరిగాయి.

సమన్వయ కమిటీలో సమన్వయలోపం
* సభ్యత్వ నమోదులో ఎవరికివారే యమునాతీరే
* వైఎస్‌ఆర్‌సిపి నేతల తీరుపై కార్యకర్తల ఆందోళన
మార్కాపురం, మే 16: నియోజకవర్గస్థాయిలో కార్యకర్తలను సమన్వయపరచి పార్టీని ముందుకు నడిపించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలోనే సమన్వయం లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మార్కాపురం నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సమన్వయ కమిటీ సభ్యులుగా మాజీఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, విద్యాసంస్థల అధినేత వెన్నా హనుమారెడ్డిలను అధిష్ఠానం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఏకమై కార్యకర్తలను కలుపుకొని పోవడంలో విఫలం కావడంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగుజారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిని సమన్వయ కమిటీ సభ్యులుగా నియమింపక ముందే మాజీఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, వెన్నా హనుమారెడ్డి ఒక వర్గంగా, జంకె వెంకటరెడ్డి ఒక వర్గంగా వ్యవహరిస్తుండేవారు. ఎవరైనా వైఎస్‌ఆర్‌సిపి అధినాయకులు మార్కాపురం వచ్చిన సమయంలో ఒకవర్గం హాజరైతే, మరోవర్గం ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం ఆనవాయితీ. ఈ పరిస్థితుల్లో ఈ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినప్పుడే నియోజకవర్గ కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా ముగ్గురు కలిసి సమష్టిగా నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. ఎవరికివారే యమున తీరులా మాజీఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మార్కాపురం ప్రాంతంలో, ఉడుముల శ్రీనివాసులరెడ్డి పొదిలి ప్రాంతంలో, వెన్నా హనుమారెడ్డి తర్లుపాడు మండలంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ముగ్గురు సమష్టిగా కాకుండా ఎవరికివారు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడంతో కార్యకర్తల పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఐక్యమత్యం లోపించి నియోజకవర్గకేంద్రమైన మార్కాపురం సహకార సంఘానికి అభ్యర్థిని రంగంలో దింపలేకపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి మార్కాపురం నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం ఖాయమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం సమన్వయ కమిటీ నియామకం సమయంలోనే ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని సభ్యులుగా నియమించడంలో తప్పటడుగు వేసిందనే భావనతో కొందరు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం దృష్టి సారించి కమిటీని సమన్వయం చేయకపోతే పార్టీ బలోపేతం కావడం కష్టమని కార్యకర్తలు బహిరంగంగా ముక్తకంఠంతో అంటున్నారు.

పరిస్థితుల్ని చక్కదిద్దుతాం
పొగాకు బోర్డు ఆర్‌ఎం అన్సారి అహ్మద్ హామీ
పొదిలి, మే 16: పొదిలి పొగాకు వేలం కేంద్రాల్లో తలెత్తిన సమస్యల్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ అన్సారి అహ్మద్ తెలిపారు. గురువారం ఆయన పొదిలి పొగాకు బోర్డును సందర్శించి రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. ఈసందర్భంగా ఆయన దృష్టికి వ్యాపారులు, రైతులు పలు సమస్యలను తీసుకొచ్చారు. పొదిలి వేలం కేంద్రాల్లో వ్యాపారులు అతి తక్కువ ధరకు పొగాకును కొనుగోలు చేస్తున్నారని, ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో అదే నాణ్యత గల పొగాకుకు కిలో 15 రూపాయల వరకు వ్యత్యాసం ఉందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇకపై అలాంటివి జరుగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు చైర్మన్, ఈడి, ఉన్నతాధికారులు కూడా పొగాకు కంపెనీల యాజమాన్యాలతో ధరల విషయంపై మాట్లాడుతున్నారని ఆర్‌ఎం రైతులకు నచ్చజెప్పారు. అందువల్ల వేలం కేంద్రాలను ప్రారంభించాలని కోరగా రైతులు కొంతసేపు మొండికేశారు. చైర్మన్ పొదిలి వస్తేనే తప్ప తాము పొగాకు కొనుగోళ్లు సాగనివ్వమని రైతులు తెలిపారు. పరిస్థితిని గమనించిన పొగాకు బోర్డు సభ్యులు భద్రిరెడ్డి కూడా ఆర్‌ఎంతో కలిసి రైతులకు నచ్చజెప్పడంతో వారు వేలం నిర్వహించేందుకు అంగీకరించారు. వెంటనే ఆర్‌ఎం స్థానిక రెండో వేలం కేంద్రాన్ని ప్రారంభించి దగ్గరుండి ధరలను పరిశీలించారు. దీంతో వ్యాపారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

సంతనూతలపాడు వైఎస్‌ఆర్‌సిపిలో
నేతల మధ్య పోరు
నేనే ఇన్‌చార్జి:దారా సాంబయ్య
సమన్వయకర్తగా పనిచేస్తున్నా:అమృతపాణి
ఒంగోలు, మే 16: నేతల అంతర్గత కుమ్ములాటలతో సతమతవౌతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తసమస్య తెరపైకి వచ్చింది. సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్త నియామకం ఇంతవరకు జరగలేదని అంతవరకు తానే ఇన్‌చార్జినని మాజీ శాసనసభ్యుడు దారా సాంబయ్య ప్రకటించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాను రెండుసార్లు జైలులో కలిసినప్పుడు తనను నియోజకవర్గ బాధ్యతలను నిర్వహించమన్నారని ఆయన గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. గతంలో హైదరాబాదులో జరిగిన సమన్వయకర్తల నియామక సమావేశంలో తన కూతురు దారా పద్మజ, డాక్టర్ అమృతపాణికి సమన్వయకర్తల నియామకపత్రాలను పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అందజేశారన్నారు. తన కూతురు పక్షాన సమన్వయకర్తగా పత్రాన్ని తాను తీసుకున్నానన్నారు. అనంతరం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో పాల్గొన్నానని పేర్కొన్నారు. తాను వైఎస్‌ఆర్‌సిపి ఏర్పాటుచేసిన నాటి నుండి పార్టీలో పనిచేస్తున్నానని పార్టీ నాయకత్వానికి వివరించినట్లు తెలిపారు. వైఎస్ జగన్ సంతనూతలపాడు నియోజకవర్గ బాధ్యతలను తనను చూడమన్నారని, తన కుమార్తె అమెరికాలో ఉంటున్నందున ఇక్కడికి రాలేదన్నారు. పార్టీలో ప్రమేయం లేని ఆరోజే ఆదరాబాదరగా సభ్యత్వం తీసుకుని సమన్వయకర్తల మీటింగ్‌కు వచ్చిన అమృతపాణి నియామకాన్ని రద్దుచేయమని తనను మాత్రమే సమన్వయకర్తగా ఉంచాలని పార్టీ నాయకత్వానికి విన్నవించానని ఆయన తెలిపారు. దీంతో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తల నియామకాన్ని నాయకత్వం పెండింగ్‌లో ఉంచిందని ఆయన వివరించారు. సంతనూతలపాడు సమన్వయకర్త నియామకం పెండింగ్‌లో ఉండటంవలన ఇప్పటివరకు ఎవరూ సమన్వయకర్త కాదని ఆయన పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తనకు జైల్లో చెప్పినట్లుగానే తాను సంతనూతలపాడు నియోజకవర్గానికి సమన్వయకర్తను తానేనని ఆయన వివరించారు. ఈవిషయం ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు కూడా తెలుసనని ఆయన గుర్తుచేశారు. పార్టీ అధిష్ఠానం ఇంతవరకు సమన్వయకర్తను నియమించనప్పటికి కొంతమంది హంగు ఆర్భాటాలతో, రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులమని ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో అస్పష్టత సృష్టించి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి స్వార్ధ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలాఉండగా నియోజకవర్గంలో సమన్వయకర్తగా తాను పనిచేసుకుంటు పోతున్నానని అమృతపాణి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. వైఎస్ విజయమ్మ చేతులమీదుగా తాను నియమాకపత్రాన్ని అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో వీరిద్దరి మధ్య అసెంబ్లీ సీటు విషయంపై కోల్డ్‌వార్ జరుగుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపధ్యంలో నేతల మధ్య సఖ్యత లేకపోతే ఆప్రభావం ఎన్నికలపై పడే అవకాశాలున్నాయని పార్టీనేతలు పేర్కొంటున్నారు.

వేట లేదు.. భుక్తి లేదు
అందని ప్రభుత్వ సాయం
దయనీయంగా మత్స్యకారుల జీవనం
చీరాల, మే 16: జిల్లాలో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. కడలిని నమ్ముకున్న వారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. దీనికి కారణం గత 30 రోజులుగా వేట లేకపోవటంతో పూటగడవటం కష్టంగా మారింది. ప్రతి సంవత్సరం మత్స్యసంపద పునరుత్పత్తికోసం ప్రభుత్వం 60 రోజులపాటు వేట నిషేధాన్ని విధిస్తోంది. ప్రస్తుతం ఈ సమయాన్ని 45 రోజులకు కుదించింది ప్రభుత్వం. ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతి ఏడాది కుటుంబానికి 31 కిలోల బియ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 1200 రూపాయలు అందజేస్తుంటారు. వేట నిషేధించి నెల రోజులు కావస్తున్నా ఈ సమయంలో వారికి భృతి కల్పించాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వారికోసం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కూడా పడకేశాయి. పునరావాస, పొదుపు పథకం అంతంతమాత్రంగానే మారాయి. ఈ సమయంలో ఉపాధి పనులు కల్పించాలని వారు చేసుకున్న వినతులను సైతం అధికారులు పట్టించుకోవటంలేదు. కొన్ని మత్స్యకార గ్రామాలలో ఒక్క జాబ్‌కార్డును కూడా ఇవ్వలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క, ప్రభుత్వం నుంచి సాయం అందక గంగపుత్రులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సంకటంగా మారింది. గత నెల 15 నుంచి వేట నిషేధం అమలులో ఉండటంతో పూటగడవటం కూడా కష్టంగా మారిందంటున్నారు మత్స్యకారులు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారంలో కూడా జాప్యం జరుగుతోంది. యేటా ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే 31 కిలోల బియ్యం నేటికీ పంపిణీ జరగలేదు. జిల్లాలో మొత్తం 102 కిలోమీటర్ల సముద్రతీరంలో 72 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో నివసించేవారిలో ఎక్కువమంది చేపలు వేటే జీవనాధారం. కాని కొంతకాలంగా జాలర్ల పరిస్థితి ఒడ్డునపడ్డ చేపలా తయారైంది. మత్స్యకారులకు పరిహారం అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క, ప్రభుత్వం నుంచి సాయం అందక గంగపుత్రులు గగ్గోలు పెడుతున్నారు. వేట నిషేధ సమయంలో తమిళనాడు రాష్ట్ర తరహాలో ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజిని అమలు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. వేటనిషేధ సమయంలో తమిళనాడు ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేస్తోందని అదికూడా సరిపోవటంలేదని దానిని రెట్టింపు చేయాలని అక్కడి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నట్లు పలువురు మత్స్యకారులు తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు అందులో సగం సహాయం కూడా అందటంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేట నిషేధ సమయాల్లో తమిళనాడు రాష్ట్ర తరహాలో ప్రత్యేక ప్యాకేజిని అమలు చేయటంతోపాటు ఉపాధి హామీ పనులు కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

సినిమా థియేటర్లను సక్రమంగా నిర్వహించాలి
జాయింట్ కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, మే 16: జిల్లాలోని సినిమా థియేటర్లను సక్రమంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశించారు. జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులతో గురువారం స్థానిక సిపివో కాన్ఫరెన్స్ హాలులో సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ మాట్లాడుతూ సినిమా థియేటర్లకు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వస్తారని, థియేటర్లలో ఆహ్లాదకర వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి థియేటర్‌ను తప్పనిసరిగ్గా రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. దీంతో థియేటర్ల యజమానులు కలుగజేసుకొని మాట్లాడుతూ తాము చాలా వరకు థియేటర్లను రెన్యువల్ చేసుకున్నామని తెలిపారు. ఇంకా 7,8 థియేటర్లు రెన్యువల్ చేసుకోవాల్సి ఉందని, ఇప్పటికే ఒరిజనల్ బి ఫారాలను ఆర్డీవో కార్యాలయంలో ఇచ్చామని తెలిపారు. అయితే ఆ బి-్ఫరాల కాపీ కనిపించడం లేదని చెబుతూ రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని, తమ వద్ద జిరాక్స్ కాపీలు ఉన్నందున వాటిమీద రెన్యువల్ చేయాలని జెసిని థియేటర్ల యజమానులు కోరారు. దీనిపై స్పందించిన జెసి త్వరలో ఆర్టీవోతో మాట్లాడి స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సినిమా థియేటర్లలో ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధరలకు కూల్‌డ్రింక్స్ అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఎంఆర్‌పికే వాటిని అమ్మాలని ఆదేశించారు. అధిక రేట్లకు విక్రయాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్త్ ఇన్‌స్పెక్టర్లు థియేటర్లలోని ఆహారపదార్థాలు తనిఖీ నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా అగ్నిమాపక అధికారులు థియేటర్లలో ప్రమాదాలకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా పౌరసంబంధాల శాఖ ముద్రించిన ప్రభుత్వానికి చెందిన 7 సంక్షేమ పథకాలకు చెందిన వాల్‌పోస్టర్‌ను సమావేశంలో జెసి ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి థియేటర్‌లో సినిమాకు ముందు ప్రదర్శించి ప్రజలకు అవగాహన కలిగే విధంగా చూడాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్‌వో డి పూర్ణచంద్రరావు, డి హరనాధ్‌బాబు, మున్సిపల్ అధికారులు, తూనికలు కొలతల అధికారులు, థియేటర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జిల్లాలో
english title: 
houses

నత్తనడకన ఆధునీకరణ

$
0
0

శ్రీకాకుళం, మే 16: ఆరుగాలం కష్టపడే అన్నదాతలను సాగునీటి కష్టాలు వెంటాడటంతో ప్రతీఏటా వరిపంట కలసిరాక వ్యవసాయ మదుపుల పేరిట తీసుకున్న రుణాలు వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నారాయణపురం కుడికాలువ శివారు గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాది కూడా సాగునీటి ఇబ్బందులు తప్పేటట్లు లేదు. నారాయణపురం కుడికాలువ పరిధిలో గల సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 18,306 ఎకరాలకు సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 6.84 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పనులు నిర్వహణకు 2010, ఏప్రిల్‌లో టెండర్లు ఖరారు చేశారు. ఈ టెండర్లను కడపకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకుని 3.9 కోట్ల రూపాయలను ఖర్చుచేసి మిగిలిన పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఇంతలోనే కాంట్రాక్టర్ ఆకస్మికంగా మృతిచెందడంతో ఆధునీకరణ పనులు ముందుకు సాగలేదు. గత ఏడాది కూడా పనులు ప్రారంభిస్తారని రైతులు ఆశగా ఎదురుచూసినప్పటికీ అది జరుగకపోవడంతో సాగునీటి కష్టాలు టైలాండ్ రైతులను వెంటాడటమే కాకుండా తీవ్రంగా పంటనష్టానికి గురిచేశాయి. 50.5 కిలోమీటర్ల పొడవు గల ప్రధాన కాలువ సాగునీటి సరఫరా పర్యవేక్షించేందుకు గ్రావెల్‌రోడ్డు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. అలాగే వరదలు సంభవించినప్పుడు అనేక చోట్ల కాలువ గట్లుకు గండిపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రక్షణ గోడలు కూడా నిర్మాణానికి నోచుకోలేదు. శిథిలావస్థకు చేరిన 22 మదుములు పునరుద్ధరించి బ్రాంచ్ ఛానెల్‌కు నీరందించాల్సి ఉన్నప్పటికీ అవి నేటికీ పూర్తికాలేదు. సంతకవిటి మండలంలో ఆధునీకరణ పనుల్లో భాగంగా డిక్యూ నిర్మాణం జరుగకపోవడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు ప్రశ్నార్ధకంగా మారింది. ఇరిగేషన్ అధికారుల గణాంకాలు ప్రకారం 3.9 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు, మిగిలిన మొత్తంతో ఆధునీకరణ పనులు పూర్తిచేయాల్సి ఉందని స్పష్టంచేస్తున్నా..ఈ పనులు దక్కించుకున్న నాటికి ఉన్న ధరలకు మిగిలిన ఆధునీకరణ పనులు పూర్తిచేసేందుకు తాజాగా గుత్తేదారులెవరూ ముందుకు రావడం లేదని, అందువల్లే పనులు పునఃప్రారంభం కాలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఆధునీకరణ పనులు పూర్తిచేయాల్సిన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం అవేవీ పట్టని చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా మిగిలిన పనులు పూర్తిచేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సిడిఆర్ నిధులతో అరకొర పనులు
పదవీకాలం ముగిసిన 15 నీటి సంఘాల పరిధిలో సిడిఆర్ నిధులతో అరకొర పనులు చేపట్టడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిధులున్నప్పటికీ ఆధునీకరణ పనులు పూర్తిచేయకుండా మొక్కుబడిగా 1.30 కోట్ల రూపాయల నిధులతో డ్రాప్‌లు, ఆయకట్టు చెరువుల్లో మదుముల మరమ్మతులు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని రైతులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు.
గుత్తేదారు అకాల మరణం వల్లే!
ఆధునీకరణ పనులు దక్కించుకున్న గుత్తేదారు అకాల మరణం వల్లే పనులు ముందుకు సాగలేదని కింతలి ఇరిగేషన్ ఎ.ఇ బగ్గు సత్యనారాయణ స్పష్టంచేశారు. టెండర్లు ఖరారై మూడేళ్లు కావడంతో అదే ధరలకు పనులు నిర్వహించేందుకు కొత్తగా ఎవరూ ముందుకు రాకపోవడంతో పాటు సాంకేతిక పరమైన ఇబ్బందులు కూడా ఆధునీకరణ పనులు ముందుకు సాగేందుకు ఆటంకంగా నిలుస్తున్నాయన్నారు. ఈ ఏడాదికి పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని ఎ.ఇ స్పష్టంచేయడం విశేషం.

చక్కెర సరఫరా నిల్
నరసన్నపేట, మే 16: గత రెండునెలలుగా నిత్యవసర సరుకులదుకాణాల నుండి పంచదార ఇవ్వడం లేదంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేశారు. అమ్మహస్తం పేరిట పంచదార ప్రతీ ఒక్క లబ్ధిదారునికి అరకిలో చొప్పున సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు ప్రకటనలిచ్చినా మూడు నెలలుగా పంచదార సరఫరా లేదంటూ వాపోతున్నారు. మరోవైపు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిత్యవసర దుకాణాలకు పంచదార సరఫరా గత మూడు నెలల నుండి పూర్తిగా నిలిచిపోయిందని డీలర్లు తెలిపారు. అయితే మూడునెలలకు సంబంధించి మొత్తం కూడా చెల్లించామని, అయినా పంచదార కోటా రావడం లేదని వారు స్పష్టంచేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు పంచదార సరఫరా అవుతున్నా ఈ రెండు మండలాలకు ఎందుకు విస్మరిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పంచదార, మిగిలిన నిత్యవసర సరుకులు సకాలంలో అందేటట్లు చూడాలని కోరారు.

కూర్మనాథుని కల్యాణం
చూతము రారండి!
* నేటి నుండి ఉత్సవాలు ప్రారంభం
గార, మే 16: శ్రీకూర్మంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కూర్మనాథుని కళ్యాణోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్నారు. వైశాఖ శుద్ధ సప్తమి మొదలు పౌర్ణమి వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభవౌతాయి. ఈ ఉత్సవాలలో ధ్వజారోహణం, నిత్యహోమాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ నెల 20న కొట్నం దంపు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. 21న కళ్యాణం, 22న కాళీపాకం, 23న పండిత సత్కారం, సదస్యం, 24న పూర్ణాహుతి కార్యక్రమాలతో ఈ కళ్యాణోత్సవం ముగుస్తుంది. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.

టిడిపి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి
శ్రీకాకుళం, మే 16: రాష్ట్రం అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యువత గుణపాఠం చెప్పగలరని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గురువారం ఇక్కడ ప్రజాసదన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 20-20 విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. టిడిపి హయాంలోనే యువతకు ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ కళాశాలల ఏర్పాటుతోపాటు నిరుద్యోగ సమస్యను పారద్రోలడానికి రాష్ట్రానికి మల్టీనేషనల్ కంపెనీలు, ఐటికంపెనీలను రప్పించిన ఘనతచంద్రబాబునాయుడుదేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకూ అధికమవుతుందని అధికారులు, మంత్రులు జైలుపాలవుతున్నారని తెలిపారు. ఇటువంటి సమయంలో అభివృద్ధిని తామే చేశామంటూ కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం భావ్యం కాదన్నారు. నేడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చీకటియుగంలా తయారుచేసిందని, ఈరోజు వరకు దేశం పార్టీ నాయకుల్లో ఏ ఒక్కరికీ అవినీతి ఆరోపణలు లేని విషయాన్ని తెలియజేసారు. ప్రజాసేవ అంటే దేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, తొమ్మిదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబునాయుడేదనన్నారు. తాము విత్తనం వేసి సాగు చేసి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెబితే కోతకు వచ్చే దశలో పంట ప్రజలకు పనికిరాకుండా చేశారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ టిడిపి హయాంలో అభివృద్ధి జరుగలేదని పేర్కొంటున్న కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం హయాంలో ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉండి ఏం చేశారంటూ ప్రశ్నించారు. తాము అతితక్కువ బడ్జెట్‌తో రాష్ట్రాన్ని శాస్ర్తియంగా అభివృద్ధి చేస్తే నేడు లక్షల కోట్ల బడ్జెట్‌తో అవినీతి అభివృద్ధి అయిందని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఉద్దాన ప్రాంతం ప్రజలకు దాహార్తిని తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకుడు దివంగత ఎర్రన్నాయుడిది కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, మహిళల కోసం మహిళాసంఘాలు, డ్వాక్రా గ్యాస్ ఇవన్నీ టిడిపి హయాంలో వచ్చిన పథకాలేనని స్పష్టంచేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడమే తప్ప పూర్తిచేసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ఎస్.వి.రమణమాదిగ, రోణంకి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంస్కరణలు తీసుకువచ్చా..
ఎచ్చెర్ల, మే 16: ఇన్‌చార్జి ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన నాటికి అంబేద్కర్ వర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా ఉండడంతో ఎన్నోసంస్కరణలు తీసుకువచ్చానని విశాఖపట్నం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం వీసీ ఆర్.జి.్భగవత్‌కుమార్ పేర్కొన్నారు. 2011 నవంబర్ 16వ తేదీన ఇక్కడ వీసీగా అదనపు బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర పాటు సేవలందించారు. రెగ్యులర్ వీసీగా హనుమంతు లజపతిరాయ్‌ను ప్రభుత్వం నియమించడంతో ఆయనకు గురువారం వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయని, ఉన్నంతలో పాలనాపరమైన సంస్కరణలు అమలుచేశానన్న సంతృప్తి మిగిలిందన్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యం ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. అర్హులకు పదోన్నతులు, టీచింగ్ అసోసియేట్స్ జీతాల పెంపు, వసతి గృహ సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ కిందకు తీసుకురావడం సంతృప్తినిచ్చాయన్నారు. 21వ శతాబ్ధపు గురుకుల భవనాలు విషయంలో జిల్లా అధికారులు వ్యవహరించిన తీరు మనస్తాపానికి గురిచేసిందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ పి.చిరంజీవులు, టీచింగ్ అసోసియేట్స్ సుబ్రమణ్యం, కృష్ణమూర్తి, గోవిందరాజులు, పి.డి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ వీసీ సేవలు కొనియాడారు. అలాగే వీసీ భగవత్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
అకడమిక్ క్యాలెండర్ ఆమోదం
వీసీ అధ్యక్షతన ఉదయం జరిగిన ప్రిన్సిపాళ్ల సమావేశంలో డిగ్రీ అకడమిక్ క్యాలెండర్‌ను ఆమోదిస్తూ తీర్మానించారు. గురువారం వీసీ భగవత్‌కుమార్ తన ఛాంబర్‌లో ప్రిన్సిపాళ్లతో సమావేశాన్ని నిర్వహించారు. డిగ్రీ అకడమిక్ క్యాలెండర్‌పై సమీక్ష నిర్వహించారు. అలాగే నాణ్యమైన విద్య అందించేందుకు అధ్యాపకులకు నిర్వహించాల్సిన వివిధ ఓరియంటేషన్ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల, మహిళల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ బమ్మిడి పోలీసు, మైథిలిలు, టెక్కలి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే డిగ్రీ మూల్యాంకన ధరను పెంచుతూ వీసీ ఆదేశాలు జారీ చేశారు. పేపర్‌కు ఎనిమిది రూపాయలు గతంలో మూల్యాంకనకు చెల్లించేవారని, దానిని ఇకనుంచి 12 రూపాయలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రిన్సిపాళ్లంతా హర్షం వ్యక్తంచేశారు.
పదోన్నతులపై విమర్శలు
ఏడాదిన్నర పాటు ఉపకులపతిగా సేవలందించిన భగవత్‌కుమార్ చివరి నిముషంలో ఇద్దరు సిబ్బందికి మాత్రమే పదోన్నతి కల్పించి అర్హులను విస్మరించారని వర్సిటీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన విశే్వశ్వరరావుకు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి, టెక్నికల్ అసిస్టెంట్‌గా సేవలందించిన రామ్మోహన్‌కు ల్యాబ్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించడం పట్ల సిబ్బంది తప్పుబడుతున్నారు. అనేక మంది అర్హులుంటుండగా ఆ ఇద్దరికే చివరి నిముషంలో పదోన్నతులు కల్పించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

కళంకిత మంత్రులను బర్తరఫ్ చేయాలి
* బిజెపి డిమాండ్
పాతశ్రీకాకుళం, మే 16: రాష్ట్ర పురోగభివృద్ధిని భ్రష్ఠు పట్టిస్తూ అవినీతికి పాల్పడిన కళంకిత మంత్రులను బర్త్ఫ్ చేయాలని భారతీయ జనతాపార్టీ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. గురువారం పట్టణంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు ఆధ్వర్యంలో ఈ మేరకు పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నానాటికీ అవినీతి పెరిగిపోతున్న నేపధ్యంలో పదవులు కాపాడుకునే పనిలో అధికార కాంగ్రెస్ నాయకులున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూడి తిరుపతిరావు, రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు ఎస్.ఉమామహేశ్వరిలు మాట్లాడుతూ పశువులను సంరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఎండోమెంటు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు అట్టాడ రవిబాబ్జీ, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్.వెంకటసన్యాసిరావు, పేడాడ తులసీరావు, కిసాన్‌మోర్చా అధ్యక్షులు పండి యోగేశ్వరరావు, దళిత మోర్చా అధ్యక్షుడు గుడివాడ జయరాం, సంపతిరావు నాగేశ్వరరావు, ద్రోణాచార్యులు, ఎం.అప్పారావు, పైడి సత్యం తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ
శ్రీకాకుళం , మే 16: పాతశ్రీకాకుళంలో కొలువైయున్న పెద్దమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ గురువారం కన్నులపండువగా జరిగింది. బి.వి.ఎస్.దత్తాత్రేయశర్మ తదితర వేదపండితుల ఆధ్వర్యంలో గణపతిపూజ, యంత్రప్రతిష్ఠ, నీరాజనం, పసిడికలశ ప్రతిష్ఠ, బింబదర్శనం, గోపూజ, బలిహరణం, పూర్ణాహుతి, నీరాజనంలు జరిగాయి. అనంతరం తిరువీధిగా విచ్చేసిన అమ్మవారిని నూతనంగా నిర్మించిన ఆలయంలో గ్రామపెద్దలు ప్రతిష్టించారు. పేడాడ వంశీయులైన దుర్గారావు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు డి.పి.దేవ్, ఎల్.నాగరాజు, కమిటీ గౌరవ సలహాదారు ఎల్.నందికేశ్వరరావు, కలగ శ్రీను, గెంజి తాతారావు, జె.చిన్నారావు, అదపాక రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వివాదస్పద భూముల్లో ఆక్రమణలు చెల్లనేరవు
తహశీల్దార్ జన్ని రామారావు
సారవకోట, మే 16: కోర్టు పరిధిలో వివాదంలో ఉన్న జిరాయితీ భూముల్లో ఇతరులు చేసిన ఆక్రమణలు చెల్లనేరవని తహశీల్దార్ జన్ని రామారావు స్పష్టంచేశారు. మండలంలో బొంతు జంక్షన్‌లో రోడ్డు, భవనాల శాఖకు చెందిన స్థలంలోను, కొంతమందికి చెందిన జిరాయితీ స్థలాలను 14 మంది ఆక్రమణలు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. జిరాయితీ స్థలానికి చెందిన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఎస్సై చిన్నంనాయుడుతో కలిసి తహశీల్దార్, రెవెన్యూ యంత్రాంగం ఈ స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల మేరకు కొలతలు వేసి హద్దులను గుర్తించారు. అనంతరం ఆక్రమణదారులతో అధికారులు చర్చలు జరిపి వాస్తవాలను తెలియజేశారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగిపోవాల్సిన అవసరం ఉందని వీరు సూచించారు. ఈ మేరకు ఆక్రమణదారులు తమ అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా అధికారులకు అందజేశారు.

వివాద పరిష్కార దిశగా సంయుక్త సర్వే
భామిని, మే 16: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమైన నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల తలెత్తె పరిణామాలపై సంయుక్త సర్వే గురువారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. ట్రిబ్యునల్ అదేశాల మేరకు ఇరురాష్ట్రాల ఇంజనీరింగ్ నిపుణలతో సంయుక్త సర్వే ఈనెల 15న ప్రారంభించిన కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) అసిస్టెంట్ డైరెక్టరు శతపతి, డిఎన్ ప్రసాదుల పర్యవేక్షణలో భామిని మండలంలో కాట్రగడ బి నుండి బత్తిలివరకు నిర్వహించారు. నేరేడిబ్యారేజి నిర్మాణ స్థలంలో 1979లో ఏర్పాటు చేసిన బెంచ్ మార్కును సముద్ర మట్టంనుండి 64.35 అడుగుల ఎత్తును ధ్రువీకరించి ప్రారంభించిన సర్వే గురువారం నాటికి మూడు కిలోమీటర్ల దూరం చేరుకుంది. ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో రేఖాంశాలు, అక్షాంశాలను నిర్దారించారు. నేరేడిబ్యారేజ్‌కు ఎగువ 15 కిలోమీటర్లు, దిగువ 10 కిలోమీటర్ల పరిధిలో సంయుక్త సర్వేనిర్వహిస్తున్నారు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక బెంచ్ మార్కు ఏర్పాటుచేసి క్రాస్ సెసన్ నిర్వహిస్తున్నారు. అలాగే 1984లో జరిగిన సర్వేలో గుర్తించిన వివరాలు ఇప్పటికీ అధ్యయన విషయాలతో పూణెలోని కేంద్ర జలసంఘం రీసెర్చ్ కేంద్రంలో మోడల్ సర్వే నిర్వహించి అందులో తేలిన అంశాలను ట్రిబ్యునల్‌కు నివేదిస్తామని సంయుక్త బృందం సభ్యులు తెలిపారు. జిపిఎస్ విధానంలో నది గమనం, నీటి ప్రవాహం, పేరుకు పోయిన ఇసుకమేటలు, వరద తీవ్రతను అంచనావేస్తామన్నారు. అయితే ఇటీవల ట్రిబ్యునల్ కమిటీ పర్యటన సందర్భంగా ఒడిశా అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలు ఈ సంయుక్త సర్వే నివృత్తి చేస్తుందని ఆంధ్ర ప్రజానీకం భావిస్తుంది. ఈ కార్యక్రమంలో వంశధార ఇఇ రాంబాబు, డిఇలు కుమార్, ఎ.నాగేశ్వరరావు, ఎ.అర్.ఎస్ వర్మ, ఒడిశ్శా తరుపున నీటిపారుదలశాఖ ఇఇ చంద్రదాస్, డిఇఇలు సురేష్‌కుమార్ బిశ్రాయ్, బిజయ్‌కుమార్ పాడీ, డిసి వెంకటేష్‌లతో మొత్తం 18 మంది ఇరురాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
ఆనపకాయలగూడలో గజరాజులు
* జీడి,మామిడి,అరటి తోలు ధ్వంసం
సీతంపేట,మే 16:మండలంలోని పులిపుట్టి పంచాయతీ పరిధిలో ఉన్న ఆనపకాయలగూడలో గజరాజులు సంచరిస్తున్నాయి.బుధవారం సాయంత్రం గుమ్మడ జీడితోటల్లో తిరుగాడిన ఏనుగులు అర్ధరాత్రి సమయంలో పాలకొండ-హడ్డుబంగి ప్రధాన రహదారి మీదుగా ఇప్పగూడ, ఆనపకాయలగూడ వైపు పయనించాయి.అయితే గుమ్మడ గ్రామానికి చెందిన ఎన్ రామారావు అనే రైతు మామిడితోటను నాశనం చేసాయి.అలాగే బూర్జగూడ,ఆనపకాయలగూడ గ్రామానికి చెందిన పి రామారావు,వెంకట్రావులకు చెందిన అరటి,మామిడి చెట్లను విరిచి ధ్వంసం చేసినట్లు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసారు.గురువారం అంతా ఆనపకాయలగూడ సమీపంలోనే సంచరించిన గజరాజులు సాయంత్రం అయ్యేసరికి సమీపంలో ఉన్న కొండ ప్రాంతం వైపు వెళ్లినట్లు గిరిజనులు తెలిపారు.ఏనుగుల వలన తమకు కంటి మీద కునుకులేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.
పంటలతో పాటు తమకు ఎక్కడ హాని తలపెడతాయోననే భయంతో జీవిస్తున్నామని అన్నారు. ఈ ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

భారీగా ఎస్సైల బదిలీలు
శ్రీకాకుళం , మే 16: జిల్లాలో 39 మంది పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డిఐజి స్వాతి లక్రా గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంతటి భారీ స్థాయిలో ఎస్‌ఐలకు బదిలీ కావడం జిల్లాలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐగా పనిచేస్తున్న కాసా భాస్కరరావును పట్టణ వన్‌టౌన్‌కు బదిలీ చేశారు. అలాగే ఎల్.చంద్రశేఖర్‌ను సంతకవిటి నుండి మందసకు, కె.గోవిందరావును మందస నుండి కంచిలి, ఎ.నాగేశ్వరరావును సంతకవిటి పోలీస్ స్టేషన్‌కు ఎస్‌ఐగా నియమించారు. సారవకోటలో పనిచేస్తున్న ఇ.చిన్నంనాయుడు ఇచ్చాపురం స్టేషన్‌కు బదిలీ చేస్తూ సారవకోటకు కొత్తగా బి.శ్రీరామమూర్తిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఎచ్చెర్లలో పనిచేస్తున్న ఎల్.సన్యాసినాయుడును జె. ఆర్.పురంనకు, ఆమదాలవలస ఎస్‌ఐ ఉదయ్‌కుమార్ ఎచ్చెర్లకు, బి.మంగరాజు నందిగాం నుండి ఆమదాలవలసకు, రేగిడి ఆమదాలవలస నుండి నందిగాంనకు ఎస్.లక్ష్మణరావు, బూర్జ ఎస్ ఎం.చంద్రవౌళి రేగిడి ఆమదాలవలసకు నియమితులైనారు. లావేరు ఎస్‌ఐ ఎం.శ్రీను హిరమండలంనకు, ఐ.రామారావు శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి లావేరుకు, ఎస్.సత్యన్నారాయణను కొత్తూరు నుండి సరుబుజ్జిలి, ఎన్.కామేశ్వరావు వీరఘట్టాం నుండి కొత్తూరు, ఆర్.వేణుగోపాలరావు సోంపేట నుండి కాశీబుగ్గ స్టేషనకు బదిలీ అయ్యారు.
వేకెన్సీ రిజర్వులో ఉన్న జి.శ్రీనివాసరావు సోంపేటకు, బారువలో పనిచేస్తున్న కె.వెంకటేశ్వరావు కోటబొమ్మాళి, శ్రీకాకుళం ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సిహెచ్.గోవిందరావును బారువకు, ఇచ్చాపురం రూరల్‌లో పనిచేస్తున్న డి.రాము ఇచ్చాపురం టౌన్‌కు బదిలీచేశారు. వీరఘట్టాం పోలీస్ స్టేషన్‌కు ఎం.రత్నరావు, దోనుబాయి నుండి మెళియాపుట్టికి వెంకటకుమార్, మెళియాపుట్టి నుండి పాతపట్నంనకు వి.నాగరాజు, పాతపట్నం నుండి ఆర్.రవిప్రసాద్ డిఎస్‌బి శ్రీకాకుళంనకు బదిలీ చేశారు. వజ్రపుకొత్తూరు, బూర్జ స్టేషన్లకు కె.శాంతారాం, బి.కృష్ణమూర్తిలను నియమించారు. వజ్రపుకొత్తూరులో పనిచేస్తున్న కె.శాంతారాంను దోనుబాయి, జలుమూరులో పనిచేస్తున్న జి.శంకరరావును టెక్కలి, జి.సిగడాంలో పనిచేస్తున్న జి.ప్రభాకరరావు రాజాం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వేకెన్సీ రిజర్వులో ఉన్న జి.వి.రమణను జలుమూరు ఎస్‌ఐగా నియమించారు. జి.సిగడాం, శ్రీకాకుళం ట్రాఫిక్, డిసిఆర్‌బి శ్రీకాకుళం, శ్రీకాకుళం ట్రాఫిక్ రెండో ఎస్‌ఐ, శ్రీకాకుళం టూ టౌన్‌కు ఇద్దరు ఎస్‌ఐలను కొత్తవారిని నియమించారు. వేకెన్సీ రిజర్వులో నూతనంగా ఎంపికైన పి.నాగేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, ఎస్.చలపతిలను ఉంచారు.

నేడు వీసీ లజపతిరాయ్ బాధ్యతల స్వీకరణ
ఎచ్చెర్ల, మే 16: జిల్లాలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా హనుమంతు లజపతిరాయ్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు బాధ్యతలు స్వీకరించనున్నారు. లెక్చరర్ నుంచి వీసీ వరకు లజపతిరాయ్ అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి జిల్లా జడ్జిగా పనిచేయడం వల్ల ఉన్నత స్థాయికి ఎదగాలన్న పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియేట్ వరకు శ్రీకాకుళంలోనే విద్యను సాగించారు. డిగ్రీని గుంటూరులో హిందూ డిగ్రీ కళాశాలలో పూర్తిచేశారు. 1977-79లో నాగార్జున యూనివర్శిటీలో ఎం.కాం పూర్తి చేసిన ఆయన అదే వర్శిటీలో పి.హెచ్.డి చేశారు. 1980లో గుంటూరు పిజి సెంటర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్‌లో 1983-84లో లెక్చరర్‌గా విధులు నిర్వర్తించారు. 1985, డిసెంబర్‌లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో రీడర్‌గా చేరి 1993లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 1990-93 మధ్య కామర్స్ విభాగాధిపతిగా పనిచేశారు. 80 పరిశోధనాపత్రాలను ప్రచురించారు. ఈయన పర్యవేక్షణలో 11 మంది పిహెచ్‌డి చేశారు. హైదరాబాద్‌లోని బిసి స్టడీసర్కిల్‌కు ఏడేళ్లపాటు కన్వీనర్‌గా, డైరెక్టర్‌గా వ్యవహించారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో రెండున్నర ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1996లో యుజిసి స్కీమ్‌లో భాగంగా విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఈజిప్టులోని పలు విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తమ బోధన చేసేందుకు 2010లో బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. అప్పటి సిఎం వైఎస్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

ఆరుగాలం కష్టపడే అన్నదాతలను సాగునీటి కష్టాలు వెంటాడటంతో
english title: 
skl

కాంగ్రెస్ సమావేశం రసభస

$
0
0

విశాఖపట్నం, మే 16: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం రసభసగా మారింది. త్వరలో ఏర్పాటు చేయనున్న మహిళా ఫోరం కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించడానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఆధ్వర్యంలో గురువారం స్థానిక కుమారి కళ్యాణ మండపంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. గత కొద్ది కాలం వరకూ బెహరా భాస్కరరావు, ఎమ్మెల్యే మళ్ల విజయ ప్రసాద్ మధ్య విభేదాలు ఉండేవి. భాస్కరరావుకు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి లభించిన తరువాత వీరిద్దరూ వైరానికి స్వస్తి చెప్పారు. అయితే, ఈ నియోజకవర్గంలో బాస్కరరావు వర్గం, విజయ ప్రసాద్ వర్గం కలవలేకపోయాయి. వీరి మధ్య మాత్రం వైషమ్యాలు అలాగే ఉన్నాయి. సమావేశం ఎందుకు నిర్వహించారో, దాని గురించి మరిచిపోయి, త్వరలోనే నియమిస్తున్న వార్డు కమిటీ అధ్యక్షుల గురించి చర్చ ప్రారంభమైంది. 66వ వార్డుకు కాంగ్రెస్ అధ్యక్షునిగా గేదెల మురళీకృష్ణను అధ్యక్షునిగా నియమించాలని బెహరా భాస్కరరావు వర్గం డిమాండ్ చేసింది. మరోపక్క గత ఎన్నికల్లో మళ్ల విజయ ప్రసాద్‌కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించిన దొడ్డి కిరణ్‌కు ఈ వార్డు అధ్యక్ష పదవి ఇవ్వాలని మళ్ల వర్గీయులు పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో కొంతమంది లేచి, మురళీకృష్ణ పార్టీకి చేసిన సేవలేంటో చెప్పాలని మళ్ల వర్గీయులు కోరారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మళ్ల, బెహరా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది

అనకాపల్లికి తొమ్మిది మందితో కమిటీ
విశాఖపట్నం, మే 16: అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీని నడిపించేందుకు తొమ్మిది మందితో కూడిన కమిటీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నియమించనున్నారు. అనకాపల్లి నియోజకవర్గ సమీక్షా సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి అనకాపల్లి నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. అలాగే పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, పప్పల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ దాడి వీరభద్రరావు పార్టీ నుంచి వెళ్లిపోయినా, నష్టమేమీ లేదని అన్నారు. తామంతా మనో ధైర్యంతో ఉన్నామని బాబుకు చెప్పారు. దాడిపై వీరు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అక్కడి కార్యకర్తలపై తనకు నమ్మకం ఉందని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని టిడిపి తప్పక గెలుచుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి తొమ్మిది మందితో కూడిన కమిటీని నియమించనున్నారు. వీరిలో ఎవరి పనితీరు బాగుంటే, వారిని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించనున్నారు. ఈ కమిటీ నియామకంపై చర్చించేందుకు జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు శుక్రవారం చంద్రబాబు నాయుడుతో చర్చించనున్నారు.

నేటి నుంచి నియోజకవర్గాల్లో మినీ మహానాడు
విశాఖపట్నం, మే 16: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా టిడిపి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మినీ మహానాడు సమావేశాల గురించి వివరించారు. శుక్రవారం విశాఖ దక్షిణ నియోజకవర్గ సమావేశం రెల్లివీధి అంబేద్కర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అలాగే శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గ సమావేశం సవేరా ఫంక్షన్ హాలులోను, ఉత్తర నియోజకవర్గ సమావేశం గురుద్వార్ దగ్గర ఉన్న కావేరి కళ్యాణ మండపంలోను, గాజువాక నియోజకవర్గ సమావేశం వాసవి కళ్యాణ మండపంలో జరుగుతుంది. అలాగే పెందుర్తి నియోజకవర్గ సమావేశం సబ్బవరం మండలం దేవిపురంలో జరుగుతుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమావేశం కంచరపాలెం రామాలయం వద్దఉన్న కళ్యాణ మండపంలో జరుగుతుంది. భీమిలి నియోజకవర్గ సమావేశం తగరపువలస జూట్‌మిల్ వెల్ఫేర్ సెంటర్‌లో జరగనుంది.
ఈ సమావేశంలో చంద్రబాబు ఇటీవల నిర్వహించిన వస్తున్నా మీకోసం యాత్ర- దాని ప్రభావంపై చర్చ జరుగుతుందని గణేష్‌కుమార్ తెలియచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ రంగం చిన్నాభిన్నమైన పరిస్థితి, నీటిపారుదల, వ్యవసాయ రంగాల సంక్షోభం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కుంభకోణాలు, క్షీణించిన శాంతి భద్రతలు వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుజనా చౌదరి, చిన రెహమాన్ హాజరుకానున్నారని ఆయన తెలియచేశారు. ఈ సమావేశాలకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వాసుపల్లి కోరారు.

వృత్తి నైపుణ్యతతో మెరుగైన ఫలితాలు
* స్టీల్ ప్లాంట్ సిఎండి చౌదరి వెల్లడి
విశాఖపట్నం, మే 16: సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని స్టీల్ ప్లాంట్ సిఎండి ఎపి చౌదరి అన్నారు. యాన్యువల్ క్వాలిటీ సర్కిల్స్, సృజన్ వికాస్, 5ఎస్ గుర్తింపు వేడుకలు గురువారం స్టీల్ ప్లాంట్‌లోని టి అండ్ డిసి ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేనేజ్‌మెంట్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చౌదరి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అందరికన్నా ముందు ఉండాలంటే, నైపుణ్యం, తెలివితేటలకు పదును పెట్టాలని సూచించారు. ప్రతి సంస్థ కూడా తమ ముందున్న సవాళ్లను అధిగమించేందుకు సరికొత్త వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మానవవనరుల అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని ఆయన తెలియచేశారు.

గోశాల నుండి గోవులను
తరలిస్తున్న రెండు వ్యానులు మాయం
* అక్రమ రవాణాదారుల చేతివాటం
* గాలింపు చర్యల్లో అధికారులు

సింహాచలం, మే 16: సింహాచలం గోశాల నుండి గోవులను తరలిస్తున్న రెండు వ్యానులను అక్రమ రవాణాదారులు దారి మళ్లించారు. వీటి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దేవస్థానం గోశాలలో కోడెదూడల మరణాల నేపథ్యంలో గోవులను విశాలమైన ప్రాంగణానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గోవులను తరలిస్తున్న రెండు వ్యానులను అక్రమ రవాణాదారులు దారి మళ్లించి, గుర్తు తెలియని ప్రాంతానికి గోవులను తరలించారు. ఈ విషయం తెలిసిన దేవస్థానం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గతంలో దేవస్థానంతో లావాదేవీలు నడిపిన వ్యాపారే వీటిని అక్రమంగా తరలించుకుపోయి ఉంటాడన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గోశాలలో దూడలను ఎక్కించిన వ్యానులు అడివివరం వద్ద ముడసర్లోవ వైపునకు వెళ్ళాల్సి ఉండగా శొంఠ్యాం వైపుగా దారి మళ్ళించినట్లు సమాచారం అందింది. సమీపంలోని క్వారీ వద్ద కోడెదూడలతో వ్యాన్‌ను చూసామని కొంతమంది సమాచారం అందించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న దేవస్థానం అధికారులు అన్ని వైపుల నుండి చర్చలకు సిద్ధమవుతున్నారు.

వీరి పరిస్థితి ఏంటో
* బదిలీ జరిగినా రిలీవ్ కాలేదు
విశాఖపట్నం, మే 16: అన్నీ కలసి వచ్చాయి. అనుకున్న చోటుకి కాకపోయినా ఉన్నచోటు నుంచి బదిలీ అయిపోయింది. అయితే కొత్త చోట కొలువులో చేరే అవకావమే లేకుండా పోయింది. విద్యాశాఖలో బదిలీలు పూర్తయినా బదిలీ ప్రాంతానికి వెళ్లి ఉద్యోగంలో చేరలేని ఉపాధ్యాయులు పరిస్థితి ఇది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగికి బదిలీ జరిగినా కొత్తగా అక్కడ చేరాల్సిన ఉపాధ్యాయుడు వస్తే తప్ప బదిలీ జరిగిన ఉపాధ్యాయుడు రిలీవ్ కావడానికి వీల్లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదులు సంఖ్యలోనే ఉపాధ్యాయులు బదిలీ జరిగినా రిలీవ్ కాలేదు. నిబంధనల మేరకు వీరు పనిచేసే చోటే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా త్వరలోనే మరోసారి కౌనె్సలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు. అయితే డిఎస్సీని ప్రకటించిన తర్వాతే మలివిడత కౌనె్సలింగ్ ఉంటుందని ఆమే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా రేషనలైజేషన్, పాఠశాలల రద్దు కారణంగా దాదాపు 430 ఎస్జీటీ పోస్టులు సర్‌ప్లస్‌గా ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. వీటిలో అత్యధికం ఏజెన్సీప్రాంతాలకు చెందినవే ఉన్నాయి.

జివిఎంసిలో అధికార్ల బదిలీలు
విశాఖపట్నం, మే 16: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పలు శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానం చలనం కలిగింది. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఇఇలు రవి, వినయ్‌కుమార్‌లను బదిలీ చేశారు. వీరిలో రవి హైదరాబాద్‌కు, వినయ్‌కుమార్ ఎపియుఎస్‌బిఐసికి బదిలీపై వెళ్లనున్నారు. పట్టణ ప్రణాళికా విభాగంలో డిసిపిగా పనిచేస్తున్న లక్ష్మణరావు బదిలీ చేశారు. ఈయన స్థానంలో రాజమండ్రిలో పనిచేస్తున్న మీనాకుమారి వచ్చారు. అలాగే జోన్ 2 ఎసిపి శ్రీనివాస్‌కు రాజమండ్రి, జోన్ 4 ఎసిపి వెంకటరత్నంను విజయనగరం బదిలీ చేశారు. అలాగే టౌన్ ప్లానింగ్ టిపిఎలుగా పనిచేస్తున్న అమర్‌నాథ్ (జోన్ 4), కనకరావు (జోన్ 5). హరిబాబు (జోన్ 6) బదీలీ అయిన వారిలో ఉన్నారు. త్వరలోనే మరికొంతమంది అధికారుల బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెల్సింది.

యనమలను సత్కరిస్తున్న యాదవ ఐక్య వేదిక
పదవులు శాశ్వతం కాదు
* తెదేపా నేత యనమల
విశాఖపట్నం, మే 16: పదవులు శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నపుడు తన ప్రాంతానికి, తన వర్గానికి చేసిన సేవలే గుర్తింపును తెస్తాయని శాసనమండలి తెదేపా పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జిల్లా యాదవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో యనమలను గురువారం ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా జీవితంలో పదవులు వచ్చిపోతుంటాయని, పదవులున్నా, లేకున్నా ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పినప్పుడే నాయకుడికి మనుగుడ ఉంటుందన్నారు. స్వార్ధంతో పనిచేసిన నాయకుడు ఎప్పుడు ఉన్నత శిఖరాలు అందుకోలేరని వాఖ్యానించారు. తెలుగుదేశం అధిష్టానం కల్పించిన ఈఅవకాశాన్ని పార్టీ పురోభివృద్ధితో పాటు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. అంతకు ముందు యనమలను యాదవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అల్సి అప్పలనారాయణ యాదవ్, పడాల రమణ, మొల్లి లక్ష్మణరావు, గోవింద్, ఒమ్మి సన్యాసిరావు, మన్యాల సోంబాబు, పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బదిలీల్లో అవకతవకలు
* జాబితాల తయారీలోనే దిద్దుబాట్లు
* వైద్య ఆరోగ్యం, విద్యాశాఖల తీరుపై ఆరోపణల వెల్లువ
విశాఖపట్నం, మే 16: నిషేధాన్ని ఎత్తివేయడంతో పక్షం రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ జాతర కొనసాగింది. బుధవారం నాటితో బదిలీల ప్రక్రియ ముగించగా, తిరిగి నిషేధం అమల్లోకి వచ్చింది. దాదాపు 15 రోజుల పాటు కొనసాగిన బదిలీల ప్రక్రియలో అన్ని ప్రభుత్వ శాఖల్లోను భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా వైద్యఆరోగ్యం, విధ్యాశాఖ ఉద్యోగుల బదిలీల్లో యంత్రాంగం తెరచాటు మంత్రాంగం నడిపి, అస్మదీయులకు అనుకున్నది సాధించిపెట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులుమారినట్టు బహిరంగంగానే విమర్శలు చోటుచేసుకున్నాయి. రెవెన్యూ, సంక్షేమం, పంచాయతీరాజ్ మరికొన్ని శాఖలు మినిహా మిగిలిన అన్ని శాఖల్లోను బదిలీ ప్రహసనం కొనసాగిందనే చెప్పాలి. ముఖ్యంగా వైద్యఆరోగ్యశాఖలో జోన్ -1 పరిధిలో 700 మందికి పైగా సిబ్బందికి బదిలీలు జరిగాయి. ఎఎన్‌ఎం, స్ట్ఫానర్సు తదితర పోస్టుల్లో బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు విమర్శలు రావడంతో అప్పటి వరకూ బదిలీల జాబితాలను చూసిన కమిటీని సైతం కలెక్టరు మార్చాల్సి వచ్చిందంటే ఏమేరకు అవకతవకలు చోటుచేసుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇక విద్యాశాఖలో బదిలీలు ఉద్రిక్త పరిస్థితుల నడుమే జరిగాయి. ఖాళీలను ప్రకటించడంలోనే విద్యాశాఖ యంత్రాంగం చేతివాటాన్ని ప్రదర్శించిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. జివిఎంసిలో విలీనమైన గాజువాక మున్సిపాలిటీ సహా 32 గ్రామాల పాఠశాలల్లోని ఖాళీలను ప్రకటించకుండానే కౌనె్సలింగ్ చేపట్టడాన్ని ఉపాధ్యాయ సంఘాలు నిరసించాయి. గత తొమ్మిదేళ్లుగా పాతుకుపోయిన ఉపాధ్యాయులు ట్రిబ్యునల్ ఉత్తర్వులు తెచ్చుకుంటూ బదిలీ లేకుండా తప్పించుకుంటున్నారని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కౌనె్సలింగ్ స్తంభింపచేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో విలీన ప్రాంత పాఠశాలల్లోని పోస్టులకు సైతం కౌనె్సలింగ్ నిర్వహించారు. అలాగే 2008 డిఎస్సీ హామీ అభ్యర్థుల కౌనె్సలింగ్‌లో కూడా గందగోళం చోటుచేసుకుంది. ఇక్కడ హామీ అభ్యర్థులకు సంబంధించి హిందీ పండిత్ పోస్టులను ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. అయితే నిబంధనలు సాకుచూపి వీరికి అవకాశం కల్పించకపోవడంతో హిందీ ఉపాధ్యాయులు కౌనె్సలింగ్‌ను బహిష్కరించారు. రవాణాశాఖలో సైతం ఇదే పరిస్థితి తలెత్తింది. కోరుకున్న పోస్టింగ్ కోసం కొంతమంది అధికారులు అక్రమ మార్గాలను అనుసరించినట్టు ఆరోపణలు వచ్చాయి. పంచాయతీరాజ్, ఇరిగేషన్ విభాగాల్లో బదిలీల్లో సైతం పాయింట్ల విషయంలో అక్కడక్కడ సమస్యలు చోటుచేసుకున్నాయి. మొత్తం మీద బదిలీల ప్రక్రియ జిల్లాలో పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చిందనే చెప్పాలి.
ఇ టికెట్ మోసాలకు చెక్
* ప్రయాణీకులు చైతన్యంపై ఐఆర్‌సిటిసి దృష్టి
* వాల్తేరు డివిజన్‌లో విస్తరణకు ప్రత్యేక చర్యలు
విశాఖపట్నం, మే 16: ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ సిస్టం (ఇఆర్‌ఎస్)లో ఈటికెట్ తీసుకునే ప్రయాణీకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోసాలకు గురికారు. అధీకృత ఏజెంట్ పూర్తి వివరాలతో పాటు టికెట్ వివరాలను రైల్వే వెబ్‌సైట్‌లో మరోసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఈటికెట్ మోసాలతో పాటు అధిక ఛార్జీల వసూళ్లను నిరోధించేందుకు రైల్వేశాఖ ప్రయాణీకుల చైతన్య సదస్సులను నిర్వహిస్తోంది. ఈటికెట్ బుకింగ్, రద్దు వంటి అంశాలకు సంబంధించి అధీకృత ఏజెంట్ల వివరాలను ముందుగానే సరిచూసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్, రద్దుకు సంబంధించిన సమాచారం ఐఆర్‌సిటిసి నుంచి మొబైల్ ఫోన్లకు సమాచారం వస్తుంది. మొబైల్ సమాచారంతో ఈటికెట్ ప్రింట్‌ను ప్రయాణీకులు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, మొబైల్ మెసేజ్‌ను టిటిఇకి చూపిస్తేచాలు. అయితే ఈటికెట్ తీసుకున్న ప్రయాణీకులు తమ ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈటికెట్‌కు సంబంధించి అధీకృత ఏజెంట్‌లు ఎసి తరగతుల్లో ప్రయాణానికి 40 రూపాయలు, ఇతర తరగుతుల్లో ప్రయాణానికి 20 రూపాయలు మించి వసూలు చేసిన పక్షంలో రైల్వే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఈ ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే దీనిని వాల్తేరు డివిజన్ పరిదిలో పటిష్టంగా అమలు చేసేందుకు జోన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సర్వీస్ ఛార్జీల పెంపుపై ఎయిర్ యూజర్స్ ఆగ్రహం
విశాఖపట్నం, మే 16: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో సర్వీసు ఛార్జీల పెంపు, లగేజీ నియంత్రణను అమలు చేస్తూ పౌరవిమానయాన శాఖ మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ఇండియా విశాఖ చాప్టర్ తప్పుపట్టింది. ప్రయాణీకులు తమతో తీసుకెళ్లే లగేజిని పరిమితం చేయడం వల్ల వారికి అవసరమైన తినుబండారాలు, మందులు ఇతర పదార్థాలను వదులుకోవాల్సి వస్తుందని అసోసియేషన్ అధ్యక్షుడు డి వరదారెడ్డి అభిప్రాయపడ్డారు. పౌరవిమానయాన శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుకోవాలని ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు విజ్ఞప్తి చేశారు. పౌరవిమానయాన శాఖ తీసుకున్న నిర్ణయంపై తమ అసోసియేషన్ తరపున పోరాటం చేయనున్నట్టు వెల్లడించారు.
ఖాళీ స్థలాల పన్నుపై జివిఎంసి దృష్టి
* జూన్ 30లోగా చెల్లించాలంటూ హుకుం
విశాఖపట్నం, మే 16: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో ఖాళీ స్థలాల పన్ను (విఎల్‌టి) వసూళ్లపై అధికారులు దృష్టి సారించారు. ఏళ్ల తరబడి విఎల్‌టి చెల్లించకుండా ఉన్న స్థలాలను గుర్తించి ఆయా స్థలాలను ఎవరికీ చెందని వాటిగా ప్రకటించాలని కమిషన్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న విఎల్‌టిలను జూన్ 30లోగా వసూలు చెల్లించాలని పేర్కొన్నారు. జోన్ -1 కార్యాలయంలో అధికారులతో గురువారం అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో సుమారు 50 కోట్ల రూపాయల మేర విఎల్‌టి వసూలు కావాల్సి ఉండగా, కేవలం 5 కోట్లు రూపాయలు మాత్రమే వసూలవుతోందన్నారు. విఎల్‌టి వసూళ్లపై కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పన్నుల సక్రమంగా వసూలైతేనే వౌలిక సదుపాయాల కల్పన, దీర్ఘకాలిక కార్యక్రమాల నిర్వాహణ సాధ్యపడుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఆస్తిపన్ను సహేతుకంగా నిర్ణయించి వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.
బిపిఎల్ కొళాయిల మంజూరుకు ఆదేశం
దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాలకు తక్కుల డిపాజిట్‌తో మంచినీటి కొళాయి కనెక్షన్ మంజూరు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అల్పాదాయ వర్గాలకు ప్రభుత్వం కొళాయి మంజూరుకు నిధులు విడుదల చేసిన దృష్ట్యా అధికారులు అర్హులను గుర్తించి వారికి కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలని స్పష్టం చేశారు. జోన్ 1 పరిధిలో 10 వేల కొళాయి కనెక్షన్లకుగాను 3000 కనెక్షన్లు బిపిఎల్ కింద ఉన్నాయని జెడ్సీ ఎన్ శివాజీ వివరించారు. జోన్ పరిధిలో ప్రస్తుతం 300 దరఖాస్తులు మాత్రమే బిపిఎల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని తక్షణమే మంజూరు చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. అలాగే సెమీ బల్క్ కనెక్షన్ల మంజూరు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. జోన్ పరిధిలో 34 సెమీబల్క్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వీటికి త్వరలోనే మంజూరు చేయనున్నట్టు తెలిపారు. జోన్ల పరిధిలో అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారం కోసమే జోనల్ సమీక్షలను క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్టు కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన వల్ల ప్రజలకు వౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు దోహదపడుతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రి మంజూరు చేసి, శంకుస్థాపన చేసిన రహదార్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగిన దృష్ట్యా వాటిని సత్వరమే చేపట్టి పూర్తి చేయాలన్నారు. అలాగే వార్డుల్లో పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కోవార్డులో కోటి రూపాయలతో పార్కుల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. జోన్ సందర్శనలో చీఫ్ ఇంజనీర్ బి జయరామిరెడ్డి, చీఫ్ సిటీప్లానర్ ఎస్ బాలకృష్ణ, ఎఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, ఎడి బలరామకృష్ణ తదితదరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ ఇతర అధికారులు విశాఖ వేలీ స్కూల్ నుంచి బీచ్ వరకూ నిర్మిస్తున్న బిటి రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు పనులపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

రైతులకు రుణాల మంజూరుకు చర్యలు
* కలెక్టర్ శేషాద్రి
అనకాపల్లి, మే 16: రైతులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి. శేషాద్రి అన్నారు. మండలంలో జైతవరం, శిరిజాం, తురువోలు, పెదగోగాడ గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. జైతవరం గ్రామంలో కోడూరు వెంకటరమణకు చెందిన వర్మీకంపోస్టును పరిశీలించారు. అలాగే శిరిజాం గ్రామంలో సాక్షరభారత్ ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టుమిషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తురువోలులో పామాయిల్ తోటలను ఆయన పరిశీలించి పెదగోగాడ పిహెచ్‌సికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. మందులు సక్రమంగా అందుతున్నదీ లేనిది రోగులను అడిగి తెలుసుకున్నారు. రైతులు అంతర పంటలపై మొగ్గుచూపాలని కలెక్టర్ రైతులకు సూచించారు. అంతర పంటలకు విత్తనాలు వ్యవసాయ కేంద్రంలో దొరకడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే కాయగూరల విత్తనాలను వ్యవసాయ కార్యాలయంద్వారా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు పి. శివప్రసాద్‌ను ఆయన ఆదేశించారు. చోడవరం నుండి చీడికాడకు బస్సులేక అవస్థలు పడుతున్నామని కలెక్టర్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎంతో మాట్లాడి బస్సు వచ్చేటట్లు చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. శిరిజాంలో సాక్షర భారత్ ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టుమిషన్ కేంద్రంలో ఒకటే మిషన్ ఉండటం వలన ఇబ్బందులు పడుతున్నామని మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే మరో కుట్టుమిషన్ వచ్చేటట్లు చూడాలని ఎంపిడివో గుణలక్ష్మిని ఆదేశించారు. బకాయిపడ్డ ఉపాధి కూలీలకు ఈనెల 25వ తేదీలోగా వేతనాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి.అప్పలనాయుడు, హౌసింగ్ ఎఇ,ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ రాంగోపాల్, అధికారులు పాల్గొన్నారు.

రూ. 12 లక్షల విలువైన గంజాయి పట్టివేత
రోలుగుంట, మే 16: మండలంలోని కొంతలం సమీపంలోని నంది వొంపు వద్ద 12 లక్షల రూపాయలు విలువైన గంజాయి పట్టుబడింది. ఈ సంఘటన లో గంజాయి తరలించడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 120 కేజీల గంజాయిని స్వాధీ నం చేసుకున్నారు. ఈ సంఘటనలో ఒకవ్యక్తి పరారయ్యాడు. మండలంలో ని రాజన్నపాలెంకు చెందిన ఎం.కొండబాబు, శరభవరం గ్రామానికి చెందిన ఎం. ఈశ్వరరావు, ఎం.కె.పట్నంకి చెం దిన వియ్యపుమారేసులు చింతపల్లి మండలం రాళ్ళగెడ్డలో 120 కేజీల గం జాయిని ఇటీవల కొనుగోలు చేసి కొం తకాలం సమీపంలోని నందివొంపు వ ద్ద నిల్వ ఉంచారు. గురువారం తెల్లవా రుజామున గంజాయిని తరలించేందు కు వాహనం కోసం ఎదురుచూస్తుండ గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై జి.అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులు వీరిని అనుమానించి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఎం.కె.పట్నంకి చెందిన వియ్యపు మారేసు వీరిని గమనించి పరారయ్యా డు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారివద్ద ఉన్న గంజాయిని స్వాధీన పర్చుకున్నారు. స్వాధీన పర్చుకున్న గంజాయి విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని వీరు దువ్వాడ రైల్వే స్టేషన్‌కు తరలించి అక్కడ నుండి తమిళనాడుకు తీసుకువెళ్ళి విక్రయాలు జరుపుతారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై జి. అప్పన్న విలేఖరులతో మాట్లాడుతూ భవిష్యత్‌లో గంజాయిపై మరింత విస్తృతంగా దాడులు జరుపుతామని ఆయ న పేర్కొన్నారు. బుధవారం రాత్రి మం డలంలోని శరభవరం, బుచ్చింపేట, రత్నంపేట, బి.బి.పట్నం గ్రామాల్లో పెట్రోలింగ్ జరిపి పాతముద్దాయిలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు.

నదిలో మునిగి యువకుడి మృతి
కోటవురట్ల, మే 16: కోటవురట్ల శివారు గవరపేట వద్ద ప్రమాదవశాత్తు వరాహనదిలో పడి ఒక యువకుడు మృతి చెందాడు. ఈసంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలో తంగేడు గ్రామానికి చెందిన సింగంపల్లి శ్రీను(35) పశువులను మేపేందుకు వరాహనది ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. పశువులు నదిలోకి దిగడంతో వాటిని బయటకు తీసుకువచ్చేందుకు శ్రీను కూడా నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో శ్రీను ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలుఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గోవిందరావు తెలిపారు.

మంచినీటి సమస్యతో
మున్సిపల్ అధికారులపై మహిళల ఆగ్రహం
అనకాపల్లి (నెహ్రూచౌక్), మే 16: గత రెండురోజులుగా నీళ్లు రావడం లేదని, కనీసం నీళ్లు రావన్న సమాచారం కూడా లేదని, ఒకవేళ కుళాయి లు ఆలస్యంగా వస్తాయని రెండురోజులుగా ఎదురుచూశామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కుళాయిల నీ రు రావన్న సమాచారాన్ని ముందుగా తెలియజేయక పోవడంపై అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళాయిలు రావన్న విషయం తమకు ముందుగా తెలియజేస్తే తాము దూరప్రాంతాలకు వెళ్లి తెచ్చుకునే వారమని మహిళలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. రెండురోజులైనా కూడా కుళాయిలు రాకపోవడంతో ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తే మున్సిపాలిటీ హెడ్‌వాటర్ వర్క్స్‌వద్ద మో టార్లు కాలిపోయాయని, ఆ విషయం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తెలియజేసింది. పట్టణంలో ఒకపక్క విద్యుత్ కోత, మరోపక్క మున్సిపల్ కుళాయిలు రాక ప్రజలకు తీవ్రమైన నీటికొరత ఏర్పడింది. దీంతో ప్రజలు ఒత్తిడిమేరకు గురువారం నుండి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు మున్సిపల్ అధికారులు పూనుకున్నారు. పట్టణంలో 34 మున్సిపల్ వార్డులుఉండగా, ఈమూడు ట్యాంకర్ల నీళ్లు ఏ మూలకు వస్తాయని మహిళలు నిలదీశారు. దీనికి త్వరలో మోటార్‌లను బాగుచేయించి మళ్ళీ యథావిధిగా కుళాయిలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆశాజ్యోతి, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సూచనల మేరకు చెప్పారు.

22న సిమ్స్‌పై తుది ఛార్జ్‌షీట్ దాఖలు
* డైరెక్టర్లు ఆస్తులు గుర్తించాం
* భూములు విక్రయించకుండా చర్యలు
* నేడు డిపాజిట్‌దారులతో ఎఎస్పీ సమావేశం
నర్సీపట్నం, మే 16: డిపాజిట్ దారులకు కోట్లాది రూపాయలు టోపీ పెట్టి బోర్డు తిప్పేసిన సిమ్స్ ఫైనాన్స్ సంస్థ మోసాలపై పోలీసులు తుది ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నర్సీపట్నం కేంద్రంగా కొనసాగిన సిమ్స్ ఫైనాన్స్ సంస్థలో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేసిన సంగతి తెలిసిందే. అధిక వడ్డీలకు ఆశపడి డిపాజిట్లు చేసిన అనేక మందికి సిమ్స్ డైరెక్టర్లు టోపీ పెట్టారు. లక్షల రూపాయలు నష్టపోయిన డిపాజట్‌దారుల్లో కొంతమంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇక్కడ ఎ ఎస్పీగా పనిచేసిన తఫ్సీర్ ఇక్బాల్ సిమ్స్ ఫైనాన్స్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేశారు. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. అలాగే సిమ్స్ డైరెక్టర్లను, పలువురు ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. తఫ్సీర్ ఇక్బాల్ రెండు నెలలక్రితం ఇక్కడి నుండి బదిలీ కావడంతో ఈకేసు ముందుకు సాగలేదు. ఇక్కడ ఎఎస్పీగా బాధ్యతలు చేపట్టిన విశాల్‌గున్నీ సిమ్స్ ఫైనాన్స్ కేసుపై దృష్టి సారించారు. గురువారం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ నర్సీపట్నం ప్రాంతంలో సిమ్స్ డైరెక్టర్లు అస్తులను గుర్తించామని చెప్పారు. ఈ కేసుకు తుది ఛార్జ్‌షీట్‌ను ఈనెల 22వ తేదీన కోర్టులో వేయనున్నట్లు తెలిపారు. సిమ్స్ సంస్థ డైరెక్టర్లు ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేసిందీ గుర్తించామన్నారు. ఈ భూములు రిజిష్టేషన్లు కాకుండా ఆయా సబ్ రిజిష్టార్ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపించామన్నారు. సిమ్స్ ఫైనాన్స్ సంస్థ డిపాజిట్ చేసి మోసపోయిన డిపాజిట్ దారులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలన్నారు. వారి పూర్తి వివరాలను తెలియజేయాలన్నారు. ఏజెంట్లు, డైరెక్టర్లు , బాధితులు ఎవరైనా వచ్చి తమ సమస్యను ఎఎస్పీకి తెలియజేసుకోవాలన్నారు.

* కార్యకర్తలు బాహాబాహీ
english title: 
congress

రాశిఫలం 19-05-2013

$
0
0
Date: 
Sunday, May 19, 2013 (All day)
author: 
-- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. ప్రయాణాలెక్కువవుతాయి.
మేషం: 
ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
వృషభం: 
ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు ఉంటాయ. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది.
మిథునం: 
క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. వ్యయ ప్రయాసలు తప్పవు. ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా కొత్త సమస్యల నెదుర్కొంటారు.
కర్కాటకం: 
చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్ర్తిలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి.
సింహం: 
వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా నుండుట మంచిది. అనారోగ్య బాధలధిగమించుటకు ఔషధసేవ తప్పదు. స్థిరాస్తుల విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
కన్య: 
కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదరవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెంతుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి.
తుల: 
నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
ధనుస్సు: 
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఋణవిముక్తి లభిస్తుంది. మానసికానందం ఉంటుంది.
కుంభం: 
నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది.
మీనం: 
బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది.
దుర్ముహూర్తం: 
సా.04.24 నుండి 05.12 వరకు
రాహు కాలం: 
..
వర్జ్యం: 
ఉ.8.55 నుండి 10.35 వరకు
నక్షత్రం: 
పూర్వ ఫల్గుని రా.01.30
తిథి: 
శుద్ధ నవమి సా.05.45
మకరం: 
వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు.

సచ్చిదానంద సాధన

$
0
0

పుష్పం వికసిస్తుంది. అందులో మకరందాన్ని ప్రోది చేసుకొని ఉంటుంది. దాన్ని ఆస్వాదించడానికి ఏదో ఒక తుమ్మెద రావాలి. స్వీకరించాలి. అపుడే ఆ పుష్పం యొక్క జన్మ సార్థకత చెందుతుంది.
వానచినుకు పంట పండటానికి ఉపయోగపడే స్థలంలో కురియాలి. ఎక్కడో ఎడారిలో బీడు భూములపై కురవటంవలన ఎలాంటి ప్రయోజనం లేదు. పంటను పండించి, ఆకలి తీర్చినపుడే ఆ వాన చినుకుకు, పండిన పంటకూ, సార్థకత ఉంటుంది. ఇవన్నీ భాస్కర శతకకారుడు సూత్రీకరించిన ఉదాహరణలు. ఎంతో వాస్తవాలు! మనిషి జీవితమూ అంతే. దీనికీ సార్థకత కావాలి. బ్రతికినన్నిరోజులూ కేవలం సంపాదన, అందులోని సుఖాలు, వారి వారి సుఖాలూ చూసుకొని మురిసిపోవటంతో సార్థకత చేకూరదు. నిష్కామ కర్మలు చేస్తూ, ఆ కర్మఫలాన్ని భగవదర్పితం చేసినపుడే సార్థకత చేకూరుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు తన అనుంగు శిష్యులు మహిమ చరణాదులతో ‘సచ్చిదానందాన్ని పొందకుంటే అంతా వ్యర్థమే నాయనా!’’ అని.
సచ్చిదానందాన్ని పొందటానికి భగవంతునికి మరింత దగ్గర కావటమొక్కటే మార్గమంటారు. ఆ దగ్గర కావటానికి మనో వ్యాకులత కావాలి. భగవంతుడొక్కడే సత్యం. తక్కినవన్నీ అనిత్యాలు. నిత్యమైనదని తెలిసినపుడు దానికోసం విచారణ సాగించండని సూచిస్తారు రామకృష్ణ పరమహంస.
శిష్యులు ‘‘స్వామీ! వాటికంత తీరిక ఎక్కడుంది’’ అంటారు.
స్వామి- ‘తీరిక ఉన్నవారు ధ్యానం, భజనలు చేయాలి. బొత్తిగా తీరిక దొరకనివారు రోజూ రెండుసార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి. ఆయన అంతర్యామి. మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మీకు అనేక వ్యాపకాలు. ఆయన్ను ప్రార్థించడానికి మీకు తీరిక ఉండదు. ఆయనకు ముఖతా వివరించండి. ఆయన్ను పొందకుంటే ఆయన దర్శనం కాకుంటే మీరెన్ని గొప్ప అద్భుతాలు సృష్టించినా వ్యర్థమే’ అంటారు. మనసును శుద్ధి చేసుకొమ్మంటారు. ‘‘నేనొక గొప్ప వ్యక్తిని. నేను ఇలాంటివాడను. నాకు గొప్ప అధికారం ఉంది- ఇటువంటి అహంకారం నశించకుంటే భగవంతుని దర్శించలేం. ‘‘నేను’’ అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీళ్ళతో కరిగించి నేలమట్టం చేసివేయాలని సూచిస్తారు.
భౌతిక ప్రపంచంలో ఇవన్నీ సాధ్యమేనా అన్న సంకోచం రాకమానదు. సాధ్యమే అంటారు రామకృష్ణ పరమహంస. భవబంధాలను ఒక క్రమపద్ధతిలో దూరం చేసుకుంటూ, ఉన్న సమయాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడపటం, భగవంతుని గురించి చింతించటం, ఆయనను కావాలని కోరుకోవటం, ఐక్యం (మనసును) చెందించటంలో సాధన చేయాలి. శ్రీరామకృష్ణులు జగజ్జనని ఇలా ప్రార్థించసాగారు- ‘‘అమ్మా! నేను ఏం తప్పు చేశాను? అమ్మా, నేను స్వయంగా ఏదన్నా చేస్తున్నానా? నువ్వే కదా సమస్తం చేస్తున్నావు! నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు’’. వ్యాకులత ఇలా కొనసాగుతుంది. అంతటి వ్యాకులత కావాలంటారు. తన వాటా ఆస్తికై కుమారుడు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు సమాలోచించుకొని, నిర్ణీత కాలానికి ముందే అతడికి వాటా పంచి ఇస్తారు. మనోవ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు. ఆయన మనకు జన్మనిచ్చినపుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది. ఆయన మన సొంత తండ్రి, సొంత తల్లి. ఆయన వద్ద మనం పట్టుపట్టవచ్చు. ‘నా ముందుకు రా, లేకుంటే నేను తిండి తినను!’’ అంటూ ఆయన్ను నిలదీయవచ్చు’’ అంటూ శిష్యులతో వివరించారు శ్రీరామకృష్ణులు 1884లో దక్షిణేశ్వరంలోని కాళికాలయంలో. ఇవన్నీ రసగుళికలు.
భోగవాంఛలు తీరనంతవరకు మనోవ్యాకులత కలగదు. కనుక ఈ భోగవాంఛలు క్రమపద్ధతిలో, మెల్లమెల్లగా దూరం చేసుకోవాలి. అపుడు భగవంతుని గురించిన చింతన మనకుతెలియకుండానే మొదలవుతుంది.

మంచిమాట
english title: 
manchi maata
author: 
-చెన్నా రామమూర్తి

19-05-2013

$
0
0
crossimage: 
Date: 
Sunday, May 19, 2013

మన పార్లమెంటుకు గేట్లెన్నో...!!

$
0
0

స్వాతంత్య్రం ప్రకటించిన సంవత్సరం లోపుననే భారతదేశపు మొదటి ప్రధాని ఓ చిన్న సంఘటనకు స్పందించి రాజీనామా చేసాడని న్యూయార్క్‌లో మేనేజిమెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అరవింద్ ఆచార్యా ఈమధ్యన లండన్‌లోని హార్ట్‌లే లైబ్రరీలో వౌంట్‌బాటన్ ఆర్కివ్‌లో దొరికిన రాజాజీ (మొదటి భారతీయ గవర్నర్ జనరల్) లేఖ ద్వారా గుర్తించాడు. 10, ఆగస్టు 1948 తేదీతోగల ఆ లేఖ మొదటి గవర్నర్ జనరల్ అయిన వౌంట్‌బాటన్‌కు రాయడం జరిగింది. ఆ లేఖలోని సారాంశం- బ్రిటీషు లాయరైన సర్ వాల్టర్ మోన్‌క్టన్ ఏడవ నిజామ్ ఉస్మాన్ అలీ బాషాకు సలహాదారు! నిజాం రాష్ట్రాన్ని స్వతంత్రంగా ఉంచాలా, ఇండియాలో కలపాలా అనే మీమాంసతో నిజాం నాటి బ్రిటీషు రాజైన జార్జ్‌కి సర్ వాల్టర్ ద్వారా ఓ లేఖను పంపడం జరిగింది. వాల్టర్‌కు, వౌంట్ బాటన్‌కు, రాజుకుఉన్న సంబంధాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ లేఖ రాయబడిందనేది ఓ ఊహ! దీనికి జార్జ్ తిరిగి రాసిన లేఖను నిజాంకు పంపించగా, వాల్టర్ సెక్రటరీ ఆ లేఖను సెన్సార్ చేయడంతో, భారతదేశం సర్వసత్తావక దేశంగా (రిపబ్లిక్) రూపుదిద్దుకోక పోవడం, పరోక్షంగా భారతదేశం బ్రిటీషురాచరిక వ్యవస్థ కిందనే కొనసాగుతున్నదని భావించిన నెహ్రూ, ఇలా రాజు రాసిన లేఖ సెన్సార్‌కు గురికావడం నైతికంగా తన తప్పుగా భావించి రాజీనామా చేసాడని, ఆ లేఖ యొక్క మొత్తం సారాంశం. (నేటి నాయకులకు ఈ సంఘటన అవసరంగా భావిస్తూ- చూడు డక్కన్ క్రానికల్ 17, ఏప్రిల్ 2013).
ఒక్కసారి గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలోకి వెళ్ళితే, మొన్నటి పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల గందరగోళం లాగానే, కోల్‌గేట్ వ్యవహారం బయటపడింది. అదీ కాగ్ నివేదిక ద్వారా. 90 బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పడంతో రెండు లక్షల కోట్లకు పైగా రావాల్సిన ఆదాయంకు గండిపడిందని, పోనీ ధర పలికిన 1,86,000 లక్షల కోట్ల రూపాయలు కూడా రాలేకపోయాయని, అది ఉపరితల బొగ్గు గనులు పనినే ప్రారంభించలేదని కాగ్ తెలిపిన నివేదిక నాడు పార్లమెంటును కుదిపివేసింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఈ ఉపరితల బొగ్గు గనుల అమ్మకాలు (ప్రైవేటు వ్యక్తులకు) ఎన్‌డిఎ కాలంలోనే(1994) మొదలుకావడం. ఎన్‌డిఎ కాలంలో ఇలా ప్రైవేట్ వ్యక్తులకు 7 గదులను అప్పజెప్పగా రూ. 12,421 కోట్లు నష్టం జరిగిందని ‘కాగ్’ బయటపెట్టింది.
సురేష్ కల్మాడీతో మొదలైన యుపిఎ అవినీతి పాలన పవన్‌కుమార్ బన్సాల్ మేనల్లుడైన విజయసింగ్లాతో చక్కగా రైలు పట్టాలెక్కింది. లంచావతారులను, వెయ్యి, పదివేలతో, లక్షతో చూసాము, గాని ఏకంగా 10 కోట్ల లంచాలిచ్చే అధికారులున్నట్లు పశ్చిమ రైల్వే ఎలక్ట్రికల్ విభాగపు జనరల్ మేనేజర్ పదవిని ఆశించిన మహేశ్‌కుమార్‌తోనే తెలిసింది. మొత్తంగా 17 జోన్లుగల రైల్వేలో 14 లక్షల మంది ఉద్యోగులుండగా, అత్యధిక లాభాలున్న జోన్ ముంబాయి.అందుకే, 90 లక్షల్ని ఇస్తూ సిబిఐకి దొరికిపోయాడు. ఓవైపు కోల్‌గేట్ వ్యవహారంలో పార్లమెంటు స్థంభనకు గురైతుంటే, సందట్లో సడేమియా రైల్‌గేట్ బయట పడడం గమనార్హం. పైగా రైల్వేమంత్రికి బంధువులు చేసే కుంభకోణాలతో సంబంధమేమిటని, ఎందుకు రాజీనామా ఇవ్వాలని అధికార పక్షం కాదు, ఎన్‌డిఎలో భాగస్వామ్య పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షులు శరద్‌యాదవ్ ప్రశ్నిస్తూ పాలకపక్షాన్ని సమర్ధించడాన్నిబట్టి,పాలకపక్షం, ప్రతిపక్షమని కాకుండా, పార్లమెంటు సభ్యులంతా ఒకే తానుగుడ్డలని తేలిపోయింది.
అందుకే వీరంతా లోక్‌పాల్ బిల్లు గూర్చి (హజారే అడుగుతున్న జన లోక్‌పాల్ కాదు) మర్చిపోయారు. సిబిఐ స్వయం ప్రతిపత్తి గూర్చి నోరు మెదపడం లేదు. కారణం- ఎన్‌డిఎ హయాంలో కూడా సిబిఐని ఎన్‌డిఎని వ్యతిరేకించిన వారిపైన మాత్రమే ప్రయోగించారు. నేడు జరుగుతున్నది అదే! అందుకే ఎఫ్‌డిఐలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఎక్కడ ఓటు వేయాల్సి వస్తుందో అని భావించిన బిఎస్‌పి (మాయావతి తాజ్ కారిడార్ కుంభకోణాన్నుంచి తప్పించుకోవడానికి), అఖిలేశ్ యాదవ్ (యుపి ముఖ్యమంత్రి), తండ్రి ములాయంసింగ్‌లు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఎక్కడ యుపిఎ సిబిఐచే కొరడా ఝుళిపిస్తుందో అని భావించి, పార్లమెంట్‌ను బహిష్కరించి, యుపిఎ-2 ప్రభుత్వానికి బహిరంగంగా అండగా నిలిచారు. వీరంతా పార్లమెంటేరియన్లు. కింది సామాజిక వర్గాలకు చెందిన ప్రజాస్వామ్యవాదులు? నాయకులు.
ఇక పాలకపక్షం- తననేమనక పోతే, ఇతరులను ఏమి అనదు. 24 స్పెక్ట్రం కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధంగల నాటి డిఎంకె మంత్రి ఎ.రాజా అరెస్టు, తర్వాత ఆడబిడ్డ ఎంపి కనిమోజి అరెస్టుతో అగ్గిబుగ్గైతున్న కరుణానిధి అవకాశంకోసం ఎదురుచూస్తూ, శ్రీలంక తమిళులపై ఆ దేశ సైన్యం చేస్తున్న దారుణాల్ని భద్రతా కౌన్సిల్లో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చి, భంగపడి యుపిఎ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో స్టాలిన్ ఆస్తులపై వెంటనే సిబిఐచేదాడి చేయించడాన్ని బట్టి చూస్తే నిజంగానే సిబిఐ పాలక పక్షపు పంజరంలో చిలుకనే! అందుకే కోల్‌గేట్ స్టాటస్‌కో రిపోర్టును న్యాయశాఖామంత్రి అశ్వనీకుమార్‌కు, అటార్నీ జనరల్ వాహనవతికి, అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్‌కు, ప్రధానమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శులకు, గనుల మంత్రిత్వశాఖ అధికారులకు చూపించి, మరీ సుప్రీంకోర్టుకు సిబిఐ డైరెక్టర్ రంజన్ సిన్హా సమర్పించాడంటే, సిబిఐ వ్యక్తిత్వ మెంతనో తెలుస్తున్నది. పొరపాటు జరిగింది, క్షమించాలి, ఇక నుంచి ఇలాంటి పొరపాటు చేయనని సిన్హా తన నిస్సహాయతను వెలిబుచ్చడం రాజకీయ పారదర్శకతకు నిదర్శనం!
మన పార్లమెంట్‌కు ఎన్ని గేట్లు (లోపలికి పోవడానికి) న్నాయో తెలియదు. ఎందుకంటే ఎవరికి నిర్ణయించిన గేటు గుండా వారు మాత్రమే పోతారు కాబట్టి! ముంబ యికి గేట్‌వే ఆఫ్ ఇండియా ఉన్నట్టు, ఢిల్లీకి ఇండియాగేట్ ఉన్నట్టు, జైపూర్ నగరానికి ఢిల్లీ గేట్‌తో సహా తదితర గేట్లు ఉన్నట్లు, మన పార్లమెంటుకున్న గేట్లకుకూడా పేర్లు పెడితే బాగుంటుంది. అందులో కామనె్వల్త్ గేట్, 24 స్పెక్ట్రం గేట్, కోల్‌గేట్, రైల్‌గేట్ అంటూ, ప్రధాన గేటుకు వౌనముని గేట్ అని పేరు పెడితే చిరకాలం జ్ఞాపకం ఉంటాయి. రాబోయే తరాలన్నా నిన్నటి సంఘటనల్ని జ్ఞప్తికి తెచ్చుకొని జాగ్రత్త పడుతాయి. లేదంటే అదో పవిత్రమైన ప్రదేశంగానే మిగిలిపోయి, కొంతమందికే పరిమితం అవుతాయి. ఈ దేశ ప్రజలకు పార్లమెంటేరియన్లు, రాజకీయ నాయకులు ఎలాగూ దక్షతగా ఉండలేరని తేలిపోయింది. కనీసం బ్యూరోక్రాట్స్ అన్నా ఈ దేశ ప్రజలకు సేవలందిస్తారా అంటే అదీ అంతంత మాత్రమేనని, సిబిఐ ద్వారా స్పష్టపడింది. ఇప్పుడు చర్చంతా స్వయం ప్రతిపత్తి గూర్చి జరుగుతున్నది. ఈ స్వయం ప్రతిపత్తి కూడా వ్యక్తుల్ని బట్టేనని టిఎన్ శేషన్ ద్వారా, ప్రస్తుత ‘కాగ్’ డైరెక్టర్ వినోద్‌రాయ్ ద్వారా కనపడింది గాని, ఇతరులున్నప్పుడు వాటి ప్రభావం అంతగాలేదనేది ప్రస్తుత ఎన్నికల కమిషన్ తెలుపుతున్నది. అందుకే శేషన్ లాంటి వ్యక్తుల్లాగా, అమెరికా ఎఫ్‌బిఐ మాజీ చీఫ్ జె.ఎడ్గర్ హూవర్ - ఈయన నాటి అమెరికా అధ్యక్షుడైన జాన్‌ఎఫ్ కెనడీ మరియు ఈయన తమ్ముడైన అటార్నీ జనరల్‌గా పనిచేసిన రాబర్ట్ కెనడీల పనివిధానం గూర్చి గూఢాచర్య జరిపేవాడు- లాంటివారు అధికారులుగా ఉంటే కొంతలో కొంత ప్రజాస్వామ్య దేశాలకు మనుగడ ఉంటుంది. లేదంటే మరింతగా భ్రష్టుపట్టి రాజకీయ ధనాస్వామ్య దేశంగా రూపాంతరం చెందుతాయి. మరి కాంగ్రెస్ నాయకులకే నెహ్రూ ఆదర్శం కాకపోతే ఈ ప్రజల పరిస్థితేంటి?

ఫీచర్
english title: 
main feature
author: 
- జి.లచ్చయ్య (సెల్ : 94401 16162)

ప్రజాకవీ...మమ్మల్ని మన్నించు!

$
0
0

నేనుచూసిన గొప్ప కవులలో వయ్య రాజారాం ఒకరు. నిస్సందేహంగా తెలుగు కవిత్వ రంగంలో అతనొక సునామీ. గ్రామం దేవరుప్పల. జిల్లా ఆనాడు నల్లగొండ. ఈనాడది వరంగల్. పుట్టింది మాత్రం అక్కడ. కాని పెరిగింది పోరాటాల పురిటిగడ్డలో. బాల్యంలో మాత్రమే తల్లిదండ్రుల చెంత పెరిగాడు. కౌమారం అంతా ఉద్యమాలలోనే. పద్నాలుగేళ్లకే ఆంధ్ర మహాసభలకి మారుపేరైన ‘సంగం’లో సభ్యుడు. సభ్యత్వం కోసం అణా పైసలు సంపాదించడానికి కొన్ని రోజులు కూలీగా పనిచేశాడు. అప్పటికే అతని తండ్రి వయ్య ముత్తయ్య కూడా సంగం సభ్యుడే. ఐతే ఇద్దరి దారులు వేరువేరు. ఒకరు బాలసంఘం సభ్యులు. మరొకరు పార్టీ సభ్యులు. ఐనా రాజారాం పిల్లవాడిగా ఉంటూనే పెద్దలతోపాటుగా పనులు చేశాడు. నూనూగు మీసాల కల్లంత దూరానే పార్టీ పనులలో మునిగిపోయాడు. విసునూరి దొరవారి ఆగడాలు మితిమీరిపోయాయి. అతని కొడుకు బాబుదొర గడీ బయటకు వచ్చాడంటే పదిమంది హిట్లర్‌ల క్రూరత్వం వికటాట్టహాసం చేసేది. కనుపించిన శరీరంపై బెత్తం దెబ్బలు. వంగి దండం పెట్టకుంటే వాడిపై రాతి బరువులు. సంగంలో చేరిన వారిపై వీపు దెబ్బలు. రాజారాం ఊరు విడిచి వెళ్లకపోతే బతికేవాడు కాదు. పిన్న వయసులోనే రహస్య జీవితం గడపవలసి వచ్చింది. ప్రజల బాధలు చూసి విపరీతంగా చలించిపోయాడు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. తెగింపు లేకుండా ప్రజలను కాపాడలేమని భావించాడు. శ్రమజీవి వర్గాల మీద దొరల ఆగడం పెరిగిపోయింది. మంగలివాడైన దొడ్డి కొమురయ్య విసునూరి దొర తల్లి జానకమ్మ పెట్టే బాధలు తాళలేకపోయాడు. ఆమె బంట్లుఅయిన కృష్ణారెడ్డి, మసికినలి ప్రజలతో వెట్టి చాకిరి చేయించారు. అదనపు శిస్తులు వేసి డబ్బులు కట్టాలని వేధించారు. గత్యంతరం లేక అందుకు ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపారు. కళ్లతో ఆ దృశ్యాల్ని చూసిన రాజారాం పళ్లు కొరికాడు. ప్రజలను పీడించే దొరల భరతం పట్టాలని పిడికిళ్లు బిగించాడు.
కాసం నారాయణ, ఎలమరెడ్డి మోహనరెడ్డి, గోలి బాల కృష్ణారెడ్డి, నీలారపు ఎల్లయ్య, జాటోతు థాను వంటివారితో సోపతి చేశాడు. కాలక్రమంలో వారే ఒక దళంగా ఏర్పడ్డారు. ధర్మారంలో జాటోతు థానుని పోలీసులు కాల్చి చంపారు. ఐనా రాజారాం భయపడలేదు.
తెలంగాణ రైతాంగ పోరాటంలోని ప్రతి దశలో తామర తంపరగా పాటలు వెలువడ్డాయి. ఆ పాటలు ప్రజలను అక్కున చేర్చుకున్నాయి. అవి వారి విశ్వాసాన్ని పెంచిన విషయం గుర్తించాడు. అంతే తాను కవి అయ్యాడు కవిత్వం అతని గళంలోంచి కాదు. కర చరణాల్లో తాండవమాడింది. రాజారాం కదిలితే సంగీతం కురిసింది. ఆనాటి పరిస్థితుల్లో కేవలం పాటలొక్కటే సరిపోవడంలేదు. విసునూరి పెట్టిన కష్టాలు, ప్రజల ప్రతిఘటన, పోరాటం వంటి అంశాలు చెప్పడానికి కథ కావాలి. పాట పెరిగి బుర్రకథ అయింది. ఒగ్గుకథ అయ్యింది. పది నిముషాల పాట మూడు గంటల ప్రదర్శన అయ్యింది. కళా రూపానికి సంగీతం ప్రాణం. సంగీత వాద్యం గళానికి తోడైంది. తంబూర, డికీలు, తాళాలు, గజ్జెలు ఉంటేనే బుర్రకథ. రాజారాం అప్పటికప్పుడు ఇద్దరు వంతలతో బుర్రకథ దళం ఏర్పాటు చేశాడు. అతని ప్రదర్శనలు తెలంగాణ అంతటా మారుమోగాయి. ఐతే రానురాను పరిస్థితులు విషమించాయి. ఆహార్యం, సంగీత వాద్యాలు వేదిక వంటివి అప్పటికప్పుడు దొరకడం దుర్లభమైంది. అందుకే ఒగ్గుకథని బుర్రకథకి ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సి వచ్చింది. ఒగ్గుకథ అయితే కట్టుకున్న ధోవతిని మార్చి, వేసుకున్న అంగీని విప్పితే చాలు. ఓ చేతిలో కర్ర, మరో చేతిలో చిన్న ఒగ్గు వాద్యం. కాళ్లకు గజ్జెలు సులభీకరించిన ఆహార్యంతో, ప్రజలకు చిరపరిచితమైన బాణీలతో ప్రదర్శన సాగేది. ఒగ్గుకథ రాజారాంకి మారుపేరైంది. వందలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ఐతే తన రహస్య జీవితానికి కళా ప్రదర్శనని తోడు చేసుకున్నాడు. ఎక్కడా తన పేరు, బృందం పేరు చెప్పుకోలేదు. ప్రజలకు ఆనాటి, తక్షణ శిక్షణలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శన ఉండాలని భావించాడు. ప్రతి ప్రదర్శనని ఒక శిక్షణ తరగతిగా మార్చిన ఘనత రాజారాందే. ఈ విషయం పార్టీ చెప్పింది కాదు. తనకు తాను స్థానిక అవసరాలరీత్యా గుర్తించి అమలు చేశాడు. అందుకే కళాకారునిగా తనకు పేరు ప్రఖ్యాతులు కావాలని ఏనాడూ ఆశించలేదు. అప్పటికే తెలుగు సాహిత్య రంగం కీర్తిప్రతిష్టల ఊబిలో కూరుకుపోయింది. సంస్థలలో, పార్టీ పత్రికలలో తమ తమ కవులను నిస్సిగ్గుగా ప్రమోట్ చేసుకుంటున్నాయి. పోరాట పార్టీలకు కూడా ఆ జాడ్యం అంటింది. బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలకు చెందిన కవుల ముందు శ్రమజీవి కవులు కనుపించలేదు. వర్గ దృక్పథం రాజకీయ (్భపోరాటాల) ఉద్యమానికే పరిమితమైంది. భావ విప్లవానికి పునాది అయిన ప్రజా కళా సాహిత్య రంగానికి అన్వయింపు జరగలేదు. శ్రమ జీవి వర్గ కవులను ప్రచారం కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు. ప్రచారానంతరం వాళ్లు కరివేపాకులయ్యారు. శిష్ట కవులను (గురజాడ, కందుకూరు, శ్రీశ్రీ వంటివారు) ఫోటోలు పెట్టి పూజించారు. వాళ్ల ముందు ఈ దిక్కుమాలిన ప్రజాకవుల పేర్లు వల్లించడానిక్కూడా పనికిరాలేదు.
‘పోతుందీ దోపిడి రాజ్యం/వస్తుంది పేదోల్ల రాజ్యం’ అని పదహారో ఏట పాటపాడి ప్రజారాజ్య పోరాటానికి తన గళాన్ని అంకితం చేసాడు. అలాంటి రాజారాంకి వయసులేదని పార్టీ సభ్యత్వం నిరాకరించింది. కాని మిర్జా ఇస్మాయిల్ ఆర్డర్‌తో పిన్న వాడైన రాజారాంని చంచల్‌గూడ జైలుకి పంపారు. ఆ తర్వాత మూడేళ్లు, జాల్నా (మహారాష్ట్ర) జైలు పాలు చేశారు. అందరికన్నా చివరన 1954లో విడుదలయ్యాడు. బయటవుంటే పసివాడని చూడకుండా దొర గుండాలు నిర్దాక్షిణ్యంగా హత్య చేసేవారు. పాట, శ్రమ జీవుల అండ ఉన్న రాజారాం ఒక మందు పాతర. అలాంటి కవి రహస్య జీవితం గడుపుతూ ఇంటికి వచ్చి అర్ధరాత్రి తల్లి ఇచ్చే జొన్న రొట్టె తిని కడుపు నింపుకున్నాడు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం వచ్చాకే, పోరాటం మధ్యలో ఆపేశాక అంతకు ముందు ఏదో విధంగా నడిచిన సంసారం ఇప్పుడు దారిద్య్రంతో బాధపడింది. పేదల రాజ్యం కోసం పోరాడిన రాజారాం మరింత పేదగా జీవితం గడపవలసి వచ్చింది.
1979లో దేవరుప్పలలోని అతని ఇంటికి వెళ్లి కొన్ని పాటలు సేకరించాను. ఆనాడు చూసిన దృశ్యం ఇంకా కడుపులో దేవినట్లుగానే ఉంది. కుక్కిమంచంలో ఆ ఆజానుబాహుడు దైన్యంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు. ‘పట్నంనుంచి ఎవరో వచ్చిండ్రు నాయనా’ అని అతని చిన్నకూతురు చెప్పినా వినలేదు. నాలాగా ఎందరో అతని ఇంటికి వచ్చారు. పార్టీ లీడర్లయితే మరీ. వచ్చిన వారందరికీ ఇంత తిండిపెట్టి పంపేవాడు. ఇవ్వాళ అతనికే గతి లేకుండాపోయింది. సగం దినం వరకు అన్యమనస్కంగానే ఉన్నాడు. గతం గురించి పెదవి విరిచాడు. చాలా పెద్దషాక్‌కి గురయినట్లు అనిపించింది. కానైతే అతను పాడిన ఏడుపాటలు కొద్ది గంటల్లో రికార్డు చేసుకున్నాను. సుమారు నాలుగు వందల పాటలు కట్టిన రాజారాం నాలుకపై కొన్ని పాటలే నిలిచాయి. అవి కూడా అతనితోపాటు పనిచేసిన మిత్రులు జ్ఞాపకం చేయగా మాత్రమే పాడాడు.
ఉదయం తొమ్మిది గంటలకు వాళ్లింటికి పోతే తర్జన బర్జనలతో మధ్యాహ్నం మూడు గంటలకి సొట్టలుపోయిన రాతెండి కంచంలో ఉప్పేసి దంచిన పచ్చి మిరపకాయల పచ్చడితో అన్నం పెట్టారు. అప్పుడుగాని అతని పరిస్థితి ఏమిటో అర్ధమైంది. కారం కొట్టిందనే మిషతో పదే పదే కన్నీళ్లు తుడుచుకున్నాను. ఎంత ఏడ్చినా బాధ కడుపులో సుళ్లు తిరుగుతునే ఉంది.
ఒక మహాకవి, ప్రజాకవికి అతిథిగా అతనితో మాట్లాడుతున్న ఆనందం కన్నా అతని పేదరికం ఎంతో బాధించింది. మెల్లిమెల్లిగా కప్పుకున్న తెలుగు సాహిత్యం స్వభావం పొరలు విప్పుకున్నాయి. రాజారాం అంటరానివాడు. పోరాటంలో అలాంటి ఆలోచన ఉండేదో లేదో ఎవరికీ తెలియదు. కాని పోరాటం ఆగిపోయాక, అతడు తిరిగి తన ఇంటికి చేరాక తిరిగి అంటరాని వాడుగానే మిగిలాడు. మాల కులంలో పుట్టి, మాలామెను పెళ్లాడి ముగ్గురు మాలపిల్లలను కన్నవాడు మాలవాడు కాక మరేమవుతాడు. పైగా దారిద్య్రం. అలాంటి వాడిని కవి అని ఎవరు అంటారు. అనగలిగిన పార్టీకి గురజాడలే కనుపిస్తారు కదా.
1988లో ‘తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజాసాహిత్యం’ పుస్తకంలో రాజారాం గురించి రాశాను. 1986లో ఆంధ్రభూమి ఆదివారం సంచికలో రాశాను. అతని పాటలు ఎన్నో సంకలనాల్లో వచ్చాయి. దేశంలో విప్లవ పోరాటాలు కొనసాగుతున్నాయి. అటు దళిత సాహిత్యోద్యమం కాని, ప్రజాసాహిత్య సంస్థలు గాని, తెలంగాణ ప్రాంతీయ సాహిత్యవాదులు గాని వయ్య రాజారాం ఎవరు, అతని చరిత్ర ఏమిటని అనే్వషించిన పాపాన పోలేదు. ఇందుకు కారణం ఏమై ఉంటుంది? దీనికి జవాబు లభించిననాడు ప్రజాకవులకి న్యాయం కలుగుతుంది. వయ్య రాజారాం నిస్సందేహంగా తెలుగు మహాకవి. తెలంగాణా ప్రజాకవి. సాహిత్య చరిత్రలో తగిన స్థానం కల్పించలేకపోయిన మా చేతగాని తనాన్ని మన్నించమని కోరడం తప్ప ఏం చేయగలం.

తొవ్వ ముచ్చట్లు
english title: 
thovva

శత్రువే సంస్కర్త!

$
0
0

శత్రువు మించిన గొప్ప సంస్కర్త ఉండడు. తెల్లని బియ్యంలో నల్లని రాళ్లను తీసినట్టు, ‘ఒప్పుల’ కుప్పలాంటి మన జీవితంలోంచి ‘తప్పుల’ను ఏరి ఇస్తాడు. ఈ పని మిత్రులవల్ల కాదు.
వ్యక్తి విషయంలోనే కాదు. సంస్థ విషయంలోనూ, ఒక పార్టీ విషయంలోనూ ఇదే నిజం.
ఏ రాజకీయ పార్టీ అయినా బాగుపడాలి అంటే, అది శత్రుపక్షం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీలు అలా బాగుపడిపోతున్నాయి. ఒక పార్టీమీద శత్రుపక్షం ఇంత ప్రేమ చూపిస్తుందంటే, నాటకం అనుకునే వాళ్లం. కానీ అది నాటకం కాదూ, ‘కర్ణాటకం’ అని బోధపడిపోయింది.
అయిదేళ్ల క్రితం యెడ్యూరప్ప నాయకత్వంలోని కర్ణాటక బీజేపీ, కర్ణాటకలోని కాంగ్రెస్‌కు బద్ధశత్రువు. కాంగ్రెస్‌ను ఓడించేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. ఇప్పుడు ఆయన ఎంత మేలు చేసి పెట్టాడో చూడండి. బిజెపీ నుంచి బయటకు వచ్చాడు కానీ, కాంగ్రెస్‌లో చేరలేదు. వేరే పార్టీ (కర్ణాటక జనతాపార్టీ) పెట్టారు. ‘అవినీతి ఆరోపణల’ ముద్రను తన మీదా, తన మాతృసంస్థ (బీజేపీ) మీద మాత్రమే వేసి కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇంత మేలు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని ఏ వ్యక్తి అయినా చేయగలరా?
యెడ్యూరప్ప మేలు ఇక్కడితో ఆగలేదు. అది కాంగ్రెస్ తప్పుల్ని ఎత్తి చూపింది. ‘అవినీతి ముద్ర’ వున్న వాళ్ల గతి కేవలం కర్ణాటకలోనే ఇలా వుంటే, దేశం మొత్తం మీద ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న నోటితో కాకుండా ఆయన ‘వోటు’తో వేయించాడు. అంతే కేంద్రంలో కాంగ్రెస్ తన తప్పును తాను తెలుసుకుంది. వెంటనే ‘తాజా కళంకితుల’యిన (పాత కళంకితులు ఎవరికి గుర్తుంటారు లెండి!) ఇద్దరు కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించింది.
ఇలా కాంగ్రెస్‌ను సంస్కరించే పనిని కర్ణాటకలో యెడ్యూరప్ప ఎలా వేసుకున్నారో, మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ శత్రుపక్షం భుజానవేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ‘కళంకితులయిన’ వారిలో ‘ఆలీబాబా’ లాంటి అధినాయకుడు ఉన్నాడో, లేదో తెలియదు కానీ, ‘అరడజను మంత్రులు’ మాత్రం ఉన్నారు. సిబిఐ శోధనలో ఏకంగా ‘్ఛర్జిషీట్’ వరకూ వీరిలో కొందరొచ్చేశారు. అయినా సరే సచివులుగా ఉండి సర్కారును చక్కబెట్టేస్తున్నారు. కాంగ్రెస్‌లోపల వున్న నేతలు ఎన్నో మార్లు ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి ఉంటారు. అయినా ప్రయోజనం లేకపోయింది.
ఈ తరుణంలో కాంగ్రెస్‌ను బాగుచేసే బాధ్యతను శత్రుపక్షమే స్వీకరించాలి. అందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయిపోయారు. ఈ ఆరుగుర్నీ మంత్రివర్గంనుంచి తొలగించాలని గవర్నర్‌కు నివేదించారు. అంతేకాదు, వారికి ఉద్వాసన పలికేవరకూ, ఉద్యమిస్తానని శపథం చేశారు. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచించవచ్చు. కేవలం ‘బాబు’ అడిగారు కాబట్టి-తీసేసామన్న మాట రాకుండా-ఏదో తరుణోపాయం ఆలోచించి తప్పు దిద్దేసుకుంటారు.
తెలుగుదేశం తప్పుల్ని కూడా వీలున్నప్పుడు కాంగ్రెస్ కూడా దిద్దిపెట్టవచ్చు. అలాగే శత్రుపక్షంగా నిలిచి కూడా 2008 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని డజను సీట్లు తెచ్చుకోలేకపోయిన టీఆర్‌ఎస్ పార్టీని కూడా సంస్కరించాలని వైఎస్ మరణానంతరం అప్పట్లో కాంగ్రెస్ కంకణం కట్టేసుకుంది. ముందు తెలంగాణ ఇస్తానని ప్రకటన చేసి, తర్వాత ‘తూచ్’ అనేసింది. దాంతో టీఆర్‌ఎస్ నేలకు కొట్టిన బంతిలా పైకి లేచింది. ఎన్నికలలో సోలిపోయినా, ఉప ఎన్నికలలో పైకి లేచింది.
నరేంద్రమోడీ బీజేపీ తరఫున ప్రచారం చేస్తే కొన్ని చోట్లే వస్తాయి కానీ అన్నిచోట్లా వోట్లు రాలవని ‘మిత్రుడు’ చెబితే బీజేపీ వినలేదు. ఎన్డీయే భాగస్వామి, బీజేపీకి అనుంగు మిత్రపక్షమైన జెడి(యు) నేత నితిష్‌కుమార్ ఈ విషయాన్ని చెప్పి చూద్దామని చాలా ప్రయత్నించాడు. కేవలం తాను పాలించే రాష్ట్రం (బీహార్) వరకూ మోడీని ప్రచారం చేయకుండా అడ్డుకోగలిగాడు. కానీ శత్రుపక్షం రుజువు చేశాక-ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోడీ ప్రచారం చేసిన ఆరు నియోజకవర్గాల్లో శత్రుపక్షం వారు గెలిచారు. ఇప్పుడర్ధమయింది కొన్ని రాష్ట్రాలలో మోడీ ప్రచారం వల్ల ఎంత లాభం ఉంటుందో, కొన్ని రాష్ట్రాలలో అంతే నష్టం ఉంటుంది.
నీతయినా, రాజనీతయినా-మిత్రుడు నుంచి నేర్చుకునేది తక్కువే. శత్రువే ఎక్కువ నేర్పుతాడు. అందుకే అసలు మిత్రులే లేకుండా మనగలగవచ్చు కానీ, కనీసం ఒక్క శత్రువు కూడా లేకుండా బతికి బట్ట కట్టడం సాధ్యం కాదు. కొన్ని పార్టీలను ఎవరూ శత్రుపక్షంగా భావించరు. ఉదాహరణకు రాష్ట్రంలో ‘లోక్‌సత్తా’ ఉంది. ఆ పార్టీమీద విరుచుకుపడాలని ఎవరికీ అనిపించదు. అందుకని ఆ పార్టీ ఒక్క సీటుకే ఎందుకు పరిమితమైందో ఆ పార్టీనేతకు అర్ధమయ్యేలా చెప్పటానికి ఏ శత్రుపక్షమూ లేదు!
శక్తి ఉన్న పార్టీకే శత్రుత్వమూ ఉంటుంది!

తకిట తకిటక..
english title: 
takita.. takitaka

పాపం గోమాత...!

$
0
0

గోవును గోమాతగా భావిస్తూ, హిందువులు దేవతగా ఆరాధిస్తారు. ఈ గోవులను పరిరక్షించేందుకు అనేక సంస్థలు అనునిత్యం ఉద్యమాలు కూడా చేస్తుంటాయి. అయితే గోమాతల చింతలు మాత్రం తీరడం లేదు. నోరులేని మూగజీవాలను ఆదుకోవడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. అది మా బాధ్యత కాదు అంటూ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు చెబుతున్నారు. కేవలం మానవీయ కోణంలోనే గోవుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామే తప్ప అది తమ బాధ్యత కాదని నేరుగా మంత్రివర్యులు రామచంద్రయ్యే ప్రకటించడం చూస్తే ఇక అధికారులు ఎంతవరకు నిబద్ధతతో పనిచేస్తారో తెలిసిపోతోంది. గోమాతను ఇక దేవుడే రక్షించాలి!
- సూర్యనారాయణ

లైవ్ భయం..!
ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఎవరైనా వణికిపోతారు. కానీ ఈ మధ్య అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సైతం లైవ్‌గా మాట్లాడాలంటే ఎందుకొచ్చిన సమస్యరా బాబూ అనుకుంటున్నారు. న్యూస్ చానల్స్ వచ్చిన కొత్తలోనో, ఉద్యోగంలో చేరిన కొత్తలోనో లైవ్‌లో మాట్లాడేందుకు బెరుకు ఉండడం సహజమే కానీ కొమ్ములు తిరిగిన సీనియర్లు సైతం ఇప్పుడు వణికిపోతున్నారు. మాజీ జర్నలిస్టు ఒకరు కోపంతో తన బాస్‌ను లైవ్‌లో చెప్పుతో కొట్టారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ, సెక్రటేరియట్, పార్టీ కార్యాలయాల నుంచి లైవ్‌గా మాట్లాడడం అంటే వేరు. కానీ జిల్లాల్లోనో, ఏదో సమస్యపై రోడ్డుమీద లైవ్‌గా మాట్లాడితే పాత కక్షలతో ఎవడు ఎటు నుంచి వచ్చి దాడి జరుపుతాడో అని కంగారు పడుతున్నారు. అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అందరినీ భయపెట్టే మేమే ఇప్పుడు భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు.
- మురళి

హరీశ్ స్థాయి అంతేనా?
టిఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై ఆ పార్టీ బహిష్కృత నేత రఘునందన్‌రావు చేసిన ఆరోపణలను టిఆర్‌ఎస్ చాలా తేలికగా తీసుకుంది. ఒకరకంగా రఘునందన్‌రావు చేసిన ఆరోపణల వల్ల హరీశ్‌రావు ఇమేజి పెరిగిందని టిఆర్‌ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. బడా పారిశ్రామికవేత్తలను బెదిరించి కోట్ల రూపాయలు వారి నుంచి టిఆర్‌ఎస్ నేతలు వసూలు చేస్తుంటారని గతంలో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన నేతలు, సమైక్యాంధ్ర నేతలు తీవ్ర ఆరోపణలు చేసేవారు. కానీ హరీశ్‌రావుపై రఘునందన్‌రావు చేసిన ఆరోపణలో పద్మాలయా స్టూడియోను బ్లాక్ మెయిల్ చేసి. రూ. 80 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ రోజుల్లో రూ. 80 లక్షలు అంటే పెద్దగా లెక్కలోకి రాదని, పైగా పద్మాలయా స్టూడియో యజమాని సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడంతో వారి నుంచి డబ్బులు తీసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు పెద్ద తప్పుగా పరిగణించరని టిఆర్‌ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు. ఇక తన నుంచి తిరుపతిలో హరీశ్‌రావు డబ్బులు తీసుకున్నారని రఘునందన్‌రావు ఆరోపిస్తే, అవీ కేవలం ఐదు, పది వేలు మాత్రమే, పైగా చేతి ఖర్చుల కోసం తీసుకున్నానని హరీశ్‌రావు చెప్పడం వల్ల, అంత చిన్న మొత్తం కూడా ఆయన దగ్గర లేదంటే, ఆయన నిజాయితీ పరుడేనన్న సంకేతాలను ప్రజలకు ఇచ్చినట్టు అయిందని టిఆర్‌ఎస్ నేతలు సంబర పడుతున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

పదవుల మీమాంస
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో జ్యోతిష్యులు, తలపండిన విలేఖర్లకు డిమాండ్ పెరిగింది. ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి అధినేత బొత్స సత్యనారాయణ వెళ్లి రెండురోజులు మకాం వేయడంతో, టీవీ చానళ్లు, పత్రికలు మంత్రివర్గంలో మార్పులు తథ్యమని విపరీతంగా ప్రచారం చేశాయి. దీంతో మంత్రులు ఎవరికీ వారు స్వాములు, జ్యోతిష్యులను సంప్రదించారు. ఇక పేషీల్లో అడుగుపెట్టే విలేఖర్లతో తలపండిన విలేఖర్లను పిలిచి వ్యక్తిగత మంతనాలు కూడా మంత్రులు జరిపారు. మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటి ? మంత్రివర్గంలో మార్పులు తప్పవా? మన పదవి ఉంటుందా? పోతుందా అనే చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇదంతా చూస్తున్న బ్యూరోక్రాట్లు కూడా ప్రభుత్వం మారుతుందా, మంత్రివర్గంలో మార్పులకే పరిమితమా? ఒక వేళ ఇదే జరిగితే తమకు కీలకశాఖలు దక్కుతాయా అనే ఆరాటంలో ఉన్నారు. ఏమి జరిగినా వచ్చే నెల రోజుల్లోపే మార్పులని, ఎన్నికల మూడ్ వచ్చేస్తున్న నేపథ్యంలో తమకు ఏమి జరిగినా ఫర్వాలేదని కొంత మంది మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- శైలేంద్ర

గెలుస్తామా?
కళంకితులకు టికెట్లు ఇచ్చేది లేదు.. ఈ మాట ప్రతి నాయకుడు చెబుతుంటాడు. రాహుల్‌గాంధీ కూడా అదే మాట చెబుతున్నారు. ఈ మాటలు విన్న కాంగ్రెస్ నాయకుడొకరు ఇలా అయితే మా గెలుపు కష్టమే అంటూ వాపోయాడు. అదేంటి అంటే ఏదో రాజకీయం కోసం రాహుల్ ఆ మాట అంటే పరవాలేదు కానీ నిజంగానే దాన్ని ఆచరిస్తే, పార్టీ ఎలా గెలుస్తుంది అని చమత్కరించారు. రానున్న ఎన్నికల్లో కళంకితులకు, నేరస్తులకు టికెట్లు ఇవ్వకూడదని రాహుల్ బల్లగుద్ది చెబుతున్నారు. ఉన్నవాళ్ళు అందరూ ఏదో విధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలన్న విషయం రాహల్‌కు తెలియాదా అని నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ ముందుగా గల్లీ రాజకీయాల గురించి తెల్సుకుంటే ఢిల్లీ రాజకీయాలు తర్వాత మాట్లాడుకొవచ్చునని నాయకులు గుర్తు చేస్తున్నారు. రాహుల్ ఇలా రాజకీయ ప్రకటనలు చేస్తూపోతే ప్రత్యర్థి బిజెపి నేత మోడీని ఎట్లా ఎదుర్కొంటారని పార్టీ సీనియర్ నేతలు తలలు పట్టుకొని కూర్చున్నారు.
- సిఎస్ కులశేఖర్‌రెడ్డి

మిర్చి మసాలా
english title: 
cow

ఇక ప్రతినాయకురాలిగా....

$
0
0

టాలీవుడ్‌లో అవకాశాల్లేక గోళ్లు కొరుక్కుంటున్న ఛార్మి హీరోయిన్ వేషం నుంచి ప్రతి నాయకురాలి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తోంది. అనుకోకుండా ఒకరోజు, మంత్ర, మంగళ చిత్రాలతో అదరగొట్టిన ఛార్మికి గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా చేస్తోంది. దీనిలో భాగంగానే ‘ప్రేమ ఒక మైకం’లో వేశ్య పాత్రలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఛార్మి ఎమ్మెస్ రాజు చిత్రం ‘రమ్’లో ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. మొదట ఈ చిత్రంలో సాధారణంగా ఉండే ఛార్మి క్రమంగా సినిమా చివరికి వచ్చేసరికి మెయిన్ విలన్‌గా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుందట. మొదట్లో అమాయకంగా...తరువాత నెగిటివ్ షెడ్‌లతో చివర్లో పూర్తి నెగటివ్‌గా కనిపించనుందట.

బాలీవుడ్‌పై గురి!

తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న అందాల భామ శృతిహాసన్ దృష్టి ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. ఎలాగైనా హిందీ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని తెగ ఆరాటపడుతోంది. పవన్‌కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’లో భాగ్యలక్ష్మిలా లంగా ఓణిలో మెరిసిపోయిన ఈ చిన్నది అంతకు ముందు ‘ఓ మై ఫ్రెండ్’లోనూ వస్తధ్రారణతో తళుక్కున మెరిసి యువతను మైమరపించేలా చేసింది. ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇందులో పంజాబీ అమ్మాయిగా అందరి హృదయాలను దోచుకుంటానంటోంది. ఈ చిత్రం విడుదలైతే బాలీవుడ్‌లో తానేంటో తెలుస్తుందని చెబుతున్న ఈ చిన్నది ఇప్పుడు మరింత గ్లామర్‌గా హాట్‌హాట్‌గా కనిపించేందుకు ఎలాంటి దుస్తులైనా వేయడానికి సిద్ధమంటూ అన్నింటికీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది.

ఖుష్బూ ఐటమ్!
పెళ్లికి ముందు సెక్స్‌లో తప్పేంటని వాదించి అభిమానుల ఆగ్రహానికి గురైన సీనియర్ నటి ఖుష్బూ ఇప్పుడు తాజాగా ఐటమ్‌సాంగ్ చేసేందుకు సిద్ధమైంది. ముదురు వయసులో మనం ఖుష్బూ అదిరిపోయే నృత్యం చూడబోతున్నాం. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజంగా నిజం. ఖుష్బూ భర్త సి.సుందర్ దర్శకత్వం వహిస్తున్న ‘సమ్‌థింగ్..సమ్‌థింగ్..’ చిత్రంలో ఓ పాటలో ఖుష్బూ నృత్యం చేయనుంది. ఆమెతో పాటు చాలామంది ప్రముఖ నటులను ఈ పాటలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిద్ధార్థ్, బ్రహ్మానందం, హన్సిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మరి కొంత మంది సీనియర్ తారలు సైతం కనిపించనున్నారు. అదీ..సంగతీ!

హరివిల్లు
english title: 
ika
author: 
-సమీర్

మనలో మనం ఎడిటర్‌తో ముఖాముఖి

$
0
0

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం
ఆంధ్రభూమి పత్రిక ఆంధ్రత్వం, తెలుగుదనం, తెలుగు సంస్కృతీ వైభవానికి అద్దం పడుతోంది. ‘సాహితి’లో సమీక్షలు, చర్చావేదిక, వ్యాసాలు, దిగ్గజాల్లాంటి పండితులు ‘్భష’ పై తర్జనభర్జనలతో మాకు ఆనందం కల్గజేస్తున్నారు. కావున మిమ్మల్ని అధికార భాషాధ్యక్షులు (్ఛర్‌మన్)గా ప్రభుత్వం నియమిస్తే ఆ భాష అమలు చేయగల్గుతారని నా విశ్వాసం. ఏమంటారు?
మీరు నా మీద పగబట్టారంటాను.

మీరు తరచూ హిందూ ధర్మ పరిరక్షకులైన పీఠాధిపతుల సరసన కూర్చుని చుక్కల్లో చంద్రుడిలా భాసిస్తున్నారు. ఇచ్చట నాదొక సలహా. దేశభక్తుల చరిత్రలు ధారావాహికంగా వ్రాసిన మీరు, అవధూతలు, హిమాలయాల్లో శత వర్షాలను అధిగమించి జీవిస్తున్న యోగులను గూర్చి వ్రాస్తే అస్మదీయులు ఆనందిస్తారని మనవి. మన్నిస్తారా?
ఎందుకు? మనమే ఒక పీఠం పెట్టేద్దాం.

కొలుసు శోభనాచలం, గరికపర్రు, కృష్ణాజిల్లా
సినిమాల్లో అశ్లీల సాహిత్యాన్ని విమర్శించే పత్రికా సంస్థలు తమదైన వార, మాస పత్రికల్లో స్ర్తి అర్ధనగ్న చిత్రాలను ప్రచురించుట ఎంతవరకు సబబు? అది మీ పత్రికకు మినహాయింపు కాదనుకోండి.
అర్ధనగ్న చిత్రాలన్నీ అశ్లీలం కావు.

ఎం.పాపారావు, బూరగాం, శ్రీకాకుళం జిల్లా
ప్రయివేటుకే నిధుల ధారబోత, ఆరోగ్యశ్రీ పేరిట కార్పొరేట్ ఆసుపత్రులే బాగుపడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు అందిస్తే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందేవి కదా! ఇది దేనికి నిదర్శనం?
కోరలు చాచిన మెడికల్ మాఫియాకు... దాని తీవ్రతను గుర్తించని మన అజ్ఞానానికి!

అపర్ణా దీక్షిత్, విజయవాడ
సిక్కుల ఊచకోత దాదాపు మూడు దశాబ్దాల తరువాత తీర్పు వెలువడింది. ‘మేము కూడా దోషులను ఎప్పటికీ వదలం’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకేనా ఈ శిక్షలు? ఎందుకిలాగ? తీర్పులకి దశాబ్దాలు తీసుకుంటారా? ఎక్కడుంది లోపం?
మనం బ్రిటిషు వాళ్ల నుంచి అరువు తెచ్చుకుని, దాని కర్మానికి దాన్ని వదిలేసిన నిరర్థక న్యాయవిధానంలో.

శివాని, శృంగవరపుకోట
కథల పోటీ ప్రకటన రచయితలకు శుభవార్త. గడువు కూడా చాలా బాగా ఇచ్చారు. మరీ సంతోషం. ఎన్ని కథలైనా ఒకరు పంపవచ్చా?
వచ్చు. వాటిలో కాస్త సరుకుంటే మేలు.

కొప్పరపు లక్ష్మీనరసింహారావు, కానూరు, విజయవాడ
‘ఈ కేసు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి మీరు ఈ విషయం అక్కడే తేల్చుకోగలరు’ అని క్రింది కోర్టులు తీర్పులు చెబుతున్నపుడు, ఇరువురి వాదనలూ వినటం, తీర్పు వాయిదా వేయటం ఈ తతంగమంతా ఎందుకండీ! ముందే చెప్పేయ్యొచ్చు కదా!
ఆ మాట చెప్పటానికీ బోలెడు తతంగం కావాలాయె!

ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు
రోజురోజుకీ మన దేశంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటారు?
మనది అరాచక వ్యవస్థ కనక.

విద్యార్థులలో నైతిక విలువలు తగ్గిపోవటానికి కారణాలు ఏమంటారు?
విద్యగరిపే వారిలో నైతిక విలువలు లేకపోవడం.

బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
లోగడ ప్రవేశపెట్టిన ఇందిరా వికాసపత్ర, చిల్డ్రన్స్ గిఫ్ట్ గ్రోత్ స్కీము మధ్యలో ఆగిపోయినయ్. బాబు ప్రతి ఆడపిల్లకు పెళ్లినాటికి రెండు లక్షలు చేతికి అందేటట్లు చేస్తానంటున్నాడు. బాబు ప్రవేశపెట్టిన పథకం తర్వాత ప్రభుత్వాలు కొనసాగించకపోతేనో?
ఆయన కొనసాగిస్తాడన్న నమ్మకం ఉందా?

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
జ్యోతిషమే నిజమైన శాస్తమ్రయితే మొన్న ఉగాదినాడు ఏ పార్టీ పంచాంగకర్తలు ఆ పార్టీయే రాబోయే కాలంలో పదవిలోకి వస్తుందని ఎలా చెబుతారు?
అది వాళ్ల సొంత పైత్యం. జ్యోతిషానికి సంబంధం లేదు.

ఢిల్లీలో ఓ పసిపాపను అత్యాచారం చేసిన విధం ఆడవాళ్లం కూడా కలసి చర్చించుకోలేక పోయాము. సుష్మా స్వరాజ్ గారన్నట్టు నిందితుణ్ణి ఉరి తీయాలి. ప్రజలందరూ కోరుకునేది కూడా ఇదే. ప్రజాభిప్రాయాన్ని మన్నించడమేగా ప్రజా ప్రభుత్వమంటే. వెంటనే ఉరి తీసేటట్టు చట్టాలు మార్చవచ్చును కదా. మీరేమంటారు?
అది జరగాలంటే మొత్తం న్యాయ విధానానే్న విచారణ క్రమానే్న, సాక్ష్యాల చట్టానే్న మొత్తంగా మార్చాలి. మన బద్ధకస్తుల రాజ్యంలో అది అయ్యేపని కాదు.

జి.నీలంనాయుడు, బర్కత్‌పురా, హైదరాబాద్
తమ దేశంపై దాడి చేసి వేలాది ప్రాణాలను బలి తీసుకున్న లాడెన్ వేట కోసం ఆఫ్గనిస్తాన్‌పై అమెరికా దాడి చేస్తే అమానుషం, అన్యాయం అని కమ్యూనిస్టులు గొంతు చించుకుంటారు. కానీ కమ్యూనిస్టు చైనా 19 కి.మీ. మన భూభాగంలోకి చొచ్చుకొని వస్తే మన కమ్యూనిస్టులకు కళ్లు మూసుకు పోయాయా?
షరా మామూలే!

కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
పార్లమెంటుపై దాడి, బొంబాయి అల్లర్లు వీటిలో సూత్రధారులేగాక ముఖ్యపాత్రధారులైన కసబ్, అఫ్జల్‌గురు, గతంలో నేపాల్‌లో భారతీయ విమానాన్ని హైజాక్ చేసిన మరొక పాకిస్తాన్ ముష్కరుడు - వీరందరూ మహా ఘనత వహించిన మంత్రిగారి దృష్టిలో ‘హిందూ’ ఉగ్రవాదులేనా?
ఏమో!

సి.ప్రతాప్, విశాఖపట్నం
ఒక ప్రభుత్వోద్యోగి వంద రూపాయల బిల్లుపై తప్పుడు సంతకం చేస్తే డిపార్ట్‌మెంట్ వివరణలు అడుగుతూ రకరకాలుగా వేధిస్తుంది. మరి ప్రజా ప్రతినిధులు, అవినీతి అధికారులు తప్పుడు నిర్ణయాలు చేసి వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంటే అడిగేవాడెవడూ లేడు. స్కాం బయటకు వచ్చి హంగామా అయితే గాని వారిపై చర్యలు ప్రారంభం అవవు. కామెంట్ ప్లీజ్!?
అవీ కంటితుడుపు చర్యలే. జనాన్ని జోకొట్టేందుకే.

చదువులు, ప్రాజెక్టులు, కాంపిటీషన్ల పేరిట పిల్లలపై తీవ్ర వత్తిడి కలుగుతోంది. కాస్త స్కూలు టైమింగ్స్ తగ్గించి పిల్లలకు ఆట, పాట నేర్పించండి అంటూ మా పిల్లలు చదివే స్కూలు ప్రిన్సిపాల్‌ను అభ్యర్థిస్తే నన్ను ఎగాదిగా చూసి వెటకారంగా మాట్లాడాడు. ఏమిటీ వైపరీత్యం సార్?
ఆయనా ఆ మాటే అంటాడు!

మహమ్మద్ యూసుఫ్, కాజీపేట, వరంగల్ జిల్లా
25 శాతం మహిళా పోలీసులను నియమించండి అని ఒక పార్టీ నేతలు అంటున్నారు కదా! 25 శాతం ఎందుకూ? 100 శాతం మహిళా పోలీసులనే నియమించమనండి. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలైనా నిరోధించగలం. మీరేమంటారు?
పోలీసుల వైఫల్యానికి కారణాలు వేరు. అందులో ఆడ, మగ తేడా ఉండదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003
e.mail : mvrsastry@gmail.com

ఎడిటర్‌తో ముఖాముఖి
english title: 
editor

ఇధి కథ కాదు

$
0
0

ముంబై-కుర్లా రైల్వే స్టేషన్, అహమదాబాద్ రైలు కోసం వేచాం-కొంత దూరంలో పది పనె్నండేళ్ల బాలుడు బూట్ పాలిష్ చేస్తుండేవాడు. ఆ బాలుడు తొడుక్కున్న చొక్కా అతని సైజ్‌కు మించిందైనా శుభ్రంగా ఉండేది. పాలిష్ కోసం వచ్చే బూట్లు, చెప్పులను మొదట పొడిగుడ్డతో శుభ్రం చేసి, దుమ్ము తొలగించిన తర్వాత పాలిష్ వేసి, గరగరా రుద్దుతుండేవాడు. ఆ బాలుని ఏకాగ్రత న న్ను ఆకర్షించింది.
బడికి వెళ్లే వయసులో ఇలా పాలిష్ పని చేపట్టేందుకు బలమైన కారణమేదో వుండాలనుకున్నాను. ఒకమారు ఆ బాలునితో మాట్లాడాలనుకున్నాను. ‘నా చెప్పులకు పాలిష్ వేయి’ అంటూ చెప్పులు ఆ బాలుని ముందుంచాను. ఒకసారి నావైపు చూసి ‘మీ చెప్పులింకా కొత్తగానే ఉన్నాయి. పాలిష్ అవసరం లేదు’ అన్నాడు. నా తోటి ప్రయాణీకులు వారి చెప్పులను పాలిష్ చేయించుకున్నారు.
వాడు పాలిష్ చేస్తుండగా వాడిని గురించిన వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. ఆ బాలుని తండ్రి రైల్వేస్టేషన్‌లో కూలీగా ఉండేవాడు. ఆ బాలునితో పాటు అతని అక్క, ఈ బాలుడు, వారి తల్లి ఇళ్లల్లో పాచి పని చేసేవారు. వీలున్నప్పుడు చెత్తకుండీల్లోని ప్లాస్టిక్ పొట్లాలను సేకరించేవారు. అలా బతుకు బండి లాగుతున్నారు. వారిలో ఒక తమ్ముడు చాలా చురుకైన వాడు. మూడో తరగతి చదువుతున్నాడు. వాడ్ని బాగా చదివించి ఆఫీసర్‌గా చూడాలని ఉబలాటపడుతుండేవారు.
ఇదివరలో ఇట్టి కథలు విన్నాను. అయినా వారి పరిస్థితి గమనించి, వారికే విధంగానైనా సహాయం చేయాలనిపించింది. నా పర్సులోని 50 రూపాయలు తీసి ఆ బాలుని ముందుంచి ‘‘బాబూ ఈ పైకంతో మీ ఇంటికేమైనా సామాన్లు తీసుకెళ్లు’’ అన్నాను. అందాకా కళకళలాడుతున్న బాలుని ముఖం తెల్లబోయింది. ‘‘హమ్ బీఖ్ నహి మాంగ్తే సాబ్ హమ్ మెహనత్‌కీ కమాయి ఖాతేహై (మేం బిచ్చమెత్తం కష్టపడి పని చేసి పొట్టపోసుకుంటాం) అంటూ, నేను అతని ముందుంచిన యాభై రూపాయలను వాపస్ చేసాడు. నేను అంతమాత్రాన వదలలేదు. నేను ఇచ్చిన పైకాన్ని తీసుకోరాదని నీకు ఎవరు చెప్పారు?’’ అని అడిగాను. ఆ బాలుడు నావైపు చూస్తూ ‘‘మా నే సిఖాయా హై, చోరీమత్ కర్నా, ఝూట్ నహీ బోల్‌నా, గలత్ కామ్ మత్ కర్‌నా, ఔర్ భీక్ నహీ మాంగ్నా’’- ‘ఏ బోలాహై మేరీ మా నే(మా అమ్మ చెప్పింది దొంగతనం చేయకు, అబద్ధమాడకు, చెడ్డపనులు చేయకు, బిచ్చమెత్తుకోవద్దు) ఇలా చెప్పింది మా అమ్మ’’ అన్నాడు..
కొనే్నళ్ల క్రితం మా వద్ద ఒక కారు డ్రైవర్ ఉండేవాడు. చాలా మంచివాడు. పాతికేళ్ల లోపే వుంటుందతని వయసు. చెప్పిన వేళకు కచ్చితంగా వచ్చేవాడు. ఎంత పనివున్నా నవ్వుతూ చేసేవాడు. ఎంత పరిచయమున్నా అతన్ని గురించి కాస్త అనుమానం ఉండేది. పెద్దలు నాతో మాట్లాడుతూ, ‘‘ఒంటరిగా అతనితో ప్రయాణం చేయకు. రాత్రి ప్రయాణం ప్రమాదకరం. ఎక్కువ చనువుతో ఉండకు’’ అని సలహాలిస్తుండేవారు.
ఒకరోజు అతను హడావుడిగా వచ్చి ‘‘అమ్మా, నాకు దయచేసి వెంటనే పాతిక వేలు ఇవ్వండి. రెండు నెలల్లో వాపసు చేస్తాను. నా తమ్మునికి గల్ఫ్‌లో మంచి ఉద్యోగం దొరికింది. అందుకు డబ్బు కావాలి’’ అన్నాడు.
సరే అంటూ డబ్బులిచ్చాను. రెండు నెలల తర్వాత మరలా వచ్చాడు. అమ్మా నేను డ్రైవర్ పని మానుకుంటాను. నా తమ్ముడున్న చోట నాకూ ఉద్యోగం దొరికింది. నేను రెండు నెలలు పని చేసి మీ డబ్బు మీకు వాపసు చేస్తాను’’ అన్నాడు. ‘ఫరవా లేదు. ఒకవేళ తిరిగి ఇవ్వకపోయినా బాధలేదు. నీకు మంచి జరగాలి. నీ వీలునుబట్టి తిరిగి ఇవ్వచ్చు’’ అన్నాను.
‘‘లేదు లేదు మీ రుణం త్వరలోనే తీర్చగలను. వీలైనంత త్వరగా పైకం పంపిస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు.
‘‘ఇట్టి సందర్భాల్లో ఒక సూత్రం పాటించాలి. ఎవరికైనా సహాయం చేసే ముందు మన వద్దనున్నదెంత? అని గుర్తుంచుకోవాలి. మీరు ఇచ్చిన మొత్తం మరలా అందకున్నా చింతించనక్కరలేదు. మనం సహాయం చేయాలి. ఇది దానం అని భావించి మరలా ఇవ్వకున్నా పర్వాలేదు అనుకుని ఇవ్వాలి. ఇందువల్ల వైమనస్యం ఏర్పడదు’’ నేను ఆ సూత్రానే్న పాటించాను.
తర్వాత కథ వినండి. ఆ డ్రైవర్ వెళ్లి నెలలు గడిచాయి. రెండు మూడేళ్లు గడిచాయి. నేను దాదాపు మరిచిపోయాను.
నా పరిచితులు కలుసుకుని మీ డ్రైవర్ ఇటీవల రెండుమూడు మార్లు కనిపించాడు. మీ గురించి అడిగేవాడు. మరోమారు కనబడీ మాట్లాడకుండా వెళ్లేవాడు.
ఒకరోజు కాలింగ్ బెల్ మోగింది. ఇంటి ముందు పరిచయం ఉండీ లేనట్టు ఒక వ్యక్తి నిల్చున్నాడు. నన్ను చూసి, నాలుగడుగులు ముందుకొచ్చి ‘‘అమ్మగారూ, బాగున్నారా?’’ అన్నాడు. వెంటనే జ్ఞప్తికొచ్చాడు.
‘‘రా, బాబూ లోపలికి రా, కూర్చో’’ అన్నాను. అమ్మగారూ ముందుగా నన్ను క్షమింపగోరుతున్నాను. మీ అప్పు తీర్చడంలో చాలా ఆలస్యం జరిగింది. మూడు నాలుగు మార్లు ఇక్కడికి వచ్చాను. కాని సిగ్గుతో మిమ్ముల్ని కలుసుకోలేదు. మా తల్లిగారు కాన్సర్‌తో బాధపడుతోంది. తండ్రి చనిపోయారు. నేను ఉద్యోగం చేస్తున్నచోట బాగా డబ్బున్న ఆమెతో నా పెళ్లి జరిగింది. ఉద్యోగం మానుకుని బిజినెస్ ప్రారంభించాను. డబ్బు కొరత ఉండేది. అయినా రోజూ మిమ్ము గురించి తలచుకునేవాడ్ని. నా గురించి మీరేమనుకుంటారో అని బాధపడుతుండేవాడ్ని. మీ అప్పు తీర్చక చస్తే ఎలా? అన్న చింత వేధిస్తుండేది. నా భార్యతో మాట్లాడుతూ ఒకవేళ నేను చస్తే అప్పు తీరుస్తాను అని ఆమె ప్రమాణం చేయించుకున్నాను’’ అన్నప్పుడు అతడు కంట తడిపెట్టడం గమనించాను.
డబ్బుతోపాటుగా పెద్ద డబ్బా నిండా ఖర్జూరం, పిల్లలకు బిస్కట్లు, చాక్లెట్లు, అత్తరు సీసా పట్టుకుని వచ్చాడు.
మన రాజకీయ నాయకులలో, న్యాయ వ్యవస్థలో, దేవాలయాలు, పీఠాధిపతులలో ఇట్టి సూక్ష్మ సంవేదన కానరాకున్నదే? ఒక నిరక్షరాస్యునిలో, బూట్ పాలిష్ చేసేవాడిలో, డ్రైవర్‌లో వున్న అంతశ్శుద్ధి మనలో ఎందుకు లేదు? మానవులలో విలువలు నశిస్తున్నాయి ఎందుకు? అంటూ గప్పాలు కొడ్తాం. విలువలెక్కడికీ పోలేదు. పోవు కూడా..్భరతీయ చైతన్యం ఇంకా జాగృతంగానే ఉంది. బూట్ పాలిష్ చేసే బాబులో, ఆ బాబును మంచి మార్గంలో నడిపించే అతని తల్లిలో, పాతికవేలు అప్పు తీసుకుని ఐదేళ్లు గడిచినా తీర్చలేకపోయానే అంటూ మానసికంగా కుమిలిన డ్రైవర్ ఇలాంటి వేలాది మందిలో లక్షలాది ప్రజల్లో విలువలింకా సజీవంగానే ఉన్నాయి.
(‘తరంగ’ కన్నడ వారపత్రికలోని సంపాదకీయం చదివి రాసిందీ రచన)

ముంబై-కుర్లా రైల్వే స్టేషన్, అహమదాబాద్ రైలు కోసం వేచాం
english title: 
i
author: 
-జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ

దేశీ సంప్రదాయంలో చేర్పులు-మార్పులు

$
0
0

భూమి, అడవి, నీరులాగే సంస్కృతి ఒక ఉత్పత్తి సాధనం. తరాల తరాలకు సంస్కృతిని అందించడంలో జ్ఞాననిధి- అందులో భాషది కీలకపాత్ర. వస్తు మార్పిడి నుండి, వ్యాపారంలో నగదు, బంగారం చలామణీలోకి వచ్చినట్లే, భాష కూడా లిఖిత రూపంలోకి వచ్చి, రాజయోగం పట్టేసరికి కొత్త అవకాశాలతోపాటు- కొత్త సమస్యలు కూడా వచ్చిపడతాయి. అతిశయాలు, ఆధిపత్య ధోరణులు పెరుగుతాయి.
బ్రిటిష్‌వారి రాకతో చదువుకున్నవాళ్ళకు ఉద్యోగావకాశాలు ఎక్కువ కావడంతో లిఖితభాషకు గిరాకీ పెరిగింది. చదువుతోపాటు, వారు వారి శాస్త్రాలను పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. కొందరు మాతృభాషలో లిఖిత భాషకు- వాడుక భాషకు మధ్య పెరుగుతున్న తేడాను తగ్గించే ప్రయత్నం చేశారు. మరికొందరు తెల్లవాడి శాస్త్రాలనే వాడుక భాషలో అనువదించారు. బహుకొద్దిమంది భారతీయ లిఖిత సంప్రదాయాలలో ఆయుర్వేదం వంటి ప్రత్యేకతలు ఈ పెను దుమారంలో కొట్టుకుపోకుండా నిలబెట్టడానికి జీవితాలను ధారపోశారు. ఏ అండదండలు లేని పల్లె ప్రజలు, గిరిజనుల వారసత్వం కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుంది. మన వారసత్వంలోని మార్గ, దేశి సంప్రదాయాలలో మార్గసంప్రదాయం అంటే లిఖిత, నృత్య, గానాలకే పెద్దపీట. దేశి సంప్రదాయాలకు ఆదరణ తగ్గడం, కులముద్ర, సామాజిక స్పృహ పేరిట కవులు కళాకారులు వాటిని వశం చేసుకోవడంలో ఈ సంప్రదాయాలు వెలవెలపోతున్నాయి.
ఈ అలిఖిత సంస్కృతిని వల్లెవేస్తూ ప్రచారం చేసే ఆశ్రీత కులాలు కళాకారులు, సంచార జాతులు క్రమంగా కూలివాళ్ళుగా మారారు. దానితో పల్లె ప్రజల జ్ఞానం కొడిగట్టుకుపోయింది. ఇపుడు జనం, తమ సాహిత్యం తాము కూర్చుకోవడం లేదు. తమ విత్తనాలు, ఎరువులు, మందులు తము తయారుచేసుకోవం లేదు. జానపదుల, గిరిజనుల జ్ఞానాన్ని దొంగిలించి బహుళ జాతి సంస్థలు పేటెంట్ చేసుకుంటున్నాయి. స్థానిక వంగడాల స్థానంలో తాము తయారుచేసిన వంగడాలను దించుతున్నారు. జానపద సంప్రదాయాలలో శుచి, శుభ్రం, సంస్కారం తక్కువని సంస్కృతంలో కొందరు పూజలు నేర్పిస్తుటే, ఈ రెంటికి దూరంగా కొందరు మరోవైపు లాగుతున్నారు. మనం భాష ఒక్కదానే్న పొగొట్టుకోవడం లేదు. మన వారసత్వాన్ని మొత్తం పొగొట్టుకుంటూ బానిసలుగా మారిపోతున్నాము. తెల్లవాడి పక్కన చోటుదొరికి రచ్చగెలిస్తే చాలుననే ధోరణి పెరిగి, ఇల్లు దివాళా తీస్తున్నా మనకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించడంలేదు.
అడవులు, బీళ్ళను మన తెగలు, పశువుల కాపరులు, మత్స్సకారులు నాశనం చేస్తున్నారని, శాస్తవ్రేత్తలు వారి చదువులు చదివిన ఉద్యోగులు ప్రచారం చేయసాగారు. ఈ వాదాన్ని తిరస్కరిస్తూ, ఈ జాతుల వనరుల యాజమాన్య పద్ధతులే మేలైనవిగా ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు వెలువడసాగాయి. వాటిలో 1982లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆచార్యుడు గంగాధర్, అహమ్మదాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆచార్యులు అనిల్‌గుప్తాలు చెంచులు తేనె, బంక, వేట, వేటలో పాటించే యాజమాన్య పద్ధతుల అధ్యయనం విశిష్టమైనది. కాని ఈ అధ్యయనాలకు మనం తెలుగు నుడికారం అద్దలేకపోయాము. ‘దేశ్య పదజాలాన్ని ప్రమాణభాషలో పునరుజ్జీవింప జేయడానికి, మాతృభాషలో కొన్ని సామాన్య శాస్త్ర గ్రంథాలు రచించడానికి- వయోజన విద్య వ్యాప్తికి మాండలిక వృత్తి పదకోశాలు ఉపయోగపడాలి’ (1960) అ ఒకనాడు ఆశించినది మొదలు కాకపోగా,నేడు భాషను బతికించుకోవడమే పెద్దసవాలుగా మారింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, సహజ వనరులన్నీ నాశనమైనాక ప్రభుత్వాలకు జ్ఞానోదయమై ఆయా తెగల, జాతుల జ్ఞానానికి- వారి యజమాన్య పద్ధతులకు ప్రాధాన్యతనిస్తూ చట్టాలు చేయసాగాయి. వాటిలో ఇటీవల వచ్చిన అటవీ హక్కుల గుర్తింపుచట్టం, త్వరలో రానున్న తీర ప్రాంత మత్స్యకారుల హక్కుల రక్షణ చట్టం ముఖ్యమైనవి. కాని ఈ చట్టాల అమలు ఇళ్ళ స్థలాలు, సాగు భూములకు పట్టాలివ్వడంగా సరిపెడుతున్నారు. ఈ మాత్రం కూడా అందనివారు తిరగబడుతున్నారు.
విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు, జానపద కళలకు పేటెంట్లు, కళాకారులకు అవార్డులు, పింఛన్లు, సాహిత్యాన్ని గ్రంథస్థం చేయడంలో మునిగిపోతే, విశ్వవిద్యాలయాలు వదిలిపెట్టి, పరిపాలన వ్యవస్థతో తలపడుతున్నవారి కృషి ఫలితంగా ఇటీవల వచ్చిన గిరిజనుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద జారీచేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలమీద ‘చేవడిబస, మగనాలమెట్ట, చీపురుపొలాలు’ అనే గోదావరి జిల్లాలో కొండరెడ్డి తెగ సంప్రదాయ పరిభాష చోటుచేసుకుంది. మిగిలిన తెగలు వాడుకొనే ఇటవంటి పదాలు సేకరించి వాటి గుర్తింపు కోసం గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎ.విద్యాసాగర్ 2011 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, జిల్లాలో వాటిని పట్టించుకునేవాడే లేడు. సామాజిక స్పృహగల రచయితలకుగాని ప్రాంతీయ ఉద్యమాలలో మమేకమై పనిచేస్తున్న భాషాభిమానులకు, మేధావులకు కూడా ఈ విషయాలు పట్టవు.
అందువల్ల కాస్తో కూస్తో చదువుకున్న చెంచులు నల్లమలలో ఈ చట్టం కింద జీవ వైవిధ్యం, మేధోసంపత్తి హక్కులు, ఆ మాటకొస్తే మొత్తం అడవిమీద తమ జ్ఞానం ఆధిక్యతను నిరూపించకుంటూ, ఈ రాజ్యం మాదేనని చాటుకుంటూ, ఇంతకుముందే ‘నడుస్తున్న చరిత్ర’లో ధారావాహికంగా వచ్చిన తమ ఆత్మకథ ‘నల్లమల చెంచు ప్రపంచం’ పుస్తకావిష్కరణ జరుపుకున్నారు.
****
దేశి సంప్రదాయాలలోగల వైవిధ్యం వారి అస్మితల గూర్చి తెలియక పునరుజ్జీవన దృష్టితో కాక, సంస్కరించే దృష్టితో దుర్గపూజలు, సత్యనారాయణ వ్రతాలు, శ్రీరామాలయాలు, భజన, దళిత గోవింద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొందరు శిష్టవర్గం వీటివైపు మొగ్గుచూపుతున్నారు. విశాఖ జిల్లా పాడేరు మన్యం ఇలవేల్పు మోదమ్మను మంత్ర తంత్రాలతో పూజించడం మంచిదే కావచ్చు. ఆ మోదమ్మను గూర్చి గిరిజనులు తరతరాలుగా పాడుకునే ఈ తుమ్మెద పదాలకి అంతే ప్రాధాన్యత ఇవ్వకపోతే జన సామాన్యానికి, ఆ కథ ఇచ్చే సందేశానికి దూరవౌతాము (మే 14 పాడేరులో మోదమ్మ జాతర ఆఖరిరోజు).
‘‘శరణు శరణు దుర్గాలమ్మలు- తుమ్మెదీరో- మీ చరణాలు తప్పలేదు
మీ చరణాలు తప్పినగాని- తుమ్మెదీరో- మీ కరుణాలు తప్పలేను
మీలాటి కాలమురాగా- తుమ్మెదీరో మిమ్ముతలచి పాడుతాము’’
దిగువ రాజ్యానికి చెందిన మోదమ్మ మొదలైన యువరాణులు- దుర్గాండ్లు, కొండరాజులు- దేశిరాజులను పెళ్ళిచేసుకుంటారు. వారిలో మోదమ్మ కొడుకు సంజీవరాజు ప్రేమించిన మాలగుంగుల పెళ్ళి జరిపించి ఆమెను రాజ్యానికి రాణిని చేయడం ఈ పాట సారాంశం. ఎగువవారు దిగువవారు, అగ్రకులాలు, అంటరాని కులాలుగా విడిపోయిన గిరిజనప్రాంతాలలో, ఐకమత్యం ఆవశ్యకతను బోధించే పాట యిది.
మనకు మంగళవాద్యాలు డోలు, సన్నాయివలెనే గిరిజనులకు నరికె, తుడుము, సన్నాయి ఉన్నాయి. భజన సెట్లు ఉచితంగా పంచిపెట్టడంతో ఈ సంప్రదాయ వాద్యాలు కనుమరుగౌతున్నాయి. ఆ ఇచ్చేదేదో వారి పద్యాలను కూడా ఇస్తే బాగుంటుంది కదా.
దాతలు వారి ఇష్టాల మేరకు ఆయా దేవతల గుళ్ళు కట్టించడంవల్ల సంప్రదాయం ప్రకారం మత్స్యదేశంగా చరిత్ర పురాణ ప్రసిద్ధి పొందిన విశాఖ మన్యంలో ‘జోర జోర జోర పంచపాండవులార’ అని పాడుతూ నంది పండుగలో పాండవులను ఆరాధించే సంప్రదాయాలు క్షీణిస్తున్నాయి.
ఈ పాట ప్రకారం పాండురాజుకు ఇద్దరు భార్యలు. దిగువ భార్య కుంతి- కొండ భార్య అసివేయుల ‘పాప’. కుంతికి కనె్నరికంలో కోలన్న (కర్ణుడు) పుట్టాడు. కొండ భార్యకు పాండవులు పుట్టారు. ఈ కోలన్న తండ్రి వెంట కొండ ప్రాంతాలకు వెళ్లి పాండవులతోకలిసి దిగువవాడైన దుర్యోధనుడితో యుద్ధం చేస్తాడు. ‘పిట్టగడ్డ జలంపల్లి- పట్టపుకోలన్న’ అని కోలన్నను పాటలో ఆహ్వానిస్తారు. భారత కథ- గిరిజన ప్రాంతంలో వారి వివాహ సంబంధాలు ఎగువ- దిగువ వ్యత్యాసాలకు తగ్గట్టుగా మారిపోతుంది.
ఈ మన్యంలోనే మత్స్యలింగేశ్వర స్వామికి శివరాత్రి జాతర జరుగుతుంది. ఇక్కడ గిరిజనులు చెప్పుకునే స్థలపురాణం విశిష్టమైనది. మత్స్యదేవత తన సంతానాన్ని కబళిస్తున్న క్రూర జంతువులు, నాగరాజులనుండి రక్షించవలసిందిగా ఆ మత్స్యలింగేశ్వర స్వామిని కోరుతూ, తన పిల్లలను ఆయన రక్షణలో ఉంచి, నాగరాజులతో యుద్ధానికి మత్స్యపర్వతానికి పోయిందట. క్రూర జంతువులకు సాధు జంతువులకు జరిగే జీవన పోరాటం చిత్రించే ఈ కథ ఆ జాతరలో గుర్తుచేసుకోవాలి.
‘‘లక్ష్మి కల్యాణమో- వైభోగమో గౌరి కల్యాణమో- శుభలగ్నమో
అలవరో! సీతమ్మ- నీ పెండ్లివారు గున్న చింతలలోన- గుర్రలవారు’’
ఈ విధంగా గోదావరి మన్యంలో గిరిజనులు పెండ్లిపాటలు పాడుకుంటారు.
దళిత గోవిందంలో శ్రీనివాస కల్యాణం చేసేటప్పుడు గిరిజన పేరంటాండ్ర చేత వారి పెండ్లి పాటలు పాడించవచ్చు. అప్పటికప్పుడు పాడమంటే వాళ్ళు పాడలేరు. దానికి కొంత ముందు ప్రయత్నం చేయాలి. మంత్ర తంత్రాలు, గంభీరమైన ఉపన్యాసాలతో మూసపోతగా కార్యక్రమాలు ఇలా సాగుతుంటే- తీర్థాలు జాతరలలో వ్యాపార సంస్కృతికి తగ్గట్టుగా వేడుకలు జరుగుతుంటాయి. ఇక మత ప్రచారాలు స్థానిక భాషలలో బాణీలతో ప్రజలలోకి పోతున్నాయి. అయితే దేశి సంప్రదాయాలు- కథలు అప్పుడప్పుడు అస్తిత్వ పోరాటాలలో కీలకపాత్ర వహిస్తున్నాయి. రకరకాల రంగులు పులుముకుంటున్నాయి. ఇందరి మధ్య సమాజం గందరగోళంగా పడిపోతుంది.
ఉత్తరాదిన వాల్మీకి రామాయణం బదులు తులసీ రామాయణం చదివేవారు ఎక్కువ. కన్నడంలో బసవేశ్వర వచనాలు, అక్కమమహాదేవి శరణాలే పురాణాలు. తుకారం, జ్ఞానేశ్వర్, కనకదాసు మొదలైనవారి భక్తి సాహిత్యం స్థానిక భాషలలో ఉన్నాయి. వాటికి ప్రచారం చాలా ఎక్కువ. నాయనార్లు, ఆళ్వార్లు కూర్చిన దివ్య ప్రబంధాలు తమిళ భాషలోనే ఉన్నాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు కంటే బ్రహ్మాండంగా చిత్తూరు జిల్లా అంతటా వేసవికాలంలో 18 రోజులపాటు ద్రౌపది తిరునాళ్లు, గంగజాతరాలు జరుగుతాయి. ఒకనాడు తత్వాలు, కీర్తనలు, కోలాటాలతో మన పల్లెలు మారుమోగిపోయేవి. వర్ణ్ధర్మాలు గౌరవించిన వైదికులు, వాటిమీద తిరుగుబాటు చేసి సమ సమాజం కోసం పాటుపడిన బ్రహ్మనాయుడు, బసవేశ్వరుడు, బ్రహ్మంగారు, వేమన మన వారసత్వంలో భాగమే.
తమకు మంత్ర తంత్రాలు, సంస్కృతం రావనే న్యూనతాభావాన్ని ఆశ్రీత కులాలవారిలో తొలగించాలి. అటు శ్లోకాలు, ఇటు కీర్తనలు, పదాలు, వారసత్వంగా వచ్చిన తమ కథాగేయాలు కలిపి తంతును రక్తి కట్టించే ధైర్యం వారిలో కలిగించాలి. పూజారులను తయారుచేసే కార్యక్రమాలలో ఈ దేశీ సంప్రదాయాలలు కూడా భాగం కావాలి.
దేశి సంప్రదాయాలలో మన వారసత్వాన్ని పునరుజ్జీవింపచేయడానికి కావలసిన వివేకంతో పనిచేసినపుడే జనాన్ని పెడత్రోవ పట్టించే ధోరణులకు అడ్డుకట్టవేయగలం.

భూమి, అడవి, నీరులాగే సంస్కృతి ఒక ఉత్పత్తి
english title: 
changes
author: 
- ‘శక్తి’ శివరామకృష్ణ 9441427977

పాడిన పాటే మళ్లీ మళ్లీనా!?

$
0
0

స్పందన
====
తెలుగులో మొదటి వ్యావహారిక భాషావాది ఎవరని ప్రశ్నిస్తే కందుకూరి వీరేశలింగంగారనో, గుఱజాడ అప్పారావుగారనో సమాధానం వస్తుందన్నారు. గుఱజాడవారి సంగతి అలా ఉంచి వీరేశలింగంగారిని వ్యావహారిక భాషావాది అనడం ఏమిటి? వీరేశలింగంగారు వ్యావహారిక భాషకి వ్యతిరేకి. ఆయన రచనలు గ్రాంథికాలు, శిష్ట వ్యావహారికాలు. గద్య తిక్కన అని ఆయన బిరుదు. ‘‘స్వామినేని ప్రభావంతో గ్రాంథిక భాషావాది అయిన కందుకూరి వీరేశలింగంగారు తన మార్గాన్ని మార్చుకుని వ్యావహారిక బాట పట్టాడు’’ అన్నారు.
వీరేశలింగంగారు వ్యావహారిక భాషలో వ్రాసిన ఏదో ఒక గ్రంథం ఈ సందర్భంగా రజాహుస్సేన్‌గారు ఉదహరించలేదు. విశ్వనాథవారు వ్యావహారిక భాషలో నవలలు వ్రాశారు కాని వీరేశలింగంగారు అలా వ్రాసినట్లు లేదు. అలాంటి గ్రంథం ఏదైనా హుస్సేన్‌గారి దృష్టిలో ఉంటే తెలియజేయవలసినదిగా మనవి. సంస్కృతంలో ‘హితోపదేశమ్’ అని గ్రంథం ఉంది. దానిని మాక్సుమూలర్ జర్మన్ భాషలోకి అనువాదం చేశాడు. స్వామినేని వారు ఈ పేరు చూచి తన గ్రంథానికి హితసూచని అని పేరు పెట్టి ఉండవచ్చుకదా. ‘‘హితసూచనికంటె ముందే ఏనుగుల వీరాస్వామయ్యగారు తన కాశీయాత్రలో వ్యావహారిక బీజాలు నాటారు’’ అన్నారు. బీజాలు నాటడం కాదు. వీరాస్వామయ్యగారు కాశీయాత్రా విశేషాలన్నీ గ్రంథస్థం చేశారు. అది పూర్తి వ్యావహారిక భాషలో వ్రాయబడింది. ఒక విధంగా దానిని మొట్టమొదటి వ్యావహారిక గ్రంథంగా చెప్పవచ్చు. వీరేశలింగంగారు స్వామినేని వారి ఆశయాలు అభిప్రాయాలు హితసూచనిలో విశేషాలు మొత్తం కాపీ చేశారని ఇదివరకు ఒక రచనలో వివరించారు. తిరిగి ఇప్పుడు అదే చెబుతున్నారు.
మన శతక పద్యాలలో అనేక సంస్కృత నీతి సూక్తుల అనువాదాలున్నాయి. సుమతీ శతకాలలోను దాశరథీ శతకంలోను కూడా ఉన్నాయి. అందువలన ఆయా కవులు వాటిని కాపీ చేశారని అనవచ్చా? ఒకే విషయాన్ని వివిధ కవులు వివిధరీతులలో వివరిస్తారు. ఛందోబద్ధమైన రచనలన్నీ నిష్ప్రయోజనాలని అవి ఎవరికి అర్థంకావని, అందువలన తేలిక వచనంలో వ్రాయాలని స్వామినేని వారి అభిప్రాయం అన్నారు. వేమన తన భావాలన్నీ తేట తెలుగు వచనంలో వ్రాస్తే అవి ఇప్పటివరకూ జీవించి ఉంటాయా?
ఛందోబద్ధమైన పద్యంలో ఒక శక్తి ఉంది. దానిపై కుతూహలం గల పాఠకునికి సులువుగా కంఠస్థమవుతుంది. అలాగే కొన్ని ఛందోబద్ధం కాని గేయాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా అట్టి శక్తి ఉంటుంది. ఇక్కడ ప్రక్రియ ప్రధానం కాదు. కవి ప్రతిభ. వచన కవిత్వానికి ఛందస్సు అవసరం లేదు. అలాంటివి కూడా కొన్ని సందర్భాలలో అందరికీ అర్థం కావడంలేదు. అందరికి అర్థమయ్యే కవిత్వంలో వ్రాసినా ఏ కవీ తన భావాలను నూటికి నూరుపాళ్లు కాగితంపై పెట్టలేడు. ప్రాచీన తెలుగు గద్య పద్యాలలో శకట రేఫం విధిగా ఉపయోగింపబడింది. ఇప్పుడుకూడా కొందరు వాడుతున్నారు.
నేడు మనం వాడుతున్న ‘ర’ అను అక్షరం లఘు రేఫం. అనగా తేలికగా పలకాలి. ఇది సంస్కృత అక్షరం. దీనికి ఒత్తులేదు. శకట రేఫం తెలుగు అక్షరం. చెరకు అని వ్రాయకూడదు ‘చెఱకు’ అని వ్రాయాలి.
ఇక్కడ లఘు రేఫమయిన ‘ర’ వాడకూడదు. అందువల్ల ‘కర్ర’ అని వ్రాయకూడదు. ‘కఱ్ఱ’ అని వ్రాయాలి. అందరు చేస్తున్న తప్పు మేమూ చేస్తాం అంటే ఎలాగ?
‘‘సాహిత్యంలో వీరేశలింగంగారి సంతకంతో ఉన్న హితసూచని ప్రతిని వాఙ్మయ మహాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారి వద్ద తాను చూచినట్లు దీన్ని బట్టి హితసూచని గ్రంథం వీరేశలింగంగారిపై ప్రభావాన్ని చూపి ఉండవచ్చునని ఆరుద్ర తన సమగ్రాంధ సాహిత్యంలో అభిప్రాయపడడం గమనార్హం’’ అన్నారు. వీరేశలింగంగారి సంతకంతో ఉన్న హితసూచని ప్రతిని గోపాలకృష్ణయ్యగారివద్ద ఆరుద్ర చూడడం జరిగింది గనుక ఆ పుస్తకం వీరేశలింగంగారిదే కదా. అది అక్కడకు ఎందుకు వచ్చింది చెప్పలేదు. తమ పుస్తకంపై ఎవరైనా పేరు ఊరు వ్రాసుకుంటారు కాని సంతకం చేయరు.
దానిని ఎవరికైనా బహుమతిగా ఇస్తే సంతకం చేస్తారు. ఆరుద్రగారి ఊహ సిద్ధాంతమా? రజాహుస్సేన్‌గారు స్వామినేని వారి అభిమాని కావచ్చు. కాని వీరేశలింగంగారిపై అభాండాలు వేయడం ఎందుకు?
అప్పకవీయంలో కొన్ని చోట్ల వ్యావహారిక భాష ఉపయోగించబడిందని దానిని తరువాత కొందరు లేఖరులు గ్రాంథికంలోకి మార్చినట్లు కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఇది వాస్తవమైతే తొలి వ్యావహారిక భాషావాది అప్పకవి అవుతాడు. ఏది ముందు? ఏది వెనుక? అనే వాదనలు నిష్ప్రయోజనం. వీరేశలింగంగారు 1919వ సంవత్సరంలోను, గురజాడవారు 1915 సంవత్సరంలోను కాలధర్మం చెందారు. ఆ రెండు సంవత్సరాలు తప్పుగా ప్రకటంపబడ్డాయి.

స్పందన
english title: 
spandana
author: 
-వేదుల సత్యనారాయణ 9618396071

దీనికి బాధ్యులెవరు?

$
0
0

అడక:తెలుగుకు సమగ్ర నిఘంటువులు లేవనే మాట తరచు వినిపిస్తూ ఉంటుంది. ఇదెంతవరకు నిజం? దీనికి బాధ్యులెవరు? లోపం ఎక్కడుంది? ఏం చెయ్యాలి? వివరంగా చెప్పండి.
-వి. రామారావు, నెల్లూరు
బదులు: తెలుగులో నిఘంటువులు కొన్ని ఉన్నా అవి ఏవీ నేటి అవసరాలను తీర్చేవిధంగా లేవు. శబ్ద రత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటువుతోపాటు చిన్నా పెద్దా నిఘంటువులు కొన్ని ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించి కొన్ని నిఘంటువులు, పదకోశాలు వ్యుత్పత్తి పదకోశాలూ, జిల్లా మాండలిక పదాల సంకలనాలు, వృత్తిపదకోశాలూ ఉన్నాయి. కాని, వీటన్నింటినీ సమకాలీన అవసరాలకు తగ్గట్లు పెంపొందించుకోవలసి ఉంది. ఇందుకోసం ప్రత్యేకించి ఒక సమగ్రమైన నిరంతర వ్యవస్థనేర్పాటుచేసుకోవాలి. ఆ బాధ్యతను తెలుగు విశ్వవిద్యాలయం తీసుకోవాలి.
అదొక దిక్కూ మొక్కూ లేని విధంగా తయారైంది. అక్కడ జరిగే పనులకొక పద్ధతి లేదు, తగిన నిధులూ లేవు. ఇదంతా అలా ఉంచి, నేటి భాష అవసరాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. కనుక ప్రాచీన కావ్యాల్లో వాడింది, కవులు, రచయితలు వ్రాసిందే భాష అనుకోకూడదు. ఎంతో విస్తరించి ఉన్న తెలుగు జాతి జన జీవనంలోంచి వేలాది మాండలికాలను, తెలుగు మాటలను అంతా సేకరించి వాటిని గ్రంథస్తం చేయాలి. కొత్తగా వచ్చే అవసరాలకు తగిన మాటల్ని వాటిలోంచి తీసుకోవాలి. అక్కరపడినపుడు కొత్త మాటల్ని తయారుచేసుకోవాలి. ఇందుకోసం తగిన సమగ్ర నిరంత వ్యవస్థను తెలుగు విశ్వవిద్యాలయంలోనే ఏర్పాటుచేసి, తగిన నిధులిచ్చి, గడువు తేదీలను నిర్ణయించి యుద్ధ ప్రాతిపదికన ఈ పనికి పూనుకోవాలి.

అడక:తెలుగు భాషపట్ల యువత ఆసక్తి చూపడంలేదని అందరూ విమర్శిస్తూంటారు. కొందరైతే తెలుగు ప్రజలకు తెలుగుపై శ్రద్ధలేదని అంటూంటారు. ఎందుకని?
-కె.సుబ్బారావు, అద్దంకి
బదులు:లోతైన అవగాహన లేకుండా పైపైకి కనిపించే పరిస్థితుల్ని బట్టి మాట్లాడే మాటలవి. ప్రజలకు ముఖ్యంగా యువతకు తమ భాషపట్ల ప్రేమ, అభిమానం ఉండదనుకోవడమంత దివాళాకోరు ఆలోచన మరొకటి ఉండదు. నేటి సమాజ అవసరాలకు తగిన విధంగా భాషను వినియోగించకపోవడం పెంపొందించే ప్రయత్నమే చేయకుండా ఇతర భాషలకు బానిసలుగా తయారయ్యే పరిస్థితిని కలిగించిన పాలకులనూ, మేధావులనూ తప్పుపట్టాలి తప్ప మొత్తంగా ప్రజలనూ, యువతనూ కాదు. ఆత్మగౌరవ సమస్యగా ‘తెలుగు’ అంశం తమ ముందుకు వచ్చినపుడు తెలుగువారు తీవ్రంగా స్పందించిన సందర్భాలున్నాయి.
అవకాశమూ ప్రోత్సాహమూ ఉంటే తెలుగును ఉన్నత శిఖరాలపైన కూర్చోపెట్టగల సత్తా తెలుగు భాషా జాతి జనుల్లో, యువతలో ఉంది. అందుకే ఎక్కడ తెలుగు భాషాభివృద్ధికోసం ఏమాత్రం పనులు జరుగుతున్నా వాటికి విశేషమైన స్పందన ఉంటోంది. ఇటీవల జరిగిన ప్రపంచ సభల సందర్భంలో జనస్పందనకు కారణం అదే. ఈ సంగతి తెలుసుకోకుండా జనానికి ముఖ్యంగా యువతకు తెలుగంటే ఆసక్తి లేదనడం అలా అనే వారి ఆలోచననల స్థాయని సూచిస్తుస్తోంది.

అడక
english title: 
adaka

వైభవం కావాలంటే ఇవి చేసి తీరాలి...

$
0
0

వేదిక
====
తెలుగు పూర్వవైభవం పొందాలంటే కచ్చితంగా మన రాష్ట్రంలో 10వ తరగతి వరకు తెలుగును బోధనా మాధ్యమంగా స్వీకరిస్తే సరిపోదు. ఎందుకంటే ఆ తరువాత చదువుకునే చదువులోనూ, ఆ తరువాత సంపాదించే ఉద్యోగానికి కూడా అవసరపడని తెలుగును ముక్కున పట్టుకుని పాఠశాలవరకు చదివేస్తే సరిపోతుందనే భావన ఇటు పిల్లలోనే కాదు పెద్దలు, ఉపాధ్యాయులలోనూ బలంగా నాటుకుని ఉంది. కనుక ఎంత చదివినా సరే అంటే ఉన్నత విద్యలూ కూడా ఒక అంశంగా తెలుగు ఉండి తీరాలి. తెలుగువారై ఉండి తెలుగు చదువనురాయడం రాకపోతే వారికి ఉద్యోగావకాశాలను కల్పించకూడదు లాంటి కఠిన నిబంధనలు పెడ్తేనే తెలుగు భాషపై ఆసక్తి, భాషాభివృద్ధి జరిగితీరుతుంది. దీనికోసం అకుంఠితదీక్షతో సమరం సాగించాలి. మాతృభాషలో విద్య బోధన సమాజానికి, భావితరాలకు ఉపయోగకరమనిచాటి చెప్పడంకాదు అది ఎంత నిజమో ఆచరించి చూపించాలి. ఇతర రాష్ట్రాలలోనూ, దేశాలలోనూ ఉన్న తెలుగువారు తప్పనిసరిగా తెలుగు చదవను రాయను నేర్చుకొని తీరాలి అనే నిబంధన సైతం ఉండితీరాలి. తెలుగు నిఘంటువు నిర్మాణ శాఖ ను ఏర్పరిచి అందులో నిరంతరం తెలుగు పదాలను, మాటలను గ్రంథస్తం చేస్తుండడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలి. ఇది కేవలం స్వచ్ఛంధ సంస్థలకు కాకుండా విధిగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏర్పాటు చేయాలి. జానపదుల వద్ద ఉన్న సాహిత్యాన్ని కూడా గ్రంథస్థం చేసే ఏర్పాటును తప్పనిసరిగా చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
- ఎం. హరి

=============

ఈ మాటలిలా..
మన పిల్లలకు ఏ భాషలు నేర్పినా, వాటితోపాటు మన ఇంటి భాష తెలుగును కూడా చదివిస్తే చాలు- మేలు. ఇప్పుడు మన తెలుగు భాషలో ఇతర భాషల కల్తీ యాస భాషణం దినదినం పెరిగిపోతున్నవి. పత్రికలు, సినిమాలు, టీవీలు చూడండి. నిజం తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని పదాల పరామర్శ.
1.అనమను, తినమను, చేయమను, పలకమను అనేవి వ్యతిరేకార్థ పదాలు. కాని, మనవాళ్ళు వాటిని- అనుమను, చేయుమను అనే అర్థంలో వాడుతున్నారు- మన భాషా పండితులు కూడా. వీటితో భావభంగం. కాబట్టి మన ఉచ్చారణ సవరించుకుంటే మంచిది. అనుమను, చేయుమను... సరియైన రూపాలు. 2. అమ్మకి, అన్నకి- (షష్టీ విభక్తి ప్రత్యయాలు కిన్, కున్) తెలుగు తెలియని పర భాషల వాళ్ళ పలుకుబడిని చూసి, మన వాళ్ళు కూడ అట్లనే మాట్లాడుతున్నారు. కాని, అకారంత పదాలకు ‘కు’ వస్తెనే సహజం- అందం. అమ్మకు నాన్నకు అనాలె. అమ్మకి, నీకి, నాకి అంటే అసహ్యంగా ఉంటవి. 3.బుల్లి- అంటే చిన్నది అనే అర్థం ఏ నిఘంటువులోనూ లేదు. అది పురుషాంగం (హింది). జులాయి అంటే పద్మశాలి (హిందీ/ఉర్దూ). చెవిలో పువ్వు- ఒక మతాచారానికి వెక్కిరింత. నంగనాచి - దిగంబర నర్తకి. దయచేసి ఇవి వాడకండి. మీ మాటలు సవరించుకొండి. ఇక కొన్ని (తప్పు) పదాలకు సరియైన రూపాలు- అధిభౌతిక, ఆధ్యాత్మిక, ఉపాధ్యాయుడు, జగదంబ, జయంత్యుత్సవం, దృఢమైన, ప్రదానం, ప్రధానం, బంధం, బాధ, బోధ, భంగం, భయం, మల్లీశ్వరి, మల్లికార్జున, విద్యార్థి, శాకాహారం... వీటిని తప్పుగా రాయకండి.
- మలయశ్రీ, కరీంనగర్
----------------------
రచనలు పంపవలసిన చిరునామా : ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్ సికింద్రాబాద్ - 500003

వేదిక
english title: 
vedika

ప్రభుత్వం మాట నీటి మూటా?

$
0
0

జనవాణి
=========
ప్రభుత్వం మాటమేరకు తెలుగు ప్రపంచ మహాసభల కోసం రచయితలందరూ తమ తమ రచనలను తమ సొంత ఖర్చుతో డిటిపి ముద్రణచేయంచి ఇచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు కొంతవరకు రచయితలకు వారి వారి పారితోషికాన్ని ఇచ్చినా తెలుగు అకాడమీ వారు ఆ రచయితలకు పారితోషికంగాని వారు డిటిపి చేయించిన ఖర్చు కూడా ఇంతవరకు చెల్లించలేదు. ఇది తెలుగును ఏ రకంగా ప్రోత్సహించడమో ప్రభుత్వమే చెప్పాలి.
- వి. లక్ష్మి, హైదరాబాదు
ఇదేనా ప్రోత్సాహం
తెలుగును అన్ని విధాల ప్రోత్సహిస్తున్నామంటూ అధికార భాషా సంఘాన్ని ఏర్పాటుచేసింది ప్రభుత్వం, తెలుగు భాషాభివృద్ధికోసం పనిచేసే ఆ కార్యాలయంలోని కంప్యూటర్లకు తెలుగు లిపి లేనే లేదు. అవసరమైన పత్రాలను డిటిపి చేయించి విడుదల చేయిస్తున్నారట. తన కార్యాలయంలోనే తెలుగు లిపిని అమర్చుకోలేకపోయిన అధికార భాషా సంఘం పనితీరు అంతుపట్టడంలేదు!
-ఎం. ఎల్. కాంతారావు, హైదరాబాద్
పనులు మొదలయ్యేదెప్పుడో!
2013ను తెలుగు భాషా సంస్కృతి వికాస సంవత్సరంగా ప్రకటిస్తామని ముఖ్యమంత్రిగారు వాగ్దానం చేసిన తర్వాత 4 నెలలకు అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. కార్యాచరణ ప్రణాళిక అంటూనే చేయవలసిన పనుల జాబితాను ఇచ్చారు. ఇంతకూ పనులు మొదలయ్యేదెప్పుడో! ఎంత శాతం అమలు జరుగుతుందో!
-ఎన్.సత్యనారాయణ, హైదరాబాద్
సూచన
‘నుడి’ పేజీ బాగుంటున్నది. ప్రతివారం ఒక కవితను, ఒక కార్టూన్‌ను, ఎక్కువగా చిన్న చిన్న రచనలను ప్రచురిస్తే మరింత బాగుంటుంది.
-ఆర్.వెంకటేశ్వరరావు, కడప
బట్టీలకు తిలోదకాలివ్వాలి
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇటీవలకాలంలో బోధనా పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనివల్ల పిల్లలకు పాఠాలు సులభంగా అర్థం కావడంతో పాటు ఉపాధ్యాయుల బోధన కూడా సులభతరం అయంది. సామాన్య శాస్త్రంలో ఉండే పరమాణు నిర్మాణం, జెనెటిక్సు లాంటి అతి కష్టమయిన అంశాలను నేడు పిల్లలకు సులభంగా అర్థం అయ్యేలా చెప్పే బోధనా ఉపకరణలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలు పెరగాలి, నాణ్యత పెరగాలి. ఆ మేరకు చదువు కోసం కేటాయించాల్సిన సమయమూ తగ్గాలి, కాని నేటి విద్యావ్యవస్థ ముఖ్యంగా పాఠశాలస్థాయలో బట్టీలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. కనుక విద్యార్థి పూర్తిగా తన బుద్ధిని ఉపయోగించి రాణించేస్థితికి రాలేకపోతున్నాడు. అందుకనే సామాన్యశాస్త్రం వంటి వాటిని కూడా మాతృభాషలో ఉన్నట్టు అయతే బట్టీపట్టడం లాంటివాటిని కాకుండా సహజంగా విద్యార్థి అర్థం చేసుకొనే దశ మొదలవుతుంది.
- ఎం. ఇందిర, మెహిదీపట్నం

జనవాణి
english title: 
janavaani
Viewing all 69482 articles
Browse latest View live