Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

బెట్టింగ్ జోరు

$
0
0

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
అదే ఊపు..అదే జోరు..పదికి వంద.. వందకి వెయ్యి.. వెయ్యికి పదివేలు..ఇలా ఐపిఎల్ బెట్టింగ్ బూకీలు భలే చురుకుగా సిక్కోల్ నుంచి కోట్లాది రూపాయలు జూదం ఆడేస్తున్నారు. పోలీసులు కన్నుకప్పి - పొలిటికల్ పవర్‌తో కాయ్‌రాజా..కాయ్..అంటూ ఐపిఎల్ బెట్టింగ్ జిల్లాలో జోరందుకుంది. కేవలం మోబైల్‌తో ఒప్పందాలు చేసుకుని అనుకున్నది అనుకున్నట్టు చెప్పిన సమయానికి, చేరాల్సిన స్థలానికి కరెన్సీ కట్టలు చేరిపోతున్న ఐపీఎల్ బెట్టింగ్‌లు సజావుగా సాగిపోతున్నాయి. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై సన్‌రైజర్స్ తరఫున బూకీలు ఇచ్చే భారీ ఆఫర్లకు మునుపెన్నడూలేని విధంగా చాలా బెట్టింగ్‌లు జరిగినట్లు తెలిసింది. తొలుత మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెందినా, అనంతరం మ్యాచ్ కొనసాగడంతో బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. కలిసొచ్చే హోంగ్రౌండ్‌లో సన్‌రైజర్స్ విజయం ఖాయమనుకుని బూకీలు కాయ్ రాజా..కాయ్.. అంటూ బెట్టింగ్‌లు జరిపారు. మంగళవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ రికార్డులపై కట్టిన బెట్టింగ్‌లు సిక్కోల్ బూకీలకు ఎక్కువ మొత్తంలో చేతులుమారితే - సిక్సర్స్, ఫోర్లు, బౌలింగ్‌లపై అంతకంటే ఎక్కువ బెట్టింగ్‌లు సిక్కోల్ జిల్లా పొగొట్టుకుంది. నైట్‌రైడర్స్ పరాజయంతో పొగొట్టుకున్న మొత్తం మళ్లీ దక్కించుకునేందుకు బుధవారం జరిగిన హైదరాబాద్ మ్యాచ్‌పై భారీగా బూకీలు బెట్టింగ్‌లు జరిపారు. కాగా, ఐపిఎల్ సీజనంతా కోట్లాది రూపాయలు బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిసింది.

సామాజిక అస్త్రానికి బొత్స పదును
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
రాజకీయ చైతన్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోకి బొత్స కుటుంబీకులు అడుగుపెడుతున్నట్టు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీలక్ష్మీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గంలోని ఎచ్చెర్ల, రాజాం శాసనసభ నియోజకవర్గాల్లో కుటుంబీకులను రంగప్రవేశం చేయించాలన్న నిర్ణయానికి సత్తిబాబు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి తన సమీప బంధువుకు 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
సిక్కోలు రాజకీయాలతో విడదీయలేని బంధాన్ని పెనవెసుకున్న బొత్స అధిష్ఠానం అండదండలతో కొన్ని పనుల్లో తన పవర్‌ను చాటుకుంటున్నారు.
పునర్విభజనకు ముందు బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఓటమి చూసి, మూడోసారి పడాల అరుణపై విజయం సాధించిన బొత్స అప్పటినుంచి సిక్కోల్ కాంగ్రెస్ రాజకీయాల్లో పట్టుసాధించేందుకు సామాజిక అస్త్రాన్ని కూడా సంధించారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మీ ఎంపి కావడం, ఆ పార్లమెంటు నియోజకవర్గంలో రాజాం, ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాలు ఉండడంతో మరింత పట్టు సాధించారని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గాలకు చెందిన కేడర్ ఏ పనికావాలన్న శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ, విజయనగరం జిల్లాలో కేరాఫ్ ‘సమీప బంధువు’ అంటూ బొత్స వారసత్వం మార్కును ప్రకటించారు. ఇది కాస్తా టికెట్ వరకూ నడిచేలా కన్పిస్తోంది. గడచిన ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి చివరి నిమిషంలో నీలకంఠంనాయుడును తెరపైకి తెచ్చి శాసనసభలో అడుగుపెట్టేలా బొత్సే వ్యూహం రచించారన్న ప్రచారం ఉండనేవుంది. నేడు పనితీరు బాగులేదన్న నెపంతో ఆయనను పక్కన పెట్టి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఆ బంధువుకు అప్పగిస్తారన్న ప్రచారం జోరందుకుంది.
ఇదిలా ఉండగా, లక్ష్మీపేట ఘటనలో రాజాం నియోజకవర్గం కాపు సామాజికవర్గానికి అధికార పార్టీ దూరమైందన్న అపవాదుతోపాటు, సెంట్రల్‌బ్యాంకు సీటు దక్కలేదన్న చింతతోవున్న మరో అనుచరుడు ఎచ్చెర్ల టికెట్ ఇచ్చే జాబితాలో రెండవ వ్యక్తిగా ప్రకటిస్తున్నట్టు సమాచారం. పొరుగు జిల్లా నాయకుడైన కేరాఫ్ పాలవలసగా సిక్కోల్ యువజన కాంగ్రెస్ నేతగా చెలామణి అయిన ఓ మద్యం వ్యాపారి కూడా ఎచ్చెర్ల కుర్చీని అందిపుచ్చుకునేందుకు అర్హుడేనంటూ బొత్స వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బొత్స కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలకు నియోజకవర్గం మార్పుపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
చీపురుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో శృంగవరపుకోటలో పాగావేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఏ చిన్న పనినైనా ఆ నియోజకవర్గం నుంచే ఆరంభించి అక్కడ నుంచే బొత్స ప్రాతినిధ్యం వహిస్తారన్న సంకేతాన్ని ఇరుగుపొరుగు జిల్లాల కాంగ్రెస్ కేడర్‌లోకి ఇప్పటికే పంపారు. అయితే, పొరుగు జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల సీట్లు ఖాళీలు లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలపై బొత్స కుటుంబీకులకు దృష్టిపడిందన్న వాదన లేకపోలేదు.

రేపటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం (టౌన్), మే 8: జిల్లాలో ఈ నెల 10వ తేదీన నిర్వహించే ఎంసెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నుండి ఇంజనీరింగ్‌కు 4513మంది, మెడికల్ విభాగంలో 1545 మంది మొత్తం 6058 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు జిల్లా ఎంసెట్ పరీక్షల కన్వీనర్ బమ్మిడి పోలీసు బుధవారం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 11 కేంద్రాలు, మెడికల్ విద్యార్ధులకు నాలుగు కేంద్రాలు కేటాయించారు. ఉదయం పది గంటలకు ఇంజనీరింగ్ పరీక్ష మొదలుకానుంది, కాగా మెడికల్‌కు సంబంధించి మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానున్నట్లు ఆయన చెప్పారు. పరీక్ష సమయానికి ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్ష హాల్‌లోకి అనుమతించేది లేదని ఆయన తెలిపారు. యధావిధిగా ఒక్కనిముషం సమయం నిబంధన కొనసాగుతుందన్నారు. పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష హాల్‌లోకి విద్యార్ధులను విడిచిపెడతామని, అందరూ ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్షకు వచ్చినపుడు బాల్‌పాయింట్‌పెన్, అట్ట మాత్రమే తీసుకురావాలని, మరే ఇతర వస్తువులను అనుమతించరని పేర్కొన్నారు. విద్యార్ధులు హాల్ టిక్కెట్లను ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని హాల్‌టిక్కెట్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తును గజిటెడ్ అధికారితో అటెస్టుచేసి తీసుకురావాలని సూచించారు.

క్రీడారంగంలో సిక్కోలు ఖ్యాతి
గార, మే 8: సిక్కోలు జిల్లాకు క్రీడా రంగంలో అరుదైన గుర్తింపు లభించింది. వికలాంగ క్రికెట్ పోటీల జాతీయ జట్టుకు దేశం తరుఫున ఆడటానికి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన ముగ్గురిలో జిల్లాలోని గార మండలం కె. మత్య్సలేశం గ్రామానికి చెందిన మైలపల్లి వేణుబాబు (24) ఉన్నారు. ఈ మేరకు సెలక్టర్లు అతనికి సమాచారం అందించారు. గడచిన ఏప్రిల్ 1న బెంగుళూరులో జరిగిన మూడు రోజుల అంతర్ రాష్ట్ర వికలాంగ క్రికెట్ పోటీల్లో వేణుబాబు ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సెలక్టర్లు జాతీయ జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు సంబంధిత టీమ్ కెప్టెన్ కూడా ఇక్కడకు సమాచారం అందించినట్లు కుటుంబీకులు తెలిపారు. వేణు ఎంపికపట్ల విశ్రాంత నేవీ ఉద్యోగి అయిన వేణు తండ్రి సూర్యనారాయణ, తల్లి పాపమ్మలతో పాటు కుటుంబీకులు, గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

రూ.474 కోట్ల లింకేజీ రుణాల లక్ష్యం
* స్ర్తినిధి జి.ఎం శ్రీనివాస్
ఎచ్చెర్ల, మే 8: ఈ ఆర్థిక సంవత్సరంలో 474 కోట్లు లింకేజీని సంఘాలకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు స్ర్తినిధి జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఎ.జి.ఎం హేమంత్ తెలిపారు. స్థానిక టిటిడిసిలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింకేజీ లక్ష్యాలు 19,423 సంఘాలకు అందించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. స్ర్తినిధి లావాదేవీలు ఆటోడేటా కార్డుల ద్వారా నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా తిరిగి చెల్లింపులు ఈ పద్ధతిలో కొనసాగించాలన్నారు. శతశాతం వడ్డీలేని రుణాలు సంఘాలకు అందేలా సిబ్బంది సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎ.ఒ. జగన్నాధంనాయుడు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గున్నమ్మ, డి.పి.ఎం సి.హెచ్.రామ్మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణాలు కార్యక్రమం అమలుపై సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చెట్టుపట్ట పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేసి నిరుపేద కుటుంబాలకు ఉపాధి హామీపథకంలో ఆదుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని తీర్మానించారు.
పకడ్భందీగా పచ్చతోరణం
* డ్వామా పి.డి కల్యాణచక్రవర్తి
ఎచ్చెర్ల, మే 8: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన పచ్చతోరణం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలుచేయాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కల్యాణచక్రవర్తి తెలిపారు. డిఆర్‌డిఏ సాంకేతిక శిక్షణా అభివృద్ధి కేంద్రం ఆడిటోరియంలో నీటియాజమాన్య సిబ్బందితో బుధవారం ఉపాధిహామీ లక్ష్యాలు- పచ్చతోరణం అమలుపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ పనులు వేగవంతంగా పూర్తిచేసి లక్ష్యాలు అధిగమించాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఓ వరం వంటిందన్నారు. ప్రతీ కుటుంబం 200 మొక్కలు పెంచినట్లయితే ఒక్కో మొక్కకు 15 రూపాయలు వంతున నెలకు మూడువేల రూపాయలు ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, రెవెన్యూ సామాజిక భూముల్లో మొక్కలు నాటేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఐదేళ్లపాటు ఈ పథకం ఆయా కుటుంబాలకు ఆదాయం ఇస్తుందని కేతెలిపారు. ఈయనతోపాటు నీటియజమాన్య సిబ్బంది ఉన్నారు.
ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
* రీజనల్ కోఆర్డినేటర్ తులసీరావు
ఎచ్చెర్ల, మే 8: ఈ విద్యాసంవత్సరంలో ఎం.బి.ఏ, ఎం.సి.ఏ అడ్మిషన్ల కోసం ఈ నెల 17న ఐసెట్‌ను నిర్వహిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జి.తులసీరావు స్పష్టంచేసారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పురుషుల, మహిళల డిగ్రీ కళాశాలలతోపాటు పాలిటెక్నిక్ మెన్ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 1440 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఉదయం పదిగంటల నుంచి 12.30 గంటలవరకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. హాల్‌టిక్కెట్లను నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోఆర్డినేటర్ సూచించారు.
ఆటోబోల్తా:ముగ్గురికి గాయాలు
నరసన్నపేట, మే 8: మండల కేంద్రంలో ఆర్టీసి కాంప్లెక్సు వద్ద బుధవారం జరిగిన ఆటోబోల్తాలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. వేకువజామున ఆరు గంటల సమయంలో ఆమదాలవలస నుండి నరసన్నపేట వస్తున్న ఆటో మనిషిని తప్పించబోయి బోల్తాపడిందని, ఈ ప్రమాదంలో మండవిల్లి అప్పన్న, ఎ.రాంబాబు, దుప్పట్ల రమేష్‌లు గాయపడ్డారన్నారు. వీరిలో రాంబాబుకు తీవ్రగాయాలవ్వడంతో రిమ్స్‌కు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రణస్థలంలో ట్రెజరీ?

పొందూరు, మే 8: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా రణస్థల మండల కేంద్రంలో సబ్‌ట్రెజరీ కార్యాలయం ఏర్పాటుకానున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పటివరకు పొందూరు సబ్‌ట్రెజరీ కార్యాలయం ద్వారా పొందూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాలకు సేవలందుతున్నాయి. తాజాగా లావేరు, రణస్థలం మండలాలకు సంబంధించి రణస్థలంలో కొత్తగా సబ్‌ట్రెజరీ కార్యాలయంకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారంరోజుల లోపు అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశాలున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే రణస్థలంలో సబ్‌ట్రెజరీ కార్యాలయం రణస్థలం, లావేరు మండలాలకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించి ఆమోదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఐదు మండలాలకు సేవలందించేందుకు స్థానిక సబ్‌ట్రెజరీ అధికారులు అధిక పనిభారాన్ని మోస్తున్నారు. జిల్లాకు చివరి మండలంగా ఉన్న లావేరు, రణస్థలం మండలాల నుంచి ప్రతీ విషయానికి పొందూరు సబ్‌ట్రెజరీకి రావడానికి ప్రజలు ఆర్థికంగా, మానసికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను గమనించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణల ద్వారా సి.ఎం కిరణ్‌కుమార్, ఆర్థిక శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డిలపై ఒత్తిడి తేవడంతో రణస్థలంలో ట్రెజరీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పొందూరు సబ్‌ట్రెజరీ నుంచి లావేరు సంఘానికి సంబంధించి 637, రణస్థలం మండలం నుంచి 565 ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాతాలు బదిలీ కానున్నాయి. రెండు మండలాలకు చెందిన 450 పింఛన్లు, అదేవిధంగా 58 పంచాయతీ ఖాతాలు, రెవెన్యూ శాఖ సిబ్బందికి 146 ఖాతాలు, రణస్థలం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఖాతా సబ్‌ట్రెజరీ కార్యాలయానికి చేరనున్నాయి. ఇక్కడ ట్రెజరీలో ఉన్న ఇద్దరు అధికారుల్లో ఒకరు రణస్థలం సబ్‌ట్రెజరీ అధికారిగా నియామకం కానున్నారు. మిగిలిన కార్యాలయాల సిబ్బందిని జిల్లాలో వివిధ సబ్‌ట్రెజరీ కార్యాలయాల నుండి నియమించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్థానిక సబ్‌ట్రెజరీ అధికారి ఎ.వి.ఎస్.రమణమూర్తి వద్ద ప్రస్తావించగా రణస్థలంలో కొత్త సబ్‌ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేసే విషయం వాస్తవమేనన్నారు.

రేపు ఔషధ దుకాణాల బంద్
శ్రీకాకుళం (టౌన్), మే 8: ఆలిండియా ఔషధ వర్తకులు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఈ నెల 10వ తేదీన మెడికల్ దుకాణదారులు బంద్ పాటించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు బరాటం నాగభూషణం తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1984లో నిర్ధేశించిన ట్రేడ్ డ్రగ్ మార్జిన్‌ను కొనసాగిస్తూ, 2013 నూతన డ్రగ్ పాలసీలో ప్రతిపాదించిన ట్రేడ్ మార్జిన్లను తగ్గించరాదని కోరారు. ఫార్మాసిస్టుల సమస్యలు పరిష్కరించాలని, బహుళజాతి వ్యాపార సంస్థలకు ఔషధ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించరాదని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 10న పట్టణంలో మెడికల్ దుఖాణాలు మూసివేస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. అనంతరం బంద్ గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.రాజేంద్రప్రసాద్, టౌన్ సంఘం అధ్యక్షుడు బరాటం ఈశ్వరరావు, కార్యదర్శి కె.రవికృష్ణ పాల్గొన్నారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
* డిసిసి అధ్యక్షుడు నర్తు
శ్రీకాకుళం (టౌన్), మే 8: రాష్ట్రంలో రానున్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఎఐసిసి ఉపాధ్యక్షునిగా నియమితులైన మొదటిసారి నిర్వహించిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచార హోరుకు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కొనియాడారు. బిజెపి ఎన్ని జిమ్మిక్కులు చేసినా అక్కడి ప్రజలు విశ్వసించలేదని, గుర్తుచేస్తూ, రాష్ట్రంలో వై ఎస్సార్ పార్టీకి కవల సోదరులుగా ఉన్న బిఎస్‌ఆర్ పార్టీ మూట సర్దేసిందని ఎద్దేవా చేశారు. దక్షిణ భారత దేశంలో బావ, బాష వ్యక్తీకరణలో ఆంధ్రప్రదేశ్‌కు దగ్గరి సంబంధాలున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో తప్పక ఉంటుందని, ఈ ఫలితాలతో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా విజయపథంలో నడుస్తుందనడానికి నిదర్శనమన్నారు. సమావేశంలో డిసిసి అధికార ప్రతినిధులు రత్నాల నర్శింహమూర్తి, ముస్తాక్ మహమ్మద్, సలీంఖాన్, టి.మోహిని, పాలిశెట్టి మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యయత్నం

కంచిలి, మే 8: బూరగాం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త తులసమ్మ పోలీసుస్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం 2005లో తన భర్త కూర్మారావు గ్రామం కోసం విద్యుత్తు పని చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురవగా, అప్పటి పెద్దలు భర్తకు వైద్యపరీక్షలు చేయిస్తామని విశాఖ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో డబ్బులు అందక వైద్యం చేయించలేక 2006లో భర్త కూర్మారావు మరణించాడని, ఆ డబ్బులు అడిగినందుకు అప్పటి నుంచి తనను గ్రామబహిష్కరణ చేసారని, ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వెల్లడించింది. ఆదివారం కంచిలి పోలీసులకు ఫిర్యాదు చేసానని, బుధవారం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా సరైన న్యాయం జరగదని భావించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. తన అత్తమామ కూడా తన భర్త ఆస్తి తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ విషయమై సోంపేట సి ఐ జి.వి.రమణకు వివరణ కోరగా, ఫిర్యాదు అందిన తర్వాత గ్రామానికి వెళ్లి గ్రామపెద్దలు, గ్రామస్థులను విచారించామని, ఈమెకు గ్రామబహిష్కరణ జరగలేదని, ఈమె నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రానికి గ్రామంలోని పిల్లలు వెళ్తున్నారని, గ్రామబహిష్కరణ విషయంలో ఏదైనా రుజువైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

పోలీసు స్టేషన్ నుంచి
ఇద్దరు బంగ్లాదేశ్ మత్య్సకారుల పరారీ
ఇచ్ఛాపురం, మే 8: రూరల్ పోలీసు స్టేషన్‌లో ఉన్న 15 మంది బంగ్లాదేశ్ మత్య్సకారుల్లో ఇద్దరు బుధవారం రాత్రి పరారయ్యారు. 2012 జనవరిలో మండలంలోని డొంకూరు సమీపంలో 19 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు వేట కోసం వచ్చి పట్టుపడ్డారు. వీరిలో నలుగురుని విడిచిపెట్టారు. మిగతా 15 మంది అప్పటి నుంచి పోలీసు స్టేషన్‌లోనే ఉన్నారు. గత కొంత కాలం క్రితం ఇద్దరు మత్య్సకారులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. మళ్లీ మహ్మద్ ఇలియా(25), మహ్మద్ దోబే(22), ఫరూర్, ఖాదర్ ఈ నలుగురు తప్పించుకునేందుకునేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న డి ఎస్పీ దేవాప్రసాద్, సీ ఐ రవికుమార్, రూరల్ ఎస్ ఐ రాములను టీంలు ఏర్పాటుచేసి గాలింపు చర్చలు చేపట్టగా ఫరూర్, ఖాదర్ పట్టుబడ్డారు. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు.

అదే ఊపు..అదే జోరు..పదికి వంద..
english title: 
a

ఇళ్ళ స్థలాలు ఇప్పించాలంటూ టిడిపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

$
0
0

మచిలీపట్నం, ఏప్రిల్ 8: నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఇటీవల స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల పక్కన ఉన్న డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలో నిరుపేదలు ఇళ్ళు నిర్మించుకోగా వాటిని అధికారులు పొక్లెయిన్‌తో పీకేయటంతో ఆగ్రహించిన బాధితులతో కలిసి బందరు తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి కొల్లు రవీంద్ర తలపై ఇళ్ళ స్థలాల అప్లికేషన్లు పెట్టుకుని పట్టణంలో నిరసనగా బయలుదేరి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలకులు ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేశారని అన్నారు. కూలిపని చేసుకుంటే తప్ప జీవనం గడవని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇళ్ళ స్థలాల అప్లికేషన్లను కలెక్టర్ డా. బుద్దప్రకాష్ ఎం జ్యోతికి అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఇళ్ళ స్థలాలపై ఎంక్వైరీ చేసి అర్హులైన వారికి త్వరలోనే స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ సిఐ మురళీధర్, ఆర్‌పేట ఎస్‌ఐ బాలశౌరి, ఇనగుదురు ఎస్‌ఐ గంగాధర్ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఈ ర్యాలీలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మోటమర్రి బాబాప్రసాద్, నారగాని ఆంజనేయ ప్రసాద్, కాసాని భాగ్యారావు, బోలెం హరిబాబు, పంచపర్వాల కాశీ విశ్వనాధం, మైనార్టీ నాయకులు ఇలియాస్ పాషా, బాషు, పచ్చిగోళ్ళ కొండలరావు, శివకోటి రాజేంద్రప్రసాద్, అంగర తులసీదాస్, వూకంటి రాంబాబు, ఎస్‌సి నాయకులు సాతులూరి నాంచారయ్య, చౌదరి, రాజా, కర్రా శ్రీను, తెలుగు మహిళా నాయకురాళ్ళు బడుగు ఉమాదేవి, తారాదేవి, కార్యకర్తలు, నిరుపేదలు పాల్గొన్నారు.

‘ఇందిరమ్మ కలల’ గ్రామసభలు విజయవంతం చేయాలి
- కలెక్టర్ బుద్దప్రకపిహెచ్‌సి ఏర్పాటుకు కృషి - ఎమ్మెల్యే దాస్
కూచిపూడి, ఏప్రిల్ 8: ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని పామర్రు శాసనసభ్యుడు డివై దాస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో 16 గ్రామాల కూడలి అయిన ఈ గ్రామంలో ప్రజలకు ఉత్తమ వైద్యసేవలందించేందుకు పక్కా భవన నిర్మాణంతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని దాస్ వాగ్దానం చేశారు. సోమవారం సాయంత్రం ప్రముఖ సంఘ సేవకులు కాశీనాధుని నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు గ్రామంలోని సర్వేనెం. 996/6 సత్రం పోరంబోకు భూమిలో నిర్మించిన జడ్‌పి షాపింగ్ కాంప్లెక్స్‌లో నిరుపయోగంగా ఉన్న స్థలంలో పిహెచ్‌సి ఏర్పాటుకు ముఖ్యమంత్రితో చర్చలు జరిపి కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఆయూష్ పరిధిలోని ఆయుర్వేద వైద్య శాలలో సక్రమంగా బాధ్యతలు నిర్వహించే వైద్యులు, సిబ్బంది ఏర్పాటుకు సంబంధిత శాఖాధికారులను ఆదేశిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పంది నాగేశ్వరరావు, మద్దుల బసవయ్య, శేఖర్, పాగోలు జ్యోతి బసు, పిఆర్ డిఇ కైలా బాలకృష్ణ, ఎఎంసి ఛైర్మన్ మూడెడ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారుల నమ్మకాన్ని వమ్ము చేయద్దు
- జిల్లా కలెక్టర్
* అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 8: ప్రజావాణి అర్జీలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అర్జీదారులతో కలెక్టరేట్ కిక్కిరిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం జ్యోతి, జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. అర్జీదారులు వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజావాణిలో అర్జీలు ఇస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని హితవు పలికారు. కాలక్షేపానికి సమావేశాలకు హాజరవుతున్నట్లు ఉందని, అర్జీల పరిష్కారంలో నాణ్యత లోపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పరిష్కరించిన అర్జీలకు సంబంధించిన సమాచారాన్ని రెండు వారాల్లో ఇవ్వాలన్నారు. పరిష్కరించిన వాటిని పరిశీలించి వాటిలో లోపాలు ఏమైనా ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జడ్‌పి సిఇవో కొండయ్యశాస్ర్తీ, డిఎస్‌వో టి ప్రభాకరరావు, డ్వామా పీడి హనుమానాయక్, పశు సంవర్ధక శాఖ జెడి దామోదర నాయుడు, మత్స్యశాఖ డిడి కళ్యాణం, సాంఘిక సంక్షేమశాఖ జెడి పిఎస్‌ఎ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ కంట్రోల్ రూమ్ సిఐ కుమారి
డయల్ 100 సేవలపై పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 8: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏ చోట నుంచి అయినా తక్షణమే పోలీసు సేవలు అందుబాటులోకి తెచ్చిన డయిల్ 100 సేవలను సోమవారం స్థానిక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రారంభించారు. ఉగాదికి అందుబాటులోకి రానున్న కేంద్రీకృత పోలీస్ సేవల ఫోన్ నెంబరు 100కు డయిల్ చేసి ప్రతి స్టేషన్‌లో ఇద్దరు సిబ్బందిని ఎంపిక చేసి వారికి అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ప్రభాకరరావు ఆదేశాల మేరకు కొంపల్లలో జివిఐసి-ఇఎంఆర్‌ఐ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ సిఐ కుమారి, పి లక్ష్మి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుండి డయల్ 100 సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా, ఏ నెట్ వర్క్ నుండి ఫోన్ చేసినా హైదరాబాద్‌లోని మాస్టర్ కంట్రోలర్‌కు వెళ్ళిన సమాచారం తక్షణం సంబంధిత పోలీస్ స్టేషన్లకు మళ్లిస్తారన్నారు. ఆ సమాచారం ఆదారంగా పోలీసులు 15 నిమిషాలలోగా సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అవసరమైన సేవలందిస్తారని తెలిపారు.

చేపల చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వద్దంటూ ధర్నా
గుడివాడ, ఏప్రిల్ 8: ముదినేపల్లి మండలం ఊటుకూరులో చేపల చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వద్దంటూ దళిత బహుజన పరిరక్షణ సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో పలువురు రైతులు గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో కొంతమంది భూస్వాములు చేపల చెరువులు తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులతోపాటు గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలను నిలిపివేశారన్నారు. అయినప్పటికీ ఒక భూస్వామి తవ్వకాలకు ప్రయత్నిస్తున్నారని, దీనికి రెవెన్యూ అధికారుల ప్రోత్సాహం ఉందన్నారు. గ్రామస్థుల ఆవేదనను గుర్తించి తవ్వకం పనులను ఆపకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన హెచ్చరించారు.

విపక్షాల భారీ ర్యాలీ
* నగరంలో హోరెత్తిన నినాదాలు
అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 8: పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ జరుపతలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకారం ఇచ్చి విజయవంతం చేస్తేనే ప్రజల సత్తా ఏమిటో నిరంకుశ కాంగ్రెస్ పాలకులకు తెలుస్తుందని సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, సిహెచ్ బాబూరావు లు పేర్కొన్నారు. మంగళవారం జరుపుతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సోమవారంసాయంత్రం వామపక్ష పార్టీల నగర కమిటీల ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర బంద్‌తోనే అంకురార్పణ చేయాలని ప్రజలనుకోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా విద్యుత్ చార్జీలతోపాటు సర్ చార్జీలను సైతం పెంచేసి సామాన్యులనే కాకుండా అన్ని వర్గాల వారితో చెలగాటమాడుతోందన్నారు. సిపిఎం నగర కార్యదర్శి బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, ఇందుకు బంద్ విజయవంతం తోనే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర నాయకులు జి కోటేశ్వరరావు, వీయపు నాగేశ్వరరావు, నవనీతం సాంబశివరావు, కె సురేష్, లంకా గోవిందరాజులు, సిపిఎం నాయకులు సిహెచ్ జోగిరాజు, మాదాల వెంకటేశ్వరరావు, డివి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఎఐవైఎఫ్ నగర కమిటీ ఆద్వర్యంలో భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. గవర్నర్‌పేట లెనిన్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈర్యాలీ నగరంలోని పలు ప్రధాన వీధుల గుండా సాగింది. ఈకార్యక్రమాన్ని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రారంభించగా ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నవనీతం సాంబశివరావు, నగర నాయకులు కొక్కెర సురేష్, లంకా గోవిందరాజులు, గుడేలా శేషు తదితరులు పాల్గొన్నారు. నగర బిజెపి ఆధ్వర్యంలో నగరంలోని బీసెంట్ రోడ్డు, ఎన్‌టిఆర్ కాంప్లెక్సు అప్సర థియేటర్, అలంకార్ సెంటర్ తోపాటు కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ ఉమామహేశ్వరరావు, మజ్ధూర్ మహా సంఘ్ నగర అధ్యక్షుడు పచ్చా పూర్ణచంద్రరావు, కలగంటి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బంద్‌కు విపక్షాలు సర్వసన్నద్ధం
అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 8: ప్రజలపై మోయలేని భారాలను మోపిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ అప్రజాస్వామికంగా పెంచిన విద్యుత్‌చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను నగరంలో విజయవంతం చేయడానికి రంగం సిద్దంమైంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం లతోపాటు ఇతర వామపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపుమేరకు నగరంలో బంద్ విజయవంతానికి విపక్ష పార్టీలకు చెందిన నగర కమిటీలన్నీ సన్నాహాలు చేస్తున్నాయి. బంద్ విజయవంతంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా చేపట్టిన ఈబంద్‌కు రాజకీయ ప్రాముఖ్యత నెలకొనడంతో విపక్ష పార్టీలు తమ సత్తా చాటేందుకు బంద్‌ను ఏవిధంగానైనా విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఉదయం ఆరు గంటలకే రోడ్ల మీదకు వచ్చి వ్యాపార వాణిజ్య సముదాయాలను తెరవకుండా చేయడంతోపాటు ప్రధానంగా నగరంలో ఉన్న బస్టాండ్‌కు చేరుకుని బస్‌ల రాకపోయకలను నిలువరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొంత మంది బస్టాండ్‌కు చేరుకుని అక్కడ అందోళన నిర్వహించడం ఒక భాగమైతే నగరంలో ప్రదర్శనలు చేపట్టి వ్యాపార, వాణిజ్యాలను కూడా ఖచ్చితంగా మూయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక స్థాయి నాయకత్వం అరెస్టయినా మరొక స్థాయి నాయకత్వం మిగిలిన బంద్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేపట్టేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే సిద్దం చేసారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్‌లను పూర్తిస్థాయిలో అడ్డుకుని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించడం గమనార్హం. అలాగే రైల్వే శాఖకు చెందిన రైళ్ళ రాకపోకల విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేదనే తెలుస్తోంది. గతంలో కన్నా రైల్వే చట్టాలు కఠినంగా అమలుచేస్తున్న నేపథ్యంలో గతంలో ఇరుక్కున్న రైల్వే కేసులను ఇంకా మరికొన్నింటిని పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు రైల్వేలను అడ్డుకుని మరిన్ని కష్టాలు కొనితెచ్చుకోవడం ఎందుకన్న మీమాంస కూడా నాయకుల్లో చెలరేగుతోంది. అంతేకాకుండా శ్రేణుల్లో కూడా రైల్వే కేసులపై విసిగి వేసారిన విషయం అధినాయకత్వానికి తెలిసిందే. ఈపరిస్థితుల్లో రైల్వేలను ఎంత వరకు అడ్డగించాలన్నది నాయకత్వంలో సందేహం మిగిలి ఉంది. సోమవారం రాత్రి విజయవాడ నగరం నుంచి ఇతర ప్రధాన నగరాలకు, పట్టణాలకు వెళ్ళవలసిన అన్ని రకాల బస్‌లు వెళ్ళిపోయాయి. అయితే విపక్ష బంద్‌ను దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా బంద్‌ను విఫలయత్నం చేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం గట్టి బందోబస్తునైనా ఏర్పాటు చేసి కొన్ని బస్‌లనైనా రోడ్లపై తిప్పాలని అధికారుల ఆలోచన కాగా ఈ ఆలోచన ఎంత వరకు కార్యరూపంలో ఉంటుందో వేచిచూడాల్సిందే. ఇదిలావుండగా బంద్ కార్యక్రమంలో భాగంగా సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన బస్టాండ్ అయిన పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉదయం 6 గంటలకే నిరసన ఆందోళన ప్రారంభించనున్నారు.

వాహనచోదకుల దూకుడు!
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 8: నగరంలో ఇ-చలానా వర్తింపు... హెల్మెట్ వాడకంపై ఆంక్షలు.. అడుగడుగునా డిజిటల్ కెమెరాల్లేవనే భరోసాతో నిర్భయంగా వాహనచోదకులు పేట్రేగి పోతున్నారు. ముఖ్యంగా ద్విచక వాహనచోదకులు ట్రాఫిక్ స్నిగల్స్‌ను, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పోలీసు సిబ్బందిని సైతం బేఖాతరు చేస్తూ రయ్.. రయ్ మంటూ దూసుకెళుతున్నారు. ఇక రామవరప్పాడు జంక్షన్ నుంచి వారధి వరకు జాతీయ రహదారిపై భారీ వాహనాల డ్రైవర్లు సైతం సిగ్నల్స్ వద్ద రెడ్‌లైట్లు పడినా ముందు కు దూసుకెళుతుంటే ఇతర వాహన చోదకులు స్థాణువులై చూడాల్సి వస్తున్నది. వాస్తవానికి పోలీసు కమిషనర్ ఎస్ మధుసూదరరెడ్డి సాధ్యమైనంత మేర వాహన చోదకులను వేధింపులకు గురి చేయరాదనే మనస్తత్వంతో ముందుకెళుతున్నారు. తెల్లవారితే నియమ నిబంధనలుంటే పోలీ

నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ
english title: 
s

హింసాద్రి కానీయకండి

$
0
0

విశాఖపట్నం, మే 8: మండు వేసవి.. ఏడాదికోసారి దర్శన మిచ్చే సింహాద్రి అప్పన్న నిజ రూపం కళ్ళారా చూడాలని ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు సింహాచలం చేరుకుంటారు. ఇలా వచ్చిన వారికి కనీస సౌకర్యాలు ఉండవు.. సాధారణ భక్తుల కన్నా.. విఐపిలు, వివిఐపిలు, రాజకీయ నాయకులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులే దేవస్థానం అధికారులకు మేరువు. వీరి వెంట వందలాది మంది గర్భగుడిలోకి వెళ్లినా నోరు మెదపరు ఈ అధికారులు. భద్రత నెపంతో వచ్చిన పోలీసు సిబ్బంది కూడా వందలాది మందిని గాలి గోపుర మార్గం నుంచి పంపిస్తున్నా, దేవాదాయశాఖ అధికారులు చేష్టలుడిగి చూస్తుంటారు. నెలల పిల్లలను చంకనెత్తుకుని.. మండుటెండలో నిలబడినా, అధికారులకు కనికరం ఉండదు. ఇలా చేయడం వలన ప్రతి ఏటా చందనోత్సవం రోజున సింహ గిరి హింస గిరిగా మారిపోతోంది. ఏటా కొత్త కొత్త లోపాలు వెలుగు చూస్తున్నా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా దాదాపూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈనెల 13న జరగనున్న చందనోత్సవాన్ని సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తపన పడుతున్నా, రాజకీయ వత్తిడులు, దేవాదాయశాఖ అధికారుల వైఖరి, ఇందుకు మోకాలడ్డుపడుతున్నాయి. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చందనోత్సవంలో భక్తులు ఆహాకారాలు పెట్టారు. తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సింహాద్రి కాస్తా హింసాద్రిగా మారింది. అప్పట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులపై విచారణ కూడా జరపాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై ఐఎఫ్‌ఎస్ అధికారి ఓ.వి.ఆర్.రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. ఆ చందనోత్సవంలో జరిగిన లోపాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన ఆయన, ఇకపై అటువంటి పొరపాట్లు జరగకుండా ఒక నివేదిక కూడా రెడ్డి ప్రభుత్వానికి అందచేశారు. ఈ నివేదికలో ఎన్ని సూచనలను ఈ చందనోత్సవంలో అమలు చేస్తున్నారు?
విఐపిలు, వివిఐపిలకు దర్శనానికి ఇచ్చే పాస్‌లను 5000లకు పరిమితం చేయాలని సూచించారు. అలాగే వారికి ఒక సమయాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. ఆ పాస్‌లు డూప్లికేట్ కాకుండా బార్ కోడ్‌ను కూడా దానిపై ముద్రించాలని సూచించారు. చందనోత్సవ నిర్వహణకు విధిగా దేవాదాయశాఖ అధికారిని నియమించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని సూచించారు. ఈ ఉత్సవ నిర్వహణకు వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని నియమించాలని సిఫార్సు చేశారు. వారికి ఆయా ఉత్సవాల్లో పాల్గొన్న అనుభవం ఉంటుంది కనుక, వారిని వినియోగించాలని సూచించారు. మొత్తం సిబ్బందిలో 10 శాతం మందిని రిజర్వ్‌లో ఉంచుకోవాలని సూచించారు. వీటిలో కొన్నింటిని అధికారులు అమలు చేస్తున్నారు.
కానీ రాజకీయ నేతల వత్తిడుల నుంచి వీరు బయట పడలేకపోతున్నారు. ఈ ఏడాది కూడా యథావిధిగా ఒక్కో విఐపి వెంట పదుల సంఖ్యలోనే అనుచరులు లోనికి వెళ్లేట్టు కనిపిస్తున్నారు. వివిఐపి, విఐపి పాస్‌లు ఎవరికి ఎనె్నన్ని ముట్టచెపుతున్నారు? ఎన్ని సామాన్య జనానికి అందాయన్నది కలెక్టర్ పరీశీలించాల్సిన అవసరం ఉంది. అతిథులకు ఆతిథ్యాన్ని కాస్తంత తగ్గిస్తే కానీ, అప్పన్న నిజ రూపాన్ని సామాన్య భక్తులు చూడలేరు.
మీడియాకు ఆంక్షలు
చందనోత్సవం రోజున జరిగే వివిధ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు మీడియా సిద్ధంగా ఉంది. అయితే మీడియాపై సింహాచలం దేవస్థానం, ప్రజా ప్రతినిధులు ఆంక్షలు విధిస్తున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఆనంద గజపతిరాజు, ఆ తరువాత వచ్చే కొద్దిపాటి విఐపిల రాకను చిత్రీకరించడానికి కూడా మీడియాను లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఏటా పోలీస్, రెవెన్యూ, దేవాదాయశాఖ ఇతర శాఖల అధికారుల కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చిన రీతిలో దర్శనానికి పంపించడం వలనే వచ్చే ఇబ్బందులన్నీ పక్కన పెట్టి, కొద్ది మంది ఆన్ డ్యూటీ మిడియా సిబ్బందిని విడిచి పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఈ అంశంపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది.
అదే పరిస్థితి కాంగ్రెస్‌లోనూ ఉంటుంది
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: కార్యకర్తల మనోభీష్టానికి విదుద్ధంగా ఏ పార్టీ నిర్ణయం తీసుకున్నా ఇటువంటి పరిస్థితులే ఎదురవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ కీలకనేత కొణతాల రామకృష్ణ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు జరుగుతున్న ప్రచారంపై బుధవారం నాడిక్కడ ఆయన స్పందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ కొణతాల క్యాడర్ స్పందించిన తీరును ఆయన ఉదహరిస్తూ ఏరాజకీయ పార్టీలోనైనా ఇటువంటి పరిణామాలు సహజమని పేర్కొన్నారు. కొణతాల కాంగ్రెస్ పార్టీలో చేరికపై జరుగుతున్న చర్చలు ఊహాగానాలుగా కొట్టి పారేశారు. అయితే కొణతాల రాకకు సంబంధించ తన అభిప్రాయాలను పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో చర్చించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొణతాల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితులు తలెత్తినప్పుడు కార్యకర్తల మనోభీష్టం మేరకే జరుగుతుందని స్పష్టం చేశారు. దాడి వీరభద్రరావును కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు మీరు ప్రయత్నించారుకదాని ప్రశ్నించగా, రాజకీయ పార్టీల్లో ఇటువంటి సంఘటనలు సర్వసాధారణమని అన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. పార్టీని వదిలివెళ్లిన వారు ఎవరైనా తిరిగి ఇదే గూటికి చేరుకోవాలని మంత్రి పి బాలరాజు అన్నారు. కొణతాల విషయమై మాట్లాడాలని మీడియా కోరగా మంత్రి స్పందించారు. పార్టీలోకి ఎవరైనా రావచ్చని, అయితే ఈవిషయాలన్నీ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో పార్టీ సత్తా చాటిందన్నారు. బిజెపి, మోడి ప్రభావం కర్ణాటకలో పనిచేయలేదన్నారు. భవిష్యత్‌లో దేశానికి రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీయే దిశానిర్దేశం చేస్తుందన్నారు.
అందుబాటులో
కార్బైడ్ రహిత మామిడి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: కార్బైడ్ రహిత మామిడి పళ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మామిడి మేళా 2013ను రాష్ట్ర మంత్రులు పి బాలరాజు, గంటా శ్రీనివాస రావు బుధవారం ప్రారంభించారు. ఎంవిపి రైతు బజార్లో బుధవారం నుంచి వారం రోజుల పాటు ఈ మేళా నిర్వహిస్తారు. తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన సుమారు 150 మంది మామిడి రైతులు మేళాలో పాల్గొంటున్నారు. సుమారు 15 రకాల మధురమైన మామిడి పళ్లను ప్రదర్శనలో ఉంచారు. రకాన్ని బట్టి కిలో 30 నుంచి 70 రూపాయల వరకూ వీటిని విక్రయిస్తున్నారు. మామిడి మేళాలో సుమారు 150 మెట్రిక్ టన్నుల మామిడి పళ్లను విక్రయించేందుకు సిద్ధం చేశారు. నిర్ణీత ధరలకు ఇక్కడ మామిడి పళ్లను విక్రయిస్తారు. ప్రదర్శనలో పాల్గొన్న మామిడి రైతులకు ఉద్యానశాఖ పలు రాయితీలను ప్రకటించిది. వీరికి అవసరమైన నిల్వ సదుపాయాన్ని కల్పించారు. అలాగే మామిడి పళ్ల రవాణాలోను, అందుకు అవసరమైన ప్యాకింగ్ తదితర అంశాల్లో 50 శాతం రాయితీని వర్తింపచేశారు. ఎటువంటి హాని కలిగించని కార్బైడ్ రహిత మామిడిపళ్ల విక్రయాలను ప్రోత్సహించే క్రమంలో ఉద్యాన శాఖ రాష్ట్రంలో తొలిసారిగా మామిడి మేళా పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వారం రోజుల పాటు జరిగే ఈమేళాలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ మామిడి పళ్ల విక్రయం జరుగుతుందని ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు.
మేళాను ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ మధుర ఫలం మామిడి అంటే అందరికీ ఇష్టమే. అయితే రసాయన ప్రక్రియ ద్వారా మామిడి పళ్లను ఉత్పత్తి చేయడం ద్వారా అనేక శారీరక రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మార్కెటింగ్, ఉద్యాన శాఖలు సమన్వయంతో మామిడి రైతుకు న్యాయం చేసేందుకు ఇటువంటి మేళాలు ఉపకరిస్తాయని అన్నారు.
మరో మంత్రి పి బాలరాజు మాట్లాడుతూ వినియోగదారునిక, రైతుకు ఉపకరించే విధంగా మామిడి మేళాను నిర్వహించేందుకు ఉద్యానశాఖ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి శేషాద్రి, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు, మార్కెటింగ్ శాఖ అధికారలు పాల్గొన్నారు.
కోస్ట్‌గార్డులో చేరనున్న మరో నౌక
రాణి అవంతిబాయి నేడు జలప్రవేశం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: ఇండియన్ కోస్ట్‌గార్డుకు మరో ఆన్‌షోర్ షిప్ సమకూరనుంది. హిందుస్థాన్ షిప్‌యార్డు సారథ్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న రాణి అవంతిబాయి నేడు జలప్రవేశం చేయనుంది. రక్షణశాఖ సహాయ మంత్రి జితేంత్ర సింగ్ చేతుల మీదుగా అవంతిబాయి జలప్రవేశం చేయనుంది. కోస్ట్‌గార్డులో చేరిన అవంతిబాయి పూర్తి అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమాచార వ్యవస్థ కలిగిన నౌక. 31.5 నాటికల్ మైళ్ల వేగంతో నడిచే ఈ అత్యాధునికి షిప్ ఏకధాటిగా 1500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జి విధానం, ఇంటిగ్రేటెడ్ మెషినరీ కంట్రోల్ సిస్టంతో పాటు అత్యాధునిక అగ్నిప్రమాద నియంత్రణ విధానం ఈ అవంతిబాయి షిప్ ప్రత్యేకతలు. విపత్కర పరిస్థితుల్లో రెస్క్యూ బృందాల కోసం రెండు ఆధునిక బోట్లతో పాటు సముద్ర గస్తీలో రాణి అవంతిబాయి కీలక సేవలు అందించనుంది. షిప్ జలప్రవేశ ఈకార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు ఇండియన్ కోస్ట్‌గార్డు డైరెక్టర్ జనరల్ అనురాగ్ జి తప్ల్యాల్, ఇనస్పెక్టర్ జనరల్ ఎస్‌పి శర్మ తదితరలు పాల్గొంటారు.

నేడు గంధం అమావాస్య : భారీగా వస్తున్న గ్రామీణ భక్తులు
సింహాచలం, మే 8: శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి దేవాలయంలో గురువారం గంధం అమావాస్య వేడుక జరగనుంది. ప్రతి సంవత్సరం చందనోత్సవానికి ముందు వచ్చే చైత్రబహుళ అమావాస్యను గంధం మూలవిరాట్‌కి శీతలాభిషేకాలు చేస్తారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన భక్తులు అమావాస్య యాత్రకు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే భజన బృందాలు, గరిడలు, కోడెదూడలను వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రానికి భక్తులు భారీగా సింహాచలం తరలివచ్చారు. తెల్లవారుజామునే పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో మెట్లమార్గంలో సింహాగిరికి చేరుకుంటారు. కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించి గంగధారలో స్నానాలు చేసి సింహాచలేశుని దర్శనం చేసుకుంటారు. అంతకు ముందు భక్తులు కొండదిగువ అటవీ ప్రాంతంలో వున్న భైరవస్వామిని, అడివివరం గ్రామదేవత పైడితల్లమ్మని దర్శించుకుంటారు. అమావాస్య సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయమని ఇఓ కె.రామచంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పుష్కరిణి వద్ద ప్రమాదాలు జరుగకుండా లోతట్టు ప్రాంతానికి స్నానాల కోసం భక్తులు వెళ్ళకుండా చెరువులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇఓ సూచించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి పది సెక్యూరిటీగార్డులను చెరువు వద్ద ఉంచాలని ఇఓ ఆదేశించారు. తాగునీటి కోసం 50 వేల ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని ఆయన సూచించారు.

‘దీర్ఘకాలిక ప్రయోజనాలతోనే ప్రాజెక్టులకు ప్రతిపాదన’

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విశాఖ నగరాభివృద్ధి సంస్థ చేపట్టే ప్రాజెక్టులు, ప్రణాళికలు అమలు చేయాలని వైస్ చైర్మన్ ఎన్ యువరాజ్ అన్నారు. ప్రణాళికాబద్దమైన ప్రగతి సాధనలో వుడా మార్గదర్శకంగా పనిచేయాలని ఆయన సూచించారు. వుడా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా వుడా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల్లో ప్రతి అంశాన్ని ముందుగానే ఖరారు చేసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్మాణాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ సరికొత్త ఒరవడిని సృష్టించాలన్నారు. విధానపరమైన జాప్యం కారణంగా వుడా చేపడుతున్న ప్రాజెక్టుల్లో విపరీతమైన ఆలస్యం చోటుచేసుకుంటోందన్న వాస్తవాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు ముందుగానే ఖరారు చేసుకోవాలన్నారు. వుడా ప్రధాన కార్యాలయం, వాణిజ్య సముదాయాలు, ఇతర పర్యాటక కేంద్రాల్లో విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలన్నారు. ప్రతిపాదిత సౌర విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సూచించారు. సమీక్షలో భాగంగా వైఎస్సార్ పార్కు, చిల్డ్రన్స్ ఎరీనా, మాస్టర్‌ప్లాన్ రహదారులు, హరిత హౌసింగ్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అంశాలపై విసి ఇంజనీర్లతో చర్చించారు. చీఫ్ ఇంజనీర్ ఐ విశ్వనాధరావు, ఇఇలు వి భవానీ శంకర్, డివి వర్మ, ఎం బలరామరాజు, ఎం అప్పన్న, క్వాలిటీ కంట్రోల్ డిఇఇ దేవీప్రసాద్ పాత్రో, ఎలక్ట్రికల్ డిఇఇ బి శేసోశేఖర్ సమావేశంలో పాల్గొన్నారు.

‘్భక్తులకు ఇబ్బంది కలగకుండా
చందనోత్సవం నిర్వహించండి’
సీతంపేట, మే 8: ప్రొటోకాల్ నిబంధనలను పాటిస్తూ ముఖ్యులకు సింహాచలేసుని దర్శనం కల్గించడమే కాకుండా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చందనోత్సవం నిర్వహించాలని మంత్రి గంటా తెలిపారు. బుధవారం సాయంత్రం నగరంలోని ప్రభుత్వ అతిధి గృహంలో ఈనెల 13న నిర్వహించబోవు చందనోత్సవ ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. తోపులాటలు, అవాంచనీయ సంఘటనలు జరగకుండ ప్రోటోకాల్ ద్వారా ఇవ్వవలసిన అతిముఖ్యుల దర్శన సమయాలను ఉదయం 4.30గంటల నుండి నుండి 5.30గంటల వరకు, సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరక కేటాయించాలని, ముఖ్యుల కొరకు ఉదయం 6గంటల నుండి 8గంటల వరకు, మధ్యాహ్నం 12గంటల నుండి 2గంటల వరకు, సాయంత్రం 7గంటల నుండి 8గంటల వరకు సమయం కేటాయిస్తే బాగుంటుందని అధికార్లకు గంటా సూచించారు. గురువారం ఉదయం సింహాచలేశుని దర్శనం సజావుగా జరిగేలా సింహాచలం దేవస్థానానికి వెళ్ళి గంటా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

భక్తిశ్రద్ధలతో
కొనసాగుతున్న గంధం తీత
సింహాచలం, మే 8: సింహాచలం క్షేత్రంలో గంధం అరగదీత ప్రక్రియ భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. మూడు రోజులకుగాను సుమారు 85 కిలోల శ్రీ గంధాన్ని ఉద్యోగులు సిద్ధం చేశారు. ఏ రోజు కారోజు అరగదీసిన గంధాన్ని తూకం వేసి దేవాలయ వైదిక పెద్దలు స్వాధీనం చేసుకుంటున్నారు. తొలివిడత సమర్పణకు సంబంధించి మరో 40 కిలోల గంధం అరగదీయాల్సి ఉంది.

షిప్‌యార్డును సందర్శించనున్న రక్షణ మంత్రి
ఆహ్వానించిన టిఎస్సార్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 8: కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం నగరానికి రానున్నారు. తన పర్యటనలో భాగంగా హిందుస్థాన్ షిప్‌యార్డును జితేంద్ర సింగ్ సందర్శించనున్నారు. రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ చైర్మన్ టి సుబ్బరామి రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన షిప్‌యార్డును సందర్శించి యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. నష్టాల్లో కూరుకున్న షిప్ యార్డుకు ఆర్ధికంగా చేయూతన నిచ్చేందుకు రక్షణ శాఖ ఆర్డర్ ఇవ్వాలని టిఎస్సార్ కేంద్ర మంత్రిని కోరారు. సుమారు 25వేల కోట్ల రూపాయల మేర రక్షణశాఖ ఆర్డర్లను షిప్‌యార్డుకు మళ్లించడం ద్వారా తిరిగి పూర్వవైభనాన్ని తీసుకురావచ్చని ఆయన సూచించారు. రక్షణ మంత్రి తన పర్యటనలో షిప్‌యార్డుకు అనుకూలంగా ప్రకటన చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో గురువారం సమవేశం కానున్న టిఎస్సార్ నేరుగా విశాఖ వచ్చి రక్షణ మంత్రి కార్యక్రమంలో పాల్గొంటారని టిఎస్సార్ కార్యాలయం వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ నేతల విజయోత్సవం
గాజువాక, మే 8: కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య క్యాంపు కార్యాలయంలో బుధవారం కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలను నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి వారణాశి దినేష్‌రాజ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఎమ్మెల్యే చింతలపూడి కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో నడిచిందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా కర్ణాటకలో ప్రచారం చేయడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రజల మంచి తీర్పును అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు గుడివాడ అమ్మన్న, కరణం కనకారావు, సోడిపిల్లి తాతారావు, యర్రా నాగేశ్వరరావు, నాగేశ్వరరావు, గోపిశెట్టి గోపి, తాతారావు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు భాష, సాహిత్యాలకు వరం ఘంటసాల స్వరం
విశాఖపట్నం (కల్చరల్), మే 8: తెలుగు భాష, సాహిత్యాలకు ఘంటసాల స్వరం జీవం పోసిందని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. ఘంటసాల సంగీత కళాశాల, వైశాఖి జలఉద్యానవనం సంయుక్త ఆధ్వర్యంలో పాటకు పల్లవి ప్రాణం పేరిట మూడు రోజుల పాటు నిర్వహించే ఘంటసాల గానామృత కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఘంటసాల లేనిదే తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు, గౌరవం దక్కేవికావన్నారు. అమృతప్రాయమైన ఆయన స్వరం పాటలు అజరామరమని అన్నారు. ఘంటసాల పాటకు మరోసారి జీవం పోసి మైమరపించిన శరత్‌చంద్రను ఆయన అభినందించారు. మిధునం సినీ నిర్మాత మొయిద ఆనందరావు మాట్లాడుతూ ఘంటసాల పాటలు తెలుగు సినిమా విలువల్ని పతాకస్థాయికి తీసుకువెళ్లాయన్నారు. తరాలు మారినా ఘంటసాల పాటలు వనె్నతగ్గవని, తెలుగువారు ఉన్నప్రతిచోటా ఆయన స్వరం ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. సిఎంఆర్ సంస్థల ఆధినేత వెంకటరమణ మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతున్న విశాఖలో ఘంటసాల స్వరారాధన పేరిట ఆయన పాడిన పాటలను అందిస్తున్న శరత్‌చంద్రను అభినందించాలని అన్నారు. పాటకు పల్లవి ప్రాణం పేరిట నిర్వహించిన ఈసంగీతారాధన కార్యక్రమంలో శరత్‌చంద్ర, ఆయన సోదరుడు గోవింద్ ఘంటసాల పాడిన పలు పాటలను మధురంగా ఆలపించారు. శరత్‌చంద్ర నేతృత్వంలో నడుస్తున్న ఘంటసాల సంగీత కళాశాల విద్యార్థులు పాటకుపల్లవి ప్రాణం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాలకు చెందిన గాయకులు పద్యాలు, ఏకగళ గీతాలు, యుగళగీతాలు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెస్ రాజు, పిఎల్‌ఎన్ రాజు, వంకాయల తాతాజీ, వైశాఖి జల ఉద్యానవనం ఎండి ఉరిటి నాగభూషణం, పలువురు ఔత్సాహిక గాయకులు పాల్గొన్నారు.

కొణతాలను కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తాం
- జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ తోట నగేష్
పాయకరావుపేట, మే 8: మాజీమంత్రి, వైఎస్సార్ సిపి నాయకుడు కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తారని జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ తోట నగేష్ అన్నారు. బుధవారం విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీ ఎంతో బలపడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. కొణతాల నాయకత్వంలో జిల్లాలో ఉన్న పార్టీ కేడర్ పనిచేయడానికి ధృడసంకల్పంతో ఉన్నారని తెలిపారు. పి.సి.సి. అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, కొణతాల రామకృష్ణను పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాల మేరకు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగా, నీలం తుపాను కారణంగా తాండవ నదిపై నిర్మించిన ముఠాకాలువ వద్ద, మండలంలోని పలుచోట్ల పంట కాలువలు మరమ్మత్తులు చేరుకున్నాయని, వీటికి తాత్కాలిక మరమ్మత్తులు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ను కో రగా ఆయన 32 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. మరో నెలరోజు ల్లో పనులు పూర్తవుతాయని తోటనగేష్ తెలిపారు. ఈ సమావేశంలో గూటూరు శ్రీనివాసరావు, కొప్పిశెట్టి వెంకటేష్, పేకేటి రాజారావు పాల్గొన్నారు.

గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికల ప్రచారం
చోడవరం, మే 8: గోవాడ సహకార చక్కెర కర్మాగారం పాలకవర్గ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు సభ్యరైతులకు విజ్ఞప్తిచేశారు. వైఎస్సార్ పార్టీ నాయకుడు బలిరెడ్డి సత్యారావు గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మండలం లక్కవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కుంగికృశించిపోయిన సహకార వ్యవస్థకు పునరుజ్జీవ నం కల్పించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకోసం వైఎస్సార్ కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. గతంలో సహకార చక్కెర కర్మాగారాలను ప్రైవేటుపరం చేయాలని అప్పటి ప్రభుత్వాలు ఆలోచన చేస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి సహకార వ్యవస్థ ను పటిష్ఠపరచి ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడారన్నారు. గోవాడ సుగర్స్‌కు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా సభ్యరైతులు విజ్ఞతతో వ్యవహరించి పార్టీ మద్దతు అభ్యర్థులకు ఓటువేసి ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నా యకులు వెంపలి ఆనందీశ్వరరావు, డాక్టర్ బండారు సత్యనారాయణ, కాం డ్రేగుల డేవిడ్, అల్లం రామఅప్పారావు, నాగులాపల్లి రాంబాబు, భూపతిరాజు సన్యాశిరాజు, భూపతిరాజు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

పురుగు మందు తాగి ప్రేమికుల ఆత్మహత్యయత్నం
* ప్రియురాలు మృతి, ప్రేమికుడి పరిస్థితి విషమం
నర్సీపట్నం(రూరల్),మే 8: ఇద్దరు ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చివరకు అమ్మాయి మృతి చెందగా, అబ్బాయి చావుబ్రతుకుల మధ్య విశాఖ కె.జి.హెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం కలిగించింది. పట్టణంలోని పెదబొడ్డేపల్లి బ్రాహ్మణవీధికి చెందిన ఆర్.ఎం.పి. వైద్యుడైన శ్రీకాకుళపు నాగేశ్వరరావుకు ఉదయలక్ష్మి(25) అనే కుమార్తె ఉంది. విజయనగరం జిల్లా దత్తిరాజూరు మండలం దత్తిగ్రామానికి చెందిన బూరిశెట్టి రాంజీ, ఉదయలక్ష్మి పట్టణంలోని ఆంధ్రా మెడికల్ సెంటర్‌లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 8వతేదీన వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగింది. అప్పటినుండి రాంజీ పెదబొడ్డేపల్లిలోని ఉదయలక్ష్మి ఇంటికి వెళ్తుండేవాడు. మంగళవారం వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని ఆ రాత్రి వీరిద్దరూ పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితికి చేరిన వీరిని బంధువులు గుర్తించి హుటాహుటినా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. విశాఖ కె.జి.హెచ్.లో ఉదయలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. రాంజీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడి వెంట వెళ్లేది ఆ నలుగురేనా..?
కశింకోట, మే 1: మారుతున్న రాజకీయ సమీకరణాల్లో మాజీమంత్రి దాడి వీరభద్రరావు వెంట వెళ్లేది కశింకోట నుండి ఆ నలుగురేనా? అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరున్న కశింకోట మండలంలో దాడి వీరభద్రరావుకు మంచి పట్టుఉంది. ఏ ఎన్నికలు వచ్చినా టిడిపి అభ్యర్థులే విజయం సాధించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఎంపిపి, జెడ్‌పిటిసిలు, వార్డుమెంబర్లు, ఎంపిటిసిలు టిడిపి కైవసం చేసుకోవడంలో ముందుండేది. దాడిని పలువురు మాస్టారుగా పిలుచుకునేవారు. మాస్టార్ వచ్చినా, ఆయన తనయుడు రత్నాకర్ వచ్చినా కశింకోటలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికేవారు.
మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో దాడి వీరభద్రరావు పేరు చెబితే ప్రతి ఒక్క కార్యకర్తకు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. బత్తిన వీరభద్రరావు(ఆటోభద్రం) ఈయన చిన్నప్పటి నుండి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషిచేసేవారు. ప్రస్తుతం దాడి, రత్నాకర్ పేరు చెపితే నానా దుర్భాషలు ఆడుతున్నారు. అలాగే పెంటకోట రాము, చిటికిరెడ్డి చిట్టిబాబు, పి కళ్యాణి, వేగి వెంకట్రావు, పెంటకోట సత్యనారాయణ, కొంతం ఆదినారాయణ, గొంతినలోవ అప్పారావు, మాజీ ఎంపిపి నిమ్మదల త్రినాధరావు, మాజీ జడ్‌పిటిసి పొన్నగంటి నూకరాజు, పలువురు మాజీ ఎంపిటిసిలు, మాజీ వార్డుమెంబర్లు, నాయకులు, కార్యకర్తలు వీరంతా దాడి పార్టీ మార్పుపై చిర్రుబుర్రులాడుతున్నారు. దాడి వెంట కేవలం బావబామర్ధులైన దొడ్డి బుద్దసత్యనారాయణ, వేగి దొరబాబు, ఆడారి నర్శింగరావు ఉండగా, తటస్థంగా మాజీ వైస్‌ఎంపిపి వేగి గోపికృష్ణ వ్యవహరిస్తున్నారు. దాడి, ఆయన కుటుంబ సభ్యులు అంటే అందరికీ మక్కువే. అలాగే తెలుగుదేశం పార్టీ అన్నా మక్కువే. కాని పార్టీ ఫిరాయింపుతో దాడి, ఆతని తనయుడుకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేశారని పలువురు కార్యకర్తలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి నాయకత్వం బాగున్నా పార్టీ ఫిరాయింపుతో ఆయన వెంట వెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు మాత్రం సిద్ధంగా లేరనే చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు రాజధాని నుండి అనకాపల్లికి వస్తుండటంతో ఎయిర్‌పోర్టు నుండి ఘనస్వాగతం పలికేందుకు భారీస్థాయిలో కార్యకర్తలను సమీకరించాలని ప్రస్తుత వైకాపా నాయకులు దొరబాబు, నర్శింగరావు నానా అవస్థలు పడుతున్నారు. దాడి రాకతో వైఎస్సార్ కాంగ్రెస్‌కి కొత్తగా నాయకులు, కార్యకర్తలు ఎంతమంది తయారవుతారో వేచిచూడాల్సిందే.

అంతర్రాష్ట్ర దారిదోపిడీ హంతకుల ముఠా అరెస్టు
అనకాపల్లి టౌన్, మే 8: అంతర్రాష్ట్ర దారిదోపిడి హంతకుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పర్లాకిమిడికి చెందిన అర్జున బోస్లే(21), రాజుబోస్లే (23) అనే ఇద్దరు అన్నదమ్ములు గత ఏడాది మేనెల 7వ తేదీన అర్ధరాత్రి వీరు అనకాపల్లి బైపాస్ రోడ్‌లో నిలిపి ఉంచి లారీలో నిద్రపోతున్న డ్రైవర్ ఉప్పాడ శ్రీను(23) వద్ద నుండి ఆరువేల రూపాయలు బలవంతంగా లాక్కొని అతన్ని కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. వీరికోసం పోలీసులు వెతుకుతుండగా మంగళవారం ఉమ్మలాడ బైపాస్ జంక్షన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అటుగా వెళుతున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వీరుచేసిన హత్యలు, దారిదోపిడీలు బయటపడ్డాయి. అందులో అనకాపల్లిలో చేసిన హత్య కూడా ఉండడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసి బుధవారం కోర్టుకు హాజరు పరచగా రిమాండ్‌కు విదించింది. పట్టణ సిఐ పి శ్రీనివాసరావు, ఎస్‌ఐలు అప్పలనాయుడు, రాంబాబు, భాస్కరరావు కేసును ఛేదించారని డిఎస్పీ విఎస్‌ఆర్ మూర్తి బుధవారం విలేఖరులకు తెలియజేశారు.

మండు వేసవి.. ఏడాదికోసారి దర్శన మిచ్చే సింహాద్రిs
english title: 
s

అసంపూర్తిగా రైల్వే వంతెన నిర్మాణం!

$
0
0

సీతానగరం, మే 8: మండల కేంద్రంలోని సీతానగరం- పార్వతీపురం ప్రధాన రహదారిలో ఉన్న రైల్వేగేటుపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు రైల్వేగేటు కష్టాలను తీర్చేందుకు 2009లో సుమారు 16 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో ఆర్వోబి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో వంతెన నిర్మాణం పూర్తిచేయడానికి గుత్తేదారునికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభంలో వేగవంతంగా జరిగినా నిర్మాణ పనులు కాలక్రమేనా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈ మధ్యలో నిర్ణీత సమయానికి నిర్మాణం పూర్తిచేయనందున గుత్తేదారు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దుచేసింది. ఏం జరిగిందో గాని తరువాత మళ్లీ అతడికే నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 80 మీటర్ల పొడవుతో 24 స్తంభాలతో నిర్మాణం కావల్సి ఉండగా మరో 10 స్తంభాలకు స్లాబ్‌ల నిర్మాణంతోపాటు చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. దాదాపు వంతెన నిర్మాణం పూర్తికావల్సిన తరుణంలో పనులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం రైల్వేగేటుతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నామని, ఈ మార్గం గుండా నిరంరం ప్రయాణించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు గాని అధికారులుగాని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ప్రజలకు నిత్యం ప్రయాణించడానికి అనువైన ఆర్వోబిల నిర్మాణాల విషయంలో ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని చెప్పుకోవాలి. గుత్తేదారుపై తగు ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
బొబ్బిలి(రూరల్), మే 8: వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతిచెందగా ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన వెలుగుచూసింది. విజయవాడ నుంచి రాయగడకు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ మండలం పారాది గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారు జామున ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో క్లీనర్ పాండు (53) అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ వెంకటేశ్వరులు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 వాహనంలో డ్రైవర్‌ను బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం చేర్పించారు. వెంకటేశ్వర్లుకు కాలు విరగడంతోపాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన క్లీనర్ పాండుది ఉయ్యూరు దగ్గర ఘంటసాల గ్రామం. డ్రైవర్‌ది విజయవాడ వద్దగల కండ్రి గ్రామం. బొబ్బిలి నుంచి విజయనగరం వెళుతున్న గుర్తుతెలియని వాహనం గొర్లె సీతారాంపురం గ్రామ సమీపంలో జి.రామారావు (55)ను ఢీకొంది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రామారావు స్వగ్రామం రామభద్రపురంలోని చొక్కాపువీధిలో నివాసం ఉంటున్నాడు. బొబ్బిలి మండలం రాచ్చేరువలస గ్రామంలో ఉన్న భార్య, పిల్లలను చూసేందుకు సైకిల్‌పై బుధవారం వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బంధువులు , పోలీసులు తెలిపారు. వి.ఆర్.ఒ. సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సి.ఐ. రాఘవులతోపాటు సిబ్బంది బుధవారం సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి.ఐ.రాఘవులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
గంట్యాడ : మండలానికి చెందిన రామభద్రపురం జంక్షనలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రైతు జి.గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉపాధి కూలీ అయిన గణపతి మధ్యాహ్నం ఉపాధి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆసమయంలో విద్యుత్ ఉండడంతో పొలంలోని వ్యవసాయ మోటారు వేసేందుకు సైకిల్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తలమీదుగా ట్రాక్టర్ చక్రం వెళ్లిపోడవంతో అక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణపతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
బొండపల్లి : రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అంబటివలస గ్రామం వద్ద జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసకు చెందిన ఆటో డ్రైవర్ ఈదుబిల్లి దుర్గారావు(21) విజయనగరంలో మామిడి కాయల బుట్టలు దించి గజపతినగరం వైపు వస్తుండగా అంబటి

మండల కేంద్రంలోని సీతానగరం- పార్వతీపురం ప్రధాన రహదారిలో
english title: 
a

కొత్త సార్లు సిద్ధం!

$
0
0

ఏలూరు, మే 8: బదిలీలపై సడలింపో లేక ఆ పోస్టుల ఆకర్షణోగాని పెద్దల ఆశీస్సులతో కొత్త సార్లు సిద్ధమయ్యారు. ఇక త్వరలోనే ఉత్తర్వులు జారీ కావటమే తరువాయిగా ఉంది. ప్రధానంగా జిల్లా స్ధాయి పోస్టుల విషయంలో గతంలో ఇక్కడ చేసినవారు, ఇప్పుడిక్కడ పనిచేస్తున్నవారు కూడా పెద్దల ఆశీస్సులను దండిగా సంపాదించుకున్నారు. వెనువెంటనే కావాల్సిన పోస్టులకు ఆశీస్సులు కూడా పొందారు. ముందస్తుగా జిల్లా పాలనలో కీలకంగా నిలిచే జిల్లా రెవిన్యూ అధికారి పోస్టు మరోనెలలో ఖాళీ కానుంది. ప్రస్తుతం డిఆర్వోగా పనిచేస్తున్న ఎం మోహనరాజు ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో చాలామంది ఈ పోస్టుపైనే టార్గెట్ పెట్టారు. అనుకున్నదే తడవు తమకు అనుకూలంగా ఉన్న పావులను కదుపుకుంటూ వచ్చారు. దీంతో ఒక అధికారికి మాత్రం దాదాపు పని అయిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్న ప్రభాకర్ అనే అధికారికి డిఆర్వో పోస్టుకు సంబంధించి ఆశీస్సులు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇక్కడ పోస్టు ఖాళీ కాగానే రంగప్రవేశం చేసేందుకు అనువుగా అన్ని పరిస్ధితులను చక్కదిద్దుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ గతంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీవోగాను, విశాఖపట్నం ఆర్డీవోగాను పనిచేశారు. దీంతో ఆయన సమర్ధతను తెలుసుకున్న కొంతమంది ప్రజాప్రతినిధులు ఆయనను ఇక్కడకు డిఆర్వోగా తీసుకువచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దానికనుగుణంగానే ఆయన కూడా ఈ ప్రయత్నాలు చేసుకున్నట్లు సమాచారం.
ఇక జిల్లా పాలనలోనే మరో కీలకమైన అంగం జిల్లా పరిషత్. ఈ కీలకమైన సంస్ధకు ప్రధానమైన పోస్టుల్లో అనిశ్చితి కొద్దికాలం నుంచి కొనసాగుతూనే ఉంది. జడ్పీ సిఇఓగా ఇటీవలే నారాయణ ఉద్యోగ విరమణ చేశారు. అంతకుముందు డిప్యూటీ సిఇఓ పోస్టు వ్యవహారంలోనూ పలురకాలైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏదీఏమైనా అప్పటివరకు జిల్లా పంచాయితీ అధికారిగా ఉన్న వి నాగార్జునసాగర్‌ను డిప్యూటీ సిఇఓగా ప్రభుత్వం నియమించింది. ఆతర్వాత కొద్దికాలానికే సిఇఓ నారాయణ ఉద్యోగ విరమణ చేయటంతో ఇన్‌ఛార్జి బాధ్యతలను నాగార్జునసాగర్‌కు అప్పగించారు. మరో నెలలో పంచాయితీ ఎన్నికలతోపాటు ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న తరుణంలో ఈ కీలకమైన పోస్టు హాట్‌టార్గెట్‌గా మారిపోయింది. పరిపాలనాపరంగాను ఈ పోస్టు కీలకమైనదనే చెప్పుకోవాలి. ఇటువంటి పోస్టుకు ఇప్పుడు గతంలో జిల్లాలో డిఆర్‌డిఎ పిడిగా పనిచేసిన మారిశెట్టి జితేంద్ర ముమ్మరంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆయనకు జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం వరకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరపాలకసంస్ధ కమిషనర్‌గా పనిచేసిన జితేంద్ర స్ధానంలో ప్రభుత్వ వేరొకర్ని నియమించటంతో ప్రస్తుతం ఆయన పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే అందివచ్చిన అవకాశంగా పశ్చిమ జడ్పీ సిఇఓ పోస్టు అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో మరో తిరకాసు కూడా లేకపోలేదు. రానున్నకాలంలో ఎన్నికల సమయం. అలాంటి సమయాల్లో సొంత జిల్లాకు చెందిన అధికారులను, మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతారు. జితేంద్రకు పశ్చిమ సొంతజిల్లానే. రానున్నది జడ్పీ ఎన్నికలే. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇక్కడ కల్పించినా ఎంతోకాలం కొనసాగే అవకాశాలు లేనేలేవని చెప్పుకోవాలి. అయినప్పటికీ పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నందున పశ్చిమలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పోస్టింగ్ కల్పించినా దానికి ముఖ్యమంత్రి అమోదముద్ర తప్పనిసరి. సొంత జిల్లాల్లో అధికారులను నియమించాలంటే తప్పనిసరిగా సిఎం అనుమతి కావాల్సిందే. ఈ లాంఛనం కూడా పూర్తయితే కొత్త జడ్పీ సిఇఓ జితేంద్ర అనే చెప్పుకోవాలి.
ఇక మరో సారు కూడా సిద్దమయ్యారు. ఆయనకు కూడా అవసరమైన ఆశీస్సులతోపాటు ఇతరత్రా పరిస్ధితులు కూడా అనుకూలంగా ఉన్నాయనే చెపుతున్నారు. గత కొద్దికాలంగా కొవ్వూరు ఆర్డీవో కొనసాగే వ్యవహారం ప్రశ్నార్ధకంగా మారిపోతూ వచ్చింది. ఇక ఎంతోకాలం ఆయన ఈ పోస్టులో కొనసాగరన్న ప్రచారం అధికారవర్గాల్లో ఉంది. ఒకనొక సమయంలో ఆర్డీవో సూర్యారావు బదిలీ అయ్యారన్న ప్రచారం కూడా కొనసాగింది. అయితే ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఆయన ఆర్డీవోగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం బదిలీల సీజన్ రావటంతో ఆర్డీవోను తప్పనిసరిగా మారుస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో కొవ్వూరు ఆర్డీవోగా పోస్టింగ్ పొందేందుకు ప్రస్తుతం సివిల్ సప్లయిస్ డిఎంగా పనిచేస్తున్న సలీంఖాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా కీలకమైన ప్రజాప్రతినిధుల నుంచి భరోసా లభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా త్వరలో పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. ఇక డ్వామా పిడి ఎన్ రామచంద్రారెడ్డిని కూడా మాతృశాఖకు బదిలీ చేస్తూ కొద్ది నెలల క్రితమే ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆయన స్ధానంలో వేరొకర్ని నియమించకపోవటంతో కొత్త అధికారి వచ్చేంత వరకు ఆయనను కొనసాగాలని కలెక్టరు ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో ఆయన కొనసాగుతూ వస్తున్నారు. అయితే డ్వామా పిడిగా వచ్చేందుకు పలువురు తమదైనశైలిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ పెత్తనం ఎక్కువగా ఉండే డ్వామా పిడి పోస్టులోకి వచ్చేందుకు చాలామంది సుముఖంగా లేనట్లు సమాచారం. అదేవిధంగా ఎస్సీ కార్పోరేషన్ ఇడి, ఆర్‌విఎం పిఓ పోస్టులు కూడా గత కొద్దిరోజుల నుండి ఖాళీగానే ఉండిపోయాయి. ఈ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉండటంతో పలువురు ఈ పోస్టుల్లోకి వచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనా 15వ తేదీ నాటికి జిల్లా స్ధాయి పోస్టుల్లో చాలావరకు భర్తీ కానున్నాయని సమాచారం.
మళ్లీ మర్రిగూడెం
భూవివాదం
ఉద్రిక్తత
పలువురికి గాయాలు
బుట్టాయగూడెం, మే 8: మండలంలోని మర్రిగూడెంలో దళితరైతు బాషా రంపాలరాజుకు చెందిన భూములపై బుధవారం మరోసారి తీవ్ర వివాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్‌ఎస్ నెం.419, 418, 4171, 4172లలో ఉన్న సుమారు 14 ఎకరాల మామిడితోటలో పంట దింపటానికి రైతు రంపాలరాజు బుధవారం సమాయత్తమయ్యాడు. మామిడికాయలు ఎగుమతి చేయడానికి వచ్చిన లారీని మర్రిగూడెం గిరిజనులు అడ్డుకోవడంతో వివాదం మొదలయింది. లారీని అడ్డుకున్న గిరిజనులను రంపాలరాజు కుమారుడు రాజేష్, కాయలు కోయడానికి కూలీలుగా వచ్చిన నిమ్మలపాడుకు చెందిన కొండరెడ్లు గోగుల రమేష్, కరకాల బాబూరావు, కరకాల వెంకటరెడ్డి తదితరులు ప్రశ్నించడానికి వెళ్ళారు. దానితో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం దాడికి దారితీసింది. తమ కళ్లల్లో ఇసుక కలిపిన కారం చల్లి, బడితెలతో మోదారని, రాజేష్, రమేష్ తలలకు తీవ్రగాయాలు కావడంతో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించినట్లు రంపాలరాజు వర్గీయులు తెలిపారు. భూ వివాదం తేలకుండా కాయలు దింపడానికి అంగీకరించమని, అందుకే లారీని అడ్డుకున్నామని మర్రిగూడెం గిరిజనులు పేర్కొంటున్నారు. రంపాలరాజు కొండరెడ్డి గిరిజనులను రప్పించి, తమపై దాడికి ఉసిగొల్పడంతో మడకం అన్నపూర్ణ, గోరం సీత, కొమరం మల్లమ్మ, గోరం పార్వతి, కొమరం చెల్లారావులను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తున్నారు. గాయపడిన గిరిజనులను 108 అంబులెన్స్‌లో బుట్టాయగూడెం ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ చర్చలు ఏర్పాటు చేస్తామన్నారని, చర్చలు జరగకుండా తోటలో కాయలు కోయడానికి వీలులేదని గిరిజనులు వాదిస్తున్నారు. సంఘటనాస్థలానికి ముందుగా వచ్చిన జంగారెడ్డిగూడెం ఎస్సై బిఎన్ నాయక్ పరిస్థిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరించడంతో వివాదాస్పద భూ రికార్డులతో ఆర్డీవో నాన్‌రాజ్, డిఎస్పీ టి.రామకృష్ణారావు, సిఐ పి.మురళీ రామకృష్ణ, తహసీల్దారు ఎన్.నరసింహమూర్తి, సర్వే అధికారి కరాటం రామకృష్ణ మర్రిగూడెం చేరుకున్నారు. అమరికం లెక్క, ఫసలీ తదితర రికార్డులు గిరిజనులకు చూపించి, వాస్తవ పరిస్థితులు వివారించారు. భూములపై హక్కుకోసం న్యాయస్థానానికి వెళ్ళదలచుకుంటే న్యాయసహాయం కోసం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారికి సిఫార్సు చేస్తామని ఆర్డీవో తెలిపారు. ప్రస్తుతం భూమి న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రంపాలరాజు ఆధీనంలోనే ఉందని స్పష్టం చేశారు. తిరిగి వివాదాలు తలెత్తకండా పోలీసు పికెటింగ్ ఏర్పాటుకు ఆదేశించారు. ఆర్డీవో నాన్‌రాజు మర్రిగూడెం గిరిజనులకు పలు పరిష్కార సూచనలు చేసారు. అధికారులు తిరిగి వెళ్ళిపోతుండగా చివరగా బయలుదేరిన తహసీల్దార్ వాహనాన్ని గిరిజనులు అడ్డగించి, కొండరెడ్లు చేసిన దాడికి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా వెళ్ళిపోయిన ఆర్డీవో ఈ సమాచారం తెలుసుకుని, మళ్ళీ వెనక్కివచ్చి, గిరిజనులతో చర్చించి, గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, తహసీల్దార్ కారును బయలుదేరతీసారు. ఎస్సైలు ఆనందరెడ్డి, శేషగిరిరావు, ఎ ఎస్సై రామకృష్ణ, ఆర్‌ఐ రమేష్, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ తదితరులు హజరయ్యారు.

తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ
అధ్యక్షురాలిగా చిట్టూరి
తణుకు, మే 8: తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలిగా వేల్పూరు గ్రామ కాంగ్రెస్ నాయకురాలు చిట్టూరి కనకదుర్గ, వెంకట సునందను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పీఠంపై పశ్చిమ గోదావరి జిల్లాలో రెండోసారి మహిళను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. గతంలో 1985లో ఈలి వరలక్ష్మి తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మొదటిసారి నియమితులయ్యారు. ఆ తరువాత రెండున్నర దశాబ్దాల అనంతరం జిల్లాలో ఒక మహిళను ఎఎంసి ఛైర్మన్‌గా నియమించడం శుభసూచకమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా గుబ్బల శ్రీనివాసరావు, సభ్యులుగా కారంపూడి సత్యవతి, గారపాటి రాజప్రతాప్, షేక్ సాతార్ సాహెబ్, దుర్గా నాగేశ్వరరావు, గంటా వెంకటరత్నం, మేడపాటి రంగారెడ్డి, మాజేటి వెంకట సూర్య నాగేశ్వర ప్రసాద్, పరిమి వీర వెంకట సత్యనారాయణ, మద్దాల శ్రీనివాసరావు, ట్రేడర్స్ ప్రతినిధులుగా బండి భాస్కరరావు, గజ్జరపు వెంకట్రావు, రెడ్డి వీర వెంకటరత్నం నియమితులయ్యారు.

మోడల్ సొసైటీలుగా 25 సహకార సంఘాలు
దేవరపల్లి, మే 8: రైతులకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో జిల్లాలో 25 సహకార పరపతి సంఘాలను మోడల్ సొసైటీలుగా తీర్చిదిద్దుతామని నాబార్డు జిల్లా మేనేజర్ టి వెంకటకృష్ణ వెల్లడించారు. దేవరపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సమావేశంలో వెంకటకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయరంగంతో పాటు ఇతర రంగాల్లో కూడ రైతులు అభివృద్ధి సాధించడానికి జిల్లాల్లో 250 సొసైటీలున్నాయని, వాటిలో 25 సొసైటీలను మోడల్ సొసైటీలుగా ఎంపిక చేశామన్నారు. ఎంపిక చేసిన మోడల్ సొసైటీల ద్వారా పరపతేతర వ్యాపారాలకు కూడ రుణాలు మంజూరు చేస్తామన్నారు. మోడల్ సొసైటీ పరిధిలో రైతులు 20 మంది సంఘంగా ఏర్పడి రైతుక్లబ్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి రైతుక్లబ్‌కు నాబార్డు తరఫున ప్రతి సంవత్సరం పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇతర రుణాలు కూడ అందచేస్తామని ఆయన వెల్లడించారు. సొసైటీ అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ రైతులకు టైఅప్ రుణాలివ్వాలని, కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేసిన రైతులకు కూడ రుణ సౌకర్యం కల్పించాలని కోరారు. బంగారంపై రుణాలకు వడ్డీశాతం తగ్గించాలని కోరారు. సొసైటీల ద్వారా దీర్ఘకాలిక రుణాలివ్వాలని, ట్రాక్టర్లు, బోర్లకు, పాడిగేదెలకు రుణాలు సమకూర్చాలని కోరారు. సంఘ కార్యదర్శి కల్లూరి శ్రీనివాస శర్మ మాట్లడుతూ దేవరపల్లి సంఘం ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా డెవలప్‌మెంట్ సేల్ మేనేజర్ సురేష్‌ప్రభు, సొసైటీ డెవలప్‌మెంట్ సేల్ సభ్యులు సూర్యప్రకాశం, బాలకృష్ణ, యర్నగూడెం బ్రాంచి మేనేజర్ డిఎన్‌వి ప్రసాద్, సూపర్‌వైజర్ మోహనరావు, డైరెక్టర్లు దుగ్గిన గంగరాజు, దొమ్మేటి శ్రీను, పిచ్చికల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
బెల్టుషాపులపై దాడి
ఏలూరు, మే 8 : పెదపాడు, పెదవేగి, ఏలూరు మండలాల పరిధిలోని బెల్టుషాపులపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. పెదపాడు మండలం వట్లూరు, పెదవేగి మండలం కొప్పాక, పెదవేగి గ్రామంతోపాటు ఏలూరు మండలంలోని పలు గ్రామాలతోపాటు నగరంలోని బెల్టుషాపులపై దాడులు చేసి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న విక్రేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీహరి తెలిపారు. ఈ దాడులను మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
బాలికపై వృద్ధుడు అత్యాచారం
*దేహశుద్ధి చేసిన స్థానికులు*కేసు నమోదు చేసిన పోలీసులు
ఏలూరు, మే 8 : కామవాంఛతో కళ్లు మూసుకుపోయిన ఒక వృద్ధుడు అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏలూరు మండలం శనివారపుపేట గ్రామంలో ఈ అత్యాచార ఘటన 15 రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు త్రీటౌన్ ఎస్ ఐ కె శ్రీనివాసరావు కధనం ప్రకారం ఏలూరు మండలం శనివారపుపేట గ్రామంలో తాడి ప్రకాశం అనే 55 సంవత్సరాల వృద్ధుని ఇంటిలో బాపల విజయకుమారి, ఆమె భర్త సత్యనారాయణ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అద్దెకు ఉంటోంది. షెడ్యూల్డు కులానికి చెందిన బాపల విజయకుమారి, సత్యనారాయణలు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. 15 రోజుల క్రితం ఇంటి యజమాని తాడి ప్రకాశం తన ఇంటిలో అద్దెకు వుంటున్న విజయకుమారి చిన్న కుమార్తె అయిన అయిదు సంవత్సరాల వయస్సున్న బాలికను తన ఇంటిలోకి పిలిచాడు. కందిపప్పు తీసుకురావాలంటూ బాలికను పంపించాడు. ఆ బాలిక కందిపప్పు తీసుకువచ్చి ప్రకాశానికి ఇచ్చింది. అయితే ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం జరిపాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంటిలో వున్న నుయ్యిలో పడేస్తానని బాలికను ప్రకాశం బెదిరించాడు. దీంతో భయపడిన ఆ బాలిక విషయాన్ని గోప్యంగా ఉంచింది. అయితే గత కొద్దిరోజులుగా ఆ బాలిక నలతగా ఉండటాన్ని పక్కింటి మహిళ గుర్తించింది. ఆ మహిళ బాలికను పిలిచి ఆరా తీయగా విషయం బయటపడింది. ఆ మహిళ బాలిక తల్లి విజయకుమారికి జరిగిన విషయాన్ని చెప్పింది. విషయం ఆనోటా ఈనోటా చుట్టు ప్రక్కల ప్రజలకు చేరడంతో వారంతా వచ్చి ప్రకాశాన్ని జరిగిన విషయంపై నిలదీశారు. అంతటితో ఆగకుండా వారంతా ప్రకాశానికి దేహశుద్ధి చేసి మంగళవారం రాత్రి పొద్దుపోయాక త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఏలూరు డి ఎస్‌పి ఎం రజనీ ఆధ్వర్యంలో అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడు తాడి ప్రకాశంపై 376 ఐపిసి (ఎఫ్) సెక్షన్ 3(2)(వి) ఎస్‌సి, ఎస్‌టి 1989 చట్ట ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోజుకి ఎనిమిది గంటలు విద్యుత్ కోతలు దారుణం
ఏలూరు, మే 8 : విద్యుత్ ఛార్జీలను మోయలేనంతగా పెంచేసి మరో ప్రక్క రోజుకు ఎనిమిది గంటలు పాటు విద్యుత్ కోతను అమలు చేయడం దారుణమని ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అంబికా కృష్ణ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టుటౌన్ మెయిన్ రోడ్డులోని గంగానమ్మ గుడి వద్ద నుండి మధులత సెంటర్ వరకు సంతకాల సేకరణను ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ ఈ నెల నుండి 6 వేల కోట్ల పైచిలుకు విద్యుత్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సర్దుబాటు ఛార్జీల పేరుతో రెండు విడతలుగా మరో రెండు వేల కోట్ల రూపాయలు వడ్డించడం పేద ప్రజల నడ్డి విరవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో సాధారణ ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా చిన్నపాటి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అంబికా కృష్ణ విరుచుకుపడ్డారు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బడేటి కోట రామారావు (బుజ్జి) మాట్లాడుతూ తాగడానికి మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నాయకులు కొల్లేపల్లి రాజు, ఉప్పాల జగదీష్‌బాబు, ఈడ్పుగంటి నరసింహారావు, పాలి ప్రసాద్, పెద్దిబోయిన శివప్రసాద్, చల్లా అప్పలరాజు, శెట్టి కళావతి, బంకా రామమోహనరావు, అద్దంకి శ్రీరామచంద్రమూర్తి, నాయుడు పోతురాజు, నెరుసు గంగరాజు, ఎం నర్సయ్య, ఒబిలిశెట్టి మల్లిఖార్జునరావు, జంపా సూర్యనారాయణ, గొర్రెల సూర్యనారాయణ, చింతల రాంబాబు, రేగాని మహాలక్ష్మీ నాయుడు, పి గంగరాజు, చింతాడి కనకారావు, తేరా వెంకటేశ్వరరావు, నక్కా సుబ్బారావు, బేతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్ విజయంపట్ల కొత్తపల్లి హర్షం
మొగల్తూరు, మే 8: కర్నాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించటం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నరసాపురం ఏమ్మేల్యే కొత్తపల్లి సూబ్బారాయుడు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలో కెపి పాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సమాచారాన్ని తెలుసుకున్న ఆయన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రానున్న సార్వతిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించటం ఖాయమని ఈ ఎన్నికలు రుజువు చేస్తూన్నాయని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని 121 సీట్లతో గెలిపించటం పార్టీపై ఉన్న అపారమైన నమ్మకమని నిదర్శనమని ఆయన తెలిపారు. కేంద్ర నాయకత్వం పైన, కాంగ్రెస్ చైర్‌పర్సన్ సోనియగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అందించిన మంచి పరిపాలనపై ఆ రాష్ట్ర ప్రజలు ముందుగా ఇచ్చిన ప్రజా తీర్పుగా ఆయన అభివర్ణించారు. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్‌పార్టీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతుందని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణల నాయకత్వంలో మళ్లీ కాంగ్రెస్‌పార్టీకి మరిన్ని మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు.

సెమీఫైనల్స్‌కు హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలు
భీమవరం, మే 8: స్ధానిక భారతీయ విద్యాభవన్స్‌లో జరుగుతున్న మల్లినీడి సత్యనారాయణమూర్తి మెమోరియల్ మూడవ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుఘల హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలు బుధవారం సెమిఫైనల్స్‌కు చేరాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు హోరాహోరీగా తలపడి తమ ప్రతిభను చాటారు. బుధవారం క్వార్టర్ ఫైనాల్స్‌లో పశ్చిమగోదావరి జట్టుపై కడప జట్టు 4-5స్కోరుతో విజయం సాధించింది. నెల్లూరు జట్టుపై చిత్తూరుజట్టు 2-6స్కోరుతో విజయం సాధించింది. తూర్పుగోదావరి జట్టుపై నిజామాబాద్ జట్టు 2-3స్కోరుతో విజయం సాధించింది. విజయనగం జట్టుపై విశాఖపట్నం జట్టు 0-6స్కోరుతో విజయం సాధించింది. అనంతరం సెమిఫైనాల్స్‌లో నిజామాబాద్ జట్టుపై చిత్తూరుజట్టు 0-3స్కోరుతో విజయం సాధించింది. విశాఖపట్నం జట్టుపై కడప జట్టు 2-3స్కోరుతో విజయం సాధించింది. గురువారం జరగబోయే ఫైనాల్స్‌లో చిత్తూరు- కడపజట్లు పోటీపడుతున్నట్లు నిర్వహకులు తెలిపారు.
సినీ ఎగ్జిబిటర్ కరాటం మృతి

జంగారెడ్డిగూడెం, మే 8: డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు తమ్ముడు, సినీ ఎగ్జిబిటర్ కరాటం మురళి (60) మృతి చెందారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన విజయవాడ డాక్టర్ రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో జంగారెడ్డిగూడెం, పరిసర మండలాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మురళి భౌతిక కాయాన్ని జంగారెడ్డిగూడెంలోని ఆయన స్వగృహానికి ఉదయం తరలించారు. ఆయన అభిమానులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్, పోలవరం ఎఎంసి ఛైర్మన్ జెట్టి గురునాధరావు, చింతలపూడి ఎఎంసి ఛైర్మన్ మేడవరపు అశోక్‌బాబు, మహాత్మాఫూలే అవార్డు గ్రహీత డికెడి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి రాఘవేంద్రరావు, డియ్యస్పీ టి.రామకృష్ణారావు, ఉషాపిక్చర్స్ అధినేత వివి బాలకృష్ణారావు, పోలవరం ఎఎంసి వైస్ ఛైర్మన్ మట్టా సత్తిపండు, విద్యావేత్త అలుగు ఆనందశేఖర్, కాంగ్రెస్ నేతలు మండవల్లి విజయసారథి, కొండపల్లి కేశుబాబు, కర్రా శ్రీ్ధర్, పిపిఎన్ చంద్రరావు, పరిమి సత్తిపండు, ముప్పిడి శ్రీనివాసరావు, ఉక్కుర్తి దుర్గారావు, మేడవరపు విద్యాసాగర్, రావూరి కృష్ణ, అచ్యుత శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, వైఎస్‌ఆర్‌సి పార్టీ నేతలు తల్లాడి సత్తిపండు, పోల్నాటి బాబ్జి, పాశం రామకృష్ణ, గూడపాటి రాధాకృష్ణ, చనమాల శ్రీనివాసరావు, కేమిశెట్టి మల్లిబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు మండవ లక్ష్మణరావు, నందిన హరిశ్ఛంద్ర, గంగిరెడ్ల మేఘలాదేవి, షేక్ ముస్త్ఫా, పెనుమర్తి రామ్‌కుమార్, కొండ్రెడ్డి సోమరాజు, సిపిఐ నేత బూరుగుపల్లి సూరిబాబు, ఇంకా పలు పార్టీల నేతలు, పలువురు సినీ ఎగ్జిబిటర్లు, అభిమానులు ఆయన భౌతిక కాయంపై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. మురళీ సోదరులు కరాటం రాంబాబు, కరాటం వెంకటరెడ్డి నాయుడు, కరాటం ఉమామహేశ్వరరావు, మురళి కుమారుడు కార్తీక్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళి భౌతిక కాయాన్ని కొద్దిసేపు సౌభాగ్య ధియేటర్ల ఆవరణలో ఉంచి, ఆయన స్వగ్రామం బుట్టాయగూడెంలో అంత్యక్రియలకు తరలించారు. కాగా, మురళికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె, కుమారునికి వివాహాలు చేసారు. ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్‌గా పలు నిర్మాణాలు చేసిన ఘనత మురళికి ఉంది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఆశక్తి లేనప్పటికీ మురళి ఆవిర్భావ సమయంలో తెలుగుదేశం పార్టీలోను, తరువాత కాంగ్రెస్ పార్టీలోను కొనసాగారు. కొద్దికాలం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కూడా పని చేసారు.

*డిఆర్వోగా ప్రభాకర్*జడ్పీ సిఇఒగా జితేంద్ర*కొవ్వూరు ఆర్డీవోగా సలీంఖాన్ *ఆశీస్సులు జారీ*ఉత్తర్వులే తరువాయి*మరికొన్ని పోస్టులకు కూడా
english title: 
k

ధర్మ పరిరక్షణకు కుంభమేళా

$
0
0

న్యాల్‌కల్, జహీరాబాద్‌, మే 9: హిందూ ధర్మ పరిరక్షణకోసం కుంభమేళాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని రవిశంకర్ గురుజీ అన్నారు. దక్షిణ భారత దేశంలోలనే మంజీరా కుంభమేళా నిర్వహించడం అభినందనీయమని కాశీనాథ్ బాబా సేవలను కొనియాడారు. మంజీరా కుంభమేళాలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రవచిస్తూ మంజీరానదిలో స్నానం చేసినవారికి నదులు, సముద్రాల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందన్నారు. మొన్నటి వరకు జరిగిన అలహాబాద్ కుంభమేళాలో 10కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారన్నారు. మహారాష్ట్ర ,కర్ణాటకనుంచి వచ్చిన మంజీరానీరే మంజీరా కుంభమేళా అన్నారు. గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ కలువడం చాలా సంతోషకరమన్నారు. ఇక్కడ స్నానాలు చేసిన భక్తుల పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమవుతాయన్నారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది సాధువులు, సంతులు తరలివచ్చి మంజీరా నదిలో స్నానాలుచేశారన్నారు. వాటిలో భక్తులు స్నానాలుచేస్తే పాపాలు తొలగిపోతాయన్నారు. సాధువులు ఎక్కడ ఉంటారో అక్కడ మంజీరానీరు తీర్థమవుతుందన్నారు. అందరూ మంచిమార్గంలో నడుచుకోవాలన్నారు. ధర్మో రక్షతి: రక్షితహా: అన్న నానుడిని నిత్యజీవితంలో అనుసరించాలన్నారు. ప్రపంచంలో హిందూ ధర్మాన్ని విస్తరింప జేస్తున్నామన్నారు. భగవంతునిపై విశ్వాసం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఇది మంచిపరిణామం కాదన్నారు. మనుషులు అనేక రోగాలకు గురౌతున్నారన్నారు. అందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పంచవటి పీఠాధిపతి కాశీనాథ్ బాబా మాట్లాడుతూ 84వేల కోట్ల జీవరాసుల్లో మనిషి జీవితమే ఉత్తమమైనదన్నారు. భగవంతుని కృపకు పాత్రులు కావాలన్నారు. ప్రపంచ దేశాల్లో హిందూధర్మాన్ని ఆచరిస్తున్నాన్నారు. 2010లో మంజీరా కుంభమేళాలో ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. అప్పుడు రామ్‌దేవ్‌బాబా వచ్చి హిందూ ధర్మపరిరక్షణకోసం, సంపూర్ణారోగ్యంకోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. 2013లో కూడా అదేతరహాలో కుంభమేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంజీరానది మహారాష్ట్ర బీడ్ జిల్లా పడౌడి తాలుకాలోని బాలాపూర్ కొండల్లో జన్మించిందన్నారు. అక్కడినుంచి అనేక ప్రాంతాలగుండా పంచవటి క్షేత్రంచేరుతుందన్నారు. ఇక్కడినంచి నిజామాబాద్ జిల్లాగుండా ప్రవహించి నిజామాబాద్‌లోని బాసరవద్ద గోదావరిలో కలుస్తాయన్నారు. అన్ని మతాల సారాంశం దేవుడొక్కడేనన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకోసం కుంభమేళా నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన సాధువులు కుంభమేళాలో స్నానాలు చేశారన్నారు. ఈ నదిలో స్నానాలు చేసిన భక్తుల సర్వపాపాలు, రోగాలు తొలుగుతాయన్నారు. శివకుమార్ మహారాజ్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా బీదర్ మఠంలో ఓం నమశివాయ అఖండ నామ స్మరణ చేస్తున్నామన్నారు. మంజీరా పురశ్కరాలు నిర్వహిస్తున్న కాశీనాథ్‌బాబాకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సభలో వివిధ ప్రాంతానుంచి వచ్చిన సాధువులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధిద్దాం
*మెదక్ ఎంపి విజయశాంతి
గజ్వేల్, మే 9: సమైక్యవాద పార్టీలకు బుద్దిచెబితేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మక్కపల్లి, ముట్రాజ్‌పల్లి, గిరి పల్లి, గజ్వేల్, పిడిచెడ్, అహ్మదీపూర్ తదితర గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే ఇక్కడి సమస్యలకు పరిష్కారం లభించనుండగా, ఇక్కడి వనరులు దోచుకెళ్తున్న సీమాంధ్ర పాలకులు, పెట్టుబడి దారులను నిల దీయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఆమరుల త్యాగాల పునాదులపై జరుగుతున్న ఉద్యమం వృథాకాదని, అయితే వారి మృతదేహాలపై ప్రమాణాలు చేసిన నేతలు పదవులు పట్టుకొని వేలాడుతుండడం సిగ్గుచేటని నిలదీశారు. అలాగే తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చిన సోనియాగాంధీ పార్లమెంటులో బిల్లుపెట్టి ఆమోదింపజేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసమే టీఆర్‌ఎస్ ఆవిర్భవించగా, అన్ని వర్గాలు అండగా నిలిచి లక్ష్యాన్ని నెరవేర్చుకుందామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని నిధులు కెటాయిస్తుండగా, గజ్వేల్ నియోజకవర్గానికి ఇప్పటికే వివిధ పథకాల క్రింద రూ,2కోట్లు కెటాయించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా విజయశాంతి పర్యటనలో మహిళల నుండి మంచి స్పందన లభించగా, గజ్వేల్ హౌజింగ్ బోర్డు కాలనీలో ఎంపిని ఘనంగా సన్మానించారు. అలాగే గిరిపల్లిలో ఎంపి విజయ శాంతి బోనం ఎత్తుకోగా, ఆయా గ్రామాలలో తరలివచ్చిన పార్టీ శ్రేణు లు ఘనంగా స్వాగతం పలికారు. నేతలు కొట్టాల యాదగిరి, ఆకుల దేవేందర్, చందు తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌కు రెండేళ్ల జైలు
* మెదక్ జిల్లా జడ్జి తీర్పు
మెదక్, మే 9: పోలీస్ కానిస్టేబుల్ రామాంజనేయులుకు రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమాన విధిస్తూ జిల్లా జడ్జి రజిని గురువారం సంచలన తీర్పు ఇచ్చారు. కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉంటూ మెదక్ సబ్ జైల్‌లో అటాచ్‌మెంట్ గార్డుగా డ్యూటీలో ఉన్న రామాంజనేయులు పిసి నెం.1157 పాత కక్షలు పునష్కరించుకుని మెదక్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఎ.విజయ్‌కుమార్‌ను కులం పేరుతో దుర్భాషలడాడు. దీంతో సిఐ ఎ.విజయ్‌కుమార్ మెదక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై మహేశ్ కేసు నమోదు చేసి, అప్పటి డిఎస్పీ మొగిలికి కేసు పరిశోధనకై కేసు ఫైల్ అప్పగించారు. డిఎస్పీ మొగిలి విచారణ జరిపి నేర నిరూపణ చేసి రామాంజనేయులును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కోర్డులో చార్జీషీట్ దాఖలు చేశారు. అప్పటి నుండి కేసు సంగారెడ్డి కోర్టులో సాక్షుల విచారణ సాక్ష్య నిరూపణ జరిపింది. ఈ కేసుపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాస్మిన్ ప్రాసిక్యూషన్ తరపున వాదన చేశారు. దరిమిల శుక్రవారం నాడు జిల్లా జడ్జి రజిని వాదోపవాదల పరిశీలన చేసిన అనంతరం రామాంజనేయులుకు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు. 20 వేల రూపాయలను ఫిర్యాదు దారుడు విజయ్‌కుమార్‌కు చెల్లించాలని కూడా జిల్లా జడ్జి తీర్చునిచ్చారు. ఈ సమాచారాన్ని మెదక్ టౌన్ పిఎస్ తరపున సిఐ ఎల్.విజయ్‌కుమార్ పత్రికలకు విడుదల చేశారు.
ఖాళీ బిందెలతో మహిళల రాస్తారోకో
మెదక్, మే 9: మెదక్ గొల్కోండ బస్తి మెదక్‌హైదరాబాద్ రోడ్డుపై గురువారం ఉదయం 8 గంటలకు శాంతినగర్, గొల్కోండ, అంబేద్కర్ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి ఎంఆర్‌పియస్ నాయకులు బాల్‌రాజు, కిషన్, రాజు, నర్సమ్మ, లక్ష్మీ, పోచమ్మ, దేవమ్మ నాయకత్వం వహించారు. మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క నీళ్ల ట్యాంకర్ కూడా రావడం లేదని నళ్లల్లో, నళ్లాలో నీళ్లు రావడం లేదని ఒక్క సారిగా మహిళలు కొపోద్రిత్తులై ఖాళీ బిందెలతో రోడ్డేక్కారు. మున్సిపల్ కమీషనర్ తమ వద్దకు వచ్చి మంచినీటిని పరిష్కరిస్తామని హామి ఇచ్చేంత వరకు రాస్తారోకో చేస్తామని మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రస్తారోకోలో ఖాళీ బిందెలను ప్రదర్శించారు. త్రాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడం లేదు. స్నానాలు లేవు, బట్టలు ఉతకడం లేదు, కానీ నళ్ల బిల్లులు మాత్రం ముక్కుపిండి వాసుళ్లు చేస్తున్నారని మహిళలు వాపోయారు. నళ్లా బిల్లుల కోసం మా బస్తిలకు ఎలా వస్తారో చుస్తామన్నారు. నీళ్లు ఇవ్వకుండా నళ్లా బిల్లులు ఎందుకు కట్టాలని కూడా వారు ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు ఎసిల కింద నిద్రబోతున్నారని ఆరోపించారు. మా వాడలకు వచ్చి మా బ్రతుకులు చుడండి అని మహిళలు నిందారోపణలు చేశారు. సుమారు 45 నిమిషాలు ధర్నా చేయడంతో ఇరు ప్రక్కల వాహానాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన కారులను ప్రక్కకు తొలగించడంతో ట్రాఫిక్ అంతరాయం తొలగింది. అక్కడి నుండి మహిళలు అవే ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

బయ్యారం గనులను ఆంధ్రాకు తరలించొద్దు
* కలెక్టరేట్ ముందు ధర్నాను విజయవంతం చేయాలి
* టిఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రాజయ్య
సంగారెడ్డిరూరల్,మే 9: బయ్యారం ఉక్కును ఆంధ్ర ప్రాంతానికి తరలించే ఆలోలచనలను విరమించుకోవాలని, ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రద్దు చేయాలని టిఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్ డిమాండ్ చేశారు.గురువారం ఐబిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయ్యారం ఉక్కును విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించి తీరుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నెల 10న సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులకు ఆయన పిలుపునిచ్చారు.ఈ ధర్నాతో ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 14న మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలను నిర్వహిస్తామన్నారు. బయ్యారం నుండి ఒక్క మట్టి పెళ్లను కూడా తరలించకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆంధ్ర ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ద్ధ, తెలంగాణ ప్రాజెక్టులపై లేదన్నారు. ఈ నెల 15నుండి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కార్యకర్తలకు శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గం నుండి పది వేల మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణ ద్వారా కార్యకర్తలను వీరసైనికుల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి చింత ప్రభాకర్, గాలి అనిల్‌కుమార్, జలాలోద్దీన్‌బాబా, విజయేందర్‌రెడ్డి, నరహరిరెడ్డి, దుర్గేష్, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో వాహనాల కేసులను పరిష్కరించుకోవాలి
* జిల్లా జడ్జి రజని
సంగారెడ్డిరూరల్,మే 9: ఈ నెల 18న జిల్లా కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్‌లో వాహనాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి టి.రజని కక్షిదారులకు సూచించారు. గురువారం జిల్లా కోర్టులో సంబంధిత న్యాయవాదులు,యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. లోక్ అదాలత్‌లో ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరించాలని జిల్లా జడ్జి న్యాయవాదులకు సూచించారు. వాహనాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు 18న లోక్‌అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరి వి.నిరంజన్‌రావు, సంబంధిత న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.
జూన్ 1 నుండి బడిబాట
సంగారెడ్డిరూరల్,మే 9: జూన్ 1వ తేదీ నుండి జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి రాజ్యలక్ష్మి మండల విద్యాధికారులకు సూచించారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో మండల విద్యాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర అకాడమిక్ మానిటరింగ్ అధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అదనపుజాయింట్ కలెక్టర్ మూర్తి మాట్లాడుతూ మండల విద్యాధికారులు, పాఠశాలల యాజమాన్య కమిటీలతో సమావేశాలు నిర్వహించి, పాఠశాలలు సక్రమంగా పని చేసే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఆర్‌విఎం సిఎంఓ ఎ.వెంకటరాములు, ఎఎంఓ ఎన్.సత్యనారాయణ, ఎఎల్‌ఎన్ సిఓ ప్రకాష్, ఫ్లాగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎఫ్‌ఎఓ బాలరాజ్, ఎఎన్‌ఓ విజయ్‌కుమార్, ఎపిఓ తాజోద్దీన్, పర్యవేక్షకులు బి.శంకర్ పాల్గొన్నారు.
నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలి
సంగారెడ్డిరూరల్, మే 9: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో సింగూర్ పరివాహక ప్రాంతంలోని ఖాదీరాబాద్, పాలడుగు,మంతూర్ తదితర గ్రామాలలో వలలు, తెప్పలు నష్టపోయిన మత్స్యకారులను ఆదుకోవాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా రేగోడ్ మండలంలో పిడుగుపాటుకు మృతి చెందిన బాలిక కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండి సర్ధార్, వృత్తిసంఘాల నాయకులు జి.జయరాజ్, సామేల్, నర్సింలు, ఆగమయ్య, సంగయ్య, శ్రీరాం, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎసిబి వలలో ఎస్‌ఐ మురహరి
గజ్వేల్, మే 9: ఎసిబి వలలో బేగంపేట ఎస్‌ఐ మురహరి చిక్కిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి నిజామాబాద్ ఎసిబి డిఎస్పీ సంజీవరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలం వీరానగర్‌కు చెందిన రాంలాల్, నర్సింలులు ఏప్రిల్ 15వ తేదీన ఉపాధిహామీ బిల్లుల విషయమై గొడవ పడగా, 16వ తేదీన బేగంపేట ఎస్‌ఐ మురహరికి ఇరువురు ఒకరిపైనొకరు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే వారు గ్రామంలోనే పంచాయతీ నిర్వహించి రాజీపడగా, రూ,10వేలు ఇస్తే నే కేసు కట్టనని, లేని పక్షంలో జైలుకు పంపిస్తానని రాంలాల్‌ను ఎస్‌ఐ బెదిరించాడు. ఈక్రమంలో అతను రూ,5వేలు ఇస్తానని ఎస్‌ఐతో ఒప్పందం కుదుర్చుకొని ఎసిబి అధికారులను అశ్రయించాడు. దీంతో గురువారం రూ,5వేల నగదు బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ మురహరికి అందజేస్తుండ గా, ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం రూ,5వేలు స్వాధీనం చేసుకోవడంతోపాటు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్లు ఎసిబి డిఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. మెదక్, నిజామాబాద్ ఎసిబి సిఐలు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, రఘునాథ్, ఎస్‌ఐ రశీద్‌అలి పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు డబ్బుల కోసం వేధిస్తే తమకు సమాచారం అందించా లని, నిజామాబాద్ జిల్లాలో మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు.

‘్ఫ్లరైడ్’ పట్ల అప్రమత్తంగా ఉండాలి
గజ్వేల్, మే 9: భయంకరమైన ఫ్లోరైడ్ నీటి పట్ల అప్రమత్తత అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి భామతి పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లోని నీటి సరఫరా విభాగం డిప్యూటీ ఇఇ కార్యాలయం, నీటి శుద్ధి పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం కేంద్రం అవసరమైనన్ని నిధులు కీటాయిస్తుండగా, గ్రామీణులను కలుషిత నీటి పట్ల చైతన్యం చేయాలని కోరారు. అయితే నీటి నమూనా పరీక్షా కేంద్రాల నుండి వచ్చే నివేదికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండ గా, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బంది గ్రామస్థాయి అధికారులకు చేరవేసి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ కనబర్చాలని సూచించారు. నీటి పరీక్షలు నిరంతరం నిర్వహిస్తూ రోగాలు ప్రబలకుండా చూడవచ్చని, అయితే నీటి నాణ్యత తెలియని జనం వాటిని సేవిస్తూ వ్యాధుల భారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫ్లోరోసిన్‌తోపాటు ప్రమాద కర లక్షణాలు కలిగిన నీటిని దూరంగా ఉంచాలని, పైపులైన్ లీకేజీలపై దృష్టి పెట్టాలని కోరారు. జిల్లాలోని 7 నీటి నమూనా పరీక్షా కేంద్రాల పని తీరును కలెక్టర్ దినకర్‌బాబును ఆమె అడిగి తెలుసుకోగా, మంచి ఫలితాలు సాధిస్తూ వ్యాధులు ప్రబలకుండా చూస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వివిధ అంశాలపై ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, నీటి నమూనా పరీక్షాకేంద్రం సిబ్బందికి ఆమె సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ విజయప్రకాష్, ఇఇ అంజనేయులు, డిప్యూటీ ఇఇ కమలాకర్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఎంపిడిఓ కౌసల్యా దేవి, మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

* ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ
english title: 
kumbh mela

జిల్లా ట్రెజరీ కార్యాలయంలో తనిఖీలు

$
0
0

నల్లగొండ , మే 9: జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని బుధవారం ట్రెజరీ శాఖ అదనపు సంచాలకులు గాండ్ల విజయ్‌కుమార్ తనిఖీ చేశారు. ట్రెజరీ కార్యాలయంలోని పెన్షన్, డిపాజిట్, స్ట్రాంగ్‌రూం, కొత్త పెన్షన్స్ విధానాలు (సిపిఎస్), పరిపాలనా విభాగం పైళ్లతోపాటు 2012-13 సంవత్సరం ఫైళ్ల నిర్వహణను పరిశీలించి రికార్డుల నిర్వహణపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో నూతన పెన్షన్ విభాగమునకు సంబంధించి 42కోట్ల రూపాయాలను ఉద్యోగుల ఖాతాల్లో జామచేయడం అభినందనీయమాన్నారు. అదనపు జెసి నీలకంఠం, ట్రెజరీ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడాల రమేష్ ఆయన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ ఉప సంచాలకులు నాగఫణీరాజు, ఎడి గుజ్జరాజు, ట్రెజరీ ఉద్యోగులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు మాలె చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు శైలజ, చంద్రశేఖర్, సత్యనారాయణ, శ్రీకాంత్, గుప్తా, సురేష్ తదితరులు ఉన్నారు.

ఎఎమ్మార్పీ ప్రధాన కాల్వకు నీటి విడుదల
పెద్దఅడిశర్లపల్లి, మే 9 : అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎఎమ్మార్పి ప్రధాన కాల్వకు గురువారం నీటిపారుదల శాఖ అధికారులు 600క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జిల్లాలో తాగు నీటి అవసరాల నిమిత్తం ఈ నీటిని విడుదల చేస్తున్నట్లు ఎఎమ్మార్పి నాలుగవ డివిజన్ ఇఇ దేవేందర్‌రెడ్డి తెలిపారు. పుట్టంగండి వద్ద 2మోటార్ల ద్వారా 900క్యూసెక్కుల నీటిని విడుదల చేసి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తునట్లు తెలిపారు. జంట నగరాల ప్రజల తాగు నీటి అవసరాల నిమిత్తం ఎకెబి ఆర్ నుండి కోదండాపురం ఫ్లాంటు ద్వారా 350క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తునట్లు పేర్కొన్నారు.

వేగ నియంత్రణతోనే ప్రమాదాల నివారణ సాధ్యం
డిఎస్పీ విజయ్‌కుమార్
నల్లగొండ , మే 9: వాహనాదారులు వేగ నియంత్రణతోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నివారణ సాధ్యమని నల్లగొండ డి ఎస్సీ విజయ్‌కుమార్ అన్నారు. గురువారం ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో వేగ నియంత్రణ, తక్కువ వేగంతో వాహనాలను నడిపే విధానంపై మోటర్ సైకిల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కువ వేగంతో వాహనాలు నడిపిన వారిలో విజేతలకు ఆయన బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ఎంవి.శ్రీనివాస్‌రావు, లయిన్స్ క్లబ్ నిర్వాహకులు ఏచూరి భాస్కర్, ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.

యువత సన్మార్గంలో నడవడానికి క్రీడలు దోహదం
భువనగిరి సబ్ కలెక్టర్ దివ్యదేవరాజన్
వలిగొండ, మే 9: గ్రామీణ ప్రాంతాల్లోని యువత సన్మార్గంలో నడవడానికి క్రీడలు దోహదపడుతాయని భువనగిరి సబ్‌కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. గురువారంవేంకటేశ్వర జడ్పీ ఉన్నత పాఠశాలలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్‌స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన దివ్యదేవరాజన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటుపడకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా క్రీడలను ఏర్పాటు చేసిన ట్రైనీ ఎస్పీ ఫకీరప్పాను ఆమె అభినందించారు. డిఇవో జగదీష్ మాట్లాడుతూ క్రీడలకు, పాఠశాలలకు విరాళాలను అందజేస్తున్నవారికి సెప్టెంబర్ 5న జిల్లా కేంద్రంలో సన్మానిస్తామన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు గూడూరు లక్ష్మారెడ్డి స్మారక బహుమతులను అందజేశారు. డివిజన్‌స్థాయి క్రీడల్లో విన్నర్‌గా గుండాల, రన్నర్‌గా ఆత్మకూర్ జట్లు నిలిచాయ. కార్యక్రమంలో ఎంపిడివో కె.జానకిరెడ్డి, ఎస్‌ఐ చంద్రశేఖర్, పిడిలు ప్రభాకర్‌రెడ్డి, చంఢీ, శీనయ్య, స్వామిరాజ్, దాతలు గూడూరు శేఖర్‌రెడ్డి, మల్లేషం, సైదులు, పంజాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఫోటో ఓటర్ల జాబితా పరిశీలన
వీడియో కాన్ఫరెన్స్‌లో భన్వర్‌లాల్ సమీక్ష
నల్లగొండ, మే 9: ఫోటో ఓటర్ల జాబితాను నూరు శాతం తప్పులు లేకుండా సరిచూసుకునేందుకు నేటి నుంచి వచ్చే నెల 15వరకు బూత్‌స్థాయి సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో 18ఏళ్లు నిండిన వారి పేర్లను నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. ఇందుకు ప్రజలకు ఫారం-6 అందుబాటులో ఉంచాలన్నా రు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా కుల గణన, రిజర్వేషన్ ప్రక్రియలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. జెసి హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అన్నిఏర్పాట్లతో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఓటర్ల జాబితా రూపకల్పనతోపాటు రిజర్వేషన్‌ల ప్రక్రియలపై సిబ్బందికి దశల వారిగా శిక్షణ పూర్తి చేశామన్నారు.

12 ఇసుక లారీల పట్టివేత
రామన్నపేట, మే 9: అక్రమంగా ఇసుక రవాణాచేస్తున్న 12లారీలను రామన్నపేట పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్‌ఐ వి. స్వామి తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా ఇసుకలోడ్లతో వెళ్తున్న 12లారీలను సిరిపురం, వెల్లంకి గ్రామాల మద్య పట్టుకున్నట్లు తెలిపారు. హాలియా మండల రామడుగువాగు నుండి హైదరాబాద్‌కు లారీలలో ఇసుక అక్రమంగా తరలిస్తూ మండలంలోని సిరిపురం, వెల్లంకి గ్రామాల నుండి వెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇసుక పంపిణికి సంబంధించిన వేబిల్లులు లేకుండా, ప్రతిలారీలలో 15నుండి 20 టన్నుల వరకు అధికలోడుతో వెళ్తున్నందునా లారీలను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన లారీలను మండల తహశీల్దార్ బండ అరుణారెడ్డికి అప్పగించారు. సబ్‌కల్టెర్ ఆదేశాలమేరకు లారీ యజమానులకు నోటీసులు జారీచేసి విచారణ అనంతరం తగుచర్యలు తీసుకోనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

మొక్కల పెంపకంపై అవగాహనకు ‘వన విలాసం’
* ఆవిష్కరించిన కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు
* పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచన
నల్లగొండ , మే 9:సమాజంలో అంతరిస్తు మొక్కల పెంపకంతోపాటు వనాల రక్షణలో భాగంగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేందుకు సామాజిక అటవీ శాఖ రూపొందించి ‘వన విలాసం’ పుస్తకాన్ని కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృక్ష సంపద తరిగిపోవడంతోనే భూఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణంలో మార్పులు వస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు మొక్కల పెంపకానికి ప్రతిఒక్కరు ముందుకురావాలని కలెక్టర్ కోరారు. జిల్లా సామాజిక అటవీశాఖాధికారి పురుషోత్తం మాట్లాడుతూ వన విలా సం పుస్తకంలో పది రకాల మొక్క జాతులకు సంబంధించి అవగాహన కల్పించేలా ఛాయచిత్రాలతో పుస్త కాన్ని తయారు చేసినట్లు తెలిపారు. వనవిలాసంలో పవిత్రవనాలు, నీడమొక్కలు, ఆకర్షణమొక్కలు, వంట చెరుకు మొక్కలు, పండ్ల, ఔషద మొక్కలు, జీవపోదలు, రైతువనాలు, క్షేత్రస్థాయివనాలకు సంబంధించి అంశాలపై అవగాహన కలిపిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇవో కోటిరెడ్డి, సామాజిక అటవీశాఖాధికారి పురుషోత్తం, సామాజిక అటవీ రెంజ్ అధికారులు సునీత, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి
ఎమ్మెల్యే జూలకంటి
మిర్యాలగూడ, మే 9: నాణ్యతా ప్రమాణా లకు అనుగుణంగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి అన్నారు. గురువారం నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై హనుమాన్‌పేటవద్ద నిర్మిస్తున్న ఫ్లైఓ వర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ ప్రజల, వాహన దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరి ష్కరించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణానికి 24 కోట్లు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను డిసెంబర్ వరకు పూర్తి చేసి వాహనదారుల, ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సాగర్ రోడ్డులో బ్రిడ్జి విస్తరణ పనులకు 48 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలన్నా రు. పట్టణంలో జనాభా పెరుగుతున్నందున ట్రాఫిక్‌పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రని, అందువల్ల త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. పట్టణంలోని బైపాస్ వెంట సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కాంట్రా క్టర్‌ను కోరారు. ఆయనవెంట ఆర్‌అండ్‌బి ఇఇ శ్రీనివాస్‌రెడ్డి, డిఇ నరేందర్, ఎఇ గణేష్‌కుమార్, సూపర్‌వైజర్ గణపతిరావు, సిపిఎం నాయకులు గని, రాంరెడ్డి తదితరులున్నారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలి
భూగర్భజలాలు అడుగంటి బోర్లు, బావులు ఎండిపోయి తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే జూలకంటి అన్నారు. మండలంలోని అవంతీ పురంలోని జంగాలకాలనీలో ఏర్పాటుచేసిన చేతిపంపును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాంఢ్ చేశారు. ఇటీవల నిర్వహించిన డిఆర్‌సి సమావేశంలో త్రాగునీటి సమస్యకు నిధులు మంజూరు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారని కానీ, నేటికి నిధులు మంజూరు కాలేదని ఆయన అన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్యను అధిగమనించేందుకు యుద్దప్రాతిపధికన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా సాగర్ కాల్వకు విడుదల చేసిన నీటితో అధికపర్యవేక్షణతో చెర్వులను నింపాలన్నారు. చెర్వులను నింపినట్లయితే భూగర్భజలాలు అడుగంటి తాగునీటి సమస్య అధిగమించవచ్చన్నారు.

నేడే ఎంసెట్... కట్టుదిట్టంగా ఏర్పాట్లు
హాజరుకానున్న 13,050మంది విద్యార్థులు
26పరీక్ష కేంద్రాల ఏర్పాటు..నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ
పరీక్ష కేంద్రాల వద్ధ 144సెక్షన్
నల్లగొండ, మే 9: ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నేడు శుక్రవారం జరుగనుండగా, పరీక్ష నిర్వాహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దఫా ఎంసెట్ పరీక్షకు 13,050మంది విద్యార్థులు హాజరవుతుండగా ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నాం 1గంట వరకు జరిగే ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షకు 9,050మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2-30నిమిషాల నుండి 5-30వరకు జరిగే మెడిసిన్ ప్రవేశ పరీక్షకు 4,000మంది విద్యార్థులు హాజరవుతున్నారు. జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణంలో మాత్రమే ఎంసెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం ఎంపిక చేసిన విద్యాసంస్థల్లో 26పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఉదయం జరిగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌కు 18పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్నం జరిగే మెడిసిన్ ఎంట్రన్స్‌కు 8పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరిండెంట్‌లుగా వ్యవహరిస్తుండగా, సదరు కళాశాలల అధ్యాపక సిబ్బంది 20మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఇన్విజిలేషన్ విధులు నిర్వహించనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 7్ఫ్లయిండ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ప్రత్యేక తహశీల్ధార్ బృందాలు కూడా పరీక్షల తీరుతెన్నులను తనిఖీ చేయనున్నారు. జెన్‌టియు నుండి ఇద్దరు పరిశీలకులు బాలనర్సయ్య, ఎన్.సైదాలతో పాటు ఎంసెట్ పరీక్షల జిల్లా రీజినల్ కోఆర్డీనేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్‌జి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డిలు కూడా పరీక్షల నిర్వాహణను పర్యవేక్షించనున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన లోనికి అనుమతించేది లేదని రీజినల్ కోఆర్డీనేటర్ నాగేందర్‌రెడ్డి ప్రకటించారు. కాగా ఎంసెట్ పరీక్ష నిర్వాహణ దృష్ట్యా పరీక్ష కేంద్రాల పరిధిలో నేడు 144సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు ప్రకటించారు. పరీక్ష సమయంలో 144సెక్షన్ అమలుతో పాటు పరీక్షల సక్రమ నిర్వాహణకు అవసరమైన చర్యలను కట్టుదిట్టంగా తీసుకోవాలని ఆయన తహశీల్ధార్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ధ అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశిస్తు, పరీక్షలు జరిగే సమయంలో పట్టణంలోని జీరాక్స్ సెంటర్లన్నింటిని మూసి ఉంచాలని ఆదేశించారు.

మంచినీళ్లకు నిధులివ్వరా..నిరసన గళమెత్తిన విపక్ష ఎమ్మెల్యేలు
మంత్రుల గైర్హాజర్‌పై మండిపాటు
జానా కోటి నిధుల హామీ అమలుకు పట్టు
వేదిక ముందు బైఠాయింపు
37.41కోట్ల బిఆర్‌జిఎఫ్ వార్షిక ప్రణాళికకు ఆమోదం
నల్లగొండ, మే 9: ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు అందించేందుకు నిధులివ్వమంటే ఇవ్వరూ..జిల్లా ప్రజల కరవు..తాగునీటి కష్టాలు, ఉపాధి సమస్యలను జిల్లా పరిషత్ సమావేశ వేదిక ద్వారానైనా వినిపించుదామంటే జిల్లాకు ఉన్న ఇద్దరు మంత్రులు సమావేశానికి రాలేదని ఈ పరిస్థితులలో మొక్కుబడి సమావేశాలతో సాధించేది ఏమిటంటు విపక్ష ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించడంతో గురువారం జరిగిన జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారుల సమావేశం మంచినీటి కేకలతో దద్ధరిల్లింది. కలెక్టర్, జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి ఎన్. ముక్తేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశం ఆరంభంలో బిఆర్‌జిఎఫ్ 2013-14వార్షిక ప్రణాళికలను 37.41కోట్లతో సమావేశ ఆమోదానికి పెట్టారు. ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న పనులు కాకుండా ఎమ్మెల్యేలు ఏవైన ప్రతిపాదనలు చేయవచ్చంటు, అలాగే అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను సూచించివచ్చంటు కలెక్టర్ తెలిపారు. తమ ప్రతిపాదనలు ఆమోదించాలన్న డిమాండ్‌తో విపక్ష ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, వెనెపల్లి చందర్‌రావులు సదరు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం కలెక్టర్ అత్యవసర పని నిమిత్తం హైద్రాబాద్‌కు వెళ్లిపోగా జడ్పీ సిఇవో అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో మంచినీటి సమస్యలపై విపక్ష ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అధికార యంత్రాంగంపై విమర్శల దాడికి దిగారు.
కోటి నిధుల కోసం ఎమ్మెల్యేల పట్టు
గత డిఆర్సీ సమావేశంలో మంచినీటి సమస్యల పరిష్కారానికి మంత్రి కె.జానారెడ్డి ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇస్తానంటు ప్రకటించారని ఇంతకు ఈ నిధులు మంజూరు చేశారో లేదో చెప్పాలంటు ఎమ్మెల్యేలు జూలకంటి, ఉజ్జిని, వెనెపల్లిలు అధికారులను నిలదీశారు. మంచినీటి సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరులో కోటా ఎందుకంటు నిప్పులు చెరిగారు. ప్రజలకు తాగునీటిని అందించలేని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉండటం దండగ అంటు మండిపడ్డారు. మే నెల గడుస్తున్నా ఇంకా నిధులు ఇవ్వకపోగా ప్రతిపాదనలు అడుగుతున్నారని ఇలాగైతే నిధులు వచ్చేదెన్నడూ..మంచినీటి సమస్యలు పరిష్కారమయ్యేదెప్పుడు అంటు వారు అధికారులపై ధ్వజమెత్తారు. గతంలో తాము ఇచ్చిన ప్రతిపాదనలకు దిక్కులేక గ్రామాల్లో మంచినీటి సమస్యలు అపరిష్కృతంగా పడివున్నాయని ఆరోపించారు. మంత్రులు సమావేశాలకు రాకుండా అధికారం అండతో తమ ప్రతిపాదనలను పక్కన పెడుతు వారు కోరుకున్న పనులు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించే సమావేశాలకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోవడం సిగ్గుచేటని అసలు పరిపాలన ఉందోలేదోనన్న సందేహం నెలకొందని విమర్శలు గుప్పించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రాజేశ్వర్‌రావు స్పందిస్తు మంచినీటి సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ నిధులు 2.95లక్షలు, నాన్ సిఆర్‌ఎఫ్ నిధులు 2.68కోట్లు వచ్చాయని, మంత్రి జానారెడ్డి ప్రకటించిన నియోజకవర్గానికి కోటి నిధులు మంజూరు కాలేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేలంతా వెంటనే మంత్రి జానారెడ్డి నుండి ఈ నిధుల మంజూరుపై స్పష్టమైన ప్రకటన రాబట్టాలని అధికారులను డిమాండ్ చేస్తూ మంత్రి తీరును నిరసిస్తు తమ సీట్ల నుండి లేచి సమావేశ వేదిక ముందు బైఠాయించారు. సమావేశానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ పూల రవిందర్‌ను కూడా నిరసనలో తమతో పాల్గొనాలని విపక్ష ఎమ్మెల్యేలు కోరగా రవిందర్ మాత్రమే వారితో జతకలిశారు. ఎమ్మెల్యేల నిరసనతో ఖంగుతున్న సిఇవో కోటిరెడ్డి విషయాన్ని ఫోన్‌లో మంత్రి జానారెడ్డికి వివరించారు. ఫోన్‌లో ఎమ్మెల్యేలతో మాట్లాడిన జానారెడ్డి తాను చేసిన ప్రకటన మేరకు నియోజకవర్గానికి కోటి నిధులు మంజూరు జరిపిస్తానని వెంటనే అందుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. తాము రెండు రోజుల్లో ప్రతిపాదనలు పంపిస్తామని వెంటనే నిధుల మంజూరు జరిపించాలని కోరుతు వారు తమ నిరసన విరమించారు. అంతకుముందు సమావేశంలో ఎమ్మెల్సీ పూల రవిందర్ మాట్లాడుతు పాఠశాలలు ప్రారంభానికి ముందే వాటిల్లో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను పూర్తి చేసి, మంచినీరు, మరుగుదోడ్ల వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు బిఆర్‌జిఎఫ్ నిధులు వినియోగించాలని కోరారు. ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు మాట్లాడుతు మంచినీటి సరఫరాకు అవసరమైన మోటార్లు, పైప్‌లైన్లకు నిధులు అందించాలని, అసంపూర్తి భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావు మాట్లాడుతు సింగారం చెరువుకు సాగర్ కాలువ నూండి స్లూయిజ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మంచినీటి పథకాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, పనులు సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరారు. ఎమ్మెల్యే జూలకంటి ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 149రూపాయలు, 100పనిదినాలు కల్పించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టగా సమావేశం ఆమోదించింది. కాగా సమావేశంలో మండల ప్రత్యేక అధికారులు ఎవరు తమ మండలాల్లో సమస్యలు వినిపించకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌లలో స్థానిక ప్రజాప్రతినిధులు లేనిలోటు కొట్టోచ్చినట్లుగా కనిపించింది. మొత్తం సమావేశం రెండుగంటల్లో ముగిసిపోయిన తీరు సమావేశ నిర్వాహణలో డోల్లతనానికి నిదర్శనం. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి రాజేశ్వర్‌రెడ్డి, డ్వామా పిడి కోటేశ్వర్‌రావు, డిఇవో జగదీష్, ఆర్‌విఎం పివో బాబుభూక్యా, డిప్యూటీ సిఇవో మోహన్‌రావు, వివిధ శాఖల అధికారులు పురుషోత్తం, శరత్‌బాబు, షరీఫ్, ప్రభాకర్‌రెడ్డి, లింగయ్య, వెంకటేశ్వర్లు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని బుధవారం ట్రెజరీ శాఖ
english title: 
treasury

దుగరాజపట్నంలో ఓడరేవుకు మోక్షం

$
0
0

నెల్లూరు, మే 9: జిల్లాలో వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద ఓడరేవుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. గురువారం ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేసినట్లుగా మీడియాలో ప్రచారం జరగ్గానే స్థానికుల్లో హర్షామోదాలు వ్యక్తమయ్యాయి. దుగరాజపట్నంకు ఓడరేవురావడంలో తిరుపతి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విస్తృతంగా కృషి చేశారు. తొలుత అక్కడ ఓడరేవుఏర్పాటుకు సాధ్యపడదని, షార్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి అభ్యంతరాలు వస్తున్నాయంటూ తొలుత అటకెక్కించారు. దీని వెనుక కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కుటిలంగా వ్యవహరిస్తోందని గమనించిన ఎంపి చింతా మోహన్ వ్యూహాత్మకంగా మసలుకున్నారు. నెల్లూరుజిల్లాలోనే కృష్ణపట్నం పోర్టు ఏర్పాటై గత ఐదేళ్లగా భారీ స్థాయిలో వ్యాపారం చేస్తుండటం తెలిసిందే. ఇదే జిల్లా పరిధిలో కృష్ణపట్నంకు సమీపంలోనే మరో ఓడరేవువస్తుండటంతోనే అడ్డంకులు ఏర్పడబోయాయి. దీనిని అత్యంత ఛాణ్యకంగా చింతామోహన్ తిప్పిగొట్టారు. కేంద్రం వద్ద తనకున్న పలుకుబడితో ఈ ఓడరేవుసాధించుకురాగలిగారు. తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గతంలో వైఎస్ కడపకు తీసుకెళ్లబోతే దానిని కూడా చింతామోహన్ అప్పట్లో అడ్డుకుని తన నియోజకవర్గానికే మంజూరయ్యేలా కృషి సల్పారు. వెంకటగిరిలో భెల్ భారీ ప్రాజెక్ట్‌ను ఆరువేల కోట్ల రూపాయలతో నిర్మించడంలోనూ చింతా మోహన్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను అప్పట్లో రాజస్థాన్‌కు, మహారాష్టక్రు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు జరిగాయి. నెల్లూరులో చిన్నపిల్లల ఆసుపత్రి బాగోకపోవడంతో ఏడుకోట్ల రూపాయల నిధులు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకొచ్చేలా కృషి చేశారు. రేణిగుంట నుంచి రాపూరుకు, నాయుడుపేటకు నాలుగు లైన్ల రహదారి 12వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించారు.

జూన్ 12న పిఎస్‌ఎల్‌వి సి-22 ప్రయోగం
షార్‌లో ఎంఆర్‌ఆర్ సమావేశం
సూళ్లూరుపేట, మే 9: పిఎస్‌ఎల్‌వి-సి 22 ప్రయోగం పై షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్‌లో గురువారం మిషన్ రెడినెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) జరిగింది. మాజీ షార్ డైరెక్టర్ కె. నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు, శాస్తవ్రేత్తలు విచ్చేసి సుదీర్ఘంగా చర్చించారు. పిఎస్‌ఎల్‌వి-సి 22 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పనులన్ని వేగంగా జరుగుతున్నాయి. ఇస్రో వర్గాల సమాచారం మేరకు జూన్ 12న ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ ప్రయోగం జరగనుంది. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ మలపాక యఘ్నేశ్వర సత్యనారాయణ ప్రసాద్, మిషన్ డైరెక్టర్, శాస్తవ్రేత్తలు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి
నెల్లూరు, మే 9: ఎన్నికల నిబంధనల మేరకు ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా బూత్ స్థాయి అధికారుల రిజిష్టర్లు, డూప్లికేట్ జాబితాను ఓటర్ల జాబితాలోని చేర్పులు, తొలగింపుల వివరాల జాబితాను జిల్లా స్థాయిలో ప్రింటింగ్ చేసి వాటికి సంబంధించిన తుది ప్రతిని రెండురోజులో జిల్లా కేంద్రానికి పంపాలన్నారు. అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి పరిష్కరించాలన్నారు. అసెంబ్లీ నియోజవర్గ మాస్టర్ ట్రైనీస్, బూత్ స్థాయి అధికారులకు ఓటర్ల జాబితా తయారీలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఓటరు నమోదుకు సంబంధించిన చేర్పులు గురించి సర్వే మే 16 నుండి జూన్ 15వరకు నిర్వహించాలన్నారు. ఇక నుండి ఓటరు గుర్తింపు కార్డులు పివిపి కలర్ ఫోటోతో జారీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల మేరకు ఓటర్ల జాబితాలలో చేర్పులు మార్పుల ప్రక్రియ సక్రమంగా నిర్వహించి తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ మాట్లాడుతూ నెల్లూరు, కావలి, డివిజన్లలతో బూత్ స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, గూడూరు డివిజన్‌లో రెండు రోజులలో పూర్తి చేస్తామన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటి తనిఖీలు మే 16నుండి ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తప్పులు లేని ఓటర్ల జాబితాలు తయారు చేయడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. నియోజక వర్గం రిటర్నింగ్ అధికారుల నియామకం, మార్పులు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే సిద్ధం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జిల్లా రెవెన్యూ అధికారి బి రామిరెడ్డి, గూడూరు సబ్ కలెక్టర్ జి నివాస్, నెల్లూరు, కావలి రెవెన్యూ డివిజన్‌ల అధికారులు పాల్గొన్నారు.

‘సమాచారం అడిగితే అక్రమ కేసులు’
కోవూరు, మే 9: పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వమని అడిగినందుకు తనపై అక్రమ కేసు బనాయించారని సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. పట్టణంలోని ఆయన స్వగృహంలో గురువారం విలేఖర్లతో మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన కొందరు తన వద్దకు వచ్చి కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి గురించి చెప్పారన్నారు. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌కు సమాచార హక్కు చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ వివరాలు, కార్యాలయానికి చేపట్టిన మరమ్మతులు, అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల గురించి సమాచారం అడిగినందుకు తనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారని తెలిపారు. కోవూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
పిడిఎస్ బియ్యం పట్టివేత
కావలి, మే 9: గుంటూరు జిల్లా మాచర్ల నుండి కావలి పట్టణానికి వాహనంలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని బుధవారం రాత్రి పోలీసులు, సివిల్ సప్లయిస్ అధికారులు పట్టుకున్నారు. కావలి డిఎస్పీ ఇందిరకు అందిన సమాచారం మేరకు సివిల్ డిటి మునిర్‌బాషాకు సమాచారం అందించగా ఆయన నిఘా ఉంచి వాహనాన్ని అదుపులోకి తీసుకొని రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. 44 బస్తాలు బియాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేశారు. పోలీసులు వాహనంలో ఉన్న కావలికి చెందిన వేణు, శింగరాయకొండకు చెందిన మనోహర్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.

జిల్లాలో 15 మంది డిటిలకు తహశీల్దార్లుగా పదోన్నతి
నెల్లూరు, మే 9: నెల్లూరు జిల్లాలో 15 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ హైదరాబాద్ సిసిఎల్‌ఎ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురువారం వెలువడిన ఉత్తర్వులలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో అడహక్ పద్దతిలో తహశీల్దార్లుగా వ్యవహరిస్తున్న డిటిలకు కూడా పదోన్నతి కలిగింది. దీంతో వీరు రెగ్యులర్ తహశీల్దార్లుగా విధులు నిర్వహించనున్నారు.

నేటి నుండి కన్యకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలు
కోవూరు, మే 9:పట్టణంలో రైల్వేఫీడర్స్‌రోడ్డులో ఉన్న శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో శుక్రవారం నుండి ఈనెల 20వ తేదీ వరకు అమ్మవారి జన్మదినోత్సవాలు జరుగుతాయని ఆయల కమిటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అమ్మవారికి ప్రతి రోజు ఉదయం పాలాభిషేకం, రాత్రి లలిత సహస్రనామపారాయణం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు విచ్చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు.

సిబిఐ కాంగ్రెస్ జేబు సంస్థ
ముత్తుకూరు, మే 9: సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ అనే అర్ధం మారి కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌గా మారిపోయిందని వైఎస్‌ఆర్‌సి సిఇసి సభ్యులు కాకాణి గోవర్దనరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం సాయంత్రం ముసునూరువారిపాళెంలో ప్రజాదీవెన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంపై సిబిఐ దర్యాప్తును పరిశీలిస్తే 85వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణంలో సోనియా, మన్మోహన్ ప్రభుత్వాలు పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కుంభకోణంలో దుర్వినియోగమైన నిధుల్ని ఒక రాష్ట్ర వార్షిక బడ్జెట్‌గా రూపొందించుకోవచ్చన్నారు. బొగ్గు కుంభకోణ నివేదికను సిబిఐ సుప్రీమ్‌కోర్టుకు సమర్పించే ముందు యూపిఏ సర్కార్‌కు సమర్పించడం వల్ల వారికి నచ్చేవిధంగా మార్చుకున్నట్లు ఆరోపించారు. దీనినిబట్టి చూస్తే సిబిఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిందన్నారు. జగన్‌ను జైల్ నుంచి బయటకు రానీయకుండా రాజకీయ కుట్ర కొనసాగుతోందన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల చొరవ చూపడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సి నాయకులు పేర్నాట శ్యాంప్రసాద్‌రెడ్డి, మునుకూరు జనార్దనరెడ్డి, మునుకూరు రమణారెడ్డి, దువ్వూరు విజయభాస్కరరెడ్డి, వేనాటి శశిధరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాకాణికి ఈ సందర్భంగా ముసునూరువారిపాళెంలో ఘనస్వాగతం లభించింది.
డక్కిలి అటవీ ప్రాంతంలో
ఎర్రచందనం స్వాధీనం
వెంకటగిరి, మే 9: వెంకటగిరి అటవీశాఖ పరిధిలోని డక్కిలి మండలం కమ్మపల్లి సమీపంలో మినీలారీలో అక్రమంగా తరలిస్తున్న 50 ఎర్రచందనం దుంగలను డక్కిలి నార్త్ డీఆర్‌వో వెంకటేశ్వరరావు గురువారం తెల్లవారుఝామున స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు గస్తీలో ఉన్న అటవీశాఖ సిబ్బందికి కమ్మ సమీపంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడ దాడులు నిర్వహించారు. అటవీశాఖ దాడులను గమనించిన స్మగ్లర్లు మినీలారీని వదలి పరారైనట్లు తెలిపారు. దీందో లారీని పరిశీలించగా అందులో 50 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ నుంచి లారీని వెంకటగిరి రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో ఎఫ్‌బివో వెంకటేశ్వరరావు, ఏబివో శ్రీరామరాజు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బకు ఒకరు మృతి
చిల్లకూరు, మే 9: మండలంలోని బూధనం గ్రామానికి చెందిన పాలిచర్ల బాలయ్య (51) బుధవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. బాలయ్య తోటలో పనిచేస్తుండగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గూడురులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం గురువారం తమ గ్రామానికి తరలించగా అక్కడ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విద్యుదాఘాతానికి గురై
కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర గాయాలు
బిట్రగుంట, మే 9: విజయవాడ డివిజన్ పరిధిలో బిట్రగుంట-అల్లూరు స్టేషన్ల మధ్య సిగ్నల్ వ్యవస్థ ఆధునీకరణ పనులు జరుగుతుండగా గురువారం ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. 204/5 కిలోమీటరు వద్ద సిగ్నల్ పోల్ ఏర్పాటుచేస్తుండగా కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే 108కి సమాచారం అందచేయగా సిబ్బంది కావలి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడినవారు తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నక్కా అప్పన్న, భుషయ్య, లవరాజు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలకు చెందిన ఐనంపూడి శ్రీను, తలకాయల రామమూర్తిగా గుర్తించారు.

గిరిజన కాలనీలో తాగునీరు సరాఫరా
బిట్రగుంట, మే 9: మండల కేంద్రమైన బోగోలు పంచాయతీలో చెంచులక్ష్మీపురం గిరిజన కాలనీలో గురువారం రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ట్రస్టు సహకారంతో గిరిజనులకు తాగునీరు సరాఫరా జరగ్గా స్థానికులు ట్రస్టు అధినేత రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ప్రజాదీవెన కార్యక్రమంలో ఆయన పర్యటించగా సమస్యను మేకల శ్రీనివాసులు ఆయన దృష్టికి తీసుకురాగా స్థానికంగా వాడుకలో లేని బోరుకు మోటారు ఏర్పాటుచేయించారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నేతలు తూపిరి పెంచలయ్య, మేకల శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విఎల్‌ఎస్‌ఐ పాత్ర కీలకం
గూడూరు, మే 9: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విఎల్‌ఎస్‌ఐ కీలక పాత్ర పోషిస్తున్నదని గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ ఎవిఎస్ ప్రసాద్ అన్నారు. గురువారం కళాశాలలో ఇసిఇ విభాగం ఆధ్వర్యంలో విఎల్‌ఎస్‌ఐ సర్య్కూట్ డిజైన్ యూజింగ్ క్యాడెన్స్ డిజైన్ టూల్స్ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్ బెంగళూరుకు చెందిన క్యాడెన్స్ డిజైన్ సిస్టమ్స్ సంస్థ సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ క్యాడెన్ టూల్స్‌లో పరిశోధన చేసే వారికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఆనలాగ్ సర్య్కూట్ డిజైన్‌లో వివిధ సూచనలు, సలహాలను రిసోర్స్‌పర్సన్‌గా విచ్చేసిన దేబాషిష్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ఇతర ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులతో పాటు ఆదిశంకర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలజీ ప్రిన్సిపాల్ ఆర్‌కె జ్ఞానమూర్తి, కె ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

బిసిలకూ సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలి
బిసి సంక్షేమ సంఘం డిమాండ్
గూడూరు, మే 9: రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టినట్టు, బిసిలకు కూడా సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టి అందుకు అవసరమైన ప్రత్యేక నిధులు కేటాయించాలని బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు గురువారం గమళ్లపాలెంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు కందనూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బిసిలు ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్యారంగాల్లో పురోగమించాలంటే ప్రత్యేక నిధులు ఎంతైనా అవసరమని, అందుకోసం బిసిలకు కూడా సబ్ ప్లాన్ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ చల్లా రమణయ్య మాట్లాడుతూ బిసిలకు సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాసభకు జిల్లాలోని బిసిలందరూ వచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీ ఎంపిక కూడా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు సంక్రాంతి జువ్వయ్య, ఉడతా శరత్ యాదవ్, గరిటి నారాయణ, ఓరేపల్లి అనిల్‌కుమార్, ఎల్‌వి సుబ్బయ్య, ఎంట్రపాటి మురార్జీ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

ఏనోటా విన్నా కర్నాటక ఫలితాలపైనే చర్చ
గూడూరు, మే 9: కర్నాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బుధవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ఇక్కడ ఏ నోటా విన్నా, నలుగురు కూడిన చోటల్లా ఈ ఫలితాలపై ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. గుజరాత్‌లో నరేంద్ర మోడి ప్రభావం కర్నాటకలో చూపి ఈ ఎన్నికల్లో కూడా బిజెపి కర్నాటకలో అధికారంలోకి వస్తుందని ఆశించాం, కానీ ఇలా జరిగిందేమిటబ్బా అంటూ పలువురు ఆసక్తికరంగా చర్చించుకొంటున్నారు. కర్నాటకలో బిజెపి ఓడి పోవడానికి యడ్యూరప్ప కారణమని పలువురు రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానించుకొనడం జరిగింది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని గట్టి నమ్మకంతో ఉన్నాం, అయినా కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పొరుగురాష్టమ్రైన మన రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం చూపే అవకాశం ఉందని, ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అనేక సంక్షేమ పధకాలను ప్రవేశవ పెడుతూ పేద ప్రజల గుండెల్లో దూసుకొని పోతున్నాడని, ఈ తరుణంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి ఢోకా ఉండదని వ్యాఖ్యానాలు చేసుకొన్నారు.

మహిళలపై దాడుల నివారణే లక్ష్యం : సిఐ
గూడూరు, మే 9: మహిళలు ఆపదలో ఉన్న సమయంలో వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసినట్టయితే సదరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సత్వర న్యాయం చేస్తారని, ప్రతి మహిళ 100 నంబర్‌ను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు టౌన్ సిఐ ఉప్పాల సత్యనారాయణ మహిళలకు సూచించారు. గురువారం స్థానిక సునీతా సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో మహిళలపై ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపులు జరిగినపుడు వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి విషయం తెలియచేస్తే ఆ ప్రదేశానికి సత్వరం తమ పోలీసులు చేరుకొని వారికి న్యాయం చేస్తారన్నారు. అలాగే ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. దేశంలోనే ప్రప్రధమంగా మన రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఈ పద్ధతిని పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందని, మహిళలు మొదట తమపై జరిగే దాడులు, వేధింపులను ఎదుర్కొని తిప్పికొట్టగలమనే మానసికంగా సిద్ధపడాలని, ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు తెలియపరిస్తే చుట్టుపక్కల వారుకూడా కలసి దుండగులను శిక్షించే అవకాశం ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. ఎక్కడ అరాచకం కాని, ఈవ్‌టీజింగ్ జరుగుతున్నట్టు ఫోన్ ద్వారా తెలియచేసినట్టయితే అక్కడకు వచ్చి దుండగుల భరతం పడతానన్నారు. సంస్థ అధ్యక్షులు సారంగం శ్రీనివాసులు, సారంగ సులక్ష్మి, ఎం వెంకటరమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత’
గూడూరు, మే 9: భూమిమీద జీవించే అన్ని జాతులు, జంతువులను, మొక్కలను పరిరక్షించే బాధ్యత మన అందరిపై ఉందని గూడూరు లయోలా కళాశాల ప్రిన్సిపాల్ పంటా సురేష్‌రెడ్డి అన్నారు. గురువారం కళాశాలలో జాతీయ పర్యావరణ జాగృతి కార్యక్రమం- కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి ప్రాంతీయ వనరుల కేంద్రం స్నాప్ సహకారంతో ప్రజా అభ్యుదయ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు ఆధ్వర్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ జీవరాశులను కాపాడాలని కోరారు. ప్రజాభ్యుదయ సేవా సమితి కోఆర్డినేటర్ డి వంశీకృష్ణ మాట్లాడుతూ కళాశాలలు, పాఠశాలల్లో మొక్కలు నాటి ఆవరణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. జీవారణ్యంలో ఏదైనా ఒక జాతి అంతరిస్తే దానిపై ఆధారపడిన మరో జాతి అంతరిస్తుందన్నారు. యునైటెడ్ హ్యాండ్స్ కార్యదర్శి యు శరత్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అడవులను నరికి వేయడం వలన కలిగే నష్టాలను తెలియచేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వి రాజా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తుందన్నారు. మార్గదర్శి సేవా సంస్థ కార్యదర్శి ఎం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు దగ్గోలు సురేంద్రబాబు, కళాశాల లెక్చరర్ కృష్ణప్రసాద్, కనుపూరు రాజా, దాసరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
మనుబోలు, మే 9: మండల పరిధిలోని ఉపాధి హామీ పనులపై ఆ పథకం జిల్లా పరిశీలకులు భక్తవత్సలం జట్లకొండూరు, చెర్లోపల్లి గ్రామాల్లో గురువారం సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత, అవకతవకలకు చోటులేకుండా చూడాలన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఉపాధి హామీ కూలీలు తమకు 2012 డిసెంబర్‌లో చేసిన పనులకు కూలీలు చెల్లించలేదని అధికారులను నిలదీశారు. స్మార్ట్‌కార్టు కోఆర్డినేటర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినందున చెల్లించలేదని, దానిపై విచారణ నిర్వహిస్తున్నామని, అందువల్ల నిధులు చెల్లించలేదని ఎండివో హేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌టి చంద్రశేఖర్, నరసింహులు, శ్రీనివాసులు, ఉమాదేవి, కార్యదర్శులు శ్రీనివాసులు, వేణుగోపాల నాయుడులు పాల్గొన్నారు.

తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ
‘అమ్మహస్తం’ వర్తింప చేయాలి
ఎమ్మెల్యే బల్లి డిమాండ్
వాకాడు, మే 9: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకం తెల్లరేషన్‌కార్డులు కలిగిన లబ్ధిదారులందరికీ వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన పంచాయతీ కార్యాలయంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి మండలంలో ఒక్కో చౌక దుకాణం ద్వారా కేవలం 50 మందికే ఆ పథకంలోని 9 రకాల వస్తువులను పంపిణీ చేయడం విచారకరమన్నారు. చౌక దుకాణ డీలర్లు అక్రమాలకు పాల్పడే అవకాశాలున్నాయన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి అర్హత కలిగిన వారందరికీ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వాకాడు మండలంలో 11458 మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉండగా 1500మందికే ఆ పథకం వర్తింప చేయడం ఏమిటని తహశీల్దార్ వెంకటసునీల్‌ను ప్రశ్నించారు. లబ్ధిదారులకు అవసరమైన వస్తువులనే అందచేసే విధంగా వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండివో వెంకటేశ్వర్లు, డిటి వెంకటేశ్వర్లురెడ్డి, విఆర్‌ఓ జనార్ధన్, కార్యదర్శి ఉమామహేశ్వరరావు, టిడిపి నాయకులు మదురెడ్డి, కృష్ణమూర్తి, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

ధ్యాన, యోగా శిక్షణా శిబిరం
గూడూరు, మే 9: గూడూరు రెండో పట్టణ పరిదిలోని మాళవ్యానగర్ మహలక్ష్మమ్మ గుడి ఎదురుగా గల రాజాస్ యోగా జిమ్ సెంటర్‌లో ఉచిత యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. యోగాతో పాటు సాయంత్రం కరాటే, స్కేటింగ్, మిమిక్రీ తరగతులను ఆసక్తి గల వారికి ఉచితంగా వేసవి సెలవుల దృష్ట్యా అందిస్తున్నట్టు నిర్వాహకులు, యోగా మాస్టర్ కట్టా మురళీకృష్ణ తెలిపారు. యోగా వలన వత్తిడి తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుందని, శారీరకంగా, మానసికంగా వికాసం కలుగుతుందని, ఎటువంటి వ్యాధులు దరిచేరవన్నారు. ప్రతిరోజు కొంచెం సమయం కేటాయించుకొని యోగా, వ్యాయామం వంటివి చేస్తే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని అన్నారు.

అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పరిశీలన
గూడూరు, మే 9: గూడూరులో నిర్మించనున్న అంబేద్కర్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. రెండో పట్టణంలోని ఎస్‌కెఆర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 50 సెంట్ల భూమిని ఇందుకోసం కేటాయించేందుకు పరిశీలించారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూళ్లూరుపేటకు వచ్చిన సమయంలో గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పనబాక కృష్ణయ్య ఇక్కడ అంబేద్కర్ భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయమని కోరగా, వెంటనే సిఎం ఇక్కడ భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జెసి స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట మండల తహశీల్దార్ వై మైత్రేయ, విఆర్‌ఓ రమణయ్య తదితరులు ఉన్నారు.

జిల్లాలో వాకాడు మండలం దుగరాజపట్నం వద్ద
english title: 
port

సిఎం పర్యటనపై పంతం నెగ్గించుకున్న మంత్రి

$
0
0

నిజామాబాద్, మే 9: ముఖ్యమంత్రి పర్యటన విషయంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బోధన్ నియోజకవర్గ కేంద్రంలోనే సిఎం టూర్ ఖరారయ్యేలా పావులు కదపడంలో కృతకృత్యులయ్యారు. ఈ నెల 13వ తేదీన బోధన్‌లో నిర్వహించనున్న రైతు సదస్సులో పాల్గొనేందుకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నట్టు ముఖ్యమంత్రి పేషీ నుండి అధికారికంగా సమాచారం అందడంతో అధికార యంత్రాంగం యావత్తు ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమైంది. ఇప్పటికే కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ ఆయా శాఖల అధికారులతో సమావేశమై సిఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గురువారం ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ బోధన్‌ను సందర్శించి సిఎం పర్యటించే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి సైతం ఆయా శాఖల అధికారులు, తన ముఖ్య అనుచరులతో సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వాస్తవానికి గత ఏప్రిల్ మాసంలోనే ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల మూడు పర్యాయాలు సిఎం పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. ఇందిరమ్మ కలలు సదస్సులో పాల్గొనేందుకు ఏప్రిల్ మొదటి వారంలో ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సభలో పాల్గొంటారని జిల్లా యంత్రాంగానికి సిఎం పేషీ నుండి సమాచారం అందింది. అయితే ఈ కార్యక్రమాన్ని బోధన్‌లో నిర్వహించాలని చివరి నిమిషంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి తలపోశారు. అమాత్యుల వారి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా అధికారులు సైతం బోధన్‌లో సిఎం పర్యటించేలా ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సిఎం పర్యటన వాయిదాపడినట్టు చివరి నిమిషంలో సమాచారం అందడం ఉసూరుమన్పించింది. అనంతరం అమ్మహస్తం కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా సిఎంకు జిల్లా నేతల నుండి పోటాపోటీగా ఆహ్వానాలు వెళ్లాయి. ఓ వైపు మంత్రి సుదర్శన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాలని కోరగా, మరోవైపు ప్రముఖ మైనార్టీ నేత, ఇటీవలే ఎమ్మెల్సీ పదవిని చేపట్టిన మహ్మద్ షబ్బీర్‌అలీ కూడా కామారెడ్డిలో పర్యటించాలని ఒత్తిడి తెచ్చారు. సందట్లో సడేమియా అన్న చందంగా ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలో కానీ, పక్కనే ఉన్న ఆర్మూర్ సెగ్మెంట్‌లో పర్యటించాలని కోరారు. ఇలా నేతలు ఎవరికివారు సిఎం పర్యటన తమ ప్రాంతంలోనే జరగాలని పట్టుబట్టడంతో వరుసగా మూడు పర్యాయాలు వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ విషయంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి తన ఆధిపత్యాన్ని చాటుకోవడంలో సఫలీకృతులయ్యారు. బోధన్‌లో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న రైతు సదస్సులో సిఎం పాల్గొనేలా పర్యటనను అధికారికంగా ఖరారు చేయించారు. నిజానికి ఈ రైతు సదస్సులను రెవెన్యూ డివిజన్ల వారీగా నిర్వహించాల్సి ఉండడంతో ఇదివరకే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా 9వ తేదీన నిజామాబాద్‌లో, 11వ తేదీన బోధన్‌లో, 13వ తేదీన కామారెడ్డిలో రైతు సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే బోధన్‌లో పర్యటించేందుకు సిఎం సుముఖత వ్యక్తం చేయడంతో రైతు సదస్సుల ప్రణాళికలో మార్పులు చేర్పులు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ల వారీగా నిర్వహించాల్సిన సదస్సులను సైతం బోధన్‌కే పరిమితం చేస్తూ 13వ తేదీన ఒకేచోట అట్టహాసంగా రైతు సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి పెద్ద సంఖ్యలో రైతులను సమీకరించేందుకు కసరత్తులు కొనసాగిస్తున్నారు. దాదాపు 10 వేల మంది రైతులను తరలించేందుకు వీలుగా ఆయా మండలాలకు వాహనాలను సమకూరుస్తున్నారు. సిఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంత్రి సుదర్శన్‌రెడ్డి స్థానికంగానే మకాం వేసి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రైతు చైతన్య సదస్సుకు ఇరవై వేల మంది
మంత్రి సుదర్శన్‌రెడ్డి
బోధన్, మే 9: బోధన్‌లో ఈ నెల 13న జరుగనున్న రైతు చైతన్య సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హాజరు కానున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇరిగేషన్ అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ముఖ్యమంత్రి రైతులతో గడుపుతారని అన్నారు. రైతుల సమస్యలు అడిగి తెల్సుకోవడమే కాకుండా యంత్రలక్ష్మి పథకం క్రింద రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందచేస్తారని పేర్కొన్నారు. ఇక్కడ నలభై ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఇందులో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, ఉద్యాన వనశాఖలకు సంబంధించిన ప్రదర్శనలు ఇందులో ఉంటాయన్నారు. అలాగే మహిళలకు బ్యాంకు లింకేజీలకు సంబంధించి 24 కోట్ల చెక్కులను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళలకు అందించడం జరుగుతుందన్నారు. డివిజన్ నుండి ఇరవై వేల మంది రైతులు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు బాన్సువాడ, బిచ్కుంద రోడ్డు అభివృద్ధి కోసం ఇరవై కోట్లు మంజూరు చేశారని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సభలో స్పష్టం చేస్తారని చెప్పారు. అలాగే బోధన్ నియోజకవర్గానికి రూరల్ వాటర్ సప్లయ్ ద్వారా ఐదు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వీటి ద్వారా చేపట్టబోయే పనులు కూడా ముఖ్యమంత్రి సభలో ప్రకటిస్తామన్నారు. ముఖ్యమంత్రి సభకు పౌరసరఫరాల మంత్రి శ్రీధర్‌బాబు, శిశు సంక్షేమ శాఖా మంత్రి సునీత లక్ష్మారెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మినారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ముఖేష్‌గౌడ్ హాజరు కానున్నారని మంత్రి వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మన్ గంగాశంకర్, సిడిసి చైర్మన్ పోతారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నరేందర్‌రెడ్డి, గణపతిరెడ్డి, గౌసోద్దీన్, గుణప్రసాద్, సత్యం, దామోదర్, ఆదినారాయణ, నక్కలింగారెడ్డి పాల్గొన్నారు.

సిఎం జిల్లా పర్యటన షెడ్యూల్
నిజామాబాద్, మే 9: రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారు అయింది. ఈ మేరకు సిఎం కార్యాలయం నుండి కలెక్టర్‌కు గురువారం సమాచారం అందించారు. దీంతో అధికారులు సిఎం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో సిఎం పర్యటన ఖరారు అయినప్పటికీ పలు మార్లు వాయిదా పడిన విషయం విధితమే. ఇందులో భాగంగానే ఈ నెల 13వ తేదీన జరుగాల్సిన సిఎం పర్యటన పలు అనుమానాలకు దారి తీసింది. గతంలో మాదిరిగా ఈ పర్యటన సైతం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సర్వత్రా భావించారు. కానీ సిఎం పర్యటన షెడ్యూల్ ఖరారు చేస్తూ అధికారికంగా వెల్లడి కావడంతో అనుమానాలకు తెర తొలగిపొయినట్లే. సిఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 13వ తేదీ ఉదయం 10గంటలకు సిఎం క్యాంప్ కార్యాలయం నుండి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారులో బయల్దేరుతారు. అక్కడి నుండి 10.15నిమిషాలకు హెలికాప్టర్‌లో బయల్దేరి ఉదయం 11గంటలకు బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడే జిల్లా అధికారులు, అనధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 11.15నిమిషాలకు కళాశాల నుండి రోడ్డు గుండా బయల్దేరి బోధన్‌లోని విజయమేరి ఉన్నత పాఠశాలకు చేరుకుని అక్కడ రైతు సదస్సును ప్రారంభిస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 2.40 నిమిషాలకు హెలిపాడ్‌కు చేరుకుని 2.45 నిమిషాలకు హైదరాబాద్ బయల్ధేరి వెళ్తారు. ఈ మేరకు బోధన్‌లో సభా వేదికకు అవసరమైన స్థలాన్ని మంత్రి సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ పరిశీలించారు.

ధాన్యం సేకరణలో ప్రైవేటు వ్యాపారులదే హవా
వెలవెలబోతున్న కొనుగోలు కేంద్రాలు
నిజామాబాద్, మే 9: ప్రస్తుత రబీ సీజన్‌లో వరి పంట సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశంతో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, ధాన్యం సేకరణలో ప్రైవేట్ వ్యాపారులదే పై చేయిగా నిలుస్తోంది. ఇదివరకు ఐకెపి, సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో జిల్లాలో విరివిగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పేవారు. అయితే ప్రస్తుతం వరి విస్తీర్ణం తగ్గడం, అకాల వర్షాలు కురిసి దాదాపు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట దెబ్బతినడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని కేవలం సొసైటీల ఆధ్వర్యంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఐకెపి సంఘాలకు మినహాయింపు కల్పించారు. మొదటి విడతలో 26 సొసైటీల ఆధ్వర్యంలో 35 కొనుగోలు కేంద్రాలను, రెండవ విడతగా మరో 31 సహకార సంఘాల ద్వారా 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తం 67 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. గతేడాది ఇదే సీజన్‌లో దాదాపు వంద వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారి వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే రైతులు కూడా అనేక కారణాల వల్ల కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించకుండా, తమ పంట ఉత్పత్తులను ప్రైవేట్ వ్యాపారులు, రైస్‌మిల్లర్లకు విక్రయించుకునేందుకే మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, సరైన గిట్టుబాటు ధర పొందాలని ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఎన్ని రకాలుగా సూచనలు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ, ఇంతవరకు వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం సేకరించలేదని తెలుస్తోంది. ఈసారి రబీలో జిల్లాలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అందులో సింహభాగం ఇప్పటికే వ్యాపారులు, రైస్‌మిల్లర్లు సేకరించడంతో కొనుగోలు కేంద్రాలకు అంతంతమాత్రంగానే ధాన్యం నిల్వలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడు ధాన్యానికి 1280 రూపాయలు, సాధారణ రకానికి 1250 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా కోతలు ప్రారంభమైన వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వ్యాపారులు మాత్రం అంతకుముందే గ్రామాల్లో పంట పొలాల్లోనే తూకం వేసి నేరుగా ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించే పనులకు శ్రీకారం చుట్టారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైన తర్వాత కూడా ప్రైవేట్ కొనుగోళ్ల ప్రక్రియ ధాటిగానే కొనసాగినట్టు స్పష్టమవుతోంది. పైగా ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరను కూడా రైతులు పొందలేకపోయారన్నది బహిరంగ రహస్యం. బయటి మార్కెట్‌లో వ్యాపారులు రైతులకు చెల్లించింది క్వింటాలుకు 1050 మొదలుకుని 1100 రూపాయలు మాత్రమే. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తర్వాత ఆ ధరను 1150 రూపాయల వరకు పెంచారు. అది కూడా ధాన్యం రకాన్ని బట్టి మాత్రమే చెల్లించారు. సరాసరిగా పరిశీలిస్తే క్వింటాలుకు రైతులకు అందింది 1100 రూపాయలు మాత్రమే. ఈ లెక్కన ఒక్క క్వింటాలుకు 150 రూపాయల వరకు రైతులు నష్టపోయినట్లు తెలుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో సవాలక్ష నిబంధనలు ఉండడం, తేమ శాతం పేరిట ఇబ్బందులకు గురి చేస్తుండడం వల్ల తాము ధాన్యాన్ని నేరుగా వ్యాపారులకు అమ్ముతున్నామని, కొనుగోలు కేంద్రాలు కోరినట్లుగా ఆరబెట్టి అమ్మినా, ధాన్యం బరువు తగ్గి వ్యాపారులు ఇచ్చిన ధరలే తమ చేతికి అందుతాయని రైతులు చెబుతున్నారు.
ఇంకా అందని చెక్కులు
ఇదిలాఉండగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఇప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. గతంలో అమ్మకాలు ముగిసిన పది రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం సంబంధిత సొసైటీలకు చెక్కుల రూపంలో డబ్బులను విడుదల చేసేది. నేరుగా సొసైటీ ద్వారా రైతులకు డబ్బులు అందేవి. ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తి చెబుతూ, రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన బిల్లులను నేరుగా ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సొసైటీలు రైతులకు సంబంధించిన ఖాతాల వివరాలను ఒక్కో రైతు వారీగా ప్రభుత్వానికి పంపించేందుకు అపసోపాలు పడుతున్నారు. దీనివల్ల బ్యాంకులు తాము చెల్లించాల్సిన బకాయిలను ఎక్కడ మినహాయించుకుంటాయోనని బెంగపెట్టుకున్న పలువురు రైతులు, బ్యాంకులో తమకు ఖాతాలు లేవంటూ వివరాలు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తోంది.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* మంత్రి జానారెడ్డి
కామారెడ్డి, సదాశివనగర్, మే 9: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని మర్కల్ గ్రామ శివారులో గల మల్లన్న గుట్ట ఆవరణలో డా.బి.ఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పథకం చేపడుతున్న గోదావరి జలాల పనులను ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ప్రభుత్వ విఫ్ ఈరవత్రి అనిల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాగునీటికి సంబంధించి ఫిల్టర్ బెడ్ నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తి అయితే జిల్లాలోని 211గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా అవుతోందన్నారు. షబ్బీర్‌అలీకి ఎమ్మెల్సీ పదవి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. 1.40 కోట్ల రూపాయలు ఈ పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు అదనంగా 60 కోట్లు నిధులు మంజూరు చేయడం జరుగుతోందని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, కామారెడ్డి డివిజన్ ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసని, ఈ ప్రాంత ప్రజల కోసం గోదావరి జలాల పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. సదాశివనగర్, మాచారెడ్డి, తాడ్వాయి, కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు మండలాలకు గోదావరి జలాలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ జిల్లాలోనే అతి పెద్ద ప్రాజెక్టు అన్నారు. మంత్రి జానారెడ్డితో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, విఫ్ ఈరవత్రి అనిల్‌ను కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకులు శాలువలు కప్పి పూలమాలలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చక్రపాణి, సిఇ బాబురావు, ఎస్‌ఐ ఇంద్రసేన, ఇఇ మూర్తి, డిఇ వెంకట్‌రావు, మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు మేనెజర్ శ్రీనివాస్, డిసిసిబి వైస్ చైర్మన్ ప్రేమ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు ఎడ్ల రాజిరెడ్డి, కైలాస్ శ్రీనివాస్‌రావు, జమునరాథోడ్, పండ్ల రాజు, బద్దెం శ్రీనివాస్‌రెడ్డి, నల్లవెళ్లి అశోక్, మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పథకాలు
* ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్
నందిపేట, మే 9: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ముందుకు కొనసాగుతాయని పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. నందిపేట మండలం మారంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి దివంగత అర్గుల్ రాజారాం విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో 5లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే ధాన్యం గిడ్డంగి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డి.శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ సమైక్యత, అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. అర్గుల్ రాజారాం బాల్కొండ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి పదవులను చేపట్టి గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా మెదులుకున్నాడని, రాజారాం తన రాజకీయ గురువని, ఆయనను స్ఫూర్తిగా తీసుకునే రాజకీయాల్లో రాష్టస్థ్రాయికి ఎదిగానని అన్నారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డితో పాటు తనను ప్రజలు ఓడించినప్పటికీ, వారికి సేవ చేయడం మరిచిపోలేమని, ప్రజా సేవయే తమ జీవిత లక్ష్యమన్నారు. 2004ఎన్నికల్లో సోనియాగాంధీ ఆదేశాల మేరకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగానే నేడు ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, టిడిపి హయాంలో నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, తాను 20ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా తాగు, సాగునీరు, రోడ్ల వంటి వౌలిక వసతుల కల్పనకు ఎంతో కృషి చేశానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, సురేష్‌రెడ్డిలకు చిందు కళాకారులు నృత్యం చేస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ గంగాధర్‌రావుపట్వారీ, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, నాయకులు నరాల రత్నాకర్, సుదర్శన్, హరిదాస్, హన్మాండ్లు, నర్సాగౌడ్, జగత్‌రెడ్డి, మోహన్‌రావు పాల్గొన్నారు.
ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాదు
* బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి
బోధన్ రూరల్, మే 9: ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాదని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. గురువారం బోధన్‌లో యువమోర్చా రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తే వంద రోజులలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతుందన్నారు. గతంలో మూడు రాష్ట్రాలు ఇచ్చిన ఘనత ఒక్క బిజెపికే దక్కుతుందన్నారు. ఆ రాష్ట్రాలలో ఎటువంటి ఆత్మహత్యలకు అవకాశం ఇవ్వకుండా ప్రజల అభీష్టం మేరకు ఆర్టికల్ మూడు ప్రకారం తమ సర్కారు ప్రత్యేక రాష్ట్రాలు ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి వైయస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రాలో ఒక మాట, తెలంగాణలో ఒక మాట మాట్లాడుతూ ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీల వైఖరుల వల్లనే తెలంగాణలో అనేక మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఆ పార్టీలకు జతకట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను మరోమారు మోసం చేసేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. బిజెపి కార్యకర్తలు గ్రామ గ్రామాన తమ పార్టీ సిద్దాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలలో బిజెపి అధికారంలోనికి వచ్చేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నర్సింహారెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి అడ్లూరి శ్రీనివాస్, సుభాష్, పట్టణాద్యక్షుడు రామరాజు, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌చారి, వెంకటక్రిష్ణ, హరికృష్ణ, గోపికిషన్, దామోదర్, వెన్న శంకర్, జనార్ధన్‌చారి, దిగంబర్, హన్మాండ్లు చారి, శివరాజ్, ధర్మపురి, కోటేశ్వర్‌రావ్, మల్లారం దత్తు పాల్గొన్నారు.

తాగునీటి కోసం రాస్తారోకో
బాన్సువాడ, మే 9: బాన్సువాడ మండలం బోర్లం క్యాంప్‌లో నెలకొన్న తాగునీటి సమస్యను నివారించాలని మహిళలు గురువారం బాన్సువాడ - కామారెడ్డి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గత ఏప్రిల్ మాసం నుండి బోర్లంక్యాంప్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీకి, నాయకులకు సంబంధం లేకుండా రోడ్డుపైకి వచ్చి ఖాళీ బిందెలతో నిరసన చాటారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసలే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో సుమారు రెండు మాసాలుగా తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బోర్లంక్యాంప్‌లో నెలక్నొ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్లంక్యాంప్ మహిళలు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
బాన్సువాడ, మే 9: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం చింతకుంట మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలీసు శాఖలో చిరు ఉద్యోగి అయిన చింతకుంట మోహన్ యువత ఉత్సాహాన్ని గుర్తించి క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు పలు సేవా కార్యాక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్ని మండలాలకు సంబంధించిన 32జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని, వారం రోజుల పాటు క్రికెట్ పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఫైనల్‌లో గెలుపొందిన విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ రూరల్ సిఐ ప్రకాష్‌యాదవ్, పట్టణ సిఐ భాస్కర్, టిఆర్‌ఎస్ నాయకులు వై.కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాజ్, కొత్తకొండ భాస్కర్ తదితరులు ఉన్నారు.

విద్యార్థులు సమాజాన్ని అధ్యయనం చేయాలి
ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.డి వలీ ఉల్లాఖాద్రీ
కామారెడ్డి , మే 9: ప్రస్తుత పరిస్థితులో విద్యార్థులు సమాజంలోని అసమానతలను, పరిస్థితులను మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.డి వలీ ఉల్లాఖాద్రి పిలుపు నిచ్చారు. గురువారం మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికేతన్‌లో జరిగిన ఎఐఎస్‌ఎఫ్ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు మార్కులు, ర్యాంకుల వైపు పరుగులు తీస్తు మానసిక ఒత్తిడికి గురవుతూ మానసిక ఉల్లాసాన్ని కొల్పోతూ, చిన్న విషయాలలో కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అందువలన దేశంలోని విద్యార్థులు, యువకుల ఆలోచన శక్తి అంతరించి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో ఎఐఎస్‌ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టిటిఎఫ్ జిల్లా కార్యదర్శి దానయ్య మాట్లాడుతూ,విద్యారంగం కొరకు ఎన్ని కమిషన్‌లు వేసిన ఇంకా విద్యారంగం మారలేదన్నారు. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో వౌళిక సదుపాయలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య విద్యానికేతన్ కరస్పాండెంట్ ఆనంద్‌రావు, సిపిఐ డివిజన్ కార్యదర్శి బాల్‌రాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి వి.ఎల్ నర్సింహారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు దశరథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

* విస్తృత స్థాయిలో ఏర్పాట్లు
english title: 
cm paryatana

ఫ్లోరైడ్ రక్కసి

$
0
0

కందుకూరు, మే 9: గారపట్టిన పళ్లు, వంకర్లు తిరిగిన కాళ్లు, 30ఏళ్లకే ముసలితనం, ఎముకలు బిగుసుకుపోయి నడవలేక మంచం పట్టే దయనీయ జీవనం జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలో గుండెలను పిండేసే దృశ్యాలివి. ఆకాశంవైపు చూడాలన్నా, నింగిలో రయ్ అని ఎగిరే విమానాన్ని వీక్షించాలన్నా, ఆరుబయట మంచంవేసుకుని దానిమీద వెల్లికిలా పండుకొని చూసే పరిస్థితి వీరికి ఉండదు. ఫ్లోరోసిస్ ప్రభావానికి మూత్రపిండాలు పాడై, కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఎందరో మృత్యువాతపడే దుస్థితి. ఒకప్పుడు ప్రకాశం జిల్లాను గడగడలాడించిన ఈసమస్యకు దశాబ్దాలు గడుస్తున్నా నేటికి తెర పడటంలేదు. జిల్లా ప్రజలను విషజ్వరాల ప్రభావం నేటికి వణికిస్తూనే ఉంది. ఇక్కడి జిల్లాలో ఫ్లోరైడ్‌తోపాటు స్టాన్సియం, బెరీలియం, ఆర్నెక్, క్రోమియం, కాడియం లాంటి ప్రమాదకర మూలకాలశాతం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈవిష జలాలు తాగి శరీరం శూక్షింమించుకుపోయి యుక్తవయస్సులోనే వృద్ధాప్యాన్ని అనుభవిస్తూ నరకం చూస్తున్నారు. ఇలాంటివారు జిల్లాలో వేలాదిమంది ఉన్నారు. ఈజలాలు తాగి మూత్రపిండాలు పాడై, కేన్సర్ బారిన పడి జిల్లా వ్యాప్తంగా గత 12ఏళ్లలో వెయ్యి మంది వరకు మృత్యువాత పడితే, 20వేలకుపైగా ప్రాణాంతక వ్యాధులతో ప్రస్తుతం బాధపడుతుండడం గమనర్హం. దంత సంబంధిత, ఫ్లోరోసిస్ దేశంలోనే తొలిసారిగా గుర్తించింది 1937లో అయితే, మన ప్రకాశం జిల్లా కనిగిరి, దర్శి, పొదిలి ప్రాంతాలలో ఫ్లోరైడ్ అప్పటి నుంచే ఉంది. అయినా ఇప్పటికి కూడా ఫ్లోరైడ్‌బూతం ఆప్రాంతాలను వదల్లేదు. దానిని పారద్రోలి ప్రజలకు రక్షిత నీటిని అందించే విషయంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉన్నారు. జిల్లాలో ఇంకా 195గ్రామాలలో ఈసమస్య కొనసాగుతూనే ఉంది. జిల్లాలో 56 మండలాలు ఉంటే, అందులో 35్ఫ్లరైడ్ మండలాలుగా ప్రభుత్వమే గుర్తించింది. అలాగే 16వేల మంది ఫ్లోరైడ్ వ్యాధిబారిన పడి దంతసంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, 2001మంది ఎముకల వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితితో 2వేల మంది బాధపడుతున్నారని జిల్లాలో 35మండలాల్లో ఇటీవల ఆయా మండల వైద్యులు, అక్కడి వైద్యసిబ్బంది 106్ఫ్లరైడ్ పీడిత ప్రాంతాలలో ఇంటింటి సర్వేజరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. లీటరు నీటిలో 1.5మిల్లీ గ్రాములకు మించి ఫ్లోరిన్ ఉండరాదు. కాని జిల్లాలోని కనిగిరి ప్రాంతంలో 8నుంచి 11మిల్లీ గ్రాములు ఉండడం గమనర్హం. జిల్లాలో 25,700పైగా తాగునీటి బోర్లు ఉంటే అందులో సుమారు 4వేల బోర్లలో ఫ్లోరైడ్‌శాతం ఉంది.
పీడిత జాబితాలో 35మండలాలు
జిల్లాలో కనిగిరి, హెచ్‌ఎంపాడు, వెలిగండ్ల, పామూరు, పిసిపల్లి, కురిచేడు, త్రిపురాంతకం, దర్శి, మార్కాపురం, పెదారవీడు, గిద్దలూరు, పుల్లలచెరువు, కంభం, మార్టూరు, సంతమాగులూరు, పొన్నలూరు, దొనకొండ, యర్రగొండపాలెం, కొనకొలమెట్ల తదితర మండలాల్లో ఫ్లోరైడ్‌తోపాటు, మెగ్నీషియం, నైట్రేట్‌లు, క్యాల్షియం వంటి పరిణామాలు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలిసింది. అధికారుల అలసత్వం కారణంగా రక్షిత జలాలకు బదులు ఫ్లోరైడ్ నీటితో గొంతు తడుపుకుంటున్నారు. కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలు నిర్మిస్తున్నారు. వాటి నిర్మాణంలో రాజ్యమేలుతున్న అవినీతి కారణంగా కొద్దిరోజులకే మూలన పడుతున్నాయి. మరికొన్ని పథకాలు ప్రారంభమైనా నెలరోజులకే నీరు చేరక పైపులైన్లు దెబ్బతింటున్నాయి. గ్రామాలలో తాగునీటి పథకాలకు ప్రభుత్వం ఏటా సగటున కోట్లు కేటాయిస్తుంది. 2012-13లో 102కోట్లు రాగా, 80కోట్లు మంచినీటి పథకాల మరమ్మతులకే ఖర్చు చేశారు. గడచిన నాలుగేళ్లను పరిశీలిస్తే 480కోట్ల రూపాయలకు పైగా నిధులు వేర్వేరు ఖర్చుల కింద ఖర్చు చేశారు. ఇందులో 60శాతం వరకు నిర్వహణకే ఖర్చు చేశారు. అయినాగాని బూతం జిల్లాని వదిలిపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించిన జిల్లాలో ఫ్లోరైడ్ శాతాన్ని తరిమికొట్టాలని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో కోరుతుంది.

ఘరానా దొంగ అరెస్టు
ఒంగోలు, మే 9: ఎటిఎంలలో డబ్బులు దొంగిలించే ఘరానా దొంగను అరెస్టు చేసి అతడి నుండి 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక జిల్లా ఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉరుటూరు గ్రామానికి చెందిన మర్రెడ్డి రామకృష్ణారెడ్డి (24) ఎటిఎంలలో డబ్బులు దొంగిలించినట్లు సమాచారం అందిందన్నారు. దీనిపై డిఎస్‌పి ఎం రజనీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో శింగరాయకొండ సిఐ టి అశోక్‌వర్థన్, టంగుటూరు ఎస్‌ఐ రమణయ్య వారి సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు గురువారం ఉదయం 7 గంటలకు సూరారెడ్డిపాలెం జంక్షన్‌లో రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసినట్లు ఎస్‌పి తెలిపారు. టంగుటూరులోని కొండేపి రోడ్డులో ఉన్న ఎస్‌బిఐ ఎటిఎంలో 2013 మార్చి 16న 16.50 లక్షలు నగదు ఎటిఎంలో నింపినట్లు తెలిపారు. అదేరోజు రాత్రి సదరు ఎటిఎం పని చేయనట్లు, ఈక్రమంలో తమ సంస్థకు చెందిన బ్రాంచి ఇన్‌చార్జి వెళ్ళి ఎటిఎంను తనిఖీ చేసినట్లు తరువాత ఇంజనీరు వచ్చి కూడా ఎటిఎంను తనిఖీ చేయగా అప్పుడు ఆ సమయంలో ఏటిఎంలో నగదు షార్ట్‌సర్క్యూట్ వల్ల కాలిపోయినట్లు కనుగొన్నట్లు తెలిపారు. ఆ తరువాత 2013 ఏప్రిల్ 24న బ్యాంకు అధికారులు, ఇన్సూరెన్స్ సర్వేయర్లు తనిఖీ చేయగా వారి తనిఖీలో అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దొంగతనమేనని తెలుసుకున్నట్లు తెలిపారు. 2013 మే 1న ఎటిఎంలో డబ్బు నింపే సంస్థ అయిన సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ప్రైవేట్ ) లిమిడెట్ ఒంగోలు బ్రాంచి ఇన్‌చార్జి ఎంకెకె దుర్గారావు, టంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయినట్లు తెలిపారు. ఈనేపథ్యంలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయన్నారు. నిందితుడు బికాం వరకు చదువుకొని సైంటిఫిక్ సెక్యూరిటీ సర్వీసెస్ నందు పని చేస్తూ ఎటిఎంలలో డబ్బు నింపుతుండేవాడని తెలిపారు. మద్దిపాడు, ఒంగోలు, టంగుటూరు ఎటిఎంలలో డబ్బు నింపేవాడని తెలిపారు. నిందితుడు తాగుడు, జూదం, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి డబ్బు కోసం ఎటిఎంలలోనే దొంగతనం చేయాలనే ఉద్దేశ్యం కలిగి టంగుటూరు ఎస్‌బిఐ ఎటిఎంనందు తనతోపాటు పనిచేసే రమణయ్య నుండి పాస్‌వర్డ్ తెలుసుకున్నాడని పేర్కొన్నారు. మార్చి 18న ఉదయం 5.30 గంటల సమయంలో టంగుటూరు ఎటిఎంకు వెళ్ళి పాస్‌వర్డ్ సహాయంతో మిషన్ తెరిచి అందులో ఉన్న 16.50 లక్షలలో 13.50 లక్షలు తీసుకొని మిగిలిన మూడు లక్షలు ఎవరికీ అనుమానం రాకుండా షార్ట్‌సర్క్యూట్ జరిగినట్లు చిత్రీకరించేందుకు 3 లక్షలు తగులబెట్టినట్లు తెలిపారు. దొంగిలించిన సొమ్ముతో జల్సాలకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. మడనూరు శ్రీను దగ్గరకు వెళ్ళేందుకు సూరారెడ్డిపాలెం జంక్షన్‌లో బస్సు దిగిన రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తరువాత ఒంగోలులోని బొల్లినేని సుబ్బయ్య వద్ద గల 7 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్దనుండి మొత్తం 10 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌పి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన శింగరాయకొండ సిఐ అశోక్‌వర్థన్, టంగుటూరు ఎస్‌ఐ వై రమణయ్య, హెడ్‌కానిస్టేబుళ్ళు అంబేద్కర్ , పి వెంకట్రావు, కానిస్టేబుళ్ళు వై చంద్రశేఖర్ , రవిరాజు, ఎం బాలచంద్ర, పూర్ణచంద్రరావు, హోంగార్డులు రమణ, సాబీద్ డ్రైవర్ శివలను జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి అభినందించారు. ఈ విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి రజనీకాంత్‌రెడ్డి, శింగరాయకొండ సిఐ అశోక్‌వర్థన్ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమప్రాంత రైతులపై అధికారుల వివక్ష
* రైతు సదస్సులో ఎమ్మెల్యే కందుల ధ్వజం
మార్కాపురం , మే 9: పశ్చిమప్రాంత రైతులపై అధికారులు వివక్ష చూపుతున్న కారణంగా ఏ ప్రభుత్వ పథకం రైతులకు సక్రమంగా అందడం లేదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జడ్పి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన మార్కాపురం, కందుకూరు డివిజన్‌స్థాయి రైతు సదస్సు కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పశ్చిమప్రాంత రైతులు వ్యవసాయ బోర్లపై ఆధారపడి జీవిస్తున్నారని, అధికారుల దయాదాక్షన్యాలు వీరిపై లేకపోవడంతో బిక్కచిక్కి చావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం రైతులకు 9గంటల విద్యుత్ అందిస్తామని చెప్పి 7 గంటలకు కుదించారని, తిరిగి 5గంటలు మాత్రమే అని చెబుతూ కనీసం 2గంటలు కూడా ఇవ్వకుండా రైతుల ఉసురుపోసుకుంటోందని ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్యే కందుల ధ్వజమెత్తారు. పశ్చిమప్రాంతంమైన మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎలాంటి ఫ్యాక్టరీలు లేవని, మార్కాపురంలో ఉన్న ఒక్కగానొక పలకల పరిశ్రమ కూడా పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూతపడిందని, ఉన్న ఆధారం వ్యవసాయమేనని అన్నారు. ఇప్పటికే విద్యుత్ సంక్షోభం, వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామాలకుగ్రామాలు వలసలు వెళ్ళాయని, రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయితే తప్ప పశ్చిమప్రాంత రైతులు పచ్చగా ఉండరని, యుద్ధ ప్రాతిపదికన ఫారెస్టు క్లియరెన్స్ ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక ఇన్‌చార్జి మంత్రి ఉన్నప్పటికీ పశ్చిమప్రాంత రైతుల గోడు వినేందుకు ఏ ఒక్కరూ రైతు సదస్సుకు హాజరుకాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రాంత రైతులపై వివక్ష ఎలాంటిదో అర్ధం అవుతుందన్నారు. పోరంబోకు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు, కౌలురైతులకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఫ్లోరిన్ పీడిత ప్రాంతంగా మార్కాపురం ఉందని, మార్కాపురం నియోజకవర్గ గ్రామాలకు సాగర్‌జలాలను నిరంతరం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న చేయూతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారిన ఆధునిక విధానాలను బట్టి వ్యవసాయాన్ని మార్చుకొని అధిక దిగుబడులతో లాభాలు గడించాలన్నారు. పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కృషి ఏఒక్కరిది కాదని, ఉభయ కమ్యూనిస్టుల స్ఫూర్తి, ఎన్టీఆర్ ఆశయం, వైఎస్‌ఆర్ లక్ష్యసాధనతో వెలుగొండ ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. కరెంటు కష్టాలకు చెక్ పెట్టేందుకు జిల్లాలో కోట్లాది రూపాయల ఖర్చుతో సోలార్ సబ్‌స్టేషన్లను నిర్మించడం జరుగుతుందని, తద్వారా విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడే మార్గం ఉందన్నారు. రైతులు ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకొని రైతుచైతన్యయాత్రల స్ఫూర్తితో అధిక దిగుబడులు సాధించాలని కోరారు. జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ మాట్లాడుతూ రైతులకు 7గంటల విద్యుత్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాగా విద్యుత్ అధిక వినియోగం కారణంగా 5గంటలకు కుదించడం జరిగిందన్నారు. నిరంతరంగా పగటిపూట రైతులకు 5గంటల పాటు కరెంటు ఇచ్చేందుకు ప్రక్రియ పూర్తి చేశామని, మరో వారంరోజుల్లో 5గంటల నిరంతర కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న కొండపోరంబోకు, ఇతరత్రా భూములను పేదలకు పట్టాలుగా ఇస్తామని హామీ ఇచ్చారు. చెట్టు-పట్టా అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా భూమి లేని పేదలకు ఆదుకుంటామన్నారు. తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారాల కోసం వీలైనంతవరకు కృషి చేస్తున్నామన్నారు. సదస్సు నిర్వాహణ ప్రాంగణంలోగల వ్యవసాయశాఖ స్టాల్స్‌ను రైతులు పరిశీలించి నూతన పరికరాల గురించి అవగాహన పెంచుకోవాలని, పంట దిగుబడి, రాబడి సూత్రాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను పండించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవసాయశాఖ పరిశోధకులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఆహ్వాన ఆర్భాటమే తప్ప.. హాజరు నామమాత్రం
* రైతు సమస్యలపై ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
మార్కాపురం, మే 9: మార్కాపురం, కందుకూరు డివిజన్ల పరిధిలో జరిగే రైతు సదస్సుకు కేంద్ర మంత్రి నుంచి జిల్లా సహకార సొసైటీ చైర్మన్ వరకు ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రాలను తయారు చేసి పంపిణీ చేశారు. అయితే గురువారం స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన రైతు సదస్సుకు మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు మినహా మరెవరూ రాకపోవడం విశేషం. ఈ సదస్సును చూసిన వారికెవరికైనా ప్రజాప్రతినిధులకు రైతు సమస్యలపై ఎంత ప్రేమ ఉందో చెప్పకనే అర్ధం అవుతుంది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, రాష్టమ్రంత్రులు సాకే శైలజనాథ్, మానుగుంట మహీధర్‌రెడ్డితోపాటు జిల్లాలోని 12మంది ఎమ్మెల్యేలు, నెల్లూరు, ఒంగోలు ఎంపిలు, ఎంఎల్‌సిలు పోతుల రామారావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండపల్లి శ్రీనివాసులరెడ్డి, జూపుడి ప్రభాకరరావులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు బీరం వెంకటేశ్వరరెడ్డిలు వస్తున్నట్లు ఆహ్వానపత్రంలో ప్రకటించారు. అయితే ఈ సదస్సుకు కేవలం మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, అన్నా రాంబాబు మాత్రమే హాజరు కావడంతో సభకు వచ్చిన ప్రతి రైతు ఆహ్వానపత్రం చూసి, హాజరైన ప్రజాప్రతినిధులను చూసి ఇదేనా వారికి రైతులపై ఉన్న ప్రేమ అంటూ విమర్శలు గుప్పించారు. రైతు విమర్శలు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళడంతో ఏమి చెప్పాలో అర్ధంకాని పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులకు స్టాండింగ్ కమిటీ సమావేశం ఉన్నందున హాజరు కాలేకపోయారని సమర్ధించుకుంటూ రైతులకు సమాధానం ఇచ్చారు . కాగా ఈ రైతు సదస్సుకు కందుకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలోని 19 మండలాల నుంచి సుమారు 50వేల మంది హాజరవుతారని అధికారులు భావించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ఓ వైపు ఎండ తీవ్రత, మరోవైపు కరవు పనుల దృష్ట్యా 10శాతం కూడా హాజరుకాకపోవడం విశేషం. ఇకపై అయినా అధికారులు ఆర్భాటపు ఆహ్వాన పత్రాలు వేయకుండా తగుజాగ్రత్తలు చేపట్టాలని జిల్లాలో ఏకైక ప్రతిపక్ష శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అధికారులకు హితవుపలికారు.

రైతు సదస్సులో చిటపటలు..
మార్కాపురం టౌన్, మే 9: స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మార్కాపురం, కందుకూరు డివిజన్‌స్థాయి రైతు సదస్సులో రైతులకు, అధికారులకు మధ్య కొన్ని చమత్కార, వెటకార, సందిగ్నతతో కూడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనితో సదస్సు ప్రాంగణం నవ్వులు విరిసి కొద్దిసేపు ఆనందం, కొద్దిసేపు ఆక్రోశ ఘటనలు చోటుచేసుకొని చిటపటలాడాయి.
* విద్యుత్‌శాఖ ఎడి రఘురాం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ అవసరార్ధం 5గంటలపాటు విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పగా ఒక రైతు లేచి మీరు ప్రయత్నిస్తూనే ఉండండి..! మేము ఇక్కడ చస్తున్నామని కేకలు వేయడంతో సభాప్రాంగణం నవ్వులతో గొల్లుమంది. ఇంతలో మరోరైతు లేచి 5గంటలపాటు విద్యుత్ ఎక్కడ..? ఎవరికి..? ఏ సబ్‌స్టేషన్ పరిధిలో ఇస్తున్నారు..? ఏ రైతు ఆ విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారో..? ఇప్పుడే చెప్పాలంటూ ఎడిని నిలదీశారు. దీనితో రైతులందరూ వేదికవద్దకు దూసుకువచ్చి సక్రమంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకొని నిరంతరంగా విద్యుత్ ఇవ్వాలని కోరారు.
* మత్స్యశాఖ అధికారి ప్రసంగిస్తూ చేపల పెంపకం, వాటి రకాల గురించి వివరిస్తుండగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జోక్యం చేసుకొని పశ్చిమ ప్రాంతంలో తాగేందుకే నీరు సరిగా లేదు, ఇక చేపల పెంపకం ఎక్కడా..? అని అంటూ ఉపయోగపడే మాటలు చెప్పండి అన్నారు. దీనితో సభలో మళ్ళీ నవ్వులు విరిశాయి.
* బేస్తవారపేట మండలంలో నష్టపోయిన దనియాల పంట రైతులు తమకు పరిహారం నేటికీ ఇవ్వలేదు, కారణమేమిటని జిల్లావ్యవసాయ అధికారిని ఓ రైతు ప్రశ్నించగా కార్యాలయం వద్దకు వస్తే వివరాలు చెబుతానని ఆ అధికారి సమాధానం చెప్పడంతో, మళ్ళీ సంవత్సరానికి గానీ మీరు దొరకరు విషయం ఇప్పుడే తేల్చండంటూ ముక్తకంఠంతో రైతులు పట్టుబట్టడం ఔరా..! అని పించింది.
* వడ్డీలేని పంట రుణాలకు బ్యాంకర్లు సహకరించడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వేదికపైనే అధికారులతో కలెక్టర్ చర్చ జరిపి రైతులను సముదాయించడం జరిగింది.
* లైలా తుఫాన్‌లో నష్టపోయిన మిర్చి, పత్తి, బత్తాయి పంటల పరిహారం కోసం వేదిక వద్ద రైతులు ఆందోళన చేయగా పోలీసులు వారికి నచ్చచెప్పి కూర్చోపెట్టారు.
* ఓ రైతు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పొడుగుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గీతాన్ని ఆలాపించడంతో సభకు హాజరైన రైతుసోదరులు ఈలలు వేస్తూ హర్షం వ్యక్తం చేయడం సభికులను ఆశ్చర్యపరచింది.

ఘోర రోడ్డుప్రమాదం కేసులో డ్రైవర్, క్లీనర్ అరెస్టు
ఒంగోలు, మే 9: ఇటీవల శింగరాయకొండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో డ్రైవర్, క్లీనర్‌లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌పి కె రఘురామిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఎస్‌పి ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నిందితులైన డ్రైవర్, క్లీనర్‌లను పాత్రికేయుల ముందు హాజరుపరిచి అనంతరం విలేఖర్లతో జిల్లా ఎస్‌పి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన అప్పారి శ్రీను (36) అనే డ్రైవర్, కడలి శ్రీనువాసు అనే క్లీనర్ ఇద్దరూ కలిసి మద్యం సేవించి సిమెంట్ లారీని నడుపుతుండగా శింగరాయకొండ వద్ద ఘోర ప్రమాదానికి గురైందన్నారు. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా నలుగురు గాయపడినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటలకు అద్దంకి పట్టణంలో 13 మంది చెన్నైలో జరిగే కూటములకు సేవ చేసుకునేందుకు పాండిచ్చేరి వెళుతున్న సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఎక్కారన్నారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న లారీడ్రైవర్, క్లీనర్ తాగి ఉండడాన్ని గమనించిన ప్రయాణీకులు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని చెప్పినప్పటికీ వినకుండా వేగంగా నడపడంతో కల్కివాయి గ్రామం వద్ద లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో లారీపై నిద్రిస్తున్న పది మంది సిమెంట్ బస్తాల కింద చిక్కుకొని మరణించినట్లు తెలిపారు. ఒంగోలులో ఎక్కిన ప్రయాణికుడి మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తించలేదన్నారు. గురువారం ఉదయం లారీడ్రైవర్, క్లీనర్ శింగరాయకొండ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు తెలిపారు. సదరు నిందితులను ఒంగోలు డిఎస్‌పి అరెస్టు చేశారని ఎస్‌పి తెలిపారు.

రెండు ఆటోలు బోల్తా:
పది మందికి గాయాలు
ముండ్లమూరు, మే 9: మండల కేంద్రమైన ముండ్లమూరులో రెండు ఆటోలు బోల్తా పడి పది మందికి గాయాలైన సంఘటన గురువారం జరిగింది. వెల్లంపల్లి గ్రామానికి చెందిన కూలీలు తిమ్మాయిపాలెం వద్ద గల ఇటుకబట్టీల పనికి వెళుతున్నారు. అదే క్రమంలో బట్టీలకు వెళుతుండగా ముండ్లమూరులో రెండు ఆటోలు బోల్తాకొట్టాయి. దీంతో రావూరి కుమారి, వేముల ఎర్రయ్య, కుంటా గోపయ్య, ఎడమానూరి త్రిశైలేంద్ర, జమ్ముల రమణ, పాలకోలు యువాంజలి, పాలెపోగు రాములు, యాదగిరి పున్నమ్మ, జమ్ముల ఈశ్వరమ్మకు గాయాలు అయ్యాయి. వీరిని దర్శి వైద్యశాలకు తరలించారు. వీరిలో రావూరి కుమారి, పాలెపోగు యువాంజలి , కుంటా గోపయ్యల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు.

వాగు ఆక్రమణలు అడ్డుకున్న గ్రామస్థులు
శింగరాయకొండ, మే 9: మండలంలోని కనుమళ్ల పంచాయతీలోని వాగుపోరంబోకు భూములకు పట్టాలు ఇవ్వదలచిన రెవెన్యూ అధికారులను గురువారం కనుమళ్ల గ్రామస్థులు రాస్తారోకోతో అడ్డుకున్నారు. కనుమళ్ల చెరువుకు నీరు వచ్చే వాగు స్థలాన్ని ఆక్రమిస్తే పొలాలు ఎలా పండుతాయంటూ, మాకడుపు కొట్టొదంటూ కనుమళ్ల రైతులు ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ తహశీల్దార్‌కు నిరసన వ్యక్తం చేశారు. వివరాలలోకి వెళితే శింగరాయకొండ జాతీయ రహదారికి పక్కనే ఉన్న కనుమళ్ల పంచాయతీలోని సర్వే నెంబర్ 322,324లలో ఉన్న ఆరు ఎకరాల 30సెంట్లు స్థలాన్ని ఇళ్ల స్థలాలు లేని వారికి కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారని, మరికొంత స్థలాన్ని కొండపి శాసస సభ్యుడు జివి శేషు తనయుడు రాజ్‌విమల్ నూతనంగా స్థాపించిన జివిఎస్ అండ్ జిపిఎస్ చారిటబుల్ ట్రస్ట్‌కు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో అదే సమయంలో స్థలాన్ని జెసిబిలతో శుభ్రపరుస్తుండడంతో గురువారం ఉదయం కనుమళ్ల గ్రామస్థులందరు వారి కుటుంబంతో సహా వచ్చి ఈఆక్రమణలు నిలుపుదల చేశారు. సుమారు 2గంటలకుపైగా కందుకూరు రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సుమారు 10కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదే సమయంలో కందుకూరు వెళుతున్న కొండపి టిడిపి ఇన్‌చార్జి డిబివి స్వామి ఈసంఘటన చూసి ఆక్రమణకు స్థలాలు కాజేసేందుకు కాంగ్రెస్‌పార్టీ పెట్టింది పేరు అని, వాగును ఆక్రమించి ఎమ్మెల్యే తన కుమారుడికి పట్టాలు ఎలా ఇస్తారో అని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈవిషయంపై కందుకూరు ఆర్‌డిఓను, జిల్లా కలెక్టర్‌ను సంప్రదిస్తామని, ఈధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ అంబటి వందనం సంఘటనా స్థలానికి వచ్చి ఈస్థలం పోరంబోకు స్థలం అని రైతులకు తెలిపారు. రైతులు తహశీల్దార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులకు అన్ని మార్గాల నుండి నీరు వచ్చే ప్రత్యామ్నాయాలను అడ్డుకుని ఆక్రమిస్తే పంటలు ఎలా పండించుకోవాలని తహశీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయంపై కలెక్టర్‌తో మాట్లాడి ఆక్రమణలను నిలుపుదల చేస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. ఆందోళన కారులు రోడ్డుపై బైఠాయించడంతో సుమారు 10కిలోమీటర్ల మేర కందుకూరు వైపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అటుగా వెళుతున్న ఉలవపాడు ఎస్సై విజయ్‌చందర్, కందుకూరు సిఐ అక్కేశ్వరరావు రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు.

విద్యుత్‌షాక్‌తో విద్యార్థి మృతి
కందుకూరు, మే 9: లింగసముద్రం మండల పరిధిలోని ఆర్‌ఆర్‌పాలెం పంచాయతీలోని యాదవపాలెంకు చెందిన బి లక్ష్మణరావు (17) అనే విద్యార్థి విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఈసంఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. విద్యార్థి తండ్రి మాలకొండయ్య తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణరావు నెల్లూరు నారాయణ కాలేజిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు, సెలవులకు ఇంటికి వచ్చినట్లు తెలిపారు. ఈక్రమంలో తమ ఇంటి వద్ద ఉన్న మోటార్‌కు నీరుపోసే సమయంలో విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడని తెలిపారు. లింగసముద్రం మండల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శనగ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
వాణిజ్య మంత్రికి రైతు సంఘాల వినతి
ఒంగోలు, మే 9: శనగ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతు నాయకుడు యలమంచిలి శివాజీ, జిల్లాకు చెందిన రైతు ప్రతినిధులు నాగబోయిన రంగారావు, చుంచు శేషయ్య, సుబ్బారావు తదితర నాయకులు గురువారం ఢిల్లీలో వాణిజ్య శాఖ మంత్రి, ప్రభుత్వ శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ రావు, వ్యవసాయశాఖ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రైతు ప్రతినిధి చుంచు శేషయ్య జిల్లాలోని పాత్రికేయులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. జిల్లాలోని రైతు ప్రతినిధులు కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి సహకారంతో ఆ మేరకు కార్యదర్శి ఎస్‌ఆర్ రావును కలిసినట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు శనగ పంటను అష్టకష్టాలు పడి ఉత్పత్తిచేస్తే రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. దేశంలోకి విదేశాలకు చెందిన శనగలు విచ్చలవిడిగా దిగుమతి అవుతున్నాయని, దీంతో దేశీయ శనగలకు ధరలు తక్కువగా వస్తున్నట్లు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కోల్డ్ సొసైటీల్లో శనగలు నిల్వ ఉన్నాయని, రోజు రోజుకు నాణ్యత తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శనగ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కార్యదర్శి ఎస్‌ఆర్ రావును కోరినట్లు తెలిపారు. అలాగే పొగాకు పంటకు కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరామన్నారు. పొగాకు ఈ - ఆక్షన్ విధానం కూడా పొగాకు బోర్డులో సక్రమంగా లేదని తెలిపారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు రాక తీవ్రంగా నష్టపోతున్నారని, వీదేశీ ఆర్డర్లు పొగాకుకు తీసుకొచ్చి గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. పొగాకు బోర్డు వేలం కేంద్రాల కొనుగోళ్ళల్లో ఎక్కువ మంది వ్యాపారులు పాల్గొనేలా చైర్మన్ కె గోపాల్‌తో మాట్లాడి మంచి ధరలు వచ్చేలా చూడాలని కార్యదర్శిని కోరామని తెలిపారు. పొగాకుకు సరైన ధరలు రాకపోతే రానున్న సంవత్సరం పొగాకుకు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉందని కార్యదర్శికి వివరించినట్లు తెలిపారు. స్పందించిన కార్యదర్శి ఎస్‌ఆర్ రావు శనగ రైతులకు గిట్టుబాటు ధరల విషయంపై సంబంధిత వ్యాపారులతో మాట్లాడతామన్నారు. పొగాకు గిట్టుబాటు ధరల విషయంపై కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

వారి జీవనం దయనీయం పట్టించుకునేవారేరీ..?
english title: 
flouride

నిముషం ఆలస్యమైతే అవుట్

$
0
0

శ్రీకాకుళం , మే 9: జిల్లాలో ఇంజనీరింగు, మెడిసన్‌కు సంబంధించి అడ్మిషన్లకు గాను నిర్వహించే ప్రవేశ పరీక్ష (ఎంసెట్) శుక్రవారం నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్‌కు 11 కేంద్రాలు, మెడిసన్‌కు నాలుగు కేంద్రాలు కేటాయించారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం పదిగంటల నుండి ఒంటిగంట వరకు, మెడికల్‌కు సంబంధించి రెండు గంటల నుండి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రంలో విద్యార్థ్ధులకు గంట ముందుగా హాల్‌లోకి అనుమతిస్తుండగా, సరిగ్గా పదిగంటలకు గేట్లు మూసివేయనున్నామని, నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు తెలియజేసారు. ప్రతి ఏడాది నిముషం నిబంధన కొనసాగుతున్నప్పటికీ అభ్యర్థులు ఆలస్యంగా రావడం, నిరాశతో వెనుదిరగడం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే గుర్తించి సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష పూర్తయ్యేంతవరకు అభ్యర్థ్ధులు కేంద్రంలో తప్పనిసరిగా ఉండలన్నారు. పరీక్ష పూర్తయిన అనంతరం ప్రశ్నపత్రాన్ని తమతో పాటు తీసుకువెళ్లవచ్చని, జవాబు పత్రంలో బ్లాక్‌పాయింట్ పెన్‌తో మాత్రమే రబ్బింగ్ చేయాలని సూచించారు. జిల్లాలో ఎంసెట్‌కు మొత్తం 6060 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా ఇంజనీరింగ్‌కు 4513, మెడిషన్‌కు 1547 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఎచ్చెర్లలోని శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఎ,బి కేంద్రాలు, శివాని ఫార్మశీ, టెక్నాలజీ కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున కేంద్రాలు కేటాయించారు. పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, చైతన్య డిగ్రీ కళాశాల, సన్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, మునసబు పేట గాయత్రి డిగ్రీ కళాశాల ఇంజనీరింగ్ పరీక్షకు కేటాయించారు. మెడిషన్‌కు సంబంధించి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో రెండు, మహిళా డిగ్రీ కళాశాల, చైతన్య డిగ్రీ కళాశాలలో ఒక్కో కేంద్రం కేటాయించారు.

అవినీతి రాజకీయాలకు చెంపపెట్టు
శ్రీకాకుళం, మే 9: కర్ణాటక రాష్ట్రంలో అవినీతిపైన అక్కడి ప్రజలిచ్చిన తీర్పు సహేతుకమైందని, అవినీతి రాజకీయాలకు చెంపపెట్టు వంటిదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇంచార్జి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. గురువారం ఇక్కడి ప్రజాసదన్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలకు అక్కడి ప్రజలు బిజెపిని ఓడించారని, అదే కాంగ్రెస్ విజయానికి కారణమైందన్నారు. అవినీతిపైన అక్కడి ప్రజలిచ్చిన తీర్పు సహేతుకమైందేనని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు అవినీతిలో కూరుకుపోయిన మంత్రులకు, రాజకీయనాయకులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ప్రజలకోసం కాకుండా, కాంగ్రెస్ నాయకులకోసమే ప్రవేశపెట్టినట్టుందని విమర్శించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలులో 144 కోట్లు రూపాయలు అవినీతి జరిగిందని, ఐదుగురు మంత్రులున్నప్పటికీ అవినీతికి ఆస్కారమేర్పడటం చూస్తుంటే, అవినీతి పరులను మంత్రులు ఎలా వెనుకేసుకొస్తున్నారో అర్ధవౌతుందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దోపిడీ పాలన సాగిస్తుందని, నాణ్యతలేని పనులు చేపట్టి కార్యకర్తలకు అనుకూలంగా ఉండేట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై నిర్వహించిన బంద్‌లో అన్ని రాజకీయపక్షాలకు చెందిన నాయకులు పాల్గొనగా, పోలీసులు దౌర్జన్యంగా వామపక్షనేతలను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఒకవేళ వారు ఏదైనా తప్పుచేసుంటే అది కాకతాళీయంగా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని తెలిపారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీస్థాయికి మరల తీసుకువెళ్లాలంటే టిడిపి గెలుపుతోనే సాధ్యమని, రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి(బాబ్జి), కలిశెట్టి అప్పలనాయుడు, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, కొర్ను ప్రతాప్, ఎస్.వి.రమణమాదిగ, అరవల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు తీపికబురు
ఎచ్చెర్ల, మే 9: గత ఏడాది సంభవించిన నీలం తుఫాన్ నష్టాలకు పరిహారాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. బాధిత రైతాంగం ఇన్‌పుట్ సబ్సిడీ కోసం కళ్లల్లో వత్తులేసుకుని నిరీక్షించారు. ఇటీవలి నిర్వహించిన రైతు చైతన్యయాత్రలో అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. జిల్లాలో 2406.3 హెక్టార్లలో పంటనష్టపోయిన 17,561 మంది రైతులకు 25.13 కోట్ల రూపాయలు పరిహారం అందించేందుకు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇదే తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 1100 హెక్టార్లు ఉద్యానవన పంటలకు పరిహారంగా కోటి రూపాయలు అందించనున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలరోజులు సమయం పడుతుందని వ్యవసాయ శాఖాధికారులే స్పష్టంచేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏడాదిగా ఎదురుచూస్తున్నా ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో వ్యవసాయ మదుపుల కోసం ఇన్‌పుట్ సబ్సిడీ ఎంతగానో దోహదపడుతుందని ఆ కుటుంబాలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. విత్తనాలు, ఎరువులకొనుగోలుకు పరిహారం మరింత ఊతమిస్తుందని అన్నదాతలంతా చర్చించుకుంటున్నారు. మరోవైపు పంట రుణాలు కూడా అందించేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా రుణాలు పొందిన ఖాతాదారులకు కూడా ఖరీఫ్‌లో రుణం ఇచ్చేందుకు మీసేవ ద్వారా అడంగల్ కాపీ జతచేయాలని నిబంధనలు విధించడంతో రైతులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. మీసేవ కేంద్రాల్లో పూర్తిసమాచారం లేకపోవడం ఆన్‌లైన్ కష్టాలు, కరెంటుకోతలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటరుణాలు ఈ ఖరీఫ్‌లో అందిపుచ్చుకోవడం కత్తిమీద సామేనంటూ రైతులంతా నిట్టూరుస్తున్నారు.

కూర ‘గాయాలు’
శ్రీకాకుళం, మే 9: కూరగాయలకు వడదెబ్బ తగిలింది. మండే ఎండల్లో కూరగాయల దిగుబడి బాగా తగ్గింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. ఉద్యానవన శాఖాధికారులు కూరగాయల విత్తనాల సరఫరాలో నిర్లక్ష్యం వహించడంతో రైతులు కూడా కూరగాయల సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. రైతులకు రాయితీపై విత్తనాలను అందించిన దాఖలాలు కూడా కానరావడం లేదు. గతంలో రైతుబజారులోనే విత్తనాలను రాయితీపై సరఫరా చేసేవారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చొరవ చూపకపోవడంతో నేడు విత్తనాలు పంపిణీ చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ ప్రణాళిక సమావేశాల్లో రాయితీపై విత్తనాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ మార్కెట్ కమిటీ అధికారులకు సూచించినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కూరగాయల కొరతతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. అల్లం ధర కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆకాశనంటింది. రాష్ట్రంలో అల్లం దిగుబడి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడంతో అల్లం ధర విపరీతంగా పెరిగింది. కేజీ అల్లం 110 రూపాయల నుంచి 120 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అలాగే కిలో టమాటా 25 రూపాయలు, వంకాయలు 20, క్యారెట్ 15 రూపాయలు, గోల్కొండచిక్కుడు 20 రూపాయలుగా విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే బెండకాయలు కేజీ 25, దొండకాయలు 14, బీరకాయలు 30 రూపాయలు, ఆనప పది, క్యారెట్ 15 రూపాయలు, పచ్చిమిర్చి 30 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు, మార్కెట్‌కమిటీ సమన్వయంతో కూరగాయలు పండించే రైతులకు రాయితీపై విత్తనాలను సరఫరా చేస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.

మంచినీటి పథకం అవినీతిపై విచారణకు రంగంలోకి సిఐడి
శ్రీకాకుళం, మే 9: ఏ పథకమైతే గుక్కెడు మంచినీటిని అందిస్తుందని ప్రజానీకం ఆశపడిందో అదే పథకం నిండా ముంచేసింది! గుత్తేదారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం పట్టడంతోపాటు అధికారుల పర్యవేక్షణాలోపాలను కళ్ళకు కట్టింది. కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టి, లక్షలాది మంది గొంతెండేలా చేసే 24 గంటలు నిరంతర మంచినీటి పథకం పనిచేయకుండా పోయింది. ఈ పథకం వైఫల్యం వెనుక ఎన్నో నిజాలు వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పర్యవేక్షణా ఇంజనీర్లు కారణంగా కోట్లాది రూపాయల విలువ చేసే రిజర్వాయర్లు పనికిరాకుండా పోయాయి. ఎ.ఎస్.ఎన్.కాలనీ, అరసవిల్లి ప్రాంతాల్లో నిర్మించిన 800, 1200 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు కుప్పకూలిపోయాయి. దీనిపై దివంగతనేత కింజరాపు ఎర్రన్నాయుడు 2009లో కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అప్పటి ఫిర్యాదుకు ఇప్పుడు సర్కార్‌లో స్పందన కన్పించింది. కుప్పకూలిన రిజర్వార్లపై నివేదికలు, సంబంధిత అధికారుల పర్యవేక్షణాలోపం, నిర్మించిన ఐ.హెచ్.సి. కాంట్రాక్టర్లపై చర్యలు వంటి అంశాలన్నీ సిఐడి అధికారులు దర్యాప్తు చేసి నివేదించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు ఆ ఉత్తర్వులు గురువారం సిఐడి అధికారులకు ఫ్యాక్స్ ద్వారా అందినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే అంశంపై అప్పట్లో దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడు విజిలెన్స్‌శాఖకు దర్యాప్తు చేయాలంటూ సంబంధిత డాక్యుమెంట్లుతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపితే..అందుకు సంబంధించిన గుత్తేదారులను బ్లాక్‌లిస్టులో పెట్టాలని, కూలిపోయిన రిజర్వాయర్లకు 40 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం గాని, మరల ఆ రిజర్వాయర్లు నిర్మించడంగాని చేయాలంటూ హుకుం జారీ చేసింది. కుప్పకూలిపోయిన రిజర్వాయర్లకు బాధ్యులను చేస్తూ ముగ్గురు ఇంజనీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ సూచించింది. రాజకీయ ఒత్తిళ్లతో నిలిచిపోయిన విజిలెన్స్ అధికారుల చర్యలకు చెక్ చెప్పేలా ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేసి నివేదికలు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇలా విజిలెన్స్‌శాఖ నివేదించిన నివేదికల తర్వాత మరల సిఐడి దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడం జిల్లాలో రెండోది. మొదటిది 50 కోట్ల రూపాయల విలువైన వంశధార షట్టర్ల కుంభకోణమైతే.. రెండోది 21.50 కోట్ల రూపాయల యు.ఐ.డి.ఎస్.ఎస్.ఎం.టి. స్కీమ్‌కు చెందిన నిరంతర మంచినీటి ప్రాజెక్టు! పెరుగుతున్న శ్రీకాకుళం జనాభా దృష్ట్యా 2036 సంవత్సరానికి (మున్సిపాలిటీకి కలుపుబోవు పంచాయతీలు పెద్దపాడు, కిల్లిపాలెం, చాపురం, ఖాజీపేట, పాత్రునివలస) 2,38,000 జనాభాను దృష్టిలో ఉంచుకొని 27.13 ఎం.ఎల్.డి. అవసరం ఉంది. అందుకుగాను నీటిసరఫరా నాగావళి నది, ఆదివారంపేట వద్ద నాలుగు బావులు, 735 మీటర్లు పొడవు గల గ్యాలరీ ద్వారా 27.31 ఎం.ఎల్.డి. సరఫరా చేయుటకు ఆంధ్రా యూనివర్సిటీ సర్వే రిపోర్టు సమర్పించారు. దాని ద్వారా పట్టణానికి 11 బ్లాకులుగా విభజించి, 7 జోన్స్‌లో 7 రిజర్వాయర్‌లను గ్రావిటీ మెయిన్ ద్వారా కలుపుతూ 20 శాతం నీటిసరఫరా లేని నెట్‌వర్క్ కలుపుతూ నివేదికలను 21.50 కోట్ల రూపాయలతో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం కేంద్ర ప్రభుత్వానికి 2007లో సమర్పించింది. యు.ఐ.డి.ఎస్.ఎస్.ఎం.టి. స్కీమ్ ద్వారా సిక్కోల్ ప్రజలకు నీటిసరఫరాకు గ్రాంటు విడుదల చేస్తూ 80 శాతం నిధులు కేంద్రప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 10 శాతం నిధులు మున్సిపాలిటీ నిధులతో మొత్తం 21.50 కోట్ల రూపాయలతో ఈ నిరంతర నీటిసరఫరా పథకాన్ని ఆమోదించడమైంది. ఈ ప్రాజెక్టును పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖ ఏజెన్సీగా పేర్కొంటూ 2007లో పనులను ఆరంభించింది. 2009లో నాలుగు బావులు 4 మీటర్లు డయాతో 12 మీటర్లు లోతుతో నిర్మించారు. గ్యాలరీ నిర్మాణానికి నాగావళినదిలో ఆదివారంపేట వద్ద 735 మీటర్ల పొడవున 600 మిల్లీ మీటర్లు ఆర్.సి.సి.ఎన్.పి. మూడు పైపు తొమ్మిది మీటర్ల లోతులో నిర్మాణం, కలక్షన్ వెల్స్ రెండు, నాలుగు మీటర్లు డయాతో, 60 కె.డబ్ల్యూ పంపుసెట్టును అమర్చారు. ఈ ప్రాజెక్టుకు అతిముఖ్యమైన రిజర్వార్ల నిర్మాణాన్ని పరిశీలిస్తే 1200 కె.ఎల్ సామార్థ్యంతో బొందిలీపురం వద్ద రిజర్వాయర్ నిర్మించారు. అలాగే 1200 కె.ఎల్. రిజర్వాయర్లు బాకర్‌సాహెబ్‌పేట, అరసవిల్లి, కంపోస్టు కాలనీ, గుజరాతీపేటలలో నిర్మించారు. దమ్మలవీధిలో 400 కె.ఎల్., పాత హెచ్.బి.కాలనీ, ఎ.ఎస్.ఎన్.కాలనీలో 800 కె.ఎల్. సామార్థ్యం కలిగిన ఐదు రిజర్వార్లు నిర్మించారు. అందులో ఎ.ఎస్.ఎన్.కాలనీ, అరసవిల్లి ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లు కుప్పకూలిపోయాయి. వాటి నికర ఖర్చు 40 లక్షల రూపాయలు. ఐ.హెచ్.సి. గుత్తేదార్లు నిర్మించిన రిజర్వాయర్లు కూలిపోయిన వెంటనే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి మరల వారిచేతే నిర్మించినట్టు చెబుతున్నప్పటికీ, ఎర్రన్నాయుడు నిరంతర నీటి సరఫరా పథకంలో అవకతవకలు, వాటి ద్వారా 5.62 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని కేంద్ర పట్టణ,గ్రామీణాభివృద్ధిశాఖకు ఫిర్యాదు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు సిక్కోలు నిరంతర నీటిసరఫరా పథకం నిర్మాణ పనులు, నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయమంటూ సిఐడికి ఆదేశాలు ఇచ్చిన కేంద్రానికి మరో మూడు వారాల్లో దర్యాప్తు ముగించి నివేదికలు అందించేందుకు రంగం సిద్ధం అవుతోంది.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
* సిఇఒ కైలాసగిరీశ్వర్
జలుమూరు, మే 9: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నిరుపేద ప్రజలకు మంజూరుచేసిన అనేక సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సి.ఇ.ఒ కైలాల గిరీశ్వర్ అన్నారు. మండలం అచ్యుతాపురం గ్రామంలో గురువారం జరిగిన పల్లెకుపోదాం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నంతకాలం అభివృద్ధి జరుగదని, మీరంతా అక్షరాస్యులుగా కావాలని కోరారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు లోపించడం వల్ల గ్రామాల్లో అనేకరోగాలు వ్యాపిస్తాయని, ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ప్రభావతి, తహశీల్దార్ శ్రీనివాసరావు, పలు శాఖాధికారులు, మాజీ ఎంపిపి బగ్గు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల కళాశాలకు మరమ్మతులు
* ఎజెసి రాజ్‌కుమార్
నరసన్నపేట, మే 9: మండలంలో తామరాపల్లి వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల మహిళా జూనియర్ కళాశాలకు మరమ్మతులు చేపట్టిన అనంతరం పునఃప్రారంభించనున్నామని ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్ స్పష్టంచేశారు. గురువారం ఆయన జూనియర్ కళాశాలను ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాలలో మరమ్మతులకు గురైన తరగతి గదులను, డార్మెంటరీ, డైనింగ్‌హాల్, వసతి గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో నాల్గవ తరగతిగదిలో స్లాబు పైపెచ్చు ఊడిపడడంతో విద్యార్థినులు, సిబ్బంది భయాందోళనకు గురవ్వడంతో గురుకుల కళాశాలను జిల్లా కేంద్రంలోని పెద్దపాడుకు మార్చామన్నారు. అయితే పలు సంఘాలు, రాజకీయ పార్టీలు జిల్లా కలెక్టర్‌కు ఈ సమస్యను తీసుకురావడంతో వీటిని పరిశీలించేందుకు వచ్చామన్నారు.ఒక్క నాల్గవ తరగతి గది తప్ప మిగిలిన గదులన్నీ బాగానే ఉన్నాయని ఇంజనీరింగ్ అధికారులు ఎజెసి దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టిన తరువాతే ఈ కళాశాలను పునఃప్రారంభించాలని ఎజెసి పేర్కొన్నారు.

భవిష్యత్ వైఎస్సార్ కాంగ్రెస్‌దే
* ఎమ్మెల్యే కృష్ణదాస్
శ్రీకాకుళం, మే 9: భవిష్యతంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని నరసన్నపేట ఎమ్మెల్యే, శాసనసభ ఉపనేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పట్టణంలోని పదవ వార్డులో మహ్మద్‌షిరాదుద్దీన్ ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించిన అనంతరం దశలవారీగా పార్టీ బలోపేతమైందన్నారు. వైఎస్సార్‌సీపీకి పెద్దఎత్తున ప్రజలు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ప్రారంభంలో కొత్తపార్టీకి నైరాశ్యం కనిపిస్తోందని, ఎన్నికల అనంతరం పార్టీ బలం తెలుస్తుందని స్పష్టంచేశారు. కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని కండువాలతో ఆహ్వానించారు. ముందుగా పదోవార్డులో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు వరుదు కల్యాణి, వై.వి.సూర్యనారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్రబాబు, అంధవరపు సూరిబాబు, ధర్మాన ఉదయ్‌భాస్కర్, మార్పు ధర్మారావు, కోరాడ రమేష్, ఎన్ని ధనుంజయ్‌రావు, జె.ఎం.శ్రీనివాస్, నక్క రామకృష్ణ, ఎన్.శ్రీనివాస్, విఆర్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

కాలువ పనులు చేపట్టాలని ఆర్డీవోను ముట్టడించిన రైతులు
ఆమదాలవలస, మే 9: తమ గ్రామాలకు సంబంధించిన 4 ఆర్, 6 ఆర్ పిల్లకాలువలకు పనులు ఒకేసారి చేపట్టాలని ఆరు గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. గురువారం గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కాలువ పరిస్థితులను తెలుసుకునేందుకు విచ్చేసిన ఆర్డీఒ గణేష్‌కుమార్‌ను వారు చుట్టుముట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిపేట, కంచరాపువానిపేట, నాదానపురం, బొమ్మిడాలపేట, సీపానచంద్రయ్యపేట, నందగిరిపేటలకు చెందిన కాలువ పనులు 2007లో ప్రారంభమయ్యాయని, నీటిపారుదల, రెవెన్యూ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇప్పటికీ అవి పూర్తికాలేదని ఆరోపించారు. 2004 నాటి పాతసర్వే రిపోర్టు ఆధారంగా పనులు చేపట్టాలని రైతులు కోరారు. కొందరు రైతులు వారి పొలాలు పోతాయనే ఉద్దేశ్యంతోను, మరికొందరు దిగువ గ్రామాలకు సాగునీరు అందకుండా ఉండేందుకు కాలువ పనులను అడ్డగిస్తున్నారన్నారు. ఈ కాలువ పనులు పూర్తవ్వకపోవడంతో సుమారు 800 ఎకరాలకు అందాల్సిన సాగునీరు వృథాగా పోతోందని ఆవేదనవ్యక్తం చేశారు. దీని వల్ల దిగువ రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ఎంతోకాలం నుండి అసంపూర్తిగా ఉన్న 4 ఆర్, 6 ఆర్ పిల్లకాలువల పనులను వెంటనే పూర్తిచేసి ఈ ప్రాంత రైతులందరికీ న్యాయం చేయాలని టిడిపి నాయకుడు పాతిన రమణ డిమాండ్ చేశారు. ఆనాటి రాష్టమ్రంత్రి తమ్మినేని సీతారాం పాలనలో ఈ కాలువ పనులకు అంకురార్పణం జరిగిందని, ఈ పనుల కోసం 108 కోట్ల రూపాయలు కేటాయించి డిజైన్ చేశారని గుర్తుచేశారు. ఆ తరువాత ప్రభుత్వాలు పాలకులు దీనిని పట్టించుకోలేదన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు నాయకులు సువ్వారి రాజులు, సువ్వారి ఆదినారాయణ, పాతిన అర్జున్, సీపాన లోకనాధం, రుప్ప అప్పన్న, చల్లా రవి, నారాయణరావు తదితరులు వంశధార, రెవెన్యూ అధికారులను నిలదీశారు.

పట్టణంలో జెసి సుడిగాలి పర్యటన
శ్రీకాకుళం , మే 9: పట్టణంలో గురువారం ఉదయం ఆరుగంటలకు జాయింట్ కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపల్ ప్రత్యేకాధికారి హోదాలో పట్టణంలోని పలువార్డులను పర్యటించి, వార్డుల్లోని సమస్యలు గుర్తించి, పరిష్కారానికై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ముందుగా పుణ్యపువీధిలో కాలువల నిర్మాణాలను పరిశీలించి, కాలువల్లో ఉన్న చెత్తను చూసి పారిశుద్ధ్య నిర్వహణపట్ల అజాగ్రత్త తగదని మున్సిపల్ హెల్త్ అధికారిని ఆదేశించారు. అక్కడ నుండి గుజరాతీపేట చేరుకొని వీధిలో నడుచుకుంటూ ప్రతి ఇంటిముందు కాలువను పరిశీలించారు. వీధిలోని చిన్నచిన్న దుకాణదారుల ఇంటిముందు చెత్తకు బకెట్లు పెట్టుకోవాలని, మున్సిపల్ వాహనం వచ్చినపుడు చెత్తను ఆవాహనంలో వేయాలని సూచించారు. అనంతరం పి.యన్.కాలనీలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీని పరిశీలించారు. మున్సిపల్ అధికారులతో కలసి వెళ్తుండగా ఇసుక బండ్లను చూసి వాటి యజమానులను పిలిచి మాట్లాడారు. బండ్లద్వారా ఇసుకను ఎక్కడకు తరలిస్తున్నారంటూ వారినుండి వివరాలు సేకరించారు. అనంతరం హయాతినగరం వద్ద నాగావళి నదినుండి ఇసుకను తెస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ ట్రాక్టర్ టైర్ల అచ్చులు ఉండటాన్ని పరిశీలించి, ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువెళ్తున్నారా? అంటూ స్థానికులను అడిగారు. వారు స్థానిక నాయకుడొకరు వారి సొంత ట్రాక్టర్లుతో ఇసుకను తీసుకువెళ్తున్నారని, అవే కాకుండా వేరే ట్రాక్టర్లవద్ద డబ్బులు వసూలుచేస్తూ ఇసుకను తరలిస్తున్నారని చెప్పగా, వెంటనే స్పందించిన జెసి అతనికి నోటీసు ఇచ్చి పిలిపించాలని అధికారులను ఆదేశించారు. చెత్తపై సమరం కార్యక్రమంలో బాగంగా ప్రతీరోజూ వార్డులన్నీ పరిశీలించి రోడ్లుపైన, కాలువల్లోనూ చెత్తలేకుండా చూసుకోవాలని, వార్డులు పరిశుభ్రంగా ఉంచాలని ఎంహెచ్‌వోను ఆదేశించి వెళ్లిపోయారు. పర్యటనలో అతని వెంట మున్సిపల్ డి.ఇ సుగుణాకరరావు, ప్రణాళిక విభాగపు సూపర్‌వైజర్ వై.ఉమామహేశ్వరరావు, ఇతర పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో ఇంజనీరింగు, మెడిసన్‌కు సంబంధించి అడ్మిషన్లకు
english title: 
skl

కొండా దంపతుల దారెటో?

$
0
0

వరంగల్, మే 9: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం ఒక వెలుగు వెలిగిన కొండా దంపతులు క్రమంగా పార్టీకి దూరం అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీయే కొండా దంపతులను దూరం పెడుతున్నట్లు ప్రచారం కూడా ఉంది. పార్టీ ముఖ్యనాయకత్వాన్ని ఎదిరించే విధంగా, ప్రశ్నించే విధంగా కొండా దంపతులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొండా దంపతులకు క్రమంగా పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తూ రాగా, తాజా సంఘటనలు పార్టీ ముఖ్యనాయకత్వానికి, కొండా దంపతులకు మధ్య దూరాన్ని మరింతగా పెంచాయి. మొదటి నుంచి జిల్లాలో కొండా దంపతులకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్గీయులుగా పేరుండగా, వైఎస్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మంత్రివర్గంలో కొండా సురేఖకు స్థానం లభించడంతో కొండా వర్గీయులు జిల్లాపై పెత్తనం చెలాయించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించడం, జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనే డిమాండ్‌కు కొండా దంపతులు మద్దతు ఇవ్వడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. జగన్ విషయంలో మంత్రి కొండా సురేఖ అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కేంద్ర నాయకత్వానికి లేఖలు పంపించారు. మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు ఒకదశలో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా ప్రశ్నించే విధంగా వ్యవహరించారు. చివరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నెపంతో కొండా సురేఖపైన, కొన్ని నెలల తరువాత ఎమ్మెల్సీ, ఆమె భర్త కొండా మురళిపైన వేటు వేశారు. ఫలితంగా పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగగా, ఆ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కొండా సురేఖ టిఆర్‌ఎస్ అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉపఎన్నికల వరకు జిల్లాలోనే కాకుండా రాష్టస్థ్రాయిలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యపాత్ర పోషించిన కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ప్రాభవం క్రమేణా తగ్గుతూ వచ్చింది. దీనికి కారణం కొండా దంపతులు అనుసరించిన ఏకపక్ష వైఖరి అనే ప్రచారం కూడా కొనసాగింది. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, నియామకాలు తమ కనుసన్నల్లో జరగాలనే విధంగా కొండా దంపతులు వ్యవహరించడం, దీనికి పార్టీ రాష్ట్ర నాయకత్వం అంగీకరించకుండా వీరిరువురిని పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకే పరిమితం చేసి మిగతా నియోజకవర్గాలలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేయడం కొండా దంపతులకు రుచించని విధంగా మారింది. పార్టీ రాష్ట్ర నాయకత్వ వ్యవహారశైలితో విభేదించిన కొండా దంపతులు క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గడచిన వారం రోజులుగా కొండా దంపతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడతారనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారాన్ని కొండా దంపతులు, వారి మద్దతుదారులు ఖండించకపోవడం మరింత గందరగోళానికి అవకాశం ఏర్పడింది. తాజాగా కొండా దంపతుల మద్దతుదారులుగా పేరున్న నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కొండా వర్గీయులకు పుండుమీద కారం చల్లిన విధంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకత్వం కష్టసమయాల్లో తమను వాడుకుని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు కొండా మద్దతుదారుల నుంచి మొదలయ్యాయి. వైఎస్సార్‌ను, జగన్‌ను కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేసిన సందర్భంలో వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలిచిన తమను ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కొండా మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం శీతకన్ను వేసిన నేపథ్యంలో కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతుండగా, కాంగ్రెస్ జిల్లా నాయకత్వంలో మాత్రం కొండా దంపతులను పార్టీలో చేర్చుకునే విషయంలో కనీస స్పందన కనిపించడం లేదు. గురువారం కొండా దంపతులు బిజెపిలో చేరతారని కొన్ని చానెళ్లలో ప్రచారం జరిగింది. కానీ ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులు మాత్రం ఖండించారు. కొండా దంపతులను బిజెపిలో చేర్చుకునే విషయాన్ని పార్టీ ఇప్పటి వరకు ఆలోచించలేదని, కొండా దంపతులతో ఎవరూ సంప్రదింపులు జరపడం లేదని స్పష్టం చేశారు.

భార్యా హంతకుడికి బేడీలు
జఫర్‌గడ్, మే 9: మద్యానికి బానిసై భార్యపై అనుమానంతో కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యచేసిన సంఘటనలో నిందితుడైన భర్త జోగు బాబును గురువారం అరెస్టు చేసినట్లు వర్థన్నపేట సిఐ మల్లయ్య తెలిపారు. ఈ నెల రెండవ తేదీన ఈ సంఘటన జరుగగా దానికి సంబంధించిన పూర్తి వివరాలను విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. మండలంలోని కోనాయిచలం గ్రామానికి చెందిన జోగు బాబు (42)కు బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన ధనమ్మతో 18 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గత కొన్నిరోజులుగా బాబు నిత్యం మాద్యానికి బానిసై భార్య ధనమ్మను డబ్బులకోసం వేధిస్తుండేవాడు. ధనమ్మ మరో వ్యక్తితో అక్రమసంబంధం నెరుపుతోందనే అనుమానం పెంచుకుని ఆమెను ఏవిధంగానైన హతమార్చాలని పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకున్నాడు. ఈనెల రెండవ తేదీన ధనమ్మ రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. ధనమ్మ కేకలువేస్తూ బయటికి వచ్చింది. ఈ సంఘటనలో ధనమ్మ ఎంజిఎంలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ధనమ్మ మృతికి కారుకుడైన బాబును గురువారం అరెస్టుచేసినట్లు సిఐ మల్లయ్య తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎస్సై ఫణీధర్, కానిస్టేబుల్ పరుషరాములు పాల్గొన్నారు.

వడదెబ్బతో యువకుడు మృతి
ఆత్మకూరు, మే 9: వడదెబ్బతో యువకుడు మృతిచెందిన సంఘటన ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో జరిగింది. మృతుని బంధువుల కథనం ప్రకారం... నీరుకుళ్ల గ్రామానికి చెందిన గొల్లపెల్లి సుభాష్ (30) గ్రామశివారులోని తన వరి పొలం వద్దకు బుధవారం వెళ్లాడు. రోజంతా అక్కడే ఉండి పొలం పనులు చూసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి వడదెబ్బతో వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు సుభాష్‌ను చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతునికి భార్య లలిత, కుమారుడు సిద్ధార్ధ, కుమార్తె కావ్య ఉన్నారు. మృతుడు సుభాష్ కుటుంబాన్ని గురువారం పరకాల ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సందర్శించి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. సుభాష్ కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.

శాంతి భద్రతల పరిరక్షణలో
కానిస్టేబుళ్ల పాత్ర కీలకం
బాలసముద్రం, మే 9: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని వరంగల్ రూరల్ ఎస్పీ జి.పాలరాజు సిబ్బందికి తెలిపారు. జిల్లాలో అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించాలనే ఆలోచనతో వరంగల్ రూరల్ ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా నేరపరిశోధన ద్వారా వివిధ కేసులలోని నిందితులను అరెస్టు చేసి విధి నిర్వహణలో ప్రతిభ చూపిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక బహుమతులు అందజేసే కార్యక్రమాన్ని జిల్లా పోలీసు విభాగంలో ప్రారంభించారు. అందులో భాగంగా మరిపెడ గ్రామానికి చెందిన గుగులోతు సునీత హత్య కేసులో నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన మరిపెడ పోలీసు అధికారులకు, సిబ్బందికి గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పాలరాజు సఫారి సూట్‌తోపాటు నగదు బహుమతులను అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో కురవి సిఐ జి.రవీందర్, మరిపెడ ఎస్సై ఎస్‌కె.అబ్దుల్ రహమాన్, కానిస్టేబుళ్లు ఎం.ప్రభాకర్, కె.రామ్‌మోహన్, జి.మహేందర్ ఉన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై సస్పెన్షన్ వేటు
వరంగల్, మే 9: పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారనే కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు జిల్లా నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ మహిళా విభాగం కన్వీనర్ నునావత్ రాధ, ట్రేడ్ యూనియన్ విభాగం కన్వీనర్ తక్కళ్లపల్లి మోహన్‌రావు, మైనారిటీ సెల్ కన్వీనర్ సయ్యద్ మసూద్, ఎస్సీ సెల్ కన్వీనర్ చిలువేరు శ్రీనివాస్‌లపై పార్టీ సెంట్రల్ కమిటీ వేటు వేసింది. ఈ నలుగురు నాయకులు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న కొండా మురళి, సురేఖ మద్ధతుదారులు కావడం విశేషం. నియోజకవర్గాల కో-ఆర్డినేటర్ల నియామకాల విషయంలో రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ నలుగురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పనిచేస్తున్న తమను కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారిని కో-ఆర్డినేటర్లుగా నియమించడాన్ని వ్యతిరేకించారు. వారం రోజులకిందట నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయానికి తాళం వేసి మెయిన్ గేటు ముందు ధర్నా కూడా నిర్వహించారు. ఈ సందర్భంలో నియోజకవర్గాల కో-ఆర్డినేటర్ల నియామకం విషయంలో డబ్బులు చేతులు మారినట్లు ఈ నలుగురు నాయకులు ఆరోపణలు చేశారు. పార్టీ నాయకత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే కార్యకర్తలతో హైదరాబాద్ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరించారు. వీరి ప్రకటనలను, చర్యలను వైఎస్సార్ సిపి సెంట్రల్ కమిటీ ముఖ్యనాయకులు సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యాలయానికి తాళం వేయడమేకాకుండా నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని జైలులో ఉన్న జగన్ దృష్టికి తీసుకువెళ్లగా, పార్టీపరంగా కఠినంగా వ్యవహరించాలని జగన్ ఆదేశించడంతో వీరిపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ నాయకత్వంపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కానీ వీరి నుంచి పార్టీ సెంట్రల్ కమిటీకి ఎటువంటి వివరణ అందకపోవడంతో నలుగురు నాయకులపై గురువారం సస్పెన్షన్ వేటు ప్రకటించారు.

ఐదు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్
* మంత్రి సారయ్య
వరంగల్, మే 9: జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే చర్యలలో భాగంగా వరంగల్ నగరంలోని ‘ఓ సిటి’లో ఐదుకోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వివిధ రకాల క్రీడలలో శిక్షణ ఇస్తారని చెప్పారు. గురువారం నగరంలోని రంగశాయిపేటలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా శిక్షణా శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి సారయ్య మాట్లాడుతూ ఓ సిటిలో కార్పొరేషన్‌కు చెందిన స్థలాన్ని కేటాయిస్తున్నామని, త్వరలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంఖుస్థాపన చేస్తారని చెప్పారు. నగరంలోని క్రీడాకారులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. కనీస వౌళిక సదుపాయాలు లేకపోయినా క్రీడలపై ఉన్న ఆసక్తితో కోచ్‌లు, క్రీడాకారులు క్రీడలలో ప్రగతి సాధిస్తుండటం అభినందనీయమని పేర్కొన్నారు. నగరంలో క్రీడల నిర్వహణకు రెండులక్షల నుండి ఐదులక్షల రూపాయల వరకు బడ్జెట్‌ను పెంచామని తెలిపారు. రంగశాయిపేటలోని జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో రెండు హాకీ, రెండు ఖోఖో, రెండు హ్యాండ్‌బాల్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా 10,11,12వ వార్డులలో జిమ్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఖిలావరంగల్‌లో క్రీడా మైదానానికి కాంపౌండ్ వాల్ నిర్మించడమేకాకుండా నీటివసతి తదితర సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. రంగశాయిపేటలో క్రీడాశిక్షణ పొందుతున్న వందమంది విద్యార్థులకు యూనిఫారాలు, షూస్‌ను రెండురోజులలో అందజేస్తానని హామీ ఇచ్చారు. క్రీడాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్ మాట్లాడుతూ ఈనెల ఏడవ తేదీ నుండి జూన్ ఆరవ తేదీ వరకు నగరంలోని విద్యార్థులకు వివిధ క్రీడలపై శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నామని తెలిపారు. వరంగల్ డిఎస్పీ హైమావతి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి దోహదం చేస్తాయని చెప్పారు. క్రీడలలో పాల్గొనే విద్యార్థులు అన్నిరంగాలలో ముందుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, మాజీ కార్పొరేటర్ బొలుగొడు సారయ్య, ముప్పారపు మల్లేశం, జనార్థన్ తదితరులు పాల్గొన్నారు.

పుష్కరకాలమైనా అమలుకునోచని ‘ఉత్త’ర్వు * కేసముద్రంలో నెరవేరని బాలికల ఉన్నత పాఠశాల ఏర్పాటు
జీవో బుట్టదాఖలేనా!?
కేసముద్రం, మే 9: ‘బాలిక పుట్టిందని చింతించవద్దు.. బాలికలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి వారి ఉన్నతికోసం ప్రభుత్వం ‘బంగారుతల్లి’ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఇక నుంచి వారి మంచి చెడ్డలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని’ రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలతో హోరెత్తిస్తుండగా.. కేసముద్రం మండల కేంద్రంలో పనె్నండేళ్ల క్రితం బాలికలకు ప్రత్యేకంగా ఉన్నత పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు అమలుకునోచుకోకుండా ఉత్త మాటగానే మిగిలిపోయింది. మండల కేంద్రంలో ప్రస్తుతం బాల, బాలికలకు కలిపి నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలను బైఫర్కేషన్ చేయడానికి విద్యాశాఖ సుముఖత వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 2001-2002 విద్యా సంవత్సరంలో బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభించాలని 23-6-2001న జీవో నెం-76 ద్వారా అనుమతి ఇచ్చింది. అయితే, అప్పట్లో ఇక్కడ వౌలిక వసతులు, సరిపడా ఉపాధ్యాయుల్లేరనే సాకుతో ఆ ఏడాది బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ, స్థానిక జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు సుముఖత చూపకపోవడంతో ఉత్తర్వు కాస్త అమలుకు నోచుకోలేకపోయింది. మరుసటి ఏడాది కూడా ఎవరూ కూడా పెద్దగా స్పందించకపోవడంతో ఆ ఉత్తర్వు కాస్త ఉత్తదిగా మారిపోయింది. అయితే, గత కొనే్నళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో బాలుర సంఖ్య తగ్గడం.. బాలికల సంఖ్య పెరగడంతో తాజాగా ఈ పాఠశాలలో బాలికల సంఖ్య 316కు చేరగా బాలుర సంఖ్య 228 మాత్రమే. పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులు నిర్వహిస్తుండగా ఒక్కో తరగతికి ఏ,బి సెక్షన్లు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతిలో బాలుర సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. గడచిన విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్ధుల సంఖ్య ఇలా ఉంది. 6వ తరగతిలో 43 మంది బాలురుండగా, 66 మంది బాలికలున్నారు. అలాగే 7వ తరగతిలో 38 మంది బాలురు, 28 మంది బాలికలు, 8వ తరగతిలో 46 మంది బాలురు, 57 మంది బాలికలు, 9వ తరగతిలో 45 మంది బాలురు, 80 మంది బాలికలు, 10వ తరగతిలో 51 మంది బాలురు, 65 మంది బాలికలున్నారు. ఈ పాఠశాలలో బాలికల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నా ఇక్కడ బాలికలకు ప్రత్యేక ఉన్నత పాఠశాల ఏర్పాటులో అటు అధికారులు.. ఇటు ప్రజా ప్రతినిధులు దృష్టిసారించకపోవడంతో కేసముద్రం మండల కేంద్రంలో పుష్కరకాలం నుంచి బాలికల పాఠశాల కలగానే మిగిలిపోయంది. ఒకే తరగతి గదిలో చదువుకోవడానికి బాలికలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాగా, ప్రభుత్వం గత కొనే్నళ్లుగా తరగతి గదుల నిర్మాణానికి నిధులు విడుదల చేయడంతో తరగతి గదుల కొరతలేదు. అలాగే, పాఠశాలలో ప్రస్తుతం ప్రతి తరగతికి రెండేసి సెక్షన్లు ఏర్పాటు చేసింది. పాఠశాలలో ప్రస్తుతం ఇంగ్లీష్ టీచర్లు ముగ్గురు, ఫిజిక్స్ ఇద్దరు, గణితం ముగ్గురు, బయోలజీ ముగ్గురు, తెలుగు పండిట్ (1) ఇద్దరు, తెలుగు పండిట్ (2) ఒక్కరు, హిందీ పండిట్ (1) ఒక్కరు, సాంఘిక శాస్త్రం ఇద్దరేసి చొప్పున విద్యా బోధనకు ప్యానెల్‌గ్రేడ్ హెడ్మాష్టర్, ఫిజికల్ డైరెక్టర్‌తో కలిపి 19 మంది ఉపాధ్యాయులున్నారు. అలాగే, ఇద్దరు బోధనేతర సిబ్బంది ఉన్నారు. ఫలితంగా విద్యాబోధనకు అవసరమైన ఉపాధ్యాయుల కొరత కూడా లేకపోవడంతో బాలికల ఉన్నతపాఠశాల ఏర్పాటుకు ఎటువంటి ఆటంకం లేదు. వీటికితోడుగా పాఠశాలలో రెండు పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన ఆటస్థలానికి, ఇతర వౌలిక వసుతులకు కూడా సరిపడా స్థలం ఉంది. అటు విద్యాశాఖ ఉన్నతాధికారులు.. ఇటు ప్రజాప్రతినిధులు స్పందిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తే.. బాలికల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పకతప్పదు.

రైతు సంక్షేమానికి కృషి
మహబూబాబాద్, మే 9: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను, సబ్సిడీలను ప్రవేశపెట్టిందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రద్యుమ్న అన్నారు. గురువారం స్థానిక బాలాజీ గార్డెన్‌లో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్ చాలా బాగున్నాయని, వీటి ద్వారా రైతులకు పంటలు, విత్తనాల మీద మంచి అవగాహన వస్తుందని అన్నారు. రైతు చైతన్య యాత్రలు రైతు సదస్సుల ద్వారా వ్యవసాయదారులకు, రైతులకు పథకాల గురించి సబ్సీడీల గురించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలో తదితర అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు రైతులు ముందస్తుగా మెళకువలు నేర్చుకొని లాభాలు గడించాలని అన్నారు. మహబూబాబాద్ ఆర్డీఓ బిక్షానాయక్ మాట్లాడుతూ రైతులు ఖరీఫ్‌కు అమవైన విత్తనాలనే ఎంపిక చేసుకోవాలని, వాటిని కోనుగోలు చేసుకునే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అన్నారు. గ్రామాల్లోని ఆదర్శ రైతులకు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆర్డీఓ అన్నారు. నూతన వ్యవసాయ విధానాలు అవలంబించడం పై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. సేంద్రియ ఎరువుల వాడడంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎ. నాగేశ్వర్‌రావు, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసోర్చ్ విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ జెడి సుధాకర్, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ శశివర్ధన్ రెడ్డి, ఎడిఎ లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల ఎడిలు, ఏఓలు, శాస్తవ్రేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

జూన్‌లో తెరాస బయ్యారం పాదయాత్ర
ఖానాపురం, మే 9: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బయ్యారం, గూడూరు, బీమదేవరపల్లి అటవీ ప్రాంతాల్లోని ఇనుప ఖనిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ టిఆర్‌ఎస్ మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. జూన్ రెండవ వారంలో కరీంనగర్ జిల్లా బీమదేవరపల్లి నుండి ఖమ్మం జిల్లా బయ్యారానికి మహాపాదయాత్ర చేపట్టేందుకు నిర్ణయించింది. పార్టీ ఎంపి విజయశాంతితో పాటు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 40 మంది పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీలోని సభ్యులంతా పాదయాత్రలో పాల్గొంటారు. ఈమేరకు గురువారం ఖానాపురం మండల కేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని ఇనుప ఖనిజాన్ని సీమాంధ్రకు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అహంకార పూరిత వైఖరికి నిరసనగా భూకంపం సృష్టించే ఆందోళనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. భీమదేవరపల్లి నుండి ప్రారంభమయ్యే మహాపాదయాత్ర దాదాపు ఎనిమిది నుండి పది రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రతి రోజు పాదయాత్ర బృందం వెంట ఐదువేల పైచిలుకు తెలంగాణవాదులు పాల్గొంటారని తెలిపారు. భీమదేవరపల్లి నుండి పరకాల, శాయంపేట, మల్లంపల్లి, నర్సంపేట, గూడూరు, మహబూబాబాద్‌ల మీదుగా బయ్యారం వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. పాదయాత్ర ముగింపు రోజు లక్షమందితో భారీ బహిరంగసభ బయ్యారంలో ఉంటుందన్నారు. ఈ మేరకు కెసిఆర్ మహాపాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కమిటీని ఖరారు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, బానోతు సంగూలాల్‌లు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సిపికి గుడ్‌బై చెబుతారా? * ‘జంప్’ కాంగ్రెస్ వైపా... బిజెపి వైపా!?
english title: 
konda couple

చేపల చెరువులను క్రమబద్ధీకరించకుంటే ధ్వంసం

$
0
0

ఏలూరు, మే 9 : జిల్లాలో జూన్ 15వ తేదీ లోగా క్రమబద్దీకరించుకోని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం చేపల చెరువులు, ఆధార్, రెవిన్యూ సదస్సు, భూ పంపిణీ తదితర కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలతో చేపల, రొయ్యల చెరువులుండాలని, ఆ నిబంధనల మేరకు చేపల, రొయ్యల చెరువులను ఏర్పాటు చేసి క్రమబద్దీకరణకు జూన్ 15వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 15వ తేదీ లోగా క్రమబద్దీకరించుకోని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అనధికార చేపల, రొయ్యల చెరువుల వివరాలను వెంటనే సమర్పించాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ప్రజలందరికీ తెలియజేసేందుకు గ్రామీణ స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంతేకాక వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. మండల పరిధిలో ఎన్ని ఎకరాలలో చేపల చెరువులున్నాయి, వాటిలో నిబంధనల మేరకు ఎన్ని చెరువులున్నాయి, నిబంధనల మేరకు లేని చేపల చెరువులున్నాయన్న విషయాలపై నివేదికలను వెంటనే సమర్పించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. జూన్ 15వ తేదీ అనంతరం నిబంధనల మేరకు లేని చేపల, రొయ్యల చెరువులను ధ్వంసం చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లాలోని ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు కేంద్రాలను ఏర్పాటు చేసి కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ కార్డుల జారీకి ప్రతీ మండల కేంద్రంలో రెండుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తహశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన రెవిన్యూ సదస్సులలో అందిన ప్రతీ విజ్ఞప్తిని పరిష్కరించాలన్నారు. రెవిన్యూ సదస్సులలో 14 వేల దరఖాస్తులందాయని, వాటిలో ఇంకా అయిదు వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని కూడా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, మండల పరిధిలో అర్హులైన కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు అందించాలని కలెక్టర్ తహశీల్దార్లను ఆదేశించారు. ఏడవ విడత భూ పంపిణీలో పేదలకు భూమి పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూముల వివరాలను వెంటనే అందించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, డి ఆర్‌వో ఎం మోహనరాజు, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, సత్యనారాయణ, సూర్యారావు, వసంతరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి లక్ష్మీనారాయణ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సలీంఖాన్, మత్స్యశాఖ ఉపసంచాలకులు కృష్ణమూర్తి, నిక్‌నెట్ అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమకు పచ్చతోరణం
*పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక*కలెక్టర్ వాణీమోహన్
ఏలూరు, మే 9 : ఎస్‌సి, ఎస్‌టిల రైతులతో పాటు నిరుపేద రైతులకు చేయూతనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమానికి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడిసిలో గురువారం ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమంపై ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ తహశీల్దార్లు, ఎంపిడివోలు, ఐకెపి సిబ్బంది తదితరులతో వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి ప్రాధాన్యతనివ్వడంతోపాటు ఉద్యాన పంటలు ప్రోత్సహించేందుకు ఎస్‌సి, ఎస్‌టి రైతులతో పాటు నిరుపేద రైతులకు చెట్లు పట్టాలిచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో మే నెలాఖరులోపు గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, రహదార్లు, కాలువగట్లపైన, నీటి పారుదల శాఖకు చెందిన నిరుపయోగంగా వున్న భూములు, విద్యాసంస్థలు, అటవీ హక్కుల చట్టం కింద పంపిణీ చేసిన భూముల వివరాలను యుద్ధప్రాతిపదికపై సంబంధఙత తహశీల్దార్లు సేకరించాలన్నారు. ఈ పధకానికి సంబంధించి ఒక్కొక్క లబ్ధిదారునకు 200 మొక్కలను అందించడం జరుగుతుందని, ఈ పధకానికి సంబంధించి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకం కింద నిధులు కేటాయింపు జరుగుతుందన్నారు. ఒక్కొక్క మొక్కకు 35 రూపాయలు, నీటి వసతికి 15 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ఈ పధకంలో లబ్ధిదారుల ఎంపికను గ్రామసంఘాలు చేపడతామని అయితే ఉపాధి హామీ పధకంలో జాబ్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కులాలకు చెందిన వారు, నిరుపేద రైతులు, ఉపాధి హామీ కింద 20 రోజుల పాటు ఉపాధి పనులు చేసి ఉండాలన్నారు. జిల్లాకు అవసరమైన ఉద్యాన మొక్కలను ముందస్తుగానే సిద్ధం చేసుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఉద్యానశఋ౎ఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. జూన్ 1 తరువాత ఈ పధకం అమలులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమం అమలు తీరుపై సంబంధిత మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద ఫలసాయాన్నిచ్చే మొక్కలను నాటుకుని అభివృద్ధి పరుచుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల భూములకు అనుగుణంగా ఫలసాయాన్నిచ్చే మొక్కలను సరఫరా చేయవలసి వుంటుందన్నారు. జిల్లాలో గత ఏడాది పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి మూడు మొక్కలు చొప్పున ఇందిరమ్మ కాలనీలలో లక్ష మొక్కలను నాటామని, పాఠశాలల్లో 75 వేల పండ్ల మొక్కలను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పది లక్షల మొక్కలు నాటామన్నారు. ఏటిగట్లపై కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
జిల్లా నిర్మల్ భారత్ అభియాన్ కింద పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పధకం కింద ఒక్కొక్క వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి పది వేల రూపాయలు అందిస్తున్నదని దీనిని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు యుద్ధప్రాతిపదికపై వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అదే విధంగా ఇందిర జలప్రభ, నిర్మల్ భారత్ అభియాన్ పధకాల తీరుపై ప్రత్యేకంగా సమీక్షిస్తానన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు మాట్లాడుతూ ఇందిరమ్మ పచ్చతోరణం పధకం అమలుపై సంబంధిత అధికారులకు అవగాహన పర్చాలనే ఉద్దేశ్యంతో గురు, శుక్రవారాలలో ప్రత్యేక వర్కుషాపును నిర్వహిస్తున్నామన్నారు. ఖాళీగా వున్న ప్రభుత్వ స్థలాలలో పండ్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పధకంతో అనుసంధానించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమం ద్వారా మొక్కలను పెంచి పెద్ద ఎత్తున వనాలను అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని నిస్వార్ధంగా నిర్వహించాలన్నారు. అయిదు సంవత్సరాల కాల పరిమితితో కూడిన ఈ పధకంపై పూర్తి అవగాహన పొందాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఐకెపి సిబ్బంది ప్రత్యేక బాధ్యత వహించాలన్నారు. ఇప్పోటికే ఐకెపి భూమి వెబ్‌సైట్‌లో 26 మండలాల భూమికి సంబంధించిన వివరాలు ఉంచడం జరిగిందని మిగిలిన 20 మండలాల్లో కూడా వివరాలు సేకరించి వెబ్‌సైట్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఉత్పాదకత నిచ్చే మొక్కలను అందజేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఇ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ సి ఇవో నాగార్జునసాగర్, హౌసింగ్ పిడి సత్యనారాయణ, డి ఆర్‌డి ఎ పిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలిగా మాలతీరాణి
ఉంగుటూరు, మే 9: రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రెండోసారి కూడా శరణాల మాలతీరాణికే అవకాశం దక్కింది. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారని శరణాల మాలతీరాణి తెలిపారు. గురువారం ఆమె మండల కేంద్రమైన ఉంగుటూరులో స్థానిక విలేఖరులతో మాట్లాడారు. గతంలో మహిళా సమస్యల మీద, మహిళా కమిషన్‌కోసం మహిళా మోర్చా అనేక ఉద్యమాలు చేపట్టిందని ఈ సందర్భంగా మాలతీరాణి చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలపై లైంగిక దాడులు అరికట్టడానికి, పాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపించేందుకు కృషిచేస్తున్నట్టు మాలతీరాణి వెల్లడించారు. భ్రూణ హత్యల నివారణకు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, స్కానింగ్ సెంటర్లపై నియంత్రణ ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్ట సభలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ సాధించేందుకు, చట్టాలపై మహిళలకు కనీస అవగాహన కల్పించడమే లక్ష్యంగా బిజెపి మహిళా మోర్చా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగానే మహిళలకు శిక్షణా తరగతులను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టపరచి మహిళా సమస్యల పరిష్కారానికి కృషిచేయడం ముఖ్యోద్దేశమని మాలతీరాణి తెలిపారు.

గుణ్ణంపల్లిలో కిష్కింధకాండ
* వానరాలు దాడి డాబాపై నుండి మహిళలకు తీవ్రగాయాలు*ఇళ్లు ధ్వంసం: భీతిల్లుతున్న చిన్నారులు
ద్వారకాతిరుమల, మే 9: వానరాలు దాడి చేయటంతో ఒక మహిళ డాబాపై నుండి కిందపడటంతో ఆమె రెండుకాళ్లూ విరిగాయి. మండలంలోని గుండంపల్లిలో గురువారం ఉదయం కేతిరెడ్డి దుర్గ అనే మహిళ డాబాపై బట్టలు ఆరేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ గ్రామంలో ప్రతి నిత్యం మహిళలు, చిన్న పిల్లలపై వానరాలు దాడి చేస్తున్నాయని, అలాగే ఇళ్లను సైతం ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. తెల్లవారుతోందంటే ఏ కోతి మూక తమపైనా, తమ ఇళ్లపైనా దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమని గడుపుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. దూబచర్ల, నల్లజర్లలోని అటవీ ప్రాంతాలు దగ్ధం కావటం, చెట్లను నరికివేయటం వంటి కారణాల వల్ల అడవుల్లో ఉండవలసిన వానరాలు ఊళ్లపై పడ్డాయి. ఈ క్రమంలో గత నెల రోజులుగా అధిక సంఖ్యలో వానరాలు గుండంపల్లి వాసులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. గత వారం రోజులుగా అవి జరుపుతున్న దాడులలో గ్రామానికి చెందిన బళ్లారి సన్యశ్రీ, శిల్పారెడ్డి మంగాయమ్మ, నక్కా గంగమ్మతోపాటు పలువురు చిన్నారులు గాయపడ్డారు. నక్కా గంగమ్మ వీపుపై కోతి కరవటంతో ఆసుపత్రిలో కుట్లు వేయించుకుంది. తాజాగా దుర్గ బట్టలు ఆరేస్తుండగా వానరాలు అకస్మాత్తుగా దాడిచేయటంతో ఆమె డాబాపై నుండి కిందపడింది. అక్కడే పొయ్యి రాళ్లు ఉన్నా ఆమె పక్కనే పడటంతో రెండు కాళ్లు విరిగి ఆమె ప్రాణాలు నిలిచాయి. అధికారులు స్పందించి వానరాలు అరికట్టేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

జిల్లాలో అటవీ హక్కుల చట్టం కింద
2715 ఎకరాలు పంపిణీ
ఏలూరు, మే 9 : జిల్లాలో అటవీ హక్కుల చట్టం కింద 1241 మందికి 2715 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు చెప్పారు. ఏలూరులో గురువారం అటవీ హక్కుల చట్టం అమలుతీరుపై జంగారెడ్డిగూడెం ఆర్డీవోతో ఆయన చర్చించారు. ఎన్నో దశాబ్ధాల నుండి అటవీ భూములను నమ్ముకుని సేద్యం చేస్తున్న పేదలను గుర్తించి ప్రభుత్వం తొలి దశగా 1189 మందికి 2645 ఎకరాల భూమిని వ్యక్తిగత పట్టాలుగా జారీ చేయడం జరిగిందని, 52 మందికి కమ్యూనిటీ పరంగా 70 ఎకరాల భూమిని అందించినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో 12 మండలాల్లో 116 గ్రామ పంచాయితీల పరిధిలో అటవీ శాఖ ప్రాబల్యంలో భూములు ఉన్నాయని, వాటిని సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఎన్నో దశాబ్ధాల నుండి అటవీ భూములను నమ్ముకున్న గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం ప్రత్యేక అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తోందని చెప్పారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో అటవీ హక్కుల చట్టం క్రింద ఆదివాసులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. బుట్టాయిగూడెం మండలం రాజానగరం (మిగతా 6వ పేజీలో)
గ్రామ పంచాయితీ రెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన 83 మంది ఆదివాసులకు 156 ఎకరాల భూమి కేటాయించాలని దరఖాస్తు చేయగా వాటిని డివిజనల్ స్థాయి కమిటీ తిరస్కరించడంపై జిల్లా కమిటీకి ఆదివాసీ గిరిజనుల తరఫు న్యాయవాది పి త్రినాధరావు అప్పీలు చేసారని దాన్ని జిల్లాస్థాయి కమిటీ పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని జెసి చెప్పారు. ఆదివాసీల హక్కులను హరిస్తే తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని ఆదివాసీల తరఫు న్యాయవాది త్రినాధరావు స్పష్టం చేశారు. కొండరెడ్డిలకు సంబంధించి 83 దరఖాస్తులు గ్రామ సభ సిఫార్స్ చేసి డివిజన్ కమిటీకి పంపించిందని అయితే వారికి పట్టాలు ఇవ్వకుండా తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము న్యాయపరంగా పోరాడి ఆదివాసులకు అటవీ భూములు అందేలా చూస్తామని చెప్పారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో నాన్‌రాజు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కరాటంకు మంత్రి వసంత్ పరామర్శ
జంగారెడ్డిగూడెం, మే 9: డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబును గురువారం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్ పరామర్శించారు. రాంబాబు సోదరుడు కరాటం మురళి మృతి చెందిన వైనం విదితమే. పట్టణంలోని కరాటం మురళి ఇంటికి వచ్చిన మంత్రి వట్టి వసంతకుమార్ మురళితో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. మురళి కుటుంబ సభ్యులను, కుమారుడు కార్తీక్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. మురళి సోదరులు కరాటం రాంబాబు, వెంకటరెడ్డి నాయుడు, ఉమామహేశ్వరరావులకు సానుభూతి తెలిపారు. మురళి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. కరాటం కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో డిసిసిబి ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం) కూడా ఉన్నారు. కాగా, గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఎం.రమేష్ కరాటం మురళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరాటం రాంబాబు, ఆయన సోదరులు వెంకటరెడ్డి నాయుడు, ఉమామహేశ్వరరావులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఎస్పీ వెంట స్థానిక డియ్యస్పీ టి.రామకృష్ణారావు, సి.ఐ పి.మురళీరామకృష్ణ ఉన్నారు.

షర్మిల పాదయాత్ర విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మద్దాల
జంగారెడ్డిగూడెం, మే 9: చింతలపూడి నియోజకవర్గంలో ఈ నెల 12వ తేదీ నుండి జరగనున్న మరో వైఎస్‌ఆర్‌సి పార్టీ నేత షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన మండల స్థాయి వైఎస్‌ఆర్‌సి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 9 జిల్లాల్లో పూర్తి చేసుకుని 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా నుండి పశ్చిమగోదావరి జిల్లాలో గురుభట్లగూడెంలో ప్రవేశిస్తుందని తెలిపారు. గురుభట్లగూడెంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, వైఎస్‌ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి షర్మిలమ్మకు ఘనస్వాగతం పలకాలని కోరారు. 12వ తేదీ రాత్రి లింగగూడెం దాటిన తరువాత షర్మిల బస ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 13వ తేదీ ఉదయం 7 గంటలకు పాదయాత్ర మొదలవుతుందని రాఘవాపురం, డి.ఎన్.రావుపేట, పోతునూరు, మల్లాయగూడెం, సమ్మిటవారిగూడెంలలో పాదయాత్ర జరుగుతుందని, చింతలపూడికి దగ్గరలో రాత్రి బస ఉంటుందని తెలిపారు. 14వ తేదీన చింతలపూడి, తీగలవంచ, టి.నరసాపురం చేరుకుంటుందని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో 14, 15వ తేదీలలో టి.నరసాపురం మండలంలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు పాదయాత్ర కామవరపుకోట మండలం రావికంపాడు చేరుకుంటుందని తెలిపారు. అక్కడికి షర్మిల పాదయాత్రకు 150 రోజులు పూర్తవుతాయని, రెండు వేల కిలోమీటర్లు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయ కర్త మొవ్వా ఆనంద్ శ్రీనివాసరావు, చింతలపూడి నియోకవర్గ సమన్వయ కర్త డాక్టర్ కర్రా రాజారావు, పార్టీ నేతలు పోల్నాటి బాబ్జి, పాశం రామకృష్ణ, నులకాని వీరాస్వామినాయుడు, చనమాల శ్రీనివాసరావు, దల్లి తుకారంరెడ్డి, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, కేమిశెట్టి మల్లిబాబు పాల్గొన్నారు.

హాకీకి పూర్వవైభవానికి యువ క్రీడాకారులు కృషి చేయాలి
భీమవరం, మే 9: హాకీ భవిష్యత్తు క్రీడాకారులపై ఉందని, హాకీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు యువ క్రీడాకారులు కృషి చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం స్థానిక భారతీయ విద్యాభవన్స్‌లో జరుగుతున్న మల్లినీడి సత్యనారాయణమూర్తి మెమోరియల్ మూడవ ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఇందులో చిత్తూరు జిల్లా జట్టు విజేతగా నిలిచింది. కడప - చిత్తూరు మధ్య జరిగిన 3-2 స్కోరుతో చిత్తూరు జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. మూడవ స్థానంలో నిజామాబాద్, నాల్గవ స్థానంలో విశాఖపట్నం జట్లు నిలిచాయి. ద్వితీయ స్థానం పొందిన కడప జట్టుకు ఎసిబి డిఎస్పీ ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య దాత మల్లినీడి సుధాకర్ మాట్లాడుతూ తన తండ్రి పేరుమీద ప్రతి ఏటా పోటీలు నిర్వహిస్తానన్నారు. ఎక్సైజ్ ఆఫీర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు భారతదేశ కీర్తిప్రతిష్టలు పెంచిన జాతీయ క్రీడ హాకీ అన్నారు. దీనిని మరింత వృద్ధిచేయాల్సిన బాధ్యత క్రీడాకారులపై ఉందన్నారు. జిల్లా హాకీ కార్యదర్శి జి సతీష్‌బాబు, గోపన్నపాలెం వ్యాయామ కళాశాల పిడి శ్యామల, ఆరేటి ప్రకాష్, ఆదిరెడ్డి సత్యనారాయణ, భవన్స్ డైరెక్టర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

డిసిసిబి బ్రాంచిల కంప్యూటరీకరణతో ఉత్తమ సేవలు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు రత్నం
దేవరపల్లి, మే 9: జిల్లాలో అన్ని డిసిసిబి బ్రాంచిలను కంప్యూటరీకరించి రైతులకు, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు (రత్నం) వెల్లడించారు. గోపాలపురంలో గురువారం సాయంత్రం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పోతుల రామతిరుపతిరెడ్డిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రత్నం మాట్లాడుతూ నాబార్డు ఆదేశాల మేరకు జిల్లాలో 25 సొసైటీలను ఎంపికచేసి మోడల్ సొసైటీలుగా అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఎంపిక చేసిన సొసైటీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులను అభివృద్ధి చేయనున్నట్టు రత్నం చెప్పారు. సహకార రంగంలోగల లోటుపాట్లను అధ్యయనం చేయడానికి, ఇతర పరిస్థితులను తెలుసుకోడానికి తాను ఇటీవల సిక్కిం, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించినట్టు ఆయన తెలిపారు. సిక్కింలో అధిక శాతం గిరిజన జనాభా ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవడం వల్ల సహకార రుణాలను వారు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. అదేవిధంగా బంగారంపై తక్కువ శాతం రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎంపిక చేసిన సొసైటీల్లో మంచి ఫలితాలు వచ్చినట్టయితే జిల్లాలో అన్ని సొసైటీలను మోడల్ సొసైటీలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గోపాలపురం డిసిసిబి బ్రాంచిలో సంవత్సరంన్నర క్రితం బంగారు రుణాలపై అవినీతి జరిగిందని, మరో 15 రోజుల్లో ఈ అవినీతిని పూర్తిస్థాయిలో వెలుగులోకి తెచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రత్నం స్పష్టం చేశారు. అంతకుముందు పోతుల రామతిరుపతిరెడ్డి మాతృమూర్తి సీతారాజేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉండవల్లి సుభాష్‌చంద్రబోస్, అడ్డూరి రామారావు, కురుకూరి నాగేశ్వరరావు, జ్యేష్ఠ సతీష్, కాసగాని గోపాలకృష్ణ గోఖలే, మద్దిశెట్టి అన్నవరం, మాకిరెడ్డి జానకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమలపై అమావాస్య ప్రభావం
ద్వారకాతిరుమల, మే 9: చిన వెంకన్న క్షేత్రంపై అమావాస్య తన ప్రభావాన్ని చూపింది. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడే శ్రీవారి క్షేత్రం గురువారం వెలవెలబోయింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగటం, తిథి ప్రభావ కారణంగా ఆలయంలోని అన్ని విభాగాలు దాదాపు ఖాళీగా కనిపించాయి. శ్రీవారి దర్శనం క్యూలైన్లు, ప్రసాదాల టిక్కెట్ల కౌంటర్లు, కేశ ఖండన శాల విభాగాలలో భక్తులు కానరాలేదు. భక్తులు లేని కారణంగా ఆలయ పరిసరాలలోని అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఖాళీగా కనిపించాయి. భక్తుల రద్దీతో నిత్యం కళకళలాడే బస్టాండ్ సైతం జనాల్లేక నిర్మానుష్యంగా మారింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావటంతోపాటు వైశాఖ మాసం ఆరంభం రోజైన శుక్ర, శనివారాల నుండి భక్తుల రద్దీ పెరగవచ్చునని ఆలయ వర్గాలు భావిస్తున్నాయి.

20 నుండి శ్రీవారి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు
ద్వారకాతిరుమల, మే 9: శ్రీవారి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఈ నెల 20నుండి 27వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు తెలిపారు. ఉత్సవాలు ప్రారంభం రోజైన 20వ తేదీన స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగానూ ముస్తాబు చేస్తారు. 21న ధ్వజారోహణ, 23న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీ రాత్రి 9గంటలకు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరుగనుంది. 25న రథోత్సవం, 26న శ్రీచక్రవారుయుత్సవం, ధ్వజారోహణ, 27న జరిగే శ్రీ పుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. శ్రీవారి కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 20నుండి 27వ తేదీ వరకూ ఆలయం నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దుచేస్తున్నట్లు ఇఒ త్రినాధరావు తెలిపారు.

కలెక్టర్ స్పష్టీకరణ
english title: 
collector

ఆన్‌లైన్ ద్వారా ట్రెజరీ చెల్లింపులు

$
0
0

విజయనగరం, మే 9: త్వరలో ట్రెజరీ ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్ చేయనున్నట్టు ట్రెజరీశాఖ రిటైర్డ్ డైరెక్టర్ బ్రహ్మయ్య చెప్పారు. ఇందుకోసం జిల్లాలో అధ్యయనం చేస్తున్నామని అన్నారు. 18 నెలల్లో అధ్యయనం పూర్తి చేసి ఆన్‌లైన్ ద్వారా సేవలు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో అధ్యయనం చేశామని, విజయనగరం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని రెండు రోజులపాటు 18 శాఖలకు సంబంధించిన ఖాతాలను పరిశీలిస్తామని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులతో మినీ కానె్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం (కాంప్రెహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారా ఎన్‌ఎపిఇఆర్‌సి సాఫ్ట్‌వేర్ నందు ప్రభుత్వ శాఖల వివరాలను నిక్షిప్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమైన తరువాత ఉద్యోగులు, పింఛనుదార్లు వారి సర్వీసు వేతనాలు, రావల్సిన బకాయిలు, పింఛను తదితర వివరాలను ఆన్‌లైన్ ద్వారాఎక్కడి నుంచైనా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు.
ఆన్‌లైన్ విధానం ద్వారా ట్రెజరీ చెల్లింపుల పద్దతి అమలైతే ప్రభుత్వ కార్యాలయాల ద్వారా కాగితాలపై బిల్లులు రాసి ట్రెజరీలో సమర్పించే పని ఉండదన్నారు. మొత్తం డేటా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చన్నారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో ఇద్దరేసి చొప్పున సాంఘీక సంక్షేమం, వైద్యశాఖ, ట్రెజరీ, డ్వామా, గిరిజన సంక్షేమం, ఆడిట్, ఇంజనీరింగ్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ తదితర శాఖలను సందర్శించి బడ్జెట్ విడుదల, మంజూరు తదితరవాటిపై వేర్వేరు హెడ్‌ల ద్వారా డ్రా చేసినపుడు ట్రెజరీ నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నట్టు చెప్పారు. ఈ బృందంలో రమణారావు, మహేష్‌కుమార్, రవికుమార్, త్యాగి, సురేంద్రనాద్ ప్రభ సభ్యులుగా ఉన్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ అధ్యయనానికి వచ్చిన బృందానికి శాఖలన్ని సహకరించి వారు కోరిన సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ నూతన వ్యవస్థలో ఉద్యోగులకు సత్వర సేవలు అందగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఇంటింటా సర్వే నిర్వహించండి: కలెక్టర్
విజయనగరం, మే 9: జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరంగా జరగాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అన్నారు. గురువారం తన చాంబర్‌లో వివిధ మండలాల తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా సర్వే నిర్వహించి శతశాతం ఓటర్లను నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డూప్లికేషన్ లేకుండా జాగ్రత్తపడాలన్నారు. ప్రతీ ఏటా 1.76 శాతం మంది 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసే అవకాశం ఉన్నందున జిల్లాలో సుమారు 16.17 లక్షల ఓటర్లలో మరో 30వేలు పెరిగే వీలుందన్నారు. అదే విధంగా 2 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉన్నందున 36వేల ఓటర్లు తగ్గే వీలుందన్నారు. ఈ రెండు అంశాలపై బూత్ లెవెల్ అధికారులు ప్రత్యేక దృష్టిసారిచి చేర్పులు, తొలగింపులు చేపట్టాలన్నారు. అదే విధంగా స్ర్తి పురుష నిష్పత్తి 1030:1000 ఉన్నందున దానిని కూడా ఓటరు నమోదులో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వలసలు, ఓటరు నమోదు చేసుకోని వారిపై కూడా దృష్టిసారించాలన్నారు. బిఎల్‌ఓలు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఇంటింటా సర్వే నిర్వహించి కొత్త ఓటర్లను గుర్తించాలన్నారు. అర్హత ఉన్న వారందరినీ ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు ఎన్నికల్లో కనీసం 95 శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. జనాభాలో 65 శాతం మంది ఓటర్లు ఉంటారని అంచనా ఉన్నందున ఓటరు జాబితా రూపొందించే సందర్భంలో దానిని దృష్టిలో పెట్టుకొని డూప్లికేషన్లను సరిచేసుకోవాలన్నారు. అదే విధంగా 60 శాతం కన్నా తక్కువ మంది ఓటర్లు ఉంటే ఓటర్లుగా నమోదు చేయించుకోని వారు ఉన్నట్టు గుర్తించాలన్నారు.
ఓటరు నమోదుకు కళాశాలలు, కొండ ప్రదేశాలు, ఎస్సీ కాలనీలు తదితర వాటిపై దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో జెసి శోభ, ఎజెసి హేమసుందర్, ఆర్డీవోలు రాజకుమారి, వెంకటరావు, మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.

గూడ్స్ ఇంజన్‌లో సాంకేతిక లోపం..ఆగిన పలు రైళ్లు
కొత్తవలస, మే 9 : మండలంలోని కంటకాపల్లి రైల్వే స్టేషన్‌లో గూడ్స్ ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఫ్లాట్‌ఫాం నెంబర్-2లో ఆగిపోయింది. దీంతో విశాఖపట్నం నుండి విజయనగరం వైపు వెళ్లే పలు రైళ్లు సుమారు గంటన్నర సమయం ఆగిపోయాయి. కొత్తవలస రైల్వే స్టేషన్‌లో విశాఖ-కోరాపుట్, రాయగడ పాసింజర్, సమతా, అలాగే బెంగుళూర్ నుంచి ఎన్నికల డ్యూటీ ముగించుకుని వచ్చి ఆర్మిడ్ స్పెషల్ పోలీస్ ట్రైనులు గంట సేపు ఆగిపోయాయి. ప్రయాణీకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సింహాచలం నార్త్ నుండి పవర్ ఇంజన్‌ను రప్పించి ఆగిఉన్న గూడ్స్‌ను ప్రక్క ట్రాక్‌కు మళ్లించారు. దీంతో మార్గం సుగమమైంది.

ఎంసెట్‌కు ప్రత్యేక బస్సులు
పార్వతీపురం, మే 9: విజయనగరం, విశాఖ నగరంలోని వివిధ క్యాంపస్‌లలో ఎంసెట్‌కు పార్వతీపురం డిపోనుండి ఐదు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఇక్కడి ఆర్టీసీ డిపోమేనేజర్ ఎన్‌వి ఎస్ వేణుగోపాల్ తెలిపారు. విజయనగరం నుండి ఎం వి జి ఆర్ కాలేజీకి రూ.10లు చార్జీ వసూలు చేస్తామన్నారు. అలాగే జె ఎన్ టియు, తదితర ఇంజనీరింగ్ కాలేజీల నుండి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్సుకు రూ.10లు కనీస చార్జీతో ఎక్స్‌ప్రెస్, డీలక్సు బస్సులలో అనుమతిస్తామన్నారు. ఈమేరకు ఆర్టీసీ ట్రాఫిక్‌వైజర్లను ఆయా ఇంజనీరింగు కాలేజిల వద్ద ఏర్పాటు చేసి, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. పార్వతీపురం, బొబ్బిలి నుండి విజయనగరం ఎం వి జి ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద దిగడానికి పది రూపాయల అదనపుచార్జీతో అనుమతిస్తామన్నారు.
‘రైతు సదస్సులకు భారీ ఏర్పాట్లు చేయాలి’
విజయనగరం, మే 9: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13న నిర్వహించనున్న రైతు సదస్సులకు జిల్లాలో రెండు డివిజన్లలో భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రవాణాశాఖా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. విజయనగరం డివిజన్ పరిధిలో 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో సభ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధగా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. సభకు హాజరయ్యేవారిక ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెడి లీలావతి, ఆర్టీవో మీరాకుమార్, ఎపిఎంఐపి పివో అశోక్‌కుమార్, డిపిఆర్‌ఓ గోవిందరాజులు, లీడ్‌బ్యాంక్ మేనేజర్, అటవీశాఖ, పట్టుపరిశ్రమ, సుగర్స్, ఉద్యానవనశాఖ, పశుసంవర్థకశాఖల అధికారులు పాల్గొన్నారు
వైభవంగా చందనోత్సవం
పార్వతీపురం, మే 9: పట్టణంలోని మెయిన్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ నర్సింహస్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి ఘనంగా చందనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ పూజారి గణపతి ప్రసాద్ పండా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ చందనోత్సవ కార్యక్రమం ఈనెల 12వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా 13 వతేదీన స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని ఆలయ పూజారి పండా తెలిపారు. అలాగే 14వ తేదీన స్వామివారి తిరువీధి ఉత్సవాలు పురవీధుల్లో జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు భుక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి ఆశీస్సులతో పాటు తీర్థప్రసాదములు స్వీకరించాలని ఆలయపూజారి గణపతి ప్రసాద్ పండా కోరారు.

‘వాస్తవాలను వక్రీకరించేందుకు ప్రయత్నించొద్దు’
విజయనగరం , మే 9: పట్టణంలో పలు అభివృద్ధిపనులకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు చేయ్యెద్దని స్థానిక ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజుకు ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సలహా ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులతో సమాధానాలు ఇప్పించారు. మున్సిపాలిటీలో నిధులు మురిగిపోయాయని, అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు ఏమాత్రం శ్రద్ధ చూపలేదని కొద్దిరోజుల క్రితం కోలగట్ల ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయానికి అశోక్ వెళ్లి నిధుల విషయమై ఆరా చేశారు. మున్సిపాలిటీలో నిధులు మురిగిపోతే తాను ప్రతిపాదించిన 127 పనులను ఎందుకు చేపట్టలేదని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామిని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ సమాధానం చెబుతూ మున్సిపాలిటీలో నిధులు మురిగిపోలేదన్నారు. ఈ వ్యవహారంలో అశోక్ స్పందిస్తూ కోలగట్లపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల నేపథ్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్సీ కోలగట్ల వచ్చి ఏయే పథకాల ద్వారా ఎంతెంతమేరకు నిధులు వచ్చాయో అకౌంటెంట్ లక్ష్మీనారాయణ బిసోయి ద్వారా సమాధానం ఇప్పించారు. తాను ఎమ్మెల్సీగా నియమితులైన రెండునెలల్లోనే 1.8 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధిపనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిళ్లా విజయకుమార్‌తోపాటు పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
డెంకాడ, మే 9 : వేసవి కాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఇక్కడి పిహెచ్‌సి వైద్యాధికారి నాగరాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో కనీస జాగ్రత్తలను పాటించాలని కాచివడపోని నీరు తాగాలని వడదెబ్బకు గురి కాకుండా ఎక్కువ నీరు తాగాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన గ్రామ సందర్శనలలో 70 వైద్య శిబిరాలు నిర్వహించామని, క్షయ వ్యాధిగ్రస్తులు 33 మంది ఉన్నారని, వారికి సక్రమంగా మందులు అందేలా చర్యల చేపడుతున్నామని, ప్రస్తుతం డయేరియా వంటి కేసులు ఏమీ లేవని, సంక్షేమ శస్త్ర చికిత్సలు మార్చి నాటికి 262 చేశామని నెలకు సుమారు 22 కేసులు చేస్తామని, ఓపి కూడా నెలకు 1400 నుంచి 1600 వరకు ఉంటుందని మందులు సక్రమంగా అందుతున్నాయని అలాగే ఆరోగ్య కేంద్రంలో ఎపిఓఎంఒ పోస్టు ఖాళీగా ఉందని పిహెచ్‌సి పరిధిలోని ఐదు ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయని అందులో అక్కివరం గ్రామంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం తప్ప సింగవరం పెదతాడివాడ గ్రామాల్లో ఉన్న వాటికి పక్కా భవనాల లేవని, 104 ద్వారా గ్రామాల్లో సక్రమంగా వైద్య సేవలు అందిస్తామని నెలలో మొదటి సోమవారం గంట్లాం, తమ్మాపురం, రెండవ సోమవారం గునుపూర్‌పేట, బెతనాపల్లి, రెండవ మంగళవారం బంటుపల్లి, గోడ్డుపాలెం, మూడవ మంగళవారం అక్కివరం గంట్లాం, రెండవ గురువారం డి.కొల్లాం, చోల్లంగిపేట, మూడవ గురువారం సింగవరాంల్లో పర్యటించి వైద్య సేవలు అందచేస్తున్నామని ఆయన తెలిపారు.

విమర్శలకు వేదికగా మారిన మున్సిపల్ కార్యాలయం
విజయనగరం , మే 9: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో రాజకీయపార్టీల నాయకులు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకుంటూ పత్రికలకెక్కారు. అయితే మున్సిపల్ కార్యాలయాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ హడావిడి సృష్టిస్తుండటం వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో పలు అభివృద్ధిపనులకు సంబంధించి గత కొన్నిరోజులుగా మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సమీక్షలు జరుపుతున్నారు. నెలరోజులపాటు ప్రతిరోజు అభివృద్ధిపనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వారం వారం బోరుబావిని ఏర్పాటుచేసేందుకు కూడా ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు నిర్లక్ష్యం వల్లే మున్సిపాలిటీలో నిధులు మురికిపోయాయని, పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపణలు చేశారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్టణాభివృద్ధి గురించి దృష్టిసారించానని, నిల్వ ఉన్న నిధుల ద్వారా అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు. దీనిలోభాగంగా గత కొన్నిరోజులుగా రోడ్డు, కాలువలు, కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్సీ శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే అశోక్‌గజపతిరాజుపై ఎమ్మెల్సీ కోలగట్ల చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై తెలుగుదేశం నాయకులు స్పందించారు. ఎమ్మెల్సీ ఆరోపణలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో అశోక్‌గజపతిరాజు, ఇతర నాయకులు బుధవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మురిగిపోయిన నిధుల గురించి ఆరా తీశారు. ఎంతమేరకు నిధులు మురికిపోయ్యే చెప్పాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామిని కోరారు. నిధులు మురిగిపోలేదని, నిల్వ ఉన్నాయని కమిషనర్ సమాధానం చెప్పారు. అయితే తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కార్యాలయాన్ని వేదికగా చేసుకోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండుపార్టీల నాయకులతీరు వల్ల అధికారులు ఇరకాటంలో పడుతున్నారు.

‘అమ్మహస్తం’కు తప్పని బాలారిష్టాలు!
గజపతినగరం, మే 9 : అర్హులైన లభ్ధిదారులందరికీ ప్రభుత్వం తొమ్మిది రకాల సరకులు సబ్సిడీపై అందించాలన్ని ఉద్దేశ్యంతో ప్రారంభించిన అమ్మహస్తం ఇంకా బాలరిష్టాలు దాటలేదు. ఇటీవల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పధకాన్ని ప్రారంభించారు. చౌక డిపోల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రారంభం నెలలోనే కొన్ని సమస్యలు ఉన్నాయని వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తామని హామీలు గుప్పించారు. అరకిలో పంచదార, కందిపప్పు కిలో, లీటరు పామోలిన్ ఆయిల్, చింతపండు అరకిలో, కారం పావుకిలో, పసుపు 100 గ్రాములు, గోదుపిండి, గోధుమలు కిలో వంతున, ఉప్పు కిలో పంపిణీ చేపడుతున్నారు. ఏప్రిల్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత జిల్లాలో 27 శాతం మంది లభ్ధిదారులకే పూర్తి సరకులు పంపిణీ చేశారు. ప్రతినెల పంచదార, పామోలిన్, కంది పప్పు, గోధుమలు, దుకాణాల ద్వారా పంపిణీ చేయగా పధకంలో అదనంగా మరో ఐదు రకాల వస్తువులు చేరినప్పటికి పంపిణీ చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారు. మండలంలో 16,140 తెలుపు కార్డులు ఉండగా అందులో అంత్యోదయ 1280, అన్నపూర్ణ 29 కార్డులు ఉన్నాయి. ఈనెల పౌరసరఫరాల గిడ్డంగికి తొమ్మిది సరకులకు గాను గోధుమలు, ఉప్పు రాలేదు. అంటే ఈనెలకు ఏడు రకాల సరకులు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ప్రతి నెల నాలుగు రకాల వస్తువులు వినహాయిస్తే ఈ పథకం ద్వారా మూడు రకాల సరకులనే ఇచ్చినట్లు అవుతుంది. గిడ్డంగికి గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు కలిపి పంచదార 220 క్వింటాళ్లు, కంది పప్పు 100 క్వింటాళ్లు, పామోలిన్ 25 వేల ప్యాకెట్లు, చింతపండు 10 వేల ప్యాకెట్లు, కారంపొడి 21 వేల ప్యాకెట్లు, పసుపు 3 వేల ప్యాకెట్లు గోధుమ పిండి 9 వేల ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈనెల కూడా 50 శాతం లబ్ధిదారులకు కూడా సరుకులు రాలేదు. వచ్చిన ఏడు రకాల సరకుల్లో కూడా సగానికిపైగా లబ్ధిదారులకు రాకపోవడంతో విమర్శలు గుప్పిస్తున్నారు.‘

ఓటరు నమోదు క్లయిమ్‌లు త్వరగా పరిష్కరించాలి
విజయనగరం, మే 9: ఓటరు నమోదు కోసం వచ్చిన కైయిమ్‌లను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. గురువారం రాత్రి ఆయన వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, ప్రతి ఓటరు ఇంటి నంబరు నమోదై ఉండాలన్నారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించి ఓటర్లు లేనట్టయితే వాటిని తొలగించాలని, ఇందుకు సంబంధిత బిఎల్‌ఒలు తనిఖీలు చేసి పేర్లను తొలగించాలని సిఇఒ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 2.20 లక్షలు ఓటర్లను సవరించడం ఇంకా మిగిలిన దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందన్నారు. ఇంటి ఇంటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేపట్టడం జరుగుతుందని, బిఎల్‌ఒలకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. అలాగే ఎపిక్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తక్కువ పోలింగ్ నమోదవుతున్న కేంద్రాల్లో దానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. జెసి శోభ, ఎజెసి హేమసుందర్ పాల్గొన్నారు.

త్వరలో ట్రెజరీ ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలను
english title: 
online

అందరి నేస్తం... భారత్

$
0
0

విశాఖపట్నం, మే 9: పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించాలని మన దేశం నిరంతరం ఆకాంక్షిస్తుందని రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. భారత కోస్ట్ గార్డ్ కోసం విశాఖలోని హిందుస్తాన్ షిప్ యార్డు తయారు చేసిన ఐసిజిఎస్ రాణి అవంతిబాయి నౌకను మంత్రి జితేంద్ర సింగ్ గురువారం జల ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా హిందుస్తాన్ షిప్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పొరుగు దేశాలతో సత్ సంబంధాలు కొనసాగించేందుకు భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ కృషి చేయాలని సూచించారు. ముంబై దాడుల తరువాత తీర ప్రాంత భద్రతను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. కోస్ట్‌గార్డ్ ద్వారా నిఘాను పటిష్ఠం చేశామని ఆయన తెలియచేశారు. ముఖ్యంగా మత్స్యకారులు తీర ప్రాంత భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతున్నారని ఆయన అన్నారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది కూడా మత్స్యకార గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. భారత నౌకా దళానికి అవసరమైన యుద్ధ విమానాలు, నౌకలను అనుకున్న లక్ష్యానికి ముందుగానే తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భారత వైమానిక దళంలో అత్యాధునిక జెట్ ఇంజన్లను వినియోగిస్తున్నామని మంత్రి జితేంద్ర సింగ్ తెలియచేశారు. ప్రపంచంలోని ఏడు, ఎనిమిది దేశాలు మాత్రమే ఈ ఇంజన్లను వినియోగిస్తున్నాయని ఆయన తెలియచేశారు. భారత నౌకాదళంలోని అత్యాధునిక, అతి భారీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య త్వరలోనే రానున్నదని ఆయన చెప్పారు. గత కొంత కాలంగా దీని నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, త్వరలోనే ఈ నౌకను జల ప్రవేశం చేయిస్తామని ఆయన చెప్పారు. ఇక లడక్‌లోని పరిస్థితి ప్రశాంతంగా ఉందని ఆయన వివరించారు. హిందుస్తాన్ షిప్‌యార్డు దేశంలోని ఇతర షిప్ యార్డుల నుంచి పోటీని తట్టుకుని, అత్యాధునిక నౌకలను తయారు చేయాలని అన్నారు.
ఇండియన్ కోస్ట్‌గార్డ్ డైరక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ అనురాగ్ జి తపలియాల్ మాట్లాడుతూ భారత తీర ప్రాంత భద్రతా దళం కొత్త తరహా పెట్రోలింగ్ వెసల్స్‌ను సమకూర్చుకుంటోందని అన్నారు. గురువారం జలప్రవేశం చేసిన రాణి అవంతిబాయి నౌక బహుళ ప్రయోజనాలు కలిగి ఉంటుందని అన్నారు. సముద్రపు దొంగలను తుదముట్టించడంతో పాటు ఆపదలో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు నౌకలో ఉన్నాయని అన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ 43 యుద్ధ నౌకలు, 26 బోట్స్,రి 60 ఎయిర్ క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోందని అన్నారు. 2009లో 22 కోస్ట్ గార్డ్ కేంద్రాలు మాత్రమే భారత సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవని, తాజాగా 19 కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సంవత్సరాంతానికి 42 కొత్త కోస్ట్‌గార్డ్ కేంద్రాలు సిద్ధమవుతాయని ఆయన చెప్పారు. కోల్‌కత్తాలో ఒక ప్రాంతీయ కోస్ట్‌గార్డ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తపలియాల్ తెలియచేశారు. అలాగే 46 రాడార్ కేంద్రాలను మొదటి దశలో ఏర్పాటు చేస్తున్నామని, రెండో దశలో 38 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియచేశారు.
నౌక విశేషాలు
ఐసిజిఎస్ రాణి అవంతిబాయి (ఇన్ షోర్ పెట్రోల్ వెసల్) 50 మీటర్ల పొడవు, 300 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది 30 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. భారత, ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని తయారు చేశారు. ఇందులో 30 మంది సిబ్బంది, ఐదుగురు అధికారలు ఉంటారు. ఈ నౌక విశాఖలోని కోస్ట్‌గార్డ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ నౌకకు కమాండింగ్ ఆఫీసర్‌గా కమాండెంట్ ఆశిష్ సిన్హా వ్యవహరిస్తారు.
ఈ కార్యక్రమంలో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ ఆర్‌కె మాధూర్, చీఫ్ నేవల్ స్టాప్ విమల్ కుమార్ శర్మ, హిందుస్తాన్ షిప్ యార్డు మేనేజింగ్ డైరక్టర్ ఎన్‌కె మిశ్ర తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఎస్‌ఎల్‌కు మంత్రి కితాబు
ఇదిలా ఉండగా హిందుస్తాన్ షిప్‌యార్డుకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్రర సింగ్ కితాబునిచ్చారు. దేశంలో అతి పెద్ద నౌకా నిర్మాణ కేంద్రాల్లో హెచ్‌ఎస్‌ఎల్ ఒకటని అన్నారు. ఇక్కడ యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేశంలో వివిధ నౌకా నిర్మాణ కేంద్రాల నుంచి వచ్చే పోటీని తట్టుకుని నిర్ణీత సమయం కన్నా, ముందుగానే నౌకలను తయారు చేసి ఇవ్వాలని ఆయన సూచించారు. హిందుస్తాన్ నౌకా నిర్మాణ కేంద్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేశారు. డిఫెన్స్ ప్రొడక్షన్స్ సెక్రటరీ మధూర్ మాట్లాడుతూ షిప్ యార్డు అభివృద్ధికి ఇప్పటికే 400 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే షిప్ యార్డుకు భారీ ఆర్డర్స్ ఇస్తామని అన్నారు.

మావో నేత వెంకటరమణ అరెస్ట్
అనకాపల్లి టౌన్, మే 9: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నక్సల్స్ దళాల సెంట్రల్ జోనల్ కమిటీ సభ్యుడు మార్పు వెంకటరమణ అలియాస్ జగదీష్‌ను అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకందిన సమాచారం మేరకు ఈస్ట్‌కోస్ట్ రైల్‌లో రాత్రి 9 గంటల తర్వాత అనకాపల్లి స్టేషన్ నుండి దిగి జగషీద్ వెళ్తుండగా ముందస్తు సమాచారం ప్రకారం అప్పటికే పహారా కాసిన అనకాపల్లి పట్టణ పోలీసులు జగదీష్‌తో పాటు మరో ముగ్గురు కొరియర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. జగదీష్ కాలికి తీవ్ర గాయమై కుంటుతూ నడుస్తుండగా అతన్ని, అతని అనుచరులను అనకాపల్లి డిఎస్పీ విఎస్‌ఆర్ మూర్తి, టౌన్ సిఐ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు అరెస్టు చేశారు. జగదీష్‌పై ప్రభుత్వం 20 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. గత నాలుగేళ్ళ కాలంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో వివిధ నక్సల్స్ దాడుల్లో జగదీష్ ప్రధాన పాత్ర వహించారు. శ్రీకాకుళం జిల్లా మందసకు చెందిన జగదీష్‌ను పట్టణ పోలీసులు మరింత సమగ్ర సమాచారం కోసం విచారిస్తున్నారు. స్థానిక వంద పడకల ఆస్పత్రిలో వైద్యచికిత్సలు జరిపి కోర్టుకు హాజరు పర్చారు. నక్సల్స్ దళ నాయకుడు అనకాపల్లిలో అరెస్టు కావడం పెద్ద సంచలనం కలిగించింది.

బిపిఎల్ కొళాయి కనెక్షన్ ఇక ఫ్రీ
* దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాలకు ఊరట
* నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం

విశాఖపట్నం, మే 9: దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాలకు ప్రభుత్వ ప్రకటన ఊరట కలిగించింది. మండు వేసవిలో చల్లటి నిర్ణయాన్ని ప్రకటించింది. నగర పరిధిలో కొళాయి మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకున్న బిపిఎల్ వర్గాలకు ఉచితంగానే కనెక్షన్ మంజూరు చేసేందుకు జివిఎంసి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం 2.35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వర్గాలకు 1200 రూపాయలకే కొళాయి కనెక్షన్ జివిఎంసి మంజూరు చేస్తోంది. అయితే గత కొంతకాలంగా వీటి మంజూరును నిలిపివేశారు. ఇప్పటి వరకూ జివిఎంసి వద్ద బిపిఎల్ కింద కనెక్షన్ కోరుతూ 12 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి ఉచితంగా కొళాయి కనెక్షన్ మంజూరు చేయాలంటే 1.44 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో 12వేల కనెక్షన్లను మంజూరు చేసేందుకు వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు.

బెంగుళూరుకు మరో ఎసి బస్
విశాఖపట్నం, మే 9: ప్రయాణీకుల నుంచి వచ్చిన స్పందనతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగుళూరుకు మరో ఎసి బస్‌ను నడిపేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే ఇంద్ర సర్వీసును ప్రతి రోజు నడుపుతున్న ఆర్టీసీ మరో సర్వీసును నడిపేందుకు నిర్ణయించారు. అలాగే బెంగుళూరులో జరిగే కెసెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఒక ఎసి సర్వీసును నడపనున్న ఆర్టీసీ రద్దీ దృష్ట్యా మరో గరుడ సర్వీసును నడపనున్నట్టు ఆర్టీసీ డిసిటిఎం జీవన్ ప్రసాద్ తెలిపారు.

హిందూస్థాన్ షిప్‌యార్డుకు
పాతికవేల కోట్ల ఆర్డర్లు
* రక్షణశాఖమంత్రి హామీపట్ల టిఎస్సార్ హర్షం
విశాఖపట్నం, మే 9: హిందుస్థాన్ షిప్‌యార్డు సంస్థకు రూ.25 వేల కోట్ల మేర ఆర్డర్లు లభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డికి హామీనిచ్చారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌తోపాటు టిఎస్సార్ షిప్‌యార్డులో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ హామీనివ్వడంపట్ల సుబ్బరామిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. రూ. 25వేల కోట్ల ఆర్డరర్లు హెచ్‌ఎఫ్‌ఎల్‌కు దక్కడం ద్వారా సంస్థకు పూర్వ వైభవం రాగలదని టిస్సార్ పేర్కొన్నారు. దీంతో సంస్థ కష్టాల నుంచి బయటపడగలదన్నారు. ఆర్డర్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న టిఎస్సార్‌ని ఇంటక్ నాయకులు గడసాల అప్పారావు అభినందించారు.

దారుణం
గోపాలపట్నం, మే 9 : ఆర్థిక బాధలు, భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలతో ఓ గృహిణి ఇద్దరు పిల్లలతో కలసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరాసా వద్ద గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. నగరంలోని రైలేస్టేషన్‌లో బాక్స్‌బాయ్‌గా పని చేస్తున్న వెల్లంకి నాగేశ్వరరావు, భార్య నాగిని (30), ఇద్దరు కుమారులు మోహనకృష్ణ (11), తిరుమలరావు (9) రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. నాగిని చుట్టుపక్కల వారితో కలసి చిట్లు వేస్తుంటుందని, చిట్లు పాటిన వారు సమయానికి సొమ్ము చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోందని తెలిసింది. చిట్ పాడిన వారికి సొమ్ము చెల్లించకపోవడంతో వారి ఒత్తిడి పెరగడంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడుతుండేవారని తెలిసింది. బుధవారం ఉదయం భార్యాభర్తలు తగవు పడ్డారని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాగిని తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుండి బయటికి వెళ్లిందని బంధువులు తెలిపారు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుందని భర్త నాగేశ్వరరావు భావించాడు. కానీ ఉదయం కరాసా వద్ద రైల్వే పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న నాగిని, ఇద్దరు పిల్లల శవాలను చూసిన వ్యక్తుల ద్వారా నాగేశ్వరరావు తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారడు. రైల్వేపోలీస్ డిఎస్పీ, భీమారావు, సిఐ పార్థసారథి, ఎస్‌ఐ బి.వి. రమణ సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం, మే 9: నగరంలోని మర్రిపాలెం ప్రధాన రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలపాలైన ఓ యువతి మార్గ మధ్యలో, మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసి బస్సును డీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ విషాదకరమైన సంఘటన వివరాలివి.
జిల్లాలోని దేవరాపల్లి మండలం, పెదనందిపాలెం గ్రామానికి చెందిన కోట్ల నాయుడు(23), స్నేహితుడు యాసల ఎర్రినాయుడు(23)తో కలిసి గురువారం ఉదయం మోటారుబైక్‌పై నగరానికి చేరుకున్నారు. ఇక్కడ న్యూకాలనీలో ఉంటున్న దేవరాపల్లికి చెందిన కిల్లిదేవి(22) స్థానికంగా ఉన్న ఇళ్ళలో ఇంటి పనులు చేస్తూ కుటుంబం గడవడానికి సహాయ పడుతుంది. ఈమె తండ్రి వాచ్‌మ్యాన్‌గా పని చేస్తుండగా, తల్లి ఇళ్ళ పనులు చేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ తరుణంలో బైక్‌పై దేవరాపల్లి నుండి వచ్చిన కోట్లనాయుడు, ఎర్రినాయుడు న్యూకాలనీలో దేవిని కలిశారు. అనంతరం వీరు ముగ్గురు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మర్రిపాలెం మీదుగా కరాసా వైపు వెళ్తుండగా బైక్ ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేకు చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. దీంతో మోటారుబైక్ ఆర్టీసీ బస్సు కిందకు దూరిపోగా బైక్‌ను నడుపుతున్న కోట్లనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాయుడుతో పాటు బైక్‌పై ఉన్న ఎర్రినాయుడు, కిల్లి దేవి తీవ్రగాయాలై అపస్మారకస్థితిలో కిందపడి ఉన్నారు. సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఎర్రినాయుడు, దేవిలను ఆటోలో స్థానికులు కెజిహెచ్‌కు తరలించారు. మార్గమధ్యలో దేవి మృతి చెందగా, ఎర్రినాయుడు కెజిహెచ్‌లో చేర్చారు. సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎర్రినాయుడు రాత్రి 8గంటల సమయంలో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న మృతుల బంధువులు కెజిహెచ్ మార్చురీకి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం చేశామని, రెండో కుమార్తె అయిన దేవిని పెళ్ళి చేసి అత్తవారింటికి పంపుదామని ఆనుకున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని తల్లిదండ్రులు మార్చురీ వద్ద పెద్ద ఎత్తున విలపించారు. పోస్టుమార్టం సమయం దాటి పోవడంతో మూడు మృతదేహాలకు శుక్రవారం ఉదయం పోస్టుమార్టం చేయనున్నారు. ట్రాఫిక్ ఎస్సై సూర్యనారాయణ నేతృత్వంలో కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

షిప్‌యార్డు కార్మిక నేతలతో జితేంద్ర సింగ్ సమావేశం
విశాఖపట్నం, మే 9: దీర్ఘకాలిక సమస్యలతో కొనసాగుతున్న హిందుస్తాన్ షిప్‌యార్డును గాడిలో పెట్టేందుకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ నడుం బిగించారు. ఇప్పటికి వరకూ హెచ్‌ఎస్‌ఎల్ సమస్యలను ఢిల్లీలోనే కూర్చుని చర్చించేవారు. షిప్ యార్డులో కూర్చుని, కార్మిక సంఘాల నాయకులతో చర్చించడం ఇదే ప్రథమం. షిప్‌యార్డులో పనిచేస్తున్న కార్మికులకు జీత భత్యాలు తప్ప, బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. షిప్‌యార్డు యాజమాన్యం కూడా వీరికి న్యాయం చేయలేని దుస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మంత్రి జితేంద్ర సింగ్ గురువారం కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు.

నేడు ఎంసెట్
విశాఖపట్నం, మే 9: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్‌లో ప్రవేశాలకు గాను ఎంసెట్ 13 పరీక్ష శుక్రవారం నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్షల నిర్వాహణకు సర్వం సిద్ధంచేశారు. జిల్లా వ్యాప్తంగా 24,212 మంది ఎంసెట్ పరీక్ష రాయనున్నారు. వీరిలో 18,491 మంది ఇంజనీరింగ్, 5721 మంది అగ్రికల్చర్, మెడిసిన్ ఎంట్రెన్స్ రాయనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మెడిసిన్ ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. పరీక్షల నిర్వాహణుకు గాను జిల్లా వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిముషం ఆలస్యమైనా అభ్యర్ధులను పరీక్షకు అనుమతించరు. పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టిన అభ్యర్ధిని గడువు ముగిసేంత వరకూ బయటకు పంపరు. పరీక్షకు బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఆన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ వెంట అప్లికేషన్ తీసుకురావాలి. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. అలాగే ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు తమ వెంట కులధృవీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది.
ఎంసెట్‌కు ఆర్టీసీ 150 బస్‌లు
ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం రాష్టర్రోడ్డురవాణా సంస్థ 150 ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. రూరల్ జిల్లాతో పాటు నగరంలోని అన్ని సిటీ డిపోల నుంచి బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ అధికారులు వారికి కేటాయించిన రూట్లలో ఎంసెట్ స్పెషల్ సర్వీసులను పర్యవేక్షిస్తారని ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్‌ప్రసాద్ తెలిపారు. అన్ని ప్రాంతాలను నుంచి ఎంసెట్ స్పెషల్ సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాల్సిందే
విశాఖపట్నం, మే 9: రైల్వే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమం రోజురోజకీ తీవ్రరూపం దాలుస్తోంది. తొలగించిన కార్మికులందరికీ కొత్త కాంట్రాక్టర్ పరిధిలోకి తీసుకుని కొనసాగించాలని కోరుతూ రైల్వే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గత పది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక రూపాల్లో చేపడుతున్న ఉద్యమాలకు రైల్వే అధికారులు, మరోపక్క కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో రోడ్డెక్కిన ఆందోళనకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. దీనికి సిఐటియు సంపూర్ణ మద్ధతునిస్తోంది. దీనిలోభాగంగా గురువారం సిపిఎం లోక్‌సభ ఫ్లోర్‌లీడర్ బాసుదేవ్ ఆచార్య డివిజనల్ రైల్వే మేనేజర్ అనిల్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న 261మంది స్వీపర్లు, క్వీనర్లు కాంట్రాక్ట్ కార్మికులను కొత్తగా వచ్చిన హర్యానా కాంట్రాక్టర్ గత నెల 29వ తేదీ నుండి పనుల నుండి తొలగించారన్నారు. కార్మికులు తమ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారన్నారు. ఎనిమిదేళ్ళ నుండి పనిచేస్తున్న పాత కార్మికులను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే డిఆర్‌ఎంను సిఐటియు నాయకులు విఎస్ పద్మనాభరాజు, పి.వెంకటరెడ్డి, ఎస్.జ్యోతీశ్వరరావు, ఎస్.కుమార్ కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. గతంలో సేవానగర్‌లో నివశించే వీరందర్నీ కాలనీ నుంచి ఖాళీ చేయించి కొమ్మాది, మధురవాడ ప్రాంతాలకు తరలించారన్నారు. సుదూర ప్రాంతాల నుండి తరలించడంతో అక్కడ నుంచి ఉద్యోగాల కోసం రావడం ఖర్చుతో కూడుకున్నదని ఆనాడే విన్నవించుకోవడం జరిగిందని, అయితే మునిసిపల్ అధికారులు, రైల్వే అధికారులు ఆ నాటికి కాంట్రాక్ట్ కార్మికులుగా రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న వారికి ఉపాధికి ఆటంకం లేకుండా చూస్తామని హామీనిచ్చి మరీ సేవానగర్ నుంచి ఖాళీ చేయించారన్నారు. అందువల్ల వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ 261మందికి ఇంత వరకు చేస్తున్న వీరి ఉపాధిని కొనసాగించేలా సానుభూతితో చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు బకాయి ఉన్న రెండు మాసాల జీతాన్ని కూడా చెల్లించాలని కోరారు. దీనికి స్పందించిన డిఆర్‌ఎం బకాయిలను చెల్లించే విదంగా తీసుకుంటామని హామీనిచ్చారు.

ఆశ కార్యకర్తల కలెక్టరేట్ ముట్టడి
విశాఖపట్నం, మే 9: ఆశలకు కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపి వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (ఆశ) ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోపలకు వెళ్ళేందుకు ప్రయత్నించడంతో పోలీసు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ క్రమంలో తోపులాట ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా చేతికందిన వారిని అందినట్టుగానే వ్యాన్‌లోకి ఎక్కించారు. ఈ విధంగా వందకు పైగా యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఆశలకు కనీస వేతనాలు నిర్ణయించి అమలు చేయాలని, సిహెచ్‌డబ్ల్యులకు గౌరవ వేతనం 400 నుండి రెండు వేలకు పెంచాలని, 104 వాహనాల డ్యూటీల 17 మాసాల బకాయిలను తక్షణం చెల్లించాలన్నారు. నాసిరకం యూనిఫారం బదులు 400లు చెల్లించాలని, జిల్లాలో యూనిఫారం కొనుగోళ్ళు, అదనపు వసూళ్ళపై చర్యలు తీసుకోవాలన్నారు. సర్క్యులర్ 134 ప్రకారం పెరిగిన పారితోషకాలు అమలు చేయాలని, ఆశపై అధికారులు, రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వి.సుబ్బాలమ్మ మాట్లాడుతూ జిల్లాలో ఆశ వర్కర్లగా గత ఏడేళ్ళుగా, కమ్యునిటీ హెల్త్ వర్కర్లగా 15 ఏళ్ళ నుండి పనిచేస్తున్నారన్నారు. వీరికి ఎటువంటి వేతనం ప్రభుత్వం చెల్లించడంలేదని, వీరితో అనేక పనులు చేయించుకుంటుందన్నారు. పెంచిన పారితోషకాలు అమలయ్యే పరిస్థితి లేదన్నారు. సిహెచ్‌డబ్ల్యూల యూనియన్ జిల్లా నాయకులు మంగమ్మ మాట్లాడుతూ కమ్యునిటీ హెల్త్ వర్కర్స్‌కు పల్స్‌పోలియో రోజుకు 225రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం వంద రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఆశలకు, కమ్యునిటి హెల్త్ వర్కర్లకు నెలకు కనీసం 500 రూపాయలు కూడా పారితోషికాలు రావడంలేదన్నారు. ఇచ్చిన పారిషోషకాలు రవాణా చార్జీలకే సరిపోతుందన్నారు. కేరళ రాష్ట్రంలో అయిదు వందలు గౌరవ వేతనం, పండుగ అలవెన్స్ 500 రూపాయలు ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా అలాగే ఇవ్వాలని, ఆశల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు
* భారీ విధ్వంసాలకు మావోలు వ్యూహరచన
* అప్రమత్తమైన పోలీసులు
కొయ్యూరు, మే 9: ఎ. ఓ.బి.లో భారీ విధ్వంసాలకు మావోయిస్టులు వ్యూహరచన చేస్తూ భారీగా తరలివచ్చారనే నిఘా వర్గాల సమాచారంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. గత కొన్ని నెలలుగా విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు అంతంతమాత్రంగా ఉండడంతో మన్య వాసులు శాంతియుత జీవనం సాగిస్తున్నారు. అయితే గత ఆదివారం రాత్రి మంపలోనూ, సోమవారం రాత్రి గూడెం మండలం పెదవలసలోనూ మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఇది మావోయిస్టుల పనా, లేక మిలీషియా సభ్యుల పనా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఎ. ఓ.బి. వదిలివెళ్ళిన మావోయిస్టు దళాలు తిరిగి విశాఖ ఏజన్సీకి చేరినట్లుగా నిఘా వర్గాల సమాచారం. కొయ్యూరు, గూడెం, చింతపల్లి మండలాల అటవీ ప్రాంతాలకు మావోయిస్టులు చేరి భారీ విధ్వంసాలకు వ్యూహరచన చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం రాత్రికిరాత్రే గ్రేహౌండ్స్, సి. ఆర్.పి. ఎఫ్, ప్రత్యేక పోలీస్ బలగాలు దింపి గాలింపు చర్యలు ఉదృతం చేసారు. దీంతో మన్యంలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి గిరిజనం బెంబేలెత్తుతున్నారు.

* పోలీసుల అదుపులో మార్పు వెంకటరమణ?
ఈస్ట్ డివిజన్ కమిటీ మాజీ కార్యదర్శి, మావోయిస్టు సీనియర్ నేత మార్పు వెంకరటమణ అలియాస్ లెంజో, అలియాస్ జగదీష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 2001 నుండి 2006 వరకు గాలికొండ ఏరియా కమిటీని బలపరిచి విశాఖ ఏజన్సీలో పోలీసులకు సింహాస్వప్నంగా మారిన జగదీష్ అనంతరం ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2008లో జరిగిన గునుకురాయి ఎన్‌కౌంటర్‌లో జగదీష్ కాలికి గాయం కావడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కాలి గాయానికి భువనేశ్వర్‌లో వైద్య సేవలు పొందుతుండగా పసిగట్టిన పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా వారి కన్నుగప్పి తప్పించుకున్నాడు. ఈనేపధ్యంలో కోరాపుట్, రాయగడల మధ్యలో మావోయిస్టుల శిక్షణా శిబిరానికి జగదీష్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించేలా పార్టీ నియమించినట్లు సమాచారం. ఇతనిపై భారత ప్రభుత్వం రివార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈశిక్షణా శిబిరంలోనే బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జగదీష్ పోలీసులకు చిక్కినట్లు, ప్రస్తుతం ఆయనను విశాఖకు తరలించి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జగన్‌కు బెయిల్ నిరాకరణకు నిరసనగా
వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల రాస్తారోకో

మునగపాక, మే 9: వైఎస్సార్ సిపి నేత వైఎస్ జగన్‌మోహన రెడ్డికి బెయిల్ రానందుకు నిరసనగా మునగపాకలో గురువారం అనకాపల్లి - పూడిమడక మెయిన్‌రోడ్డులో మండల పార్టీ నేతల ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, సిబిఐ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మం డల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చింనాయుడు మాట్లాడు తూ ప్రజానీకమంతా జగన్‌మోహన రెడ్డికి బెయిల్ వస్తుందని ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ, సిబిఐ, తెలుగుదేశం పా ర్టీలు కుట్రలు పన్ని బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించా రు. జగన్‌మోహనరెడ్డికి రాష్ట్రంలో ప్రజ ల నుండి లభిస్తున్న ఆదరణకు తట్టుకోలేకే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇలాంటి నీచమైన కుట్రలు పన్నుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ సిబిఐను తన జేబుసంస్థగా వాడుకుని జగన్‌మోహనరెడ్డిని ఇబ్బందులకుగురిచేస్తుందని ఆయన ఆరోపించారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా విజయమ్మకు మద్ధతుగా వైఎస్సార్ సిపి అభివృద్ధికి నిరంతరం కృషిచేయాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సిపి విజయకేతనం సాధించేందుకు కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా కృషిచేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సిపి నేతలు మళ్ల నాగసన్యాశిరావు, కాండ్రేగుల నూకరాజు, సింగర్ రాజు, శరగడం జగన్నాథరావు, కర్రి భాస్కరరావు, నరాలశెట్టిసూర్యనారాయణ, పల్లి నాయుడు, టెక్కలి కొండలరావు, భీశెట్టి ధనశ్రీను, బొడ్డేడ త్రినాథరావు పాల్గొన్నారు.

ఉన్నత ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
* మంత్రి బాలరాజు
చింతపల్లి, మే 9: రాష్టవ్య్రాప్తంగా ఉన్నత ఉద్యోగాలకు శిక్షణ పొందేందుకు 80 కోట్ల రూపాయలతో 28 శిక్షణ కేంద్రాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. గురువారం చింతపల్లి వచ్చి న ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒక్కొక్క శిక్షణ కేంద్రానికి మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తారన్నారు. విశాఖలో నిర్మించనున్న భవనానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. జిల్లాలో పాడేరు, పెదబయలు, చింతపల్లిలో ఈ భవనాలు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని కేంద్రాల్లో గ్రూప్ -1 నుండి గ్రూప్-4 వరకు వివిధ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 జాతీయ బ్యాంకులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో డుంబ్రిగుడలో బ్యాంకు ప్రారంభించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జి.కె.వీధిలో కూడా బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే వందకుపైగా వసతి గృహాలు మంజూరు చేశారన్నారు. వంద మంది విద్యార్థులుఉన్నచోట్ల వసతి గృహం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మీ-సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు 46 సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గడిచిన ఏడాది వెయ్యి కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టామన్నారు.
వడదెబ్బకు వృద్ధుడి మృతి
మునగపాక, మే 9: మండలంలో గల గణపర్తి గ్రామానికి చెందిన కోరిబిల్లి సోమునాయుడు(60) వడదెబ్బ తట్టుకోలేక గురువారం మృతి చెందాడు. సోమునాయుడు పొలంలో పనులు ముగించుకుని భోజనానికి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఎండ వేడిమికి తట్టుకోలేక పడిపోయాడని స్దానికులు చెబుతున్నారు. పడిపోయిన సోమునాయుడును సమీపంలో ఉన్న వ్యక్తులు అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమించడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలిస్తుండగా మరణించారని బంధువులు చెబుతున్నారు. ఈయనకు ముగ్గురు ఆడపిల్లలు భార్య ఉ న్నా రు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
‘దాడి’ స్వాగతానికి ఏర్పాట్లు
అనకాపల్లి టౌన్, మే 9: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సిపిలో చేరి మొదటిసారిగా విశాఖ జిల్లాకు విచ్చేస్తున్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైఎస్సార్ సిపి విశాఖ రూరల్ ప్రచార కమిటీ కన్వీనర్ పోతల ప్రసాద్ తెలిపారు. స్థానిక మళ్లా ప్లాజాలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు రూరల్ జిల్లా గ్రామాల నుండి మాజీమంత్రి దాడీ వీరభద్రరావుకు ఘనస్వాగతం పలికేందుకు కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు ఎయిర్‌పోర్టు నుండి భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనకాపల్లిలో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దెల వేణుకుమార్, కొత్తా గోపాలకృష్ణ, దాడి భానోజిరావు, మళ్ల రాజా, ఎస్‌విజి రమణాజీ గుప్తా, మద్దాల రమణబాబు, రాపేటి తాతారావు, కోరుకొండ రాఘవ పాల్గొన్నారు.
‘బోగస్ సంస్థల పట్ల అప్రమత్తం’
చోడవరం, మే 9: బోగస్ ఆర్థిక సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఎంటి ప్రసాద్ సూచించారు. గురువారం మండలంలోని గోవాడ గ్రామంలో ఆర్‌బిఐ ఆదేశాల మేరకు ఆర్థిక అక్షరాస్యత, రుణ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అధిక వడ్డీలు ఆశచూపుతున్న బోగస్ ఆర్థిక సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అటువంటి సంస్థల బారినపడి మోసపోవద్దని ఆయన అన్నారు. ఆర్‌బిఐ ధ్రువపత్రాలు కలిగిన ఆర్థిక సంస్థల్లోనే పొదుపు చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా ఇళ్లలో నగలు, ధనం ఉంచుకునే కన్నా బ్యాంకు లాకర్లలో దాచుకుంటే సురక్షితంగా ఉంటుందన్నారు. 500, వెయ్యిరూపాయల నకిలీ నోట్లు గ్రామీణ ప్రాంతాల్లో చెలామణి అవుతున్న దృష్ట్యా ప్రజలు జాగరూకతతో వ్యవహరించి అటువంటి నో ట్లను గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బిఐ డివిజనల్ మేనేజర్ డి.జయబా ల, టి. చంద్రమోహన్, కౌన్సిలర్ పివిరమణమూర్తి, ఎస్‌బిఐ బ్రాంచి మేనేజర్ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు కల్యాణి మండపం సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు
అనకాపల్లి టౌన్, మే 9: స్థానిక రింగురోడ్డులో గల కల్యాణి మండపం గత కొనే్నళ్లుగా వివాదాల్లో నెలకొని ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీమంత్రి దాడి వీరభద్రరావు కల్యాణి మండప నిర్మాణానికి సహకరించి అక్కడి స్థానికులకు తోడ్పాటునందించారు. ఈ క్రమంలో ప్రభుత్వం మారాక కల్యాణి మండపంలో ఫ్యాషన్ టెక్నాలజీ మహిళలకు నేర్పిస్తామని స్థానికుల వద్ద నుండి మున్సిపల్ అధికారులు అడిగి తీసుకోవడం జరిగింది. శిక్షణ కాలం పూర్తయిన అనంతరం ఈ కల్యాణి మండపాన్ని మీకు అప్పగించడం జరుగుతుందని అక్కడి స్థానికులకు, కమిటీ సభ్యులకు అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. అయితే అనుకున్నదొకటి అయినదొకటి ఇక్కడ జరిగింది. మున్సిపల్ అధికారులు కల్యాణి మండపం మాకే చెందుతుందని వారు స్వాధీనం చేసుకున్నారు. కల్యాణి మండపం కమిటీ సభ్యులైన ట్రస్టీ కన్వీనర్ కాశీరావు, ఏడువాకల సూరిబాబులు కోర్టులో పిటీషన్ వేయగా కోర్టు వీరికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. దీంతో మున్సిపల్ అధికారులు కల్యాణి మండపం అప్పగింఛడం జరిగింది. కమిటీ సభ్యులు, స్థానికులు గత నెల శ్రీరామనవమికి కల్యాణి మండపాన్ని ముస్తాబుచేసి శ్రీరామకళ్యాణం ఘనంగా నిర్వహించారు. అప్పటి నుండి కల్యాణి మండపం నిర్వహణ కమిటీ సభ్యులే నిర్వహిస్తున్నారు. మున్సిపల్ అధికారులు గురువారం కల్యాణి మండపం తమకు స్వాధీనం చేయాలంటూ రావడంతో కమిటీ సభ్యులు, అక్కడి స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. మున్సిపల్ అధికారులు పోలీస్ బందోబస్తుతో వచ్చి దౌర్జన్యంగా కల్యాణి మండపానికి తాళాలు పగులగొట్టి వారితాళాలు వేయడం జరిగింది. అలాగే దానికి కోర్టు నోటీసు కూడా అంటించడం జరిగింది. దీంతో కమిటీ సభ్యులు, స్థానికులు ఆగ్రహించి కమీషనర్ డౌన్‌డౌన్, గంటా శ్రీనివాసరావు డౌన్‌డౌన్ అంటూ నినాదాలుచేసారు. ఒక దశలోకమీషనర్‌తో వాగ్వివాదం చేసి కమీషనర్ బయటకువెళ్లకుండా అడ్డుకోవడంజరిగింది. కోర్టు ఉత్తర్వులు ఉంటే చూపించడంటూ 1997కోర్టు ఉత్తర్వులను చూపిస్తున్నారని, కొత్తగా వచ్చిన మా ఉత్తర్వులను మీకైమైనా వచ్చివుంటే అవి చూపించడంటూ వారు నిలదీయడం జరిగింది. ఈ కల్యాణి మండప స్థలం అనకాపల్లి అప్పన్న అనే వ్యక్తికి చెందినవని ఆయన కుమారుడు ట్రస్టీగా వ్యవహరిస్తున్నాడని, స్థలం మున్సిపాల్టీది కాకాపోయినా అధికారులు దౌర్జన్యంగా కల్యాణి మండపాన్ని స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమంటూ వారు నిలదీసారు.

పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు
english title: 
bharat

గాలిగోపురం మార్గాన్ని ఆపితేనే సామాన్యుడికి దర్శనం

$
0
0

సింహాచలం, మే 10: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి వారి నిజరూప దర్శనం (చందనోత్సవం) నిర్వహణ దేవాదాయశాఖ అధికారులకు ప్రతి సంవత్సరం సవాల్‌ను విసురుతోంది. రాష్ట్రంలోని వేరే ప్రధాన దేవాలయాల్లో నిశ్చింతగా ఉత్సవాలను నిర్వహించగలిగే అధికారులు సింహాచలం చందనోత్సవం అంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ నామ్‌కే వాస్తేగా దేవాదాయ శాఖ నిర్వహణ పెత్తనం అంతా రెవెన్యూ, పోలీసుశాఖలదే. ఎన్ని క్యూలైన్లు పెట్టిన, ఎన్ని టిక్కెట్లు ప్రవేశపెట్టినా ఆరోజు మాత్రం మంత్రులు, అధికారులు ప్రకటించిన దానికి విరుద్ధంగా ఉండటం సహజమైపోయింది. ముఖ్యంగా గాలిగోపురం మార్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మార్గంలో ప్రవేశాన్ని నిషేధించగలిగితే చందనయాత్ర పూర్తయినట్లు భావించవచ్చు. గత సంవత్సరం జూలైలో జరిగిన ఆషాడపౌర్ణమి, గిరి ప్రదక్షిణే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణాలు రెండు ఒకటి గాలిగోపులద్వార దర్శనం నిలిపివేత, రెండవది విఐపిల తాకిడి లేకపోవడం. విఐపిలతో వచ్చే వారిని క్యూలో వెళ్ళమన్నా వినకుండా గాలిగోపురంతో పాటు బైటకు వచ్చే మార్గాన్ని కూడా ఆక్రమించి నానా గొడవ చేస్తుంటారు. ఇక్కడ దేవాదాయ, దేవస్థానం ఉద్యోగుల మాటకు విలువే ఉండదు. ఇదంతా ఒక ఎత్తయితే విధి నిర్వహణను సక్రమంగా పాటించని దేవాదాయశాఖ ప్రత్యేకాధికారులు. ఈ కోవలేకే వస్తుంది గతేడాది అడిషినల్ కమిషన్ వ్యవహరించిన తీరు. ఈ ఏడాది వస్తున్న అడిషినల్ కమిషనర్, ఇఓలు కలిగి గాలిగోపుర దర్శనాన్ని నిలిపివేయ గలిగితే క్యూలో వచ్చే సామాన్య భక్తునికి నిజరూప దర్శనం సుగమమవుతుంది. లేనిఎడల ఈనుగాచి నక్కలపాలైన చందంగా తయారవుతుంది.

సింహాచలం శ్రీ వరాహ
english title: 
simhachalam

జిల్లాకు నీలం తుఫాన్ నష్టపరిహారం రూ. 37 కోట్ల నిధులు విడుదల

$
0
0

అనకాపల్లి , మే 10: రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లాకే నీలం తుఫాన్ పంట నష్టపరిహారం కింద 37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన రైతు సదస్సులో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడారు. ఈ నష్టపరిహారం లక్షా 40 వేల మంది రైతులకు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుందని కలెక్టర్ అన్నారు. అకౌంట్ లేని రైతులు బ్యాంక్ అకౌంట్లు తెరవాలని, దీనికి బ్యాంకులన్నీ రైతులకు సహకరించి అకౌంట్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్ల సదస్సులో చెప్పామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సహకరించాలన్నారు. ఈ నష్టపరిహారం సొమ్ము రైతులకు అందకుండా బ్యాంక్‌లో జమ అవుతుండటంతో వారి బాకీలు కింద జమ చేసుకుంటారని రైతులు అపోహలో ఉన్నారని, అటువంటిదేమీ లేదని బ్యాంకర్లకు, రైతులకు సొమ్ము అందించేలా ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు పలు సబ్సిడీలు మీద రుణాలు, విత్తనాలు, ఎరువులు అందిస్తుంది. రైతులు సద్వినియోగం చేసుకుని పంటలు అధిక దిగుబడి సాధించాలన్నారు. వ్యవసాయ శాఖాధికారులు సలహాలు, సూచనలతో మేలైన రకాల వంగడాలు ఎంపిక చేసుకుని ఎరువులు, పురుగుల మందులు వాడి మేలైన పంటలను పండించి మిగతా రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. వ్యవసాయాధికారులు అందించే రైతు శిక్షణ లకు తప్పనిసరిగా హాజరై శిక్షణ పొందాలని, దీనిద్వారా రైతులకు పలు సందేహాలు తొలగిపోతాయన్నారు. రైతులకు ఎరువులు విత్తనాల కొరత లేకుండా చూడాలని, అలాగే రైతులకు ఎక్కడ సీడ్ సెంటర్ దగ్గర కావాలో తెలిపితే అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సీజన్‌లో మత్స్యకారులకు పనిలేకుండా వేటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం ఉందని వారికి ఆహార పథకం కింద మూడు వేల మెట్రిక్ టన్నులు బియ్యం ప్రభుత్వం పంపిణీ చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. బియ్యం తొమ్మిది వేల మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు బాగా పడి రైతులు ఎక్కువ దిగుబడి సాధించాలని ఆయన అన్నారు. అలాగే రెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రుణాలను రైతులు ఉపయోగించుకుని పంటలు పండిస్తున్నారని, కానీ ఏనాడు వారికి సరైన గిట్టుబాటుకు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతులు రుణాలను కూడా చెల్లించ లేకపోతున్నారన్నారు. పరిశోధనా కేంద్రం ఎడిఆర్ అంకయ్య మాట్లాడుతూ రైతులు డ్రమ్‌సీడర్ ద్వారా పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని, వర్షాలు తక్కువ పడుతున్న సమయాల్లో డ్రమ్‌సీడర్, బిందు సేద్యం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ పరిశోధనా స్థానంలో 20మంది శాస్తవ్రేత్తలు ఉన్నారని, రైతులు వారి సలహాలు, సూచనలు క్షేత్రస్థాయిలో ఉపయోగించుకుని మేలురకాల పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు రైతు సదస్సులో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఫలసాయ పనిముట్ల స్టాల్స్‌ను కలెక్టర్ శేషాద్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, ఎంపిడిఒ ఇ. సందీప్, డిప్యూటీ తహశీల్దార్ భాస్కరరావు, ఆదర్శ రైతులు, రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్ శేషాద్రి
english title: 
neelam

నాలుగ్గంటలకే సర్వదర్శనం

$
0
0

సింహాచలం, మే 10: సింహాచలం దేవాలయంలో 13వ తేదీన జరగనున్న సింహాద్రినాథుని నిజరూపదర్శనం చందనయాత్రకు సంబంధించి దేవస్థానం అధికారులు అధికారికంగా శుక్రవారం ఒక ప్రకటన చేశారు. 12వ తేదీ ఆదివారం సాయంత్రం నుండి చందనోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయంలో ప్రారంభమవుతాయని చెప్పారు. ఆ రోజు ఆరుగంటలకే సర్వదర్శనాలు నిలిపివేస్తున్నారు. అనంతరం దివిటీ సలాం, దీపారాధన, మూర్తి కలశారాధన, ఆరాధన, రాత్రి 11 గంటలకు పవళింపుసేవ, కవాట బంధనం నిర్వహిస్తామని వారు తెలిపారు. 13వ తేదీ తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాతసేవ, 2 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణం, కలశారాధన, చందనోత్సవం, 3.30 నిమిషాలకు వ్యవస్థాపక ధర్మకర్తల తొలి దర్శనం, 4 గంటలకు భక్తుల సర్వదర్శనం, రాత్రి 9 గంటలకు సహస్రఘటాభిషేకం, 12 గంటలకు శీతలోపచారాలు జరుగుతాయి. అనంతరం ఈ చందనోత్సవం సందర్భంగా వచ్చే విఐపిల వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తామని దేవస్థానం వారు తెలిపారు. కొండదిగువ గోశాల, దేవస్థానం ఇఓ కార్యాలయం, ఆంధ్రాబ్యాంకు, పాత అడివివరం జంక్షన్‌ల వద్ద పార్కింగ్ కేటాయించడం జరిగిందని దేవస్థానం అధికారులు చెప్పారు. పార్కింగ్ ప్రదేశాల నుండి ఉచిత ప్రత్యేక బస్సులున్నట్లు తెలిపారు. దర్శనం టిక్కెట్లను ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంకు సింహాచలం బ్రాంచ్‌లతో పాటు నగరంలోని సీతమ్మధార, వాల్తేరు, అక్కయ్యపాలెం, మహారాణిపేట, మురళీనగర్, ద్వారకానగర్, కొత్తరోడ్డు, స్టీల్‌ప్లాంట్, గాజువాక, ఎయు క్యాంపస్, ఎంవి, మధురవాడలలోని ఆంధ్రాబ్యాంకు శాఖలలో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అడివివరం గ్రామీణ బ్యాంకు, కొత్తవలస ఇండియన్ బ్యాంకుల్లో కూడా టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

విఐపిల ఫోన్ కాల్స్‌తో ఈవో ఉక్కిరిబిక్కిరి
సింహాచలం, మే 10: రాజకీయ నాయకుల పిఒలు, అధికారుల సిసిల వద్ద నుండి ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఫోన్‌కాల్స్ సింహాచల దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌చే నీళ్లు తాగిస్తున్నాయి. చందనోత్సవ పాసుల కోసం ఆయనను ఒత్తిడి చేస్తున్నారు. ఫ్రీ పాసులు లేవు... టిక్కెట్లు తీసుకోవాలంటూ సమాధానం చెప్పడం ఈవోకు కత్తి మీద సాములా తయారైంది. ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక దర్శనం కోసం రూ.500 టిక్కెట్లు విఐపిల కొరకు, మిగిలిన వారి కోసం సాధారణ రూ.500ల టిక్కెట్లు ఉన్నాయంటూ ఈవో చెబుతున్నారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా ఈ మాట మేం వింటున్నాం... చివర్లో పాసులిస్తారు’ అంటూ ఆయనతో వాదనకు దిగినవారూ లేకపోలేదు. టిక్కెట్లే తీసుకుంటాం కానీ మాకు విఐపిల టిక్కెట్లు ఇవ్వాలంటూ ఆయనను వేధిస్తున్నారు. ఒకపక్క ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వస్తున్న మంత్రులు, అధికారులు, మరోపక్క ఈ రకమైన ఫోన్‌కాల్స్‌తో ఈవో పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఈ టిక్కెట్ల నిమిత్తం సూపరింటెండెంట్‌ని ఏర్పాటు చేసినా ఈవోకు ఫోన్‌కాల్స్ తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు.

విజయావకాశాలున్న అభ్యర్థులను డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోండి
* డిసిసి అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ
చోడవరం, మే 10: గోవాడ సహకార చక్కెర కర్మాగారం పాలకవర్గ ఎన్నికలకు విజయావకాశాలుఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకుని డైరెక్టర్లుగా గెలిపించేందుకు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ సూచించారు. శుక్రవారం స్థానిక శ్రీనివాస కల్యాణమండపంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ పదవి ఆశావహుల్లో విజయావకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసి డైరెక్టర్లుగా గెలిపించుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత పరంగా ఏర్పడిన పార్టీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సహకార చక్కెర కర్మాగారాలకు పునరుజ్జీవం కల్పించి ప్రైవేటుపరం కాకుండా కాపాడామన్నారు. ఫ్యాక్టరీ పరిధిలోని 13సెగ్మెంట్లకు ఈనెల 29వ తేదీన నిర్వహించనున్న ఎన్నికల్లో డైరెక్టర్లను ఎంపిక చేసుకుని పిదప చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకుంటారన్నారు. అంతకుముందు పలువురు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించాలని, తర్వాతే డైరెక్టర్లుగా పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసుకోగలమని కోరినప్పటికీ ఆయన ఆ అంశాన్ని తిరస్కరించారు. ముం దుగా డైరెక్టర్లను ఎంపిక చేసుకున్న మీదటనే చైర్మన్‌ను ఎన్నుకుంటారన్నారు. సవరించిన సహకార ఎన్నికల చట్టప్రకారం గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రధానంగా అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌పార్టీ పటిష్ఠంగా ఉందని, ఇందుకు నిదర్శనం ఇటీవల పిఎసిఎస్‌ల ఎన్నికల్లో 22సంఘాలను కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు కైవసం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఒకసారి అవకాశం రాలేదని బాధపడేకన్నా మరో అవకాశం కోసం ఎదురుచూడాలని ఆయన సూచించారు. కష్టించి పనిచేసే ప్రతీ కార్యకర్తకు పార్టీ అదిష్ఠానం గుర్తిస్తుందని, అటువంటి వారికి నామినేటెడ్ పదవులను కట్టబెడతారన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పతివాడ అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పి.సతీష్‌వర్మ, రోలుగుంఠ మండలానికి చెందిన కృష్ణారావు, రావికమతం మండలానికి చెందిన జగ్గారావు, బుచ్చయ్యపే ట మండలం నుండి దొండా రాంబాబు, మాడుగుల మం డలం నుండి శానాపతి గంగారావు, చీడికాడ మండలం నుండి సుంకరి రుద్రి సుగర్స్ ఎన్నికలలో అనుసరించాల్సిన విధివిధానాలు, డైరెక్టర్ల ఎంపికపై తీసుకుంటున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూడెడ్ల శంకరరావు, దేవరపల్లి సన్యాశిరావు, సుంకరి శ్రీనివాసరావు, మొల్లిప్రసాద్, ఉప్పల గణనూకరాజు పాల్గొన్నారు.

‘కోనాం రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలి’
చీడికాడ, మే 10: కోనాం రిజర్వాయర్ నీటిని పంటలకు వెంటనే విడుదల చే యాలని రిజర్వాయర్ ఆయకట్టు రైతులు కోరుతున్నారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 95 మీటర్ల వరకు నీరు ఉంది. కాస్తున్న ఎండలకు చెరుకుతోటలు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు వారం రోజులు ఇదే మాదిరిగా కాస్తే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని గతనెల రైతులు ఆం దోళన చేస్తే వారం రోజులు ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారని, కాలువలో పూడికలు తీస్తామన్న సాకుతో రిజర్వాయర్‌లో నీటిని బ యటకు రాకుండా తలుపులు బిగించారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య
అనకాపల్లి , మే 10: స్థానిక భీమునిగుమ్మం సెంటర్‌లో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. రైల్వేస్టేషన్ సమీపంలోని భీమునిగుమ్మం సెంటర్‌లో నివాసముంటున్న బొడ్డేడ ఉదయకుమారి(28) అనే మహిళ శుక్రవారం ఉదయం చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రెండురోజుల క్రితం భార్యభర్తలు గొడవపడి భర్త 7వ తేదీన అనుమానాస్పదంగా మరణించాడు. దీనిపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఆమె భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక పాప ఝాన్సీ(5), బాబు జగదీష్(2) ఉన్నారు. ఇప్పుడు పిల్లలు అనాథలయ్యారు. ఈ పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుళ్లిన గొర్రెలు, మేక తలలు స్వాధీనం
విశాఖపట్నం, మే 10: కుళ్లిన, నిల్వ ఉంచిన మాసం ఉత్పత్తులను గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి హనుమంతవాక కబేళాను జివిఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పివి రమణమూర్తి తన సిబ్బందితో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కబేలాలో పెద్ద సంఖ్యలో ఉన్న గొర్రె, మేక తలలు, కాళ్లను గుర్తించి వాటిని పరీక్షించారు. ఈ ఉత్పత్తులు కుళ్లి, దుర్గంధపూరితంగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరీక్షలకు పంపారు. ఒడిశా సహా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గొర్రె, మేక తలలను, మాసాంన్ని తెచ్చి ఇక్కడ కబేళా వద్ద విక్రయిస్తున్నట్టు పలు ఫిర్యాదులు అందడంతో అధికారులు దాడులు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తూ ప్రజలు, వినియోగదారులకు హాని చేస్తున్న వారిపై జివిఎంసి ప్రజారోగ్య విభాగం అధికారులు కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న కుళ్లిన మాసం ఉత్పత్తులను కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించి పూడ్చిపెట్టారు. మాసం ఉత్పత్తులు విక్రయిస్తున్న ముగ్గురు మహిళలపై ఆరిలోవ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈసందర్భంగా జివిఎంసి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ కుళ్లి, పాడైన మాసం ఉత్పత్తులను తినడం వల్ల అనారోగ్యానికి గురికావడంతో పాటు ప్రాణాపాయం కూడా తప్పదని పేర్కొన్నారు. కుళ్లి గొర్రె,మేక తలలను కాల్చి విక్రయించడం వల్ల వాటి నాణ్యతను వినయోగదారులు గుర్తించలేరని, అయితే వీటిని తినడం వల్ల ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఇటువంటి వాటిని కొనుగోలు చేసేప్పుడు వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇకమీదట ఇటువంటి వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈదాడుల్లో నగర వెటర్నరీ అధికారి డాక్టర్ రామ్మోహన్, నాయక్, భాస్కరరావు పాల్గొన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి సస్పెన్షన్
జివిఎంసిలో ఫుడ్ సేఫ్టీ అధికారిగా పనిచేస్తున్న డివి అప్పారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఎంవి సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఆహార పదార్ధాల నమూనాలను సేకరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తించిన కమిషనర్ ఈనిర్ణయం తీసుకున్నారని జివిఎంసి ప్రధాన వైద్యాధికారి రమణమూర్తి తెలిపారు. సస్పెండైన ఫుడ్ సేఫ్టీ అధికారి విధి నిర్వాహణలో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

నిరాశపరచిన జితేంద్ర సింగ్
విశాఖపట్నం, మే 10: కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ షిప్ యార్డు కార్మికులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. ఆయన షిప్‌యార్డుకు వచ్చి తమ సమస్యలను వింటారని, వాటికి పరిష్కార మార్గం చూపుతారని కార్మికులు భావించారు. కానీ అలా జరగలేదు. కనీసం కార్మిక సంఘాల నాయకులతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. షిప్‌యార్డు తయారు చేసిన అవంతిబాయి నౌకను మంత్రి గురువారం జల ప్రవేశం చేయించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మంత్రి జితేంద్ర సింగ్ షిప్‌యార్డు ఎండితో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాతైనా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడతారనుకుంటే, ఏమాత్రం వారితో మాట్లాడకుండా, వారిచ్చిన వినతిపత్రాలు తీసుకుని వెళ్లిపోయారు. వాస్తవానికి మంత్రి జితేంద్ర సింగ్ గత నెల ఎనిమిదో తేదీన షిప్‌యార్డుకు రావలసి ఉంది. ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఎట్టకేలకు గురువారం షిప్‌యార్డుకు వచ్చిన ఆయన కార్మిక సమస్యలను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. షిప్‌యార్డుకు ఆర్డర్స్ విషయంలో మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ముందు కోస్ట్‌గార్డ్, నేవీ నమ్మకాన్ని చూరగొనాలని సూచించారు. అలాగే డిఫెన్స్ ప్రొడక్షన్స్ కార్యదర్శి కూడా షిప్‌యార్డుకు కొత్త ఆర్డర్స్ ఇస్తామన్న స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలి : అఖిలపక్షం
పెదగంట్యాడ, మే 10: కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలు గంగవరం పోర్టు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గత అయిదు రోజుల నుండి కార్మికులు తమ సమస్యలపై స్పందించాలని కోరుతూ నిరసన తెలుపుతున్నా పట్టించుకోని పోర్టు యాజమాన్యం వైఖరిని నిరసిస్తు శుక్రవారం గంగవరం పోర్టు రోడ్డులో నిరాహార దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. పోర్టు యాజమాన్యం మొండి వైఖరి నశించించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. కార్మికులు చేపట్టే ఉద్యమం తీవ్ర రూపం దాల్చకుండా అధిక సంఖ్యలో పోలీసులు శిబిరం వద్ద మోహరించారు. కార్మికులు పోర్టు కార్యాలయం దరిదాపులకు వెళ్లకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. ముందుగా సౌత్ ఎసిపి కె.వెంకటరమణ సిబ్బందితో శిబిరం వద్దకు చేరుకుని కార్మికులు, నాయకులతో చర్చలు జరిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని, పోర్టు యాజమాన్యంతో చర్చించి తగు న్యాయం జరిగేలా చూస్తానని ఎసిపి వారికి బరోసా ఇచ్చారు. అనంతరం పోర్టు యాజమాన్యంతో ఎసిపి చర్చించిన మీదట కార్మికుల సమస్యలపై శనివారం పోర్టు ప్రతినిధులు సమావేశం జరపడానికి అంగీకరించారన్నారు. రెచ్చగొట్టే విధంగా వ్యహరించ వద్దని కార్మికులకు, నాయకులకు సూచించారు. ఇదిలావుండగా పోర్టు కార్మికులు చేపట్టిన ఉద్యమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, నాయకులు స్టాలిన్, జి.సుబ్బారావు, తిప్పల దేవన్‌రెడ్డి, జి.సత్యారావు, ఎన్.రామారావు, డి. ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, బసా సాధూరెడ్డి, చిక్కా సత్యనారాయణ, ఎం. గురుమూర్తి, జి.దానయ్య తదితరులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. గంగవరం పోర్టు కోసం స్టీల్‌ప్లాంట్ భూములతో పాటు స్థానిక రైతులు భూమిని ధారా దత్తం చేశారన్నారు. స్థానికులకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జిపిఎస్‌గా పేర్కొనడం విచారకరమన్నారు. యాజమాన్యం కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోగా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం వాస్తవ పరిస్థితిని గుర్తించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే పరిసర గ్రామాలు కాలుష్యం బారిన పడకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల, నిర్వాసితుల సహనాన్ని పరీక్షించాలని చూస్తే పోర్టు యాజమాన్యం తగిన మూల్యం చెల్లించు కోవాల్సివస్తుందన్నారు. అప్పటికి యాజమాన్యం స్పందించకుంటే గంగవరం పోర్టు, ఉక్కు నిర్వాసితులు కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తారన్నారు. ఈ ధర్నాలో పోర్టు కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

సింహాచలం దేవాలయంలో 13వ
english title: 
sarva darsanam

న్యాయవాదులు వృత్తినైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

$
0
0

నందిగామ, మే 10: న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని మంచి లాయర్‌లుగా గుర్తింపు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ అన్నారు. స్థానిక రామన్నపేట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 16వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టును శుక్రవారం ఆయన హైకోర్టు న్యాయమూర్తి మరియు కృష్ణాజిల్లా పర్యవేక్షక న్యాయమూర్తి జి రోహిణితో కలిసి ప్రారంభించారు. అనంతరం నెహ్రూనగర్‌లోని కమ్మకల్యాణ మండపం ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చక్రధరరావు అధ్యక్షతన జరిగిన సభలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ మాట్లాడుతూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గానూ కోర్టులోని లైబ్రరీకి తన వంతుగా లక్ష అందజేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని న్యాయవాదులు విజ్ఞానాన్ని, భాషా ప్రావిణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని సమాజానికి మార్గదర్శకంగా ఉండాలన్నారు. ఇక్కడ అదనపు జిల్లా కోర్టు ఆవశ్యకతను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కమిటీకి నివేదించడం వల్ల వారు మంజూరు చేశారని తెలియజేశారు. ఈ ప్రాంతానికి చెందినవాడిని కావడం వల్ల ఇక్కడి ప్రజల కష్టాలు, బాధలు తనకు తెలుసునని అన్నారు. మెట్ట ప్రాంతమైన ఇక్కడ వ్యవసాయంలో ఆటుపోట్లు ఎదురవుతున్నా రైతాంగం ఆత్మవిశ్వాసంతో దీనే్న నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. దేశానికి రాజైనా తల్లికి బిడ్డే అన్నట్లుగా తాను ఏ స్థాయిలో హోదాలో ఉన్నా నందిగామ తాలూకాకు చెందినవాడిగా చెప్పుకోవడానికి గర్వపడతానని అన్నారు. ఇక్కడ అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయడం ఈ ప్రాంతంలోని కక్షిదారులకు పండుగేనన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని, ఈ ప్రాంతం సశ్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను బార్ అసోసియేషన్ నేతలు, పలువురు ప్రముఖులు, అధికారులు దుశ్సాలువాలు, పూలమాలలు, బొకెలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ పూర్వపు అధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు, విజయవాడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ మురళి, రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్ సెక్రటరీ రవికుమార్, 16వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రామకృష్ణ, నందిగామ సీనియర్ సివిల్ జడ్జి కరణం చిరంజీవులు, నందిగామ న్యాయమూర్తులు సాయిభూపతి, బాబునాయక్, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పింగళి లక్ష్మీనర్శింహరావు, అనె్నపాక సుందరరావు, సుంకర రాజేంద్రప్రసాద్‌లతోపాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

న్యాయవాదులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని మంచి లాయర్‌లుగా
english title: 
advocates

దుర్భరం ... దుస్సహం

$
0
0

మచిలీపట్నం , మే 10: వేసవి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు శ్వాస అందక నానా అవస్థలు పడుతున్నారు. పసికందులు వేడిమికి ఉడికిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ కోతలు అధికమవటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైంది. సాయంత్రం 7 గంటలైనా వేడి తగ్గటం లేదు. ఎండలో ప్రయాణం చేయాలంటే హడలిపోతున్నారు. బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నాయి. కారం మిల్లులో పనిచేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పొట్టకూటి కోసం కార్మికులు ఎంతటి కష్టాలనైనా భరిస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ లేకపోవటంతో చిన్నారుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రోహిణీ కార్తెలో మరెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గర్భిణీలు శ్వాస అందక సతమతమవుతున్నారు. శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో నీరసించిపోతున్నారు.
కూచిపూడి : రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోహిణీ కార్తె రాకముందే ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో బతుకే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందేమోనని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అధికమవటంతో వృద్ధులు, చిన్నారులతో పాటు యువత కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. వేళపాళా లేకుండా కొనసాగుతున్న విద్యుత్ కోతల కారణంగా పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుండే విద్యుత్ కోత ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. తిరిగి 4 గంటల నుండి 10 గంటల వరకు సరఫరా అవుతున్న విద్యుత్ నిశిరాత్రిలో ప్రారంభమయ్యే విద్యుత్ కోత సమయంలో గాలి లేక ప్రజలు అల్లల్లాడిపోతున్నారు.

వేసవి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో జిల్లా ప్రజలు
english title: 
simmering summer
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>