తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన ననన... తోం తననన ననన...
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరు బొమ్మా
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయో మాక్కూడా
చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరు బొమ్మా
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
జల జల జల జాజుల వాన కిలకిలకిల కిన్నెర వీణ
మిలమిల మిన్నంచులపైన మేలి తిరిగిన చంచలయాన
మదిరోహల లాహిరిలోనా మదినూపే మధిరవి జాణ
నీ నడకలు నీవైనా చూశానా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాసె్తైనా నీ వెనకాలేవౌతున్నా
నీ వీపుని ముళ్ళై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలైపోతారు
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణౌతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టగమ్మా
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
తోం తననన తోం తననన ననన తోం
తననన తోం తననన ననన
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయొద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెనె్నలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టూ
అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణీ జాగారం ఎందుగ్గానీ
నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మా
ఈ పాట మీకు తెలుసా?
ఏ సినిమాలోది?
గీత రచయిత ఎవరు?
సంగీత దర్శకుడు ఎవరు?
మాకు తెలియచేయనక్కరలేదు..
మీరు గుర్తు చేసుకుంటే చాలు..
తెలియకుంటే, వివరాలు వచ్చేవారం ఇక్కడే.
గతవారం పాట
సినిమా : సిందూరం
సంగీతం : శ్రీ
రచన : సిరివెన్నెల సీతారామశాస్ర్తి