కావలసినవి
మసూర్ దాల్ / ఎర్ర పప్పు .....
5 టీ.స్పూ.
వెన్న ...... 1 టీ.స్పూ.
ఉల్లిపాయ ..... 1 చిన్నది
పాలు ....... 1 కప్పు
ఉప్పు ........ తగినంత
మిరియాల పొడి ........ చిటికెడు
ఇలా చేయాలి
కుక్కర్‌లో వెన్న వేసి వేడి
చేయాలి. అది కరిగిన తర్వాత
సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి
మెత్తబడేవరకు వేపాలి. తర్వాత
ఎర్రపప్పు కడిగి వేయాలి. మరో
రెండు నిమిషాలు వేపి, రెండు
కప్పుల నీళ్లు వేసి మూత పెట్టి 3
విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత పాలు
కలిపి మిక్సీలో వేసి బ్లెండ్
చేసుకుని ఒక ప్యాన్‌లో వేసి వేడి
చేయాలి. కొద్దిగా మరిగిన తర్వాత
తగినంత ఉప్పు, మిరియాల పొడి
వేసి కలిపి దింపేయాలి. ఇందులో
మిరియాల పొడి బదులు
అప్పటికప్పుడు మిరియాలను
దంచివేస్తే మరింత రుచిగా
ఉంటుంది. పైన కొంచెం కొత్తిమీర
కూడా వేసుకోవచ్చు.
కుక్కర్‌లో వెన్న వేసి వేడి చేయాలి
english title:
masoordal soup
Date:
Sunday, October 28, 2012