కొబ్బరి, శనగపప్పుతో
కావలసినవి
పాలు- లీటరు
కొబ్బరి పాలు- 4 కప్పులు
శనగపప్పు- 1 కప్పు
బెల్లం - ఒకటిన్నర కప్పు
బొంబాయి రవ్వ- పావు కప్పు
యాలకులు- 3
నెయ్యి - ఒక టీ. స్పూన్
బాదం, జీడిపప్పు, కిసిమిస్-
సరిపడ
తయారు చేసేదిలా
ముందుగా శనగపప్పును నీటితో
శుభ్రంగా కడిగాక, కుక్కర్‌లో వేసి
తగినన్ని నీళ్లు పోసి మెత్తగా
ఉడికించాలి. బెల్లం ముక్కల్ని
నీటిలో కరిగించాలి.
ఉడికిన శనగపప్పులో రవ్వ,
బెల్లం నీరు, కొబ్బరి పాలు పోసి
బాగా కలిసేదాకా ఉడకపెట్టాలి. ఈ
మిశ్రమం పాయసంలా మారాక,
ముందుగా నేతిలో దోరగా వేపిన
జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వేసి,
చివరన యాలకుల పొడి వేయాలి.
-విజయనిర్మల
==================
బొబ్బర గింజలతో
కావలసినవి
బొబ్బర గింజలు ..... పావు కప్పు
కొబ్బరి తురుము ... అరకప్పు
బెల్లం........ తగినంత
యాలకుల పొడి .... కొద్దిగా
వండే విధం
బొబ్బర గింజల మీద పొట్టు తీసి
ఒక పాత్రలో నీరుపోసి పొయ్యిమీద
పెట్టి, కొబ్బరి తురుము మెత్తగా
రుబ్బిన బెల్లం, యాలకుల పొడి
వేసి ఉడికిస్తే పాయసం తయార్.
దీనిని చిన్న పిల్లలే కాదు, పెద్దలు
కూడా ఇష్టంగా తీసుకుంటారు.
====================
టమాటాతో..
కావలసినవి
టమాటాలు - పావు కిలో
కొబ్బరి తురుము - రెండు పిడికిళ్ళు
బెల్లం- అర కప్పు
చక్కెర - అర కప్పు
యాలకుల పొడి - తగినంత
నెయ్యి - 1 టీ.స్పూ.
ద్రాక్ష- 10
జీడిపప్పు - 8
వండండి ఇలా
టమాటా ముక్కలను దోరగా
వేయించి, మిక్సీలో వేసి
రుబ్బుకోండి. కొబ్బరి తురుము
కూడా జత చేయండి. తరువాత
బాగా మిక్స్ చేయండి.
పొయ్యిమీద ఈ మిశ్రమాన్ని పెట్టి
బెల్లం, కొబ్బరి తురుము, చక్కెర,
నెయ్యిలో వేయించిన జీడిపప్పు,
ద్రాక్ష వేసి కలియపెట్టండి.
అంతే... టమాటా పాయసం
వడ్డించడానికి రెడీ!