కావలసినవి
ఓట్స్ ...... 1 కప్పు
పెసరపప్పు ..... 1/2 కప్పు
మిరియాలు ... 1 టీ.స్పూ.
జీలకర్ర .... 1 టీ.స్పూ.
అల్లం ..... చిన్న ముక్క
పచ్చిమిర్చి ... 2
కరివేపాకు ..... 1 రెబ్బ
కొత్తిమీర ..... కొద్దిగా
నెయ్యి ...... 2 టీ.స్పూ.
ఉప్పు ....... తగినంత
ఇలా వండాలి
ప్యాన్ వేడి చేసి ఓట్స్ దోరగా
వేయించి పెట్టుకోవాలి. పెసరపప్పు
కడిగి ఉడికించుకోవాలి. ప్యాన్‌లో
నెయ్యి వేడి చేసి జీలకర్ర,
మిరియాలు, కరివేపాకు వేసి
కొద్దిగా వేగిన తర్వాత నిలువుగా
చీల్చిన పచ్చిమిర్చి, సన్నగా
తరిగిన అల్లం వేసి వేపాలి.
తర్వాత ఉడికించిన పెసరపప్పు
వేసి కలపాలి. అది
ఉడుకుతున్నపుడు అరకప్పు
నీళ్లు పోయాలి.
తర్వాత ఓట్స్, తగినంత ఉప్పు
వేసి కలిపి మూత పెట్టి మూడు
నిమిషాలు ఉడికించాలి. తర్వాత
మరికొంచెం నెయ్యి, కొత్తిమీర వేసి
దింపేయాలి. ఈ పొంగల్ వేడిగానే
సర్వ్ చేయాలి.
ప్యాన్ వేడి చేసి ఓట్స్ దోరగా వేయించి పెట్టుకోవాలి
english title:
oats pongal
Date:
Sunday, October 28, 2012