కావలసినవి
స్వీట్ కార్న్ గింజలు - 1 కప్పు
ఉల్లిపాయ - 1 చిన్నది
వెల్లుల్లి - 4 రెబ్బలు
కొత్తిమీర తరుగు - 1/4 కప్పు
పుదీనా తరుగు - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 3
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
క్రీం - 2 టీ.స్పూ.
తయారు చేసేదిలా
స్వీట్‌కార్న్ గింజలను
ఉడికించుకోవాలి. కొత్తిమీర,
పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి
కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ప్యాన్‌లో నూనె వేసి సన్నగా
తరిగిన లేదా గ్రైండ్ చేసుకున్న
ఉల్లిపాయ వేసి దోరగా
వేయించాలి. ఇందులో
రుబ్బుకున్న మిశ్రమాన్ని వేసి
కొద్దిసేపు వేపాలి. తర్వాత
పసుపు, ఉడికించిన కార్న్
గింజలు, తగినంత ఉప్పు వేసి
కలిపి మూత పెట్టాలి. ఇవి బాగా
వేగిన తర్వాత దింపేసి క్రీమ్ వేసి
సర్వ్ చేయాలి. ఈ కూర అన్నంలో
కంటే చపాతీ, నాన్‌లకు
బావుంటుంది.
స్వీట్‌కార్న్ గింజలను ఉడికించుకోవాలి
english title:
green corn curry
Date:
Sunday, October 28, 2012