కావలసినవి
చిన్న ఉల్లిపాయలు
- 1 కప్పు
టమాటాలు - 2
చింతపండు పులుసు
- 1/2 కప్పు
పప్పు నీళ్ళు - 1 కప్పు
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - 2 రెబ్బలు
ఎండుమిర్చి - 2
నెయ్యి - 2 టీ.స్పూ.
ఆవాలు, జీలకర్ర మినప్పప్పు
- 1/2 టీ.స్పూ.
ఇంగువ - చిటికెడు
పొడి చేయడానికి
వెల్లుల్లి - 4 రెబ్బలు
ఎండుమిర్చి - 4
జీలకర్ర - 1/2 టీ.స్పూ.
మిరియాలు - 1/2 టీ.స్పూ.
వేయించిన శనగపప్పు
- 1 టీ.స్పూ.
వేయించిన కందిపప్పు
- 1/2 టీ.స్పూ.
ఇలా చేద్దాం
వెల్లుల్లి,
ఎండుమిర్చి, జీలకర్ర,
మిరియాలు కలిపి పొడి
చేసుకోవాలి. ఇందులో వేయించిన
కందిపప్పు, శనగపప్పు కూడా
కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.
చిన్న ఉల్లిపాయలు లేదా
మామూలు ఉల్లిపాయలు
తరిగినవి తీసుకోవాలి. ఒక
ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి ఆవాలు,
జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు
వేసి కొద్దిగా వేపాలి. తర్వాత
ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా
వేయించాలి. ఇందులో పప్పు
నీళ్లు, పల్చటి చింతపండు నీళ్లు,
సన్నగా తరిగిన టమాటా
ముక్కలు వేసి మరిగించాలి. రసం
మరుగుతున్నపుడు చేసి
పెట్టుకున్న పొడి, తగినంత ఉప్పు,
కొత్తిమీర వేసి మరో రెండు
నిమిషాలు మరిగించి దింపేయాలి.