కావలసినవి
అన్నం - 2 కప్పులు
ఆరెంజ్ జ్యూస్ - 1/2 కప్పు
ఉల్లిపాయ - 1 చిన్నది
పచ్చిమిర్చి - 3
ఆవాలు, జీలకర్ర - 1/4
టీ.స్పూ.
కరివేపాకు - 2 రెమ్మలు
కేసర్ రంగు లేదా కుంకుమ
పువ్వు - కొద్దిగా
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
నెయ్యి - 2 టీ.స్పూ.
ఇలా వండాలి
ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు,
జీలకర్ర వేయాలి. అవి
చిటపటలాడుతున్నపుడు
సన్నగా తరిగిన ఉల్లిపాయ,
కరివేపాకు, నిలువుగా చీల్చిన
పచ్చిమిర్చి వేసి దోరగా వేపాలి.
ఇందులో నారింజ రసం, కేసర్
వేసి రెండు నిమిషాలు వేడి చేసి
అన్నం, తగినంత ఉప్పువేసి
కలపాలి.
మొత్తం అన్నం, రసం బాగా
కలిసాక రెండు నిమిషాలు ఉంచి
నెయ్యి వేసి దింపేయాలి. పెరుగు
పచ్చడితో వేడిగా సర్వ్ చేయాలి.
నారింజ రంగు, రుచి ఉండడంవల్ల
పిల్లలు బాగా ఇష్టపడతారు.
ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి
english title:
orange kesar fried rice
Date:
Sunday, October 28, 2012