కావలసినవి
దొండకాయలు ... 250 గ్రా.
సోయా కీమా ...... 100 గ్రా.
ఉల్లిపాయ ..........1
పచ్చిమిర్చి ......... 2
కరివేపాకు ........... 2
రెమ్మలు
అల్లంవెల్లుల్లి ముద్ద .... 1
టీ.స్పూ.
పసుపు .............. 1/4
టీ.స్పూ.
కారం పొడి .......... 1 టీ.స్పూ.
ధనియాల పొడి ...... 1
టీ.స్పూ.
గరం మాసాలా పొడి .. 1/4
టీ.స్పూ.
ఉప్పు ....తగినంత
కొత్తిమీర ........ కొద్దిగా
వండే విధం
ఒక గిన్నెలో సోయా కీమా వేసి
వేడినీళ్లు పోయాలి. చల్లారిన
తర్వాత నీరంతా గట్టిగా
పిండేయాలి. దొండకాయలను
చిన్న చిన్న ముక్కలుగా కట్
చేసుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడి
చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ
వేసి దోరగా వేయించాలి. ఇందులో
పసుపు, కరివేపాకు, అల్లం
వెల్లుల్లి ముద్దవేసి మరో రెండు
నిమిషాలు వేయించాలి. తర్వాత
దొండకాయ ముక్కలు వేసి కలిపి
నిదానంగా వేయించాలి.
ముక్కలు మెత్తబడ్డాక కారం పొడి,
ధనియాల పొడి, సోయా కీమా,
తగినంత ఉప్పు వేసి కలిపి
వేయించాలి. ముక్కలు మెత్తబడి
వేగిన తర్వాత గరం మసాలా
పొడి, కొత్తిమీర వేసి కలిపి
దింపేయాలి. ఇది అన్నంలో గానీ,
చపాతీలకు గానీ బావుంటుంది.