నాక్స్‌విల్: విశ్వశాంతికోసం జరుపుతున్న అమెరికా పర్యటనలో భాగంగా విశ్వయోగి విశ్వంజీ శుక్రవారం టెన్నెస్సీ రాష్ట్రంలోని నాక్స్‌విల్‌లో నాక్స్ కౌంటీ మేయర్ టిమ్ బర్షెట్, నాక్స్‌విల్ నగర ప్రథమ మహిళా మేయర్ మేడెలిన్ రోజెరోతో సమావేశమయ్యారు. శాంతి స్థాపనకోసం ఏకం కావాలని, భూమాతను రక్షించాలని ఆయన వారిని కోరారు. మానవాళికి బలాన్ని చేకూర్చే ఆహారం, దుస్తులు, గూడు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్వామీజీ మేయర్లతో చెప్పారు. శాంతికి ప్రాముఖ్యం ఇవ్వడం వ్యక్తుల నుంచి మొదలుకావాలని ఆయన ఉద్ఘాటించారు. అది ఆ తరువాత కుటుంబానికి, సమాజానికి ఆ విధంగా విశ్వవ్యాప్తం అవుతుందని అన్నారు. మన హృదయం ప్రేమాస్పదమై, మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చని ఆయన అన్నారు. స్వామీజీ సందేశాన్ని ప్రశంసిస్తూ శాంతియాత్ర జరుపుతున్నందుకు మేయర్లు ఆయనను అభినందించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బాలబాలికలు ‘మైత్రీ భజతు...’ను ఆలాపిస్తూ స్వామీజీని పూజించారు. ఈ సందర్భంగా భారతీయ సనాతనధర్మ ఔన్నత్యాన్ని గురించి తెలియజేస్తూ మనందరం వసుధైక కుటుంబం అని, భూమాతను పూజించాలని ఆయన పిలుపు ఇచ్చారు. (చిత్రం) నాక్స్‌విల్ నగర మేయర్ మేడెలిన్ రోజెరోతో విశ్వయోగి విశ్వంజీ
విశ్వశాంతికోసం విశ్వయోగి విశ్వంజీ జరుపుతున్న అమెరికా పర్యటనలో
english title:
viswamji's visits
Date:
Monday, October 29, 2012