ప్రభుత్వం గ్యాస్‌ను ధర పెంచకుండా మొదటి ఆరు సిలెండర్ల వరకూ సబ్సిడీ ధరలకు, ఏడవది సబ్సిడీ లేని గుదిబండ ధరకు కొనక తప్పదన్న పత్రికా ప్రకటన గగుర్పాటు కలిగించింది. ఏ కుటుంబాల వారికైనా కనీసం 12 సిలిండర్స్ పడతాయి. ఆరింటికి రెట్టింపు ధర చెల్లించడం అదనపు భారం. బాయలర్ పెట్టుకునే సౌకర్యం లేని ఇరుకింట్లో జన్మించిన పసి పిల్లలకు సం.వరకు వేన్నీళ్ళు స్నానం చేయించాలంటే గ్యాస్ కావాల్సిందే. అలాంటి వారికి ఒక స్తంభం రెండుమూడు వారాలు వస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలి. అలాంటివారు పిల్లల్ని కనటం మానివేయాల్సి ఉంటుందేమో మరి? తిండి కూడ తగ్గించుకోవాలి. ఏ వర్గాల వారికైనా సిలిండర్ కావలసిందే! లేనిదే కడుపులోకి ముద్ద పోదు. కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటి వాడుకుందామనుకున్నా బొగ్గులు, కట్టెలు దొరుకుతున్నాయా! వాటి ధరలు కూడ అందుబాటులో లేవు. కనుక ప్రభుత్వంవారు ఈ విధానాన్ని కాకుండా ఎంతోకొంత ధర పెంచితే ఉభయత్రా శ్రేయస్కరం.
- పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
పెన్షన్లు, ఎల్.ఐ.సిలు చిల్లర వ్యాపారాలా?
మన దేశంలోని చిల్లర వ్యాపారాన్ని బహుళ దేశ సంస్థలకు కట్టబెట్టేందుకు మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ సైతం జారీచేసింది. ప్రతిపక్షాలలో కొన్ని ఇందుకు వ్యతిరేకించినా కొన్ని విపక్షాలు సైతం మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఇందుకు ప్రోత్సహించింది. అంతేకాదు తమ నిర్ణయం మంచిదని, మన ప్రజలకు మేలుచేసేదేనని అంటూ ఆయా సత్ఫలితాలను వల్లెవేస్తూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అయితే... మన అభిమాన రచయిత ‘సాక్షి’వారు 22.9.12నాటి కథనం ద్వారా మనకందించిన నిజాలను పరిశీలిస్తే ప్రధాని నేతి బీరలో నెయ్యి ఎంతో కమ్మనోనంటూ ప్రజలను నమ్మించ చూశారని తేలిపోయింది. చిల్లర వ్యాపారాన్ని విదేశాలకు కట్టబెడితే మన ప్రజలు పడాల్సిన కష్టనష్టాలను వివరిస్తూ సాక్షివారు వ్రాసిన ‘పాముల బండి ఎక్కండి’అనే శీర్షికను చదివినవారికి తెలిసే వుంటుంది. చిల్లర వ్యాపారం అంటూనే హోల్‌సేల్ మార్కెట్లు దేశమంతటా స్థిరపడినాయనే సందేశం ఇప్పటికే ప్రజలలో బలపడే అవకాశముందన్న భావనకు వస్తున్నారు. ఉదాహరణకు పెన్షన్లు, జీవిత బీమా, విశాఖ ఉక్కులో వాటా వంటి పెద్ద పెద్ద సంస్థలను ఎఫ్‌డిఐల కోవలో చేరిపోనున్నాయి. ఇవి చిల్లర వ్యాపార సంస్థలా? ప్రజలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలి.
- కె.వి.రమణారావు, పోతవరం
వ్యవస్థలో లొసుగులను తొలగించండి
మన దేశంలో లా అండ్ ఆర్డరు, న్యాయ సూత్రాలు ప్రతి పౌరునికి రక్షణ కల్పించగలదని నమ్మకం కలగడం లేదు. స్కూలుకి వెళ్ళే చిన్నారులు, మోపెడ్స్, బైకుల్లో ప్రయాణించే యువత, నడి వయస్కులు, బస్సుల్లో, రైళ్ళలో ప్రయాణించే కుటుంబాలు, కూలి పనులుకోసం దూర ప్రాంతాలకి తరలే లక్షలాది వలస కార్మికులు, పుణ్యక్షేత్రాలు దర్శించే భక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి చేరతారు అన్న గ్యారంటీ లేని జనారణ్యంలో బ్రతుకుతున్నాం. స్కూలు, కాలేజికి వెళ్ళే యువతి, స్కూలు అసిస్టెంట్లు,హెడ్ మాస్టర్లు, ఆటో డ్రైవర్లు లేక అటెండర్లు వలన ఏ అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు. సహ విద్యార్థులచే ఏ అవమానాలైనా పడవచ్చు. లేదా స్కూలు బస్సులు వాగుల్లోకి దొర్లి పిల్లల ప్రాణాలు పోవచ్చు. బస్సులు లారీలు గుద్దుకొని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోవచ్చు. లేక లోకలు మాఫియా గ్రూపులు కొట్లాటలు, విదేశీయులైన ఉగ్రవాదుల కాల్పులు జన సమ్మర్ధం బాగా వుండే స్థలాల్లో జరిగి వందల్లో ప్రాణాలు కోల్పోవచ్చు. చిన్నవి పెద్దవి నేరాలు ఎటువంటివైనా పోలీసుల పరిశోధనలు కొనే్నళ్లు, పిదప జైలుశిక్షకొనే్నళ్ళు, వీలైతే బెయిలుపై బైటకి, తిరిగి అదే గూండాగిరిలు ప్రారంభిస్తారు. సమాజంపై గౌరవం లేదు. జైలు జీవితంపైభయం లేదు. శిక్షాస్మృతిపై నమ్మకం లేదు. మహాఅయితే రెండుమూడేళ్ళు జైలు, ఈలోగా బెయిలు, మరణశిక్షలు పై నమ్మకం ఏనాడో పోయింది. లా అండ్ ఆర్డరులో ఈ లొసుగుల వ్యవస్థను ఎన్నాళ్లు మోస్తాం? పొరుగునున్న గల్ఫ్ దేశాలు, సింగపూర్ మాదిరి శిక్షా స్మృతి మనకి ఎంత త్వరగా వస్తే అంత మంచిది.
- తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి, విశాఖ
ప్రభుత్వం గ్యాస్‌ను ధర పెంచకుండా మొదటి ఆరు సిలెండర్ల వరకూ సబ్సిడీ ధరలకు, ఏడవది సబ్సిడీ లేని గుదిబండ ధరకు కొనక తప్పదన్న పత్రికా ప్రకటన గగుర్పాటు కలిగించింది.
english title:
bharamina
Date:
Monday, November 12, 2012