Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దీపాలు చైనావైనా ‘కాంతులు’ మనవే!

$
0
0

దేశ దేశాల దీపావళి పండుగల సంగతి దేవుఁడెరుగు- మన దేశంలో మాత్రం- దీపావళి పండుగకి కాంతులు మనవే అయినా- దీపాలు- అంటే ప్రమిదలు, లాంతర్లు, దీప తోరణాలూ వగైరా ఎన్నో మన నెత్తిమీద వున్న చైనావాళ్లవేనుట!
‘‘మనం నిత్యం వాడుకునే- ఎన్నో పరికరాలు, బొమ్మలు, వస్తువులు, మొబైల్స్ వాళ్లవైనప్పుడు- దీపాలు కూడా ‘చీనా’ సరుకు అయితే- ఏం కొంపమునిగిందీ?’’ అంటే - ‘‘ఆ రంగురంగుల చైనా ప్రమిదల్లో, లాంతర్లలో, దీప తోరణాలలో వెలిగేవి- మన కాంతులే కదా? మన కల్చర్ కాపాడబడుతున్న కాలం, మనకి ఎందుకు వర్రీ?’’ అన్నాడు ఓ ‘‘దీపావళీ నాన్నగారు’’. తన స్నేహితులకి తన పిల్లలికీ సంతోషంగా యిద్దామని- ముందే మార్కెట్‌లో వున్న- చైనా బాణాసంచాని కొనుక్కొని- తన స్కూటర్‌కి ముందూ- వెనుకా- పాలబిందెలవాడు ‘లోడ్’ చేసుకున్నట్లు కట్టేసుకున్నాడు!
‘‘నేను పెట్టే ఖర్చుకి- చైనావాడి దీపాలూ, టపాసులూ వగైరా పండుగ సామగ్రి- రెట్టింపు సరుకువస్తోంది కదా- రుూ దరిద్రగొట్టు కాలంలో- కాల్చి పారేస్తాం- పేల్చి పారేస్తాం. అంతేగా?’’-
‘‘్ధరల మీద అతని కోపం అది. సంస్కరణల మీద కాదు సుమా! ‘దరిద్రగొట్టు’అన్న మాటని- మనోభావాల మీద ఎక్కుపెట్టుకోకూడదు. కించపడరాదు మనం’’- అని ప్రక్కనున్న మరో మిత్రుడి వ్యాఖ్యానం. అదీ నిజమే. ప్రగతి, పురోభివృద్ధి లాంటి మాటలకి అర్థం- గవర్నమెంటు అధీనంలో వున్న ప్రతీ వస్తువు రేటూ పెరగడమేనన్న ధోరణిలో- మన దీన జనోద్ధారక నాయకులు- మన ‘‘నల్లదొరలు మాట్లాడుతూన్న ఈ రోజులలో- సామాన్యుడు అన్నివేళలా బాధపడరాదు. ‘ఒకటి కొంటే రెండు ఫ్రీ’కే ఎగబడాలి. అదే ప్రగతి పథంలో ముందంజ.
అయితే, మన కోస్తా జిల్లాల్లో- ‘నికృష్ట నీలం’దెబ్బకి విలవిల్లాడుతున్న- కృష్ణ, ఉభయగోదావరి, విశాఖ లాంటి జిల్లాల్లో తప్ప- మిగతా అన్నిచోట్లా కూడా- దీపావళీ మార్కెట్ స్థితి- డబుల్ ధమాకాగానే సాగిపోతోంది- అన్నట్లు మార్కెట్ సరళి - సందడి అన్నిచోట్లా కనబడుతున్నాయి.
కాగా- తమిళనాడులోనయితే- జయమ్మ ‘ఖజానా’ లోనుంచి 185 కోట్ల రూపాయలు తీసి- అన్నిరకాల, అన్నివర్గాల- గవర్నమెంట్, సెమీ గవర్నమెంటు ఉద్యోగులకి- 20శాతం బోనస్‌గా ముందే ప్రకటించేసింది. లక్కీ తంబీ!
ఆంధ్రావనిలో- అన్నపూర్ణగా వాసికెక్కిన ప్రాంతం మాత్రం ‘‘ఘర్‌ఘర్ మేఁదివాలీ హై- మేరేఘర్ మేఁఅంధేరా’’ - అన్న పాత పాటని తల్చుకుని కుమిలిపోతున్నది.
అక్కడ కేంద్రం కదిలి, ఈ ‘అంచున’వున్న ఆంధ్ర తీర దుస్థితిదాకా వచ్చేలోగా- ప్రకటనల వానలు మాత్రం కురుస్తాయ్. ఈలోగా మళ్లీ- మరో ‘నీలం’లేదా- మరో ‘యమపాశం’- సస్యశ్యామలాంధ్రం మీదికి దుముకుతుందేమో? నన్న భయం వుంది. అయినా సామాన్యుడు మొండి ఘటం. ఓ దీపం స్విచ్ ‘ఆఫ్’చేసి- మరో దీపం స్విచ్ ‘ఆన్’చేసినట్లు- కష్టాలనంతమైనా, సంసార సాగరాన్ని ఈదుకుంటూ- మన కల్చర్‌కోసం- తన కుటుంబంకోసం- దీపావళికి చప్పుళ్లు తగ్గినా- దీపాలు మాత్రం వెలిగించక మానడు. ఓ కంట నీరం- ఓ కంట ఆనందబాష్పంగా- దీపావళి మార్కెట్ జోరుగానే సాగుతోంది.
వినియోగదారుడు- ‘చప్పుళ్లూ’, ‘వెల్తుర్లూ’కొంటూంటే వినియోగదారిణి ‘‘-రకరకాల ‘శారీమాల్స్’- ‘జీన్‌మేళాలూ’, ‘లెగ్గింగ్స్ హేలాలూ’’ - దీ(పా)వళీ- (సారీ! దీపావళీ అనాలి) డబుల్ ధమాకాల్లో బిజీ అయిపోతోంది.
ఫుట్‌పాత్‌ల మీద కూడా- చైనా దీపాలూ, చైనా ప్రమిదలు, లాంతర్లూ, స్టాండులూ వగైరా- కనుల పండువగా- దిగడిపోయాయి. లాంతర్‌లు, దియాలు- అనడం నాగరికత. లాంతర్ అంటే- పాతకాలపు హరికేన్‌లాంతర్ కాదు. శోభాయమానంగా వ్రేలాడుతూ వుండే- విద్యుత్ కళాకృతుల్ని లాంతర్లు అంటున్నారు.
‘అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా’ (‘అసోచెమ్’) వారి సోషల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఏ.ఎస్.డి.ఎఫ్) సంస్థ సీరియస్‌గా- రుూ దీపావళి మందు మార్కెట్ సర్వే చేసింది. దేశవాళీ- దీపావళీ సామగ్రికి- పరదేశీ చైనావళి సరుకులు ఎంతో ఎక్కువ పోటీ యిస్తోంది! ఎంత? అంటే- 45 శాతం అనగా ఫార్టీఫైవ్ పర్సెంట్ అన్నమాట. పైగా- దీపాలంకార పాత్రలు, తోరణాలూ మాత్రమేనా? లక్ష్మీ, గణపతి, పార్వతీ- వగైరా దేవతామూర్తుల ‘రూపు’లన్నీ -‘‘చైనా సే ఆరహేఁహైఁ!’’ అంటే- దిగడుతున్నాయి. పైగా- మన ప్రమిదలు (మట్టివే వాడుడూ’- అని పాడుదాం) గానీ, ప్లాస్టిక్ వీ గట్రా వాడుతాం. బిజినెస్ 72 శాతం దెబ్బతిన్నదిట! మై డ్రాగన్!
అనగా, రుూ మేరకు మన దీప కార్మికుడు చావుదెబ్బతింటున్నట్లేగా?
అద్సరేగానీ- చైనా దీపాల తోరణాలే ఎందుకు వాడుతున్నారు? అని మనం పండుగ మనుషుల్ని అడిగితే- ఓ- ‘సా’యిలా చెప్పాడు. మన వంద రూపాయలతో- చైనా సామగ్రి కొంటే - మనకి 135 రూపాయల సరుకు లభిస్తోంది స్వామీ! పైగా చైనా దీపాల తోరణం అపార వర్ణశోభితంగా వెలిగి- మన సరుకు పీల్చుకునే విద్యుచ్ఛక్తికన్నా చాలా తక్కువ ‘కరెంట్’ని త్రాగుతాయి.
కాగా - రుూ వ్యాపారంలో ఇండో చైనా ఛాంబర్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి- డి.ఎస్.రావత్‌గారి ఉవాచ! ఎంత దారుణం!
సో విష్ యూ మోర్ లైట్ అండ్ లెస్ సౌండ్!

దేశ దేశాల దీపావళి పండుగల సంగతి దేవుఁడెరుగు- మన దేశంలో మాత్రం-
english title: 
deepalu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>