చూడబోతే ఇప్పుడు సీజనంతా వార్షికోత్సవాల కాలంలా కన్పడుతోంది. నిన్నగాక మొన్న ‘ఉత్తరాన్’ ధారావాహిక వెయ్యి ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంటే, తాజాగా ‘బడే అచ్చే లగ్తే హై’ మూడొందల భాగాలను విజయవంతంగా పూర్తిచేసుకుంది.
ప్రతీ భాగమూ ప్రత్యేకమైనదే
‘బడే...’లో ప్రధాన భూమిక పోషించిన సాక్షి తన్వార్ ‘‘చూస్తూ చూస్తూంటేనే ఈ సీరియల్ మూడొందల భాగా న్ని పూర్తిచేసేసుకుంది. ఇందులో ప్రసారమైన ప్రతి ఎపిసోడూ ప్రత్యేకత గలదే. ఆర్టిస్టుగా నాకు అనేకానేక మధు రానుభూతుల్ని మిగిల్చిందీ సీరియల్. షూటింగ్ సమయంలో సహ నటీనటులతో ఏర్పడిన ఆత్మీయభావన తలుచుకుంటేనే మరో ప్రపంచంలోకి వెళ్లిపోతున్నాను. ఈ సందర్భంగా ఈ ధారావాహికకిలా బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అంటున్నారు. ఇందులో రామ్కపూర్ సరసన నటించిన సన్నివేశాలు బాగా పండాయి. సాక్షి తన్వార్, కూతురుగా నటించిన అమృతా ముఖర్జీతోనూ మంచి అనుబంధం కలిగింది. ‘‘ముఖ్యంగా అమృతాకున్న ఎనర్జీ స్థాయి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది’’.. అంటారు సాక్షి తన్వార్.
చూడబోతే ఇప్పుడు సీజనంతా వార్షికోత్సవాల కాలంలా కన్పడుతోంది.
english title:
three
Date:
Tuesday, November 13, 2012