కరఁగు: ద్రవించుట
కరుగు: ద్రవింపఁజేయుట
కఱ, కఱు: కొఱుకుట
కఱచు: అభ్యసించుట
కలఁగు,
కలతపడు,
కలకపాఱు,
కలఁగుడువడు: కలుషవౌట
కలుగు: లభించుట, పుట్టుట, కలుషవౌట
కలియు: పొందుట, కూడుట
కలుపు: కూర్చుట, కలుషముగఁజేయుట
కలువరించు,
కలవరించు: స్వప్నములో మాటలాడుట
కలగను: స్వప్నమొందుట
కవియు: అభిముఖముగాఁగలహము కుద్యుక్తుఁడౌ
కసురు,కసరు: తిట్టుట
కసుగందు: పుష్పాదులు కొంచెముగా వాడిపోవుట
కాఁగు: తప్తవౌట
కాంచు: చూచుట
కాచు: ఫలించుట, ప్రతీక్షించుట, ఆవులు మొదలైన వానిని బాలించుట.
వెనె్నలగాని, యెండగాని ప్రకాశించుట
(ఆంధ్ర ధాతుమాల నుంచి)
కరఁగు: ద్రవించుట
english title:
Verbal Bases
Date:
Saturday, December 1, 2012