సిడ్నీ, జనవరి 30: టెస్టు సిరీస్‌ను 0-4 తేడాతో ఓడిపోయిన టీమిండియాను ఆస్ట్రేలియా జట్టు కోచ్ మికీ ఆర్థర్ దెబ్బతిన్న పులితో పోల్చాడు. ఏ క్షణంలోనైనా ఎదురుదాడికి దిగుతుందని జోస్యం చెప్పాడు. సోమవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు కూడా పాల్గొనే ముక్కోణపు వనే్డ సిరీస్‌లో విభిన్నమైన భారత జట్టును చూస్తామని వ్యాఖ్యానించాడు. సురేష్ రైనా, రోహిత్ శర్మ వంటి యువ ఆటగాళ్లు బుధవారం జరిగే మొదటి టి-20 మ్యాచ్‌లో అద్భుతాలు సృష్టించే అవకాశం లేకపోలేదని అన్నాడు. విరాట్ కోహ్లీ సమర్థుడైన ఆటగాడని, రవీంద్ర జడేజా వంటి యువ ఆల్‌రౌండర్ టీమిండియాకు అండగా నిలుస్తాడని చెప్పాడు. ఆసీస్ జట్టులోనూ యువ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని, కాబట్టి టి-20 సిరీస్‌తోపాటు, ముక్కోణపు వనే్డ టోర్నీ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుందని ఆర్థర్ పేర్కొన్నాడు. వికెట్‌కీపర్ హాడిన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మాథ్యూ వేడ్ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టి-20, వనే్డ టోర్నీలకు ఆసీస్ జట్టు ఎంపిక ఉందని స్పష్టం చేశాడు.
ఆసీస్ కోచ్ ఆర్థర్ వ్యాఖ్య
english title:
wounded tiger
Date:
Tuesday, January 31, 2012