కోల్‌కతా, జనవరి 30: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌కు అసాధారణ ఆదరణ లభించడంతో మిగతా క్రీడా సమాఖ్యలన్నీ ఇలాంటి టోర్నీలపైనే దృష్టిపెట్టాయి. భారత ఫుట్‌బాల్ సమాఖ్య కూడా దేశవిదేశాల సాకర్ ఆటగాళ్లతో భారీ టోర్నమెంట్‌ను నిర్వహించనుంది. ప్రీమియర్ లీగ్ సాకర్ (పిఎల్‌ఎస్)గా పేర్కొనే ఈ టోర్నమెంట్ కోసం సోమవారం ఇక్కడ వేలం జరిగింది. పేరొందిన ఆటగాళ్ల కోసం వివిధ ఫ్రాంచైజీలు పోటీపడగా, ఇటలీ మాజీ కెప్టెన్ ఫాబియో కానవరో జాక్‌పాట్ కొట్టాడు. 2006లో ప్రపంచకప్ సాకర్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఇటలీ జట్టుకు నాయకత్వం వహించిన కానవరో మోకాలి గాయం కారణంగా ఆతర్వాతి ఏడాదే అంతర్జాతీయ సాకర్ నుంచి రిటైర్ అయ్యాడు. అతనిని సిలిగురి ఫ్రాంచైజ్ ఏకంగా 8,30,000 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. పిఎల్‌ఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం. ఫ్రెంచ్ మిడ్‌ఫీల్డర్ రాబర్ట్ పైరెస్‌కు హౌరా ఫ్రాంచైజ్ 8,00,000 డాలర్లు వెచ్చించింది. ట్యాగ్ ప్రైజ్ 8,40,000 డాలర్లు ఉన్న చెల్సియా మిడ్‌ఫీల్డర్, అర్జెంటీనా మాజీ ఆటగాడు హెర్మన్ క్రెస్పో అత్యధిక మొత్తాన్ని పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడని అనుకున్నా, అంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. చివరికి బారాసత్ ఫ్రాంచైజీ అతనిని అదే మొత్తానికి తీసుకుంది. ఈ వేలంలో క్రెస్పో ఎక్కువ మొత్తాన్ని సంపాదించినా, ఎవరూ ఊహించని రీతిలో కానవరోకు జాక్‌పాట్ లభించింది. పిఎల్‌ఎస్‌లో సిలిగురి, హౌరా, బారాసత్‌తోపాటు దుర్గాపూర్, కోల్‌కతా ఫ్రాంచైజీలు ఉన్నాయి. పిఎల్‌ఎస్ మ్యాచ్‌లు వచ్చేనెల ప్రారంభమవుతాయి.
క్రికెట్ టోర్నమెంట్‌కు అసాధారణ ఆదరణ లభించడంతో మిగతా క్రీడా సమాఖ్యలన్నీ ఇలాంటి టోర్నీలపైనే దృష్టిపెట్టాయి.
english title:
jackpot
Date:
Tuesday, January 31, 2012