విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల సంఖ్య నేడు గణనీయంగా పెరిగింది. ఇదివరకటిలా కాకుండా నేడు మధ్యతరగతి స్థాయినుంచి ఉన్నత వర్గాలకు చెందినవారు సైతం విదేశాలకు వెళ్లడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే అభ్యర్థులు నేరుగా కాకుండా కొన్ని అర్హత పరీక్షల్లో పొందిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశానికి వీలు కల్పిస్తారు. అలా విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి అర్హత కల్పించే పరీక్షే జిఆర్‌ఇ (గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్). ఈ పరీక్షలో మంచి మార్కులు పొందిన అభ్యర్థులు అమెరికాలో ఇంజనీరింగ్, సైన్సు, ఆర్ట్స్, పోస్టుగ్రాడ్యుయేషన్, పరిశోధన విభాగాల్లో ప్రవేశం పొందడానికి వీలుంటుంది. ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ అనే సంస్థ2ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
జి.ఆర్.ఇలో జనరల్ టెస్ట్, సబ్జెక్ట్ టెస్ట్ అనే రెండు విభాగాలలో అభ్యర్థి ప్రతిభను అంచనా వేస్తారు. జనరల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు. అందువల్ల దీనిని ఏడాది పొడవునా నిర్వహిస్తారు. కాని సబ్జెక్టు టెస్టు మాత్రం కేవలం నిర్దిష్ట తేదీలలో మాత్రమే నిర్వహిస్తారు.
జనరల్ టెస్ట్: ఇందులో వెర్బల్, క్వాంటిటేటివ్, ఎనలిటికల్ టెస్టులుంటాయి.వెర్బల్ విభాగంలో ఇచ్చే 30 ప్రశ్నలకు గాను 30 నిముషాల వ్యవధిని ఇస్తారు. క్వాంటిటేటివ్ విభాగంలో ఇచ్చే 28 ప్రశ్నలకు 45 నిముషాల సమయాన్ని ఇస్తారు. ఎనలిటికల్ టెస్టులో 35 ప్రశ్నలకు గాను గంట సమయాన్ని కేటాయిస్తారు.
వెర్బల్ విభాగంలో అభ్యర్థి ఇచ్చిన సమాచారాన్ని ఏ విధంగా విశే్లషించి మూల్యాంకనం చేసి కొత్త సమాచారాన్ని రాబడుతున్నాడనే విషయాన్ని అంచనా వేస్తారు.
క్వాంటిటేటివ్ విభాగంలో గణితానికి సంబంధించిన ప్రశ్నలడుగుతారు. ఎనలిటికల్ విభాగంలో వివిధ స్ట్రక్చర్ సెట్స్ సంబంధాన్ని, ఆ సమాచారంతో కొత్త సమాచారం ఇవ్వడాన్ని అంచనా వేస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కంప్యూటర్ స్క్రీన్‌మీద కనిపించే ప్రశ్నలకు ఒకదాని తర్వాత ఒకటిగా సమాధానాలు ఇచ్చుకోవాలి. ఈ పద్ధతిలో వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. ప్రశ్నలన్నీ అభ్యర్థి ప్రతిభ మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ముందు ఓ కష్టతరమైన ప్రశ్న అడిగితే, దానికి అభ్యర్థి సమాధానం ఇవ్వలేకపోతే తర్వాత ప్రశ్న కొంచెం సులువుగా ఉంటుంది. అలాగే అభ్యర్థి ముందిచ్చిన కష్టతరమైన ప్రశ్నకు సమాధానం ఇస్తే, తర్వాత ఇచ్చే ప్రశ్న ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. ప్రశ్నల కష్టాన్నిబట్టి మార్కులలో కూడా హెచ్చుతగ్గులుంటాయి. ఇక స్కోరింగ్‌కి సంబంధిం ఏ విభాగానికి ఆ విభాగంలో స్కోరులు ప్రత్యేకంగా ఇస్తారు. అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు, తీసుకున్న సమయాన్నిబట్టి స్కోర్ ఆధారపడి ఉంటుంది.
సబ్జెక్టు టెస్ట్: ఈ పరీక్షలో సబ్జెక్టుపై అభ్యర్థికున్న ప్రతిభా సామర్ధ్యాలను అంచనా వేస్తారు. కంప్యూటర్ సైన్స్, బయో కెమిస్ట్రీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లిటరేజర్, ఫిజిక్స్, మేధ్స్, సైకాలజీ తదితర అంశాలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఏడాది పొడుగునా కాకుండా నిర్దేశిత తేదీల్లో నిర్వహిస్తారు. దీనికి సంబంధించి స్కోర్‌ని అంచనా వేసేందుకు రెండు పద్ధతులను అనుసరిస్తారు. మొదట అన్ని అంశాలు కలిపి ‘రా’ స్కోరు నిర్ణయిస్తారు. అనంతరం తప్పుడు సమాధానాలకు పావువంతు చొప్పున మార్కులు తీసేసి ‘రా’ స్కోరు లోంచి తీసేస్తారు. రెండో అంచెలో విడిస్కోర్, స్కేల్డ్‌స్కోర్ తదితరాలుంటాయి. స్కోర్ రిపోర్టులో ప్రతి టెస్టుకి విడిగా మొత్తం స్కోర్, పర్సంటైల్ స్కోర్ ఇస్తారు. సబ్ స్కోరులు కూడా ఉంటాయి. టెస్టు రేంజి 200-900 మధ్య, సబ్‌స్కోర్ 20-99ల మధ్య ఉంటుంది. పర్సంటైల్ స్కోర్ అంతకు ముందు మూడేళ్ల స్కోర్‌లను బట్టి ఉంటుంది.
రైటింగ్ అసెస్‌మెంట్: ఈ టెస్టు జిఆర్‌ఇకి సంబంధం ఉండదు. ఆయా విశ్వవిద్యాలయాల నిర్ణయం మేరకు ఈ టెస్టు నిర్వహిస్తారు. క్రిటికల్ రీజనింగ్, ఎనలిటికల్ రైటింగ్‌పై అభ్యర్థి ప్రతిభను అంచనా వేయడానికిగాను ఈ టెస్టుని ఉద్దేశించారు. ఈ టెస్టులో ఇష్యూటాస్క్, ఆర్గ్యుమెంట్ టాస్క్‌లనే రెండు ఉప విభాగాలుంటాయి. ఇష్యూటాస్క్‌లో అభ్యర్థి ఒక విషయంపై తన దృక్పథాన్ని తెలియజేయాల్సిఉంటుంది. అలాగే ఆర్గ్యుమెంట్ టాస్క్‌లో ఓ ఆర్గ్యుమెంట్‌ని విశే్లషించాల్సి ఉంటుంది.
ఫీజు వివరాలు: అభ్యర్థులు జనరల్ టెస్టుకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీ షెడ్యూలింగ్‌కి కూడా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టెస్టు రద్దు చేసుకునే కట్టిన ఫీజులో కొంత భాగాన్ని వాపసు ఇస్తారు.
ఎక్కడ నిర్వహిస్తారు: బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌లతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల సంఖ్య
english title:
gre exam
Date:
Friday, February 3, 2012