ఈనాడు హెచ్.ఆర్. నిపుణులకు (హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్) విపరీతమైన డిమాండ్ వుంది. ఫలితంగా ఇతర రంగాల్లో వలెనే హెచ్‌ఆర్‌డిలో కూడా ఉద్యోగులకు విపరీతమైన పోటీ ఉంది. అయినప్పటికీ నిపుణులకు, ప్రతిభావంతులకు అవకాశాలు అక్షర లక్షణాలుగా ఉన్నాయి. హెచ్.ఆర్. ఉద్యోగులు లాభనష్టాల గురించి, మరి ఇతర అంశాల గురించి ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని నేడు అనేక కంపెనీలు ఆశిస్తున్నాయి. మరో విశాలమైన యదార్థ దృక్పథాన్ని కలిగి ఉండాలని కూడా కోరుతున్నారు. హెచ్.ఆర్. నిర్వహించే పనులు కంపెనీ వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉండడంతోపాటు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్స్ ఆ వ్యాపారులకు సంబంధించిన మేనేజర్లు సిబ్బందిని కూడా పర్యవేక్షించాలని పలు కంపెనీలు కోరుతున్నాయి. ఇదిలా వుంటే ఎంబిఎ డిగ్రీ పురోగతికి అవసమైందే - కాని ప్రసిద్ధి చెందిన సంస్థల నుంచి పొందితే తప్ప దానికి ఆశించినంత విలువ ఉండదని పలువురి అభిప్రాయంగా ఉంది. అందువల్ల అదనపు అర్హత కోసం హెచ్‌ఆర్ డిగ్రీ చేస్తే అవకాశాలు కోకొల్లలుగా వుంటాయి. ఎంబిఎ డిగ్రీ హ్యూమన్ రిసోర్స్ నిపుణులకు అనేక విధాలుగా ఉపయోగపడడమే కాకుండా ఒక కార్పొరేషన్ సీనియర్ వ్యూహరచయిత స్థానానికి ఎదగడానికి అవసరమయ్యే వ్యాపార పరిజ్ఞానాన్ని పొందడానికి దోహదపడుతుంది. హెచ్‌ఆర్ డిగ్రీ చేసిన వారు అనేకమంది ఉన్నప్పటికీ మరి ప్రతిభా సామర్థ్యాలననుసరించి ఎంపిక చేసుకోవాలని కంపెనీలు ఆశిస్తున్నాయి. హెచ్‌ఆర్ కార్యక్రమాల విడుదలలోనూ, కంపెనీ వ్యవస్థీకరణలోను స్థూలమైన మార్పు జరుగుతున్న కారణంగా, ఎంపిక ప్రక్రియలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. అందువల్ల ఉద్యోగాలు కోరేవారు పోటీని తట్టుకోవాలంటే మంచి విద్యార్హతలను, పని సామర్థ్యాలను సమపాళ్ళలో సంపాదించుకుని ఉండాలి.
డిగ్రీలలో ఉన్నత శ్రేణులు, మంచి తెలివి తేటలతోపాటు కంపెనీ లాభాలకు, భవిష్యత్ పురోభివృద్ధికి దోహదపడే వారినే అనేక కంపెనీలు కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైన నిపుణత, గతానుభవంతోపాటు హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంటుకు, సంస్థలకు లాభసాటి సభ్యులైన గ్రాడ్యుయేట్లను (హెచ్.ఆర్‌లో) ఎంపిక చేసుకుంటున్నాయి. ఎంపిక విషయంలో ఈ కింది నియమాలను కంపెనీలు పాటిస్తున్నాయి.
* కేవలం డిగ్రీ పుచ్చుకున్నంత మాత్రాన, అభ్యర్థులను ఉద్యోగావకాశాలను కంపెనీలు కల్పించవు. అనుభవం, సామర్థ్యంతోపాటు ఇతర ముఖ్య విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తాయి.
* అంతర్గత సంప్రదింపులు, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు తమ సేవలను పూర్తికాలం వినియోగించేవారినే కంపెనీలు ఎంపిక చేస్తాయి. అందువల్ల ఈ రంగంలో రాణించాలనుకునే వారికి మంచి సంభాషణా చాతుర్యం, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, పరస్పర అవగాహనా ప్రావిణ్యాలు కలవారికే ఉన్నత అవకాశాలు వరిస్తాయి.
* హెచ్‌ఆర్‌లోని క్రియాశీలక పనులు అంటే నష్టపరిహారం, లాభాలవంటి వాటిని కంప్యూటర్, సాంకేతిక సమాచార పద్ధతుల ద్వారా నిర్వహిస్తారు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞాన ప్రావిణ్యతలను అదనపు అర్హతలుగా కంపెనీలు భావిస్తారు.
* విదేశీ భాషా పరిజ్ఞానం వివిధ జాతుల ప్రజలతో కలిసి మెలిసి పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీలు అలాంటి అర్హతలున్న వారి కోసం అనుక్షణం అనే్వషణలో వుంటాయి.
* విద్య ద్వారాను, గత ఉద్యోగాలనుభవం ద్వారానూ హెచ్.ఆర్. విద్యార్థులు వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన ప్రాథమిక అంశాలు లాభాలు గడించే పద్ధతులపై అవగాహన ఉందని నిరూపించుకోవాలి. హెచ్‌ఆర్‌ను ఓ స్థాయిలో ఉంచి దానినే విధంగా ఉపయోగించుకోవాలో వివరించగలిగే స్థితిలో హెచ్‌ఆర్ డిగ్రీ అభ్యర్థులు కలిగి ఉండాలని కంపెనీలు ఆశిస్తున్నాయి. అలాగే సంస్థ కింది స్థాయి నుంచి భవిష్యత్‌లో పురోభివృద్ధి చెందడానికి ఇదే కీలకమైందని తెలుపగల వారై ఉండాలి.
* హెచ్‌ఆర్ ఉద్యోగాలలో మాస్టర్ డిగ్రీ ఉన్న వారినే వరిస్తున్నాయి. మాస్టర్ ప్రోగ్రామును ఎంపిక చేసుకోవడంలో ఎంబిఎ గాని, ప్రత్యేక డిగ్రీ అయిన మాస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ లేబర్ రిలేషన్స్ డిగ్రీని కాని ఎంచుకోవచ్చు. ఎంబిఎ అభ్యర్థులు మార్కెటింగ్, ఆర్థిక వనరులు, జమా లెక్కలు, వ్యాపార చట్టాలలో విస్తృతమైన శిక్షణ పొందడానికి వీలు కల్పిస్తుంది. అది హెచ్‌ఆర్ డిగ్రీ హోల్డర్లకు లాభాలు సమకూర్చి పెడుతుంది.
* సాధారణ ఉద్యోగాలను కోరే కంపెనీలు హెచ్‌ఆర్ లోనికి కాలేజీ గ్రాడ్యుయేట్లను నేరుగా తీసుకోరు. కానీ కార్యాలయంలో అంతర్గత బదిలీలు చేయడం ద్వారా హెచ్‌ఆర్ సిబ్బందిని పూరిస్తారు. ఇలాంటి కంపెనీలు ఎంబిఎలను కోరుకుంటారు. కొన్ని కంపెనీలు బెపిఫిట్స్ కో-ఆర్డినేటర్ లేదా అసిస్టెంట్ హెచ్‌ఆర్ మేనేజర్ వంటి స్థానాల్లోకి కాలేజీ గ్రాడ్యుయేట్లను నేరుగా తీసుకుంటాయి. ఈ కంపెనీలు కూడా మాస్టర్స్ డిగ్రీనే ఎక్కువగా కోరుకుంటాయి.
గుర్తించుకోవాల్సిన అంశాలు:
* మాస్టర్స్ డిగ్రీ ద్వారా అత్యధిక జీతం పొందలనుకుంటే పనిలో అనుభ చాలా అవసరం. అండర్ గ్రాడ్యుయేట్ నుంచి వెంటనే మాస్టర్ డిగ్రీకి వెళ్ళడం శ్రేయస్కరం కాదు. చదువుకుంటూనే ఓ కంపెనీలో పనిచేయడానికి ప్రయత్నించాలి. పశ్చిమ దేశాల్లో ఈ ఆనవాయితీ ఉంది. ఆసియా దేశాల్లోనూ ఈ పద్ధతిని పాటిస్తున్నాయి.
* కాలేజీ గ్రాడ్యుయేట్లు విస్తృతమైన విశే్లషణ విభాగాల్లో శిక్షితులై ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. ఆ విధంగా హెచ్‌ఆర్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాలనుకునే అభ్యర్థులు పెట్టుబడి లేక అకౌంటింగ్ సంబంధిత వ్యాపార రంగంలోగాని, లిబరల్ ఆర్ట్స్‌లోని అర్థశాస్త్రంలోనూ లేదా మనస్తత్వ శాస్త్రంలోగాని కోర్స తీసుకోవచ్చు.
* ప్రాథమిక వ్యాపార రంగాల్లో భాగమైన అకౌంటింగ్, ఫైనాన్స్ కోర్సులలో అభ్యర్థులు శిక్షణ పొందక పోతే ఎంఎస్ వంటి స్పెషలైజ్డ్ మాస్టర్స్ డిగ్రీని ఎంపిక చేసుకున్నప్పుడు అధిక పోటీని ఎదుర్కోవలసి వస్తుంది.
* వ్యాపార రంగంలోనూ, హెచ్‌ఆర్ ప్రాథమిక రంగాల్లో కోర్సులు తీసుకోవడంతోపాటు విద్యార్థులు ఉద్యోగ చట్టం, కార్మిక అర్థశాస్త్రం, సంస్థాపర మార్పులు, నిపుణుతగల మేనేజ్‌మెంట్ రంగాల్లో కోర్సులు చేయాలి. చివరికి రెండు రంగాల్లో అనుభవం సంపాదించడంవల్ల అభ్యర్థులకు విపరీతమైన డిమాండ్ పలుకుతుంది.
ఈనాడు హెచ్.ఆర్. నిపుణులకు (హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్) విపరీతమైన డిమాండ్ వుంది.
english title:
hr experts
Date:
Friday, February 3, 2012