నేషనల్ లా యూనివర్సిటీ, న్యూఢిల్లీ డిప్లమో ఇన్ కాంపిటీషన్ పాలసీ అండ్ లా, సర్ట్ఫికెట్ కోర్స్ ఇన్ కాంపిటీషన్ పాలసీ అండ్‌లాలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు; ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 25. ఇతర వివరాలకు హెచ్‌టిటిపి://ఎన్‌ఎల్‌యు ఢిల్లీ డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
పీజీ డిప్లమో ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్
జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైన్స్ ఎడ్యుకేషన్ పీజీ డిప్లమో ఇన్ సైన్స్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బిఎస్‌సి/ఎంఎస్‌సి చేసి టీచర్‌గా అనుభవం ఉన్నవారు అర్హులు. దరఖాస్తులను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మార్చ 5. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ జెఎన్‌సిఏఎస్‌ఆర్ డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
పిహెచ్‌డి ప్రోగ్రామ్ ఇన్ హిందీ
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా పిహెచ్‌డి ప్రోగ్రామ్ ఇన్ హిందీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఎంఏ/ఎంఫిల్ ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలకు చివరి తే దీ 2012 మార్చి 2. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ సిఏఎల్‌యుఎన్‌ఐవి డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
పీజీడీఎం ప్రోగ్రామ్
ఎంఐటి స్కూల్ ఆఫ్ బిజినెస్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ మేనేజ్‌మెంట్ (మార్కెటింగ్/ఫైనాన్స్/హ్యూమన్ రిసోర్స్) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఎంపిక క్యాట్/మ్యాట్/సీమ్యాట్/ఎక్స్‌ఏటి/ఏటిఎంఏ స్కోర్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 జూలై 15. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఏఐసిటిఈ-సీమ్యాట్ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హర్యానా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మార్చి 30. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎన్‌ఐఎఫ్‌ఎం డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఐఐటిఎంలో కోర్సులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్ ఎర్త్ సిస్టమ్ సైనె్సస్ అండ్ క్లైమేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఎంఎస్‌సి/ఎంఎస్/ఎంటెక్ ఇన్ మెటీయోరాలజీ/అట్మాస్ఫియరిక్ సైనె్సస్/కెమిస్ట్రీ/ఓషనోగ్రఫీ/్ఫజిక్స్/స్టాటిస్టిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్ ఉండాలి. ఎంపిక సిఎస్‌ఐఆర్ నెట్‌లో క్వాలిఫై ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఏప్రిల్ 15. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎంఓఈఎస్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఎన్‌పిసిసిలో ఉద్యోగాలు
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యుటివ్ డైరక్టర్ (ఇంజనీరింగ్)-2, ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్/అకౌంట్స్)-1, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్)-1, గ్రూప్ జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్)-4, జనరల్ మేనేజర్ (ఫైనాన్స్/అకౌంట్స్)-2, జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్)-1, జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్/అకౌంట్స్)-3, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్/అకౌంట్స్)-1, డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్)-2, సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్/అకౌంట్స్)-3, సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్)-2, మేనేజర్ (సివిల్)-15, మేనేజర్ (ఫైనాన్స్/అకౌంట్స్)-9, మేనేజర్ (హెచ్‌ఆర్)-2, మేనేజర్ (లా)-2, డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్)-30, డిప్యూటీ మేనేజర్ (హెచ్‌ఆర్)-4, డిప్యూటీ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్)-2, డిప్యూటీ మేనేజర్ (లా)-4, మేనేజర్ (ఐటి)-2, డిప్యూటీ మేనేజర్ (ఐటి)-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: ఎంఈ/ఎంటెక్/బిఈ/బిటెక్/ఎంబిఎ/ఎంసిఎ ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 11. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎన్‌పిసిసి డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు
ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ వెటరినరీ అసిస్టెంట్ సర్జన్-609 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జోన్-1లో క్లాస్-ఎ-70, క్లాస్-బి-1, జోన్-2లో క్లాస్-ఎ-86, క్లాస్-బి-3, జోన్-3లో క్లాస్-ఎ-70, క్లాస్-బి-1, జోన్-4లో క్లాస్-ఎ-115 పోస్టులున్నాయి. అర్హతలు: క్లాస్-ఎ పోస్టులకు వెటరినరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండ్రీలో డిగ్రీ ఉండాలి. క్లాస్-బి పోస్టులకు వెటరినరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీలో డిగ్రీ మరియు వెటరినరీ సైన్స్ ఇన్ మైక్రో బయాలజీ/పారా సైటాలజీ/ఎపిడిమియాలజీ/వైరాలజీ/ఇమ్యునాలిజీ/పాథాలజీ/బయో టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. వయసు 36 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తులను అభ్యర్థియొక్క డిగ్రీ/పీజీ డిగ్రీ సర్ట్ఫికెట్ కాపీ మరియు ఫోటోగ్రాఫ్‌ను జతపరిచి తపాలా ద్వారా గానీ లేదా స్వయంగా కానీ డైరక్టర్ ఆఫ్ యానిమల్ హెజ్బెండ్రీ కార్యాలయంలో 2012 ఫిబ్రవరి 1 నుండి పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను 2012 ఫిబ్రవరి 15 లోగా డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హజ్బెండ్రీ కార్యాలయం, శాంతినగర్, హైదరాబాద్-500028 చిరునామాకు పంపాలి.
ఏపిఈపిడిసిఎల్‌లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సబ్ ఇంజనీర్స్-20, జూనియర్ అసిస్టెంట్స్-58, జూనియర్ లైన్‌మెన్-937 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు: సబ్ ఇంజనీర్స్‌కు బిఈ/బిటెక్/డిప్లమో ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. జూనియర్ అసిస్టెంట్స్‌కు ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్/ఆఫీస్ ఆటోమేషన్‌లో డిప్లమో ఉండాలి. జూనియర్ లైన్‌మెన్‌కు పదవ తరగతితోపాటు ఎలక్ట్రికల్ వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటిఐ లేదా ఇంటర్ ఒకేషనల్ ఉండాలి. వయసు 36 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 22 జూనియర్ లైన్‌మెన్‌కు, 2012 ఫిబ్రవరి 28 సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్‌కు. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఏపి ఈస్ట్రన్ పవర్ డాట్ కామ్ వెబ్‌సైట్ చూడండి.
నేషనల్ లా యూనివర్సిటీ, న్యూఢిల్లీ డిప్లమో ఇన్ కాంపిటీషన్
english title:
avi - ivi
Date:
Friday, February 3, 2012