Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చిరు ప్రయత్నం?

$
0
0

ఇష్టపడిన వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని స్నేహ సెటిలయిందన్న సంగతి తెలిసిందే. కానీ - ఆమె భర్త సినిమాల్లో వేసే అరకొర వేషాలు ఆమెకి సంతృప్తి నివ్వటం లేదు. అతణ్ణి హీరోగానో? కేరెక్టర్ యాక్టర్‌గానో చూడాలన్న తపన. ఇంట్లో కూర్చుంటే అవకాశాలు ఎవరిస్తారు? టాలీవుడ్‌లోనూ కోలీవుడ్‌లోనూ ఉన్న పరిచయాల్తో తన భర్తకు ఆఫర్లు ఇప్పించమంటూ పలువురిని కలుస్తోందిట. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న నాగార్జున చిత్రంలో స్నేహ భర్త ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడన్న వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. దీన్నిబట్టి పూర్వ పరిచయాలు సత్ఫలితాల నిచ్చినట్టే. ఆమె నటించినా నటించక పోయినా తన భర్తకు అవకాశాలు ఇప్పించే ప్రయత్నం హర్షించతగ్గదే. ఈ ప్రయత్నాలు ఎన్ని అవకాశాల్ని తెచ్చిపెడతాయో చూడాలి మరి!

ఇష్టపడిన
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles