సంగారెడ్డిరూరల్,జనవరి 25:ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలి సంప్రదాయాలు అంతరించిపోతున్న తరుణంలో పెద్దల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇందులో ఓటు హక్కు వినియోగం ప్రధానమైందని జిల్లా జిడ్జి టి.రజని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి పౌరుడు ఓటు హక్కును పొందేందుకు తన వివరాలను నమోదు చేయించుకోవాలని, ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల జీవితాల్లో కష్టాలు, ఇబ్బందులు ఎదురైనట్లైతే అవి మీరు వేసిన ఓటు ద్వారా మాత్రమే వచ్చినవిగా భావించాలన్నారు.18సంవత్సరాలు నిండిన పౌరసులు విధిగా ఓటు హక్కును పొంది వినియోగించుకోవాలని ఆమె సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం చేసిన ప్రతిజ్ఞను ప్రతి పౌరుడు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ప్రతిజ్ఞ విలువను కాపాడే విధంగా నడుచుకోవాలన్నారు. పౌరులు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే యువత గొంతు వినిపించాలని జిల్లా జడ్జి యువతకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు సరైన ఆయుధమన్నారు.ప్రపంచ దేశాలలో భారతదేశం ఆదర్శ వంతంగా నిలిచిదంటే దాని ప్రధాన కారణం ప్రజాస్వామ్య వ్యవస్థను ఓటు హక్కును ప్రజలందరూ వినియోగించడం వల్లే సాధ్యమైందన్నారు.కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లందరికి ఓటు హక్కు విలువను తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో 20,06,063మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 10,07,297మంది పురుషులు కాగా,9,98,717మహిళ ఓటర్లు ఉండగా, ఇతరులు 49మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లాలో పది శాసభ సభ నియోజకవర్గాల పరిధిలో 2,345పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు.నూతనంగా 18-19సంవత్సరాల పౌరులు ఓటు హక్కును నమోదు చేసుకున్న వారిలో 14109పురుషులు, 7170మంది స్ర్తిలు ఉన్నారని,19సంవత్సరాల పై బడిన వారు 30,039మంది పురుషులు,28204మంది స్ర్తిలు ఉన్నారని తెలిపారు.1-1-2013నాటికి నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారిలో మొత్తం 79,522మంది కాగా,ఇందులో 44148మంది పురుషులు,35374మంది స్ర్తిలున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. 3వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎన్ సంపత్ సందేశాన్ని జిల్లా కలెక్టర్ చదివి వినిపించారు.జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఏడుగురు సీనియర్ ఓటర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అదే విధంగా నూతనంగా ఓటు హక్కును పొందేందుకు నమోదు చేసుకున్న 9మంది యువతకు జిల్లా జడ్జి టి.రజని ఫొటో గుర్తింపు కార్డులను అందజేశారు.అంతకు ముందు స్థానిక ఐబి నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు.కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మానవహారంలో జిల్లా జడ్జి టి.రజని ప్రతి ఎన్నికల్లో నిర్బయంగా ఓటు వేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఐ.ప్రకాష్‌కుమార్,ల్యాండ్ సర్వే రికార్డ్ ఎడి ఇంద్రసింగ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సి.రంగారెడ్డి, జిల్లా యువజన సంక్షేమాధికారి ఆంజనేయశర్మ,వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు హక్కును
english title:
m
Date:
Saturday, January 26, 2013