మెదక్, జనవరి 25: నామినేషన్ పత్రం దాఖలు చేసిన క్రమసంఖ్యను మార్చి పరిశీలనలో తిరస్కరించగా అభ్యర్థి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగడంతో ఆమోదించిన సంఘటన మెదక్ సొసైటీలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రస్తుత చైర్మన్(టిడిపి)కు అనుకూలంగా డిఎల్‌సిఓ వెంకట్‌రెడ్డి క్రమసంఖ్యను దిద్దినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు సొసైటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్, సబ్ కలెక్టర్, మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ సొసైటీ పరిధిలో 6వ ప్రాదేశిక నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు గురువారం రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రస్తుత చైర్మన్ చిలుముల హన్మంతరెడ్డితో పాటు రాజ్‌పల్లికి చెందిన మార్గం నాగరాజు, మంబోజిపల్లికి చెందిన మ్యాకల రాములు, ర్యాలమడుగుకు చెందిన గంగన్నగారి శేక్‌రెడ్డిలున్నారు. అయితే మార్గం నాగరాజు క్రమసంఖ్య 3096 నెంబరు. ఇదే నెంబరును నామినేషన్ పత్రంలో రాయగా అదే రోజు సాయంత్రం నోటీసు బోర్డుపై కూడా అధికారులు అంటించారు. శుక్రవారం నామినేషన్ పరిశీలన సందర్భంగా నామినేషన్ పత్రంపై 3096 నెంబరును 3896గా దిద్దారు. దీంతో డిఎల్‌సిఓ సూచన మేరకు నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారి శారద పత్రం వెనకాల రాశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ విషయం తెల్సిన డిఎల్‌సిఓ వెంకట్‌రెడ్డి తిరిగి ఎంపిడిఓ సూచించడంతో నామినేషన్ ఆమోదిస్తున్నట్లు రాశారు. డిఎల్‌సిఓ సూచన మేరకు తాను వ్యవహరించినట్లు ఎన్నికల అధికారి శారద స్పష్టం చేశారు. అయితే ఉదయం సొసైటీ కార్యాలయానికి వచ్చిన డిఎల్‌సిఓ వెంకట్‌రెడ్డి కేవలం 6వ ప్రాదేశిక నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాలు మాత్రమే పరిశీలించడం గమనార్హం.
డిఎల్‌సిఓపై చర్య తీసుకోవాలి
6వ ప్రాదేశిక నియోజవకర్గంలో అభ్యర్థి మార్గం నాగరాజు నామినేషన్ తిరస్కరించి ప్రస్తుత చైర్మన్‌కు అనుకూలంగా డిఎల్‌సిఓ వెంకట్‌రెడ్డి వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, కిషన్‌గౌడ్, సిడిసి డైరెక్టర్ మామిళ్ల ఆంజనేయులు ఆరోపించారు. సొసైటీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రంను దిద్దినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రదీప్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంకట్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
నిబంధనల మేరకే వ్యవహరించాం : డిఎల్‌సిఓ వెంకట్‌రెడ్డి
నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డిఎల్‌సిఓ వెంకట్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ పత్రంపై దిద్దినట్లు ఉండడం వల్ల పరిశీలించిన తర్వాత ఆమోదించాలని సూచించినట్లు చెప్పారు. తాము ఎవరికి అనుకూలం కాదన్నారు.
* ముందు తిరస్కరించి తర్వాత ఆమోదం * ఆందోళనకుదిగిన కాంగ్రెస్ నేతలు
english title:
m
Date:
Friday, January 25, 2013