సంగారెడ్డిరూరల్, జనవరి 25: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉంటుందని, కాంగ్రెస్‌ను ఖతం చేసే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని, ఇందుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐబి ముందు కేంద్రమంత్రి సుశీల్‌కుమార్ షిండే, గులాం నబి ఆజాద్‌ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు.ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేస్తామని చెప్పి మరో మారు కాలయాపనకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ నెల 27న జరిగే తెలంగాణ సమరదీక్ష ద్వారా తెలంగాణ సత్తచాటాలన్నారు.
తెలంగాణ వ్యతిరేకులను లక్ష్యంగా చేసుకొని వీరాగం సృష్టిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు సంగమేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.జగన్, నాయకులు బుచ్చిరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీశైలం, ప్రతాప్‌రెడ్డి, కసిని వాసు, రమేష్, సంతోష్, మాణిక్యరావు, మల్లేశం, ఎల్లయ్య, రాములు, మానిక్యరావు, దుర్గాప్రసాద్, ద్వారక రవి, అశ్వంత్, వెంకట్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
* రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉద్ధృతం * బిజెపి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి
english title:
m
Date:
Saturday, January 26, 2013