గజ్వేల్, జనవరి 25: టిడిపి నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన గజ్వేల్ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పట్టణంలోర్యాలీ నిర్వహించి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేసిన క్రమంలో వ్యాపారులు స్వచ్చందంగా తమ దుకాణాలను మూసి వేశారు. అయితే సిద్దిపేట డిఎస్పీ శ్రీ్ధర్, గజ్వేల్ సిఐ చతుర్‌సింగ్ రాథోడ్‌ల నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టగా, బంద్ ప్రశాంతంగా సాగింది. కాగా టిడిపి మండల అధ్యక్షుడు ఉప్పల మెట్టయ్య ఇంటికి టిడిపి శ్రేణులు తరలివస్తున్నారనే సమాచారం మేరకు డిఎస్పీ శ్రీ్ధర్ నేతృత్వంలో అక్కడికి చేరుకున్నారు.
ఈక్రమంలో టిడిపి నేతలు, పోలీసులకు మద్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకోగా, టిడిపి నేత ఉప్పల మెట్టయ్యతోపాటు మరికొందరిని పోలీసులు ఠాణాకు తరలించి మిగిలిన కార్యకర్తలను అక్కడి నుండి చెదరగొట్టారు. కాగా ప్రస్తుతం గజ్వేల్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండగా, భారీగా పోలీసులను మోహరింపజేసి బందోబస్తు చేపట్టారు. అయితే కాంగ్రెస్ శ్రేణుల దాడిలో ప్రతాప్‌రెడ్డి గాయపడిన సమాచారం అందుకున్న టిడిపి జిల్లా అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు, రాష్ట్ర నేతలు ఎకె గంగాధర్‌రావు, బక్కి వెంకటయ్య, దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే జయపాల్‌రెడ్డిలు బూర్గుపల్లికి చేరుకొని పరామర్శించి సంఘటనకు సంబందించిన వివరాలు ఆయన నుండి అడిగి తెలుసుకున్నారు.
టిడిపి నేత
english title:
m
Date:
Saturday, January 26, 2013