* ప్రణాళికల రూపకల్పనకు కలెక్టర్ సమీక్ష
సంగారెడ్డిరూరల్,జనవరి 25: మంజీరా, పోచారం అభయారణ్యాలు, ఎక్కువ పర్యావరణ రక్షిత ప్రాంతాలుగా ప్రకటించడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం మంజీర డ్యాం వద్ద సంబంధిత అధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెన్సిటివ్ జోన్‌లో పరిశ్రమలు, విద్యుత్ లైన్లు, రోడ్లు వేయడానికి ముందు ఫారెస్ట్ అధికారుల అనుమతి పొందాలని సూచించారు. సెన్సిటివ్ జోన్ వన్య ప్రాణుల సంరక్షణకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ వచ్చే వేసవిలో ఎదురయ్యే మంచినీటి సమస్యపై మంజీర నదిలో అందుబాటులో ఉన్న నీటిని బోట్లో తిరిగి పరిశీలించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.శరత్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం సురేష్‌కుమార్, పంచాయతీ రాజ్ ఇంజనీర్ శ్రీరాములు, ట్రాన్స్‌కోఎస్‌ఈ రాములు, డివిజనల్ ఫారెస్ట్ అధికారి హరికుమార్ మెప్మా పిడి సాయిలు, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్, ఆర్‌అండ్‌బి ఈఈ,గ్రౌండ్ వాటర్ డిడి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మంజీరా, పోచారం అభయారణ్యాలు
english title:
m
Date:
Saturday, January 26, 2013