విశాలాక్షినగర్, ఫిబ్రవరి 25: ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ బలోపేతం చేయటానికి ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన రాష్టస్థ్రాయి సమావేశం నిర్ణయించింది. దీనిలో భాగంగా వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ మార్చి 4వ తేదీ నుండి ఉత్తరాంధ్రలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కార్యకర్తలలో నూతనోత్తేజాన్ని నింపటానికి విజయమ్మ నేరుగా పలు చోట్ల నిర్వహించే సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. సోమవారం వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ పట్ల ప్రజాధరణ పెరుగుతోందని కేంద్ర కమిటీ గుర్తించిందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో ఏ సమస్య మీదైనా పార్టీ స్పందించిన తీరుపై ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తోందన్నారు. ప్రతి కార్యకర్తను స్వయంగా కలిసి స్థానిక సమస్యలను పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తెలుసుకుంటా రన్నారు. 4వ తేదీన విజయమ్మ పర్యటన శ్రీకాకుళంలో ప్రారంభవౌ తుందన్నారు. మార్చి 4, 5 6 తేదీల్లో మూడురోజుల పాటు ఉత్తరాంధ్రలో విజయమ్మ పర్యటిస్తారన్నారు. అనంతరం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ ప్రజాసేవ చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని, పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని స్పష్టం చేశారు. నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు ప్రతి కార్యకర్త నిరంతరం పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ బలోపేతం చేయటానికి ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన రాష్టస్థ్రాయి సమావేశం
english title:
v
Date:
Tuesday, February 26, 2013