విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 25: దేశవాళి క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే వన్‌డే నాకౌట్ క్రికెట్ టోర్నమెంటు మంగళవారం ప్రారంభం కానున్నది. అయిదురోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీల్లో ప్రముఖ జాతీయ క్రికెటర్లు సురేష్ రైనా (ఉత్తర్ ప్రదేశ్), యువరాజ్ సింగ్ (పంజాబ్), గౌతం గంభీర్ (్ఢల్లీ), వినయ్ కుమార్, రాబిన్ ఊతప్ప (కర్నాటక), మహ్మద్ ఖైఫ్ (ఉత్తర్ ప్రదేశ్), పార్ధీవ్ పటేల్, వేణుగోపాలరావు (గుజరాత్)లతో పాటు జాతీయ జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న యువ క్రికెటర్లెందరో తమ సత్తా చాటనున్నారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న కర్నాటక, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ జట్లు సోమవారం ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ముమ్మర సాధన చేశాయి. పంజాబ్, ఢిల్లీ, గురజాత్, కేరళ జట్లు సోమవారం విశాఖ నగరానికి చేరుకున్నాయి. అయితే పంజాబ్ డైనమేట్ యువరాజ్ సింగ్ మంగళారం ముంబయి, పశ్చిమ బెంగాల్ జట్లతో పాటు విశాఖకు చేరుకుంటాడు.
మంగళవారం నాటి ప్రారంభ పోటీల్లో వినయ్ కుమార్ నాయకత్వంలోని కర్నాటక జట్టు, సురేష్ రైనా నాయకత్వం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో తలపడనున్నది. మరో మ్యాచ్‌లో అస్సాం జట్టు, మధ్యప్రదేశ్ జట్లు పోర్టు స్టేడియంలో తలపడనున్నాయి. మ్యాచ్‌లకు జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి, పోలీస్ కమిషనర్ శివధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభిస్తారు. మ్యాచ్‌లు 8.40 గంటలకు ప్రారంభవౌతాయి. తొలిరోజు పోటీలో గెలిచిన జట్లతో డిఫెండింగ్ చాంపియన్స్ బెంగాల్, రన్నరప్ ముంబయి జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతాయి.
నగరంలో యాంటీ డోపింగ్ స్క్వాడ్:
క్రీడాకారుల్లో ఉత్ప్రేరకాలు వాడేవారి భరతం పట్టే యాంటీ డోపింగ్ స్క్వాడ్ కూడా సోమవారం విశాఖకు చేరుకుంది. ఈ స్క్వాడ్ మ్యాచ్ సమయాల్లో అనుమానం వచ్చిన వారిపై ర్యాండమ్ టెస్ట్ చేసి, పాజిటివ్‌గా వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.
జట్ల వివరాలు:
కర్నాటక: ఆర్. వినయ్ కుమార్ (కెప్టెన్), స్టువర్ట్ బిన్ని, రాబిన్ ఊతప్ప, రాహుల్, మణీష్ పాండే, సిఎం గౌతమ్, అమిత్ వర్మ, కరుణ్ నాయర్, అభిమన్యు మిథున్, అప్పన్న, అక్షయ్, శరత్ శివలింగయ్య, మయాంక్ అగర్వాల్, సుచిత్, గణేష్.
యు.పి. : సురేష్ రైనా (కెప్టెన్), మహ్మద్ ఖైఫ్, రాజ్ బహదూర్ పాల్, ఏకలవ్య, ఇంతియాజ్ అహ్మద్, ముకుల్ డాగర్, ఉమాంగ్ శర్మ, అంకిత్ రాజ్‌పుత్, పర్వీందర్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ, ప్రశాంత గుప్త, అక్షదీప్ నాథ్, అమిత్ మిశ్రా, కుల్‌దీప్ యాదవ్, ఆలి ముర్తుజ, అరీష్ ఆలమ్.
దేశవాళి క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన విజయ్ హజారే వన్‌డే నాకౌట్ క్రికెట్ టోర్నమెంటు
english title:
n
Date:
Tuesday, February 26, 2013