నాగార్జున కథానాయకుడుగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘గ్రీకువీరుడు’ చిత్రం శ్రీరామనవమి కానుకగా విడుదల కానుం ది. దశరథ్ దర్శకత్వంలో కామాక్షి మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సంతోషం చిత్రం దశరథ్ దర్శకత్వంలో రూపొందిందని, ఆ చిత్రం తనకు బాగా నచ్చిన చిత్రమని, ఇప్పటికీ అనేకమంది కుటుంబ ప్రేక్షకులు అలాంటి చిత్రాల్లో నటించమని అడుగుతూనే వుంటారని, మళ్లీ చాలా రోజుల తర్వాత దశరథ్ దర్శకత్వంలో ఈ చిత్రంలో నటించడం ఆనందంగా వుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ముఖ్యంగా యువత చాలా బాగావుందని స్పందించడం ఆనందాన్నిస్తోందని, అంకుల్ అని సంబోధిస్తూనే ఇంత అందంగా ఎలా వున్నారు? అని అడగడం సంతోషంగా వుందని ఆయన తెలిపారు. మంచి కథానాయకుడు, నిర్మాత దొరకడం తన అదృష్టమని, అమెరికాలో పుట్టిపెరిగిన ఈవెంట్ మేనేజర్‌గా నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్నాడని దర్శకుడు దశరథ్ తెలిపారు. కథానాయకుడు ఇండియా వచ్చాక ఎదురైన అనుభవాలు చిత్ర కథాంశమని, సంగీతపరంగా పూర్తి సంతృప్తితో ఉన్నామని ఆయన వివరించారు. ఈ చి త్రంలో నాగార్జునను చూశాక 2001లో నిర్మించారా అని ప్రేక్షకులకు అనుమానం వస్తుందని, అంత యంగ్‌గా కనిపిస్తారని నేటితో షూ టింగ్ పూర్తయిందని, మార్చి రెండో వారంలో ఆడియో విడుదల చేయనున్నామని నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మాస్ పాటలతో ప్రథమార్ధంలోనే హీరో పాత్ర ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని, తమ సంస్థ ప్రతిష్ఠకు తగిన విధంగా చిత్రాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అనిల్‌భండారి కూడా పాల్గొన్నారు. కథానాయికలుగా నయనతార, మీరాచోప్రా నటిస్తుండగా కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శరత్‌బాబు, నాగబాబు, కాశీవిశ్వనాథ్, వెనె్నల కిశోర్, నాగినీడు, సుప్రీత్, అశోక్‌కుమార్, భరత్‌రెడ్డి, సంజయ్ స్వరూప్, తా.రమేష్, సారికరామచంద్రరావు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందూ ఆనంద్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, కెమెరా: అనిల్‌భండారి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: రవీందర్, స్క్రీన్‌ప్లే: హరి, ఎం.శ్రీనివాసరావు, నిర్మాత: డి.శివప్రసాదరెడ్డి, కథ, మాటలు, దర్శకత్వం: కె.దశరథ్.
నాగార్జున కథానాయకుడుగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘గ్రీకువీరుడు’
english title:
sree
Date:
Thursday, February 28, 2013