కింకన్ దన్నునదల్చి చక్రమునదా గృష్ణుందనిన్ వైచినం
బొంకం బొప్పగ దాని దుత్తుఱుముగా బోదట్టి యుప్పాంగె ని
శ్శంకాత్ముండు దధీచి శాశ్వతులు నీ సద్భక్తులూహింపగా
సంకల్ప ప్రభవ ప్రతాపవన భాస్వద్దాప సర్వేశ్వరా!
భావం: సర్వేశ్వరా! కోపంతో అదలించి తనపై శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే సందేహ రహింతుడైన దధీచి దాన్ని ఎంతో రమణీయంగా పొడిపొడిగా చేసి విజృంభించాడు. ఓ సర్వేశ్వరా సంకల్పం చేతనే పుట్టిన శౌర్యమనే అరణ్యంలో ప్రకాశించే దావాగ్నీ నీ భక్తులని ఎవరూ చంపలేరు సుమా. నిరాకారుడు, నిశ్చలుడు, సత్యుడు, నిత్యుడు అయన పరమేశ్వరుడొక్కడే నిత్యసత్యమైతే ఇక చంపేది ఎవరు చచ్చేది ఎవరు? ఉన్నది ఒకటే నని ఎరిగిన వారికి శివుడు తప్ప మరేం కనిపిస్తుంది. అందుకే శివుడు, శివభక్తుడు ఇద్దరూ ఒక్కరేనని దాన్ని తెలుసుకొంటే అది శివతత్వం అర్థం అవుతుందని శివభక్తులు చెప్తుంటారు.
సర్వేశ్వర శతకములోని పద్యమిది