హైదరాబాద్, మార్చి 25: శాసనసభ ప్రారంభం కాగానే వివిధ పక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై టిడిపి సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు, రైతాంగం విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని టిఆర్‌ఎస్ సభ్యుడు ఈటెల రాజేందర్ వాయిదా తీర్మానాలను ఇచ్చారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు వైఎస్ విజయమ్మ, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై సిపిఐ, సిపిఎం పక్షాల నాయకులు గుండా మల్లేష్, జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ నగారా సమితి నేత నాగం జనార్ధన రెడ్డి, ప్రత్యేక తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని బిజెపి నాయకుడు ఇ లక్ష్మీనారాయణలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
రెవిన్యూ మంత్రి ప్రకటనకు ఆటంకం
ప్రశ్నోత్తర కార్యక్రమం చేపట్టేముందు రెవిన్యూ మంత్రి రఘువీరా రెడ్డి రెవిన్యూ సదస్సులపై ఒక ప్రకటన చేస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి డి శ్రీ్ధర్‌బాబు స్పీకర్‌ను కోరారు. దానికి స్పీకర్ అనుమతించినా, విపక్షాల సభ్యులు తక్షణం తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. అయితే ఒక దశలో రెవిన్యూ మంత్రి రఘువీరా రెడ్డి లేచి ప్రకటన చేయబోగా తెలుగుదేశం పార్టీ సభ్యులు దానిని అడ్డుకున్నారు. పురపాలక మంత్రి సమాధానం ఇస్తున్న సమయంలోనే తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతూ టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. దీంతో అత్యంత కీలకమైన అంశాలు సభలో చర్చించాల్సి ఉందని, అనేక మంది సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉందని, ప్రభుత్వం నుండి సమాధాన కోసం సభ్యులు ఎదురుచూస్తున్నారని కనుక విపక్షాలు సహకరించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి డి శ్రీ్ధర్‌బాబు కోరారు. అయినా విపక్షాలు పోడియంను వీడి రాకపోవడంతో ఉదయం 9.15 గంటలకు స్పీకర్ గంట పాటు సభను వాయిదా వేశారు.
శాసనసభ తిరిగి ఉదయం 10.30 గంటలకు సమావేశమైంది. వెంటనే స్పీకర్ నాదెండ్ల మనోహర్ విద్యుత్ సంక్షోభంపై స్వల్పకాలిక చర్చను చేపట్టారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, వినియోగం తదితర అంశాలపై ముఖ్యమంత్రి నివేదికను సభలో ప్రవేశపెట్టారు.
విద్యుత్‌పై నేడూ చర్చ
విద్యుత్ సమస్యపై సోమవారం శాసనసభ అట్టుడికిపోయింది. కరెంటు కష్టాలు ముందే తెలిసినా ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు చేపట్టలేదని, దాంతో సామాన్యులు సైతం విద్యుత్ కోతలతో అతలాకుతలమైపోతున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుమారు నాలుగు గంటలకుపైగా ఈ అంశంపై చర్చించిన తర్వాత శాసనసభ మధ్యాహ్నం వాయిదా పడింది. తిరిగి ఇదే అంశంపై మంగళవారం చర్చ జరుగుతుందని సభ వాయిదా వేస్తూ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క చెప్పారు. విద్యుత్ సమస్యపై వివిధ విపక్షాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య రాష్ట్రంలో ఉన్న మాట నిజమేనని దానిని సరిదిద్దేందుకు విపక్షాలు తగిన సూచనలు చేస్తే ఆ విధంగా ప్రభుత్వం తగు చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు.
శాసనసభ ప్రారంభం కాగానే వివిధ పక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను
english title:
adjournment motions
Date:
Tuesday, March 26, 2013