హైదరాబాద్, మార్చి 25: అధికారులు ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు సోమవారం విడివిడిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకుండా తన నియోజక వర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యేలైన తనను ఆహ్వానించకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు డిఎస్‌పికి వ్యతిరేకంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేగా నా విధులను నేను నిర్వహించకుండా అడ్డుకున్నారని, తన హక్కులకు భంగం కలిగించారని ఫిర్యాదు చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్ బి మోహన్‌రావు సివిల్ డ్రెస్‌లో, ప్రైవేటు కారులో వచ్చి టిడిపి కార్యకర్తను కారులో బలవంతంగా తీసుకు వెళుతుంటే తాను అడ్డుకున్నానని తెలిపారు. డిఎస్‌పి ఎం రజని ప్రతి సందర్భంలోనూ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఈ వివాదంపై తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్యే స్పీకర్‌కు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యువత నేత శ్రీహరిరాజు మృతి
తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీహరిరాజు సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్రీహరి రాజు మృతికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. యువత కార్యక్రమాల్లో శ్రీహరి రాజు చురుగ్గా పాల్గొనేవారని తెలిపారు.
అధికారులు ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగే విధంగా
english title:
mla
Date:
Tuesday, March 26, 2013