Date:
Thursday, March 28, 2013 - 01
వృశ్చికం:
(విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ):
నూతన వస్తు, వస్త్ర, ఆభరణ, లాభాలను పొందుతారు. ధనలాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా):
మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
వృషభం:
(కృత్తి 2,3,4పా, రోహిణి, మృగ శిర 1,2పా):
కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వుంటాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి
మిథునం:
(మృగశిర 3,4పా, ఆర్ద్ర, పునర్వసు 1,
2,3పా):
కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.
కర్కాటకం:
(పునర్వసు 4పా, పుష్యమి, ఆశే్లష):
స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. క్రొత్త వ్యక్తులను నమ్మి మోసపోరాదు. మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా):
విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి. స్థిరాస్తుల సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు.
కన్య:
(ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా):
ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి వుంటారు. దైవదర్శనం లభిస్తుంది.
తుల:
(చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా):
కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా):
ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
కుంభం:
(్ధనిష్ఠ 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా):
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. అజీర్ణబాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుండి రక్షించుకోవడం అవసరం.
మీనం:
(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి):
స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు.
దుర్ముహూర్తం:
ఉ.10.20 నుండి 11.08 వరకు, తిరిగి మ.03.11 నుండి 03.59 వరకు
రాహు కాలం:
................
వర్జ్యం:
సా.05.43 నుండి 07.16 వరకు
నక్షత్రం:
హస్త ఉ.09.58
తిథి:
బహుళ పాడ్యమి మ.02.10
మకరం:
(ఉత్తరాషాఢ 2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ 1,2పా):
మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.