Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

సుఖ సంతోషాలు

Image may be NSFW.
Clik here to view.

మానవునికి నిజమైన సంతోషం ఆనందమయమైన జీవనము గడపడంలోనే ఉన్నది. ఆ ఆనందం సంపదవల్లనో, ఇతర ధనేతరములవల్లనో రాదు. సంతృప్తికరమైన జీవనములోనే ఉన్నది. ధర్మాచారమునందు ఆసక్తి, ఆధ్యాత్మికమైన వాతావరణంలోనే ఉన్నది.
పూర్వకాలమున ఆధునిక సౌకర్యములు అందుబాటులో లేకపోయినను ప్రజలు ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడిపేవారు. పురుషులు వ్యవసాయము, ఇతర చేతివృత్తులలో ఆదాయాన్ని గడించేవారు. స్ర్తిలు ఇంటిపనులతో, గృహ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించేవారు. ఉమ్మడి కుటుంబాలు కావడంతో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. పిల్లల ఆలనా పాలనా పెద్దవారు చూపేవారు. కార్యక్రమాల నిర్వహణలో అందరూ పాలుపంచుకునేవారు. అసూయాద్వేషాలు ఉండేవి కావు. ఒకరి అవసరాలు మరొకరు తెలుసుకొని ఒకరికొకరు తోడ్పాటును అందించుకునేవారు. అందరూ కలిసిమెలసి ఉండడంవలన ప్రేమాభిమానాలు, ఆప్యాయతాలు వెల్లివిరిసేవి. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా సంయమనంతో పరిష్కరించుకునేవారు.
ఆ సంతోషం, ఆనందం నేటి ఆధునిక జీవన శైలిలో కరువైంది. పరిమిత కుటుంబం కావడంతో తోబుట్టువుల ప్రేమాభిమానములు తెలియడంలేదు. ఇతరులతో ప్రేమాభిమానములు పంచుకోవడం తెలియడంలేదు. ఆధిపత్య ధోరణి, స్వార్థం, అంతా నాకే కావాలి అనే అహం పెరుగుతోంది. బంధువులను కలుసుకోకపోవడంవలన వావివరుసలు తెలియడంలేదు. అనుబంధాలు దెబ్బతింటున్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మరచిపోయి, విదేశీ సంస్కృతి అలవాటు చేసుకుంటున్నాము. ఈ చర్య ఆమోదయోగ్యం కాదు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత భారతీయులైన మనందరిపైనా ఉంది. వివాహ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలిస్తున్న విదేశీ ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండడం యువతకు చాలా మంచిది. విదేశీయులు భారతీయ వివాహ వ్యవస్థకు, ఆచార సంప్రదాయాలకు ఆకర్షితులై, మన వివాహ వేడుకలలో పాలుపంచుకుంటుంటే భారత యువత విదేశీయుల ఆకర్షణలో పడి మన వివాహవ్యవస్థను కించపరిచే విధంగా ప్రవర్తించకపోవడం శోచనీయం. పెద్దలు ఈ విషయంలో యువతకు సరైన మార్గనిర్దేశనం చేయాలి. సిరిసంపదలవలన సంతోషంగా ఉన్నామనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. సేవామార్గమే సంతృప్తి. నిజమైన సంపదని ఎందరో మహాత్ములు నిరూపించారు.
మనం చనిపోయాక మన వెంట వచ్చేవి సిరిసంపదలు కావు. మనం చేసిన సత్కార్యాలు, ఆచరించి చూపిన ధర్మాలు సమాజంలో ఇన్ని అన్యాయాలు, అక్రమాలు దారుణమైన నేరాలు జరగడానికి కారణము ధర్మమార్గం లోపించడంవలన. మనిషి మంచికి ఆకర్షితుడు కాకపోయినా, చెడుకు ఆకర్షితుడవుతున్నాడు. మంచిని చెప్పకపోయినా చెడును ప్రోత్సహించకపోతే చాలు. మంచి చేసినట్లే.
మంచి, చెడు, న్యాయం, ధర్మం, శీలం స్ర్తికైనా పురుషుడికైనా ఒకటే. మగవాళ్ళు తప్పులు చేస్తున్నారు కదాని, ఆడవాళ్ళు ధర్మం తప్పి నడిస్తే ఇక సమాజాన్ని బాగుచేయటం ఎవరివల్ల అవుతుంది? పెద్దలు తప్పు చేస్తే పిల్లలు తప్పులు చేస్తారు. వాళ్ళ తప్పుల్ని సరిచేసి దారిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కుటుంబం సవ్యంగా ఉంటే సమాజం కూడా సవ్యంగా ఉంటుంది. మంచి సమాజాన్ని ఏర్పరచడంలో మన వంతు కృషి చేద్దాం. సమ సమాజ స్థాపనకు ముందడుగువేద్దాం.
====================
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
==================
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

మంచిమాట
english title: 
manchi maata
author: 
‍సి. ఛాయాదేవి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>