Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సన్‌రైజర్స్ ‘సూపర్’ విన్

$
0
0

హైదరాబాద్, ఏప్రిల్ 7: చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠను రేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 130 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా సన్‌నైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి సరిగ్గా 130 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ ‘టై’ అయింది. మ్యాచ్ ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ వికెట్ నష్టం లేకుండా 20 పరుగులు చేసింది. అందుకు సమాధానంగా రాయల్ చాలెంజర్స్ 15 పరుగులకు పరిమితమైంది.
ఆదుకున్న కోహ్లీ, హెన్రిక్స్
టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ కేవలం మూడు పరుగుల వద్ద స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ వికెట్ కోల్పోయింది. ఒక పరుగు చేసిన అతను హనుమ విహారీ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్‌కు దొరికిపోయాడు. ఆతర్వాత రాయల్ చాలెంజర్స్ వికెట్లు క్రమం తప్పకుండా కూలాయి. మిడిల్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ, మోజెస్ హెన్రిక్స్ ఆదుకోకపోతే, రాయల్ చారెంజర్స్ స్కోరు 100 పరుగుల స్కోరు కూడా దాటేది కాదు. కోహ్లీ 46 పరుగులు చేసి ఆశిష్ రెడ్డి బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్‌కాగా, 44 పరుగులు చేసిన హెన్రిక్స్‌ను కామెరూన్ వైట్ క్యాచ్ పట్టగా ఇశాంత్ శర్మ అవుట్ చేశాడు. వీరిద్దరినీ మినహాయిస్తే రాయల్ చాలెంజర్స్ బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం గమనార్హం. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 130 పరుగులు సాధించిన రాయల్ చాలెంజర్స్ తన ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి మురళీ కార్తీక్ 2, జైదేవ్ ఉనాద్కత్ ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇశాంత్ శర్మ నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
సాదాసీదా లక్ష్యమైన 131 పరుగులను సాధించేందుకు ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్‌రైజర్స్ నాలుగు పరుగుల స్కోరువద్ద వికెట్‌కీపర్, ఓపెనర్ పార్థీవ్ పటేల్ వికెట్‌ను చేజార్చుకుంది. మోజెస్ హెన్రిక్స్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అరుణ్ కార్తీక్ క్యాచ్ పట్టగా, కేవలం రెండు పరుగులు చేసిన పటేల్ పెవిలియన్ చేరాడు. కామెరూన్ వైట్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, హెన్రిక్స్ బౌలింగ్‌లోనే ముత్తయ్య మురళీధన్‌కు దొరికిపోయాడు. అతను తొమ్మిది బంతుల్లో ఐదు పరుగులు చేశాడు. ఓపెనర్ అక్షత్ రెడ్డి రాయల్ చాలెంజర్స్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని 21 బంతుల్లో, రెండు ఫోర్లతో 23 పరుగులు చేశాడు. భారీ స్కోరుగా సాగుతున్న అతనిని మురళీధరన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 48 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మూడో వికెట్ చేజార్చుకుంది. నాలుగో వికెట్‌కు విహారీతో కలిసి 5.2 ఓవర్లలో 33 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన కెప్టెన్ కుమార సంగక్కర 16 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఉనాద్కత్ బౌలింగ్‌లో అరుణ్ కార్తీక్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. విహారీ వ్యూహాత్మకంగా ఆడినా, అతనికి సరైన సహకారాన్ని ఇవ్వలేకపోయిన తిసర పెరెరా 7 పరుగులు చేసి, ఉనాద్కత్ బౌలింగ్‌లోనే హెన్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 98 పరుగుల వద్ద సన్‌రైజర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత విహారీ జట్టు స్కోరును వంద పరుగుల మైలురాయిని దాటించాడు. అయితే, అదే క్రమంలో మూడో పరుగు కోసం ప్రయత్నించినప్పుడు అమిత్ మిశ్రా రనౌట్ కాగా, సన్‌రైజర్స్ ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. చివరి మూడు ఓవర్లలో విజయానికి 28 పరుగులు అవసరమైన దశలో ఆశిష్ రెడ్డి బ్యాటింగ్‌కు వచ్చాడు. వీరిద్దరూ జట్టును చివరి ఓవర్‌లో ఏడు పరుగుల వద్దకు చేర్చారు. వినయ్ కుమార్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతికే ఆశిష్ రెడ్డి అవుటయ్యాడు. కవర్స్ స్థానంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో అతను వెనుదిరిగాడు. రెండో బంతికి రెండు పరుగులు లభించగా, మూడో బంతిని డేల్ స్టెయిన్ డిఫెన్స్ ఆడాడు. నాలుగో బంతికి ఒక పరుగు లభించింది. ఐదో బంతిలో విహారీ రెండు పరుగులు చేశాడు. చివరి బంతికి లెగ్‌బై రూపంలో ఒక పరుగు లభించడంతో మ్యాచ్ టై అయింది. అప్పటికి విహారీ 44, స్టెయిన్ మూడు పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అయితే, మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్‌ను అమలు చేశారు. సన్‌నైజర్స్‌కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. తిసర పెరెరా, కామెరూన్ వైట్ బ్యాటింగ్ చేస్తే, వినయ్ కుమార్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతి నోబాల్‌కాగా, పెరెరా ఒక పరుగు తీశాడు. తర్వాతి బంతికి వైట్ ఒక పరుగు చేస్తే, రెండో బంతిలో పెరెరా మరో పరుగు తీశాడు. ఆతర్వాత వైట్ విజృంభణ మొదలైంది. మూడో బంతిని సిక్సర్‌గా మలచిన అతను నాలుగో బంతిలో రెండు పరుగులు చేశాడు. ఐదో బంతిలో మరో సిక్సర్ బాదాడు. చివరి బంతిలో మళ్లీ రెండు పరుగులు చేశాడు. మొత్తం మీద సన్‌రైజర్స్ సూపర్ ఓవర్‌లో వికెట్ నష్టం లేకుండా 20 పరుగులు చేసింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ తరఫున క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగారు. సర్‌నైజర్స్ తరఫున స్టెయిన్ బౌలింగ్ తీసుకున్నాడు. తొలి బంతిలో రెండు పరుగులు చేసిన గేల్, రెండో బంతిలో ఒక పరుగు సాధించాడు. మూడో బంతిని కోహ్లీ ఫోర్‌గా మలిచాడు. నాలుగో బంతిలో ఒక పరుగు చేశాడు. ఐదో బంతిలో గేల్ సిక్స్ కొట్టాడు. ఆరో బంతికి ఒక పరుగు మాత్రమే లభించడంతో, సన్‌రైజర్స్ విజయం సాధించింది.

ఐపిఎల్ టి-20 క్రికెట్ టోర్నమెంట్
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>