
కింగ్ నాగార్జున కథానాయకుడుగా కామాక్షి మూవీస్ పతాకంపై నిర్మించిన గ్రీకువీరుడు చిత్రం ఈనెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. కె.దశరథ్ దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మించిన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించనున్నామని తెలిపారు. వేసవి కానుకగా ఈనెల 26న విడుదలవుతున్న ఈ చిత్రంలో నాగార్జున లుక్స్, గెటప్, స్టైల్ సరికొత్తగా ఉంటాయని, అభిమానులకే కాక అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని ఆయన తెలిపారు. నయనతార, మీరాచోప్రా, కె.విశ్వనాథ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్, శరత్‌బాబు, నాగబాబు, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు, అలీ, వేణుమాధవ్, రఘుబాబు, కాశీవిశ్వనాథ్, వెనె్నలకిషోర్, నాగినీడు, సుప్రీత్, అశోక్‌కుమార్, భరత్‌రెడ్డి, సంజయ్ స్వరూప్, తా.రమేష్, సారిక రామచంద్రరావు, గీతాంజలి, సుధ, జయలక్ష్మి, జయవాణి, లహరి, ఇందు ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌భండారి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: థమన్ ఎస్.ఎస్, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ, మాటలు, దర్శకత్వం: కె.దశరథ్.