దర్శకుడు శ్రీనువైట్ల సినిమాలు అంటేనే పూర్తి హాస్యంతో నిండి వుంటాయన్న నమ్మకం ప్రేక్షకులకు వుందని, ఆయన చిత్రాలు చూస్తుంటే జంధ్యాల చిత్రాలు గుర్తొస్తాయని ఎన్టీఆర్ తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన బాద్‌షా చిత్రానికి సంబంధించి విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సందర్భంలో పై మాటలు ఎన్టీఆర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ బ్లాక్‌బస్టర్ కొట్టాలన్నా గణేష్ మాటలు నేడు నిజమయ్యాయని, ఈరోజు ఇలాగే ఆగిపోతే బాగుండుననిపిస్తుందని, తన కెరీర్‌లో ఇంత పెద్ద విజయాన్ని అందజేసినందుకు దర్శకుడు శ్రీనువైట్లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన తెలిపారు. ఈ చిత్ర కథ విన్నప్పుడే బాగా వుంటుందని అనిపించిందని, షూటింగ్ సమయంలో తన నటనే కాక తాను వేసుకునే కాస్ట్యూమ్స్, చెప్పే డైలాగులు, వేసే స్టెప్పులు ఆచితూచి శ్రీను పరిశీలించారని, ఎన్టీఆర్ పోషించిన జస్టిస్ చౌదరి పాత్ర వేయమన్నప్పుడు మొదట చెమటలు పట్టాయని, ఇప్పుడు ప్రేక్షకులు ఆ పాత్రను ఆస్వాదిస్తున్నందుకు సంతోషంగా వుందని, ఇంత పెద్ద విజయం అందించిన రాష్ట్ర ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన వివరించారు. అందరూ కష్టపడి పనిచేయడంవల్లనే ఇంత పెద్ద విజయాన్ని నమోదుచేసుకున్నామని, గణేష్ బ్లాక్‌బస్టర్ కొట్టాలని చెప్పే ఈ విజయాన్ని సాధించారని, ఆయన అన్ని విధాలుగా సహకరించడంవల్లే ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నామని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పారు. ఎన్టీఆర్ ఒక సంవత్సరంపాటు తనతోనే ప్రయాణం చేశారని, ఏ ఇగో లేకుండా ఆయన తనతో కలిసిపోబట్టే బాద్‌షా ఇంత చక్కగా తీయగలిగానని, ముఖ్యంగా స్విట్జర్లాండ్‌లో చేసిన పాట సమయంలో చాలా కష్టపడ్డామని ఆయన వివరించారు. అందంగా ఓ అద్భుతం ఆవిష్కృతమైందని, తానాసించిన విధంగా ఎన్టీఆర్ కుటుంబానికి ఓ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించాలన్న కోరిక బాద్‌షాతో తీరిందని నిర్మాత గణేష్ తెలిపారు. ఈ చిత్రంకోసం ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్‌ను కూడా త్యాగంచేసి, ఆదివారాలు కూడా పనిచేశారని, ఇంత మంచి చిత్రాన్ని అందించినందుకు ఓ రకంగా గర్వంగా ఉందని, భవిష్యత్‌లో కూడా ఇలాంటి చిత్రాలనే నిర్మించే ప్రయత్నం చేస్తానని ఆయన వివరించారు. కార్యక్రమంలో గోపీమోహన్, కాజల్, ఆచంట గోపీనాథ్, బి.ఎ.రాజు, విశ్వ, హరి, ప్రవీణ్, సుధాకర్, ప్రకాష్, విజయ్, రామారావు, శంకర్, రామజోగయ్యశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు శ్రీనువైట్ల సినిమాలు అంటేనే పూర్తి హాస్యంతో నిండి వుంటాయన్న నమ్మకం ప్రేక్షకులకు వుందని,
english title:
kastaniki
Date:
Wednesday, April 10, 2013