Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తేలని పైలాన్ స్థల వివాదం

$
0
0

గాజువాక, ఏప్రిల్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా... మీకోసం పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఏర్పాటు చేయాలకున్న పైలాన్ స్థల వివాదం కొనసాగుతోంది. పైలాన్ నిర్మాణంపై ఆదివారం విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో నేతలు సమావేశమయ్యారు. పైలాన్ నిర్మించాలనుకున్న స్థలం వివాదంలో పడిందన్న విషయాన్ని చంద్రబాబునాయుడు దృష్టికి నేతలు తీసుకువెళ్లారు. వివాద స్థలాన్ని పక్కన పెట్టి మరో స్థలాన్ని అనే్వషించాలని టీడీపీ విశాఖపట్నం జిల్లా నేతలకు ఆదేశించినట్లు తెలిసింది.
వివాదం చోటు చేసుకున్న వడ్లపూడి స్థలాన్ని విడిచి పెట్టి మరో స్థలాన్ని అనే్వషించే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఆదివారం కూర్మన్నపాలెం, శివాజీనగర్, అగనంపూడి, షీలానగర్ ప్రాంతాల్లో నేతలు స్థల అనే్వషించారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నేతలు నెల్లూరు భాస్కరరావు, హర్షవర్థన ప్రసాద్, పల్లా శ్రీనివాసరావు, పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాసరావులు ఈ స్థల అనే్వషణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో స్థలాన్ని నేతలు గుర్తించారు. దీంట్లో భాగంగా ఆయా స్థలాలకు చెందిన రైతన్నలతో నేతలు మాట్లాడారు. ఒక స్థలం ఉడా లే-అవుట్‌లో ఉంది.
లే-అవుట్‌లో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయాలని కొంత మంది నేతలు ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ మూడు స్థలాలు పట్టణానికి కాస్త దూరంగా ఉంటుందన్న భావం నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వడ్లపూడి స్థలానికి నగరానికి దగ్గర, జాతీయ రహదారి అనుకుని ఉండడంతో నేటికీ కొంత మంది ఆ స్థలంలోనే పైలాన్ నిర్మాణం చేపట్టాలని పట్టుబడుతున్నారు. దీంతో స్థల వివాదాన్ని పరిష్కరించుకునే విధంగా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్లపూడి స్థలానికి సంబంధించిన యజమాని ఇప్పటికే కమర్షియల్ స్థలంగా మార్పు చేసుకుని ఉడా అధికారుల వద్ద అనుమతులు పొందినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. సదరు స్థల యజమాని చక్రవర్తికి స్టీల్‌ప్లాంట్ భూ సేకరణ అధికారులు కేటాయించడం జరిగిందని, అయితే ఈ స్థలానికి గాజువాక తహశీల్దార్ నోటీసులు జారీ చేయడం ఏమిటని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు.
అయినప్పటికీ వివాదానికి పోయేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా లేరు. డబ్బు ఇచ్చి స్థలాన్ని కొనుగోలు చేసుకునేందుకు వివాదాలు ఎందుకు అని టీడీపీ నేతలు అంటున్నారు. పైలాన్ స్థల వివాదం వెనక రాజకీయ కుట్ర ఉందన్న భావం పలువురు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని అనే్వషిస్తున్నప్పటికీ సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ సమస్యను ఆయన ముందు పెట్టి పరిష్కరించుకునేందుకు ఆలోచన చేస్తున్నారు. పైలాన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వాన్ని కేటాయించమని చెప్పడం లేదని, కొనుగోలు చేసుకుందామన్నా అటంకం పెట్టడం పట్ల టీడీపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా..మీకోసం పాదయాత్ర విజయవంతానికి చిహ్నాన్ని నిర్మించే ఈ పైలాన్ విశాఖపట్నానికి వనె్న తెస్తుందన్న భావం వ్యక్తం చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే కొంత మంది పైలాన్ నిర్మాణం అడ్డుకోవాలని తెర వెనక ఉండి రాజకీయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పైలాన్ నిర్మాణం వారం రోజుల్లో పూరి చేసే విధంగా కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చంద్రబాబు పాదయాత్ర కాస్త ఆలస్యం కావడంతో పైలాన్ నిర్మాణానికి సమయం సరి పోతుందని టీడీపీ నేతలు అంటున్నారు.

కశింకోటలో మంత్రి ఆనం కటౌట్ శవయాత్ర
* చెప్పులతో కొట్టిన వైకాపా కార్యకర్తలు
* దిష్టిబొమ్మ దగ్ధం
* భారీగా నిలిచిన ట్రాఫిక్
కశింకోట, ఏప్రిల్ 14: రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎం.పి జగన్‌మ్మోన్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యాలకు నిరసనగా కశింకోటలో మాజీ సర్పంచ్ మళ్లబుల్లిబాబు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు జరిగాయి. మంత్రి ఆనం రామానారాయణరెడ్డి కటౌట్ తయారుచేయించి కశింకోట పురవీధుల్లో శవయాత్ర మాదిరిగా డప్పులతో ఊరేగించి కర్మకాండలు చేయించి స్థానిక జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేసి దిష్టిబొమ్మను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు దగ్ధం చేసారు. మంత్రి కటౌట్‌ను స్థానిక ఆర్‌ఇసిఎస్ డైరక్టర్ శ్రీనివాసరావు చెప్పుతో కొట్టడమే కాకుండా జిల్లాజెడ్పికో-అప్షన్ మాజీ సభ్యుడు పీటర్‌వైజ్‌మేన్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు రాపేటి భానోజీరావు కాళ్లుతో తన్నుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌ఇసిఎస్ వైస్‌చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, బుల్లిబాబు మాట్లాడుతూ మంత్రి ఆనంకు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేసి పోటీచేయాలని, వైఎస్ బిక్షతో గెలిచి మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా జగన్‌పైనా, వారి కుటుంబ సభ్యులపైనా నిందారోపణలు చేయడం మంత్రి నీతిమాలిన రాజకీయానికి నిదర్శనమన్నారు. జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేక కాంగ్రెస్ నాయకులకు మతి భ్రమించిందని ఆరోపించారు. ఈ నిరసన కారణంగా జాతీయ రహదారిపై సుమారు ఐదు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చినా ఆందోళనకారులు నిరసనలు విరమించలేదు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పండూరి ఎరుకునాయుడు, సాలాపు స్యామలరావు, బుద్ద వరహాసత్యనారాయణ(సత్య), బయ్యవరం సత్తిబాబు, పిఎసిఎస్ డైరక్టర్ పెంటకోట నాగేశ్వరరావు, బలిజిబల్లి అప్పలనాయుడు, శిష్టి గోవింద పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 800 పోస్టులు ఖాళీ
* రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జెసి వనజాక్షి
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 14: రాష్ట్రం లో పలు ప్రభుత్వ వైద్యాలయాల్లో 800 స్పెషలిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ ఎస్. వనజాక్షి తెలిపారు. ఆదివారం స్థానిక వంద పడకల ఆసుపత్రికి విచ్చేసిన సందర్భంగా పలు వార్డులను ఆమె సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఆపరేషన్ థియేటర్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఎస్‌వి కుమారి మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్‌లో కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పించాల్సిఉందని జెసికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ ధియేటర్‌కు కావాల్సిన పరికరాలను నిధులు మం జూరు చేస్తానని జెసి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చా రు. ఈ సందర్భంగా డెలీవరీ కేసుల రిజిస్టర్‌ను తనిఖీలు చేసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో వనజాక్షి మాట్లాడుతూ ఇప్పటికే ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని, దీంతో 350 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందుతుందని, విశాఖ రూరల్‌లోనే అనకాపల్లి పెద్ద ఆసుపత్రిగా అభివృద్ధి చెంది ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో 253 ఏరియా ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేచ్చారని ఆమె అన్నారు. ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా వైద్యసిబ్బందిని నియమించుకోవచ్చని ఆమె భరోసా పలికారు. అనంతరం నూకాంబిక దేవాలయాన్ని సందర్శించిన ఆమె అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ నాయక్, వైద్యవిధాన పరిషత్ సూపరింటెండెంట్ ఎస్‌వి కుమారి, ఆర్‌ఎంఒ ప్రియదర్శిని, ఆసుపత్రి అభివృద్ధి డైరెక్టర్ బొడ్డేడ అప్పారావు పాల్గొన్నారు.

వస్తున్నా మీ కోసం పాదయాత్రకు ఏర్పాట్లు
నాతవరం, ఏప్రిల్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రకు రోడ్డుపై కాకుండా రోడ్డుపక్కన నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ల సూచన మేరకు ఆదివారం శృంగవరం నుండి డి.యర్రవరం మదర్ కాలేజ్ వరకు రోడ్డు పక్కన మట్టిని వేసే కార్యక్రమంలో పార్టీ నాయకులు పనులు వేగవంతం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ప్రారంభం కానున్న యాత్రకు బాబు కాళ్ళు సహకరించకపోవడంతో మట్టిరోడ్డుపై నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాతవరం మండలంలో బాబు బస నాల్గవ రోజుకు చేరింది. ఇంకా మండలంలో మరో నాలుగు రోజులు బస చేసే పరిస్థితులు కనిపిస్తుంది. వస్తున్నా మీ కోసం బాబుపాదయాత్ర అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి శ్రీకారం చుట్టారు. మొదట్లో 2,300 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని సాగించిన పాదయాత్ర విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చేరుకునే సరికి 2,700 కిలోమీటర్లు దాటింది. మండలంలో ఇంకా 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంది.

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో
నియోజకవర్గ సమీక్షా సమావేశాలు
నాతవరం, ఏప్రిల్ 14: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో నియోజకవర్గాల సమీక్షా సమావేశాల వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్, పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు తెలియజేశారు. ఆదివారం వారు విలేఖరులతో మాట్లాడుతూ 15వతేదీ సాయంత్రం పాయకరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులతో సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడతారు. 16వ తేదీ డి.యర్రవరం కాలేజీలో రాత్రి బసచేసి 17వ తేదీ ఉదయం పాడేరు నియోజకవర్గంలో సమీక్ష నిర్వహిస్తారన్నారు. 17వ తేదీన బలిఘట్టంలో బసచేసి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల నాయకులతో సమీక్షిస్తారు. 18వ తేదీన కొండల అగ్రహారం నల్లమారెమ్మ గుడివద్ద బస చేస్తారు. 19వ తేదీన పాత కన్నూరుపాలెంలో బసతోపాటు భీమిలి నియోజకవర్గం సమీక్ష, 20వ తేదీన తాళ్ళపాలెంలో బస చేస్తారు. 21వ ఆదివారం పూర్తిగా విరామం. 22వ తేదీన జగన్నాధపురంలో బస చేసి యలమంచిలి కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 23న గంగాదేవి పేటలో బస చేసి విశాఖ తూర్పు, విశాఖ పడమర నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తారు. 24వ తేదీన రేబాకలో బస చేస్తారని, అనంతరం అనకాపల్లి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నాయకులతో సమీక్షా నిర్వహిస్తారన్నారు. 25వ తేదీన సబ్బవరంలో బసచేసి అనంతరం విశాఖ దక్షిణ, అరకు కార్యకర్తలతో సమీక్ష, 26న కొత్తూరు జంక్షన్‌లో రాత్రి బస, పెందుర్తి నియోజకవర్గంలో కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. 27వ తేదీన వడ్లపూడిలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశాలకు ఆయా నియోజకవర్గాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని వారు కోరారు. వస్తున్నా పాదయాత్రకు ఘనస్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు.

మావోల వల్ల ప్రగతికి అవరోధం
* నర్సీపట్నం ఒఎస్‌డి దామోదర్
పాడేరు, ఏప్రిల్ 14: గిరిజన ప్రాంతంలో మావోల కార్యకలాపాల వల్ల ప్రగతికి విఘాతం కలుగుతుందని నర్సీపట్నం ఒ.ఎస్.డి.దామోదర్ అన్నారు. స్ధానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంవద్ద ఆదివారం ఆయన మావోయిస్ట్ అగ్రనేత బాకూరు గణేష్ సోదరుడు బాకూరు బొంజురాజుకు వాహనాల మరమ్మత్తులు చేసేందుకు ఉపకరించే పనిముట్లను అందజేశారు. ఇంతకుముందు బాకూరులో జయహో మహిళలో బాకూరు బొంజురాజుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా పనిముట్లను అందజేసేందుకు డి.ఐ.జి.స్వాతి లక్రా హామీ ఇచ్చారని తెలిపారు. డి.ఐ.జి. ఆదేశాల మేరకు పనిముట్లను పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మావోయిస్టుల చర్యలవల్ల మారుమూల ప్రాంతాల ప్రగతికి విఘాతం కలుగుతుందని తెలిపారు. మావోయిస్ట్ ఉద్యమంలో చేరిన ప్రతి ఒక్కరి కుటుంబీకులు సంఘంలో తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ మానసిక క్షోభకు గురవుతూ పిల్లలకై పరితపిస్తున్న తల్లిదండ్రులను విడిచి అందరికీ దూరమై మావోయిస్ట్‌లు సాధించేది ఏమీ లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా మావోయిస్ట్‌లు తమ పద్ధతి మార్చుకుని జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాడేరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గఫూర్, ఎస్.ఐ.అప్పన్న, సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్ సిపి యలమంచిలి
సమన్వయకర్తగా బొడ్డేడ
అనకాపల్లి, ఏప్రిల్ 14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ నియామక పత్రాన్ని ఆదివారం అందుకున్నారు. రాజధానిలో వైఎస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ యలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్తగా నియామకపు పత్రాన్ని ఆర్‌ఇసిఎస్ మాజీ చైర్మన్ ప్రసాద్‌కు అందజేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు
english title: 
pylon

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>