హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ప్రత్యేకంగా పనిచేస్తున్న ఎస్పీఎఫ్ అధికారులకు సాంకేతిక అంశాలపై రెండు వారాలపాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా శనివారం సాంకేతిక పరికరాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఎస్పీఎఫ్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ జనరల్ పివి సునీల్‌కుమార్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో పర్యవేక్షించారు. ఎస్పీఎఫ్‌లోనున్న ఏఎస్‌ఐ నుంచి అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి వరకు ఉన్న వారికి సాంకేతిక పరికరాల వినియోగంలో నైపుణ్యం పెంచేందుకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు సునీల్‌కుమార్ చెప్పారు. రోజురోజుకూ వివిధ సంస్థలకు పెరుగుతున్న దాడుల భయం నేపథ్యంలో సాంకేతిక పరికరాలపై కూడా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని తిరుమల, తిరుపతి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ ఆలయాలతోపాటు సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రిజర్వ్‌బ్యాంకు, రిలయన్స్ పరిశ్రమలు, మేజర్ ధర్మల్ విద్యుత్ కేంద్రాలు వంటి దాదాపు 150 సంస్థలకు ఎస్పీఎఫ్ రక్షణ కల్పిస్తున్న సంగతి తెలిసిందే. (చిత్రం) శిక్షణ కార్యక్రమంలో ఎస్పీఎఫ్ ఇన్‌చార్జ్ డిజి సునీల్‌కుమార్
రాష్ట్రంలో ప్రత్యేకంగా పనిచేస్తున్న ఎస్పీఎఫ్
english title:
spf
Date:
Sunday, April 21, 2013