Date:
Saturday, April 27, 2013 (All day)
వృశ్చికం:
సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులచే గౌరవింపబడుదురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆర్థిక చింత యుండదు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందెదరు. శుభవర్తమానం వస్తుంది.
మేషం:
ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. బంధు, మిత్రులను కలుస్తారు.
వృషభం:
వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడుట మంచిది.
మిథునం:
శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.
కర్కాటకం:
స్థిరాస్తుల విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది.
సింహం:
మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికివెళ్లరాదు.
కన్య:
ప్రయాణాలెక్కువచేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.
తుల:
బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలు వస్తాయ. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
ధనుస్సు:
ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు.
కుంభం:
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది.
మీనం:
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.
దుర్ముహూర్తం:
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం:
..
వర్జ్యం:
సా.06.25 నుండి 08.04 వరకు
నక్షత్రం:
విశాఖ మ.02.39
తిథి:
బహుళ విదియ రా.09.33
మకరం:
కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమ్తత అవసరం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఋణప్రయత్నాలు చేస్తారు. సత్కార్యాల్లో పాల్గొంటారు.