వరంగల్, మే 15: వచ్చే ఎన్నికల్లో తాము ఎవరితో జతకట్టాలనే అంశంపై ఇంకా ఆలోచించలేదని సిపిఎం రాష్టక్రార్యదర్శి బివి.రాఘవులు స్పష్టం చేశారు. ఎన్నికల పొత్తులపై తమ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని ఆయన అంచనా వేశారు. కాగా బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటు చేస్తూనే.. ఇక్కడి ఖనిజంను విశాఖకు పంపాలనేది తమ పార్టీ అభిప్రాయంగా తేల్చారు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు బుధవారం వరంగల్‌కు వచ్చిన రాఘవులు సర్క్యూట్ అతిథిగృహంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. బయ్యారంనుండి ఒక్క ఖనిజాన్ని కూడా తరలనిచ్చేది లేదని తెలుగుదేశంపార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు అర్థరహితమని కొట్టివేశారు. ‘బయ్యారం ఖనిజం అంత నాణ్యమైనది కాదు, ఇతర ప్రాంతాలనుండి కొంత ఖనిజ మిశ్రమాన్ని ఇక్కడికి తెచ్చి ఇక్కడి ఖనిజంతో కలిపితే వినియోగంలోకి తెచ్చేలా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవచ్చు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంత ఖనిజాన్ని ఇక్కడికి తెచ్చేందుకు ఆ ప్రాంతవాసులు అంగీకరించినపుడు, ఇక్కడి ఖనిజాన్ని కూడా విశాఖకు తరలించేందుకు అంగీకరించవలసిందే కదా? అని ఆయన ప్రశ్నించారు. టిడిపి నేతల ప్రకటన సంకుచితమని అన్నారు. ఇనుపఖనిజం వినియోగంపై రాష్ట్రప్రభుత్వం కనీసం సర్వే చేయకుండానే బయ్యారం గనులను విశాఖకు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం సబబుకాదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసమే సర్కార్ ఈ నాటకం (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)ఆడుతోందని దుయ్యబట్టారు. బయ్యారంతోపాటు ఓబులాపురం, ప్రకాశం జిల్లా గనులనుండి కూడా ఖనిజాన్ని అడిగినపుడు, కేవలం బయ్యారం గనుల తరలింపుపై సర్కార్ నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. ఆయా ప్రాంతాల ఖనిజాన్ని వినియోగించేందుకు స్థానికంగానే ఫ్యాక్టరీ పెడితే నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లవుతుందని అన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వును రద్దుచేసి, ఖనిజ వినియోగంపై సమగ్ర నిర్ణయం ప్రకటించాలని రాఘవులు డిమాండ్ చేశారు.
ఆ మంత్రులను సాగనంపండి
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్టమ్రంత్రులను తక్షణం సాగనంపాలని రాఘవులు హితవు పలికారు. ఆరోపణల నేపథ్యంలో కొందరు మంత్రులు పదవులకు రాజీనామా చేసినా ఆమోదించకుండా వారిని కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దోబూచులాడడం సిగ్గుపడే పరిస్థితి అని దుయ్యబట్టారు. హోంమంత్రి సబితకు సమన్లు వచ్చాయని, ఒక మంత్రేమో జైల్లో ఉన్నాడని, మరికొందరు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందంని అని గుర్తుచేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని రాజకీయంగా ఉద్యమిస్తామని చెప్పారు. కళంకిత మంత్రుల తొలగింపు, రాష్ట్ర విభజన, కాంగ్రెస్‌లో ముఠాలు వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో పాలన అనేదే లేకుండాపోయిందని చెప్పారు.
ప్రతిపక్షాలది బలహీనతే
రాష్ట్రంలో ప్రతిపక్షాల బలహీనత కారణంగానే ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు అడ్డులేకుండాపోతోందని రాఘవులు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 2002లో విద్యుత్‌చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ అన్నిపక్షాలను కలుపుకొని భారీ ఉద్యమాన్ని నిర్మిస్తే సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలిన ఉదంతాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత సర్కార్‌ను సాగనంపేందుకు టిఆర్‌ఎస్ అవిశ్వాసం పెడితే, ప్రధాన ప్రతిపక్షం టిడిపి మద్దతివ్వలేదని, ఆ పార్టీది చేతగానితనమని, ఏ పార్టీకి ఆ పార్టీ చీలికలుగా పోరాడితే ఇక బలం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఈ ముదనష్టపు సర్కార్ పాలనకు ముగింపు పలికేలా అవిశ్వాసం ప్రతిపాదించే విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రాగుల రమేశ్ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఆరు
నెలల్లో కెటిపిపి రెండవ దశ విద్యుత్ ఉత్పత్తి
మంత్రి పొన్నాల
జనగామ, మే 15: భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మరో ఆరు నెలల్లో ప్రారంభమవుతుందని, దీనికి తోడుగా 800 మెగావాట్ల మూడవ దశకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. బుధవారం జనగామలో జరిగిన డివిజన్ స్థాయి రైతు చైతన్య సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, వచ్చే సంవత్సరం నాటికి మరో 3 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు మూడవ దశ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఏప్రిల్ 24వ తేదీన ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన
* ‘ముందస్తు’ రాకపోవచ్చు * బయ్యారంలో ఫ్యాక్టరీ పెడుతూనే విశాఖకు ఖనిజం * సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
english title:
y
Date:
Thursday, May 16, 2013