బాసర, మే 15 : ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని రాష్ట్ర వైద్య, విద్య శాఖామంత్రి కొండ్రు మురళీమోహన్ అన్నారు. బుధవారం బాసర అమ్మవారి సన్నిధిలో మంత్రి తన కూతురుకు అక్షర స్వీకార పూజల అనంతరం ఆలయ వసతిగృహంలో విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.6500ల కోట్లు కేటాయించిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 108 అంబులెన్సులను 160 కొనుగోలు చేశామని, అందులో 70 గిరిజన ప్రాంతాలకు కేటాయించడం జరిగిందన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా 108పై దుష్ప్రచారం సాగిస్తున్నారన్నారు. గతంలో ప్రతీ జిల్లాలో మందుల కొనుగోళ్ళకు రూ.160 కోట్లు కేటాయించగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రతీ జిల్లాకు 360 కోట్లకు పెంచడం జరిగిందన్నారు. దీంతో పాటే ప్రతీ జిల్లాలో మూడు కోట్ల రూపాయలతో ఓ డ్రగ్ హౌస్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 7లక్షల పింక్ కార్డుదారులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా ముఖ్యమంత్రి త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక మాజీ సర్పంచ్ బాసర కేంద్రంగా 108 అంబులెన్స్‌లను కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రజలపై భారం పడకుండా మంచి పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సబ్‌ప్లాన్ కోరుతూ బిసి సంఘాల ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 15: జిల్లాలో వెనుకబడిన తరగతి వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఎస్సీ, ఎస్టీ తరహాలో బిసిలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బిసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా శిబిరంలో బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు దారుట్ల కిష్టు మాట్లాడుతూ జనాభాలో 50 శాతం బిసి వర్గాలే ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మాత్రం పాలకులు వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మల్చుకొనే రాజకీయ పార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడ్డ బిసిలను మాత్రం అణిచివేతకు గురి చేస్తున్నారన్నారు. బిసిలకు బడ్జెట్ కూడా తక్కువగా కేటాయిస్తున్నారని, ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మాదిరిగా బిసిలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సుజాత శర్మకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు శశికాంత్, వి ఆదినాథ్, నారాయణ, ప్రధాన కార్యదర్శి లింగన్న తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ శాఖల్లో 40 వార్డెన్ పోస్టుల నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 15: జిల్లాలోని గిరిజన సంక్షేమం, సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయాల్లో గ్రేడ్-2 వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టుల నియామకాల కోసం బుధవారం జిల్లా కలెక్టర్ అశోక్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. గ్రూప్-4 సర్వీసెస్ నోటిఫికేషన్ ప్రకారం సాధారణ నియామకాల కోసం ఈ మెరిట్ లిస్టును విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మెరిట్ లిస్టు ఆధారంగానే గ్రేడ్-2 వసతి గృహ సంక్షేమ అధికారుల పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని, సాంఘీక సంక్షేమ శాఖకు 19 పోస్టులు, గిరిజన సంక్షేమ శాఖకు 21 పోస్టులు మొత్తం 40 వసతి గృహాల సంక్షేమ అధికారుల పోస్టులను మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడ్తామన్నారు. ఈకార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంకం శంకర్, స్టెప్ సిఇఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎపిఆర్‌జెసి, ఆర్డీసీ ప్రవేశ పరీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 15: ఆదిలాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష నిర్వహణ కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఏలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పరీక్ష సాగింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగగా, మొత్తం 2037 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎపిఆర్‌జెసి పరీక్ష కోసం 8 కేంద్రాలను, ఎపిఆర్‌డిసి పరీక్ష నిమిత్తం ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. పట్టణంలోని సిబిఆర్ మోడల్ స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్ ఎ, బి కేంద్రాలు, విద్యార్థి పాఠశాల, ప్రగతి హైస్కూల్, సిఆర్‌ఆర్ మెమోరియల్, లిటిల్‌ఫ్లవర్ కేంద్రాలను ఎపిఆర్‌జెసి కోసం కేటాయించగా, ఎపిఆర్‌డిసి పరీక్ష కోసం విద్యార్థి డిగ్రీ కళాశాలను కేటాయించారు. పరీక్ష కేంద్రానికి 45 నిమిషాల ముందుగానే చేరుకోవాలని ఆదేశాలుండడంతో విద్యార్థులు ముందస్తుగానే పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. ఎపిఆర్‌జెసికి 2134 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొంటే 1964 మంది హాజరయ్యారని 170 మంది గైర్హాజరు అయినట్లు, ఎపిఆర్‌డిసి పరీక్ష కోసం 73 మంది దరఖాస్తులు చేసుకోగా, ఆరుగురు గైర్హాజరు కాగా, 66 మంది హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ అనురాధ తెలిపారు. పరీక్షలు మొత్తం ప్రశాంతంగానే ముగిసాయని ఆమె తెలిపారు.
సంక్షేమ పథకాలకు ఆధార్ కీలకం
* జూలై 1 నుండి నగదు బదిలీ పథకం ప్రారంభం* వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ కార్యదర్శి మహంతి
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 15: ప్రతి ఒక్క విద్యార్థి స్కాలర్‌షిప్‌లతో పాటు సంక్షేమ కార్యక్రమాలు లబ్దిపొందే విధంగా జిల్లాల్లో నూటికి నారు శాతం బ్యాంక్ ఖాతాలు, ఆధార్ నెంబర్లు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పివికె మహంతి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం జూలై 1 నుండి నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నందున ఈ పథకం గురించి బుధవారం రోజు రాజధాని నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, సాంఘీక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మహంతి అధికారులకు మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఎస్సీలకు అందిస్తున్న పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఓబిసిలకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను జూలై నుండి విద్యార్థులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తుందని, అందుకు గాను ప్రతి విద్యార్థి బ్యాంకు ఖాతా తీసి ఆధార్ నెంబర్ అనుసంధానం చేయాలని ఇందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి డిజిటల్ డాటా బేస్ ద్వారా నమోదు చేయాలని పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల రుణాలు, రాయితీలను నేరుగా లబ్దిదారుల ఖాతాలలో జమ చేస్తుందని అందుకు గాను ప్రతి లబ్దిదారునికి జీరో బ్యాలెన్స్‌పై బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 2013-14 సంవత్సరంలో విద్యార్థులకు పోస్టుమెట్రిక్, ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ కలిగి వున్న అభ్యర్థులకు మాత్రమే నేరుగా వారి ఖాతాలలో జమ చేయబడ్తాయని ఖాతాలు లేని వారికి చెల్లింపులు చేయబడవని పేర్కొన్నారు. కాలేజీల ప్రిన్సిపాళ్ళతో జిల్లా కలెక్టర్లు సమావేశాలు ఏర్పాటుచేసి విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించి ఆధార్ నెంబర్లు తప్పకుండా నమోదు చేసి ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయాలని ఈ చర్య జూన్ 15లోగా పూర్తిచేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. కలెక్టర్ అశోక్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో 27 లక్షల 37 వేల 759 మంది జనాభా వుండగా, 25 లక్షల 61 వేల 925 మందికి 94 శాతం ఆధార్ నెంబర్లు నమోదు చేస్తామని ఇంకను ఒక లక్ష 75 వేల 834 మందికి ఆధార్ నెంబర్లు నమోదు చేయాల్సి వుందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ సమావేశంలో జెసి సుజాత శర్మ, సాంఘీక సంక్షేమ శాఖ డిడి అంకం శంకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ పి రవికుమార్, పలు శాఖల అధికారులు వసంత్‌రావు దేశ్‌పాండే, సిరాజోద్ధీన్, రవీందర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు వేలల్లో...బదిలీలు వందల్లో
* ఎస్‌జిటి బదిలీల కోసం 20 గంటల కౌనె్సలింగ్* జిల్లాలో ముగిసిన ఉపాధ్యాయుల బదిలీలు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, మే 15: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. బుధవారం అర్థరాత్రి వరకు పిఇటిలు, తెలుగు పండిత్, హిందీ పండిత్ ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ కొనసాగగా, వివిధ ప్రాంతాల నుండి బదిలీ కోరుతూ తరలి వచ్చిన ఉపాధ్యాయులు కాస్త ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఈ నెల 11 నుండి బదిలీ కౌన్సిలింగ్ ప్రారంభం కాగా, ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన చోటికి పోస్టింగ్ కోసం సుమారు 4,200 మంది దరఖాస్తులు చేసుకోగా, వీటిలో 1150 మందికి మాత్రమే బదిలీలు జరిగాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద అధికారులు షామియానా ఏర్పాటుచేసినప్పటికీ ఉపాధ్యాయులకు సరిపోక పోవడంతో టియుటిఎఫ్ ఆధ్వర్యంలో మరో షామియానా వేసి టీచర్లకు చలువ నీటిని అందించారు. ఈ సారి ఉపాధ్యాయుల బదిలీల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలకు అనుమతి ఇవ్వక పోవడంతో బయటనే జాబితాను పట్టుకొని ఆరాతీస్తూ కనిపించారు. కాగా ఎస్‌జిటి లోకల్ బాడీ ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్‌కు భారీ ఎత్తున దరఖాస్తులు రాగా 1468 మంది కౌన్సిలింగ్‌కు హాజరైతే వీరిలో 630 మందికి మాత్రమే బదిలీలు జరిగాయి. పోస్టుల ఖాళీలు అనుకూలమైన ప్రాంతాల్లో లేని కారణంగా ఉపాధ్యాయులు వందల సంఖ్యలో బదిలీలకు ఆసక్తి చూపకుండా వెనుదిరిగారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తున్న వారికి తోడు రేషనలైజేషన్‌లో పోస్టులను కోల్పోతున్న వారు మాత్రమే అధిక సంఖ్యలో బదిలీకి గురయ్యారు. ఈ బదిలీ కౌన్సిలింగ్‌కు జిల్లా అదనపు జెసి వెంకటయ్య, జడ్పీ సిఇఓ ఆర్ వెంకటయ్య, డిఇఓ అక్రముల్లాఖాన్, డిప్యూటీ డిఇఓ రామారావు తదితరులు హాజరయ్యారు. విచిత్రమేమిటంటే ఎస్‌జిటి ప్లేన్ ఏరియాలో బదిలీ కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏకధాటిగా 20 గంటల వరకు కొనసాగడం గమనార్హం. అర్థరాత్రి వేళ మహిళా ఉపాధ్యాయులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన టీచర్లు కౌన్సిలింగ్ కోసం నిద్ర హారాలు మాని బారులు తీరాల్సి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం తిరిగి 2 గంటలకు కౌన్సిలింగ్ ప్రారంభించగా, తొలుత మైనర్ మిడియ ఎస్‌జిటి ఉర్దూ మీడియంలో 161 మంది, మరాఠీ మీడియంలో 121 మంది, కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. ఆ తరువాత బెంగాలి మీడియం, హిందీ మీడియం కౌన్సిలింగ్ జరిగింది. వీరిలో 50 మందికి మాత్రమే అనుకున్న చోటికి స్థాన చలనం జరగ్గా, కొందరికి పోస్టింగ్ లభించక పోవడంతో పాత చోటికే ఆసక్తి కనబర్చారు. బుధవారం పిఇటిల కౌన్సిలింగ్‌కు 31 మంది హాజరయ్యారు. హిందీ పండిత్, తెలుగు పండిత్ పోస్టులకు 300 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా, వీరిలో 70 మందికి మాత్రమే బదిలీలు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 4 వేలపైన దరఖాస్తులు వస్తే కేవలం వందల సంఖ్యల్లో మాత్రమే బదిలీలు చోటు చేసుకోవడంతో కొందరు నిరాశకు గురి కావాల్సి వచ్చింది. 2008లో డిఎస్సీ పరీక్షలో ఎంపికై 2011లో ప్రొబిషన్ పూర్తయిన ఉపాధ్యాయులు మాత్రమే భారీ సంఖ్యలో బదిలీలు చేసుకున్నారు. 2 సంవత్సరాలు పూర్తయిన వారికి కౌన్సిలింగ్‌కు అవకాశం కల్పించడంతో వీరికి కాస్త అనుకూలమైన చోట పోస్టింగ్‌లు లభించాయి. మొత్తం మీద బదిలీల కౌన్సిలింగ్ ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కొత్త పాఠశాలల్లో కొత్తగా పోస్టింగ్‌లతో ఉపాధ్యాయులు బదిలీపై చేరనున్నారు.
అమ్మవారి సన్నిధిలో
మంత్రి కూతురికి అక్షర స్వీకార పూజలు
బాసర, మే 15 : చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి సన్నిధిలో బుధవారం రాష్ట్ర వైద్య, విద్య శాఖామంత్రి కొండ్రు మురళీమోహన్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని తన కూతురికి అక్షర స్వీకార పూజలను నిర్వహింపజేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయాధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి తన రెండవ కూతురైన అనిష్కకు అక్షర స్వీకార పూజను నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఇంచార్జి ఎస్ ఈ శ్యాంబాబు, ఏడీ విజయ్‌గోపాల్, ఈ ఈ ఉమాశంకర్, జిల్లా మల్లేరియా అధికారి అల్హం రవి, ఆర్డీ ఓ గజ్జన్న, తహశీల్దార్ నరేందర్ ఉన్నారు. సీ ఐ శ్రీ్ధర్‌రావు, ఎస్సై ప్రవీన్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాసర క్షేత్రానికి రావడం మొదటిసారి అని, అమ్మవారి చెంత తన కూతురుకు అక్షర స్వీకార పూజలు జరిపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
అమ్మవారి సన్నిధిలో
మానవ హక్కుల కమిషన్ సభ్యుడి పూజలు
బాసర, మే 15 : బాసర అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర మానవహక్కుల కమీషన్ సభ్యుడు బేరిరెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనను ఆలయాధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో కమిషన్ సభ్యుడు బేరిరెడ్డి మనుమడి అక్షర స్వీకార పూజలను అర్చకులు నిర్వహింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు హారతిని ఇచ్చి ఆశీర్వదించారు. అధికారులు మానవహక్కుల కమిషన్ సభ్యుడు బేరిరెడ్డిని శాలువాతో సత్కరించి అమ్మవారి ఫోటో, ప్రసాదాన్ని అందజేశారు. ఈయన వెంట ఎస్సై ప్రవీన్‌కుమార్, ఏ ఈ ఓ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
*మంత్రి కొండ్రు మురళీమోహన్
english title:
p
Date:
Thursday, May 16, 2013