విశాఖపట్నం, మే 15: మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. చేపలవేటపై నిషేధం అమలవుతున్న దృష్ట్యా మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీని స్థానిక ఫిషింగ్ హార్బర్‌లో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు చేపలవేటపై నిషేధాన్ని ప్రతియేటా విధిస్తోందని తెలిపారు. అయితే వేట నిషేధం కాలంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని, వారిని ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 31 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అయితే భవిష్యత్‌లో బియ్యం బదులు నగదు రూపంలో అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మత్స్యకార సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రజలకు అమలయ్యే అన్ని సంక్షేమ కార్యక్రమాలు మత్స్యకారులకు సైతం వర్తిస్తాయని ఆయన తెలిపారు. అయితే మత్స్యకారులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ వి శేషాద్రి మాట్లాడుతూ అర్హులైన మత్స్యకార కుటుంబాల వారందరికీ బియ్యం సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈనెల 30లోగా బియ్యం అర్హులైన అన్ని మత్స్యకార కుటుంబాలకు అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 15 నుంచి మే 31 వరకూ చేపలవేట పై నిషేధం అమల్లో ఉంటుందన్నారు. నిషేధం కారణంగా జిల్లాలోని 600 మర పడవలు,1700 మెకనైజ్డ్ బోట్లుకు వర్తిస్తుందన్నారు సంప్రదాయ పడవలకు చేపలవేట నిషేధం వర్తించదని ఆయన తెలిపారు. వేట నిషేధం కారణంగా ఇబ్బందులకు గురయ్యే మర పడవల్లో సిబ్బంది ఎనిమిది మంది, ఇంజను తెప్పల్లో సిబ్బంది ఆరుగురు వంతున గుర్తించినట్టు తెలిపారు. జిల్లాలోని 62 మత్స్యకార గ్రామాల్లో సర్వే నిర్వహించి మొత్తం 10,422 కుంటుంబాలకు బియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వకరూ 9000 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశామని తెలిపారు. మిగిలిన కుటుంబాలకు కూడా త్వరలోనే బియ్యం విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి కోటేశ్వర రావు, ఎపి మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ పి చినఅప్పారావు, సహాయ సరఫరా అధికారి భాస్కర రావు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నేటి నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి కోటికుంకుమార్చన
* ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇఓ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి కోటి కుంకుమార్చన గురువారం ప్రారంభం కానుంది. విజయ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్టి గురువారం ఉదయం కుంకుమార్చన కార్యక్రమంలో ప్రారంభమవుతుందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి డి భ్రమరాంబ బుధవారం విలేఖరులకు తెలిపారు. 40 రోజుల పాటు కోటి కుంకుమార్చన జరుగుతుందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరుగుతుందన్నారు. కోటికుంకుమార్చనలో పాల్గొనదలిచే భక్తులు 1116 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈపూజా రుసుం చెల్లించే దాతల గోత్రనామాలతో నిత్యం పూజలు నిర్వహంచడం జరుగుతుందన్నారు. అలాగే భక్తులు ఒకరోజు కుంకుమార్చనలో స్వయంగా పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. పూజ అనంతరం భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, కండువా, జాకెట్టు పులిహోర, చక్రపొంగలి, లడ్డూ ప్రసాదం వితరణ చేయబడుతుందన్నారు. పదిహేనేళ్ల కిందట కోటి కుంకుమార్చన నిర్వహించగా మళ్లీ ఈసంవత్సరం కోటి కుంకుమార్చన జరుగుతోందన్నారు.
గ్రంధాలయ సంస్థ స్థల వివాదంపై ప్రజాబ్యాలెట్
* సంస్థ సొంతంగా నిర్మాణం చేపట్టాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: జిల్లా గ్రంధాలయ సంస్థ సొంతంగా గ్రంధాలయ భవన నిర్మాణాన్ని చేపట్టాలని గ్రంధాలయ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. మహారాణిపేట దండుబజార్ సమీపంలో సుమారు ఎకరం విస్తీర్ణం గల స్థలం గ్రంధాలయ సంస్థకు ఉండగా, నూతన భవన నిర్మాణాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష సంస్థకు కట్టబెట్టడాన్ని వారు ఖండించారు. ఈసంస్థ గ్రంధాలయ సంస్థకు చెందిన స్థలాన్ని 33 లీజుకు తీసుకుని కేవలం నామమాత్రపు అద్దెను చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మంత్రి తీరును పరిరక్షణ కమిటీ కన్వీనర్ పి మల్లేశ్వర రావు తప్పుపట్టారు. మూడేళ్ల కిందట ఒప్పందం జరిగినప్పటికీ ప్రత్యూష సంస్థ ఇప్పటి వరకూ నిర్మాణం చేపట్టలేదన్నారు. ఒప్పందం ప్రకారం ఎనిమిది అంతస్తుల భవనాన్ని నిర్మించాల్సి ఉండగా, కేవలం 47చదరపుగజాల్లో చిన్న భవనాన్ని నిర్మించి, మిగిలిన స్థలంలో తాము సొంతంగా వాణిజ్య సముదాయాన్ని నిర్మించుకుంటామన్న ప్రతిపాదన తీసుకురావడాన్ని ఖండించారు. విశాఖ బీచ్‌రోడ్డులో గ్రంధాలయ పరిరక్షణ కమిటీ చేపట్టిన ప్రజాబ్యాలెట్‌కు విశేష స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడంతో పాటు ఒప్పందాన్ని రద్దుచేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఫోరం ఫర్ బెటర్ విశాఖ ప్రతినిధి ఇఎఎస్ శర్మ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాని పిలుపునిచ్చారు. గ్రంధాలయ సంస్థ పరిరక్షణ సమితి ప్రతినిధులు చేపట్టిన ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో జెపి శర్మ, బ్యాంకు ఉద్యోగి జి లచ్చిరాజు, బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి తదితర శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
గోవుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత
* స్వచ్ఛంద సంస్థలు, రైతులకు అప్పగించేందుకు సిద్ధం
సింహాచలం, మే 15: సింహాచలం దేవస్థానం గోవులశాలలో కోడెదూడల మరణాలు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భక్తుల మొక్కుమడుల రూపంలో వందల సంఖ్యలో వస్తున్న గోవులను సంరక్షించడం అధికారులకు తలకు మించిన భారంగా పరిణమించింది. వేలం పాటల ద్వారా గోవులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ప్రతి ఏటా భారాన్ని దించుకుంటున్నా అధికారులకు వేలాలు నిలిపివేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత కష్టాల్లోకి పడదోసింది. దేవస్థానం చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన గోమేథం పెద్ద అపవాదును తెచ్చిపెట్టింది. ఇప్పటికే అధికారికంగా అధికారులు ప్రకటించిన గోవుల సంఖ్య 883 కాగా రానున్న రోజుల్లో వందల సంఖ్యలో గోవులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో దేవస్థానం కఠినమైన నిర్ణయాన్ని బుధవారం ప్రకటించింది. పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు, దేవస్థానం ఇఓ కె.రామచంద్రమోహన్ పరిస్థితిని అంచనా వేసి భక్తులు మొక్కుల రూపంలో సమర్పిస్తున్న గోవులను స్వీకరించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు చక్కబడే వరకు గోవుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇఓ రామచంద్రమోహన్ మంత్రికి, దేవాదాయశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కోడెదూడల మొక్కుకు ప్రత్యామ్నాయంగా 516 రూపాయలు చెల్లించి దేవస్థానం వద్ద రసీదు స్వీకరించి మొక్కు తీర్చుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం దేవస్థానం వద్ద కోడెదూడలను స్వచ్ఛంద సంస్థలకు, రైతులకు ఉచితంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు. స్థలం, వసతులు, వనరులు సమకూరుస్తామని గోశాల నిర్వహణకు ముందుకు రావాలని దేవస్థానం పిలుపునిచ్చింది. పచ్చికమేత, ఎండుగడ్డి విక్రయించేరైతులు సమాచారం అందిస్తే కొనుగోలు చేస్తామని దేవస్థానం ప్రకటించింది. గోసంరక్షణ చేపట్టేందుకు అనుభవం గల రైతులు ముందుకు వస్తే ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉపాధి కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇఓకి బిజెపి నేతల మెమోరాండం
గోశాలలో కోడెదూడల మరణాల నేపథ్యంలో బిజెపి నేతలు బుధవారం దేవస్థానం ఇఓ రామచంద్రమోహన్‌ని కలిసారు. గోశాలలో పరిస్థితిని సమీక్షిస్తున్న ఆయనకు భాజాపా నేతలు వెళ్ళి మెమోరాండం సమర్పించారు. హిందూ సాంప్రదాయంలో గోవులకున్న ప్రాధాన్యతను తెలియజేస్తూ గోసంరయణ చేపట్టాలని కోరారు. వాస్తవ పరిస్థితులను ఇఓ భాజాపా నేతలకు వివరించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు కంభంపాటి హరిబాబు గోశాల నిర్వహణపై కొన్ని సూచనలు ఇచ్చారు.
గోశాలలో ప్రార్థనలు
గోవుల మరణాల నేపథ్యంలో కొంతమంది స్వచ్చందంగా వచ్చి గోశాలలో ప్రార్థనలు చేశారు. గోవులకు శక్తిని ప్రసాదించేలా రికీ హీలింగ్ నిర్వహించారు. రికీ హీలింగ్ ద్వారా ప్రాణులకు శక్తిని ప్రసరింపజేయవచ్చునని వారు పేర్కొన్నారు.
శాశ్వత పరిష్కారమే శరణ్యం
* నిర్వహణ అన్ని విధాలా భారం
* పశుసంవర్థక శాఖ జెడి వెంకటేశ్వరరావు
సింహాచలం, మే 15: కోడెదూడల నిర్వహణ అన్ని విధానాల తలకు మించిన భారమేనని దేవస్థానంలో ఎదురైన ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఆ దిశగా ఒక నిర్థిష్టమైన విధానాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశుసంవర్థక శఖ జాయింట్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు చెప్పారు. సింహాచలం గోశాల పరిస్థితిని కళ్లారా చూసారు. జిల్లాలో రెండు లక్షల అరవైవేల కృత్రిమ గర్భధారణలు జరుగుతున్నాయని వీటి ద్వారా 80 వేల దూడలు వస్తున్నాయని వీటిలో 40 వేలు మగవే ఉన్నాయని, ఇందులో 15 వేలు జెర్సీవి ఉన్నాయని ఆయన వివరించారు. యాంత్రిక వ్యవసాయ సాధానలు వచ్చాక దూడలు, ఎద్దుల అవసరం లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఎటువంటి ప్రయోజనం లేని కోడేదూడలను మేపడం ఆర్థికంగా భారంగా తయారయ్యాయి. ప్రస్తుతం 30 శాతం మేత మాత్రమే అందుబాటులో ఉంటోందని ఆయన వెల్లడించారు. ఇజ్రాయిల్ వంటి దేశాల్లో ఉపయోగం లేని వాటిని ఆహారపదార్థంగా స్వీకరిస్తూ 30శాతం ఆదాయాన్ని సంపాదిస్తున్నారని ఆయన తెలిపారు. సింహాచలం గోశాలకు సంబంధించినంత వరకూ భవిష్యత్ మరింత కష్టతరమవుతుందని ఆయన అన్నారు. కోడెదూడలు వయస్సు పెరిగిన కొద్దీ వాటిలో శక్తిపెరిగి పోరాటాలకు దిగుతాయని అన్ని ఒకే చోట ఉండటం వలన పోట్లాడుకుంటూ ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కడుపు నింప గలిగితే చాలు
గోవులకు కడుపు నిండా తిండి, నీరు ఇవ్వడమే తమ తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. దేవస్థానం సుమారు 883 కోడెదూడలకు రోజుకు ఒక టన్ను దాణ, టన్ను ఎండుగడ్డి, నాలుగు టన్నుల పచ్చిమేత వేయాల్సి వస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కోఫోరి, ఎపిబి గడ్డి సాగు చేయవచ్చునని ఆయన సూచించారు. సుమారు 15 ఎకరాల్లో కాలానుగుణంగా గడ్డి సాగు చేయగలిగితే గోవులకు మేత అందుతుందని ఆయన అన్నారు. వర్షాకాలంలో జొన్నగడ్డి సాగు చేసుకోవాలని ఆయన తెలిపారు. గోవులకు ఎన్ని సెలైన్లు ఎక్కించినా, బి కాంప్లెక్స్ మందువేసి కడుపునింపకపోతే బతకడం కష్టమని ఆయన స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో దీనికి శాశ్వతమైన పరిష్కారం అవసరమని ఆయన తేల్చి చెప్పారు.
తగ్గుతున్న భూగర్భ జలాలు
* శివార్లలో అడుగంటుతున్న వైనం
* జనావాసాలు పెరగడమే కారణం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: పట్టణీకరణ ప్రభావం అనుభవంలోకి వస్తోంది. నగర శివార్లు నివాసయోగ్యంగా ఉండటంతో ఇక్కడ గృహనిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా శివార్లలో పెద్ద ఎత్తున స్థిరాస్తివ్యాపారం చేస్తున్నాయి. దీంతో శివార్లలో జనసాంద్రత రోజురోజుకీ పెరుగుతోంది. పట్టణీకరణతో పాటే సమస్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వౌలిక సదుపాయాలు మినహా ఎటువంటి సమస్యలు లేని శివారు ప్రాంతాలు పట్టణీకరణతో సమస్యల వలయంలో విలవిల్లాడుతున్నాయి. ఎనిమిదేళ్ల కిందట గాజువాక మున్సిపాలిటీ సహా 32 గ్రామాలను నగర పాలక సంస్థలో విలీనం చేసి గ్రేటర్ విశాఖగా మార్చారు. ప్రస్తుతం పట్టణ జనాభా 19 లక్షలకు చేరుకుంది. శివార్ల విలీనంతో నగర పరిధిసైతం విస్తృతమై సమస్యలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా శివార్లలో పెరుగుతున్న జనసాంద్రతకు నిదర్శనంగా నిర్మాణ రంగం కూడా జోరందుకుంది. దీంతో శివార్లలో ఇప్పుడు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. గత 20 సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే 15.7 శాతం పట్టణీకరణ పెరిగింది. రానున్న దశాబ్ధకాలంలో మరో 10 శాతం వరకూ పట్టణీకరణ చోటుచేసుకునే అవకాశాలున్నట్టు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా నగర శివార్లలో భూగర్భ జలాల స్థాయి ఆందోళనకరంగా మారుతోంది. ఒకప్పుడు శివార్లలో భూగర్భజలాల స్థాయి అనుకూలంగా ఉన్నప్పటికీ రానురాను పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది. జిల్లాలో భూగర్భ జలాల స్థాయి కాస్త సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ శివార్లలో మాత్రం నీటిమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా పెందుర్తి, పరవాడ ప్రాంతాల్లో ఈఅంశం స్పష్టంగా కన్పిస్తోంది. పరవాడ ప్రాంతంలో భూగర్భ జలాల స్థాయి 11.41 మీటర్లకుగాను 12.93 మీటర్లకు పడిపోయాయి. ఇక పెందర్తి పరిసర ప్రాంతాల్లో 9.86 మీటర్లకుగాను 11.35 మీటర్లకు పడిపోయాయి. ఇటీవల కాలంలోనే భూగర్భ జలాల స్థాయి పడిపోయినట్టు అధికారులు గుర్తించారు. జనావాసాలు పెరగడంతో పాటు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం, శాటిలైట్ కాలనీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. పరవాడ ప్రాంతంలో శాటిలైట్ కాలనీలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి గణనీయం చోటుచేసుకుంటోంది. దీని కారణంగా నీటి వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. శివార్లలో పడిపోతున్న భూగర్భ జలాలను తిరిగి పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే అమల్లో ఉన్న వాల్టా చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి. దీనితో పాటు బహుళ అంతస్తుల భవనాలు, కొత్తగా అభివృద్ధి పరిచే లేఅవుట్‌లలో తప్పనిసరిగా ఫిల్టర్‌బెడ్‌ల ఏర్పాటు వంటి అంశాలను కఠినంగా అమలు చేయాలని శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు.
రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: ఉగ్రవాదులు దాడులకు రెక్కీ నిర్వహించినట్టు నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో విశాఖ రైల్వే స్టేషన్‌లో పోలీసులు బుధవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నట్టు ఇటీవల ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు రాకపోకలు సాగించే ద్వారాలతో పాటు అనధికార మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం కాకుండా అనధికారికంగా ప్రయాణీకులు రాకపోకలు సాగించే మార్గాలను మూసివేయాలని రైల్వే అధికారులకు సూచించారు. ప్రయాణీకుల ముసుగులో ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశాలున్నాయని భావించి ఆయా మార్గాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని నిర్ణయించారు. స్టేషన్‌లో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసులతో పాటు ప్రభుత్వ రైల్వే పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయ కౌనె్సలింగ్‌లో గందరగోళం
* కౌనె్సలింగ్‌ను బహిష్కరించిన హిందీ పండితులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: ఉపాధ్యాయ కౌనె్సలింగ్‌లో జిల్లా విద్యాశాఖ తీరు విమర్శలకు తావిస్తోంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న బదిలీ కౌనె్సలింగ్‌లో రోజుకో వివాదం విద్యాశాఖను చుట్టుముడుతోంది. జివిఎంసిలో విలీన గ్రామాల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను వెల్లడింకుండా కౌనె్సలింగ్ జరపడాన్ని ఉపాధ్యాయులు నిరసించారు. దీంతో సోమవారం నాటి కౌనె్సలింగ్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడంతో ఒక దశలో కౌనె్సలింగ్ సైతం నిలిచిపోయిన సంగతి విధితమే. 2008 డిఎస్సీలో ఒప్పంద నియామకాల్లో హిందీ పోస్టులకు ఎంపికై వేర్వేరు కారణాల రీత్యా ఇతర పాఠ్యాంశాల్లో పనిచేస్తున్న వారు బుధవారం నాటి కౌనె్సలింగ్‌లో తమ పోస్టుల ఖాళీలను చూపాలంటూ అధికారులను నిలదీశారు. వీరికి అప్పట్లోనే శాలరీ అడ్జస్ట్‌మెంట్ చేయడం వల్ల ఖాళీలను చూపడం కుదరదని విద్యాశాఖ అధికారులు వెల్లడించడంతో వివాదం తలెత్తంది. హిందీ పోస్టులకు ఎంపికైన తమకు ఆపోస్టుల ఖాళీల్లో బదిలీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అంగీకరించకపోవడంతో 54 మంది ఉపాధ్యాయులు కౌనె్సలింగ్‌ను బహిష్కరించారు.
ఇదిలా ఉండగా ఉపాధ్యాయ బదిలీ కౌనె్సలింగ్‌కు బుధవారం చివరిరోజు కావడంతో మిగిలిన ఉపాధ్యాయులందరికీ కౌనె్సలింగ్ నిర్వహించి నియామకపు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. దీంతో రాత్రి పొద్దుపోయినప్పటికీ బదిలీ కౌనె్సలింగ్‌ను నిర్వహించారు. మొత్తంగా
రెవెన్యూలో ముగిసిన బదిలీలు
* నలుగురు తహశీల్దార్లకు పోస్టింగ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ బుధవారం ముగిసింది. నలుగురు తహశీల్దార్లకు బుధవారం పోస్టింగ్‌లు కేటాయించారు. శ్రీకాకుళం నుంచి బదిలీపై వచ్చిన వైఎస్సార్ ప్రసాద్‌ను దేవరాపల్లి తహశీల్దారుగా నియమించారు. వుడా భూసేకరణ విభాగంలో పనిచేస్తునర్న కె రమామణిని కశింకోట తహశీల్దారుగాను, కోనేరు రంగారావు సిఫార్సుల అమలు కమిటీలో పనిచేస్తున్న గీతం కుమారిని వుడా భూసేకరణ విభాగంలోను, దేవరాపల్లి తహశీల్దారుగా పనిచేస్తున్న రాజకుమారిని కోనేరు రంగారావు సిఫార్సుల అమలు కమిటీలోను నియమించారు. జిల్లాలో ఏడు తహశీల్దారు పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. విశాఖ అర్బన్, కోటవురట్ల, ముంచింగ్‌పుట్, కోటపాడు, ఎస్ రాయవరం తహశీల్దారు పోస్టులతో పాటు జివిఎంసి ఎస్టేట్ అధికారి, నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి ఒకరు, విజయనగరం నుంచి అయిదుగురు, హైదరాబాద్ నుంచి ఒకరు ఇంకా జిల్లాకు రావాల్సి ఉంది. అలాగే బుధవారం నాటి బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా 10 మంది డిప్యూటీ తహశీల్దార్లకు, 40 మంది సీనియర్ అసిస్టెంట్లకు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లకు, 80 మంది విఆర్వోలకు బదిలీ జరిగింది.
త్వరలోనే వార్డు కమిటీల నియామకం
* నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా నగర పరిధిలోని 72 వార్డులకు కాంగ్రెస్ కమిటీల నియామకం చేపట్టనున్నట్టు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు వెల్లడించారు. నగర పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున వార్డుల్లో తరచు కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మార్చాలని సూచించారు. ఇందుకోసం కార్యకర్తలు చేసే సూచనలు పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. పనితీరు ఆధారంగా కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు లభిస్తాయని, ఇప్పటికే ఈఅంశంపై కసరత్తు జరుగుతోందన్నారు. పార్టీని బలోపేతం చర్యల్లో భాగంగా నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో తరచు సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. దశలవారీగా నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో వారి నేతృత్వంలోనే సమావేశాలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో తూర్పు నియోజకవర్గ పరుధిలోని 12 వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ల్యాండ్ పూలింగ్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
* వుడా విసి యువరాజ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: ల్యాండ్ పూలింగ్ విధానంలో విశాఖనగరాభివృద్ధి సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లో భూయజమానుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వుడా ఉపాధ్యక్షుడు ఎన్ యువరాజ్ స్పష్టం చేశారు. రైతులు, భూయజమానుల సమస్యలు తెలుసుకునేందుకు బుధవారం వారితోనే వుడా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వెల్లడించిన సమస్యలు విన్న విసి వుడా బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరదేశిపాలెం ఓజోన్ వేలీ ఫేజ్-1 పరిధిలో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు భాగస్వాములుగా చేరి భూములను వుడాకు అప్పగించిన ఒప్పంద పత్రాలను పరిశీలించి అర్హులైన భూ యజమానులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్లాట్‌ల కేటాయింపు పూర్తయి, రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్న వారి విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరదేశిపాలెం రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు అభివృద్ధి పనులు జాప్యం జరుగుతున్నందున తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ కొంతమంది భూయజమానులు చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ వుడా బోర్డు నిర్ణయం తీసుకున్న దృష్ట్యా ఈఅంశాన్ని కూడా వుడా బోర్డుకు నివేదించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్లాట్‌ల కేటాయింపు పూర్తయిన మొదటి ఫేజ్‌లో వౌలిక సదుపాయాల కల్పన త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపాదించిన స్థాయిలో పరదేశిపాలెం ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు మొత్తంగా పూర్తయితే ఇతర ఉమ్మడి సదుపాయల కల్పనలో స్పష్టత రాదన్నారు. అనకాపల్లి చెర్లోపల్లిఖండం వద్ద ప్రతిపాదించిన మరో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు పరిధిలో అభివృద్ధి చేసే భూమిలో కొంత శాతం రైతులకు చెల్లింపు పద్దతిపై తిరిగి ఇవ్వాలన్న అంశంపై కూడా బోర్డు సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. భూముల యజమానులు, వారసుల వివరాలు పక్కా ఆధారాలతో మరోసారి అందజేయాలని రైతులకు సూచించారు. పూలింగ్‌లో భూములను ఇచ్చిన రైతులకు లేఅవుట్‌లో ఒకే చోట ప్లాట్లు కేటాయించాలన్న రైతుల అభ్యర్ధన పట్ల విసి సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి అభ్యర్ధన ఇస్తే బోర్డు మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు, భూ యజమానులతో సమావేశం నిర్వహించిన విసి చొరవను పలువురు కొనియాడారు. సమావేశంలో వుడా కార్యదర్శి జిసి కిషోర్‌కుమార్, ఎస్టేట్ అధికారి బి భవానీదాస్, చీఫ్ ఇంజనీర్ విశ్వనాధరావు, ప్లానింగ్ అధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
వుడా సర్వేయర్ సస్పెన్షన్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఎస్టేట్ విభాగంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న పి నరసింహారావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ విసి ఎన్ యువరాజ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు సంబంధం లేని ప్రైవేటు లేఅవుట్‌లలో ప్లాట్‌ల విషయంలో తన పరిధికి మించి వ్యవహరించడం, అవకతవకలకు పాల్పడినట్టు ఆధారాలతో రుజువు కావడంతో విసి చర్యలకు ఉపక్రమించారు. కూర్మన్నపాలెం వుడా లేఅవుట్‌లో ఒక ప్లాట్‌కు సంబంధించి సర్వేయర్ నరసింహరావు అన్నీ తానై ప్లాట్‌ల యజమానులను ఖరారు చేయడంతో పాటు ప్లాట్‌లను యజమానులకు కొలతోసి భౌతికంగా అప్పగించినట్టు వుడా పేరిట అధికారికంగా లేఖలు ఇవ్వడాన్ని గుర్తించారు. పై అధికారుల ఆదేశాలు గానీ, వుడాలోని సంబంధిత విభాగాల ఉత్తర్వులు లేకుండానే నరసింహారావు ఈపనులకు పాల్పడినట్టు రుజువైంది. ఈలేఅవుట్‌లో 99,229 ప్లాట్‌లకు చెందిన యజమానులు వుడాకు చేసుకున్న విజ్ఞప్తిపై క్షేత్రస్థాయి పరిశీలన, రికార్డుల పరిశీలనతో ఈ విషయం వెలుగుచూసింది. ప్రైవేటు లేఅవుట్‌లతో సంబంధం లేకుండా తన ప్లాట్‌ను కొలతలు వేసి విస్తీర్ణం విషయంలో నోటిమాటగా ఆదేశాలు జారీ చేశారని సరోజిని అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపిన విసి నరసింహరావును సస్పెండ్ చేశారు. విధి నిర్వాహణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అవినీతి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని విసి స్పష్టం చేశారు.
ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయండి
* జివిఎంసి కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 15: జివిఎంసి చేపడుతున్న ప్రాధాన్యత ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ ఎంవి సత్యనానాయణ అధికారులను ఆదేశించారు. జివిఎంసి విభాగాధిపతులతో తన ఛాంబర్‌లో బుధవారం సమవేశమైన కమిషనర్ పలు ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. నగరంలోని అన్ని ప్రధాన రహదార్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వాటిని మే నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన రోడ్లకు మార్కింగ్, జీబ్రా మార్కింగ్ చేయాలని సూచించారు. అన్ని కూడళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని, అలాగే బ్యూటిఫికేషన్ చేయాలన్నారు. బిఆర్‌టిఎస్, ఫ్లైఓవర్ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు పనులను తరచు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాధాన్యత ప్రాజెక్టుల ప్రగతిని ఏరోజుకారోజు తనకు వివరించాలని స్పష్టం చేశారు. సమీక్షలో అదనపు కమిషనర్ ఫైనాన్స్ పి పూర్ణ చంద్రరావు, చీఫ్ ఇంజనీర్ జయరామిరెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ బాలకృష్ణ, సిఎంఓ డాక్టర్ పివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
====
ఆర్థిక ప్రయోజన పథకాల
లక్ష్యాలను అధిగమించాలి
పాడేరు, మే 15: ప్రభుత్వ ఆర్థిక ప్రయోజన పథకాల లక్ష్యాలను అధిగమించేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వై.నరసింహారావు కోరారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయ సమావే శ మందిరంలో బ్యాంకులు, వ్యవసా య, ఉద్యానవన, ఇందిరాక్రాంతి పథం అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీలో అమలు చేయనున్న ఆర్థిక ప్రయోజన పథకాల అమలును సమీక్షించారు. ఏజెన్సీలోని ప్రతి మండలంలో 15 మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజన పథకాన్ని అందించేందుకు అర్హులైన వారిని గుర్తించాలని ఆదేశించా రు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు వందరవాణా వాహనాలను మం జూరు చేస్తామని, ప్రతి యూనిట్‌కు లక్ష నుంచి లక్షావేల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ చెల్లిస్తుందని చెప్పా రు. ఈ ఏడాది ఆర్థిక ప్రయోజన పథకాలను గిరిజనులకు మెరుగ్గా అందించేందుకు బ్యాంకులు, ప్రభుత్వ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం వివిధ రకాల రాయితీలను బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తుందని, బ్యాంకు ఖాతాలను ఇంతవరకు తెరవ ని రైతులు ఖాతాలను ప్రారంభించాలని చెప్పారు. గిరిజన ప్రాంతంలో రైతుల నుంచి బ్యాంకు ఖాతాల ప్రారంభం మందకొడిగా ఉండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించి ఆరేళ్ళు కా వస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో ఖాతాలు ప్రారంభం కాకపోవడాన్ని ఆ యన ప్రశ్నించారు. సిబ్బంది కొరత బ్యాంకు ఖాతాలను ప్రారంభించడానికి అడ్డంకి కాదన్నారు. బ్యాంకు ఖాతాలు ఇప్పటికే ఉన్న రైతులు ఖాతా నెంబర్లను వ్యవసాయ అధికారులకు అందిం చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొందాలన్నారు. పంట నష్టపరిహారం చెల్లింపులలో రైతుల అనుమతి లేకుం డా పాత బకాయిలను బ్యాంకు అధికారులు వసూలు చేయరాదని ఆయన చెప్పారు. రైతుల అభీష్టం మేరకు మాత్ర మే పాత బకాయిలను వసూలు చేసుకోవాలని, వారి అనుమతి లేకుండా పాత బకాయిలు వసూలు చేయడం మంచిదికాదని ఆయన అన్నారు.
క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను తహశీల్ధార్లను సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన చెప్పారు. ఏజెన్సీలో ఆదిమజాతి గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పిఒ తెలిపారు. గిరిజన సంక్షేమ అధికారులు, ఎం.పి.డి.ఒ.లు, ఇంజనీరింగ్, ఇందిరాక్రాంతి పథం అధికారులు బృందాలుగా ఏర్పడి ఆదిమజాతి గిరిజన గ్రామాల్లో పర్యటించి వారి అవసరాలపై సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఆదిమజాతి గిరిజన గ్రామాలలో కల్పించాల్సిన వౌలిక సదుపాయాలను గుర్తించి సర్వే నివేదికలను ఈ నెల 17వ తేదీ నాటికి సమర్పించాలని నరసింహారావు చెప్పారు. ఈ సమావేశంలో స్టేట్‌బ్యాంకు మేనేజర్ అర్జునరావు, ఐ.టి.డి.ఎ. సహాయ ప్రా జెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు, కాఫీ సహాయ సంచాలకులు జి.రామ్మోహనరావు, ప్రాజెక్టు ఉద్యానవన అధికారి రా మాంజనేయులు, ప్రాజెక్టు వ్యవసాయ అధికారి ఓ.్భగ్యలక్ష్మి, ఇందిరాక్రాంతి పథం ఎ.పి.డి. సుధీర్, ఎం.పి.డి.ఒ.లు, ఉపాధి హామీ పథకం ఎ.పి.డి.లు, వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
గోవాడ సుగర్స్ పాలకవర్గ ఎన్నికలకు మోగిన నగారా
చోడవరం, మే 15: మండలంలోని గోవాడ సహకార చక్కెర కర్మాగారం పాలకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల పట్ల చివరి నిమిషం వరకు అలుముకు న్న అనుమానపు మబ్బులు బుధవారంతో వీగిపోయా యి. బుధవారం సాయంత్రం ఎన్నికల అధికారి, డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి డి.శ్రీనివాసరాజు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలమేరకు గతనెల 13వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ పాలకవర్గాల సభ్యుల సంఖ్య, మహిళా రిజర్వేషన్ల అంశంపై ఎన్నికల నిర్వహణపట్ల సందేహం నెలకొంది. ఈ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం విచారణలో ఉండటంతో ఎన్నిక ల షెడ్యూల్ ప్రకారం 13వ తేదీన నోటిఫికేషన్ జారీకావాల్సి ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. చివర కు పాలకవర్గ సభ్యులు సంఖ్య 14గా నిర్ణయించి మహిళా రిజర్వేషన్లపై న్యాయస్థానం తీర్పు వెలువడకపోవడంతో గోవాడ సుగర్స్ పాలకవర్గానికి సభ్యరైతు ల నుండి 14, కార్మికుల నుండి ఒక స్థానానికి సభ్యుని ఎన్నుకోవడానికి నోటిఫికేషన్‌ను ఎన్నికల నిర్వహణాధికారి డి.శ్రీనివాసరాజు ప్రకటించారు. 14 మంది డైరెక్టర్లలో షెడ్యూల్ కులాలకు రెండు, షెడ్యూల్ తెగలకు ఒకటి, వెనుకబడిన తరగతులకు రెండు, సన్నకారు రైతులకు ఒకటి, మిగిలిన నియోజకవర్గాలను జనరల్‌గా పేర్కొన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ ఏ ఒక్కటి లేకపోవడం విశేషం.
సెగ్మెంట్ల వారీగా రిజర్వేషన్ల వివరాలు
లక్ష్మీపురం, వడ్డాది నియోజకవర్గాలు షెడ్యూల్ కులాలకు, రావికమతం నియోజకవర్గం షెడ్యూల్ తె గలకు, కె.కోటపాడు, ఎ.్భమవరం నియోజకవర్గాలు వెనుకబడిన తరగతులకు, రోలుగుంట నియోజకవర్గాన్ని సన్నకారు రైతులకు కేటాయించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులు షెడ్యూల్ కులాల, తెగలకు చెందిన వారు వంద రూపాయలు, వెనుకబడిన తరగతుల వారు 200 రూపాయలు, ఇతరులు 400 రూపాయలు నామినేషన్ ఫీజుగా చెల్లించాల్సిఉంటుంది.
21వ తేదీ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు గోవాడ సుగర్స్ అతిథిగృహంలో నామినేషన్లు దాఖలు చేయాలి. 22న నా మినేషన్ల పరిశీలన, 23న సాయంత్రం ఐదు గంటల వ రకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. 29న ఉదయం ఏడు నుండి రెండు గంటల వరకు ఆయా కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ఈనెల 30న చైర్మన్, వైస్‌చైర్మన్‌ను ఎన్నుకుంటారు.
‘కనీస వేతనం ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం’
సబ్బవరం, మే 15:ఇందిరక్రాంతి పథం యానిమేటర్లకు కనీస వేతనం అమలు చేసేవరకు ఆందోళన కొనసాగుతుందని మండల సిఐటియు కార్యదర్శి ఉప్పాడ సత్యవతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్ధానిక మండల పరిషత్ కార్యాలయం ముందు బుధవారం ఆమె యానిమేటర్ల సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం అనేక సంక్షే పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న విఒఎలను నిర్లక్ష్యం చేయటం తగదన్నారు. యానిమేటర్లకు కనీసవేతనం అమలుచేయాలని డిమాండ్ చేశారు. వారికి నియామకపత్రాలు, గుర్తింపుకార్డులు ఇవ్వాలని, లక్ష రూపాయల బీమా సౌకర్యం కల్పించి ప్రీమియం సొమ్ముప్రభుత్వమే చెల్లించాలన్నారు. యానిమేటర్లకు పనిభార